explosives
-
పేరు వేరే అయినా.. పేజర్ వీళ్లదే
లెబనాన్‌లో వేలాది పేజర్లు ఒకే సమయంలో పేలి వేలాది మందిని గాయపరిచి, కొందరి ప్రాణాలు తీసిన ఘటనలో కొత్త విషయాలు బయటికొస్తున్నాయి. పేలిన పేజర్లను హంగేరీలోని ఒక సంస్థకు హెజ్బొల్లా, లెబనాన్ సైన్యం ఆర్డర్ ఇవ్వగా వాటిలో స్వల్ప పరిమాణంలో పేలుడు పదార్థాన్ని అమర్చి సరఫరా చేశారని గత రెండ్రోజులుగా వార్తలొచ్చాయి. అయితే వాస్తవానికి ఆ పేజర్లను తయారుచేసిన సంస్థ ఇజ్రాయెల్‌కు చెందిన డొల్ల కంపెనీ అని అంతర్జాతీయ మీడియా కోడై కూస్తోంది. హంగేరీలో పేరులో ‘బీఏసీ’ అక్షరాలుండే కంపెనీలు కుప్పలుతెప్పలుగా ఉన్నాయి. వీటి పోలికలతో ‘బీఏసీ కన్సల్టింగ్ కేఎఫ్టీ’ పేరిట ఒక నకిలీ కంపెనీని ఇజ్రాయెల్ స్థాపించింది. పేజర్లను అది తయారుచేస్తుంది. హెజ్బొల్లా సభ్యులకు పేలుడు పదార్థమున్న పేజర్లను సరఫరా చేసి వారిని అంతంచేయడమే ఈ కంపెనీ లక్ష్యం. ఇందుకోసం ముగ్గురు ఇజ్రాయెల్ నిఘా విభాగ అధికారులు ప్రత్యేకంగా పనిచేశారని తెలుస్తోంది. లెబనాన్ నుంచి పేజర్ల సరఫరా కాంట్రాక్ట్ సంపాదించేందుకు ఇజ్రాయెల్ చాన్నాళ్ల క్రితమే మూడు డొల్ల కంపెనీలను ఏర్పాటుచేసిందని న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. ఈ మూడు కంపెనీల్లో ఒకటైన బీఏసీ కన్సల్టింగ్ కేఎఫ్టీ హంగేరీలోని బుడాపెస్ట్ కేంద్రంగా పనిచేస్తోంది. ఈ సంస్థకు, ఇజ్రాయెల్‌కు సంబంధం ఉంటుందని హెజ్బొల్లా అస్సలు ఊహించలేదు. ఎలాంటి అనుమానం రాకపోవడంతో బీఏసీ కన్సల్టింగ్ సంస్థకే హెజ్బొల్లా పేజర్ల సరఫరా ఆర్డర్ ఇచ్చిందని ఇరాన్‌లోని మెహర్ న్యూస్ఏజెన్సీ వివరించింది. బీఏసీ కన్సల్టింగ్ గత మూడేళ్లుగా తైవాన్‌కు చెందిన గోల్డ్ అపోలో బ్రాండ్‌తో పేజర్లు తయారుచేసి విక్రయిస్తోంది. దీంతో హెజ్బొల్లా నుంచి చాలా సులువుగా బీఏసీ సంస్థ ఆర్డర్ సాధించగల్గిందని మెహర్ తన కథనంలో పేర్కొంది. అందుకే యూరప్ దేశానికి చెందిన పేజర్లు పేలితే తనకేం సంబంధం అన్నట్లు ఇజ్రాయెల్ ఇంతవరకు ఎలాంటి వివరణ ఇవ్వలేదని తెలుస్తోంది. అయితే ఈ విషయమై బీఏసీ కన్సల్టింగ్ వాదన మరోలా ఉండటం విశేషం. ‘‘ పేజర్ల తయారీలో మాకు ఎలాంటి సంబంధం లేదు. మేం కేవలం వాటిని రవాణా చేశాం’’ అని బీఏసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారిణి క్రిస్టినా బార్సోనీ అర్సిడియాకోనో స్పష్టంచేశారు. పేలిన పేజర్లను మాత్రమేగాక సాధారణ పౌరుల కోసం కూడా వేలాది పేజర్లను ఈ సంస్థ తయారుచేసినట్లు సమాచారం. ఈ సాధారణ పేజర్లు ఏవీకూడా పేలినట్లు వార్తలు రాలేదు. హెజ్బొల్లా సభ్యులు వాడిన, పేలిన పేజర్లు 2022 ఏడాది అర్ధభాగంలో తయారుచేసి ఉంటారని తెలుస్తోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ డంప్ స్వాధీనం
పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా): కూంబింగ్‌కు వచ్చిన పోలీస్ పార్టీలను హతమార్చాలనే లక్ష్యంతో మావోయిస్టులు ఏర్పాటు చేసిన భారీ డంప్‌ను పోలీసులు చాకచక్యంగా వెలికితీసి నిర్విర్యం చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ తుహిన్ సిన్హా వెల్లడించారు. జీకే వీధి మండలం సీలేరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పనసలబంద పరిసర అటవీ ప్రాంతంలో ఈ నెల 24న పోలీస్ పార్టీలు కూంబింగ్‌కు వెళ్లాయి. వారిని హతమార్చాలనే లక్ష్యంతో మావోలు ఏర్పాటు చేసిన భారీ డంప్‌ను పోలీసులు గుర్తించి స్వా«దీనం చేసుకున్నారు.ఈ డంప్‌లో ఆరు స్టీల్ క్యారేజ్ మందు పాత్రలు, రెండు డైరెక్షనల్ మైన్స్, ఖేల్ కంపెనీకు చెందిన ఒక పేలుడు పదార్థం, 150 మీటర్ల ఎలక్ట్రికల్ వైరు, ఐదు కిలోల మేకులు, ఇనుప నట్లు, విప్లవ సాహిత్యం ఉన్నాయని ఆయన వివరించారు. జిల్లాలో మావోయిస్టులు దాచిపెట్టిన డంప్‌లన్నింటినీ స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. మావోల కుట్రపూరిత ప్రణాళికలపై గిరిజనులంతా అప్రమత్తంగా ఉండాలని, వారి మాటలు నమ్మొద్దని సూచించారు.మావోలకు పేలుడు పదార్థాలు లభించడంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామని, పనసలబంద అటవీ ప్రాంతంలో అధారాల కోసం గాలింపు కొనసాగుతోందన్నారు. డంప్‌ను స్వా«దీనం చేసుకోవడంలో కీలకపాత్ర పోషించిన సీలేరు ఎస్ఐ రామకృష్ణ, ఆర్ఎస్ఐ జాన్‌రోహిత్, జి.మాడుగుల ఎస్ఐ శ్రీనివాసరావులను ఎస్పీ అభినందించారు. -
1,300 కిలోల పేలుడు పదార్థాల పట్టివేత
మహబూబాబాద్ రూరల్ : పోలీసులు 1300 కిలోల పేలుడు పదార్థాలను పట్టుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరిని అరెస్ట్ చేయగా, మరొకరు పరారయ్యారు. బుధవారం మహబూబాబాద్ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ రాంనాథ్ కేకన్ ఈ కేసు వివరాలు వెల్లడించారు. మరిపెడ ఎస్సై తాహేర్ బాబా ఆధ్వర్యంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. వీరారం క్రాస్‌రోడ్డు వద్ద పోలీసులను గమనించిన బొలెరో వాహన డ్రైవర్ పారిపోయేందుకు ప్రయత్నించాడు. దీంతో అనుమానం వచ్చి వెంటనే వాహనం ఆపి తనిఖీ చేయ గా, అందులో బాక్సులు కనిపించాయి. అందులో పేలుడు పదార్థాలకు సంబంధించిన జిలెటిన్ స్టిక్స్, ఎలక్ట్రానిక్ డిటోనేటర్లు లభించాయి. జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం జయదేవపేట గ్రామానికి చెందిన కస్తూరి కుమార్, మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం దంటకుంట తండాకు చెందిన బాదావత్ కిశోర్‌లను అదుపులోకి తీసుకున్నారు. కుమార్‌కు వెంకటరమణ ఎంటర్ ప్రైజెస్ పేరు మీద లైసెన్స్ ఉంది. ఆ లైసెన్స్ ప్రకారం కేవలం నిర్ణీత పరిధిలో మాత్రమే పేలుడు పదార్థాలను అమ్ముకోవాలి. కానీ తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో అక్రమంగా పేలుడు పదార్థాలను అనుమతి లేని వారికి అమ్ముతూ పట్టుబడ్డారు. కాగా, ఈ ఘటనలో జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం జయదేవపేట కస్తూరి సారయ్య పరారీలో ఉన్నాడని ఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ జోగుల చెన్నయ్య, తొర్రూరు డీఎస్పీ సురేష్, మరిపెడ సీఐ హతీరాం, ఎస్సై తాహేర్ బాబా, పోలీసు సిబ్బంది క్రాంతికుమార్, వెంకన్న పాల్గొన్నారు. -
ఇండియన్ మ్యూజియానికి బాంబు బెదిరింపులు
కోల్‌కతా: కోల్‌కతాలోని ఇండియన్ మ్యూజియానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. మ్యూజియంలో బాంబును అమర్చినట్లు ఈమెయిల్ వచ్చిందని పోలీసులు తెలిపారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. సందర్శకులందర్ని మ్యూజియం నుంచి ఖాళీ చేయించారు. బాంబు స్క్వాడ్ బృందాలను మ్యూజియానికి పంపించారు. బాంబు బెదిరింపు ఈమెయిల్‌లు బూటకమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మధ్య కాలంలో అమెరికా నుంచి అలాంటి మెయిల్స్ కొన్ని వచ్చాయని వెల్లడించారు. ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లు దుండగులు మెయిల్లో పేర్కొన్నట్లు స్పష్టం చేశారు. ఇటీవల దేశంలో బాంబు బెదిరింపు మెయిల్స్ రావడం ఎక్కువైంది. దేశరాజధానిలో ఇటీవల ఇజ్రాయెల్ దౌత్య కార్యాలయం వద్ద బాంబు బెదిరింపుల ఘటన జరిగింది. అటు.. ముంబయిలోనూ ఆర్బీఐ, ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇటీవలే అయోధ్య రామాలయం, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు కూడా ఇలాంటి బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: ఢిల్లీ సర్కార్‌కు షాక్.. మొహల్లా క్లినిక్‌లపై సీబీఐ దర్యాప్తు -
పేలుడు పదార్థాల సరఫరా కేసులో.. 8 మందిపై ఎన్ఐఏ చార్జిషీట్
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భద్రతాదళాలపై పేలుళ్లు జరిపేందుకు కుట్ర పన్నిన ఎనిమిది మంది మావోయిస్టులపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) శుక్రవారం చార్జిషిట్ దాఖలు చేసింది. మావోయిస్టులకు పేలుడు పదార్థాలు సరఫరా చేస్తున్న వ్యక్తులపై 2023 జూన్ 5న చెర్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో కేసు నమోదైంది. ఈ కేసుతో సంబంధం ఉన్న ఎనిమిది మంది నిందితులపై ఐపీసీ సెక్షన్ 120(బీ), 143, 147, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం సెక్షన్ 10,13,18,20ల కింద కేసులు నమోదు చేసినట్లు పేర్కొంది. పట్టుబడిన నిందితులు మావోయిస్టులకు కొరియర్లుగా పనిచేస్తున్నట్లు చార్జిషీట్లో తెలిపింది. మావోయిస్టులకు పేలుడు పదార్థాలు, డ్రోన్లు, లేథ్ మెషీన్లు సరఫరా చేస్తుండగా పునెం నాగేశ్వరరావు, దేవనూరి మల్లికార్జున రావు, వొల్లిపోగుల ఉమాశంకర్‌ను అరెస్టు చేశారు. ఆ తర్వాత వారి నుంచి సేకరించిన సమాచారం మేరకు జన్ను కోటి, ఆరేపల్లి శ్రీకాంత్, తాళ్లపల్లి ఆరోగ్యం, బొంత మహేందర్, సోనబోయిన కుమారస్వామిని అరెస్టు చేసినట్లు ఎన్ఐఏ తెలిపింది. పునెం నాగేశ్వరావు, దేవనూరి మల్లికార్జునరావు, వొల్లిపోగుల ఉమాశంకర్‌లు 2023 మార్చిలో డ్రిల్ మిషన్, మే 2023లో ఒక లేథ్ మిషన్ కొనుగోలు చేసినట్లు తమ దర్యాప్తులో వెల్లడైనట్లు ఎన్ఐఏ పేర్కొంది. ఈ ముగ్గురు నిందితులు మే లో డ్రోన్లు, పేలుడు పదార్థాలు గుర్తించినట్లు తెలిపింది. -
కేరళ బాంబు పేలుళ్ల ఘటనలో విస్తుపోయే నిజాలు..!
తిరువనంతపురం: కేరళ పేలుళ్ల ఘటనలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రార్థన సెంటర్లో టిఫిన్ బాక్స్‌లో పేలుడు సంభవించినట్లుగా విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రార్థనలు జరుగుతున్న కన్వెన్షన్ సెంటర్లోకి దుండగులు పేలుడు పదార్ధాలను తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. పేలుడు సంభవించిన అనంతరం సెంటర్లో దట్టమైన పొగ కమ్ముకుందని స్థానికులు తెలిపారు. భయాందోళనకు లోనైన ప్రజలు పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగిందని వెల్లడించారు. బాధితుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా అల్లకల్లోలంగా మారిందని తెలిపారు. కేరళలో ఒకేరోజు మూడు సార్లు పేలుళ్ల ఘటన చోటుచేసుకుంది. ఈ పేలుళ్లల్లో ఒకరు మృతిచెందగా.. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. కలమస్సేరి సమీపంలోని ఓ కన్వెన్షన్ సెంటర్లో ప్రేయర్ మీట్ జరుగుతుండగా ఈ ఘటన జరిగింది. ప్రార్థన సమయంలో అందరూ కళ్లు మూసుకొని ప్రార్థనలు చేస్తుండగా ఉదయం 9:47 సమయంలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. అనంతరం మరో రెండు మూడు చిన్న పేలుళ్లు జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దాదాపు 2,000 మందితో ప్రార్థనలు జరుగినట్లు స్థానికులు తెలిపారు. ఎన్ఐఏ యాంటీ టెర్రర్ ఏజెన్సీ కేసును విచారిస్తోంది. జాతీయ భద్రతా దళం బృందం కూడా కేరళకు రానుంది. ఈ పేలుళ్లకు కారణం ఏంటనేది తెలియాల్సి ఉంది. ఇది ఉగ్రదాడి అని ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. కేరళలో జరిగిన ఓ కార్యక్రమంలో హమాస్ నాయకుడు పాల్గొనడంపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ పేలుడు సంభవించింది. It's a very unfortunate incident. We are collecting details regarding the incident. All top officials are there in Ernakulam. DGP is moving to the spot. We are taking it very seriously. I have spoken to DGP. We need to get more details after the investigation: Kerala CM Pinarayi… https://t.co/4utwtmR9Sl pic.twitter.com/GHwfwieRLB — ANI (@ANI) October 29, 2023 పేలుడు ఘటనపై కేరళ సీఎం పినరయి విజయన్ స్పందించారు. 'ఇది చాలా దురదృష్టకరమైన ఘటన. దీనికి సంబంధించి వివరాలు సేకరిస్తున్నాం. ఉన్నతాధికారులందరూ ఎర్నాకులంలో ఉన్నారు. ఘటనా స్థలానికి డీజీపీ వెళ్లారు. పేలుడు ఘటనను చాలా సీరియస్‌గా తీసుకుంటున్నాం. డీజీపీతో మాట్లాడాను. దర్యాప్తు తర్వాత మరిన్ని వివరాలు తెలుస్తాయి. దీనికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం' అని అన్నారు. అటు.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా కేరళ సీఎం విజయన్‌తో ఫొన్లో మాట్లాడారు. ఇదీ చదవండి: కేరళలో భారీ పేలుడు.. ఉగ్రదాడి కలకలం! -
రాష్ట్రంలో ఎన్ఐఏ సోదాలు
సాక్షి, హైదరాబాద్/సాక్షి ప్రతినిధి, వరంగల్/చర్ల: రాష్ట్రంలో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) శనివారం వరుస దాడులు నిర్వహించింది. తెలంగాణలోని వరంగల్, కొత్తగూడెం జిల్లాలతోపాటు ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లోనూ ఎన్ఐఏ అధికారుల సోదాలు కొనసాగాయి. ఈ దాడులు రెండు రోజులుగా జరుగుతున్నప్పటికీ శనివారం వెలుగులోకి వచ్చాయి. ఈ ఏడాది జూన్‌లో కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో ముగ్గురి నుంచి పేలుడు పదార్థాలు, డ్రోన్లు, లాత్ మిషన్‌ను స్థానిక పోలీసులు స్వాధీనం చేసుకుని ఆ ముగ్గురినీ అరెస్టు చేశారు. భద్రతా బలగాలకు వ్యతిరేకంగా పేలుడు పదార్థాలు, డ్రోన్లు ఉపయోగించేందుకు చేసిన కుట్రలో నిషేధిత మావోయిస్ట్ పార్టీ ప్రమేయం ఉండటంతో కేసు దర్యాప్తు చేపట్టిన ఎన్ఐఏ అధికారులు స్థానిక పోలీసుల ఎఫ్ఐఆర్ ఆధారంగా మరో 12 మంది నిందితులపై కేసు నమోదు చేశారు. ఆ విచారణ కొనసాగింపులో భాగంగానే శనివారం వరంగల్‌లో ఐదు చోట్ల, భద్రాద్రి కొత్తగూడెంలో రెండు చోట్ల, అదేవిధంగా ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా పామేడులోని నిందితుల ఇళ్లలో సోదాలు చేపట్టారు. ఈ సోదాల్లో పలు డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్టు ఎన్ఐఏ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. సోదాల్లో స్వాధీనం చేసుకున్న డిజిటల్ డివైజ్‌లను, డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నట్టు వెల్లడించారు. నిందితులు యాంటీ భారత్ ఎజెండాలో భాగంగా పలు ముడిపదార్థాలను మావోయిస్టులకు చేర్చేందుకు ప్రయత్నించినట్టు ప్రాథమిక ఆధారాలు లభించాయని తెలిపారు. ఏజెన్సీలో ఇద్దరు అదుపులోకి? ములుగు జిల్లాలోని ఏటూరునాగారం, వెంకటాపురం ఏజెన్సీలో మావోయిస్టుల గురించి ఎన్ఐఏ అధికారులు ఆరా తీసినట్లు తెలిసింది. ఎదిరె, సూరవేడు కాలనీ, విజయపురితో పాటు పలుచోట్ల మావోయిస్టు దళానికి డ్రోన్, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఇతర సామగ్రి సరఫరా చేశారనే సమాచారంతో సోదాలు నిర్వహించిన ఎన్ఐఏ.. ఏజెన్సీలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. రెండు రాష్ట్రాల సరిహద్దులోని ఏజేన్సీ ప్రాంతాల్లో దేశవాళీ తుపాకులను తయారు చేసి వాటిని మావోలకు పంపుతున్నారన్న సమాచారం మేరకు సోదాలు జరిపినట్లు తెలిసింది. -
ఢిల్లీలో బాంబు కలకలం: ఓ ఇంట్లో అనుమానాస్పద బ్యాగ్..!!
