కిడ్నీ రాకెట్‌పై సర్కారు సీరియస్‌ | The government is serious about the kidney racket | Sakshi
Sakshi News home page

కిడ్నీ రాకెట్‌పై సర్కారు సీరియస్‌

Published Fri, Apr 28 2023 3:59 AM | Last Updated on Fri, Apr 28 2023 9:25 AM

The government is serious about the kidney racket - Sakshi

మహారాణిపేట/సింహాచలం: విశాఖపట్నంలో కిడ్నీ రాకెట్‌ వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని వైద్య, ఆరోగ్య శాఖను ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా అధికారులు ఈ ఉదంతంపై విచారణ వేగవంతం చేశారు. దీనిపై జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతోపాటు పోలీసులు కూడా సమగ్ర దర్యాప్తు చేపట్టారు.

పెందుర్తిలో కిడ్నీ మార్పిడి చేసిన తిరుమల ఆస్పత్రిపై జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ, జీవన్‌దాన్‌ అధికారులు, పోలీసులు దాడులు నిర్వహించారు. డబ్బు ఆశ చూపించి గత ఏడాది డిసెంబర్‌ 16వ తేదీన మధురవాడ వాంబే కాలనీకి చెందిన జి.వినయ్‌కుమార్‌కు పెందుర్తి తిరుమల ఆస్పత్రిలో కిడ్నీ తీసుకున్న విషయం తెలిసిందే. ఒప్పందం ప్రకారం రూ.8.50 లక్షలు ఇవ్వకుండా కేవలం రూ.2.50 లక్షలు ఇవ్వడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.  

ఆస్పత్రికే అనుమతి లేదు 
కలెక్టర్‌ ఎ.మల్లికార్జున ఆదేశాల మేరకు పెందుర్తిలో కిడ్నీ మార్పిడి చేసిన తిరుమల ఆస్పత్రిపై డీఎంహెచ్‌వో పి.జగదీశ్వరరావు, జీవన్‌దాన్‌ కో–ఆర్డినేటర్‌ రాంబాబు, ఏసీపీ అన్నెపు న­రసింహమూర్తి సంయుక్తంగా దాడులు ని­ర్వ­హిం­చారు. ఆస్పత్రి అనుమతులు, ఇటీవల జరిగిన సర్జరీలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. ఆస్పత్రిలో ఆర్థో ఓపీలు, సర్జరీలు చేస్తున్న విషయాన్ని గుర్తించారు. ఇందులో రెండు ఆపరేషన్‌ థియేటర్లు కూడా ఉండటాన్ని గమనించారు. ఐదేళ్లుగా పెందుర్తిలో తిరుమల ఆస్పత్రి కార్యకలాపాలు సాగిస్తోంది. దీనికి ఎటువంటి అనుమతి లేదని అధికారుల విచారణలో నిర్ధారణ అయింది.

కనీసం తాత్కాలిక ఆనుమతి కూడా లేదన్న విషయం తెలుసుకుని అధికారులు కంగుతిన్నారు. అనుమతులు లేని ఆస్పత్రిలో నిబంధనలకు విరుద్ధంగా, నేరపూరితంగా సర్జరీలు నిర్వహిస్తున్నట్టు గుర్తించారు.  ఆ ఆస్పత్రిలో ఆర్థోపెడిక్‌ వైద్యుడు మాత్రమే ఉండగా.. కిడ్నీ మారి్పడి ఎలా చేశారు, ఎవరు చేశారన్న విషయంపైనా ఆరా తీశారు. తమ ఆస్పత్రిలో  ఎముకలకు సంబంధించిన వైద్యమే తప్ప ఎలాంటి కిడ్నీ మారి్పడి ఆపరేషన్లు జరగలేదని ఆస్పత్రి ఎండీ పరమేశ్వరరావు అధికారులకు చెప్పారు.  

ఆస్పత్రి సీజ్‌ :  వైద్య సే­వ­లు,  సౌకర్యాలపై అధికారులు  కలెక్టర్‌ మల్లికార్జునకు ప్రాథమిక నివేదికను అందజేయగా..  ఆస్పత్రిని సీజ్‌ చే­యా­లని  ఆదేశించారు. దీంతో డీఎంహెచ్‌వో జగదీశ్వరరావు, పెందుర్తి తహసీల్దార్‌  సమక్షంలో ఆస్పత్రిని సీజ్‌ చే­శారు.  మోసం, మానవ అవయ­వాల మారి్ప­డి చట్టం 1995, ఐపీసీ 18, 19తో పాటు 420 ఆర్‌/డబ్ల్యూ 120(బీ) కింద కేసు నమోదు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement