Kidney Racket
-
హైదరాబాద్ కిడ్నీ రాకెట్ ఇష్యూపై ప్రభుత్వం సీరియస్
-
కిడ్నీ రాకెట్ ఘటనలో కొత్త మలుపు
-
కిడ్నీ రాకెట్ పై గుంటూరు పోలీసుల దర్యాప్తు ముమ్మరం
-
కుదిపేస్తున్న కిడ్నీ దందా
-
పాక్‌లో జోరుగా కిడ్నీల దోపిడీ.. 328 సర్జరీలు..?
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో ఆర్ధిక వ్యవస్థ అతలాకుతలమవడంతో అక్కడి వారు దొడ్డిదారిలో సంపాదన కోసం అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇదే క్రమంలో పాక్ ఆక్రమిత కశ్మీర్లో మానవ అవయవాల స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న ఓ ముఠా గుట్టు రట్టు చేశారు పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ పోలీసులు. ఒక బాధితుడు తమవద్దకు వచ్చి కొందరు తనను బలవంతంగా ప్రైవేట్ ట్రీట్మెంట్ చేయించుకోమని వేధించారని కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు కూపీ మొత్తం లాగారు. పాకిస్తాన్లో ఓ అనామక డాక్టర్ గుట్టుగా నిర్వహిస్తోన్న మానవ అవయవాల స్మగ్లింగ్ గుట్టును రట్టు చేశారు పంజాబ్ ప్రావిన్స్‌లోని పోలీసులు. ధనికుల అవసరానికి తగ్గట్టుగా కిడ్నీలను సమకూర్చే క్రమంలో ఈ ముఠా వందల మందికి సర్జరీలు నిర్వహించి వారి కిడ్నీలను తొలగించారు. డాక్టర్ ఫవాద్ నేతృత్వంలో సాగుతున్న ఈ దందా గురించిన వివరాలు అక్కడి ముఖ్యమంత్రి మొహ్సిన్ నఖ్వీ బయటపెట్టారు. మొహ్సిన్ నఖ్వీ మాట్లాడుతూ.. డాక్టర్ ఫవాద్ ఇప్పటివరకు మొత్తం 328 సర్జరీలు నిర్వహించారని వీటి ద్వారా సుమారుగా 35000 యూఎస్ డాలర్లు( రూ.28.27 లక్షలు) కొల్లగొట్టారునై అన్నారు. ఈ ముఠాలో ఇప్పటివరకు మొత్తం ఎనిమిది మందిని అరెస్టు చేశామని తెలిపారు. వీరిలో ఒక కారు మెకానిక్ పేషేంట్లకు అనస్థీషియా ఇవ్వడంలో సహకరించేవాడని వెల్లడించారు. ఆసుపత్రుల్లో చేరిన పేషేంట్లను లాహోర్ లేదా పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించి అక్కడ గుట్టుగా ఆపరేషన్లు నిర్వహించేవారని తెలిపారు. ముఖ్యంగా పాక్ ఆక్రమిత కశ్మీర్లో కిడ్నీ మార్పిడులకు సంబంధించి ఎలాంటి చట్టాలు లేనందున అక్కడ వీరు యథేచ్ఛగా సర్జరీలు చేసేవారని అన్నారు. ఈ ముఠా నిర్వహించిన సర్జరీల్లో ఇప్పటివరకు ముగ్గురు మృతిచెందినట్లు గుర్తించామని, మిగిలిన విషయాలపై దర్యాప్తు జరుగుతోందని అన్నారు. నిందితుడు డాక్టర్ ఫవాద్ ఇదే కేసులో గతంలో ఐదు సార్లు అరెస్టయ్యారని కానీ న్యాయపరమైన లొసుగులను అడ్డంపెట్టుకుని బయటకు వచ్చేవారని అన్నారు. ఆశ్చర్యకరంగా సర్జరీలు జరిగిన చాలామందికి తమ కిడ్నీని తొలగించిన విషయం కూడా తెలియదు. ఈ ముఠాసభ్యుల్లో ఒకరు తనవద్దకు వచ్చి ప్రైవేటు ట్రీట్మెంట్ కోసం బలవంత పెట్టారని.. ఇప్పుడు వేరొక డాక్టర్ వద్దకు వెళ్తే తనకు ఒక కిడ్నీలేదని చెప్పారని ఓ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇది కూడా చదవండి: 2023 Nobel Prize: కోవిడ్–19 టీకా పరిశోధనలకు నోబెల్ -
కిడ్నీ శస్త్రచికిత్స చేసిన వైద్యుడు రాజశేఖర్ అరెస్ట్
-
నీలి చిత్రాల సీడీల నుంచి కిడ్నీ రాకెట్ వరకూ..