-
వైఎస్ ప్రతాప్‌రెడ్డి కార్యాలయంలో పోలీసుల తనిఖీ
పులివెందుల: వైఎస్సార్ జిల్లా భాకరాపురంలోని పేలుడు పదార్థాల లైసెన్సు హోల్డర్ వైఎస్ ప్రతాప్‌రెడ్డి కార్యాలయంలో శనివారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. పోరుమామిళ్ల సీఐ మోహన్‌రెడ్డి తమ సిబ్బందితో కలిసి శనివారం మధ్యాహ్నం వైఎస్ ప్రతాప్‌రెడ్డి కార్యాలయానికి చేరుకున్నారు. పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని విచారించారు. పేలుడు పదార్థాలు, వాటి నిల్వలతో పాటు ఎవరెవరికి సరఫరా చేస్తారు? తదితర విషయాలపై వారిని ప్రశ్నించినట్లు సమాచారం. మామిళ్లపల్లె వద్దనున్న ముగ్గురాళ్ల క్వారీలో ఈనెల 8న పేలుళ్లు సంభవించి 10 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి క్వారీ లీజుదారుడు నాగేశ్వరరెడ్డి, జిలెటిన్ స్టిక్స్ సరఫరా చేసిన రఘునాథరెడ్డితో పాటు పులివెందులకు చెందిన వైఎస్ ప్రతాప్‌రెడ్డిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. -
సచిన్‌వాజే హైఎండ్ బైక్ స్వాధీనం, కీలక సీసీటీవీ ఫుటేజీ
సాక్షి, ముంబై: ముంబై మాజీపోలీసు అధికారిక సచిన్‌వాజేకు సంబంధించి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) సోమవారం హై ఎండ్ బైక్‌ను స్వాధీనం చేసుకుంది. ఫిబ్రవరి 25 న పారిశ్రామికవేత్త ముఖ్‌శ్ అంబానీ నివాసం ఆంటిలియా సమీపంలో పేలుడు పదార్థాలతో నిండిన ఎస్యూవీ, వాహన యజమాని మన్సుఖ్ హిరేన్ అనుమానాస్పద మరణంలో సచిన్ వాజ్ పాత్రపై దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏ స్వాధీనం చేసుకున్న వాహనాల సుదీర్ఘ జాబితాలో తాజాగా బైక్ చేరింది. అలాగే సచిన్ వాజేతో సంబంధంముందని భావిస్తున్న మహిళను కూడా ఎన్ఐఏ ప్రశ్నించింది. మహిళ ఆధీనంలో ఉన్న మీరా రోడ్ ఏరియాలోని ఒక ఫ్లాట్‌ను కూడా శోధించినట్లు ఎన్ఐఏ అధికారులు తెలిపారు. అలాగే కీలకమైన సిసిటివి ఫుటేజ్‌ను కూడా సాధించింది. సచిన్ వాజే మార్చి 4 న రాత్రి 7 గంటలకు ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్‌కు వెళుతున్నట్లు వీడియోను గుర్తించారు. అదే రోజు సీన్ రీక్రియేషన్ కోసం థానే వెళ్లారు. అయితే మార్చి 5 న థానేలోని కల్వా లేక్ వద్ద మన్సుఖ్ హిరెన్ మృతదేహం పలు అనుమానాల్ని రేకెత్తించింది. ఈ కేసును కూడా మన్సుఖ్ భార్య ఫిర్యాదు మేరకు ఎన్ఐఏ దర్యాప్తు జరుపుతోంది. అంబానీ ఇంటి ఎస్‌యూవీని పార్కింగ్ చేయడంలో వాజే పాత్రపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న దర్యాప్తు సంస్థ తన కదలికలను దాచడానికి నకిలీ వాహన రిజిస్ట్రేషన్ ప్లేట్లను ఉపయోగించాడని ఆరోపించిన సంగతి తెలిసిందే. In CCTV footage (in pic), Sachin Waze was seen going to Chhatrapati Shivaji Maharaj Terminus at 7 pm on 4th March. He had taken a local train to Thane that day. He was brought to CSMT y'day for scene recreation Body of Mansukh Hiren was found at Kalwa creek in Thane on 5th March pic.twitter.com/gnMfdaMLLQ — ANI (@ANI) April 6, 2021 -
అంబానీ ఇంటి వద్ద కలకలం : మరో కీలక పరిణామం
సాక్షి, ముంబై: రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ ఇంటింముందు పేలుడు పదార్థాలతో దర్శనమిచ్చిన వాహనం వివాదం చినికి చినికి గాలివానలా మారుతోంది. ఈ కేసులో రోజుకో పరిణామంతో, బీజేపీ, శివసేనల మాటల యుద్ధం వాహన యజమాని మన్సుఖ్ హిరేన్ అనుమానాస్పద మరణం తరువాత మరింత ముదురుతోంది. తాజాగా తన బదిలీని వ్యతిరేకిస్తూ ముంబై మాజీ పోలీసు కమిషనర్ పరమబీర్ సింగ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనను హోం గార్డ్ విభాగానికి బదిలీ చేయడాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లో దాఖలు చేశారు. మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై సీబీఐ విచారణ జరపాలని ఈ సందర్భంగా ఆయనడిమాండ్ చేశారు. ఈ కేసులో సాక్ష్యాలను మాయం చేసేందుకు తనపై బదిలీ వేటు వేశారని ఆరోపించారు. ఈ కేసులో కీలకమైన సాక్ష్యాలు నాశనం చేయకముందే. తన ఆరోపణలపై హోంమంత్రిపై న్యాయమైన దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తూ తనకు రక్షణకు కల్పించాల్సిందిగా కోరారు. (వాజే టార్గెట్ వంద కోట్లు) మహారాష్ట్ర ప్రభుత్వం మార్చి 17 న సింగ్‌ను బదిలీ చేసి, మహారాష్ట్ర డీజీపీగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న సీనియర్ ఐపిఎస్ అధికారి హేమంత్ నాగ్రేల్ను కొత్తగా నియమించింది. దీంతో హోమ్ గార్డ్ డైరెక్టర్ జనరల్ (డీజీ)గా పరమ్‌బీర్ సింగ్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. పోలీసు కమిషనర్ బాధ్యతలనుంచి తొలగించిన అనంతరం సింగ్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేకు ఒక లేఖ రాశారు. హిరేన్ మృతి కేసులో ఎన్ఐఏ అదుపులో ఉన్న సచిన్ వాజే, ఇతర పోలీసు అధికారులను రూ .100 కోట్లు వసూలు చేయాలని రాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ కోరినట్లు ఈ లేఖలో ఆరోపించారు. ముంబైలోని బార్స్ , రెస్టారెంట్ల నుండి నెలవారీ రూ .50 కోట్ల నుండి 60 కోట్ల వరకు వసూలు చేయాలని కోరారంటూ సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఈ ఆరోపణలను దేశ్‌ముఖ్ ఖండించారు. హోంమంత్రి రాజీనామా చేసే ప్రసక్తేలేదు : శరద్ పవార్ అటు పరంబీర్ సింగ్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్ తీవ్రంగా ఖండించారు. దేశ్‌ముఖ్ రాజీనామా చేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. అనిల్ దేశ్‌ముఖ్ ఫిబ్రవరి 5నుండి 15 వరకు ఆసుపత్రిలో ఉన్నారు, ఫిబ్రవరి 15 నుండి 27 వరకు అతను నాగ్‌పూర్‌లో హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. దీనికి సంబంధించిన వివరాలను, రికార్డులన్నింటినీ మహారాష్ట్ర ముఖ్యమంత్రితో అందించనున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో దేశ్‌ముఖ్ రాజీనామాకు సంబంధించి సేన నుండి ఎలాంటి ఒత్తిడి లేదని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు అనిల్ దేశ్‌ముఖ్‌పై వచ్చిన ఆరోపణలపై బీజేపీ సభ్యులు చర్చకు పట్టుబట్టడంతో పార్లమెంటు ఉభయసభలు దద్దరిల్లిపోయాయి. రాజ్యసభలో బీజేపీ ఎంపీలు ఇదే అంశంపై చర్చ చేయాలని డిమాండ్ చేయగా, లోక్‌సభలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ మహారాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేయడం సంచలనం సృష్టించింది. కాగా ఫిబ్రవరి 25 న అంబానీ నివాసం వెలుపల పేలుడు పదార్థాలతో నిండిన ఎస్‌యూవీని ఉంచడంలో వాజే ఆరోపించిన పాత్రను ఎన్ఐఏ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. -
అంబానీ ఇంటి వద్ద కలకలం: మళ్లీ అక్కడే మరో మృతదేహం
ముంబై: ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ నివాసం 'యాంటిలియా' వద్ద అనుమానాస్పద వాహనం కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో అనుమానాస్పద స్థితిలో వాహన యజమాని మన్సుఖ్ హిరేన్ శవమై తేలిన విషయం తెలిసిందే. తాజాగా మరొక మృతదేహం లభించింది. అంబానీ ఇంటి వద్ద కలకలానికి ఈ మృతదేహానికి సంబంధం ఉందని పోలీసులు భావిస్తున్నారు. అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలు లభించిన కేసును నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ), మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) దర్యాప్తు చేస్తున్నాయి. ముంబైకి సమీపంలోని చిన్న కాలువ దగ్గర స్కార్పియో యజమాని మృతదేహం లభించిన చోటే తాజాగా శనివారం ఓ మృతదేహం లభ్యమైంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడు 48 ఏళ్ల షేక్ సలీమ్ అబ్దుల్ అని గుర్తించారు. రేతి బందర్ ప్రాంతంలో నివసించే సలీమ్ కూలీ పని చేసేవాడని తెలుసుకున్నారు. సముద్రపు ఒడ్డున నిద్రించి ఉన్నప్పుడు నీటిలో పడిపోయి ఉంటాడని భావిస్తున్నారు. అయితే అతడు ప్రమాదవశాత్తు చనిపోయి ఉంటాడని ముంబ్రా పోలీసులు గుర్తించారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 25న అంబానీ ఇంటిముందు పేలుడు పదార్థాలతో నిండిన వాహనాలు కలకలం రేపాయి. అందులోని ఒక వాహనం స్కార్పియో యజమాని హిరేన్ మార్చి 5వ తేదీన ముంబై సమీపంలోని ఒక కొలనులో శవమై తేలాడు. దీనికి సంబంధించి మూడు కేసులను ఎన్ఐఏ, ఏటీఎస్ విచారిస్తున్నాయి. ఈ కేసులో రోజుకో పరిణామం వెలుగులోకి వస్తున్నాయి. -
అంబానీ ఇంటి వద్ద కలకలం : సచిన్‌పై బదిలీ వేటు
సాక్షి,ముంబై: బిలియనీర్, పారిశ్రామికవేత్త ముఖేశ్ అంబానీ ఇంటివద్ద పేలుడు పదార్థాల వాహనం రేపిన వివాదంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఉదంతంలో అనేక ట్విస్ట్ అండ్ టర్న్స్ మధ్య తాజాగా ముంబై క్రైమ్ ఇంటెలిజెన్స్ యూనిట్(సీఐయు) హెడ్, అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్ సచిన్ వాజేపై వేటు పడింది. ఆయనను క్రైమ్ బ్రాంచ్ నుండి తొలగించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ బుధవారం ఒక ప్రకటన చేశారు. ఈ కేసులో స్కార్పియో యజమాని మన్సుఖ్ హిరేన్ మరణం కేసులో వాజేను రక్షించేందుకు శివసేన ప్రభుత్వం ప్రయత్నిస్తోందంటూ రాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ విమర్శించారు. అలాగే ఫిబ్రవరి 22 న హోటల్లో శవమై కనిపించిన దాద్రా, నాగర్ హవేలీ ఎంపీ మోహన్ డెల్కర్ రాసిన సూసైడ్ లేఖ తన దగ్గర ఉందంటూ రాష్ట్ర అసెంబ్లీలో దేవేంద్ర ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలు సభలో కలకలం రేపాయి. ఈ నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యతను సంతరించుకుంది. (ఈ ఘటనపై అసెంబ్లీలో రచ్చ చేసిన ప్రతిపక్షాలు) గతనెల 25న అంబానీ ఇంటి ముందుపేలుడు పదార్థాలతో కనిపించిన స్కార్పియో యజమాని, ఆటో విడిభాగాల వ్యాపారి మన్సుఖ్ హిరేన్ అనుమానాస్పద మరణంపై ఫడ్నవిస్, పోలీసు అధికారి సచిన్ వాజేపాత్రపై పలు అనుమానాలను వ్యక్తం చేశారు. సచిన్ తన భర్తను హత్య చేసి ఉండవచ్చని హిరేన్ భార్య ప్రకటన మేరకు ఆయనను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. (అంబానీ ఇంటివద్ద కలకలం : ఫడ్నవీస్ సంచలన వ్యాఖ్యలు) మరోవైపు తాజా వ్యవహారంతో శివసేన, బీజేపీ మధ్య రగులుతున్న వివాదం మరింత రాజుకుంది. అన్వే నాయక్ ఆత్మహత్య కేసుకు సంబంధించి వచ్చిన ఆరోపణల నేపథ్యంలో హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్‌పై ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్ అసెంబ్లీలో ప్రివిలేజ్ మోషన్ ఇచ్చారు. (అంబానీ ఇంటి దగ్గర కలకలం : అనుమానాస్పద లేఖ) -
అంబానీ ఇంటి వద్ద కలకలం రేపిన స్కార్పియో ఓనర్ మృతి
ముంబై: ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ నివాసం 'యాంటిలియా' దగ్గర పేలుడు పదార్థాలతో కూడిన ఓ వాహనాన్ని నిలిపి ఉంచడం తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం తాజాగా మరో షాకింగ్ వార్త వెలుగు చూసింది. అంబానీ ఇంటి ముందు నిలిపిన పేలుడు పదార్థాలున్న స్కార్పియో ఓనర్ మరణించాడు. ముంబైకి సమీపంలోని చిన్న కాలువ దగ్గర అతడి మృత దేహం లభ్యమయ్యింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదవశాత్తు మరణించినట్లు కేసు నమోదు చేశారు. గత నెల 26న ముకేశ్ అంబానీ నివాసం వద్ద పేలుడు పదార్థాలతో కూడిన ఓ స్కార్పియోని నిలిపి ఉంచిన సంగతి తెలిసిందే. వాహనం లోపల ఒక బ్యాగును, లేఖను కనుగొన్నారు పోలీసులు. ‘ముఖేశ్ భయ్యా, నీతా బాబీ ఇదొక ట్రైలర్ మాత్రమే’’ అని లేఖలో రాసినట్టు సమాచారం. అయితే సీసీటీవీ ఫుటేజ్ పరిశీలన తరువాత యాంటిలియా సమీపంలో అనుమానాస్పదంగా రెండు వాహనాలను ఆపి ఉంచినట్లు పోలీసులు గుర్తించారు. ఇక దుండగులు వాడిన స్కార్పియోను విఖ్రోలి ప్రాంతం నుంచి దొంగిలించినట్లు దర్యాప్తులో. తాజాగా దాని ఓనర్ మరణించడం సంచలనం సృష్టిస్తోంది. చదవండి: అంబానీ ఇంటి దగ్గర కలకలం.. ఇది ట్రైలర్ మాత్రమే అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలు : మరో ట్విస్టు -
ఇది ట్రైలర్ మాత్రమే
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ ఇల్లు యాంటీలియా సమీపంలో నిలిపి ఉంచిన వాహనంలో పేలుడు పదార్థాలు లభించడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఇదే వాహనంలో బెదిరింపు లేఖ బయటపడింది. ‘ఇది కేవలం ట్రెయిలర్ మాత్రమే’ అని ఇందులో రాసి ఉంది. డ్రైవర్ సీటు పక్కనే ముంబై ఇండియన్స్ క్రికెట్ జట్టు బ్యాగులో ఈ లేఖను పోలీసులు గుర్తించారు. ఆగంతకులు ముకేష్ అంబానీ కుటుంబాన్ని ఉద్దేశిస్తూ ఈ లేఖ రాశారు. నీతా అంబానీ, ముకేష్ భయ్యాకు ఇదొక ఝలక్ అని, ఏర్పాట్లు జరుగుతున్నాయని, నెక్ట్స్ టైమ్ ఇవి(పేలుడు పదార్థాలు) మిమ్మల్ని చేరుకుంటాయని అందులో ఉంది. పేలుడు పదార్థాలతో కూడిన కారును యాంటీలియా పక్కనే పార్కు చేయాలని దుండుగులు భావించినట్లు, అక్కడ పటిష్టమైన భద్రత ఉండడంతో కొంత దూరంలో నిలిపి ఉంచినట్లు పోలీసులు భావిస్తున్నారు. ముకేష్ అంబానీ సెక్యూరిటీ వాహనం నంబర్ ప్లేట్‌పై ఉన్న రిజిస్ట్రేషన్ నెంబరే ఈ స్కార్పియో నంబర్ ప్లేట్‌పై ఉండడం గమనార్హం. స్కార్పియోను దుండుగులు చోరీ చేసి, తీసుకొచ్చారని పోలీసులు చెప్పారు. -
అంబానీ ఇంటి దగ్గర కలకలం.. ఇది ట్రైలర్ మాత్రమే
