Nallamala
-
నల్లమలలో అరుదైన చింకారా
సాక్షి, నాగర్‌కర్నూల్: నాజూకైన శరీరం, బెదురు కళ్లు, రింగులు తిరిగిన కొమ్ములతో కృష్ణజింకలను పోలి ఉండే చింకారా అరుదైన వన్యప్రాణుల్లో ఒకటి. దేశంలో అరుదుగా కన్పి0చే ఈ ఇండియన్ గజల్ ఎక్కువగా గుజరాత్లో కొంతభాగం విస్తరించిన థార్ ఎడారితో పాటు కర్ణాటకలోని యాడహల్లి అభయారణ్యంలో మాత్రమే కన్పిస్తాయి. ఇలాంటి అరుదైన చింకారాల గెంతులకు నల్లమల అటవీప్రాంతం నెలవైంది. నల్లమలలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని మద్దిమడుగు రేంజ్లో పదుల సంఖ్యలో చింకారాలు ఉన్నాయి. అయితే అతి సున్నితమైన చింకారాల మనుగడకు వేట, మానవసంచారం రూపంలో ముప్పు పొంచి ఉంది. అంతరించిపోతున్న దశలో చింకారా జాతి దేశంలోనే అరుదైన చింకారా జాతి జింకలు అంతరించిపోతున్న దశలో ఉన్నాయి. దట్టమైన అడవిలో కాకుండా పూర్తిగా గడ్డి మైదానాలు, పొదలతో కూడిన అడవుల్లో నివసించేందుకే చింకారాలు ఇష్టపడతాయి. జనావాసాలు, మనుషులకు ఇవి దూరంగా ఉంటాయి. మనుషులు కన్పిస్తే చాలు భయంతో బెదిరిపోతాయి. చిన్నచిన్న శబ్దాలకు కూడా గజగజ వణికిపోతాయి. అతి సున్నితమైన ఈ జీవులకు వేట, మానవ సంచారం, ఇతర జంతువులతో ముప్పు ఉందని అటవీ అధికారులు చెబుతున్నారు. పులుల సంతతి పెరిగేందుకు, జీవవైవిధ్యాన్ని పెంపొందించడంలో చింకారాలు కీలకంగా పని చేస్తాయి. ఈ ప్రాంతాల్లో మానవ సంచారాన్ని తగ్గించేందుకు, వేటను నివారించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.చింకారాలు అతి సున్నితమైనవి దేశంలో అరుదైన చింకారాలు నల్లమలలో ఉన్నాయి. జింక జాతికి చెందిన ఈ ప్రాణులు అతి సున్నితమైనవి. మనుషులు కని్పస్తే బెదిరిపోతాయి. పులుల సంతతి పెరిగేందుకు, జీవవైవిధ్యంలో వీటి పాత్ర కీలకం. నల్లమలలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో వీటి సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నాం. – రోహిత్ గోపిడి, జిల్లా అటవీశాఖ అధికారి, నాగర్‌కర్నూల్ జిల్లాజనసంచారం, ఆవుల మందలతో ముప్పునల్లమలలోని మద్దిమడుగు అటవీరేంజ్ పరిధిలో చింకారాల ఉనికి కన్పిస్తుండగా, ఈ ప్రాంతంలో జనసంచారం క్రమంగా పెరుగుతోంది. ప్రముఖ పుణ్యక్షేత్రం పబ్బతి ఆంజనేయస్వామి ఆలయానికి ఇతర ప్రాంతాల నుంచి ఎక్కువగా భక్తుల తాకిడి ఉంటుంది. నల్లమలలో వేలసంఖ్యలో వదులుతున్న ఆవుల మందలతో కూడా చింకారాలకు ముప్పు పొంచి ఉంది. చిన్నచిన్న మొక్కలు, నేలపై తక్కువ ఎత్తులో ఉండే గడ్డి మాత్రమే చింకారాల ఆహారం కాగా, ఈ ప్రాంతంలో వందల సంఖ్యలో సంచరిస్తున్న ఆవుల మందలతో ఆహారపు పోటీ నెలకొంది. ఆవులను మేపేందుకు స్థానిక గ్రామాల నుంచి కాకుండా నల్లగొండలోని కంబాలపల్లి, చందంపేట పరిసర ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో ఆవుల మందలను కృష్ణాతీరంలోని నల్లమలలో వదులుతున్నారు. జంతువుల నుంచి వన్యప్రాణులకు సంక్రమించే జూనోసిస్ వ్యాధులకు చింకారాలు లోనయ్యే అవకాశం ఉంది. అరుదైన చింకారాల సంరక్షణకు అటవీశాఖ, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
నాడు వైఎస్సార్.. నేడు నేను.. ఇది దేవుడి రాసిన స్క్రిప్ట్: సీఎం జగన్
Live Updates.. వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభం అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ.. వెలిగొండ ప్రాజెక్ట్‌తో దశాబ్ధాల కల నెరవేరింది. టన్నెల్లో ప్రయాణించినప్పుడు సంతోషంగా అనిపించింది. అద్భుతమైన ప్రాజెక్ట్‌ను పూర్తి చేసినందుకు సంతోషంగా ఉంది. మహానేత వైఎస్సార్ వెలిగొండ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేశారు. ఆయన కుమారుడిగా ఈ ప్రాజెక్ట్‌ను నేనే పూర్తి చేయడం గర్వంగా ఉంది. ఇది దేవుడి రాసిన స్క్రిప్ట్. ఈ ప్రాజెక్ట్‌తో 30 మండలాల్లో 15.25 లక్షల మంది తాగునీటి సమస్యకు పరిష్కారం చూపించాం. ఈ టెన్నల్ వల్ల ప్రకాశం, కడప, నెల్లూరు జిల్లాలకు ప్రయోజనం కలుగుతుంది. వెలిగొండ ప్రాజెక్ట్‌తో నాలుగు లక్షల 47వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. నెరవేరిన 20 ఏళ్ల కల నాడు తండ్రి వైఎస్సార్ శంకుస్థాపన.. నేడు కొడుకుగా సీఎం హోదాలో వైఎస్ జగన్ ప్రారంభోత్సవం వెలిగొండ ప్రాజెక్ట్‌ను జాతికి అంకితం చేసిన సీఎం జగన్ యుద్ధ ప్రాతిపదికన వెలిగొండ ప్రాజెక్ట్ జంట సొరంగాలు పూర్తి ఆసియాలోనే అత్యంత పొడవైన సొరంగాలను పూర్తి చేసిన ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీని నిలబెట్టుకున్న సీఎం జగన్ ♦ వెలిగొండ చేరుకున్న సీఎం జగన్ ♦ వెలిగొండ ప్రాజెక్ట్ వద్దకు బయలుదేరిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ♦ కాసేపట్లో వెలిగొండ ప్రాజెక్ట్ టెన్నెన్ను జాతికి అంకితం చేయనున్న సీఎం జగన్. ♦ సీఎం వైఎస్ జగన్ బుధవారం ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు రెండో టన్నెల్‌ను సీఎం జగన్ జాతికి అంకితం చేస్తారు. ♦ మొదట దోర్నాల మండలం ఎగువ చెర్లోపల్లికి సీఎం జగన్ చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొని పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. అనంతరం వ్యూ పాయింట్ నుంచి వెలిగొండ ప్రాజెక్ట్‌ను, రెండో టన్నెల్‌ను పరిశీలిస్తారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సీఎం జగన్.. ♦ 2019లో వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వెలిగొండ ప్రాజెక్టును పూర్తిచేయడంపై ప్రత్యేక దృష్టిపెట్టారు. గత 58 నెలల పాలనలో దాదాపు రెండేళ్లు కరోనావల్ల పనులు చేయలేని పరిస్థితి. అయినాసరే.. మొదటి సొరంగం పనుల్లో మిగిలిన 2.883 కిమీల పనులను 2019, నవంబరులో ప్రారంభించి.. 2021, జనవరి 13 నాటికి పూర్తిచేయించారు. 2014–19 మధ్య టీడీపీ సర్కార్ హయాంలో మొదటి సొరంగంలో రోజుకు సగటున 2.41 మీటర్ల మేర తవ్వితే.. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో రోజుకు సగటున 4.12 మీటర్ల మేర తవ్వడం గమనార్హం. అలాగే, శ్రీశైలం రిజర్వాయర్ నుంచి మొదటి సొరంగం ద్వారా నల్లమలసాగర్‌కు నీటిని విడుదలచేసే హెడ్ రెగ్యులేటర్ పనులను అదే ఏడాది పూర్తిచేయించారు. ♦ ఇక రెండో సొరంగం మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని 2019 ఎన్నికలకు ముందు భారీగా పెంచేసిన చంద్రబాబు.. వాటిని అధిక ధరలకు సీఎం రమేష్‌కు కట్టబెట్టి, ప్రజాధనాన్ని దోచిపెట్టారు. వాటిని రద్దుచేసిన సీఎం జగన్.. రివర్స్ టెండరింగ్ నిర్వహించి టీడీపీ సర్కార్ అప్పగించిన ధరల కంటే రూ.61.76 కోట్లు తక్కువకు పూర్తిచేసేందుకు ముందుకొచ్చిన ‘మేఘా’ సంస్థకు 7.698 కి.మీ.ల సొరంగం పనులను అప్పగించారు. తద్వారా చంద్రబాబు అక్రమాలను ప్రజల ముందు పెట్టారు. ♦రెండో సొరంగంలో టీబీఎంకు కాలం చెల్లడంతో.. రోజుకు ఒక మీటర్ పని జరగడం కూడా కష్టంగా మారింది. దాంతో 2022లో మనుషుల ద్వారా పనులు చేయించాలని అధికారులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. మొదటి సొరంగం నుంచి రెండో సొరంగంలోకి 17.8 కి.మీ, 16.555 కి.మీ, 14.5 కి.మీ, 13.5 కి.మీ, 12.5 కి.మీ వద్ద సొరంగాలను తవ్వి.. అక్కడ మనుషులతో సొరంగాన్ని తవ్వించేలా పనులు చేపట్టారు. మంగళవారం నాటికి రెండో సొరంగం తవ్వకం పనులు పూర్తయ్యాయి. 7.685 కి.మీల పొడవున తవ్వకం పనులు, హెడ్ రెగ్యులేటర్ పనులు కూడా పూర్తయ్యాయి. శ్రీశైలానికి వరద వచ్చేలోగా టీబీఎంను సొరంగం నుంచి బయటకు తీయనున్నారు. మరోవైపు.. 2014–19 మధ్య చంద్రబాబు సర్కార్ హయాంలో రెండో సొరంగం రోజుకు సగటున 1.31 మీటర్ల మేర తవ్వితే.. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో రోజుకు 7.25 మీటర్లు (టీబీఎం ద్వారా 1.45, మనుషుల ద్వారా 6.80 మీటర్లు) తవ్వడం గమనార్హం. ♦ఇక టీడీపీ సర్కార్ చేపట్టకుండా నిర్లక్ష్యం చేసిన తీగలేరు హెడ్ రెగ్యులేటర్, తూర్పు ప్రధాన కాలువ హెడ్ రెగ్యులేటర్ పనులను చేపట్టిన సీఎం వైఎస్ జగన్ యుద్ధప్రాతిపదికన పూర్తిచేయిస్తున్నారు. శ్రీశైలంలోకి కృష్ణా వరద జలాలు వచ్చిన వెంటనే.. సొరంగాల ద్వారా నల్లమలసాగర్‌కు తరలించి.. ఆయకట్టుకు నీళ్లందించనున్నారు. ♦ ప్రాజెక్టు పనులకు ఇప్పటివరకూ రూ.978.02 కోట్లను సీఎం వైఎస్ జగన్ ఖర్చుచేశారు. ప్రాజెక్టు పనులకు పెట్టిన ప్రతి పైసా సద్వినియోగమయ్యేలా జాగ్రత్తలు తీసుకుని.. శరవేగంగా పూర్తిచేయించారు. నల్లమలసాగర్.. ఓ ఇంజినీరింగ్ అద్భుతం ప్రకాశం జిల్లాలో విస్తరించిన నల్లమల పర్వత శ్రేణులకు సమాంతరంగా వెలుపల ఉన్న కొండలను వెలిగొండలు అంటారు. వెలిగొండ శ్రేణుల్లో సుంకేశుల, కాకర్ల, గొట్టిపడియ వద్ద కొండల మధ్య ఖాళీ ప్రదేశాల (గ్యాప్)ను కలుపుతూ 373.5 మీటర్ల పొడవు, 63.65 మీటర్ల ఎత్తు (సుంకేశుల డ్యామ్)తో.. 