సాక్షి ప్రతినిధి, కాకినాడ: రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన విశాఖపట్నం కిడ్నీ రాకెట్ వ్యవహారం తీగ లాగితే కాకినాడ జిల్లాలో డొంక కదిలింది. ఈ రాకెట్లో అరెస్టయిన ప్రధాన నిందితుడు నర్ల వెంకటేశ్వర్లు (వెంకటేష్) మూలా లు కాకినాడ జిల్లా పెదపూడి మండలం కాండ్రేగులలో బయట పడ్డాయి. స్వగ్రామం కాండ్రేగుల అయినప్పటికీ అత డు సుమారు రెండు దశాబ్దాలుగా మండల కేంద్రమైన కరపలో వ్యాపారాలు చేస్తున్నాడు. కరప హైస్కూలులో పదో తరగతి చదువుకున్న వెంకటేష్ తన సోదరుడి వద్ద ఉంటూ.. కరపలో చిన్న దుకాణం అద్దెకు తీసుకుని, సీడీలు, క్యాసెట్లు విక్రయించేవాడు. ఆ ఆదాయం చాలదనుకున్నాడో ఏమో కానీ అక్రమార్జన వైపు మళ్లాడు. నీలి చిత్రాల సీడీలు, క్యాసెట్లు అద్దెకు ఇస్తూనే ఆర్థికంగా బలపడేందుకు ఏదో ఒకటి చేయాలని అనుకునేవాడని చెబుతున్నారు. తొలి నాళ్లలో తన కిడ్నీ అమ్మగా వచ్చిన సొమ్ముతో వ్యాపారం ప్రారంభించాడని అప్పట్లో చెప్పుకునేవారు. సీడీల కొనుగోలు పేరుతో కాకినాడ, విశాఖపట్నం, చైన్నె తదితర పట్టణాలకు వెళ్లేవాడు. ఈ క్రమంలో పలువురితో ఏర్పడిన పరిచయం కాస్తా కిడ్నీ అమ్మకాల వరకూ వెళ్లిందని చెబుతున్నారు. డబ్బు అవసరం ఉన్న వారికి వల వేసి, కిడ్నీ రాకెట్‌కు మధ్యవర్తిగా వ్యవహరిస్తూ కమీషన్లు దండుకునే వాడని విశాఖ పోలీసుల దర్యాప్తులో తేలింది. వెంకటేష్ విశాఖపట్నంలో కిడ్నీ రాకెట్ నడుపుతున్నట్టు కరప పరిసర గ్రామాల్లో 2019లోనే ప్రచారం జరిగింది. ఆ సమయంలో అతడు కొంత కాలం కనిపించకుండా పోవడం అప్పట్లో ఈ ఆరోపణలకు బలం చేకూర్చింది. ఈ రాకెట్ గుట్టు ఇప్పుడు రట్టవడం.. 2019లో కిడ్నీ రాకెట్ కేసులో 40 రోజుల పాటు జైలుశిక్ష అనుభవించినట్టు పోలీసులు చెప్పడం చర్చనీయాంశమైంది. తాజాగా కిడ్నీ రాకెట్లో వెంకటేష్ సూత్రధారి అని పోలీసులు నిర్ధారించడంతో స్థానికులు, కుటుంబ సభ్యులు విస్మయానికి గురవుతున్నారు. తమ కళ్లెదుట సీడీలు అమ్మిన అతడు ఏకంగా కిడ్నీ రాకెట్‌కే ఒడిగట్టాడని తెలిసి నివ్వెరపోతున్నారు. కరపలో చిన్నషాపు అద్దెకు తీసుకుని వ్యాపారం మొదలుపెట్టిన వెంకటేష్ అక్రమార్జన బాట పట్టాడు. సీడీల వ్యాపారం మానేసి, 2017లో కరపలోనే పేపకాయలపాలెం మార్గంలో ఖరీదైన స్థలం కొనుగోలు చేసి, జీ 2 భవనం నిర్మించాడు. మల్లేశ్వరి ఫ్యామిలీ కలెక్షన్స్ పేరిట వస్త్ర వ్యాపారం కూడా ప్రారంభించాడు. దీనికి సమీపంలోని మరో భవనంలో ఉన్న వస్త్ర దుకాణాన్ని కూడా కొనుగోలు చేశాడు. అక్కడే మరో స్థలం కొని మరో జీ 2 భవనం కూడా నిర్మిస్తున్నాడు. ఇలా వక్రమార్గం పట్టిన వెంకటేష్ చివరకు పాపం పండి జైలు పాలయ్యాడు. -
కిడ్నీ రాకెట్ కేసును ఛేదించిన పోలీసులు.. ముగ్గురు అరెస్ట్
-
విశాఖ కిడ్నీ రాకెట్ లో తవ్వేకొద్దీ సంచలన విషయాలు
-
విశాఖ కిడ్నీ రాకెట్ కేసులో సీసీఎస్ పోలీసులతో స్పెషల్ ఇన్వెస్టిగేషన్
-
కిడ్నీ మోసాలపై నిఘా.. కఠిన చర్యలు తప్పవు: మంత్రి రజిని
సాక్షి, విజయవాడ: కిడ్నీ మోసాలపై రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో నిఘా పెట్టామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కిడ్నీ రాకెట్ వార్తలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందన్నారు. పెందుర్తి తిరుమల ఆస్పత్రి ఘటన తమ దృష్టికి రాగానే విచారణకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. వైజాగ్ కలెక్టర్, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు విచారణ చేపట్టి ఆస్పత్రిని సీజ్ చేశారని వెల్లడించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న తిరుమల ఆస్పత్రికి అసలు అనుమతులే లేవని అధికారులు గుర్తించారని పేర్కొన్నారు. ఆస్పత్రి యాజమాన్యంపై క్రిమినల్ కేసులు కూడా నమోదైనట్లు వివరించారు. తిరుమల ఆస్పత్రి వ్యవహారంలో మధ్యవర్తులుగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నవారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని వెల్లడించారు. చదవండి: స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో ఈడీ దూకుడు, రూ.31 కోట్ల ఆస్తుల అటాచ్ వారిని విచారించి అసలు నిజాలు రాబడతామన్నారు. కిడ్నీ రాకెట్ వ్యవహారంలో ఎవరున్నా వదిలిపెట్టబోమని తెలిపారు. ఇలాంటి ఘటనలకు తావు లేకుండా ఉండేలా తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర స్థాయిలో ఒక కమిటీని వేస్తామన్నారు. అవయవాలతో చట్ట విరుద్ధంగా వ్యాపారం చేసే ఆస్పత్రులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