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ ఇల్లు యాంటీలియా సమీపంలో నిలిపి ఉంచిన వాహనంలో పేలుడు పదార్థాలు లభించడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఇదే వాహనంలో బెదిరింపు లేఖ బయటపడింది. ‘ఇది కేవలం ట్రెయిలర్ మాత్రమే’ అని ఇందులో రాసి ఉంది. డ్రైవర్ సీటు పక్కనే ముంబై ఇండియన్స్ క్రికెట్ జట్టు బ్యాగులో ఈ లేఖను పోలీసులు గుర్తించారు. ఆగంతకులు ముకేష్ అంబానీ కుటుంబాన్ని ఉద్దేశిస్తూ ఈ లేఖ రాశారు. నీతా అంబానీ, ముకేష్ భయ్యాకు ఇదొక ఝలక్ అని, ఏర్పాట్లు జరుగుతున్నాయని, నెక్ట్స్ టైమ్ ఇవి(పేలుడు పదార్థాలు) మిమ్మల్ని చేరుకుంటాయని అందులో ఉంది. పేలుడు పదార్థాలతో కూడిన కారును యాంటీలియా పక్కనే పార్కు చేయాలని దుండుగులు భావించినట్లు, అక్కడ పటిష్టమైన భద్రత ఉండడంతో కొంత దూరంలో నిలిపి ఉంచినట్లు పోలీసులు భావిస్తున్నారు. ముకేష్ అంబానీ సెక్యూరిటీ వాహనం నంబర్ ప్లేట్‌పై ఉన్న రిజిస్ట్రేషన్ నెంబరే ఈ స్కార్పియో నంబర్ ప్లేట్‌పై ఉండడం గమనార్హం. స్కార్పియోను దుండుగులు చోరీ చేసి, తీసుకొచ్చారని పోలీసులు చెప్పారు. చదవండి: (అంబానీ ఇంటి దగ్గర కలకలం : అనుమానాస్పద లేఖ) -
అంబానీ ఇంటి దగ్గర కలకలం : అనుమానాస్పద లేఖ
సాక్షి, ముంబై: ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ నివాసం 'ఆంటిలియా'దగ్గర పేలుడు పదార్థాలతో కూడిన ఓ వాహనాన్ని నిలిపి ఉంచడం తీవ్ర సంచలనం సృష్టించింది. దక్షిణ ముంబైలోని ముఖేష్ నివాసం యాంటీలియా సమీపంలోనే గురువారం సాయంత్రం స్కార్పియో వాహనం అనుమానాస్పదంగా కనిపించింది. యాంటీలియా సెక్యూరిటీ సిబ్బంది నుంచి సమాచారం అందుకున్న బాంబు డిటెక్షన్, డిస్పోజల్ స్క్వాడ్, యాంటీ టెర్రరిజం స్క్వాడ్(ఏటీఎస్) సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, వాహనం లోపల ఒక బ్యాగును, ఒక లేఖను కనుగొన్నారు. కానీ దానిలోని విషయాలను ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ‘ముఖేశ్ భయ్యా, నీతా భాబీ ఇదొక ట్రైలర్ మాత్రమే’’ అని లేఖలో రాసినట్టు సమాచారం. అయితే సీసీటీవీ ఫుటేజ్ పరిశీలన తరువాత గురువారం రాత్రి 1 గంటకు ఆంటిలియా సమీపంలో అనుమానాస్పదంగా రెండు వాహనాలను ఆపి ఉంచినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ఆగంతకులు స్కార్పియో, ఇన్నోవా రెండు వాహనాల్లో వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. స్కార్పియో డ్రైవర్ అంబానీ ఇంటి సమీపంలో వాహనాన్ని ఆపి, మరో కారులో అక్కడినుంచి ఉడాయించాడు. ఇంటి దగ్గర అనుమానాస్పదంగా కనిపించిన ఈ వాహనంలో జిలెటిన్ స్టిక్స్, ఇతర పేలుడు పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు. ఇందులో 20 జిలెటిన్ స్టిక్స్ ఉన్నట్లు తేలిందని మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. పేలుడు పదార్థాలు ఉన్న స్కార్పియోను పోలీసులు సురక్షిత ప్రాంతానికి తరలించారు. దాని యజమాని ఎవరు? అందులో పేలుడు పదార్థాలు పెట్టిందెవరు? ఎందుకోసం పెట్టారు? అనేది తేల్చేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అంబానీ ఇంటి వెలుపల భద్రత కట్టుదిట్టం చేశారు. సీసీటీవీఫుటేజీని పరిశీలిస్తున్నారు. -
ముఖేశ్ అంబానీ ఇంటి దగ్గర పేలుడు పదార్థాలు
ముంబై: ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ఇంటి దగ్గర పేలుడు పదార్థాలతో కూడిన ఓ వాహనాన్ని నిలిపి ఉంచడం తీవ్ర సంచలనం సృష్టించింది. దక్షిణ ముంబైలోని ముఖేష్ నివాసం యాంటీలియా సమీపంలోనే గురువారం సాయంత్రం స్కార్పియో వాహనం అనుమానాస్పదంగా కనిపించింది. యాంటీలియా సెక్యూరిటీ సిబ్బంది నుంచి సమాచారం అందుకున్న బాంబు డిటెక్షన్, డిస్పోజల్ స్క్వాడ్, యాంటీ టెర్రరిజం స్క్వాడ్(ఏటీఎస్) సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. ఈ వాహనంలో జిలెటిన్ స్టిక్స్, ఇతర పేలుడు పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు. ఇందులో 20 జిలెటిన్ స్టిక్స్ ఉన్నట్లు తేలిందని మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ప్రకటించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. పేలుడు పదార్థాలు ఉన్న స్కార్పియోను పోలీసులు సురక్షిత ప్రాంతానికి తరలించారు. దాని యజమాని ఎవరు? అందులో పేలుడు పదార్థాలు పెట్టిందెవరు? ఎందుకోసం పెట్టారు? అనేది తేల్చేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
బ్లాస్టింగ్‌తో.. కంపిస్తున్న భూమి
సాక్షి, వనపర్తి/కొత్తకోట: గత కొన్నేళ్ల క్రితం మైనింగ్ అనుమతి పొందిన ఓ కంపెనీ.. జనావాసాలకు అతి సమీపంలో బ్లాస్టింగ్ చేస్తుండటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. కొత్తకోట మండలం సంకిరెడ్డిపల్లి సమీపంలో డ్రిల్లింగ్ మిషన్‌కు బదులుగా బోరు డ్రిల్లింగ్ చేస్తుండటంతో భూమి దద్దరిల్లడంతో పాటు గ్రా మంలోని పదుల సంఖ్యలో ఇళ్లు నెర్రెలు బారాయి. ఏడాది క్రితం ఈ సమస్యపై గ్రామస్తులు ఏకతాటిపైకి వచ్చి బ్లాస్టింగ్‌ను బంద్ చేయించారు. ఇటీవల బ్లాస్టింగ్ తిరిగి ప్రారంభమవడంతో గ్రామస్తులు ఖంగుతిన్నారు. ఇదేమని ప్రశ్నిస్తే.. మాకు అధికారుల నుంచి అనుమతి లభించిందని చెప్పుకొస్తున్నారు. ఎండుతున్న బోర్లు కంకర కొరకు రోజు బ్లాస్టింగ్ చేస్తుండటంతో సమీపంలో గల వ్యవసాయ బోర్లు పూడిపోయి నీళ్లు రాకపోవడంతో పంటలు పండించుకునే పరిస్థితి లేకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్లాస్టింగ్ పనులు నిలిపేయాలని కోరితే.. క్వారీ యజమాని బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. కలెక్టరేట్లో ఫిర్యాదు గుట్టలో అనుమతులకు మించి బ్లాస్టింగ్ చేస్తున్న తీరుపై, ఇళ్లు నెర్రెలు బారుతున్నాయని, భారీ శబ్దాలతో ఇళ్లు నెర్రెలు బారుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తూ రెవెన్యూ, మైనింగ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. గతంలో ఫొటోలతో సహా మండల, జిల్లా స్థాయి అ«ధికారులకు ఫిర్యాదు చేశారు. తాజాగా సోమవారం కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చేందుకు కలెక్టరేట్‌కు చేరుకున్నారు. కలెక్టర్‌ను కలిసే అవకాశం లేకపోవడంతో కలెక్టరేట్లో బ్లాస్టింగ్ బంద్ చేయించాలని ఫిర్యాదు చేసి వెళ్లారు. అయినా అ«ధికారుల నుంచి స్పందన లేకపోవటం గమనార్హం. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు, ఎమ్మెల్యే, ఎంపీ తమ గ్రామాన్ని సందర్శించి బ్లాస్టింగ్‌ను పూర్తిగా నిషేధించాలని గ్రామస్తులు కోరారు. కంపిస్తున్న భూమి సంకిరెడ్డిపల్లి సమీపంలో ‘గొట్టెతేనా’ అనే గుట్ట ఉంది. దీని నుంచి కంకర మిషన్‌కు రాయి సరఫరా కోసం అధికారులు అనుమతులిచ్చారు. ఈమేరకు బ్లాస్టింగ్‌తో చుట్టూ కిలోమీటర్ దూరం వరకు భూమి కంపించడంతో పాటు సమీపంలో గల పంట పొలాల రైతులు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని జీవిస్తున్నారు. ప్రతి రోజు బ్లాస్టింగ్ చేస్తుండటంతో గ్రామంలో దాదాపు 30ఇళ్లకు పైగా పాక్షికంగా దెబ్బతిన్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. బ్లాస్టింగ్ తిరిగి ప్రారంభమవడంతో నూతనంగా ఇళ్లు నిర్మించుకునేందుకు సైతం వెనకాడే పరిస్థితి నెలకొంది. పరిశీలిస్తాం సంకిరెడ్డిపల్లి సమీపంలోని క్రషర్లో బ్లాస్టింగ్ చేసేందుకు అనుమతుల విషయం మాకు తెలియదు. పాత అనుమతులు ఉన్నట్లుగా తెలుసు. మరొకసారి ఈ విషయంపై దృష్టి సారించి అనుమతుల వివరాలను తెలుసుకుంటాం. – మల్లిఖార్జున్‌రెడ్డి, సీఐ, కొత్తకోట క్వారీ అనుమతి రద్దు చేయాలి కాసులకు కక్కుర్తి పడి గ్రామ శివారులోని గుట్టపై రాళ్లు తీయడానికి అనుమతులిచ్చారు. బ్లాస్టింగ్‌తో ఇళ్ల గోడలు పగుళ్లు వస్తున్నాయి. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయం భయంగా జీవిస్తున్నాం. అధికారులు, ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకొని క్వారీ అనుమతి రద్దు చేసి తమకు న్యాయం చేయాలి. – గీత, సంకిరెడ్డిపల్లి ఇంట్లో ఉండలేకపోతున్నాం ప్రతి రోజు బ్లాస్టింగ్ చేయడంతో పెద్దగా శబ్దాలు వస్తున్నాయి. ఇళ్లు పగుళ్లు ఇచ్చాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయపడుతున్నాం. ఇంట్లో ఉండాలంటేనే భయమేస్తుంది. ఇలాగే ఉంటే పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంటాం. ఇప్పటికైనా అధికారులు చొరవ చూపాలి. – భారతమ్మ, సంకిరెడ్డిపల్లి -
తృటిలో తప్పిన పుల్వామా తరహా ఘటన!
శ్రీనగర్: పుల్వామా దాడితో భారత సైన్యంపై విరుచుకుపడిన ఉగ్రవాదులు మరోసారి అలాంటి పథకాన్నే రచించారు. అయితే, భద్రతా బలగాల ఉమ్మడి సెర్చ్ ఆపరేష్‌తో వారి కుట్రలు భగ్నమయ్యాయి. గురువారం ఉదయం 8 గంటల సమయంలో గడీకల్ ప్రాంతంలోని కెవారాలో హైవే పక్కన 52 కిలోల పేలుడు పదార్థాలను గుర్తించామని ఆర్మీ ఒక ప్రకటనలో పేర్కొంది. హైవే పక్కన ఉన్న పండ్లతోటలో భూమిలో పాతిపెట్టిన ప్లాస్టిక్ ట్యాంక్‌లో ఈ మొత్తం బయటపడిందని తెలిపింది. పుల్వామా ఘటన జరిగిన ప్రాంతానికి 9 కిలో మీటర్ల దూరంలోనే ఈ ప్రాంతం ఉందని వెల్లడించింది. 125 గ్రాముల చొప్పున మొత్తం 416 ప్యాకెట్లలో పేలుడు పదార్థాలు లభించాయని ఆర్మీ వెల్లడించింది. ఆ ప్రాంతంలోనే మరిన్ని సోదాలు నిర్వహించగా మరో ట్యాంక్‌లో 50 డిటోనేటర్లు కనుగొన్నామని పేర్కొంది. కాగా, 2019 ఫిబ్రవరి పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది భారత జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. ఆ దాడిలో ఉగ్రవాదులు 35 కిలోల ఆర్డీఎక్స్ను మరికొన్ని జలెటిన్ పేలుడు పదార్థాలను ఉపయోగించినట్టు వెల్లడైంది. పుల్వామా దాడి వెను జైషే చీష్ మసూద్ అజార్ ఉన్నట్టు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) తేల్చింది. ఇక పుల్వామా దాడికి ప్రతిగా భారత్ పాకిస్తాన్‌లోని బాలాకోట్‌పై వైమానిక దాడులు చేసి జైషే ఉగ్రవాద శిబిరాలను మారూపాల్లేండా చేసిన సంగతి తెలిసిందే. -
ఆత్మాహుతి దాడికి యత్నం : హై అలర్ట్
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిలో రెండు రోజుల క్రితం కలకలం రేపిన ఐసీస్ ముఠా నుంచి పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీన చేసుకున్నారు. ఐఎస్ఐఎస్ సంస్థతో సంబంధాలున్న మహ్మద్ ముస్తాకీమ్ అలీయాస్ అబూ యూసఫ్‌ను శుక్రవారం రాత్రి ఢిల్లీ నడి వీధుల్లో పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న క్రమంలో యూసఫ్ ఇంట్లో పెద్ద ఎత్తున పేలుడు పదార్ధాలు, అత్మాహుతికి పాల్పడే బాడీ జాకెట్లను పోలీసులు గుర్తించారు. ఇవ్వనీ ఉత్తర ప్రదేశ్‌లోని బలంపూర్ సమీపంలోని ఓ నివాసంలో గుర్తించిన పోలీసులు వాటి చూసి షాక్‌కు గురయ్యారు. (ఉగ్ర అలజడి : హై అలర్ట్) వెంటనే రంగంలోకి దిగిన ప్రత్యేక దర్యాప్తు బృంధం మరికొన్ని ఆధారాలను సేకరిస్తోంది. యూసఫ్‌తో పాటు ఇంకా ఎవరైనా పేలుళ్లకు ప్రయత్నిస్తున్నారా..? ఏయే ప్రాంతాలు వారి టార్గెట్‌లో ఉన్నాయన్న అంశాలపై పోలీసులు కూపీ లాగుతున్నారు. మరోవైపు యూపీలో భారీగా పేలుడు పదర్ధాలు లభ్యం కావడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఢిల్లీతో సహా దేశంలోని ముఖ్య పట్టణాల సిబ్బంది అలర్ట్‌గా ఉండాలని ఆదేశించారు. దీనిపై కేంద్ర హోంశాఖ ఆరా తీస్తోంది. -
ఉగ్ర అలజడి : హై అలర్ట్
సాక్షి, న్యూఢిల్లీ : భారీ స్థాయి పేలుడు పదార్థాలు కలిగిన ఓ వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేయడం కలకలం రేపుతోంది. శుక్రవారం అర్థరాత్రి ఢిల్లీ నడి వీధుల్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతని వద్ద పేలుడు పదార్థాలను గుర్తంచారు. వెంటనే తేరుకున్న సిబ్బంది దేశ రాజధాని పరిసర ప్రాంతాల్లో అప్రమత్తం చేశారు. ఈ క్రమంలోనే అతన్ని విచారిస్తుండగా ప్రమాదకర నిషేదిత ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా అతనితో పాటు మరికొంత మంది ఉగ్రవాదులు ఢిల్లీ సరిహద్దుల నుంచి ఉత్తర ప్రదేశ్‌లోకి అక్రమంగా చొరబడినట్లు తెలిసింది. (చొరబాటుదారులను కాల్చి చంపిన బీఎస్ఎఫ్) ఈ నేపథ్యంలో యూపీ పోలీసుశాఖను కేంద్ర హోంశాఖ అప్రమత్తం చేసింది. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ హితేష్ చంద్ర అవాస్తీతో చర్చించి సరిహద్దుల్లో తనిఖీలు నిర్వహించాలని, చెక్‌పోస్టుల వద్ద భద్రతలను మరింత పటిష్టం చేయాలని ఆదేశించింది. దీంతో శనివారం రాష్ట్ర పోలీసులు ఉన్నతాధికారులతో సమావేశమైన డీజీపీ దేశంలో ఉగ్ర అలజడి ఉన్నందున అప్రమత్తంగా ఉండాలిన ఆదేశాలు జారీచేశారు. గణేష్ ఉత్సవాలు జరిగే ప్రాంతాల్లో ఓ కన్నేసి ఉండాలని సూచించారు. -
ఛత్తీస్‌గఢ్: పేలుడు పదార్థాలు నిర్వీర్యం
-
ఆవుపైనా అమానుషత్వం
సిమ్లా: కేరళలో పైనాపిల్‌లో పేలుడుపదార్థాలు పెట్టి దాంతో ఏనుగును హతమార్చిన అమానవీయ ఘటనను మరువకముందే హిమాచల్ ప్రదేశ్‌లోని బిలాస్పూర్లో ఆవు నోట్లో టపాసులు పెట్టి, అలాంటి దారుణానికే ఒడిగట్టారు దుండగులు. ఝన్‌దూతలోని ఓ సూడి ఆవు నోట్లో టపాసులు పెట్టి పేల్చడంతో ఆవుకి తీవ్రగాయాలయ్యాయి. నోరంతా రక్తసిక్తమైన ఆవు ఏమీ తినలేక అవస్థపడుతోంది. ఆవు యజమాని గురు దయాళ్æ ఈ వీడియోను సోషల్ మీడియాలో పెట్టడంతో ఇది వైరల్‌గా మారింది. ఆవుపై దాడికి ఒడిగట్టిన వారిని కఠినంగా శిక్షించాలని ఆవు యజమాని కోరారు. ఈ ఘటనకు తన పొరుగున నివసించే నందాలాల్ కారణమని ఆరోపించారు. పది రోజుల క్రితం ఈ ఘటన జరిగింది. యానిమల్ క్రూయాలిటీ యాక్టు కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కేరళలోని పాలక్కాడ్‌లో టపాసులు పెట్టిన పైనాపిల్ తినడంతో ఏనుగు మరణించిన ఘటన తర్వాత యానిమల్ క్రూయాలిటీ యాక్ట్‌ను చేశారు. పేలుడు ధాటికి ఏనుగు తీవ్రంగా గాయపడటంతో కొన్ని రోజులపాటు ఏమీ తినలేక, నొప్పి నుంచి ఉపశమనం కోసం నీటిలోనే ఉండి చనిపోయింది. ఈ ఘటనలో సంబంధం ఉన్న కొందరిని పోలీసులు అరెస్టు చేశారు. -
ఏనుగు నోట్లో పైనాపిల్ బాంబ్