587 మీటర్ల పొడవు, 85.9 మీటర్ల ఎత్తు (గొట్టిపడియ డ్యామ్)తో 356 మీటర్ల పొడవు, 57 మీటర్ల ఎత్తు (కాకర్ల డ్యామ్)తో మూడు డ్యామ్‌లు నిర్మించడంతో నల్లమల పర్వత శ్రేణులు, వెలిగొండ కొండల మధ్య 62.40 చదరపు కిలోమీటర్ల ప్రదేశంలో 53.85 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నల్లమలసాగర్ సహజసిద్ధంగా రూపుదిద్దుకుంది. ఇదో ఇంజినీరింగ్ అద్భుతమని సాగునీటిరంగ నిపుణులు ప్రశంసిస్తున్నారు. నల్లమలసాగర్ పనులను మహానేత వైఎస్ పూర్తి చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కొల్లంవాగు ద్వారా రోజుకు 11,583 క్యూసెక్కులు తరలించేలా కొల్లంవాగు కుడి వైపునున్న కొండను తొలచి, రెండు సొరంగాలు (టన్నెల్–1 ద్వారా 3,001 క్యూసెక్కులు, టన్నెల్–2 ద్వారా 8,582 క్యూసెక్కులు) తవ్వి.. ఫీడర్ ఛానల్ ద్వారా నల్లమలసాగర్‌కు కృష్ణా జలాలను తరలిస్తారు. వెలిగొండ ప్రాజెక్టులో 18.8 కి.మీ.ల పొడవున తవ్విన రెండు సొరంగాలు ఆసియా ఖండంలోనే అతిపెద్ద నీటిపారుదల సొరంగాలు కావడం గమనార్హం. -
సఫారీకి జీవకళ...రూ.కోటితో సరికొత్త హంగులు
ప్రకృతి అందాలు, రమణీయ, కమనీయ దృశ్యాలకు నెలవైన నల్లమల అభయారణ్యం సరికొత్త సొబగులు దిద్దుకుంటోంది. రూ.కోటితో పర్యావరణ ప్రేమికులకు మరో కొత్త లోకాన్ని చేరువ చేసేందుకు సిద్ధమవుతోంది. ఓపెన్ టాప్ జీపుల్లో విహరిస్తూ సాగే జంగిల్ సఫారీ ఇకపై సరికొత్త అనుభూతులు నింపనుంది. తుమ్మలబైలు సమీపంలో రూపుదిద్దుకుంటున్న పర్యావరణ విజ్ఞాన కేంద్రం సందర్శకులను విశేషంగా ఆకట్టుకోనుంది. వన్యప్రాణుల శిలాప్రతిమల్లో ఉట్టిపడుతున్న జీవకళ ప్రకృతిని ప్రేమించే మనసులను కట్టిపడేస్తోంది. పెద్దదోర్నాల(ప్రకాశం): నల్లమల అభయారణ్యం.. ఈ పేరు వింటేనే ప్రకృతి ప్రేమికుల మనసు పులకిస్తుంది. అక్కడ సాగే జంగిల్ సఫారీని ఆస్వాదించేందుకు ఆరాటపడని వారుండరంటే అతిశయోక్తి కాదు. దట్టమైన అటవీ ప్రాంతంలో పచ్చని పచ్చిక బయళ్ల నడుమ వన్యప్రాణులను వీక్షిస్తూ పర్యటిస్తుంటే కలిగే ఆనందమే వేరు. నల్లమలలో ఇలాంటి అనుభూతులను సొంతం చేసుకోవాలని అనుకుంటున్న పర్యాటకులకు అటవీశాఖ మరిన్ని సౌకర్యాలు కల్పిస్తూ వస్తోంది. తాజాగా సుమారు కోటి రూపాయల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టింది. వన్యప్రాణుల ఆకృతులతో కూడిన పర్యావరణ విజ్ఞాన కేంద్రంతో పాటు పర్యాటకులు విశ్రాంతి తీసుకునేందుకు పగోడాలు, క్యాబిన్లో అధునాతనంగా రూపుదిద్దుకున్న టాయిలెట్లు, ఆరు బయట పచ్చిక బయళ్లతో ఆకట్టుకునే రీతిలో జంగిల్ సఫారీ ప్రాంగణం రూపుదిద్దుకుంటోంది. ఎకో టూరిజం పర్యాటకులకు కొత్త అనుభూతి కల్పించేందుకు సరికొత్త వాటిని సిద్ధం చేస్తోంది. శరవేగంగా పర్యావరణ విజ్ఞాన కేంద్రం పనులు... జంగిల్ సఫారీలో భాగంగా పెద్దదోర్నాల మండల పరిధిలోని తుమ్మలబైలు సమీపంలో పర్యావరణ విజ్ఞాన కేంద్రం అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఈ కేంద్రంలో పెద్దపులి, చిరుతపులి, జింకలు, కృష్ట జింక, నీల్గాయ్, సాంబార్, హనీబ్యాడ్జర్, మూషిక జింకలతో పాటు రెడ్ జంగిల్ పౌల్, గ్రే జంగిల్ పౌల్, హార్న్‌బిల్ పక్షులు, గుడ్లగూబ, నెమలి, ఎన్నో రకాల పక్షుల అందమైన ఆకృతులను ప్రతిష్ఠించారు. ఆయా ఆకృతులకు సంబంధించి విద్యుద్ధీకరణ పనులు పూర్తి కావాల్సి ఉంది. సరికొత్త టెక్నాలజీతో ఒక్కో వన్యప్రాణి ఆకృతి వద్ద నిలబడినప్పుడు ఆ వన్యప్రాణి గాండ్రింపుతో పాటు దానికి సంబంధించిన పూర్తి వివరాలు లౌడ్ స్పీకర్లో వినిపించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వన్యప్రాణుల శిలాప్రతిమల్లో జీవకళ... పర్యావరణ విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన వన్యప్రాణుల ఆకృతులు జవకళను సంతరించుకుని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. పులుల ప్రతిమలు చూస్తుంటే.. మన కళ్ల ముందే సజీవంగా ఉన్నాయన్న అనుభూతి కలుగుతోంది. సహజసిద్ధ వాతావరణంలో రాజసంగా నిలుచుని ఉండే పెద్దపులి ప్రతిమ సందర్శకులను కట్టిపడేసేలా ఉంది. చెట్టుపై కూర్చున్న చిరుతపులితో పాటు పెద్ద పులులను సైతం ఎదిరించే మొండితనం, ధైర్యం ఉన్న బుల్లి జీవి హనీబ్యాడ్జర్, ప్రపంచంలోని జింకలలో కెల్లా అత్యంత చిన్న జింకగా ప్రసిద్ధి గాంచిన మూషిక జింకలు సైతం జీవకళతో అబ్బురపరుస్తున్నాయి. గడ్డి మైదానంలో కూర్చుని సేదతీరుతున్న కణితి, పర్యావరణ విజ్ఞాన కేంద్రం గోడలపై ఏర్పాటు చేసిన నల్లమల అభయారణ్యంలోని పక్షి జాతుల ఆకృతులు కనువిందు చేస్తున్నాయి. జంగిల్ సఫారీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చిన్నపాటి సరస్సు, పచ్చిక బయళ్లు, చిన్నారులు కూర్చునేందుకు చెక్కతో తీర్చిదిద్దిన సీతాకోక చిలుక, తాబేలు, తదితర ఆకృతులు ఆకట్టుకుంటున్నాయి. ఇవే కాకుండా జంగిల్ సఫారీకి అధునాతన వాహనాలు ఏర్పాటు చేశారు. నల్లమల అభయారణ్యంలో వన్యప్రాణుల నెలవైన పులిచెరువు రహదారిలో ఏర్పాటు చేసిన ముఖద్వారంతో పాటు 14 కిలోమీటర్లు జంగిల్ సఫారీ కొనసాగే రహదారిని అందంగా తీర్చిదిద్దారు. పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవడంతో పాటు పలు ప్రత్యేకతలతో జంగిల్ సఫారీని అందంగా తీర్చిదిద్ది పర్యాటకులకు గొప్ప అనుభూతి కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కోటి రూపాయలతో పనులు నల్లమల జంగిల్ సఫారీలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న పర్యావరణ విజ్ఞాన కేంద్రంలో వన్యప్రాణుల ప్రతిమలను తీర్చిదిద్దుతున్నాం. విద్యుద్ధీకరణ పనులు చేపట్టాల్సి ఉంది. జంగిల్ సఫారీ రహదారులను కూడా అభివృద్ధి చేస్తున్నాం. ఆద్యంతం పచ్చని పచ్చిక బయళ్లతో అందంగా తయారు చేస్తున్నాం. పులిచెరువు ముఖద్వారం ఆర్చిని ఆకర్షణీయంగా మారుస్తున్నాం. వన్యప్రాణుల ప్రతిమలు జీవకళతో సందర్శకులను ఆకట్టుకుంటాయి. – విశ్వేశ్వరరావు, ఫారెస్టు రేంజి అధికారి -
నల్లమల ఘాట్ రోడ్‌లోనూ డ్రంక్ అండ్ డ్రైవ్
అసలే దట్టమైన నల్లమల అభయారణ్యం.. ఎత్తయిన ఘాట్ రోడ్డు.. భారీ మలుపులు.. వాహనదారుల అజాగ్రత్తలతో నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. ఏదైనా ప్రమాదం జరిగితే రెండువైపులా భారీగా నిలిచిపోతున్న వాహనాలు.. గంటల తరబడి ట్రాఫిక్ జామ్.. సంఘటన స్థలానికి అంబులెన్స్, పోలీసు వాహనాలు చేరుకునేందుకు కూడా అష్టకష్టాలు పడాలి.. ఈలోపు క్షతగాత్రుల ప్రాణాలు పోయే పరిస్థితి నెలకొని ఉంది. వీటిని దృష్టిలో ఉంచుకుని శ్రీశైలం, కర్నూలు ఘాట్ రోడ్లలో వాహన ప్రమాదాల నివారణకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. స్పీడ్ గన్లు, బ్రీత్ ఎనలైజర్లతో తనిఖీలు చేయడం.. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలతో చెక్ పెడుతున్నారు. పెద్దదోర్నాల: ► శ్రీశైలం వైపు వేగంగా వెళ్తున్న ఓ టూరిస్టు బస్సు ఎదురుగా వస్తున్న వాహనానికి దారి ఇవ్వబోయి అదుపుతప్పి తుమ్మలబైలు వద్ద బోల్తాపడిన సంగతి పాఠకులకు విధితమే. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ► మూడు రోజుల కిందట ఓ కారు శ్రీశైలం ఘాట్ రోడ్డులో సాక్షి గణపతి ఆలయ సమీపంలో బోల్తా పడి నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదానికి అతివేగమే కారణంగా తెలుస్తోంది. ఇలాంటి ప్రమాదాల నివారణకు పోలీసు శాఖ ప్రత్యేక కార్యాచరణతో రంగంలోకి దిగింది. అధిక శాతం వాహనదారులకు ఘాట్ రోడ్లపై అవగాహన లేకపోవడం, మితిమీరిన వేగంతో ప్రయాణించడం వలనే ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తించింది. అతివేగం కారణంగా జరుగుతున్న అనర్థాలపై వాహనదారులకు అవగాహన కల్పిస్తోంది. ప్రమాదాల నివారణకు కసరత్తు చేస్తోంది. జిల్లాలోని సమస్యాత్మక రోడ్లతో పాటు అత్యంత ప్రమాదకర రోడ్లుగా నల్లమల అభయారణ్యంలోని శ్రీశైలం, కర్నూలు ఘాట్ రోడ్లను గుర్తించారు. ఘాట్ రోడ్లలో తరచూ జరుగుతున్న ప్రమాదాల నివారణకు లేజర్ స్పీడ్ గన్లతో పరిశీలించి వాహనాల మితిమీరిన వేగాన్ని కట్టడి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారికి కూడా జరిమానాలు విధించేందుకు బ్రీత్ ఎనరైజర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. బ్రీత్ ఎనలైజర్‌తో వాహనదారులకు పరీక్షలు.. మండల పరిధిలోని శ్రీశైలం ఘాట్ రోడ్డుతో పాటు కర్నూలు రహదారిపై వాహనదారులకు బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు నిర్వహించే కార్యక్రమాన్ని పోలీసులు చేపట్టారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న పలువురిపై కేసులు నమోదు చేస్తున్నారు. వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపటం వలన అధిక శాతం ప్రమాదాలు జరుగుతున్నాయని తేలడంతో డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కఠినంగా వ్యవహరిస్తున్నారు. వ్యక్తిగత తప్పిదాల వలనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. దానివలన ఏ తప్పూ చేయని ఎదుటి వ్యక్తుల ప్రాణాలు కూడా పోతున్నాయి. ఘాట్ రోడ్లపై 40 కి.మీ వేగానికి మించి ప్రయాణించడం ప్రమాదకరమని, సెల్ఫోన్లు మాట్లాడుతూ వాహనాలు నడపరాదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మితిమీరిన వేగంతోనే తరుచూ ప్రమాదాలు.. మితిమీరిన వేగం, వాహనాలను నడిపే సమయంలో నిర్లక్ష్యం కారణంగానే ఘాట్ రోడ్లపై ఎక్కువగా వాహన ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని అధికారులు గుర్తించారు. పెద్దదోర్నాల మండల కేంద్రం నుంచి శ్రీశైల పుణ్యక్షేత్రానికి 50 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అదేవిధంగా కర్నూలు రోడ్డులోని రోళ్లపెంట నుంచి మండల కేంద్రం వరకు 30 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ రెండు రహదారులూ ఘాట్ రోడ్లే. ఈ మార్గాలలో నిత్యం వాహనాల రద్దీ అధికంగా ఉంటుంది. రాష్ట్రంతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన లక్షలాది మంది ప్రయాణికులు, భక్తులు వందలాది వాహనాల్లో శ్రీశైలం వెళ్తారు. కొన్నేళ్లుగా ఘాట్ రోడ్లలో అధికంగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాలకు అతివేగమే ప్రధాన కారణమని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. వీటిని అరికట్టేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టింది. జిల్లాలోని ముఖ్య రహదారులపై ప్రయాణించే వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు అధికారులు లేజర్ గన్లను వినియోగిస్తున్నారు. పరిమితికి మించిన వేగంతో వెళ్లే వాహనాలకు జరిమానాలు, ఈ–చలానాలు విధిస్తున్నారు. రాయలసీమ ప్రాంతం నుంచి రాజధానికి వెళ్లే రహదారులతో పాటు, అత్యంత క్లిష్టమైన శ్రీశైలం ఘాట్ రోడ్డులో స్పీడ్ గన్లను ఏర్పాటు చేసి వేగ నియంత్రణకు చర్యలు చేపడుతున్నారు. మితిమీరిన వేగంగా వెళ్తున్న వాహనాలను కంట్రోలు చేసేందుకు స్పీడు గన్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. వేగ నియంత్రణకు పటిష్ట చర్యలు మితిమీరిన వేగంతో ప్రయాణించే వాహనాల వలనే ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అందువలన అతివేగంతో ప్రయాణించే వాహనాలను గుర్తించేందుకు ఘాట్ రోడ్లలో స్పీడ్ గన్లను వినియోగిస్తున్నాం. డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు కూడా నిర్వహించి జరిమానాలు విధిస్తున్నాం. దీనివలన రోడ్డు ప్రమాదాలను నియంత్రించగలుగుతున్నాం. వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపటం నేరం. సెల్ఫోన్లు మాట్లాడుతూ వాహనాలు నడపటం అనర్థదాయకం. - మారుతీకృష్ణ, సీఐ, యర్రగొండపాలెం -
‘నల్లమల’ అడవుల్లో అంతర్యుద్ధం..గెలించిందెవరు?
అమిత్ తివారి, భానుశ్రీ హీరో,హీరోయిన్లు నటించిన తాజా చిత్రం ‘నల్లమల’.రవిచరణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాజర్, తనికెళ్ల భరణి, అజయ్ ఘోష్, కాలకేయ ప్రభాకర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఆర్.ఎమ్ నిర్మిస్తున్న ఈ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో గురువారం ఈ మూవీ టీజర్‌ను ప్రముఖ దర్శకుడు దేవా కట్టా విడుదల చేశారు. ‘1980 జూలై 23, ఇరాన్-ఇరాక్ యుద్ధం మొదలయ్యే ముందు రోజులు ఇవి. అప్పుడప్పుడే నల్లమల అడవుల్లో అంతర్యుద్ధం మొదలైంది’ అనే మాటలతో ఈ మూవీ టీజర్ మొదలైంది. ప్రతి సన్నివేశంలో అమిత్ నటన ఆకట్టుకునేలా ఉంది. ధికారం కోసం నల్లమల అటవీ ప్రాంతంలో చోటుచేసుకునే సంఘటనలు.. అందమైన అడవిలో స్వచ్ఛమైన ప్రేమకథతో ఈ సినిమా రూపుదిద్దుకున్నట్లు టీజర్‌ను చూస్తే తెలుస్తోంది. టీజర్ విడుదల సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న దేవాకట్టా మాట్లాడుతూ. ఈ మూవీలోని ఏమున్నావే పిల్ల పాటను నేను నా ఫ్రెండ్స్‌తో హ్యాంగవుట్లో ఉంటే వింటాను. ఇలాంటి పాట నాకు ఒక్కటి కూడా లేదు అని అసూయ పడ్డాను. అమిత్‌ను మొదటిసారి చూసినప్పుడే ఇంత మంచి యాక్టర్‌వి ఎందుకు అంత తక్కువగా కనిపిస్తున్నావ్ అని అన్నాను. మంచి ఫుడ్ చాలా అరుదుగా దొరుకుతుందన్నట్టుగా అనిపించింది.ఇంత మంచి క్యాస్టింగ్‌ను పెట్టుకోవడంతోనే సినిమా సక్సెస్‌కు మొదటి మెట్టు పడ్డట్టు అయింది.ఈ చిత్రానికి పని చేసిన ప్రతీ ఒక్కరికీ ఆల్ ది బెస్ట్’అని అన్నారు. దర్శకుడు రవి చరణ్ మాట్లాడుతూ.. ‘నాతో ఈ సినిమా చేసినందుకు, నేను ఈ రోజు ఇక్కడ నిలబడి మాట్లాడేలా చేసిన నిర్మాత ఆర్ఎమ్ గారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. నాకు దేవా కట్టా గారంటే చాలా ఇష్టం. టీజర్ రిలీజ్ చేసినందుకు థ్యాంక్స్. సినిమా గురించి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. ఓ రెండు విషయాలు చెబుతాను. అడవిని అడవి తల్లి.. గోవును గోమాత అని అంటాం. బానిస బతుకుల నుంచి భారతదేశం స్వేచ్చా ఆయువును పీల్చుకుంటున్న సమయంలో నల్లమల అడవుల్లోకి మానవ రూపంలో ఉన్న క్రూరమృగం ఎంట్రీ అయింది. ఆ మృగం ఎంట్రీ అయ్యాక ఏం జరిగింది అనేదే ఈ కథ. తరువాత సినిమా గురించి చాలా విషయాలు చెబుతాను. ఈ సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్’ అని అన్నారు. -
నల్లమలలో స్వల్పంగా కంపించిన భూమి
అచ్చంపేట: నాగర్‌కర్నూల్ జిల్లా నల్లమల ప్రాంతంలో స్వల్పంగా భూమి కంపించింది. సోమవారం ఉదయం 5 గంటల సమయంలో రెండు సెకండ్ల పాటు భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్లలోని సామగ్రి కదలడంతో ఏమి జరుగుతుందో తెలియక జనం ఇళ్లనుంచి బయటకు పరుగులు తీశారు. అచ్చంపేట, బల్మూర్, లింగాల, అమ్రాబాద్, పదర, ఉప్పునుంతల, తెలకపల్లి మండలాల్లో భూప్రకంపనలు సంభవించాయి. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.0గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్సీఎస్) వెల్లడించింది. దీని ప్రభావం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. శ్రీశైలం జలాశయం బ్యాక్‌వాటర్‌కు 35 కి.మీ. ఎగువన ఈ భూకంపం సంభవించినట్లు గుర్తించారు. హైదరాబాద్‌కు దక్షిణంగా 150 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని ఎన్సీఎస్ వెల్లడించింది. భూగర్భంలో ఏడు నుంచి 10 కిలోమీటర్ల లోతు నుంచి ప్రకంపనలు వచ్చాయని తెలిపింది. -
హీరో, హీరోయిన్లుగా బిగ్‌బాస్ కంటెస్టెంట్లు
నల్లమల అడవి నేపథ్యంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. వాటికి భిన్నంగా ఆ అడవి చుట్టూ జరిగిన ఎన్నో చీకటి కోణాలను, సామాన్య జనానికి తెలియని అవినీతి ఒప్పందాల నేపథ్యంలో ఆసక్తికర కథా కథనాలతో తెరకెక్కుతోన్న చిత్రం `నల్లమల`. అమిత్ తివారీ, భానుశ్రీ, నాజర్, తనికెళ్ల భరణి, అజయ్ ఘోష్, కాలకేయ ప్రభాకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి రవి చరణ్ దర్శకుడు. ఆర్.ఎమ్ నిర్మిస్తున్న ఈ మూవీలోని సిద్ శ్రీరామ్ పాడిన ఏమున్నవే పిల్లా సాంగ్ ఇప్పటికే 17 మిలియన్లకి పైగా వ్యూస్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అంతే కాకుండా ఆ పాటకు లక్షకు పైగా కవర్‌సాంగ్స్ రావడం విశేషం. అలాగే ఈ చిత్రంనునుండి విడుదలైన అన్ని పాటలు 1మిలియన్‌కి పైగా వ్యూస్ సాధించడం ఆడియన్స్‌లో ఈ సినిమా క్రేజ్‌ను తెలియజేస్తున్నాయి. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో విడుదలతేదిని ప్రకటించనున్నారు. -
రోడ్డు విస్తరణ: వెయ్యేళ్ల శిల్పాలను మట్టిలో పూడ్చేసి..