విశాఖ కిడ్నీ రాకెట్ కేసులో ప్రభుత్వం సీరియస్
-
కిడ్నీ రాకెట్‌పై సర్కారు సీరియస్
మహారాణిపేట/సింహాచలం: విశాఖపట్నంలో కిడ్నీ రాకెట్ వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని వైద్య, ఆరోగ్య శాఖను ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా అధికారులు ఈ ఉదంతంపై విచారణ వేగవంతం చేశారు. దీనిపై జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతోపాటు పోలీసులు కూడా సమగ్ర దర్యాప్తు చేపట్టారు. పెందుర్తిలో కిడ్నీ మార్పిడి చేసిన తిరుమల ఆస్పత్రిపై జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ, జీవన్‌దాన్ అధికారులు, పోలీసులు దాడులు నిర్వహించారు. డబ్బు ఆశ చూపించి గత ఏడాది డిసెంబర్ 16వ తేదీన మధురవాడ వాంబే కాలనీకి చెందిన జి.వినయ్‌కుమార్‌కు పెందుర్తి తిరుమల ఆస్పత్రిలో కిడ్నీ తీసుకున్న విషయం తెలిసిందే. ఒప్పందం ప్రకారం రూ.8.50 లక్షలు ఇవ్వకుండా కేవలం రూ.2.50 లక్షలు ఇవ్వడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆస్పత్రికే అనుమతి లేదు కలెక్టర్ ఎ.మల్లికార్జున ఆదేశాల మేరకు పెందుర్తిలో కిడ్నీ మార్పిడి చేసిన తిరుమల ఆస్పత్రిపై డీఎంహెచ్‌వో పి.జగదీశ్వరరావు, జీవన్‌దాన్ కో–ఆర్డినేటర్ రాంబాబు, ఏసీపీ అన్నెపు నరసింహమూర్తి సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఆస్పత్రి అనుమతులు, ఇటీవల జరిగిన సర్జరీలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. ఆస్పత్రిలో ఆర్థో ఓపీలు, సర్జరీలు చేస్తున్న విషయాన్ని గుర్తించారు. ఇందులో రెండు ఆపరేషన్ థియేటర్లు కూడా ఉండటాన్ని గమనించారు. ఐదేళ్లుగా పెందుర్తిలో తిరుమల ఆస్పత్రి కార్యకలాపాలు సాగిస్తోంది. దీనికి ఎటువంటి అనుమతి లేదని అధికారుల విచారణలో నిర్ధారణ అయింది. కనీసం తాత్కాలిక ఆనుమతి కూడా లేదన్న విషయం తెలుసుకుని అధికారులు కంగుతిన్నారు. అనుమతులు లేని ఆస్పత్రిలో నిబంధనలకు విరుద్ధంగా, నేరపూరితంగా సర్జరీలు నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. ఆ ఆస్పత్రిలో ఆర్థోపెడిక్ వైద్యుడు మాత్రమే ఉండగా.. కిడ్నీ మారి్పడి ఎలా చేశారు, ఎవరు చేశారన్న విషయంపైనా ఆరా తీశారు. తమ ఆస్పత్రిలో ఎముకలకు సంబంధించిన వైద్యమే తప్ప ఎలాంటి కిడ్నీ మారి్పడి ఆపరేషన్లు జరగలేదని ఆస్పత్రి ఎండీ పరమేశ్వరరావు అధికారులకు చెప్పారు. ఆస్పత్రి సీజ్ : వైద్య సేవలు, సౌకర్యాలపై అధికారులు కలెక్టర్ మల్లికార్జునకు ప్రాథమిక నివేదికను అందజేయగా.. ఆస్పత్రిని సీజ్ చేయాలని ఆదేశించారు. దీంతో డీఎంహెచ్‌వో జగదీశ్వరరావు, పెందుర్తి తహసీల్దార్ సమక్షంలో ఆస్పత్రిని సీజ్ చేశారు. మోసం, మానవ అవయవాల మారి్పడి చట్టం 1995, ఐపీసీ 18, 19తో పాటు 420 ఆర్/డబ్ల్యూ 120(బీ) కింద కేసు నమోదు చేశారు. -
కిడ్నీ బాధితుడు వినయ్ కుమార్ ఇంటికి వైద్య బృందం
-
కిడ్నీ రాకెట్ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం
-
డీఎస్పీ వీడు పక్కా 420
-
హైదరాబాద్‌లో కిడ్నీ రాకెట్ నిర్వాహకుడి అరెస్టు
-
కిడ్నీ పేరుతో రూ.34 లక్షల టోకరా.. దాంతో
సాక్షి, జూబ్లీహిల్: అంతర్జాతీయ కిడ్నీ రాకెట్‌ను బంజారాహిల్స్ పోలీసులు ఛేదించి నిర్వాహకుడిని అరెస్ట్ చేశారు. బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం నిర్వహించి మీడియా సమావేశంలో వెస్ట్‌జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు పట్టణానికి చెందిన దోగిపర్తి షణ్ముఖ పవన్ శ్రీనివాస్ (25) గతంలో ఎయిర్‌క్రాఫ్ట్ మెయిన్టెనెన్స్ ఇంజినీర్‌గా పని చేశాడు. తర్వాత షేర్మార్కెట్లో పెట్టుబడి పెట్టి నష్టపోయాడు. అప్పుల పాలైన శ్రీనివాస్ ఫేస్బుక్ ద్వారా కొందరు వ్యక్తులతో పరిచయం చేసుకొని 2013లో శ్రీలంకలోని కొలంబోలో ఒక ఆసుపత్రిలో తన కిడ్నీని రూ. 