అనంతగిరి మండలంలో పోలీసులు జరిపిన వాహన తనిఖీల్లో బుధవారం 500 కేజీల గంజాయి పట్టుబడింది.
అనంతగిరి మండలంలో పోలీసులు జరిపిన వాహన తనిఖీల్లో బుధవారం 500 కేజీల గంజాయి పట్టుబడింది. ఓ మినీ వ్యాన్‌లో గంజాయి తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించి ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.