సాక్షి, హైదరాబాద్: ఇవి దాదాపు వెయ్యేళ్ల క్రితం నాటి శిల్పాలు.. దేవతా మూర్తులు, వీరగల్లుల విగ్రహాల సమూహం. రోడ్డు విస్తరణకు అవి అడ్డుగా ఉన్నాయని భావించిన ఓ కాంట్రాక్టర్ వాటి మీదుగా మట్టి వేసి అలాగే రోడ్డు నిర్మాణం ప్రారంభించేశాడు. మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలం పోల్కొంపల్లి గ్రామంలో ఇది జరిగింది. కొందరు గ్రామస్తుల ద్వారా విషయం తెలుసుకున్న విశ్రాంత పురావస్తు అధికారి, బుద్ధవనం ప్రాజెక్టు కన్సల్టెంట్ ఈమని శివనాగిరెడ్డి సోమవారం గ్రామాన్ని సందర్శించారు. వివిధ సందర్భాల్లో వెలుగుచూసిన కళ్యాణి చాళుక్యుల హ యాం క్రీ.శ.11వ శతాబ్దం నాటి దేవతామూర్తుల, స్థానిక వీరుల శిల్పాలు అరుదైనవని ఆయన అంటున్నారు. చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచిన వాటిని నిర్లక్ష్యంగా పూడ్చేయడం సరికాదని, తక్షణమే శిల్పాలను సురక్షిత ప్రాంతానికి తరలించి పరిరక్షించాలని ఆయన కోరుతున్నారు. ఆయన వెంట నల్లమల నేచర్ ఫౌండేషన్ అధ్యక్షులు పట్నం కృష్ణంరాజు, భూత్పూరు ఆలయ కమిటీ సభ్యుడు అశోక్‌గౌడ్ తదితరులున్నారు. చదవండి: Maoist Party : హిడ్మా, శారద క్షేమమే -
నల్లమల అడవిలో నాజర్ పరిశోధనలు!!
అమిత్‌తివారీ, భానుశ్రీ, తనికెళ్ల భరణి, అజయ్ ఘోష్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘నల్లమల’. రవిచరణ్ దర్శకత్వంలో ఆర్.ఎమ్ నిర్మించారు. ఈ సినిమాలో కీలక పాత్ర చేసిన నాజర్ లుక్‌ని రిలీజ్ చేశారు. రవిచరణ్ మాట్లాడుతూ– ‘‘ఇరాన్లో నివసించే తెలుగు శాస్త్రవేత్త పాత్రను నాజర్ చేశారు. తన పరిశోధనలు ప్రపంచాన్ని శాసించాలనుకునే శాస్త్రవేత్త. అందుకు ఏం తయారు చేయాలా అని ఆలోచిస్తుంటాడు. ఆ ప్రయోగం మంచిదా? చెడ్డదా? అనేది పట్టించుకోడు. ప్రయోగాలకు నల్లమల అడవిని ఎంచుకుంటాడు. ఆ ప్రయోగాల వల్ల ఏం జరిగిందనేది కథ’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: వేణు మురళి, సంగీతం, పాటలు: పి.ఆర్. -
నల్లమల అడవి నేపథ్యంలో...
‘‘నల్లమల అడవి నేపథ్యంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ వాటికి భిన్నంగా ఆ అడవి చుట్టూ జరిగిన ఎన్నో చీకటి కోణాలను, సామాన్య జనానికి తెలియని అవినీతి ఒప్పందాలను మా ‘నల్లమల’ సినిమాలో చూపించనున్నాం’’ అని దర్శకుడు రవికిరణ్ అన్నారు. అమిత్ తివారీ, భానుశ్రీ, నాజర్, తనికెళ్ల భరణి, అజయ్ ఘోష్, కాలకేయ ప్రభాకర్, ఛత్రపతి శేఖర్, చలాకీ చంటి, ముక్కు అవినాశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘నల్లమల’. ఆర్.ఎమ్ నిర్మిస్తున్న ఈ సినిమా మోషన్ పోస్టర్ని దర్శకుడు త్రివిక్రమ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా రవికిరణ్ మాట్లాడుతూ–‘‘సేవ్ నల్లమల’ అనే నినాదంతో ఎంతోమంది అభ్యుదయ వాదులు, అటవీ సంరక్షులు ఎన్నో పోరాటాలు చేస్తున్నారు. అవినీతి ఒప్పందాలకు వ్యతిరేకంగా భవిష్యత్ తరాల కోసం పోరాటం సాగించిన ఒక వీరుడు ఎదుర్కొన్న సమస్యలు, వాటిని అతనెలా పరిష్కరించాడనే వాస్తవ సంఘటనల నేపథ్యంలో సాగే చిత్రమిది’’ అన్నారు. ‘‘వాస్తవ సంఘటనలే అయినా లవ్, ఎమోషన్‌తో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది’’ అన్నారు నిర్మాత ఆర్.ఎమ్. ఈ చిత్రానికి కెమెరా: వేణు మురళి, సంగీతం, పాటలు: పి.ఆర్. -
నల్లమలలో మొబైల్ ల్యాబ్
అచ్చంపేట : మారుమూల ప్రాంత పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, ఇతర పోస్టులను భర్తీ చేస్తున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతలలో పది పడకల అస్పత్రిని 30 పడకలుగా ఆప్‌గ్రేడ్ చేసే పనులకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, నల్లమలలో సంచార పాతోలాజికల్ లేబరేటరీ (మొబైల్ వ్యాన్)ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. అలాగే ట్రామా, కేన్సర్ డిటెక్షన్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. అచ్చంపేటలో వంద పడకల ఆస్పత్రి రూపుదిద్దుకుంటోందన్నారు. -
యూరేనియం వ్యతిరేక కమిటి చైర్మన్‌గా వీహెచ్
సాక్షి, హైదరాబాద్: నల్లమల్ల అడవి యూరేనియం తవ్వకాల వ్యతిరేక కమిటి చైర్మన్‌గా మాజీ పీసీసీ అధ్యక్షుడు వీ.హనుమంతరావు నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. ఈ కమిటీలో మొత్తం 16 మంది సభ్యులు ఉంటారని ఆయన పేర్కొన్నారు. కాగా నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలు జరపకుండా పెద్దఎత్తున ఉద్యమించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని టీపీసీసీ కోర్ కమిటీ తీర్మానించిన విషయం తెలిసిందే. నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా సేవ్ నల్లమల (#SaveNallamala) పేరుతో పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేస్తున్నారు. ప్రకృతి ప్రేమికులు, సామాజిక కార్యకర్తలు ఈ విషయంపై గళమెత్తుతున్నారు. తాజాగా సినీ దర్శకుడు శేఖర్ కమ్ముల కూడా ఈ విషయంపై స్పందించారు. -
నల్లమలలో అణు అలజడి!