5 లక్షలకు అమ్ముకొని అప్పులు తీర్చాడు. మరింత డబ్బు సంపాదించాలనే దురాశతో తానే కిడ్నీ వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్న శ్రీనివాస్ సదరు రాకెట్‌తో పరిచయం పెంచుకున్నాడు. బాధితులను, కిడ్నీ డోనర్స్‌ను కొలంబో తీసుకెళ్లి ఇప్పటివరకు ఏడుగురికి కిడ్నీ ఆపరేషన్లు చేయించాడు. మరో 23 ముగ్గురిని కిడ్నీ ఇప్పిస్తానని డబ్బు తీసుకొని మోసం చేశాడు. ఇతని ద్వారా శ్రీలంకలో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్న వ్యక్తి హైదరాబాద్‌లో చనిపోయాడు. 2016లో అరెస్టు... దీంతో 2016లో శ్రీలంక పోలీసులు శ్రీనివాస్‌ను అరెస్ట్ చేశారు. 15 నెలలు జైలులో ఉండి విడుదలై ఇండియాకు వచ్చి తిరిగి వ్యాపారం ప్రారంభించాడు. కిడ్నీలు అవసరమైన పేషంట్లకు ఇంటర్నెట్ ద్వారా వలవేసేవాడు. వారికి విదేశాల్లో మెరుగైన వైద్యం చేయిస్తానని, కిడ్నీలు దానం చేయిస్తానని నమ్మబలికేవాడు . ఈ క్రమంలో నగరంలోని శ్రీనగర్‌కాలనీకి చిందిన నాగరాజు (55) రెండు కిడ్నీలు చెడిపోవడంతో అతడిని భార్య బిజ్జల భారతి బంజారాహిల్స్‌లోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. ఇంటర్నెట్ సహా ఇతర మార్గాల ద్వారా బాధితుల గురించి తెలుసుకున్న శ్రీనివాస్.. నాగరాజు భార్య భారతికి మాయమాటలు చెప్పి నమ్మించాడు. నాగరాజుకు టర్కీలో మెరుగైన వైద్యం చేయిస్తానని, కిడ్నీలను ఇచ్చే దాతలను ఏర్పాటు చేయిస్తానని, అందుకు రూ. 34 లక్షల ఖర్చు అవుతుందన్నాడు. భారతి కుటుంబం ముందస్తుగా శ్రీనివాస్‌కు వివిధ బ్యాంకు అకౌంట్ల ద్వారా రూ. 24 లక్షలు ట్రాన్స్ఫర్ చేసింది. డాలర్లుగా మార్చడంతో పాటు ఇతర ఖర్చుల కోసం రూ. 10 లక్షల నగదుగా ఇవ్వాలని కోరాడు. ఒప్పందం ప్రకారం సృజన్ అనే వ్వక్తి భారతి ఇంటికి వచ్చి నగదు, నాగరాజు, కుటుంబసభ్యుల పాస్‌పోర్ట్‌లను తీసుకెళ్లాడు. టర్కీలోని ఆస్పత్రిలో వైద్యం, విమాన టికెట్లు, హోటల్ ఖర్చులు, దాతకు, డాక్టర్లకు చెల్లించాల్సిన మొత్తం తాను చూసుకుంటానని నమ్మబలికాడు. ఆ తర్వాత కనిపించకుండాపోయాడు. ఫోన్లో కూడా అందుబాటులోకి రాలేదు. రూ. 30 నుంచి 50 లక్షలకు ఒప్పందం... దీంతో తాము మోసపోయామని అనుమానం వచ్చిన భారతి గతేడాది జూన్ 14న బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఇంటర్నెట్ ద్వారా బాధితుల గూర్చి తెలుసుకునే శ్రీనివాస్ వారి బలహీతలను సొమ్ము చేసునేవాడు. శ్రీలంకలోని వెస్ట్రన్, నవలోక్, హేమాస్, లంక ఆసుపత్రి సహా టర్కీలోని పలు ఆసుపత్రుల్లో కిడ్నీ మార్పిడి చేయిస్తానని, రూ.30 నుంచి 50లక్షలకు ఒప్పందం చేసుకునేవాడు. ఇందులో కేవలం రూ.5 లక్షలలోపు మాత్రమే దాతకు, డాక్టర్లకు, ఏజెంట్లకు పంచి మిగతాది కాజేసేవాడు. భారతి కుటుంబం నుంచి తీసుకున్న సొమ్ము మొత్తం శ్రీలంకలోని కాసినోల్లో ఖర్చుచేశాడు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు శనివారం నిందితుడు శ్రీనివాస్‌ను అరెస్ట్ చేశారు. ఇతడిపై విజయవాడలో ఇప్పటికే రెండు కేసులు, నగరంలోని సీసీఎస్‌లో మరో కేసు ఉన్నాయి. బాధితుల పాస్‌పోర్ట్‌లను స్వాధీనం చేసుకున్నారు. 406,420 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసును ఛేదించిన బంజారాహిల్స్ ఏసీపీ కేఎస్.రావు, ఇన్స్పెక్టర్ కళింగరావు, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రవికుమార్‌లను డీసీపీ అభినందించారు. -
‘కిడ్నీ డోనర్స్–బయ్యర్స్’పేరుతో వెబ్సైట్
నేరేడ్మెట్: కిడ్నీ విక్రయాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని రాచకొండ ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం నేరేడ్మెట్లోని తన కార్యాలయంలో రాచకొండ సీపీ మహేష్‌భగవత్ వివరాలు వెల్లడించారు. తమిళనాడు రాష్ట్రంలోని మధురై జిల్లా, గోవిందనగరం(అంబసముద్రం– తేని)కి చెందిన దీనదయాలన్ సూర్యాశివరామ్ శివ ( ‘కిడ్నీ డోనర్స్–బయ్యర్స్’పేరుతో వెబ్సైట్ ఏర్పాటు చేశారు. ఆన్లైన్లో ఈ వెబ్‌సైట్‌ను సందర్శించిన వారు కాంట్రాక్ట్ చేస్తే తాను కిడ్నీ ఫెడరేషన్లో ఏజెంట్‌గా పని చేస్తున్నట్లు చెప్పుకునేవాడు. కిడ్నీ విక్రయించడానికి ఆసక్తి ఉన్న వారు అతడిని సంప్రదించగా ముందుగా ఫెడరేషన్లో పేరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించాడు. ఇందుకు గాను తన ఖాతాలో రూ.15వేలు డిపాజిట్ చేయించాలని కోరేవాడు. అనంతరం వారి ఆధార్, పాన్, బ్యాంక్‌ఖాతా వివరాలు సేకరించే అతను ఆపరేషన్‌కు ముందు ఒప్పందం ప్రకారం 50శాతం డబ్బులు, తరువాత 50శాతం డబ్బులు చెల్లిస్తారని బాధితులను నమ్మించేవాడు. నకిలీ క్లయింట్ల జాబితాను తయారు చేసి, రూ.