కర్నూలు జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో పోలీసులు శనివారం భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం సిద్ధాపురం ప్రాంతంలో తనిఖీలు నిర్వహించిన పోలీసులు ఓ వాహనంలో భారీగా పేలుడు పదార్థాలను కనుగొన్నారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసిన పోలీసులు 1260 జిలిటిన్ స్టిక్స్, 1650 డిటోనేటర్లతో పాటు.. 150 కిలోల అమ్మోనియం నైట్రేట్ ని స్వాధీనం చేసుకున్నారు. పేలుడు పదార్థాలను తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా.. ఈ పేలుడు పదార్థాలు ఎవరివి.. ఎక్కడికి తరలిస్తున్నారు అనే కోణంలో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.
భారీగా పేలుడు పదార్ధాలు స్వాధీనం
Published Sat, Nov 28 2015 4:12 PM | Last Updated on Sun, Sep 3 2017 1:10 PM
Advertisement
Advertisement