సాక్షి, హైదరాబాద్/నాగర్‌కర్నూల్: అమ్రాబాద్ పులుల అభయారణ్యంలో యురేనియం నిక్షేపాల అన్వేషణ అంశం అక్కడి గిరిపుత్రులు, పర్యావరణ ప్రేమికులు, ఇతర వర్గాల్లో ఆందోళనలు రేకెత్తిస్తోంది. దేశంలోనే రెండో అతిపెద్ద టైగర్ రిజర్వ్‌గా, పలు రకాల చెంచు జాతులు, అత్యంత జీవవైవిధ్యం గల ప్రదేశంగా ఈ అభయారణ్యానికి పేరుంది. ఇక్కడ యురేనియం అన్వేషణ కోసం సర్వేలకు కేంద్రం తుది అనుమతి లభిస్తే ప్రమాదకర పరిస్థితులు తలెత్తుతాయనే చర్చ సాగుతోంది. ఈ ఏడాది మే 22న ఢిల్లీలో జరిగిన కేంద్ర అటవీ సలహా మండలి భేటీలో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లోని 83 చదరపు కిలోమీటర్ల పరిధిలో కేంద్ర అణుఇంధనశాఖ పరిధిలోని అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ (ఏఎండీ) సర్వేలు చేపట్టేందుకు సూత్రప్రాయంగా ఆమోదం లభించింది. అన్వేషణపై ఏఎండి నుంచి అందిన ప్రతిపాదనల్లో స్పష్టత కొరవడిందనే అభిప్రాయం భేటీలో వ్యక్తమైంది. ప్రస్తుతానికి సర్వే కోసమే అనుమతినిస్తున్నట్టు పేర్కొనడంతోపాటు సాంకేతిక అంశాలు, ఎలా తవ్వకాలు జరుపుతారన్న దానిపై ఆధారాలు పరిశీలించాకే ఏఎండీకి తుది అనుమతినిచ్చే విషయాన్ని ఆలోచిస్తున్నట్టు తెలిపింది. అయితే ఈ అనుమతులు యురే నియం వెలికితీతకు ఇచ్చిన ఆమోదముద్రేనని పర్యావరణవేత్తలుహెచ్చరిస్తున్నారు. తాజా ప్రతిపాదనలు కోరిన కేంద్ర అటవీ శాఖ యురేనియం నిల్వల అన్వేషణపై సాంకేతికాంశాలు, సర్వే నిర్వహణ పూర్తి వివరాలు, పత్రాలను తాజాగా మరోసారి ప్రతిపాదనలు పంపించాలని ఏఎండీకి కేంద్ర అటవీశాఖ సూచించింది. సర్వే చేపట్టే విధానం, తదితర విషయాలపై స్పష్టమైన సమాచారం, వివరాలను ఫారం–సీ రూపంలో నిర్ణీత ఫార్మాట్లో కొత్త ప్రతిపాదనల రూపంలో పంపించాలని ఏఎండీకి రాష్ట్ర అటవీశాఖ లేఖ ద్వారా విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తోంది. తాజా ప్రతిపాదనల్లో ఈ అంశాలన్నింటికి సమాధానం లభిస్తే అప్పుడు అనుమతిపై ఆలోచించవచ్చని, అందువల్ల ఇప్పుడే ఏదో జరిగిపోతుందని భావించడానికి లేదంటున్నారు యురేనియం నిక్షేపాలు ఉన్న కేంద్రాలను గుర్తిస్తున్న మ్యాప్ తుది నిర్ణయమేదీ తీసుకోలేదు: పీసీసీఎఫ్ పీకే ఝా అమ్రాబాద్ అభయారణ్యంలో యురేనియం నిక్షేపాల అన్వేషణకు అవసరమైన సర్వేకు అనుమతిపై తాజాగా ఇంకా ఎలాంటి నిర్ణయం వెలువడలేదని ‘సాక్షి’ ప్రతినిధితో అటవీ సంరక్షణ ప్రధానాధికారి (పీసీసీఎఫ్) ప్రశాంత్ కుమార్ ఝా స్పష్టం చేశారు. ఏఎండీ గత ప్రతిపాదనల్లో స్పష్టత లేనందున నిర్ణీత ఫార్మాట్లో పూర్తి వివరాలు, సమాచారంతోపాటు, ఆయా సాంకేతిక అంశాలపైనా స్పష్టతతో కూడిన వివరణలు అవసరమవుతాయన్నారు. కేంద్రం నుంచి స్పందనలు, సూచనలు, సలహాలను బట్టి తదుపరి చర్యలు చేపడతామన్నారు. ఇప్పటికిప్పుడు యురేనియం నిల్వల అన్వేషణకు అనుమతిపై రాష్ట్ర అటవీశాఖ ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదన్నారు. వైఎస్సార్ నిలిపేశారు.. అయినా! నల్లమలలో అమ్రాబాద్ పులుల అభయారణ్యం 2611.39 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించింది. ఇందులో 2,166.37 చదరపు కి.మీ అభయారణ్యం. 445.02 చదరపు కిలో మీటర్ల బఫర్ జోన్‌గా ఏర్పాటు చేశారు. 2008 నుంచి నల్లమలలో ఖనిజ నిక్షేపాల కోసం అన్వేషణ మొదలు పెట్టారు. అప్పట్లో డీబీర్ అనే ఎమ్మెన్సీకి కేంద్ర ప్రభుత్వం ఈ అన్వేషణ బాధ్యత అప్పగిస్తే అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి దీన్ని నిలిపివేశారు. అన్ని రాజకీయ పార్టీలూ కేంద్రం నిర్ణయంపై ఆందోళనలు నిర్వహించాయి. అప్పుడు కాస్త వెనక్కు తగ్గినట్లు అనిపించినా.. 2012 మే నెలలో అమ్రాబాద్ మండలంలోని తిర్మలాపూర్ (బీకే)లో వ్యవసాయ పొలాల వద్ద అడవి ప్రాంతంలో 27 బోర్లు వేశారు. బోర్లు ఉచితంగా వేస్తున్నారని రైతులు సంతోషపడ్డారు. అసలు విషయం తెలియడంతో బోరు బావుల తవ్వకాలను అడ్డుకొని బోరు వాహనాలపై దాడి చేశారు. అయితే యురేనియం కోసం నిర్వహించిన సర్వే సత్పలితాలు ఇవ్వడంతో దానికి కొనసాగింపుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతితోనే అటవీశాఖ ముసుగులో 2017 మే, జూన్ నెలలో పదర మండలం ఉడిమిళ్ల, పదర, మన్ననూర్ తదితర ప్రాంతాల్లో సర్వే నిర్వహించి చెట్ల కొలతలు చేపట్టారు. డ్రిల్లింగ్‌తో ముప్పే! రాష్ట్రంలోని అటవీప్రాంతాల్లోని మొత్తం 4బ్లాకుల్లో యురేనియం నిల్వల అన్వేషణ చేపట్టాలని ఏఎండీ భావిస్తోంది. ఇందులో భాగంగా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లోని ఒకచోట 20–25 చదరపు ఎకరాల విస్తీర్ణంలో తవ్వకాలు చేపట్టవచ్చునని తెలుస్తోంది. అయితే సర్వేలో భాగంగా చేపట్టే డ్రిల్లింగ్‌తో అటవీ సమతుల్యతపై ప్రభావం చూపడంతో పాటు అక్కడి ప్రజల జీవనవిధానం ఇబ్బందుల్లో పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభావితమయ్యే గ్రామాలు.. పదర మండలం పరిధిలో: ఉడిమిళ్ల, పెట్రాల్‌చెన్ పెంట, చిట్లంకుంట, చెన్నంపల్లి, వంకేశ్వరం, పదర, కోడోన్పల్లి, రాయగండి తాండా, జోతినాయక్తండా, కండ్ల కుంట. అమ్రాబాద్ మండలం పరిధిలో: కుమ్మరోనిపల్లి, జంగంరెడ్డిపల్లి, కల్ములోనిపల్లి, తెలుగుపల్లి, మాచారం, మన్ననూర్, ప్రశాంత్‌నగర్ కాలనీ, అమ్రాబాద్. వీటితో పాటు అచ్చంపేట పరిధిలోని ఏజెన్సీ ప్రాంతాలపై ప్రభావం పడే అవకాశం అడవిని వదలబోం తరతరాలుగా ఈ అడవితల్లినే నమ్మకొని జీవిస్తున్నాం. ఇప్పుడు యురేనియం అంటూ తవ్వకాలు జరుపుతారని అనుకుంటున్నరు. ఏడాదిగా ఇదే మాట నడుస్తున్నది. అడవి తల్లిని నమ్ముకొని బతుకుతున్నం. ఎవరొచ్చినా అడవిని వదిలేది లేదు. – వీరయ్య, చెంచు, కొమ్మెనపెంట కార్యాచరణ రూపొందిస్తాం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశాలు నిర్వహించి యూరేనియంపై అభిప్రాయాలు సేకరించాం. త్వరలోనే ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తాం. ప్రతి గ్రామంలో తిరిగి ప్రజలను చైతన్యం చేస్తాం. ఈ ప్రాంత బిడ్డలుగా ఎట్టి పరిస్థితుల్లోనూ యురేనియం తవ్వకాలు జరపనివ్వం. – వంశీకృష్ణ, డీసీసీ అధ్యక్షుడు, నాగర్‌కర్నూల్. అస్తిత్వం కోల్పోనున్న చెంచులు నల్లమలలో 112 చెంచుపెంటల్లో దాదాపు 12వేల మంది చెంచులు నివసిస్తున్నారు. యురేనియం తవ్వకాలకు అనుమతి ఇవ్వడం వల్ల అడవిని నమ్ముకొని జీవిస్తున్న చెంచులు తమ అస్తిత్వాన్ని కోల్పోయే ప్రమాదం వచ్చి పండింది. వేగంగా అంతరిస్తున్న ఆదిమ జాతుల్లో చెంచులు కూడా ఉన్న నేపథ్యంలో వారి చరిత్ర, సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించాల్సిన సమయంలో యురేనియం తవ్వకాల పేరిట ఆదిమ జాతిని మరింత ప్రమాదంలోకి నెట్టే ప్రయత్నాలతో ప్రజాసంఘాలు, పార్టీలు, చెంచులు మరో పోరాటానికి సిద్ధమవుతున్నారు. తవ్వకాలను అడ్డుకుంటాం నల్లమలలో యురేనియం తవ్వకాలను అడ్డుకుంటాం. యురేనియం పేరుతో అటవీ సంపదను కాజేయాలని చూస్తున్నారు. దీని రేడియేషన్‌తో జీవకోటి మనుగడకు ముప్పు నెలకొంది. దేశంలోనే పెద్దదైన అమ్రాబాద్ రిజర్వుఫారెస్టు, వన్యప్రాణులకు తీవ్ర నష్టంతోపాటు కృష్ణానది జాలాలు కూడా కలుషితమవుతాయి. – నాసరయ్య (యురేనియం తవ్వకాల వ్యతిరేక పోరాటకమిటీ నాయకులు) -
దేవుడి సాక్షిగా నరబలి!
సాక్షి, శిరివెళ్ల(కర్నూలు) : నల్లమల అటవీ ప్రాంతంలోని శ్రీ సర్వ నరసింహస్వామి ఆలయ సమీపంలోని వక్కిలేరు వాగులో పూడ్చిన శవాన్ని శుక్రవారం బయటకు తీశారు. తల నరికి వేయడం.. మృతదేహం పక్కన నిమ్మకాయ ఉండడంతో ఇది నరబలి అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాగులో వజ్రాల అన్వేషణ కోసం వచ్చిన ఓ వృద్ధుడు..గురువారం పూడ్చిన శవం కాలి వేలు బయట పడడాన్ని గమనించాడు. భయాందోళనకు గురై విషయాన్ని ఆలయ సిబ్బందికి తెలియ చేయగా వారు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. శుక్రవారం డిప్యూటీ తహసీల్దార్ జిలానీ, ఆర్ఐ ఉశేనిబాషా సçమక్షంలో సర్కిల్ ఎస్ఐలు చంద్రశేఖరరెడ్డి, రామిరెడ్డి ఆధ్వర్యంలో పూడ్చిన శవాన్ని బయటకు తీశారు. 25–30 ఏండ్ల వయస్సున్న వ్యక్తి తల నరికినట్లు ఉంది. అదిగాక గుంతలో శవం పక్కను నిమ్మ కాయ కూడా ఉండడంతో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. జీన్స్ ఫ్యాంట్, రెడ్ పుల్ షర్టు, ఎర్రని శరీర వర్ణచ్ఛాయతో చేతి వేలికి కాపర్‌తో తయారు చేతిన ఉంగరం ఉంది. మొలతాడు లేదు. నంద్యాల ప్రభుత్వ వైద్యశాల డాక్టర్ రామిరెడ్డి ఘటనా స్థలంలోనే మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. తలను దేహం నుంచి నరికినట్లు డాక్టర్ నిర్ధారించారు. కాగా వ్యక్తిని ఘటనా స్థలం నే హత్య చేసి పూడ్చి పెట్టారా ? లేక ఎక్కడో హత్య చేసి ఇక్కడ పూడ్చి పెట్టారన్నది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. కాగా వ్యక్తి కాలి వేలికి రింగ్ మాదిరిగా ఉంది. కాలి నొప్పి ఉన్న వారు ఇలా వేయించుకుంటారని స్థానికులు చెబుతున్నారు. మహదేవపురం వీఆర్వో శ్రీకాంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పోస్టు మార్థం అనంతరం మృత దేహాన్ని అక్కడే పూడ్చి వేశారు. -
గుడిలో ఉరేసుకుని భక్తుడి ఆత్మహత్య
పెద్దదోర్నాల: నల్లమల అటవీ ప్రాంతంలోని ఓ గుడిలో గుర్తు తెలియని భక్తుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన ఆదివారం శ్రీశైలం ఘాట్‌రోడ్డులోని చిన్నారుట్ల సమీపంలో ఉన్న ఆంజనేయస్వామి గుడిలో జరి గింది. స్టేషన్ రైటర్ సురేష్ తన సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి పరిశీలించారు. ఎస్ఐ రామకోటయ్య కథనం ప్రకారం.. శ్రీశైలం రోడ్డులో ఉన్న ఆంజనేయస్వామి ఆలయంలో ఉరేసుకున్న వ్యక్తికి సంబంధించి ఎటువంటి ఆనవాళ్లు లభించలేదన్నారు. మృతుడికి 20 నుంచి 30 ఏళ్లు ఉం టాయి. కాషాయ వస్త్రాలు ధిరించి ఉన్నాడు. శరీరంపై జంధ్యం ఉంది. సంఘటన శనివారం అర్ధరాత్రి జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు 9121102194 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు. -
ప్రతి పులికీ ఓ లెక్కుంది!