కోటి తన ఖాతాలో జమ అవుతున్నట్లు వచ్చిన నకిలీ ఎస్ఎంఎస్లను దాతల ఫోన్లకు పంపేవాడు. ఈ మేరకు ఫెడరేషన్ పేరుతో నకిలీ పత్రాలను తయారు చేసి ఫేస్బుక్, వాట్సాప్‌ల ద్వారా దాతలకు పంపించి నమ్మించేవాడు. పలువురిని నుంచి ఫీజుల పేరుతో ఖాతాల్లో నగదు జమ చేయించు కున్న అనంతరం వారి ఫోన్ నంబర్లను బ్లాక్ లిస్ట్‌లో పెట్టేవాడు. అతడి చేతిలో మోసపోయిన బాధిడుతు ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఫేస్బుక్, ఇతర ఆన్లైన్ వివరాల ఆధారంగా నిందితుడిని నేరేడ్మెట్లో అరెస్టు చేశారు. అతడి నుంచి నకిలీ పత్రాలతోపాటు సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ తెలిపారు. అవయవదానం చేయడానికి అనేక నిబంధనలు, చట్టాలు ఉన్నాయని, ఆన్లైన్లో ప్రకటనలు చూసి మోస పోవద్దని సీపీ సూచించారు. ఈ సందర్భంగా సిబ్బందికి నగదు రివార్డులను ప్రకటించారు. -
శ్రద్ధలో మరో కుట్రకోణం!
సాక్షి, విశాఖపట్నం: కిడ్నీ రాకెట్‌కు కేంద్ర బిందువైన నగరంలోని శ్రద్ధ ఆస్పత్రి యాజమాన్యం ఆడిన మరో కుట్రకోణం బట్టబయలైంది. ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి వేసిన ఎత్తుగడ బెడిసికొట్టింది. కిడ్నీ రాకెట్ వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ఆస్పత్రి ఎండీ డాక్టర్ ప్రదీప్ పరారీలో ఉన్నాడు. పోలీసులకు దొరక్కుండా చాన్నాళ్లు తప్పించుకున్నాడు. ఈలోగా న్యాయవాదులు, సన్నిహితుల సలహాలతో వ్యూహాలు పన్నాడు. ఇందులో భాగంగా శ్రద్ధ ఆస్పత్రిని 2014లో మరొకరికి (తన వద్ద పనిచేసే వ్యక్తికి?) జీపీఏ రాసినట్టు తప్పుడు నోటరీ చేయించాలని నిర్ణయించాడు. ఈ బాధ్యతను నగరానికి చెందిన సుబ్రహ్మణ్యం అనే న్యాయవాదికి అప్పగించాడు. వాస్తవానికి ఆయన కూడా నోటరీ న్యాయవాదే. అయినప్పటికీ ఈ కిడ్నీ రాకెట్ కేసులో తానెక్కడ ఇరుక్కుంటానో అన్న భయంతో తనకు పరిచయం ఉన్న నాయుడు అనే మరో నోటరీని ఆశ్రయించాడు. పాత తేదీలతో శ్రద్ధ ఆస్పత్రిని మరొకరికి దారాదత్తం చేస్తూ జీపీఏ రాయించినట్టు నోటరీ చేయించాడు. అయితే శ్రద్ధ ఆస్పత్రిలో పోలీసులు నిర్వహించిన సోదాల్లో ఈ తప్పుడు జీపీఏ డాక్యుమెంటు బయటపడినట్టు సమాచారం. దీంతో సంబంధిత నోటరీ నాయుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో అసలు సంగతిని బయటపెట్టాడు. శ్రద్ధ ఆస్పత్రి నిర్వాహకులు తనకు బంధువులని, అందువల్ల నోటరీ చేయాలని కోరడంతో చేశానని, తనకు నోటరీ ఫీజు కూడా కేవలం రూ.400లే ఇచ్చాడని నాయుడు పోలీసుల విచారణలో కుండబద్దలు కొట్టాడు. అంతేతప్ప అంతకు మించి ఈ వ్యవహారంలో తనకేమీ తెలియదని చెప్పడంతో పోలీసులు అతడిని విడిచిపెట్టారు. శ్రద్ధ ఆస్పత్రి యాజమాన్యం నుంచి భారీగా సొమ్ము నొక్కేసి సుబ్రహ్మణ్యం ఈ పనికి పూనుకున్నాడని అనుమానిస్తున్నారు. ఇందులో నకిలీ జీపీఏకి సూత్రధారి సుబ్రహ్మణ్యాన్ని అదుపులోకి తీసుకోకపోవడం, అరెస్టు చేయక పోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తనను మోసం చేశాడంటూ సుబ్రహ్మణ్యంపై న్యాయవాది నాయుడు ఫిర్యాదు చేసినా దానిని పోలీసులు తీసుకోవడం లేదని అంటున్నారు. స్కెచ్ వెనక కథ ఇదీ..! ఈ కిడ్నీ రాకెట్లో తన ప్రమేయం లేదని చెప్పేందుకు, అరెస్టు కాకుండా తప్పించుకునేందుకే శ్రద్ధ ఆస్పత్రి ఎండీ డాక్టర్ ప్రదీప్ ఈ ఎత్తుగడ వేశాడు. జీపీఏ పొందిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేస్తే అతను జైలులో ఉన్నంతకాలం అతడి కుటుంబాన్ని శ్రద్ధ యాజమాన్యం పోషించేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు. వ్యూహం బెడిసి కొట్టడంతో ప్రదీప్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. -
విశాఖ: శ్రద్ధ ఆస్పత్రిని సీజ్ చేయాలని కలెక్టర్ ఆదేశం
-
కిడ్నీ రాకెట్ కేసులో వెలుగు చూస్తున్న అక్రమాలు
-
కిడ్నీ కేటుగాళ్లు!