కొచ్చీ: మనుషుల్లోని క్రూరత్వానికి అద్దం పట్టే సంఘటన కేరళలో జరిగింది. టపాకాయల్లో ఉపయోగించే పేలుడు పదార్థాలు నింపిన పైనాపిల్‌ను తినిపించడంతో గర్భంతో ఉన్న ఓ ఏనుగు మృతి చెందింది. కేరళ రాష్ట్రం మలప్పురం జిల్లాలో సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్కులోని వెల్లియార్ నది వద్ద మే 27వ తేదీన జరిగిన ఈ దారుణం పట్ల తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. గుర్తు తెలియని దుండగుడు ఇచ్చిన పైనాపిల్ ఏనుగు గొంతులో పేలిపోయింది. అడవుల్లో ఏనుగులను వేటాడే ముఠా ఈ హత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ దారుణాన్ని మోహన్ కృష్ణన్ అనే అటవీ అధికారి వెలుగులోకి తీసుకొచ్చారు. గర్భిణి ఏనుగు మరణించిన తీరును, ఫొటోలను ఆయన తన ఫేస్బుక్ పేజీలో పోస్టు చేశారు. ఏనుగు తల నీటిలో కూరుకుపోయిందని పేర్కొన్నారు. మూగ జీవాన్ని రాక్షసంగా చంపేసిన దుండగుడిని గుర్తించి, అదుపులోకి తీసుకోవాలని కేరళ ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఈ మొత్తం ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరపాలని స్పష్టం చేసింది. -
మాఫియా గుండెల్లో మందుపాతర ముగ్ధ సిన్హా
‘వెల్డన్.. డన్ ఎ గ్రేడ్ జాబ్’ అనేవారు. వెంటనే ట్రాన్స్ఫర్ చేసేవారు. ప్రతిసారీ అంతే. ప్రతిచోటా అంతే. ముగ్ధ బెదర్లేదు. బ్యాక్ స్టెప్ వెయ్యలేదు.ఎందుకోసమైతే ఆమె ఐఏఎస్ అయ్యారో అందుకోసమే పనిచేస్తున్నారు.ఆమె సామాన్యుల పక్షం. వాళ్ల కోసం ఎంతటివాళ్లతోనైనా పోరాడేందుకు సిద్ధం అయ్యే.. ఏరోజుకారోజు ఆమె డ్యూటీకి బయల్దేరుతుంటారు. రాజస్థాన్ కేడర్‌కు చెందిన ముగ్ధ ప్రస్తుతం రాజస్థాన్–ఢిల్లీమధ్య పాలనా వ్యవహారాల్లో కీలకమైన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రాజస్థాన్‌లోని ఝున్ఝును జిల్లా. 2010. ఆ జిల్లాలోని పల్లెల్లో.. చట్టబద్ధమైన ఎలాంటి అనుమతి, అంగీకారం లేకుండా యథేచ్ఛగా మైనింగ్ జరుగుతోంది. అగ్రకులాల వాళ్లు ఏది చెబితే అదే చట్టం. ఏం చేస్తే అదే న్యాయం. మైనింగ్ మాఫియా, బోర్‌వెల్స్, గ్యాస్ సిలెండర్స్, బ్లాక్ మార్కెటింగ్.. ఒకటేమిటి అన్నీ! అలా ఒకసారి.. ఓ గ్రామంలో మైనింగ్ కోసం పేలుడు పదార్థాలు పెట్టారు. ధనార్జనే ధ్యేయం కాబట్టి పనిచేస్తున్న కూలీల, చుట్టుపక్కల ప్రజల భద్రతను గాలికొదిలేశారు. దాంతో ఆ పేలుడికి కొంతమంది ఎగిరిపడ్డారు. ప్రాణాలు గాల్లో కలిశాయి. తర్వాత చూస్తే దగ్గర్లో ఉన్న పొదల్లో తెగిపడ్డ తలలు కనిపించాయి. ఊరంతా వణికిపోయింది. దానికి బాధ్యులమంటూ స్థానిక మైనింగ్ కంపెనీలేవీ ముందుకు రాలేదు. బాధిత కుటుంబాలకు నష్టపరిహారాన్నిచ్చే బాధ్యతా తీసుకోలేదు. చివరకు ప్రభుత్వమే నష్టపరిహారం చెల్లించింది. ఆ మైనింగ్ వ్యవస్థా మూతపడింది. ఇదంతా ఇక్కడ రాసినంత తేలిగ్గా, అలవోకగా జరగలేదు. కొన్ని నెలల పోరాటం, బెదిరింపులు, బదిలీలు.. అన్నీ జరిగాకే న్యాయం గెలిచింది. అది ఓ వ్యక్తి సాధించిన విజయం. ఆమె ఆ జిల్లా కలెక్టర్. పేరు ముగ్ధా సిన్హా. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ ఆ జిల్లాకు కలెక్టర్‌గిరీ చేయడానికి పురుష ఐఏఎస్ అధికారులే భయపడ్తుంటే మహిళా ఐఏఎస్‌లు చార్జ్ తీసుకోవడం ఊహించలేని విషయం. కాని ఆ సవాల్‌ను స్వీకరించారు ముగ్ధా సిన్హా. ఝున్‌ఝునుకు వచ్చిన మొదటి మహిళా కలెక్టర్‌గానే కాదు.. ఆ జిల్లాను ఓ దారిలో పెట్టిన ఐఏఎస్గానూ చరిత్రలో నిలిచారు. నిజానికి నలభై లక్షల జనాభా ఉన్న పెద్ద జిల్లాలకు కలెక్టర్‌గా పనిచేసిన ముగ్ధా.. ఝున్‌ఝునుకు ట్రాన్స్ఫర్ అవగానే.. చిన్న జిల్లా, హాయిగా పనిచేసుకోవచ్చని ఊపిరి పీల్చుకున్నారట. తీరా వచ్చాక తెలిసింది.. పరిమాణంలో చిన్నదే అయినా ఎదుర్కోవాల్సిన చాలెంజెస్ పెద్దవని. భయపడలేదు ఆమె. ‘‘బ్యూరోక్రాట్స్‌లో నాలుగు రకాలుంటారు. ఒకటి.. నిజాయితీగా, సమర్థవంతంగా పనిచేసేవారు. రెండు.. నిజాయితీగా ఉన్నా సామర్థ్యంలేని వాళ్లు. మూడు.. సామర్థ్యం ఉన్నా నిజాయితీలేని వాళ్లు. నాలుగు.. అవినీతి, అసమర్థులైన ఆఫీసర్లు. నాకు తెలిసింది.. నేను ప్రయత్నించేది.. ఒక్కటే.. నిజాయితీగా ఉండాలి.. సమర్థవంతంగా పనిచేయాలి. ఆ సూత్రాన్ని నమ్మాను కాబట్టే ఝన్‌ఝునులో పరిస్థితులకు వెరవలేదు’’ అంటున్నారు ముగ్ధ. మాఫియా నుంచి ఫోన్ కాల్స్ ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాక ముగ్ధాకు చాలా ఫోన్‌కాల్స్ వచ్చాయి.. ‘‘మళ్లీ మా మైన్స్ ఎప్పుడు తెరుస్తున్నారు’’ అంటూ! అలా ఫోన్ చేసిన వాళ్లెవరూ నిజమైన యజమానులు కారు. యజమానులు ఫోన్ చేయించిన మధ్యవర్తులు. అలాంటి ఏ ఒత్తిళ్లకూ తలొగ్గలేదు ముగ్ధ. అదొక్కటే కాదు.. ఝున్‌ఝునులో జరుగుతున్న ఇతర అరాచకాలకూ ఆమె అడ్డుకట్ట వేశారు. మైనింగ్ తర్వాత ఆ రేంజ్‌లోనే ఉన్న వంట గ్యాస్ సిలెండర్ల బ్లాక్ మార్కెటింగ్‌నూ బ్లాక్ చేసేశారు. అలాగే పర్మిషన్ లేకుండా వేస్తున్న బోర్‌వెల్స్‌నూ పూడ్చేయించారు. హర్యానా నుంచి బోర్వెల్ మెషీన్స్ వచ్చేవి. వాటన్నిటినీ సీజ్ చేయించారు. ఝున్ఝునూను పట్టి పీడిస్తున్న ఇంకో పెద్ద రుగ్మత.. అగ్రకుల అహంకారం. సామాన్యులు తమ గోడు వెళ్లబుచ్చుకోవడానికి కలెక్టర్ ఆఫీస్ ముందు వరుస కడితే.. వాళ్ల ముందు అగ్ర కులస్థుల సమూహం ఉండేది. అగ్రకులస్థులు కలెక్టర్‌ను కలిసి మాట్లాడాకే నిమ్న కులస్థులు కలవాలి. ఇది అక్కడి ఆనవాయితీ. ఆ ‘సంప్రదాయాన్ని’ తుంగలో తొక్కారు ముగ్ధ. అసలు ఎవరూ తన ఆఫీస్ ముందు క్యూ కట్టకముందే గ్రామాల్లోకి వెళ్లిపోయి ప్రత్యక్షంగా సామాన్య ప్రజలను ఆమె కలిసేవారు. వాళ్ల అర్జీలు, దరఖాస్తులు తీసుకునేవారు. సత్వర పరిష్కారం కోసమూ అంతే శ్రమించేవారు. ఆఫీస్ పనివేళలు అయిపోయి, పని మిగిలిపోతే ఆ ఫైల్స్ పట్టుకుని ఇంటికి వెళ్లేవారు. రాత్రంతా కూర్చొని ఫైల్స్ చెక్ చేసేవారు. ఆమె నిజాయితీ, సామాన్యులకు అండగా ఉన్న తీరు, మైనింగ్ మాఫియా, బ్లాక్ మార్కెటింగ్‌పై ఆమె ఉక్కుపాదం మోపడం.. ఇవన్నీ గిట్టని పెద్దలు ఆర్నెల్లలో ముగ్ధకు ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఇప్పించారు. ఆ ఆర్డర్ తీసుకునే ముందు.. ఆరావళి పర్వత సాణువుల్లోని మైన్స్‌లో ఇల్లీగల్ మైనింగ్ కోసం పేలుడు పదార్థాల లోడ్‌తో వెళ్తున్న ట్రక్కులన్నిటినీ ముగ్ధ సీజ్ చేయించారు. ఇది జరిగి దాదాపు తొమ్మిదేళ్లవుతోంది. ఇప్పటి వరకు ఆ మైన్స్ తెరుచుకోలేదు. ఆమె తీసుకున్న నిర్ణయాన్ని కాదనే ధైర్యం ఎవరూ చేయట్లేదు. అడ్మినిస్ట్రేషన్‌లో ముగ్ధ వేసిన ముద్ర అది! అమ్మ కోరికపై ఐఎఎస్ ముగ్ధా తండ్రి గురు స్వరూప్ సిన్హా. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో పైలట్‌గా పనిచేసేవారు. చైనాతో, ఆ తర్వాత 1971లో పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో పాల్గొన్నారు. 1978లో విమాన ప్రమాదంలో మరణించారు.. విధి నిర్వహణలోనే. అప్పటికి ముగ్ధ వయసు నాలుగేళ్లు. ఇద్దరు చెల్లెళ్లు. తల్లి కమలా సిన్హా పిల్లల్ని పెంచి పెద్దచేసింది. సమాజాన్ని సంస్కరించడం కోసం ముగ్ధాకు ఐఏఎస్ లక్ష్యాన్ని నిర్దేశించిందీ ఆమెనే. భర్త చనిపోయాక పిల్లలను తీసుకుని ఆగ్రా వెళ్లిపోయారు కమల. పాఠశాల విద్యను అక్కడే పూర్తి చేశారు ముగ్ధ. ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజ్‌లో హిస్టరీ హానర్స్ చదివారు. కాలేజ్ ఫస్ట్. యూనివర్సిటీలో థర్డ్ ర్యాంకర్. ఇంటర్నేషనల్ రిలేషన్స్‌లో ఎమ్మే చేశారు. సెకండ్ అటెంప్ట్‌లో ఐఏఎస్ సాధించారు. సివిల్స్‌లో ఆమెది ఆల్ ఇండియా ఎయిత్ ర్యాంక్. జైపూర్ అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళా ముగ్ధానే. రెండేళ్లు సీఎమ్ (రాజస్థాన్) ఆఫీస్‌లోనూ పని చేశారు. జిల్లా కలెక్టర్‌గా 2005లో మొదటి అపాయింట్మెంట్ తీసుకున్నారు. ‘‘సివిల్ సర్వీస్.. జాబ్ కాదు. నిజంగా సర్వీసే. సామాన్యుల సంక్షేమం కోసం చేసే సేవ. మనం చేసిన పనే తర్వాతి తరాల వాళ్లకు అందే వారసత్వం. మన పనే ప్రజల హృదయాల్లో మనకు సుస్థిరస్థానం కల్పిస్తుంది’’ అని అంటారు ముగ్ధా సిన్హా. పదేళ్లలో పదమూడు బదిలీలు! ఆర్నెల్లలోనే అరవై ఏళ్ల పాలనా సంస్కరణలు తెచ్చారు ముగ్ధ. అందుకే ఆమె ట్రాన్స్ఫరై పోతుంటే ఆ జిల్లాలోని ప్రజలు సరే.. లాయర్లు, టీచర్లు, ఇంజనీర్లు అందరూ ముగ్ధా బదిలీని ఆపమంటూ ధర్నా నిర్వహించారు. బంద్‌కు పిలుపిచ్చారు. ఆమెలోని సిన్సియారిటీ, సమర్థత తన పదిహేనేళ్ల సర్వీస్‌లో పదమూడు ట్రాన్స్ఫర్స్లను గిఫ్ట్‌గా ఇచ్చింది. అయినా అలుపెరగక ప్రయాణిస్తూనే ఉన్నారామె తను నమ్మిన దారిలో. -
గప్‌చుప్‌గా ఆన్లైన్లో..
సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన ఐసిస్ సానుభూతిపరుడు, దేశంలో పలు విధ్వం సాల సూత్రధారి ఖదీర్‌పై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో కళ్లు చెదిరే వాస్తవాలు తెలుస్తున్నాయి. ఖదీర్ ను ఉగ్రవాద బాటలోకి పట్టించిన అబ్దుల్లా బాసిత్ ఆదేశాల మేరకు ఈ కామర్స్ సైట్ అమెజాన్ ద్వారా పేలుడు పదార్థాలను ఇత డు కొనుగోలు చేసినట్లు ఎన్ఐఏ చార్జ్‌షీట్‌లో పేర్కొంది. 2016నాటి అబుదాబి మాడ్యూల్ కేసులో గతేడాది ఆగస్టులో ఖదీర్, బాసిత్‌లను ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారు. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉంటోన్న వీరిపై ఎన్ఐఏ అధికారులు పాటియాలా కోర్టులో అనుబంధ చార్జ్‌షీట్‌ను దాఖలు చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా.. విధ్వంసాలకు అవసరమైన పేలుడు పదార్థాల సమీకరణ ఉగ్రవాద సంస్థలకు పెద్ద సవాల్‌గా మారింది. దీంతో ఎవరికీ అనుమానం రాకుండా వీరిద్దరూ సంప్రదాయేతర విధ్వంసక వనరులపై దృష్టి పెట్టా రు. వీటిని కొనుగోలు చేసే బాధ్యతను బాసిత్ తన ప్రధాన అనుచరుడు ఖదీర్‌కు అప్పగించాడు. దీనిపై ఇంటర్నెట్లో అధ్యయనం చేసిన ఖదీర్ హైడ్రోజన్ పెరాక్సైడ్, ఫాస్ఫరస్, యూరియా తదితరాలను బాంబుల తయారీకి వినియోగించుకోవచ్చని తెలుసుకున్నాడు. పాతబస్తీలోని వివిధ ప్రాంతాలతో పాటు అమెజాన్ ద్వారా ఆర్డర్ చేసి వీటిని సమీకరిం చాడు. షహీన్‌నగర్‌లోని తన ఇంటితో పాటు తన బం ధువు ఇంట్లోనూ వీటిని ఉపయోగించడంపై కొన్ని ప్రయోగాలు చేశాడు. అయితే వీటిని బాంబు లుగా మార్చడంలో ఖదీర్ విఫలమయ్యాడు. ఎన్ఐఏ ఇతడిని అరెస్టు చేసినప్పుడు ఇంటి నుంచి ఈ పదార్థాలతో పాటు ల్యాప్‌టాప్‌నూ స్వాధీనం చేసుకున్నా రు. ఈ పదార్థాలు మార్కెట్లో తేలిగ్గా దొరకడంతో పాటు ఎవరికీ అనుమానం రాదని వీటిని ఎంపిక చేసుకున్నట్లు వీరిద్దరూ ఎన్ఐఏకు తెలిపారు. బాసిత్ ప్రభావంతోనే ఉగ్రబాట జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన అనాథాశ్రమం ఉద్యోగి అబ్దుల్ ఖుద్దూస్ కుమారుడు అబ్దుల్ ఖదీర్. కొద్దికాలం చంద్రాయణగుట్టలో నివసించిన ఖదీర్...బాసిత్ ప్రభావంతోనే ఐసిస్ వైపు ఆకర్షితుడయ్యాడు. 2015లో పదో తరగతి ఫెయిల్ అవ్వడంతో ఓ ఇంటర్నెట్ సెంటర్లో పార్ట్‌టైమ్ ఉద్యోగిగా పని చేశాడు. ఇతడి మేనత్తతో పాటు కొందరు బంధువులు పాకిస్తాన్లో ఉంటారు. గతేడాది ఆగస్టు 10న ఓ శుభకార్యం కోసం కుటుంబంతో కలసి ఖదీర్ అక్కడకు వెళ్ళాల్సి ఉంది. దానికి మూడ్రోజుల ముందే ఎన్ఐఏ విచారణకు హాజరవుతుండటంతో పాక్‌కు వెళ్లడం సాధ్యం కాలేదు. అబుదాబి మాడ్యూల్‌కు సంబంధించిన హ్యాండ్లర్‌తో పాటు ఇతర కీలక కేడర్‌తో ఆన్లైన్ ద్వారా టచ్‌లో ఉండి, సంప్రదింపులు జరిపింది అబ్దుల్లా బాసిత్ అని ఎన్ఐఏ చార్జ్‌షీట్‌లో పేర్కొంది. -
ఖమ్మంలో భారీ విస్ఫోటం
సాక్షిప్రతినిధి, ఖమ్మం: నగరంలో సోమవారం భారీ విప్ఫోటం జరిగింది. ఓ భవనం కుప్పకూలగా.. మంటల్లో చిక్కుకొని ఒకరు తీవ్రంగా గాయపడ్డాడు. సుమారు 20 దుకాణాల వరకు దెబ్బతిన్నాయి. భారీ శబ్దానికి స్థానికులు భయంతో పరుగులు తీశారు. తెల్లవారుజామున ఈ ఘటన జరగడం.. భవనంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. రూ.కోటికి పైగా ఆస్తి నష్టం జరిగిందని చెబుతున్నారు. పేలుడు పదార్ధాలు నిల్వ ఉంచడంతో అవి పేలాయని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని ప్రముఖ వ్యాపార కూడలి అయిన కమాన్‌బజార్‌లో బెందెడి రవీంద్రనాథ్‌కు చెందిన భవనంలో వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటకు చెందిన దేవాండ్ల శ్రీనివాస్ ‘నానో శ్రీనివాస్’పేరుతో గతేడాది నుంచి వస్త్ర దుకాణం నిర్వహిస్తున్నాడు. అద్దె సరిగా చెల్లించకపోవడంతో దుకాణం ఖాళీ చేయాలని యజమాని చెప్పాడు. దీంతో శ్రీనివాస్ మూడు రోజులుగా ఆ పనిలోనే ఉన్నాడు. పేలుడు పదార్థాలే కారణమా? భారీ శబ్ధానికి స్థానికులు ఏం జరిగిందో తెలియక భయంతో రోడ్లపైకి పరుగులు తీశారు. దుకాణంలో పేలుడు పదార్థాలు నిల్వ ఉంచి ఉండవచ్చని, అవి ప్రమాదవశాత్తు పేలి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తోగానీ, సిలిండర్లకు సైతం ఇంతటి స్థాయిలో పేలుడు జరిగే అవకాశం ఉండదని చెబుతున్నారు. ఈ భారీ విస్ఫోటానికి 30 ఏళ్ల క్రితం నిర్మించిన భవనం కుప్పకూలింది. ఆ సమయంలో భవనంలో ఎవరూ లేరు. అయితే.. వెనుక ఉన్న భవనంలో వస్త్ర దుకాణం వ్యాపారి శ్రీనివాస్ నిద్రిస్తున్నాడు. ఒక్కసారిగా చెలరేగిన మంటల్లో అతను చిక్కుకున్నాడు. తనను కాపాడాలని అతను గట్టిగా కేకలు వేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. అగ్నిమాపక సిబ్బంది వెనుక భవనం నుంచి దిగి నిచ్చెన ద్వారా బయటకు తీసి.. 108 అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను 50 శాతం వరకు కాలిపోయాడు. ఎస్పీ సందర్శన రూ.కోట్లాది వ్యాపారం జరిగే ఈ ప్రాంతంలో భారీ పేలుడు సంభవించడంతో ప్రజలు ఆ ప్రాంతానికి తండోప తండాలుగా చేరుకున్నారు. పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మూడు అగ్నిమాపక వాహనాలతో మంటలను అదుపులోకి తెచ్చారు. భవనం పూర్తిగా ధ్వంసం కావడంతో శకలాలను రెండు జేసీబీల ద్వారా తొలగించారు. అయితే ఘటనా స్థలం వద్ద ఏపీ లోని కడప జిల్లా రాయచోటికి చెందిన ఓ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ కారులో రెండు రోజుల క్రితం నలుగురు వ్యక్తులు వచ్చి ఈ షాపులో తిరిగారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పోలీసులు బాంబ్, డాగ్ స్క్వాడ్లతో క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ ఘటనలపై పలు అనుమానాలు వ్యక్తమవుతుండటంతో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. -
పేలుడు పదార్థాల బాధ్యత ఖదీర్‌కు!