నల్లమల నుంచి ‘సాక్షి’ప్రత్యేక ప్రతినిధి అప్పుడే తెలతెలవారుతోంది.. దట్టమైన అడవి.. నింగిని తాకుతున్నాయా అన్నట్టుగా ఎల్తైన చెట్లు.. భానుడి లేలేత కిరణాలతో చిగురుటాకులపై మెరిసిపోతున్న మంచు బిందువులు.. ఆకాశంలో రివ్వురివ్వున పక్షులు.. ఎటు చూసినా ప్రకృతి సోయగాలు.. ఆహ్లాదకర వాతావరణం.. ఇంతలో గుండెలు అదిరిపడేట్టుగా.. ‘సార్.. పులి అడుగు జాడ. అడుగు ముందుకు వేయకండి..’ ఎఫ్ఆర్వో శ్రీదేవి హెచ్చరిక! వెంటనే ఆమె తన భుజాన ఉన్న కిట్‌బ్యాగ్‌ను తీశారు. మార్కర్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో పులి అడుగును సేకరించే పనిలో పడిపోయారు. అది సేకరించిన తర్వాత ఇంకా దట్టమైన అడవిలోకి బృందం ప్రయాణం సాగింది. పులుల గణన తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ‘సాక్షి’ మన్ననూర్ ఎఫ్ఆర్వో శ్రీదేవి టీంతో కలసి ఇటీవల నల్లమల అటవీప్రాంతంలో పర్యటించింది. ఈ ప్రయాణ విశేషాలు, పులుల పాదముద్రలను సేకరించే విధానంపై ఆసక్తికర అంశాలు.. పాద ముద్రలు సేకరిస్తారిలా.. మన్ననూర్ వెస్ట్ బీట్‌లోని ట్రయల్ పాత్‌పై బృందం ప్రయాణం సాగింది. ఉదయం 7 గంటలకల్లా అటవీ ప్రాంతంలోని గుండం చేరుకున్నాం. జంతువుల దాహార్తిని తీర్చుతున్న సహజమైన జల స్థావరం ఇది. దీని ఒడ్డునే పులి పాద ముద్రలు కనిపించాయి. స్పష్టంగా కనిపించే పాదాలను సేకరించేందుకు ఒక పద్ధతి, అస్పష్ట పాదముద్రలు సేకరించడానికి మరో పద్ధతి ఉంటుంది. నీటి చెమ్మ ఉండటంతో పులి అడుగు బలంగా పడింది. వెంటనే బృందంలో ఓ సభ్యుడు పరిసరాలను శుభ్రం చేశాడు. మరో సభ్యురాలు పచ్చి వెదురు కొమ్మను విరుచుకొచ్చి చుట్టలా మార్చి పాద ముద్రల చుట్టూ ఉంచింది. తర్వాత వెంట తెచ్చుకున్న ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పౌడర్‌ను చిన్న బకెట్లో నీళ్లతో కలిపి పాద ముద్రలపై పోశారు. 10 నిమిషాల తర్వాత ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పాదముద్రల అచ్చులతో గట్టిపడింది. దాన్ని తీసి భద్రపరిచారు. ఇలాంటి పాద ముద్రల నమూనాలు రిజర్వ్ ఫారెస్టు పరిధిలో 230 వరకు సేకరించినట్లు అధికారులు తెలిపారు. ఈ పాదముద్రల చిత్రాలను ఆన్లైన్లో వైల్డ్‌లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు పంపుతామని, అక్కడి నిపుణులు వాటిని విశ్లేషించి అవి ఎన్ని పులుల పాదముద్రలో అంచనా వేస్తారని అమ్రాబాద్ రేంజర్ ప్రభాకర్ తెలిపారు. గుండం వద్ద చిరుత పులుల పాదముద్రలు కూడా చాలానే కన్పించాయి. వామికొండ వైపు వెళ్తుండగా దారి మధ్యలో.. మూషిక జింకలు కనిపించాయి. ఇవి ప్రస్తుతం అంతర్ధాన దశలో ఉన్నాయి. వామికొండ అటవీ ప్రాంతంలో కూడా పులి పాదముద్రలు కన్పించాయి. పులి దారి.. రహదారి! పులులు, చిరుత పులులు ఎలుగుబంటి తదితర జంతువుల పాదముద్రలను గుర్తించేందుకు ముందుగా... అవి ఎక్కువగా నడిచే అవకాశం ఉన్న ప్రాంతం మీదుగా ఒక దారిని రూపొందిస్తారు. ఈ దారినే ‘ట్రయల్ పాత్’అని పిలుస్తారు. ఇది 5 మీటర్ల వెడల్పుతో సుమారు 5 కి.మీ. పొడవు ఉంటుంది. పులిది ఎప్పుడూ రాజ మార్గమే. పొదలు, పుట్టల మాటున దాక్కొని నడవడం దానికి ఇష్టం ఉండదు. చదునుగా విస్తరించిన బాటపైనే నడుస్తుంది. ఈ ట్రయల్ పాత్‌పైనే చాలా అటవీ జంతువుల పాదముద్రలు, వాటి విసర్జితాలు(పెంటికలు) కనిపిస్తాయి. అధికారులు కేవలం పులి, చిరుత పాదముద్రలు, పెంటిక నమూనాలు మాత్రమే సేకరించారు. మిగిలిన జంతువుల గుర్తులను నమోదు చేసుకున్నారు. తెలంగాణ పరిధిలోకి వచ్చే రాజీవ్ రిజర్వ్ టైగర్ ఫారెస్టులో మొత్తం 642 ట్రయల్ పాత్‌లు ఏర్పాటు చేశారు. శాకాహార జంతువులకు ‘ట్రాన్సాక్ట్’ శాకాహార జంతువులను లెక్కించేందుకు మరో పద్ధతి ఉంటుంది. ఇందుకు ఏర్పాటు చేసే మార్గాన్ని ‘ట్రాన్సాక్ట్’అని పిలుస్తారు. 2 కి.మీ. పొడవు, 2 మీటర్ల వెడల్పుతో దీన్ని రూపొందించారు. ప్రతి బీట్‌కు ఒకటి చొప్పున నల్లమలలో మొత్తం 213 ట్రాన్సాక్ట్లు ఏర్పాటు చేశారు. ట్రాన్సాక్ట్కు ప్రతి 400 మీటర్లకు ఒక మార్కు చొప్పున విభజన చేశారు. ప్రతి మార్కు పరిధిలో సాధారణ మొక్కలు, ఔషధ మొక్కలు, చెట్లు, పొదలను లెక్క గట్టారు. -
నల్లమలకు పర్యాటక శోభ
సాక్షి, నాగర్‌కర్నూల్ : నల్లమలకు పర్యాటక శోభ సంతరించుకుంది. రోజురోజుకు పర్యాటకుల తాకిడి పెరుగుతోంది. నాగర్‌కర్నూల్ జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలోని పురాతన ఆలయాలు, ప్రకృతి రమణీయ ప్రదేశాలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.90 కోట్లు కేటాయించింది. ఇందుకు సంబంధించిన పనులు చురుగ్గా సాగుతున్నాయి. శ్రీశైలం క్షేత్రానికి ముఖద్వారంగా భావించే ఉమా మహేశ్వర క్షేత్రానికి పర్యాటకంగా మెరుగులు అద్దుతున్నారు. జిల్లాలోని కృష్ణా, తుంగభద్ర నదుల సంగమ ప్రదేశం సోమశిలలోని జ్యోతిర్లింగాల ఆలయాలను అభివృద్ధి పర్చడంతోపాటు ఇక్కడ పర్యాటకులకు ఆహ్లాదాన్ని అందించేందుకు ప్రత్యేకంగా బోట్లు, కాటేజీలు ఏర్పాటు చేయనున్నారు. ఇంకా హరి, కేశవుల ప్రతిరూపంగా భావించే సింగవట్నం లక్ష్మీ నరసింహస్వామి పురాతన ఆలయాన్ని పర్యాటకశాఖ అభివృద్ధి పరుస్తోంది. ఆలయ ఆవరణలోని శ్రీవారి సముద్రాన్ని మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి పరుస్తోంది. రత్నగర్భ లక్ష్మీదేవి కొలువైన రత్నగిరి కొండను పర్యాటకుల సౌకర్యార్థం సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఆకట్టుకుంటున్న వ్యూ పాయింట్లు సలేశ్వరం వ్యూ పాయింట్‌కు వెళ్లేందుకు అటవీశాఖ ప్రత్యేకంగా సఫారీ వాహనాలను ఏర్పాటు చేసింది. ఇక్కడికి వెళ్లాలంటే టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ గుండా ప్రయాణించాల్సి ఉండటంతో ప్రత్యేక భద్రత ఏర్పాట్లు ఉంటాయి. ఈ సందర్భంగా పర్యాటకులకు అటవీ వన్యమృగాలు కనువిందు చేస్తాయి. జింకలు, దుప్పులు, అడవి కోళ్లు, కోతులు, నెమళ్లు, రకరకాల పక్షులతోపాటు చిరుతలు, పెద్ద పులులు దర్శనమిస్తుంటాయి. ఈగలపెంట వద్ద రోప్‌వే.. దట్టమైన అభయారణ్యంలో ఫర్హాబాద్ వ్యూపాయింట్ ఉంది. ఇక్కడి నుంచి నల్లమలలోని అటవీ అందాలు, వన్య మృగాల సంచారాన్ని ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం ఉంది. దీనిని కాళ్ల కింద నుంచే డీప్ (లోతును) అందాలను చూసేందుకు ప్రత్యేక లిఫ్ట్ మాదిరి యంత్రాన్ని అభివృద్ధి చేయనున్నారు. దీని మాదిరిగానే అక్కమ్మదేవి గృహాల సమీపంలో మరో వ్యూ పాయింట్, వాచ్‌టవర్ నిర్మించేందుకు ప్రతిపాదనలు తయారు చేశారు. శ్రీశైలం డ్యాం సమీపంలో కృష్ణానదిలోకి దిగేందుకు ఈగలపెంట వద్ద రోప్‌వే ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. రోప్‌వే ఏర్పాటుతో పాతాళగంగను చేరేందుకు దాదాపు 20 కి.మీ దూరం తగ్గుతుంది. డ్యాం చుట్టు కాకుండా నేరుగా పాతాళగంగా నుంచి శ్రీశైలం వెళ్లొచ్చు. తద్వారా శ్రీశైలం మల్లికార్జునస్వామి, భ్రమరాంబ అమ్మవారి దర్శనానికి వెళ్లే భక్తులు దోమలపెంట, ఈగలపెంటలో విడిది చేసి రద్దీ తగ్గాక వెళ్లేందుకు వెసులుబాటు లభిస్తుంది. అటవీశాఖ అనుమతులు రాగానే రోప్‌వే పనులు ప్రారంభిస్తారు. పర్యాటకులకు బస్సులు ఫర్హాబాద్ నుంచి అమ్రాబాద్ పులుల అభయారణ్య సంరక్ష కేంద్రంలో వివిధ ప్రాంతాలను పర్యాటకులు తిలకించేందుకు ఇప్పటికే రెండు బస్సులు ఏర్పాటు చేశారు. ఒక్కొకరికి రూ.100 చార్జీ చొప్పున తీసుకుని రెండుగంటలు అడవి అందాలను చూసే అవకాశాన్ని కల్పించారు. పర్యాటకుల రద్దీని బట్టి మరో 2 బస్సు లు కొనుగోలు చేయనున్నారు. ఆక్టోపస్ వ్యూ పాయింట్‌కు అపూర్వ స్పందన 3ఇటీవల పర్యాటక శాఖ, అటవీ శాఖ సంయుక్తంగా నాగర్‌కర్నూల్ జిల్లాలోని దోమలపెంటకు 12 కిలోమీటర్ల దూరంలో ఆక్టోపస్ వ్యూ పాయింట్ ఏర్పాటు చేశారు. కృష్ణానది మూడు పాయలుగా ఇక్కడ నల్లమల కొండలను చీలుస్తూ ప్రవహించే దృశ్యం వీక్షించేందుకు వీలుగా దీనిని ఏర్పాటు చేశారు. ఇక్కడికి వెళ్లాలంటే కూడా అటవీ శాఖ అధికారుల బందోబస్తు ఏర్పాట్ల ద్వారానే వెళ్లాల్సి ఉంటుంది. నల్లమల అడవిలో ప్రయాణించడం, పారే జలపాతాలు, కిలకిలరావాలు చేసే పక్షుల సందడి మధ్య వ్యూ పాయింట్‌కు చేరుకోవడం పర్యాటకులకు తెలియని అనుభూతిని కలిగిస్తుంది. ఇక నల్లమల అటవీ ప్రాంతంలోని పలు చోట్ల రోప్‌వేల నిర్మాణం కోసం అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఎత్తయిన జలపాతమైన మల్లెలతీర్థాన్ని చేరుకునేందుకు మెట్ల దారి ఏర్పాటు చేస్తున్నారు. -
పెళ్లి చూపులకు వెళ్తూ..