-
గుట్టు వీడుతుందా?
-
కిడ్నీ రాకెట్లో మరికొన్ని ఆస్పత్రులు?!
సాక్షి, విశాఖపట్నం: ఏటా కోట్లాది రూపాయలు కుమ్మరిస్తున్న కిడ్నీ మార్పిడి వ్యవహారంలో విశాఖలోని మరికొన్ని ఆస్పత్రులు ఉన్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కిడ్నీ మార్పిడికి చెల్లించే మొత్తం (సుమారు రూ.60 నుంచి 70 లక్షలు)లో సగానికి పైగా ఆస్పత్రులే కొట్టేస్తున్నాయి. కిడ్నీ దాతలకు మాత్రం మొక్కుబడిగా చెల్లించి చేతులు దులిపేసుకుంటున్నాయి. హైదరాబాద్‌కు చెందిన టి.పార్థసారథి అప్పులపాలై తన కిడ్నీని బెంగళూరులోని ప్రభాకర్‌కు రూ.12 లక్షలకు అమ్ముకోవడం, నగరంలోని శ్రద్ధ ఆస్పత్రి అందులోని రూ.5 లక్షలే చెల్లించి తర్వాత ముఖం చాటేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కిడ్నీ రాకెట్ వ్యవహారం వెలుగు చూసింది. ఇప్పుడు తీగలాగితే డొంకంతా కదులుతోంది. ఈ వ్యవహారంలో ఇప్పటిదాకా బ్రోకర్, ఆయుర్వేద వైద్యుడు మంజునాథ్, కిడ్నీ మార్పిడి చేసిన శ్రద్ధ ఆస్పత్రి వైద్యుడు దొడ్డి ప్రభాకర్, ఆస్పత్రి అడ్మినిస్ట్రేటర్ జేకే వర్మలను పోలీసులు అరెస్టు చేశారు. కిడ్నీ మార్పిడి చేయించుకున్న ప్రభాకర్ అనారోగ్యంతో ఉండడం వల్ల పోలీసులు ఇంకా అతడిని అరెస్టు చేయలేదు. పరారీలో ఉన్న అతని సోదరుడు వెంకటేష్, శ్రద్ధ ఆస్పత్రి ఎండీల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆ ఆస్పత్రుల్లో అలజడి కిడ్నీ రాకెట్ వ్యవహారంపై కలెక్టర్ కె.భాస్కర్ త్రిసభ్య కమిటీని వేశారు. తొలుత శ్రద్ధ ఆస్పత్రి కిడ్నీ బాగోతంపై క్షుణ్ణంగా దర్యాప్తు చేశాక, నగరంలో ఇంకా కిడ్నీ మార్పిడికి అనుమతి ఉన్న ఆస్పత్రులపై కూడా లోతుగా పరిశీలించాలని ఆదేశించారు. విశాఖ నగరంలో ఇలాంటి ఆస్పత్రులు 11 వరకు ఉన్నాయి. వీటిలో పేరున్న కార్పొరేట్ ఆస్పత్రులున్నాయి. వీటిలో చాలావరకు నిబంధనలు పాటించకుండానే అవయవ/కిడ్నీ మార్పిడిలు చేస్తున్నట్టు చెబుతున్నారు. ఆయా ఆస్పత్రుల్లోనూ ఇలాంటి అక్రమాలు చోటుచేసుకుని ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఆ ఆస్పత్రుల నిర్వాహకుల్లో ఇప్పుడు తీవ్ర అలజడి రేగుతోంది. శ్రద్ధ ఆస్పత్రి విషయంలో ముందుగా ఒప్పందం కుదుర్చుకున్న మేరకు సొమ్ము చెల్లించి ఉంటే బాధితుడు ఫిర్యాదు చేసే అవకాశమే ఉండేది కాదు. కానీ బేరం బెడిసి కొట్టడంతో వెలుగులోకి వచ్చింది. నగరంలో కిడ్నీ మార్పిడిలు చేస్తున్న మిగతా ఆస్పత్రుల్లోనూ అడ్డదారి వ్యవహారాలే నడుస్తున్నట్టు తెలుస్తోంది. అవయవాల మార్పిడిలో ఉల్లంఘనలకు పాల్పడుతున్నా ఇన్నాళ్లూ ఎవరూ పట్టించుకోలేదు. శ్రద్ధ ఆస్పత్రి బాగోతంతో ఇప్పుడు త్రిసభ్య కమిటీ మిగతా ఆస్పత్రులపైనా విచారణ ప్రారంభిస్తుంది. ఎంత మందికి కిడ్నీ/అవయవ మార్పిడి చేశారు? వారి చిరునామా? దాతల వివరాలు కూడా కూపీ లాగనుంది. వారం రోజుల్లోగా శ్రద్ధ ఆస్పత్రిపై విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించాల్సి ఉంది. అనంతరం మిగిలిన ఆస్పత్రుల్లో గడచిన ఐదేళ్లుగా ఎలాంటి అతిక్రమణలు జరిగాయో పరిశీలిస్తారు. త్రిసభ్య కమిటీ చిత్తశుద్ధికి ఇది పరీక్షగా మారనుందని వైద్య వర్గాలు చెప్పుకుంటున్నాయి. శ్రద్ధ ఆస్పత్రి లైసెన్సు రద్దు చేయాలి పెదవాల్తేరు(విశాఖ తూర్పు): కిడ్నీ మార్పిడి రాకెట్‌కు కేంద్రమైన శ్రద్ధ ఆస్పత్రి లైసెన్సుని రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాజకీయ ఐక్యవేదిక చైర్మన్ జేటీ రామారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు రేసపువానిపాలెంలో గల జిల్లా వైద్య – ఆరోగ్యశాఖ కార్యాలయం ఎదుట సోమవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు స్పందించకుంటే తామే ఆస్పత్రికి తాళాలు వేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం కమిటీలు, విచారణ పేరుతో జాప్యం చేయకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సంస్థ నాయకులు బి.