సాక్షి, హైదరాబాద్: ఉగ్రవాద సంస్థలకు రిక్రూట్మెంట్ తేలికైనా విధ్వంసాలకు అవసరమైన పేలుడు పదార్థాల సేకరణ సవాల్‌గా మారింది. అబుధాబి మాడ్యూల్‌కు సంబంధించిన ‘ఐసిస్ ద్వయం’అబ్దుల్లా బాసిత్, అబ్దుల్ ఖదీర్ మాత్రం ఈ వ్యవహారంలో తెలివిగా వ్యవహరించారు. సంప్రదాయేతర ‘విధ్వంస’ వనరులపై దృష్టి పెట్టారు. ఈ బాధ్యతల్ని సూత్రధారి బాసిత్ ప్రధాన అనుచరుడు ఖదీర్‌కు అప్పగించినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు గుర్తించారు. శనివారం నగరంలో అరెస్టు చేసిన వీరిని సోమవారం ఢిల్లీలోని పాటియాల కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం అనుమతితో తదుపరి విచారణ నిమిత్తం 11 రోజులు (ఈ నెల 24 వరకు) పోలీసు కస్టడీకి తీసుకున్నారు. ఆర్డీ ఎక్స్, అమ్మోనియం నైట్రేట్‌ను సమీకరించే ప్రయత్నంలో నిఘాకు చిక్కే ప్రమాదం ఉం దని సాధారణ వస్తువులపై ఐసిస్ ద్వయం దృష్టిపెట్టింది. ఈ అంశంపై ఖదీర్ ఇంటర్నెట్లో సుదీర్ఘ అధ్యయనమే చేశాడు. పాతబస్తీలోని వివిధ ప్రాంతాల నుంచి వీటిని సమీకరించాడు. షహీన్‌నగర్‌లోని తన ఇంటితోపాటు తన బంధువు ఇంట్లోనూ వీటిపై ప్రయోగాలు చేశాడే కానీ, ఇంకా సఫలీకృతుడు కాలేదు. ఎన్ఐఏ అధికారులు ఇతడి ఇంటి నుంచి ఈ పదార్థాలతోపాటు ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటినీ పరీక్షల నిమిత్తం సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లెబోరేటరీకి పంపారు. ఇలాంటి పదార్థాలు మార్కెట్లో తేలిగ్గా దొరకడంతోపాటు ఎవరికీ అనుమానం రాదనే వీటిని ఎంపిక చేసుకున్నామని బాసిత్, ఖదీర్ ఎన్ఐఏకు తెలిపారు. 2014 నుంచి ఐసిస్ భావజాలం... 2014 నుంచి ఐసిస్ భావజాలంతో ఉండి, రెండుసార్లు దేశం దాటేందుకు యత్నించి చిక్కిన, ఇప్పటికీ రెండుసార్లు అరెస్టు అయిన అబ్దుల్లా బాసిత్‌కు ‘ఉగ్రస్ఫూర్తి’ఇచ్చింది అతడి సమీప బంధువు సలావుద్దీన్. నల్లగొండకు చెందిన సలావుద్దీన్ సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ముంబై వెళ్లి అక్కడి స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా(సిమి)తో సంబంధాలు ఏర్పర్చుకున్నాడు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకల్లో సిమి కార్యకలాపాల నిర్వహణలో కీలకపాత్ర పోషించాడు. ఆపై రెండేళ్లపాటు సిమికి ఆలిండియా చీఫ్‌గా వ్యవహరించాడు. 2001లో సిమిని కేంద్రం నిషేధించిన తరవాత సలావుద్దీన్ దుబాయ్‌కు మకాం మార్చాడు. 2011లో కేరళలో చిక్కిన ఇతడు 2014 అక్టోబర్‌లో నల్లగొండ నుంచి వస్తూ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. బాసిత్‌లో మార్పు తీసుకురావాలని కుటుంబీకులు ఓ యువతితో వివాహం చేసినా అతడిలో మార్పు రాలేదని అధికారులు చెప్తున్నారు. -
పెద్దపల్లిలో పేలుడు పదార్థాలు స్వాధీనం
సాక్షి, పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లాలో భారీగా పేలుడు పదార్థాలు బయటపడ్డాయి. జిల్లాలోని బసంత నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని దేవునిపల్లి శివారులోని క్వారీలో గురువారం టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అక్రమంగా నిల్వ చేసిన 321 ఎలక్ట్రికల్ డిటోనేటర్స్, 170 కేజీల అమ్మెనియా, 50 లీటర్ల కిరోసిన్, కాంప్రెషర్ ట్రాక్టర్‌ను పేలుడు పదార్ధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. క్వారీ యజమానులు రాయిశెట్టి శ్రీనివాస్, చిట్యాల అశోక్, కాంప్రెషర్ యజమాని సంచులు సధాకర్, డ్రైవర్ దేవేందర్‌ను అరెస్టు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు. -
పాపం.. లూలు జాబ్ పోయింది!
వాషింగ్టన్ : లూలును సీఐఏ విధుల నుంచి తప్పించింది. లూలు అంటే బాంబు స్క్వాడ్ బృందంలో పనిచేసే ఓ శునకం. లూలును ఎందుకు జాబ్ నుంచి తీసేశారో ఆ వివరాలపై ఓ లుక్కేయండి.. అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు బాంబు తనిఖీల కోసం కొన్ని ప్రత్యేక జాతి శునకాలకు శిక్షణ ఇస్తాయి. ఇందులో భాగంగానే ఇటీవల లాబ్రడార్ బ్రీడ్‌కు చెందిన లూలును ఎంపిక చేసింది సీఐఏ. బాంబులుగానీ, లేదా ఇతర పేలుడు, అనుమానిత వస్తువులను పసిగట్టేలా అధికారులు లూలుకు శిక్షణ ఇప్పించారు. అయితే గతకొన్ని రోజులుగా లూలు విధులు సరిగా నిర్వహించడం లేదని గుర్తించారు. ఆ వివరాలను సీఐఏ ఓ బ్లాగులో పేర్కొంది. ట్రైనింగ్ తీసుకున్న తర్వాత కొన్ని శునకాలు తమ విధులు సక్రమంగా నిర్వర్తించవు. అందుకు లక్ష కారణాలుండొచ్చు. కొన్నిసార్లు కొన్నిరోజులకే అవి మళ్లీ పూర్తిస్థాయిలో తమ బాధ్యతలను నిర్వర్తిస్తాయి. లూలు విషయంలో అలా జరగదని తేలిపోయింది. మళ్లీ శిక్షణ ఇవ్వాలని చూసినప్పటికీ, ఆ శునకం ఆసక్తి చూపించడం లేదట. ఒకవేళ బలవంతంగా లూలుతో పని చేయిస్తే అది బాంబులు, పేలుడు పదార్థాలను గుర్తించకపోతే ప్రాణనష్టం వాటిల్లే అవకాశం ఉంది. దాంతో పాటు లూలు సాధారణ శునకాల్లాగ జీవించాలని చూస్తుందని, అందుకే బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం లేదని తెలుసుకున్న అధికారులు ఈ స్పెషల్ డాగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఉద్యోగం పోగొట్టుకున్న లూలు ప్రస్తుతం హ్యార్రీ అనే మరో శునకంతో ఫ్రెండ్షిప్ చేస్తూ సాధారణ జీవితం గడుపుతోందని అధికారులు ఆ బ్లాగ్‌లో వెల్లడించారు. -
తొక్కిస్తున్నారు
► చవకగా... తేలికగా ► వాహనంతో దాడులకు ఉగ్రసంస్థల మొగ్గు ‘సాధ్యమైనంత ఎక్కువగా ప్రాణనష్టం కలిగించడం... అదీ పెద్దగా వ్యూహరచన అవసరం లేకుండా, అత్యంత చవకగా’ అనేది ఇప్పుడు ఉగ్ర సంస్థల లక్ష్యంగా మారింది. ఒకప్పుడు ఎంతో వ్యయప్రయాసలకు ఓర్చి, ఎంతోమందిని దాడిలో భాగస్వాములను చేసి... రెక్కీలు నిర్వహించి, పక్కా ప్రణాళికతో దాడులు చేసి విధ్వంసం సృష్టించేవారు. ఎక్కడ, ఏ రోజు, ఏ సమయానికి దాడికి తెగబడాలనే దాన్ని ముందే నిర్ణయించుకునే వారు. భారీ ప్రాణనష్టం కలిగించడం ద్వారా పాశ్చాత్యులను భయభ్రాంతులకు గురిచేసేవారు. కానీ ఇప్పుడు పంథా మారింది. ఓ పికప్ (సరుకు రవాణా) వాహనాన్ని అత్యంత వేగంగా నడుపుతూ జనాన్ని తొక్కించడమే. ఉగ్రవాద సంస్థలు ఈ తరహా దాడులకు మొగ్గడం వెనుక పలు అనుకూలతలు ఉన్నాయి. బార్సిలోనా దాడి నేపథ్యంలో అవేమిటో చూద్దాం... కనిపెట్టే అవకాశం ఉండదు... రైళ్లలో, బస్సుల్లో, స్టేడియాల్లో లేదా ఇతర జనసమ్మర్థ ప్రాంతాల్లో బాంబులు పెట్టాలంటే... వాటిని గుట్టుగా రవాణా చేయాలి. విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్ లాంటి చోట్ల మెటల్ డికెట్లర్లు, సీసీ కెమెరాలతో పటిష్ట నిఘా ఉంటుంది. కాబట్టి బాంబులను అనుకున్న చోటకు చేర్చడం కష్టం. మానవ బాంబులుగా మారి దాడి చేద్దామన్నా ఇదే పరిస్థితి. పైగా బాంబులను తయారుచేయడం, రవాణా... రిస్క్‌తో కూడుకున్నవి. ఏమాత్రం తేడా వచ్చినా... పేలిపోతారు. కుట్ర భగ్నం చేయడం కష్టం... సాధారణంగా నిఘా వ్యవస్థలు ఉగ్ర కదలికలపై గట్టి నిఘా పెడతాయి. ఇంటర్నెట్పై, సామాజిక మాధ్యమాల ద్వారా జరిగే సంభాషణలపై కన్నేసి ఉంచుతాయి. ఫోన్ సంభాషణలపైనా నిఘా ఉంటుంది. ఆధునిక భద్రతా వ్యవస్థల కళ్లుగప్పి... ఐసిస్ ఆక్రమిత ప్రాంతం నుంచి యూరోప్ దేశాల్లోని తమ సానుభూతిపరులతో, ఉగ్రవాదులుగా మారిన వారితో సంప్రదింపులు జరపడం అంత తేలిక కాదు. ఇలా ప్రయత్నించే సందర్భాల్లో పలు ఉగ్రకుట్రలు భగ్నమవుతుంటాయి. అదే సానుభూతిపరులను ఒంటరిగా వాహనదాడులకు ప్రేరేపిస్తే... ఎలాంటి అవరోధాలు లేకుండా పని ఇట్టే పూర్తయిపోతుంది. భారీ ప్రాణనష్టం ద్వారా... విపరీతమైన ప్రచారం లభిస్తుంది. ఉగ్ర సంస్థల లక్ష్యం తేలికగా నెరవేరుతుంది. అందుకే ఉగ్రసంస్థలు తమ మాధ్యమాల ద్వారా ఇలా ఒంటరిగా దాడులు చేసే వారిని అమరయోధులుగా కీర్తిస్తూ ఆకాశానికెత్తుతున్నాయి. తద్వారా మరింత మందిని ఈ దిశగా ప్రేరేపించే ప్రయత్నం చేస్తున్నాయి. శిక్షణ అక్కర్లేదు... ఉగ్రసంస్థలు తాము రిక్రూట్ చేసుకునే వారిని... తమ అనుకూల ప్రాంతాలకు రప్పించి శిక్షణ ఇస్తుంటాయి. తుపాకీ కాల్చడం, బాంబుల తయారీ, ఎవరికీ అనుమానం రాకుండా పనిచేసుకుపోవడం, సంభాషణల్లో వాడే కోడ్ భాష... తదితర అంశాల్లో శిక్షణ ఇస్తుంటాయి. అదే పికప్ వ్యాన్‌తో జనాన్ని తొక్కించాలంటే ఎలాంటి శిక్షణా అక్కర్లేదు. డ్రైవింగ్ తెలిస్తే చాలు. చవక... తేలిక బాంబుదాడుల్లో ఎన్నో వ్యయప్రయాసలుంటాయి. అదే పికప్‌తో చేసే దాడి చాలా చవక. చేయాల్సిందల్లా ఓ వాహనాన్ని అద్దెకు తీసుకోవడం. పైగా చట్టవిరుద్ధం కూడా కాదు. జనంతో కిటకిటలాడే ప్రదేశానికి వెళ్లి విచక్షణారహితంగా వాహనాన్ని నడిపి భీభత్సాన్ని సృష్టించడం. ఖర్చుపరంగా ఇది చాలా చవక, అమలుపరంగా అత్యంత తేలిక. ఒకవేళ ముందుజాగ్రత్తగా ఇలాంటి వాహనాలను తనిఖీ చేసినా... నడుపుతున్న వ్యక్తి ఉద్దేశాన్ని పసిగట్టం అసాధ్యం. ఎలా మొదలైంది... పేలుడు పదార్థాలతో నిండిన వాహనంతో శత్రు శిబిరంలోకి చొచ్చుకెళ్లి పేల్చివేయడం... చాలా కాలంగా ఉంది. కానీ వాహనంతో గుద్దిచంపడాన్ని 2008లో ఇజ్రాయిలీలపై దాడికి పాలస్తీనియన్లు తొలుత ప్రారంభించారు. తర్వాత అల్‌ఖైదా, ఐసిస్‌లు వ్యతిరేకులపై దాడికి దీన్నో సమర్థ ఆయుధంగా వాడొచ్చని గుర్తించి ప్రచారం ప్రారంభించాయి. 2014లో ఐసిస్ మీడియా గ్రూపు ఎనిమిది నిమిషాల వీడియోను విడుదల చేసింది. పాశ్చాత్యులను, ఇస్లాంను అనుసరించని వారిని భయబ్రాంతులకు గురిచేయండి. ఎప్పుడేం జరుగుతుందోననే భయంతో వారికి నిద్ర కూడా పట్టకూడదు. మనవారి కోసం పొరాడటానికి సిరియా, ఇరాక్‌లకు రానక్కర్లేదు. మీరున్న చోటే... మీ కార్లను ఆయుధాలుగా వాడండి. జనాన్ని కార్లతో తొక్కిచంపండి’ అని ఇందులో ఐసిస్ పిలుపిచ్చింది. తర్వాత ఈ తరహా దాడులు పెరిగాయి. డిసెంబరు 2014: ఫ్రాన్స్‌లోని నాంతెస్లో క్రిస్మస్ మార్కెట్లోకి ఒక వ్యాన్ దూసుకెళ్లింది. అలాగే డిజాన్లో ఓ కారు పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ రెండు ఘటనల్లో 20 మంది గాయపడ్డారు. జులై 14, 2016: ఫ్రాన్స్‌లోని నైస్‌లో అత్యంత ఘోర దుర్ఘటన జరిగింది. ట్యునీషియా దేశస్థుడైన మహ్మద్ బౌహ్లెల్ ఓ భారీట్రక్కుతో జనంపైకి దూసుకెళ్లి ఏకంగా 86 మంది చావుకు కారణమయ్యాడు. వందమంది పైచిలుకు క్షతగాత్రులయ్యారు. ఉగ్రభావాలతో ప్రేరేపితుడైన బౌహ్లెల్ జనాన్ని ట్రక్కుతో తొక్కిస్తూ మైలు దూరం వెళ్లాక చివరికి పోలీసులు అతన్ని కాల్చిచంపారు. డిసెంబరు 19, 2016: బెర్లిన్‌లోని క్రిస్మస్ మార్కెట్లోకి ట్రాక్టర్ ట్రైలర్‌ను నడపి అనిస్ అమ్రీ (ట్యునీషియా) 12 మంది అమాయకులను పొట్టనబెట్టుకున్నాడు. యూరప్‌ను జల్లెడ పట్టిన పోలీసులు... ఘటన జరిగిన నాలుగురోజులకు అమ్రీని ఇటలీలోని మిలన్లో కాల్చిచంపారు. ఇతను ఐసిస్‌కు విధేయతను ప్రకటిస్తున్న వీడియోను ఆ సంస్థ విడుదల చేసింది. మార్చి 22, 2017: లండన్‌లోని వెస్ట్ మినిస్టర్ బ్రిడ్జిపై నడిచి వెళుతున్న పాదచారులపైకి ఎస్‌యూవీని నడిపి నలుగురిని చంపిన ఖాలిద్ మసూద్... తర్వాత వాహనం ఆగిపోవడంతో... కిందకు దిగి ఓ పోలీసు అధికారిని పొడిచి చంపాడు. చివరకు పార్లమెంటుకు సమీపంలో భద్రతాబలగాలు ఇతన్ని కాల్చి చంపాయి. ఏప్రిల్ 7, 2017: స్వీడన్‌లోని స్టాక్‌హోమ్‌లో ఓ ఫుట్‌పాత్‌పైకి ట్రక్కును నడిపి ఐదుగురిని పొట్టనబెట్టుకున్నాడు ఉబ్జెకిస్థాన్‌కు చెందిన రఖ్మత్ అకిలోవ్. ఉగ్రదాడిగా నిందితుడు అంగీకరించాడు. జూన్ 3, 2017: లండన్ బ్రిడ్జిపై పాదచారులపైకి వ్యాన్‌ను నడిపి... తర్వాత దారినే పోయేవారిని కత్తులతో పొడిచారు ముగ్గురు తీవ్రవాదులు. ఈ దాడిలో మొత్తం ఎనిమిది మంది మృతి చెందారు. జూన్ 19, 2017: మసీదులో ప్రార్థన చేసుకువచ్చిన వారిపైకి డారెన్ ఓస్బోర్న్ అనే వ్యక్తి వ్యాన్‌తో ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, 11 మంది గాయపడ్డారు. నిందితుడిపై తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడ్డాడనే అనుమానం కూడా ఉంది. ఆగష్టు 17, 2017: బార్సిలోనాలో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో జనంపైకి ఓ వ్యాన్ దూసుకెళ్లింది. 13 మంది మృతి చెందగా, 100 మంది దాకా గాయపడ్డారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ప్రగతినగర్‌లో పేలుడు పదార్ధాలు స్వాధీనం