∙ రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలు ∙ నల్లమల ఘాట్‌లో ఘటన ∙ కారులో ఇరుక్కుపోయిన క్షతగాత్రులు ∙ నుజ్జునుజ్జయిన కారు నల్లమల ఘాట్(మహానంది): నంద్యాల–గిద్దలూరు రహదారిపై నల్లమల ఘాట్‌లో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుల కథనం మేరకు.. మార్కాపురం గ్రామానికి చెందిన మర్రి రమణ, సుభద్ర దంపతులు తమ కుమారుడు కిరణ్‌కు పెళ్లి చూపుల కోసం కారులో స్వగ్రామం నుంచి బయలుదేరారు. పచ్చర్ల సమీపంలో ఉన్న కల్వర్టు మలుపుల వద్ద వేగంగా వస్తున్న బండల లారీ కారును ఢీకొట్టింది. దీంతో రమణకు నడుము, సుభద్ర కాలు, చేయి విరిగాయి. కిరణ్‌కు తీవ్రగాయాలయ్యాయి. డ్రైవర్ సురేష్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. కారు నుజ్జనుజ్జవడంతో దాదాపు గంటపాటు వారు వాహనం నుంచి బయటకు రాలేకపోయారు. అటుగా వచ్చిన ప్రయాణికులు వారిని 108లో నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో వారిని కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. మహానంది ఎస్ఐ పెద్దయ్యనాయుడు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన సిబ్బందితో కలిసి నంద్యాల ప్రభుత్వాస్పత్రికి వెÐðళ్లి వివరాలు సేకరించారు. కారు డ్రైవర్ సురేష్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
పెద్దపులే టార్గెట్
► నల్లమలలోకి హర్యానాకు చెందిన వేటగాళ్ల ముఠా ప్రవేశించినట్లు సమాచారం ► రెడ్ అలర్ట్ ప్రకటించిన అటవీశాఖ ► అడవిని జల్లెడ పడుతున్న అధికారులు ► అనుమానితులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని గిరిజనులకు సూచన ఆత్మకూరు రూరల్(కర్నూలు): ప్రపంచంలో అంతరించి పోతున్న జాతిగా రెడ్ డాటా బుక్‌లో నమోదైన పెద్ద పులులకు అత్యంత సురక్షిత అభయారణ్యంగా నల్లమలకు పేరుంది. నల్లమలలోని నాగార్జున సాగర్ – శ్రీశైలం పెద్దపులుల అభయారణ్యం, గుండ్ల బ్రహ్మేశ్వరం వన్యప్రాణి అభయారణ్యాలు పెద్దపులులు అత్యంత వేగంగా ప్రవర్ధనం చెందడానికి అనువైన ప్రదేశాలుగా దేశంలోనే గుర్తింపు పొందాయి. ఈ ప్రాంతాల్లో సుమారుగా వంద పులులకు తక్కువ కాకుండా ఉండవచ్చని ఓ అంచనా. అంతా బాగుంది అనుకుంటున్న ఈ పరిస్థితుల్లో వాటి భద్రతకు మళ్లీ ముప్పు ముంచుకొచ్చింది. హర్యానాకు చెందిన ముగ్గురితో కూడిన వేటగాళ్ల ముఠా పులులను వేటాడేందుకు నల్లమలలో ప్రవేశించినట్లు జాతీయ పులుల సంరక్షణ సాధికార సంస్థ (ఎన్టీసీఏ) నుంచి నల్లమలలోని నాగార్జునసాగర్ – శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ ప్రాజెక్ట్ టైగర్ శర్వానంద్‌కు సమాచారమందింది. అలాగే వైల్డ్‌లైఫ్ క్రైమ్ కంట్రోల్ బోర్డు న్యూఢిల్లీ నుంచి కూడా ఇదే సమాచారం నల్లమల పరిధిలోని అటవీ అధికారులకు చేరింది. దీంతో అటవీ శాఖ నల్లమల పరిధిలో రెడ్ అలర్ట్ ప్రకటించింది. పులు వేటలో ఘనాపాఠీలు: నల్లమలలోకి ప్రవేశించినట్లు అనుమానిస్తున్న ముఠా సభ్యులు లక్ష్మీచాంద్, పప్పు, లీలావతిలు హర్యానా రాష్ట్రంలోని పంచకుర జిల్లాలో వేట ప్రధాన వృత్తిగా గల ఓ తెగకు చెందిన వారు. వీరు దేశంలోని పలు పెద్ద పులుల అభయారణ్యాలు నేషనల్ పార్కులలో వేటాడి చంపిన కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నారు. అలవాటు నేర ప్రవృత్తి కలిగిన ఈ బృందం నల్లమల చేరుకుందన్న సమాచారం అటవీ శాఖ అధికారులను పరుగులు పెట్టిస్తోంది. పుణ్యక్షేత్రాలపై ప్రత్యేక నిఘా మహానంది: నల్లమలలోకి పెద్ద పులల వేటగాళ్లు ప్రవేశించారనే సమాచారం మేరకు నల్లమల పరిధిలోని మహానంది, అహోబిలం, ఓంకారం, గుండ్ల బ్రహ్మేశ్వరం పుణ్యక్షేత్రాల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు నంద్యాల డీఎఫ్ఓ శివప్రసాద్ తెలిపారు. ఇప్పటికే ఆయా పుణ్యక్షేత్రాల పరిధిలోని ప్రొటెక్షన్ వాచర్లు, సిబ్బందిని అలర్ట్ చేశామన్నారు. ఫారెస్ట్ రేంజర్లు, డివిజనల్ రేంజ్ ఆఫీసర్లు, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, అసిస్టెంటు బీట్ ఆఫీసర్లు, ప్రొటెక్షన్ వాచర్లతో ప్రత్యేక టీములను కేటాయించామన్నారు. పగలు, రాత్రి వేళల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నల్లమల ఘాట్ రోడ్డు అయిన నంద్యాల–గిద్దలూరు దారిలో నిత్యం వాహనాల తనిఖీ చేపడతామన్నారు. అడవంతా గాలింపు నల్లమలలో పెద్దపులల వేటగాళ్లు ప్రవేశించారనే సమాచారంతో అటవీశాఖాధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు. చెంచుగూడేల్లో, అటవి సమీప గ్రామాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. అన్ని బేస్‌క్యాంపుల సిబ్బంది సమన్వయంతో కాలినడకన అడవంతా జల్లెడ పడుతున్నారు. హిందీ మాట్లాడే ఉత్తర భారతదేశ వ్యక్తులు, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే సమాచారాన్ని తమకు తెలియజేయాలని ఆత్మకూరు అటవీ డివిజన్ ముఖ్య అధికారి సెల్వం ప్రకటించారు. 9440810058, 9493547206, 9493547207, 9493547221, 9493548832, 9493548825 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చి వన్యప్రాణును కాపాడాలని కోరారు. గతంలోనూ ఉత్తరాది వేటగాళ్ల సంచారం నల్లమలలో పలుమార్లు ఉత్తర భారత దేశానికి చెందిన పులుల వేటగాళ్లు సంచరించారు. ఢిల్లీకి చెందిన రాణి సాహెబా అనే మహిళా వన్యప్రాణి స్మగ్లర్ తరఫున ఓ వేట గాళ్ల బృందం నల్లమలలో అనుమానాస్పదంగా తిరుగుతూ ఆత్మకూరు అటవీ డివిజన్ అధికారులకు పట్టు బడింది. ఈ బృందంలోని వారు పగలు అటవీ సమీప గ్రామాల్లో బొమ్మలు, శాలువాలు, రగ్గులు అమమ్ముతూ తిరుగుతూ రాత్రి పూట అడవుల్లో ప్రవేశించి వన్యప్రాణులను వేటా డుతారు. పట్టు బడిన వేటగాళ్ల బృందం ఇచ్చిన సమాచారం మేరకు రాణి సాహెబాపై నాగలూటి రేంజ్ అధికారులు కేసు నమమోదు చేసి ఆమెను ఢీల్లీలో అరెస్టు చేసి తీసుకొచ్చారు. ఇదిలా ఉండగా ఆత్మకూరు అటవీ డివిజన్ వెలుగోడు రేంజ్‌లోని నార్త్ బీట్‌లో పులులను వేటాడేందుకు ఉపయోగించే ఇనుప ఉచ్చు(ఐరన్ ట్రాప్) గతంలో లభ్యమయింది. ఈ తరహా ఉచ్చులను హర్యానా వేటగాళ్లు వినియోగిస్తారని అధికారుల ద్వారా తెలుస్తోంది. -
నల్లమలలో మంటలు
మహానంది: నంద్యాల–గిద్దలూరు ఘాట్‌రోడ్డులోని నల్లమల అడవిలో శనివారం రాత్రి మంటలు చెలరేగాయి. నంద్యాల నుంచి గిద్దలూరు వెళ్లే మార్గంలో సర్వనరసింహస్వామి ఆలయం దాటిన తర్వాత చలమ ముఖద్వారం సమీపంలో మంటలు వ్యాపించాయి. కింది నుంచి పై వరకు మంటలు చెలరేగాయి. ఘాట్ రోడ్డు వెంబడి వెళ్తున్న వాహనదారులు భయాందోళన చెందుతున్నారు. సమీపంలో పచ్చర్ల గ్రామం ఉంది. వేసవికాలం కావడంతో అటవీశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుని అగ్నిప్రమాదాల నుంచి అడవిని కాపాడాలని అటవీ పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు. -
నల్లమలలో రూ. 22లక్షలతో ఫైర్‌లైన్స్