నరసింహాచారి, శివాజీ, కిశోర్, పి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. శ్రద్ధపై విచారణ ప్రారంభం శ్రద్ధ ఆస్పత్రిపై కలెక్టర్ నియమించిన త్రిసభ్య కమిటీ సోమవారం విచారణ చేపట్టింది. కమిటీ సభ్యులు కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ జి.అర్జున, డీఎంహెచ్‌వో డాక్టర్ ఎస్.తిరుపతిరావు, జిల్లా ఆస్పత్రుల సమన్వయకర్త డాక్టర్ బీకే నాయక్‌లు సోమవారం ఉదయం కేజీహెచ్‌లో సమావేశమయ్యారు. అనంతరం తిరుపతిరావు, నాయక్‌లతో కలిసి డాక్టర్ అర్జున్ మీడియాతో మాట్లాడారు. శ్రద్ధ ఆస్పత్రి కిడ్నీ రాకెట్ వ్యవహారం ‘సాక్షి’లో ప్రచురించడంతో కలెక్టర్ భాస్కర్ విచారణకు త్రిసభ్య కమిటీని వేశారని చెప్పారు. శ్రద్ధ ఆస్పత్రి ప్రారంభం నుంచి ఎన్ని కిడ్నీ మార్పిడులు జరిగాయో రికార్డులను పరిశీలిస్తామని, ఇందుకు పోలీసుల సహకారం తీసుకుంటామని తెలిపారు. వారం రోజుల్లో నివేదిక ఇస్తామని, ఆ తర్వాత మిగిలిన ఆస్పత్రులపై దృష్టి సారిస్తామని చెప్పారు. ‘శ్రద్ధ’లో కనిపించని బాధ్యులు త్రిసభ్య కమిటీ సభ్యులు వి చారణకు శ్రద్ధ ఆస్పత్రికి వెళ్లినప్పుడు ఆస్పత్రిలో నిర్వాహకులుగానీ, పరిపాలనా విభాగ బాధ్యులుగానీ లేరు. ఇప్పటికే ఆస్పత్రి ఎండీ పరారీలో ఉన్నారు. కమిటీ సభ్యులు అందుబాటులో ఉన్న రికార్డులను పరిశీలించారు. కొన్నింటిని పో లీసులు తీసుకెళ్లినట్టు చెప్పారు. కమిటీకి అవసరమైన రికార్డులను పరిశీలన కోసం పోలీ సు విచారణాధికారి నుంచి తీసుకోనున్నారు. ఆ తర్వాత రోజూ శ్రద్ధ ఆస్పత్రిలోనే విచారణ చే యనున్నారు. ఈ ఆస్పత్రికి కిడ్నీ మార్పిడికి 2022వరకు అనుమతులుండగా, జీవన్‌దాన్‌కు మాత్రం గడువు ముగిసిందని గుర్తించినట్టు తెలిసింది. -
కిడ్నీ రాకెట్ పై త్రిసభ్య కమిటీ విచారణ ముమ్మరం
-
కిడ్నీ మార్పిడి ఘటనపై త్రిసభ్య కమిటీ
సాక్షి, విశాఖపట్నం : విశాఖలో కిడ్నీ మార్పిడి ఘటనలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఏళ్ల తరబడి ఇదో వ్యాపారంగా పెట్టుకుని ఏటా కోట్లాది రూపాయలు ఆర్జించిన శ్రద్దా ఆసుపత్రి.. కాలం కలిసిరాక ఇప్పుడు అడ్డంగా బుక్కయిపోయింది. ఈ ఘటనపై విచారణకు ముగ్గురు సభ్యుల కమిటీని నియమించారు. శ్రద్ద ఆసుపత్రి రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు జరిగిన ఆపరేషన్ల తీరుపై ఆరా తీశారు. శ్రద్ధ ఆస్పత్రికి రాష్ట్రంతోపాటూ ఇతర రాష్ట్రాల్లోనూ బ్రోకర్లున్నారు. వీరు కిడ్నీ ఎవరికి అవసరం? ఎవరిస్తారు? వంటి వాటిపైనే దృష్టి సారిస్తారు. అలా దొరికిన వారితో ఆస్పత్రి యాజమాన్యం, వైద్యుడు (నెఫ్రాలజిస్టు)కు బ్రోకర్లు పరిచయం చేసి బేరం కుదురుస్తారు. ఇలా శ్రద్ధ ఆస్పత్రి యాజమాన్యానికి దేశంలోని వివిధ ప్రాంతాల బ్రోకర్లతో లింకులున్నాయని పోలీసులు ప్రాథమికంగా నిర్థారణకు వచ్చారు. తాజాగా వెలుగు చూసిన పార్థసారథి వ్యవహారంలో పోలీసులకు అశ్చర్యం కలిగించే విషయాలు వెల్లడయినట్టు సమాచారం. హైదరాబాద్, బెంగళూరు వంటి మహానగరాల్లో విశాఖకంటే మెరుగైన, అత్యాధునిక వైద్య సదుపాయాలున్న కార్పొరేట్ ఆస్పత్రులు ఎన్నో ఉన్నా... అంతగా పేరు ప్రఖ్యాతల్లేని విశాఖలోని శ్రద్ధ ఆస్పత్రికే కిడ్నీ మార్పిడి కేసులు పెద్ద సంఖ్యలో వస్తుండడంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. -
కిడ్నీ రాకెట్ వ్యవహారంలో విచారణ వేగవంతం
-
కిడ్నీ వ్యాపారం పైనే 'శ్రద్ధ'