హైదరాబాద్: కూకట్‌పల్లిలోని ప్రగతి నగర్లో ఎస్ఓటీ పోలీసులు గురువారం పేలుడు పదార్ధాలు స్వాధీనం చేసుకున్నారు . ఓ ఇంటి సెల్లార్ నిర్మించేందుకు అడ్డుగా ఉన్న బండరాళ్లను పగలగొట్టేందుకు పేలుడు వదార్ధాలు తీసుకుని వచ్చారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో వారు సంఘటనా స్ధలానికి చేరుకుని ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి నుంచి 70 జిలెటిన్ స్టిక్స్, 50 డిటోనేటర్లు, ఒక ఇటాచి వాహనం, రెండు కంప్రెషర్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బయట పడ్డ ‘పేలుడు’ పాతర
బాంబ్ డిజ్పోజబుల్ స్క్వాడ్ వెలికితీత వందేసి చొప్పున డిటోనేటర్లు, పవర్ జెల్స్ స్వాధీనం అడ్డతీగల : గ్రామ శివారులోని ప్రధాన రహదారి చెంత పోలీసులు గురువారం పేలుడు పదార్ధాలను వెలికితీశారు. ఒక గోతిలో దొరికిన ఒక ప్లాస్టిక్ టబ్బు.. అందులో ఉన్న సంచిలో 25 కిలోల బరువైన వంద డిటోనేటర్లు, మరో వంద పవర్ జెల్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి వచ్చిన అత్యంత రహస్య సమాచారం మేరకు రంపచోడవరం ఏఎస్పీ అద్మామ్ నయూం అస్మి ఆధ్వర్యంలో బాంబ్ డిస్పోజబుల్ స్క్వాడ్, ఇతర పోలీసులు అడ్డతీగల శివారున అడవుల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో దొరికిన ఈ టబ్బుకి ఏమైనా ఎలక్ట్రిక్ వైర్లు అమర్చారా? అంటూ నిశితంగా పరిశీలించి తరువాతే దానిని బయటకు తీశారు. ఎక్కడో విధ్వంసం సృష్టించేందుకే వీటిని ఇక్కడ భద్రపర్చినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. ఏడేళ్ళ క్రితం కోనలోవ వద్ద ఓ కల్వర్టు కింద అమర్చిన 35 కిలోల పేలుడు పదార్ధాలను పోలీసులు కనుగొన్నారు. ఆ తరువాత పేలుడు పదార్ధాలు దొరకడం ఇదే ప్రథమం. దర్యాప్తు చేస్తాం : ఏఎస్పీ అస్మి అడ్డతీగల శివారున పేలుడు పదార్ధాలు బయటపడిన విషయంపై కేసు దర్యాప్తు చేస్తామని రంపచోడవరం ఏఎస్పీ అద్నామ్ నయూం అస్మి తెలిపారు. తనిఖీల్లో బయటపడిన పేలుడు పదార్ధాలను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇంటెలిజెన్స్ బ్యూరో సమాచారంతో ఈ ప్రాంతాన్ని జల్లెడ పట్టి వీటిని కనుగొన్నట్టు చెప్పారు. పేలుడు పదార్ధాలు క్వారీ నిర్వాహుకులకు చెందినవా? లేక మావోయిస్టులు ఇక్కడ ఉంచారా అనేది దర్యాప్తులో తేలుతుందన్నారు. ఈ ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకుని క్షుణ్ణంగా అన్వేషిస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుతం ఏజెన్సీలో పరిస్థితి ప్రశాంతంగానే ఉందన్నారు. -
బాంబు పేలుళ్లు ఇండియాలోనే ఎక్కువ
న్యూఢిల్లీ: భారతదేశంలోనే ఎక్కువగా బాంబులు పేలుతున్నాయి. గడిచిన రెండేళ్ల రికార్డులు పరిశీలిస్తే ఈ విస్మయకర విషయం బయటపడింది. గత రెండేళ్లలో ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా ఇండియాలో బాంబు పేలుడు ఘటనలు నమోదయ్యాయి. ప్రతి నిత్యం బాంబులు, పేలుళ్లతో దద్దరిల్లుతాయని భావించే పాకిస్తాన్, ఇరాక్ కన్నా ఇండియాలో ఈ సంఖ్య ఎక్కువగా ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎస్ జీ) పరిధిలో నేషనల్ బాంబు డాటా సెంటర్ (ఎన్బీడీసీ) తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం భారత్ లోనే అత్యధికంగా బాంబులు పేలిన ఘటనలు చోటుచేసుకున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాల్లోని తీవ్రవాద సంస్థలు పాల్పడే పేలుళ్ల ఘటనల వివరాలను ఎన్బీడీసీ ఎప్పటికప్పుడు సేకరించి విశ్లేషిస్తుంది. తీవ్రవాదులు అనుసరిస్తున్న పంథా, ఉపయోగిస్తున్న పేలుడు పదార్థాలను, విద్రోహా ఘటనలను విశ్లేషించి వాటికి కౌంటర్ గా అనుసరించాల్సిన వ్యూహాన్ని ఎన్బీడీసీ ప్రభుత్వానికి సూచిస్తుంది. భారతదేశంలో గత ఏడాది 337 పేలుడు (ఇంప్రూవైజ్డ్ ఎక్స్ ప్లోజివ్ డివైసెస్ - ఐఈడీ ఉపయోగించిన) ఘటనలు నమోదయ్యాయి. 2015 లో 268 మొత్తంగా పేలుళ్లు జరిగితే, 2014లో 190, 2013 లో 283, 2012లో 365 పేలుళ్లు సంభవించాయి. పేలుళ్లలో ఇండియా తర్వాత ఇరాక్ రెండో స్థానంలో ఉంది. ఇరాక్ లో గతేడాది 221 బాంబు పేలుడు సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఆ తర్వాత అఫ్ఘానిస్తాన్ లో 132, టర్కీలో 71, థాయిలాండ్ లో 63, సోమాలియా, సిరియాలో కలిపి 56 ఘటనలు జరిగాయి. 2015 లో ఇరాక్ లో 170 పేలుళ్లు, పాకిస్తాన్ లో 208, అఫ్టానిస్తాన్ లో 121, సిరియా 41 సంఘటనలు జరిగాయి. ఇక ఇండియాలో రాష్ట్రాల వారిగా పరిశీలిస్తే అత్యధికంగా చత్తీస్‌గఢ్‌లో నమోదయ్యాయి. గతేడాదిలో చత్తీస్‌గఢ్‌లో 60, జమ్ము కశ్మీర్లో 31, కేరళలో 33, మణిపూర్ లో 40, ఒడిశాలో 29, తమిళనాడులో 32, పశ్చిమ బెంగాల్ లో 30 సంఘటనలు రికార్డయ్యాయి. గతేడాది జూలై 18 న బీహార్ లో చేటుచేసుకున్న బాంబు పేలుడు ఘటనలో అత్యధికంగా సీఆర్పీపీఎఫ్ బెటాలియన్ కు చెందిన 10 మంది కమెండోలు మృత్యువాత పడ్డారు. ఔరంగాబాద్-గయ అటవీ ప్రాంతంలో సీఆర్పీపీఎఫ్ స్వ్కాడ్ ను దాదాపు 200 మావోయిస్టులు చుట్టుముట్టి 22 ఐఈడీ పేలుళ్లకు పాల్పడ్డారు. కొన్ని సంఘటనలు ఆగస్టు 24 - (జమ్మూ కశ్మీర్) పుల్వామా వద్ద బాంబు దాడి చేసిన ఘటనలో 9 మంది పోలీసులు గాయపడ్డారు. జనవరి 27 - (జార్ఘండ్) పాలము వద్ద కాన్వాయ్ వెళుతుండగా, ల్యాండ్ మైన్ పేలుడు ఘటనలో ఐదుగురు పోలీసులతో పాటు మొత్తం ఏడుగురు మరణించారు. మరో 8 మంది గాయపడ్డారు. మార్చి 30 - (చత్తీస్ గఢ్) దంతెవాడ సమీపంలో మావోయిస్టుల మందుపాతర పేలుడు ఘటనలో ఏడుగురు భద్రత సిబ్బంది మరణించారు. మే 22 - (మణిపూర్) పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ పాల్పడిన పేలుడు ఘటనలో అస్సోం రైఫిల్స్ కు చెందిన 29వ బెటాలియన్ లోని ఆరుగురు మరణించారు. నవంబర్ 19 - (అస్సోం) ఆర్మీ క్యాంపుపై ఉల్ఫా మిలిటెంట్లు పేల్చిన ఐఈడీ ఘటనలో ముగ్గురు సైనికులు నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఎన్బీడీసీ గణాంకాల ప్రకారం గత పదేళ్ల కాలంలో (2007-2016) మధ్య కాలంలో సగటున 277 పేలుఘటనలు చోటుచేసుకోగా, అందులో 223 మంది మరణించగా, 724 మంది గాయపడ్డారు. - హిజ్బుల్ ముజాహిదీన్ కు చెందిన బుర్హన్ వని మరణం తర్వాత జమ్మూ కశ్మీర్ లో ఈ ఘటనలు పెరిగాయి - గతేడాదితో పోల్చితే ఈశాన్య రాష్ట్రాల్లో ముఖ్యంగా మణిపూర్ (40), అసోం (11) సంఘటనల్లో 15 శాతం పెరిగాయి. - మొత్తం ఘటనల్లో వామపక్ష తీవ్రవాద ప్రభావం ఉన్న ప్రాంతాల్లో 47శాతం చోటుచేసుకున్నాయి. - దేశంలోని మిగతా ప్రాంతాలను పరిశీలిస్తే కేరళ (33), తమిళనాడు (32)ల్లో అధికంగా నమోదయ్యాయి. ప్రపంచంలోనే అతి పెద్ద బాంబు పేలుడు ఘటన ఇప్పటివరకు జరిగిన ఘటనల్లో 2016 లో సిరియాలో జరిగిందే అతిపెద్దది. సిరియాలోని మెడిటెర్రెనియన్ తీరంలో ఉన్న జబ్లే, టార్టోస్ ల్లో మే 23 న ఐఎస్ తీవ్రవాదులు రెండు కార్లలో బాంబులు అమర్చి తమకు తాముగా ఆత్మాహుతికి పాల్పడటం ద్వారా పేల్చిన ఘటనలో 150 మంది మరణించగా, 200కు పైగా గాయపడ్డారు. ప్రపంచంలో తీవ్రమైన ఘటనలు లిబియా - జనవరి 7, తీవ్రవాదులు బాంబులు పెట్టి ఒక లారీనీ పేల్చిన ఘటనలో 60 మంది పోలీసు అధికారులు బలికాగా, ఇందులో 127 మంది గాయపడ్డారు. ఇరాక్ - ఫిబ్రవరి 28, సదర్ మార్కెట్ ప్రాంతంలో ఆత్మాహుతి దాడిలో 70 మంది ప్రాణాలు కోల్పోగా వంద మందికిపైగా గాయపడ్డారు. పాకిస్తాన్ - మార్చి 27, గుల్షన్ ఏ ఇక్బాల్ పార్క్ వద్ద జరిగిన ఆత్మాహుతి దాడిలో 72 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో 300లకుపైగా గాయాలపాలయ్యారు. ఇరాక్ - మే 11, జరిగిన కారు బాంబు పేలుడు ఘటనలో 64 మందిని పొట్టనపెట్టుకోగా 87 మంది గాయపడ్డారు. ఇరాక్ - జూలై 3, కరడా జిల్లాలో ఆత్మాహుతి దాడిలో 115 మంది మృత్యువాత పడ్డారు. ఇందులో 200 మందికిపైగా గాయపడ్డారు. ఇరాక్ - నవంబర్ 24, ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు పాల్పడిన పేలుడు ఘటనలో వంద మంది షియా పర్యాటకులు మరణించారు. ప్రపంచ వ్యాప్తంగా అదే తీరు తీవ్రవాదులు ప్రజా సమూహాల్లోనే ఎక్కువగా బాంబులు పెడుతున్నారు. గతేడాది జరిగిన ఇలాంటి ఘటనల్లో 73శాతం ప్రజలు ఎక్కువగా గుమిగూడే ప్రాంతాలను టార్గెట్ చేసుకోగా ఆ తర్వాత తీవ్రవాదులు సంచరించే ప్రాంతాల్లో రెండో టార్గెట్ భద్రతా బలగాలు. తాజాగా గురువారం పాకిస్తాన్ సింధ్ రాష్ట్రంలోని సెహ్వాన్ పట్టణంలో ఐసిస్ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడిలో 70మంది మరణించగా 160 మందికి పైగా గాయపడ్డారు. మరోవైపు అదే రోజు ఇరాక్ రాజధాని బాగ్దాద్ లో కారు బాంబు పేలుడులో 51 మంది మృత్యువాత పడగా 60మందికి పైగా గాయపడ్డారు. -
ఎర్రకోటలో పేలుడు పదార్థాలు
న్యూఢిల్లీ: ఎర్రకోటలోని ఓ బావిలో మందుగుండు సామగ్రి, పేలుడు పదార్థాలు కనిపించడం కలకలం రేపింది. ఎర్రకోటలోని పబ్లికేషన్ భవనం వెనుక ఉన్న ఓ బావిని శనివారం సిబ్బంది శుభ్రం చేస్తుండగా ఐదు మోర్టార్లు, 44 ఉపయోగించని, 87 ఉపయోగించిన బుల్లెట్లు దొరికాయి. వెంటనే పోలీసులకు, ఎన్ ఎస్జీకి సమాచారం అందించారు. ఆ ప్రాంతాన్ని పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నాక ఎన్ ఎస్జీ సిబ్బంది బాంబులను నిర్వీర్యం చేసే నిపుణులతో అక్కడికి చేరుకున్నారు. అవి ప్రభుత్వానికి చెందినవే అయ్యుంటాయని భావిస్తున్నారు. -
బస్సులో పేలుడు పదార్థాల పట్టివేత
రాయచూరు రూరల్: కర్ణాటకలోని రాయచూరు జిల్లా కేంద్రం సమీపంలో శక్తినగర్ వద్ద ఆర్టీసీ బస్సులో పేలుడు పదార్థాలు లభ్యం కావడం కలకలం రేపింది. జిల్లా ఎస్పీ చేతన్ సింగ్ రాథోడ్ శనివారం మీడియాకు వివరాలను వెల్లడించారు. హైదరాబాద్ నుంచి రాయచూరుకు వస్తున్న కర్ణాటక ఆర్టీసీ బస్సులో బాంబుల తయారీకి వినియోగించే పేలుడు వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. బస్సులో రూ.2 వేల నోట్లు తరలిస్తున్నారని అజ్ఞాత వ్యక్తి నుంచి రాయచూరు పోలీసులకు సమాచారం అందిందని, దీంతో శుక్రవారం రాత్రి 10 గంటలకు శక్తినగర్ వద్ద బస్సును తనిఖీ చేయగా చివరి సీటులో పేలుడు సామగ్రి ఉందన్నారు. హైదరాబాద్ నుంచి 53 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఈ బస్సులో ఇద్దరు మహబూబ్‌నగర్‌లో దిగినట్లు కండక్టర్ తెలిపారన్నారు. -
కరీంనగర్లో బాంబుల కలకలం
కరీంనగర్: జిల్లా కేంద్రంలో మంగళవారం బాంబుల కలకలం రేగింది. కరీంనగర్ నడిబొడ్డులోని జ్యోతినగర్‌లో గల ఓ గ్రౌండ్లో మంగళవారం ఉదయం మున్సిపాలిటీ సిబ్బందికి చెత్తతీసే సమయంలో రెండు గ్రెనేడ్లు కనిపించాయి. ఈ విషయాన్నిసిబ్బంది పోలీసులకు తెలియజేశారు. సంఘటనాస్థలానికి బాంబ్ స్క్వాడ్‌తో చేరుకున్న పోలీసులు తనిఖీలు నిర్వహించి రెండు గ్రెనేడ్లను స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఏమైనా పేలుడు పదార్ధాలు ఉన్నాయా అనే అనుమానంతో ఆ ప్రాంతంలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. -
రైల్వే స్టేషన్లో బాంబుల బ్యాగులు
జైపూర్: రాజస్థాన్‌లో బాంబుల బ్యాగులు కలకలం సృష్టించాయి. కోటా సిటీలోని రైల్వే స్టేషన్‌లోని ఓ ప్లాట్‌ఫాంపై అనుమానాస్పదంగా రెండు బ్యాగులను గుర్తించారు. దీంతో వాటిని తనిఖీ చేయగా పేలుడు పదార్థాలు ఉన్నాయి. 'కోటా సిటీలోని రైల్వే ప్లాట్‌ఫాం నెంబర్ 1పై దొరికిన రెండు బ్యాగుల్లో 2.75కేజీల పేలుడు పదార్థాలు, విద్యుత్ తీగలు, డిటోనేటర్లు లభించాయి' అని అక్కడి పోలీసులు తెలిపారు. పేలుడు పదార్థాలు, డిటోనేటర్లు రెండు వేర్వేరు బ్యాగుల్లో పెట్టినట్లు పోలీసులు చెప్పారు. మంగళవారం సాయంత్ర 4.30గంటల ప్రాంతంలో వీటిని గుర్తించినట్లు వెల్లడించారు. అయితే, ఆ పేలుడు పదార్థాలు ఎలాంటివి అనే విషయంలో వివరణ మాత్రం ఇవ్వలేదు. శరవేగంగా బాంబ్ స్క్వాడ్ టీం స్పందించడంతో ఎలాంటి ప్రమాద ఘటన చోటుచేసుకోలేదు. ఢిల్లీ, ముంబయి వంటి సుదూర ప్రయాణాలు చేసేందుకు రాజస్థాన్‌లో ఇదే ప్రముఖ రైల్వే స్టేషన్. -
బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు
అక్రమంగా బాణాసంచా తయారి చేస్తున్న ఇంట్లో పేలుడు సంభివించింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ సంఘటన నల్లగొండ జిల్లా నేరేడుచర్లలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికంగా ఓ ఇంట్లో పెద్ద శబ్ధంతో కూడిన పేలుడు సంభవించడంతో.. స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. షాక్‌లో నుంచి తేరుకునే లోపే ఓ ఇంట్లో భారీ ఎత్తున మంటలు రావడాన్ని గుర్తించిన స్థానికులు అందులో ఉన్న ముగ్గురిని మిర్యాలగూడ ఆస్పత్రికి తరలించారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. -
సీఎం పర్యటన వేళ.. పేలుడు పదార్థాల కలకలం!