- డీఎఫ్ఓ శివప్రసాద్ మహానంది: వేసవిలో నల్లమల సంరక్షణకు రూ. 22లక్షలు వెచ్చించి 200 కిలోమీటర్ల మేరకు ఫైర్‌లైన్స్ ఏర్పాటు చేశామని డీఎఫ్ఓ శివప్రసాద్ పేర్కొన్నారు. స్థానిక అటవీ పర్యావరణ కేంద్రం నర్సరీల్లో పెరుగుతున్న మొక్కలను శుక్రవారం ఆయన పరిశీలించారు. నల్లమల అడవిలో అగ్ని ప్రమాదాలను పూర్తిగా అరికట్టేందుకు తాత్కాలికంగా 55 మందిని ఫైర్వాచర్స్గా తీసుకున్నామన్నారు. ప్రస్తుతం బేస్‌క్యాంపుల్లో 65 మంది సిబ్బంది విధుల్లో ఉన్నారని తెలిపారు. వన్యప్రాణులకు తాగునీరు అందించేందుకు నంద్యాల, రుద్రవరం డివిజన్లలో 60 సాసర్ పిట్స్ ఉన్నాయన్నారు. వీటికి అదనంగా కొత్తగా 40 నిర్మించామన్నారు. వీటికి ఎప్పటికప్పుడు ట్రాక్టర్ల ద్వారా నీటిని నింపుతామని తెలిపారు. ప్రతి రోజూ నంద్యాల–గిద్దలూరు రహదారిలోని ఘాట్‌రోడ్డులో తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. అటవీపర్యావరణ కేంద్రం పరిధిలోని రెండో నర్సరీలో మొక్కలు ఎండిపోవడంపై డీఎఫ్ఓ శివప్రసాద్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పక్షం రోజుల్లో పరిసరాలు మారాలని సిబ్బందిని ఆదేశించారు. నంద్యాల ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అబ్దుల్ ఖాదర్, డీఆర్ఓ రఘుశంకర్ తదితరులు ఆయన వెంట ఉన్నారు. -
నల్లమల ఘాట్‌లో లారీ బోల్తా
మహానంది: కర్నూలు జిల్లాలోని నల్లమల ఘాట్ రోడ్డులో ఇనుప రాడ్ల లోడుతో వెళుతున్న లారీ అదుపు తప్పి బోల్తాపడింది. ఈ సంఘటనతో ఈ మార్గంలో రాకపోకలు ఆగిపోయాయి. నంద్యాల-గిద్దలూరు మార్గంలో నల్లమల ఘాట్ రోడ్డులో గురువారం మధ్యాహ్నం లారీ బోల్తా పడింది. లారీ గుంటూరు నుంచి నంద్యాలకు వెళుతోందని తెలుస్తోంది. ఈ ప్రమాదం కారణంగా ఈ ఘాట్‌రోడ్డులో రాకపోకలు ఆగిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి బయలుదేరారు. లారీని పక్కకు తప్పించి రాకపోకలను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నారు. -
సమాజ సేవలోనే సంతృప్తి
ఆర్డీటీ ప్రోగ్రామ్ డైరెక్టర్ మాంచో ఫెర్రర్ ఆత్మకూరురూరల్: తోటి మనిషికి సహయం చేయడంలోనే సంతృప్తి దాగి ఉంటుందని రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ప్రోగ్రామ్ డైరెక్టర్ మాంచో ఫెర్రర్ స్పష్టం చేశారు. ‘ఇండియా ఫర్ ఇండియా’ అన్న తమ సంస్థ చేపట్టిన కార్యక్రమంలో భాగంగా సేవా హుండీల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఆయన బుధవారం ఆత్మకూరు వచ్చారు.ఈ సందర్భంగా రాయల్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. ఎప్పుడూ విదేశీ నిధులతోనే సేవ చేయాలా? మనల్ని మనం ఆదుకుందామనే ఉద్దేశంతో చేపట్టిన కార్యక్రమమే సేవా హుండీలని ఆయన చెప్పారు . చాలా మంది ఈ హుండీలో రోజుకొక రూపాయ చొప్పున వేసి ఏడాది తర్వాత తిరిగి తమ సంస్థ సేవాకార్యక్రమాలకు అందజేస్తున్నారన్నారు. 2014లో మొదలైన ఈ ఉద్యమంతో ఇప్పటికి కోట్లాది రూపాయలు సంస్థకు అందాయన్నారు. గత సంవత్సరం 1,44,596 సేవా హుండీల ద్వారా రూ.4,12,71,077 సమకూరిందన్నారు. ఈ డబ్బును నల్లమలలో అత్యంత దుర్భర జీవనం గడుపుతున్న చెంచుల సంక్షేమానికి వెచ్చిస్తునా్నమని చెప్పారు. అనంతరం ఆయన ఎంపిక చేసిన వలంటీర్లకు సేవా హుండీలను అందించి ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించాలని కోరారు. కార్యక్రమంలో ఆత్మకూరు సీఐ కృష్ణయ్య పాల్గొని ప్రసంగించారు.ఆర్డీటీ సిబ్బంది వన్నూరప్ప, బాషాతదితరులు పాల్గొన్నారు. -
నల్లమలలో యువనేత
రాజన్న కుమారుడు వైఎస్ జగన్ శ్రీశైలం వెళ్తున్నారనే సమాచారం తెలుసుకున్న నల్లమల ప్రాంత పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్ అభిమానులు హాజీపూర్ చౌరస్తా వద్దకు తండోపతండాలుగా తరవచ్చారు. జగన్ రాకకోసం ఎంతో ఆతృతగా ఎదురుచూశారు. జననేత రాగానే పూలమాలలు వేసి, కరచాలనం చేసి అభిమానం చాటుకున్నారు. అచ్చంపేట: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి గురువారం అచ్చంపేట మండలం హాజీపూర్ చౌరస్తాలో పార్టీ నాయకులు ఘనస్వాగతం పలికారు. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లుతున్న ఆయన ఉదయం11 గంటలకు హాజీపూర్‌కు చేరుకున్నారు. చౌరస్తాలో ఉన్న వైస్సార్ సీపీ నేతలను చూసి వాహనం నిలిపారు. కాబోయే సీఎం వైఎస్ జగన్ అని కార్యకర్తలు, నాయకులు నినాదాలు చేశారు. వాహనంలో నుంచి ఆయన కిందకు దిగగా కార్యకర్తలు, నాయకులు ఒకరినొకరు తోసుకుంటూ కలిసేందుకు ప్రయత్నించారు. తోపులాటతో వైఎస్‌ను అంగరక్షకులు చుట్టముట్టి వాహనం ఎక్కించారు. వాహనంపై నుంచి అభిమానులకు అభివాదం చేశారు. నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల అధ్యక్షుడు భగవంతురెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి ఆయనకు పుష్పగుచ్ఛం అందజేశారు. అధ్యక్షుడు కలుస్తుండగానే జగన్ అభిమానులు తోసుకుంటూ జగన్ వద్దకు చేరుకున్నారు. స్వాగతం పలికిన వారిలో అచ్చంపేట నియోకవర్గ నేతలు కొండూరు చంద్రశేఖర్, తోకల శ్రీనివాస్‌రెడ్డి, మంజూరు అహ్మద్ పాల్గొన్నారు. జననేత అభివాదం మన్ననూర్: నల్లమల సరిహద్దు ప్రాంతం మన్ననూర్ మీదుగా శ్రీశైలం వెళ్లిన జననేతను చూసేందుకు తరలొచ్చి రోడ్డుపై వేచి ఉన్న ప్రజలకు వైఎస్సార్సీపీ నేత జగన్మోహన్రెడ్డి అభివాదం చేశారు. గురువారం ఆంధ్రప్రదేశ్‌లో రైతు భరోసా యాత్రను ప్రారంభించేందుకుగాను ఆయన రోడ్డు మార్గం గుండా శ్రీశైలం వెళ్లారు. జగన్ వస్తున్న సమాచారం తెలుకున్న ప్రజలు మన్ననూర్, వటువర్లపల్లి, దోమలపెం ట, ఈగలపెంట, పాతాలగంగ వద్ద నీరాజనాలు పలికారు. అమ్రాబాద్ మండలం ఈగలపెంట పోలీసులు రోడ్డు భద్రతలో భాగంగా మండల సరిహద్దు మూలమలుపు నుంచి చెరువు కొమ్ము లింగమయ్యస్వామి ఆలయం సమీపంలోని అటవీశాఖ చెక్‌పోస్టు వరకు ఎస్కార్ట్‌గా వెళ్లారు. -
వామ్మో..పెద్ద పులి!
- నల్లమల సమీప గ్రామాల్లో సంచారం - భయపడుతున్న గ్రామస్తులు - పాదగుర్తులను గుర్తించిన అధికారులు - జాగ్రత్తగా ఉండాలని సూచనలు చిన్నకంబలూరు (ఆళ్లగడ్డ): నల్లమల అటవీ సమీపంలోని చిన్నకంబలూరు, పేరూరు, ఈదుబై కొట్టాల ప్రాంతాల్లో పెద్దపులి సంచారం ప్రజల్లో భయాందోళన కల్గిస్తోంది. వారం రోజులుగా పంట పొలాల్లో ఇది సంచరిస్తున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఈ విషయం తెలిసి..పొలాల్లోకి వెళ్లేందు రైతులు, కూలీలు జంకుతున్నారు. అటవీ అధికారులకు సమాచారం అందడంతో సోమవారం..వారు పులి సంచార ప్రాంతాలకు వెళ్లి పగ్ మార్క్‌లు ( పులి పాదాల గుర్తులను ) సేకరించారు. సేకరించిన గుర్తులను నంద్యాల అటవీ కార్యాలయానికి తీసుకెళ్లి పరిశీలించగా అవి పెద్ద పులి పాదాలని తేలింది. ఈ సందర్భంగా చలమ రేంజి అధికారి సూర్యచంద్రరాజు మాట్లాడుతూ.. చిన్నకంబలూరు, పేరూరు సమీప గ్రామాల్లో పెద్ద పులి వారం రోజులుగా సంచరిస్తూ, తిరిగి నల్లమల అడవిలోకి వెళ్తోందన్నారు. పూర్తి నిర్ధారణ చేసి ప్రజలకు సమాచారం ఇస్తామని.. అంతవరకు అటవీ సిబ్బంది, గ్రామస్తులు జాగ్రత్తగా ఉండాలన్నారు.