నగరంలోని టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక ఫోటోస్టుడియోపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం సాయంత్రం దాడిచేసి భారీగా మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
నగరంలోని టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక ఫోటోస్టుడియోపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం సాయంత్రం దాడిచేసి భారీగా మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్టూడియోపై దాడిచేశారు. స్టుడియో యజమాని రెడ్డి సన్యాసినాయుడును అరెస్ట్‌చేశారు. మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థం విలువ లక్ష రూపాయలు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.