- మహ్మదాబాద్‌లో భారీస్థాయిలో స్వాధీనం - పోలీసుల దాడిలో లభ్యమైన పేలుడు పదార్థాలు - శుక్రవారం చౌటుప్పల్‌లో కేసీఆర్ పర్యటన సంస్థాన్ నారాయణపురం : నల్లగొండ జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం గుజ్జ గ్రామంలో 3 రోజుల క్రితం వాల్‌పోస్టర్ల కలకలం మరువక ముందే మహ్మదాబాద్ గ్రామపరిధిలోని దుబ్బళ్ల గ్రామంలో పెద్దఎత్తున లభ్యమైన పేలుడు పదార్థాలు కలకలం సృష్టించాయి. అజ్ఞాత వ్యక్తి సమాచారం మేరకు ఎస్సై పి.అశోక్‌కుమార్ నేతృత్వంలో బుధవారం రాత్రి దుబ్బళ్లలో మల్లెపల్లి లకా్ష్మరెడ్డి కోళ్లఫారమ్పై దాడులు నిర్వహించారు. అరగంట అయితే వేరే ప్రాంతానికి తరలిపోయే ఈ పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చిట్యాల మండలం వెలిమినేడు, నార్కట్‌పల్లి మండలాల్లో ఉన్న ఐడియల్ ఎక్స్‌ప్లోజివ్ కంపెనీకి చెందిన పేలుడు పదార్థాలు లభ్యమైనట్లు, జూన్ 29న ఇవి వెలిమినేడు నుంచి దుబ్బళ్లకి చేరినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఎలక్ట్రానిక్ డిటోనేటర్స్ ఐడియల్ కంపెనీవి 500, గల్ఫ్ కంపెనీవి 1,915, ఈడీ కనెక్టర్స్ 400, డిటోనేటర్స్ కనెక్టర్స్ 2000, ఐడియల్ పవర్‌జెల్ 7 కాటన్లు(1482 ప్యాకెట్లు), డిటోనేటర్ ఫ్యూజ్ వైర్లు 4 బండిళ్లు(ఒక్కొక్కటీ 375 సెం.మీ.), అమ్మోనియం నైట్రేట్ 350 కిలోలను (7 బస్తాలు) స్వాధీనం చేసుకుని నారాయణపురం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఐడియల్ కంపెనీ యజమాని ఎలిమినేటి శ్రీనివాస్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగతా వారు పరారీలో ఉన్నారు. శ్రీనివాస్‌రెడ్డిపై చిట్యాల, సైబర్‌బాద్‌లో కూడా కేసులు నమోదయ్యాయి. గ్రామంలో పేలుడు పదార్థాల్ని అక్రమంగా నిల్వ ఉంచడం, అక్రమ తరలింపు వంటి ఆరోపణలపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. వీటిని సురక్షితంగా ఉంచడానికి వెలిమినేడుకు తరలించారు. సీఎం పర్యటనకు ఏమైనా లింకుందా? హరితహారంలో భాగంగా శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్ చౌటుప్పల్ పర్యటన నేపథ్యంలో.. ఈ పేలుడు పదార్థాలు దొరకడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం పర్యటనకు ఈ పేలుడు పదార్థాలకు ఏమైనా లింకు ఉందా?.. 3 రోజుల క్రితం గుజ్జ గ్రామంలో ఆర్ఎన్వై పేరుతో వాల్‌పోస్టర్లు వెలిసిన విషయం తెలిసిందే. ఈ సంఘటనకు, గుజ్జ సంఘటనకు 4 రోజుల తేడా ఉండడం, ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా చోటు చేసుకున్న పరిణామాలు అనుమానాస్పదంగా మారాయి. కాగా., రాళ్లు పగలకొట్టడానికి వ్యాపారం నిమిత్తం అమ్మకాలు చేస్తున్నారని పోలీసులు అంటున్నారు. దాడుల్లో ట్రైనీ ఎస్ఐలు బీ.కుమారస్వామి, నరసింహ, ఏఎస్ఐలు శివాజీరెడ్డి, వెంకట్‌రెడ్డి, శ్రీనివాస్, పాండు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
పేలుడు పదార్థాలు స్వాధీనం
అనుమతులు లేని వెంచర్లో అక్రమంగా డిటోనేటర్స్‌తో పేలుళ్లు జరుపుతుండటాన్ని గుర్తించిన ఎస్వోటీ పోలీసులు భారీగా చేసుకున్నారు. నగరంలోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని చెంగిచర్లలో అనుమతి లేని వెంచర్లో అక్రమంగా పేలుళ్లు జరుపుంతుండటంతో.. గురువారం రాత్రి పోలీసులు దాడులు నిర్వహించారు. పేలుళ్లు నిర్విహ స్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 28 డిటోనేటర్స్, 50 కేజీల క్యాల్షియం హైడ్రాక్సైడ్‌ను స్వాధీనం చేసుకున్నారు. -
భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం
రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం తారమతిపేట ఔటర్ రింగ్‌రోడ్డు సమీపంలో భారీ ఎత్తున పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. గుట్టు చప్పుడు కాకుండా పేలుడు పదార్థాలను తరలిస్తున్న నలుగురు వ్యక్తులను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 18 వందల జెలిటిన్ స్టిక్స్, 16 వందల డిటోనేటర్లతో పాటు రూ. 1.43 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. -
ఉగ్రదాడి.. ఇద్దరు ఎంపీలు సహా 15 మంది మృతి
మొగాదీషు : సోమాలియా రాజధాని మొగాదీషు నగరంలోని ఓ హోటల్ పై తీవ్రవాదులు బుధవారం సాయంత్రం బాంబు దాడులుకు తెగబడ్డారు. ఈ ఘటనలో కనీసం 15 మంది మృతిచెందగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. కొందరు సాయుధులు బాంబు దాడి చేయడంతో పాటు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. మృతులలో ఇద్దరు పార్లమెంట్ సభ్యులు ఉన్నారని సోమాలియా అధికారులు గురువారం ప్రకటించారు. కాల్పులు జరిగిన తర్వాత హోటల్ తాత్కాలికంగా మూసివేసిన అధికారులు గురువారం కూడా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. హోటల్ కొందరు కాల్పులు జరపగా, మరొందరు దుండుగులు హోటల్ ముందు ఉన్న స్థానికులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. హోటల్ ముందు బాంబు దాడి జరిగినట్లు తెలుస్తోంది. తొమ్మిది మృతదేహాలను అక్కడి నుంచి తరలించామని, ప్రస్తుతం అక్కడ దుండుగులు ఉండే అవకాశాలున్నాయని పోలీసులు అనుమానాలు వ్యక్తంచేశారు. అయితే ఈ ఘటనకు పాల్పడ్డ ముగ్గురు సాయుధులను మట్టుపెట్టినట్లు ఓ అధికారి చెప్పారు. ప్రభుత్వ అధికారులు, మంత్రులు, ఇతర రాజకీయ నాయకులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగిందని అభిప్రాయపడుతున్నారు. ఈ ఉగ్రదాడికి తామే బాధ్యులమని ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ అల్-షబాబ్ ప్రకటించింది. -
ఆర్టీసీ బస్టాండ్‌లో సూట్‌కేసు కలకలం
వైఎస్సార్ జిల్లా రాజంపేట ఆర్టీసీ బస్టాండ్‌లో ఆదివారం ఓ సూట్‌కేసు కలకలం రేపింది. తెల్లవారుజామున ఎవరో ఓ సూట్ కేసును విడిచి వెళ్లడంతో అందులో ఏముందోనన్న భయంతో ప్రయాణికులు హడలిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సూట్‌కేసును స్వాధీనం చేసుకున్నారు. అందులో ఎలాంటి పేలుడు పదార్థాలు లేకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. -
సెకన్లలో విస్ఫోటకాలను గుర్తించవచ్చు!
బోస్టన్: అతి తక్కువ సమయంలో విస్ఫోటక పదార్థాలను గుర్తించేందుకు శాస్త్రవేత్తలు ఒక కొత్త పద్ధతిని కనుగొన్నారు. ఈ కొత్త టెరాహెడ్జ్ స్పెక్ట్రోస్కోపీ విధానం ద్వారా 100 మైక్రో సెకండ్ల వ్యవధిలోపే పేలుడు పదార్థాలను గుర్తించవచ్చు. ఈ విధానాన్ని అమెరికాలో ని మాసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇదివరకు ఉపయోగించిన విధానం ద్వారా పేలుడు పదార్థాలను గుర్తించేందుకు 15 నుంచి 30 నిమిషాల సమయం పట్టేది. కానీ ప్రస్తుత టెరాహెడ్జ్ స్పెక్ట్రోస్కోపీ విధా నం ద్వారా క్వాంటమ్ కాస్కేడ్ లేజర్ (అర్ధవాహక లేజర్)ను ఉపయోగించి సెక ండ్ల వ్యవధిలో విస్ఫోటాలను కనుగొనవచ్చు. ఇది కంప్యూటర్ చిప్ పరిమాణంలో ఉండడం మరింత కలిసొచ్చే అంశం. -
తుంగతుర్తిలో పేలుడు పదార్ధాలు స్వాధీనం
తుంగతుర్తి మండలం గొట్టిపర్తి, రావులపల్లిలో పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. అక్రమంగా నిల్వ ఉంచిన 858 జెలెటిన్ స్టిక్స్, 915 ఎలక్ట్రానిక్ డిటోనేటర్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వరంగల్ జిల్లా పాలకుర్తి నుంచి సరఫరా జరిగినట్లు సమాచారం. -
కొల్లాంలో మళ్లీ కలకలం
కొల్లాం: పుట్టింగళ్ ఆలయంలో చోటుచేసుకున్న పెను విషాదం నుంచి కోలుకోకముందే కొల్లాంలో మళ్లీ కలకలం చెలరేగింది. బాణాసంచా పేలి 106 మంది ప్రాణాలు కోల్పోయిన కాళికాదేవి ఆలయానికి అతి సమీపంలో మూడు గుర్తుతెలియని కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటి నిండా భారీగా పేలుడు పదార్థాలు నింపిఉండటంతో అధికారులతోపాటు ప్రజల్లోనూ కలవరం మొదలైంది. ఈ కార్లు ఎవరివి? పేలుడు పదార్థాల ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? వాటిని ఆలయంలో జరిగే వేడుకల కోసం తెచ్చారా? లేక సంఘవిద్రోహుల పనా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ కొల్లాంకు వచ్చినప్పుడు కూడా ఆ కార్లు అక్కడే ఉన్నాయా? లేక ఆ తరువాత తీసుకొచ్చి నిలిపారా అనే విషయాలు కూడా ఇంకా వెల్లడికావాల్సి ఉంది. సంఘటనా స్థలానికి చేరుకున్న బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ కార్లలోని పేలుడు పదార్థాలను జాగ్రత్తగా వెలికి తీసేప్రయత్నం చేస్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున బాణాసంచా కాల్చే వేడుకలో చెలరేగిన భారీ పేలుడు కారణంగా 106 మంది మరణించిన సంగతి తెలిసిందే. దాదాపు 400 మంది క్షతగాత్రులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పేలుడు సమయంలో ఆలయంలో 15 వేల మంది భక్తులు ఉన్నారు. ఇదిలా ఉంటే కేరళలోని అన్ని ఆలయాల్లో బాణాసంచా కాల్చడాన్నినిషేధించాలంటూ ఆందోళనలు మిన్నంటాయి. ఇప్పటికే దీనిపై పలువురు సామాజిక వేత్తలు, సంస్థలు కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఆలయాల్లో పటాకులను నిషేధించే విషయమై రేపు(మంగళవారం) కేరళ హైకోర్టులో వాదనలు ప్రారంభంకానున్నాయి. మరోవైపు ఆలయాల ధర్మకర్తల మండళ్లు మాత్రం పటాకుల వేడుకలను ఆపేదిలేదని ప్రకటించారు. ఉత్సవాల సందర్భంగా ఆలయాల్లో టపాకాయలు పేల్చడం ఏళ్లుగా వస్తోన్ ఆచారమని, ఎట్టిపరిస్థితుల్లో ఆపబోమని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రేపటి విచారణ ప్రాధాన్యం సంతరించుకుంది. -
చింటూ రిమాండు పొడిగింపు
చిత్తూరు (అర్బన్): అక్రమంగా పేలుడు పదార్థాలు కలిగి ఉన్నారనే ఆరోపణలపై కోర్టుకు హాజరైన చింటూకు రిమాండు గడువును పొడిగిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న చింటూకు సంబంధించి బంగారుపాళ్యం వద్ద ఉన్న క్వారీలో పేలుడు పదార్థాలు ఉన్నాయని అక్కడి పోలీసులు కేసు నమోదు చేయడం తెలిసిందే. విచారణలో భాగంగా మంగళవారం చింటూను పోలీసులు చిత్తూరులోని నాలుగో అదనపు మున్సిఫ్ మేజిస్ట్రేట్ న్యాయస్థానంలో హాజరు పరచగా, విచారణను ఈనెల 22కు వాయిదా వేస్తూ న్యాయమూర్తి యుగంధర్ ఆదేశాలు జారీ చేశారు. అనంతరం చింటూను కడప జైలుకు తరలించారు. -
వెయ్యికేజీల పేలుడు పదార్థాలు, 132 డిటోనేటర్లు
భోపాల్: మధ్యప్రదేశ్‌లో పోలీసులు భారీ ఎత్తున మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఒకటి కాదు రెండుకాదు ఏకంగా వెయ్యికేజీల పేలుడు పదార్థాలు గుర్తించి సీజ్ చేశారు. దీంతోపాటు 132 డిటోనేటర్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలోని సాగర్ జిల్లాలో పోలీసులు వీటిని గుర్తించారు. దీనికి సంబంధించి ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారిని ప్రస్తుతం ప్రశ్నిస్తున్నారు. -
పేలుడు పదార్థాలు స్వాధీనం
మోమిన్‌పేట్ (రంగారెడ్డి) : రంగారెడ్డి జిల్లా మోమిన్‌పేట్‌లోని ఓ ఇంట్లో నిల్వ ఉంచిన 300 డిటోనేటర్లు, 300 జిలెటిన్ స్టిక్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 25న రోడ్డు పక్కన గుంటలు తీస్తున్నవారి వద్ద కొన్ని డిటోనేటర్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని విచారించగా.. పూర్తి వివరాలు బయటపడ్డాయి. పేలుడు పదార్థాలను నిల్వ ఉంచిన నలుగురు నిందితులను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. -
పేలుడు పదార్థాలు స్వాధీనం
వెల్దుర్తి (కర్నూలు) : వాహన తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు ఓ వాహనంలో తరలిస్తున్న పేలుడు పదార్థాలను గుర్తించి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో శుక్రవారం వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఓ ట్రాక్టర్లో తరలిస్తున్న 225 జిలెటిన్‌స్టిక్స్, 400 ఎలక్ట్రికల్ పరికరాలు, 15 కిలోల అమ్మోనియంను గుర్తించారు. దీంతో వాటిని స్వాధీనం చేసుకుని ట్రాక్టర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మైనింగ్‌కు ఉపయోగించడం కోసం ఎటువంటి అనుమతులు లేకుండా నల్లగొండ నర్సయ్య అనే వ్యక్తి వీటిని తరలిస్తున్నాడని తెలిసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
భారీగా పేలుడు పదార్ధాలు స్వాధీనం
-
భారీగా పేలుడు పదార్ధాలు స్వాధీనం
కర్నూలు జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో పోలీసులు శనివారం భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం సిద్ధాపురం ప్రాంతంలో తనిఖీలు నిర్వహించిన పోలీసులు ఓ వాహనంలో భారీగా పేలుడు పదార్థాలను కనుగొన్నారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసిన పోలీసులు 1260 జిలిటిన్ స్టిక్స్, 1650 డిటోనేటర్లతో పాటు.. 150 కిలోల అమ్మోనియం నైట్రేట్ ని స్వాధీనం చేసుకున్నారు. పేలుడు పదార్థాలను తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా.. ఈ పేలుడు పదార్థాలు ఎవరివి.. ఎక్కడికి తరలిస్తున్నారు అనే కోణంలో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. -
మందుగుండు పేలి నలుగురికి తీవ్ర గాయాలు
శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండల కేంద్రంలో ఓ ఇంట్లో మందుగుండు సామగ్రి తయారు చేస్తుండగా భారీ పేలుడు జరిగింది. కూరాసుల వీధిలో శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స కోసం వారిని పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఇద్దరికి 70 శాతం కాలిన గాయాలు కాగా, మరో ఇద్దరికి 40 శాతం కాలిన గాయాలు అయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం జిల్లా ఆస్పత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
భారీగా మందుగుండు సామాగ్రి స్వాధీనం
శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం కొత్తూరుపేట గ్రామ సమీపంలో భారీగా మందుగుండు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాదీనం చేసుకున్న వాటిలో 2000 జిలెటిన్ స్టిక్స్, 1300 డిటోనెటర్స్ తో పాటు ఫ్యూజ్ వైర్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి ఎవరినీ అరెస్టు చేయలేదు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
పేలుడు పదార్థాలు స్వాధీనం
నగరంలోని టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక ఫోటోస్టుడియోపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం సాయంత్రం దాడిచేసి భారీగా మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్టూడియోపై దాడిచేశారు. స్టుడియో యజమాని రెడ్డి సన్యాసినాయుడును అరెస్ట్‌చేశారు. మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థం విలువ లక్ష రూపాయలు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. -
మందుగుండు సామాగ్రి స్వాధీనం
శ్రీకాకుళం జిల్లా పాలకొండలో అక్రమంగా నిల్వచేసిన రూ.70 వేలు విలువచేసే మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారంతో పాలకొండ పోలీసులు పట్టణంలోని ఒక ఇంటిపై శనివారం సాయంత్రం దాడిచేసి మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకుని , ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ పేలుడు పదార్థాలు ఎందుకు నిల్వ చేశారు.. ఎవరికి చేర వేస్తున్నారు అనే అశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. -
భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం
కరీంనగర్ జిల్లా ధర్మపురిలో భారీగా పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ధర్మపురి శివారులోని ఇద్దరు కార్మికుల ఇళ్లపై పోలీసులు శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో దాడి చేశారు. వారిళ్లల్లో నిల్వ ఉంచిన 1319 జెలిటిన్ స్టిక్స్, 1002 డిటోనేటర్లు స్వాధీనం చేసుకున్నారు. కంచెం మైసయ్య, పురాణి మల్లేశం అనే వ్యక్తులపై కేసు నమోదు చేశారు. ఈ పేలుడు పదార్థాలను రాళ్లు పగులగొట్టేందుకు వాడుతున్నట్టు తెలిసింది. -
భారీ పేలుడు.. 90 మంది బలి
మధ్యప్రదేశ్‌లో ఘోర దుర్ఘటన.. 100 మందికి పైగా గాయాలు.. బావి తవ్వకాల కోసం ఇంట్లో నిల్వ చేసిన పేలుడు పదార్థాలు విస్ఫోటనంతో జనసమ్మర్ద ప్రాంతంలో కుప్పకూలిన 2 భవనాలు మృతుల్లో అత్యధికులు కూలి పని కోసం నిరీక్షిస్తున్న కూలీలే ఝబువా (మధ్యప్రదేశ్): బావుల తవ్వకాల కోసం భారీ స్థాయిలో నిల్వ చేసిన పేలుడు పదార్థాలు పేలిపోవటంతో మధ్యప్రదేశ్‌లోని ఝబువా జిల్లా పెట్లావద్ పట్టణంలో 90 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 100 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో చాలా మంది కూలి పని కోసం నిరీక్షిస్తున్న కూలీలే. రాతి ప్రాంతాల్లో బావులు తవ్వేందుకు లెసైన్స్ కలిగివున్న రాజేంద్ర కసావా అనే వ్యక్తి తన నివాస భవనంలో భారీ స్థాయిలో పేలుడు పదార్థాలు, జిలెటిన్ స్టిక్‌లను నిల్వ ఉంచాడు. రెండు దుకాణాలు కూడా ఉన్న ఈ రెండంతస్తుల భవనం పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద రద్దీ ప్రాంతంలో ఉంది. దీనికి ఆనుకుని చాలా రద్దీగా ఉండే మూడంతస్తుల సెథియా రెస్టారెంట్ కూడా ఉంది. శనివారం ఉదయం 8:30 గంటలకు రాజేంద్ర భవనంలో పేలుడు పదార్థాలు ఒక్కసారిగా పేలిపోయాయి. దీంతో ఆ భవనం కుప్పకూలింది. దానికి ఆనుకుని ఉన్న రెస్టారెంట్ కూడా ధ్వంసమయింది. ఆ సమయంలో రెస్టారెంట్లో పెద్ద సంఖ్యలో వినియోగదారులు ఉన్నారని, సమీపంలో రోజు కూలీలు కూడా చాలా మంది కూర్చుని ఉన్నారని స్థానిక పోలీసు అధికారులు తెలిపారు. మొత్తం 90 మంది మృతిచెందగా వారిలో ఎక్కువ మంది రెస్టారెంట్ సమీపంలో కూలిపని కోసం నిరీక్షిస్తున్న రోజు కూలీలేనని అధికారులు తెలిపారు. అలాగే.. గుజరాత్ వెళ్లేందుకు ప్రయాణమై రెస్టారెంట్ వద్ద టీ, టిఫిన్లు చేయటానికి నిలుచుని వున్న మరికొందరు కూడా ప్రాణాలు కోల్పోయారు. మొదట టపాసుల పేలుళ్ల చప్పుళ్లు... ‘కింది అంతస్తులో రెండు దుకాణాలు కూడా ఉన్న ఆ భవనం నుంచి మొదట టపాసులు పేలిన చప్పుళ్లు వినవచ్చాయి. తర్వాత ఎవరో ఒక షాపు షట్టరు తెరిచారు. దీంతో భారీ విస్ఫోటనం సంభవించింది. జనం ప్రాణాలు దక్కించుకోవటానికి పరుగులు తీశారు. అలా పారిపోయిన వారే ప్రాణాలతో బయటపడ్డారు. వారికి కూడా గాయాలయ్యాయి’’ అని బలరామ్ అనే కూలి తెలిపారు. ఆయన కూడా ఈ పేలుడులో గాయపడ్డారు. విస్ఫోటనంతో మనుషులు ముక్కలు చెక్కలయ్యారని.. శరీర భాగాలు ముక్కలుగా తెగి గాలిలోకి ఎగిరిపడటం చూశామని ఈ పేలుడు నుంచి గాయాలతో బయటపడ్డ నర్సింగ్ (42) అనే వ్యక్తి తెలిపాడు. ధ్వంసమైన రెండు భవనాల శిథిలాల్లో చాలా మంది చిక్కుకుపోయారని పేర్కొన్నాడు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు జిల్లా పోలీసు, రెవెన్యూ ఉన్నతాధికారులు, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అంతర్సింగ్ ఆర్యలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను ఝబువా జిల్లా ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టమ్ నిర్వహిస్తున్నారు. క్షతగాత్రులకు కూడా అదే ఆస్పత్రిలో చికిత్స చేస్తున్నారు. సహాయ చర్యల కోసం జాతీయ విపత్తు నిర్వహణ దళం (ఎన్డీఆర్ఎఫ్) బృందాన్ని పంపించారు. కుప్పకూలిన నిర్మాణాల శిథిలాలను తొలగించేందుకు గుజరాత్‌లోని వడోదర నుంచి మరొక బృందాన్ని తరలించారు. ఈ దుర్ఘటనపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించినట్లు రాష్ట్ర హోంమంత్రి బాబూలాల్‌గౌర్ తెలిపారు. పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం సంభవించటం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ తీవ్ర విచారం వ్యక్తంచేశారు. మృతిచెందిన వారి కుటుంబ సభ్యులకు రూ. 2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ. 50,000 చొప్పున పరిహారం ప్రకటించారు. ప్రధాని సంతాపం... మధ్యప్రదేశ్‌లో విస్ఫోటనంలో ప్రజలు మృతి చెందటం తనకు ఎంతో బాధ కలిగిస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్విటర్లో తీవ్ర విచారం వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలుపుతూ.. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ కూడా తీవ్ర సంతాపం తెలిపారు. -
పేలుడు పదార్థాలు కలిగి ఉన్న ఐదుగురు అరెస్ట్
మాచర్ల (గుంటూరు) : పేలుడు పదార్థాలు కలిగి ఉన్నారనే కారణంగా ఐదుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 1 తపంచా, 2 బుల్లెట్లు, 4 జిలిటిన్‌స్టిక్స్, 8 డిటోనేటర్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా మాచర్ల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది. స్థానికంగా నివాసముంటున్న దుర్గంపూడి వెంకటరామిరెడ్డి దగ్గర పనిచేస్తున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు. -
పేలుడు పదార్థాలతో వ్యక్తి హల్ చల్
పెర్త్: ఆస్ట్రేలియాలో ఓ వ్యక్తి కలకలం సృష్టిస్తున్నాడు. భారీ పేలుడు పదార్థాలు తన ఒంటికి చుట్టుకొని హల్ చల్ చేస్తూ చుట్టుపక్కలవారిని హడలెత్తిస్తున్నాడు. పోలీసుల సమాచారం మేరకు ఆస్ట్రేలియాకు నైరుతి వైపున్న బన్బర్రి పార్క్‌లో గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది. బాంబులు చుట్టుకొని వచ్చిన ఆ వ్యక్తి అక్కడే ఒకరిని బందీగా పట్టుకొని పేల్చేవేసుకుంటానంటూ బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు చుట్టుపక్కల వాళ్లు తెలిపారు. అయితే, అతడి డిమాండ్ ఏమిటనే విషయం కూడా చెప్పడం లేదని సమాచారం. ఘటన తెలుసుకున్న పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. నిర్బంధంలో ఉన్న వ్యక్తిని విడిపించడానికి చర్యలు ప్రారంభించారు. -
క్వారీలపై దాడి: పేలుడు పదార్థాలు స్వాధీనం
విశాఖపట్నం : విశాఖ జిల్లా రౌలుకుంట మండలంలోని నల్లరాతి క్వారీలపై పోలీసులు గురువారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. నిబంధనలకు వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహిస్తుందున ఈ దాడులు నిర్వహించారు. పాతంపేట క్వారీకి చెందిన రాజుల నాయుడును అదుపులోకి తీసుకున్నారు. మరో క్వారీకి చెందిన వ్యక్తి పరారయ్యాడు. ఈ రెండు క్వారీల నుంచి 70 జిలెటిన్ స్టిక్స్, 36 డిటోనేటర్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (రౌలుకుంట) -
ఖమ్మం జిల్లాలో భారీగా పేలుడు సామగ్రి పట్టివేత
ఖమ్మం : ఖమ్మం జిల్లాలో భారీగా పేలుడు సామగ్రిని పట్టుకున్నారు. ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లోని మావోయిస్టులకు చేరవేస్తున్న జిలిటెన్ స్టిక్స్, డిటోనేటర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కంకర లోడ్ టిప్పర్ అడుగు భాగంలో పేలుడు సామగ్రిని ఉంచి పాల్వంచ నుంచి మల్కన్‌గిరికి తీసుకెళ్తుండగా పట్టుకున్నారు. వీటి విలువ సుమారు రూ.1.92 ల క్షలు ఉంటుందని, నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని కొత్తగూడెం ఓఎస్డి జూవెల్ డేవిస్ వివరించారు. స్థానిక సీఐ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. జిలిటెన్ స్టిక్స్ అక్రమంగా రవాణా అవుతున్నట్లు పోలీసులకు గత 21న సమాచారం అందిందని, ఎంపీ బంజరు సమీపంలో మాటువేసి పట్టుకున్నామని చెప్పారు. 362 జిలిటెన్ స్టిక్స్, 12 బండిళ్ల డిటోనేటర్లు, (ఒక్కో బండిల్లో 25 చొప్పున) స్వాధీనం చేసుకుని లారీ డ్రైవర్ శంకర్ నారాయణ, క్లీనర్ సంతోష్ విశ్వకర్మను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. వారిని విచారించగా పాల్వంచ మండలం జగన్నాధపురం ప్రభావతి స్టోన్ క్రషర్స్ సూపర్ వైజర్ బండారి వీరన్న టిప్పర్‌లో ఎక్కించాడని తె లిపారని వెల్లడించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లికి చెందిన బొల్లం నాగేశ్వరరావు సరఫరా చేశాడని చెప్పడంతో అతడిని కూడా అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. పాల్వంచ టు మల్కన్‌గిరి... పాల్వంచకు చెందిన అమర్‌కుమార్ ఒడిశాలో కాంట్రాక్ట్ పనులు చేస్తున్నాడు. ఈ క్రమంలో అక్కడి మావోయిస్టులతో సంబంధాలు ఏర్పడటంతో వారికి పేలుడు పదార్థాలు సరఫరా చేసేందుకు మల్కన్ గిరికి రవాణా చేస్తున్నట్లు విచారణలో వెల్లడైందని ఓఎస్డీ తెలిపారు. అమర్ కుమార్ పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలిస్తున్నామని చెప్పారు. -
భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం
ఖమ్మం: జిల్లాలోని బూర్గంపహాడ్ మండలం మోరంపల్లి బంజర్ వద్ద శుక్రవారం భారీగా పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహన తనిఖీల్లో భాగంగా పోలీసులు సోదా చేయగా పది బాక్సుల్లో మొత్తం రెండు వేల జిలెటిన్ స్టిక్స్ లభ్యమయ్యాయి. వీటిని మావోయిస్టులకు చేరవేసేందుకు తీసుకెళ్తున్నట్లు అనుమానాలున్నాయని కొత్తగూడెం ఓఎస్డీ డేవిస్ తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. -
రైల్వేస్టేషన్లో పేలుడు పదార్థాలు లభ్యం
మట్టెవాడ(వరంగల్): వరంగల్ రైల్వే స్టేషన్లో బుధవారం సాయంత్రం పేలుడు పదార్థాలు ఉన్న బ్యాగ్‌ను పోలీసులు కనుగొన్నారు. నిన్న సాయంత్ర ఆరు గంటల సమయంలో రైల్వే స్టేషన్‌లోని బుకింగ్ కౌంటర్ సమీపంలో వదిలివేసిన బ్యాగ్‌లో 6 జిలెటిన్ స్టిక్స్, 25 డిటొనేటర్స్, రెండు ఎలక్ట్రికల్ వైర్లను గుర్తించారు. ఈ బ్యాగ్‌ను గుర్తుతెలియని వ్యక్తి వదిలి వెళ్లినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని రైల్వే పోలీసులు తెలిపారు. -
25 జిలెటిన్ బాక్సులు స్వాధీనం, ఇద్దరు అరెస్ట్
తిరుపతి: నగరి మండలం రామాపురంలో గురువారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. పేలుడు పదార్థాలు ఉన్నట్టు అందిన సమాచారం మేరకు ఓ ఇంట్లో సోదాలు జరిపారు. ఈ తనిఖీల్లో నిల్వ ఉంచిన 25 జిలెటిన్ బాక్సులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. -
రసాయనాలు పేలి ఇద్దరి దుర్మరణం
మరొకరికి తీవ్రగాయాలు, పరిస్థితి విషమం కరీంనగర్: కరీంనగర్ హౌసింగ్ బోర్డులోని ఓ ఇంట్లో శనివారం రాత్రి రసాయన పదార్థాలు పేలడంతో ఇద్దరు దుర్మరణం చెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. కర్నూలు జిల్లా కొడకండ్లకు చెందిన పెంటం నాగార్జునకుమార్(35), పెంటం శ్రీనివాస్‌కుమార్(34), మల్ల రామ కృష్ణారెడ్డి(42) హౌసింగ్‌బోర్డులోని ఓ ఇంట్లో రసాయన పదార్థాలతో బొమ్మలు చేస్తూ దుకాణాలకు సరఫరా చేస్తుండేవారు. శనివారం ఎప్పటిలాగే బొమ్మలు తయారు చేయగా.. మిగిలిన పదార్ధాలను ఇంటి సమీపంలో పారేశారు. అక్కడ మధ్యాహ్నం సమయంలో పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. కాగా ఎక్స్‌పెయిరీ డేట్ ముగిసిన హార్డినర్ పౌడర్‌లో నీళ్లు కలిపి పారబోసేద్దామని ఆదివారం శ్రీనివాస్ ప్రయత్నించగా అది పెద్ద శబ్దంతో పేలి మంటలు లేచాయి. ఈ ప్రమాదంలో నాగార్జునకుమార్, మల్ల రామకృష్ణారెడ్డి అక్కడిక్కడే మృతిచెందారు. శ్రీనివాస్ చేతులు తెగిపోయాయి. కాళ్లు ఇతర భాగాలు నుజ్జునుజ్జుయ్యాయి. పేలుడు ధాటికి గదిలోని కిటికీలు, తలుపులు దూరంగా ఎగిరిపడగా ఒక పక్క గోడ పూర్తిగా బద్దలైంది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పివేశారు. తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్‌కుమార్‌ను హైదారాబాద్‌కు తరలించారు. -
పాతబస్తీలో తీవ్ర ఘర్షణలు
-
హడలెత్తించిన పేలుడు
ఉలిక్కిపడిన పాతబస్తీ భారీ శబ్దంతో విస్ఫోటం.. మంటలు బెంబేలెత్తిన స్థానికులు నాటుబాంబుగా భావిస్తున్న పోలీసులు యాకుత్‌పురా, న్యూస్‌లైన్: పాతబస్తీలో పేలుడు ఘటన కలకలం రేపింది. మంగళవారం అర్ధరాత్రి భవానీనగర్ ఠాణా పరిధిలోని సాలెం చౌక్ 1వ నంబర్ గల్లీలో ఓ ఇంటి ముందు విద్యుత్ స్తంభం వద్ద భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. భారీగా మంటలు చెలరేగాయి. ఒక్క క్షణం బెంబేలెత్తిన స్థానికులు.. ఆపై తేరుకుని ఘటనా స్థలానికి భారీగా చేరుకున్నారు. గల్లీలోని ఓ గోడ పక్కన భారీ శబ్దంతో పేలుడు సంభవించినట్టు గుర్తించారు. పేలుడు అనంతరం మంటలు చెలరేగడంతో పక్కనే ఉండే ఇంటి గోడలతో పాటు ఓ ఇంటి పరదా, వంటసామగ్రి కాలిపోయాయి. అక్కడికి సమీపంలో ఇంటి ముందు తోపుడు బండిపై నిద్రిస్తున్న మహ్మద్ సల్మాన్ చేతికి స్వల్ప గాయమైంది. పోలీసులు, డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్‌లు ఘటన స్థలానికి చేరుకుని పేలుడు శకలాలను సేకరించాయి. పక్కనే ఉన్న రైల్వేట్రాక్ పరిసర ప్రాంతాల్లోనూ క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. గన్‌ఫౌడర్, మేకులు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఆధారాలను బట్టి పేలింది నాటుబాంబు అయి ఉండొచ్చనే నిర్ధారణకు వచ్చారు. గన్‌పౌడర్, మేకుల్ని పరీక్షల నిమిత్తం ఫొరెన్సిక్ ల్యాబ్‌కు తరలించారు. సాలెం చౌక్ ప్రాంతంలో నేరారోపణలు ఎదుర్కొంటూ గతంలో జైలుకు వెళ్లి వచ్చిన వారి వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. నగర అదనపు కమిషనర్(శాంతిభద్రతలు) అంజనీ కుమార్, అదనపు కమిషనర్ (సిట్ అండ్ క్రైమ్) సందీప్ శాండిల్యా, దక్షిణ మండల డీసీపీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, సీబీసీఐడీ ఎస్పీ రామ్మోహన్ రావు, నగర టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ లింబారెడ్డి, దక్షిణ మండలం అదనపు డీసీపీ బాబురావు ఘటన స్థలాన్ని సందర్శించారు. అకస్మాత్తుగా పేలుడు.. పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. అంతలోనే మంటలు చెలరేగాయి. ఎటు నుంచి వచ్చిందో, ఎవరూ వేశారో తెలియదు కానీ విద్యుత్ స్తంభం వద్ద పేలుడు పదార్థం పడి మంటలు చెలరేగడంతో మా ఇంట్లోని కర్టెన్ కాలిపోయింది. - అబ్దుల్, ప్రత్యక సాక్షి భయమేసింది.. అర్ధరాత్రి ఇంటి బయట కూర్చుండగా, పేలుడు సంభవించింది. మంటలు వ్యాపించడంతో భయంతో పారిపోయాను. మొదట ఎవరైనా యువకులు టపాసులు పేల్చారేమోనని భావించాను. కానీ, అక్కడ ఎవరూ లేరు. - షేక్ నబీ, స్థానికుడు -
కాశ్మీర్ లో ఎన్నికలపై దాడి చేసే కుట్ర భగ్నం
జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికలను భగ్నం చేసేందుకు, వోటు వేయాలనుకున్న ప్రజల్లో భయాందోళనలు సృష్టించేందుకు ఉగ్రవాదులు పన్నిన కుట్రను భద్రతాదళాలు విఫలం చేశాయి. జమ్మూ ప్రాంతంలోని డోడా జిల్లాలోని పూనేజా-భదర్వాహ్ ఏరియాలోని రంట్ సాకా అడవుల్లో ఉగ్రవాదులు దాచిపెట్టిన ఆయుధాలను పోలీసులు చేజిక్కించుకున్నారు. పోలీసులు రంట్ సాకా అడవుల్లోని కొండకోనల్లో భదానీ నాలా పక్కన దాదాపు 48 గంటల పాటు వెతికి, 8 కిలోల ఆర్డ డీ ఎక్స్, ఆరు ఆధునిక ఆయుధాలను, ఏడు గ్రెనేడ్లు, భారీ మొత్తంలో మందుగుండు సామగ్రిని, కమ్యూనికేషన్ పరికరాలు,పాకిస్తానీ కరెన్సీ, రెండు డిటోనేటర్లు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. స్థానిక ఉగ్రవాదుల సాయంతో విదేశీ ఉగ్రవాదులు ఈ స్థావరాన్ని నిర్మించారు. ఈ స్థావరం నుంచి ఉగ్రవాదులు ఎన్నికలను భగ్రం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఖచ్చితమైన సమాచారం లభించిన తరువాత భద్రతాదళాలు ఈ ఏరియాలో సోదాలు జరిపాయి. భదర్వాహ్ - డోడా ఉధమ్ పూర్ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ఈ నియోజకవర్గం నుంచి కేంద్ర మంత్రి, మాజీ ముఖ్యమంత్రి గులామ్ నబీ ఆజాద్ పోటీలో ఉన్నారు. -
మావోల కోట.. బస్తర్!
బస్తర్ (ఛత్తీస్‌గఢ్): బస్తర్.. నక్సలైట్ల కంచుకోట. వారి రెడ్ కారిడార్‌లో కీలక ప్రాంతం. మావోలు స్వేచ్ఛగా సంచరించగలిగే ఆదివాసీల గడ్డ. వారికి రక్షణ కల్పించేలా అడవులు, కొండలతో నిండిన నేల. దక్షిణ బస్తర్‌లోని 70 శాతం పూర్తిగా మావోల అధీనంలోనే ఉంది. సుక్మా, అబూజ్‌మఢ్, కాంకేర్, నారాయణపూర్.. తదితర ప్రాంతాల్లోనూ భద్రతా బలగాలు చేరగలిగే ప్రాంతాలు దాదాపు శూన్యం. అదీకాక స్థానిక గిరిజనుల్లో మావోలకు మంచి పట్టుంది. అటవీ అధికారులతో చేతులు కలిపి కాంట్రాక్టర్లు ఆదివాసీలతో వెట్టిచాకిరీ చేయిస్తున్న సమయంలో.. వారి బారినుంచి గిరిజనులను మావోయిస్టులు కాపాడారు. స్థానిక భూస్వాముల నుంచి భూములను లాక్కొని భూమిలేని ఆదివాసీలకు పంచిపెట్టారు. బీడీ ఆకులు సేకరించే గిరిజనులకు కనీస వేతనాల కోసం పోరాడుతున్నారు. వారు స్థానికుల్లో ఒకరుగా ప్రవర్తిస్తారు. ఈ కారణాలతో స్థానికులు మావోలకు బాగా దగ్గరయ్యారు. అంతేకాకుండా, ఎదిరించిన వారిని చంపేస్తారన్న భయం కూడా స్థానిక గిరిజనుల్లో ఉంటుంది. ఇప్పటికే ఎన్నికల బహిష్కరణకు మావోయిస్టులు పిలుపునిచ్చారు. ‘ఓటేస్తే చేతులు నరికేస్తామని నక్సలైట్లు బెదిరిస్తున్నారు కాబట్టి ఓటేసిన తరువాత వేలిపై చుక్క పెట్టకపోతేనే ఓటేస్తా’మని స్థానికులు అధికారులకు విన్నవించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బస్తర్‌లో నేటి తొలివిడత ఎన్నికలు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. సోమవారం ఎన్నికలు జరగనున్న 18 స్థానాల్లో 12 ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. నేపాల్ నుంచి నక్సలైట్లు: మావోయిస్టులు పోలింగ్ రోజు ఇక్కడ భారీ దాడులకు దిగే సన్నాహకాల్లో ఉన్నారని నిఘావర్గాలు ఇప్పటికే హెచ్చరించాయి. మావోయిస్టుల దళపతి గణపతి బస్తర్ డివిజన్లోని అబూజ్‌మఢ్‌లో మకాం వేసి దాడుల కోసం కేడర్‌ను సిద్ధం చేశారని తెలిపాయి. దాడుల కోసం నేపాల్ సహా పలు ప్రాంతాల నుంచి నక్సలైట్లు అబూజ్‌మఢ్ చేరుకున్నారని వెల్లడించాయి.