సాక్షి, విశాఖపట్నం: ఆ ఆస్పత్రికి కాసుల వర్షం కురిపించే కిడ్నీ మార్పిడిపైనే అత్యధిక ‘శ్రద్ధ’! లక్షలాది రూపాయలు వచ్చి పడుతుండడంతో యాజమాన్యం అడ్డదారులు తొక్కింది. ఏళ్ల తరబడి ఇదో వ్యాపారంగా పెట్టుకుని ఏటా కోట్లాది రూపాయలు ఆర్జిస్తోంది. కాలం కలిసిరాక ఇప్పుడు అడ్డంగా బుక్కయిపోయింది. విశాఖలో కిడ్నీ మార్పిడికి కేంద్రం ముసుగులో కిడ్నీ రాకెట్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది..! డొంక కదిలిందిలా.. హైదరాబాద్‌కు చెందిన సెక్యూరిటీ గార్డు పార్థసారథి తన కిడ్నీని రూ.12 లక్షలకు అమ్ముకున్నా రూ.5 లక్షలే ఇచ్చారంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నగరంలోని కలెక్టరేట్ వద్ద ఉన్న శ్రద్ధ ఆస్పత్రి బాగోతం వెలుగులోకి వచ్చింది. ఇన్నాళ్లూ ఈ ఆస్పత్రిలో జరుగుతున్న కిడ్నీ మార్పిడులపై ఎవరూ దృష్టి సారించలేదు. ఒక కిడ్నీ మార్పిడికి రోగి నుంచి రూ.60 – రూ.70 లక్షలు వసూలు చేస్తుంటారు. ఇందులో విధిలేక కిడ్నీని అమ్ముకున్న అభాగ్యులకు రూ.12 నుంచి రూ.15 లక్షలు ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకున్నా ఐదారు లక్షలే ఇచ్చి చేతులు దులుపుకుంటారు. కానీ ఆస్పత్రి యాజమాన్యంపై గానీ, కిడ్నీ మార్పిడి చేయించుకున్న వారిపై గానీ ఫిర్యాదు చేసే సాహసం ఈ అభాగ్యులు చేయలేరు. ఇదే ‘శ్రద్ధ’కు వరంగా మారింది. దేశవ్యాప్తంగా బ్రోకర్లు శ్రద్ధ ఆస్పత్రికి రాష్ట్రంతోపాటూ ఇతర రాష్ట్రాల్లోనూ బ్రోకర్లున్నారు. వీరు కిడ్నీ ఎవరికి అవసరం? ఎవరిస్తారు? వంటి వాటిపైనే దృష్టి సారిస్తారు. అలా దొరికిన వారితో ఆస్పత్రి యాజమాన్యం, వైద్యుడు (నెఫ్రాలజిస్టు)కు బ్రోకర్లు పరిచయం చేసి బేరం కుదురుస్తారు. ఇలా శ్రద్ధ ఆస్పత్రి యాజమాన్యానికి దేశంలోని వివిధ ప్రాంతాల బ్రోకర్లతో లింకులున్నాయని పోలీసులు ప్రాథమికంగా నిర్థారణకు వచ్చారు. తాజాగా వెలుగు చూసిన పార్థసారథి వ్యవహారంలో పోలీసులకు అశ్చర్యం కలిగించే విషయాలు వెల్లడయినట్టు సమాచారం. హైదరాబాద్, బెంగళూరు వంటి మహానగరాల్లో విశాఖకంటే మెరుగైన, అత్యాధునిక వైద్య సదుపాయాలున్న కార్పొరేట్ ఆస్పత్రులు ఎన్నో ఉన్నా... అంతగా పేరు ప్రఖ్యాతల్లేని విశాఖలోని శ్రద్ధ ఆస్పత్రికే కిడ్నీ మార్పిడి కేసులు పెద్ద సంఖ్యలో వస్తుండడంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఏడాదికి 10 నుంచి 12 కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు ఈ ఒక్క ఆస్పత్రిలోనే జరుగుతున్నాయని తెలుసుకుని పోలీసులు నివ్వెరపోతున్నారు. అందుకే ఇప్పుడు ఇలా ఎవరెవరు కిడ్నీ మార్పిడులు చేయించుకున్నారు? వారికి కిడ్నీలు ఎవరిచ్చారు? ఎంత చెల్లించారు? వారితో ఎవరికైనా వివాదాలు తలెత్తాయా? అనే కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు. దీనిపై ఆస్పత్రి రికార్డులను తనిఖీ చేసి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నిర్వాహకులకు మద్దతుగా అధికార పార్టీ నేత! ఇప్పటికే ఈ కిడ్నీ రాకెట్ కేసులో ఈ ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ ప్రభాకర్‌ను, బ్రోకర్‌గా వ్యవహరిస్తున్న బెంగళూరుకు చెందిన ఆయుర్వేద వైద్యుడు మంజునాథ్‌లను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నేడో రేపో ఆస్పత్రి నిర్వాహకులను కూడా అరెస్టు చేసే అవకాశాలున్నాయి. దీంతో వీరు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం. ఈ ఆస్పత్రి యాజమాన్యం అధికార పార్టీ ‘ముఖ్య’ నేతతో సత్సంబంధాలున్నాయని, అటు నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయని చెబుతున్నారు. శ్రద్ధ ఆస్పత్రి కిడ్నీ రాకెట్ బాగోతం వెలుగులోకి రావడంతో విశాఖ నగరంలో ఇలాంటి వ్యవహారాలు నడుపుతున్న ఇతర కార్పొరేట్ ఆస్పత్రుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. పార్థసారథిలాంటి బాధితులుంటే తమకు ఫిర్యాదు చేయాలని పోలీసులు కోరడంతో అలాంటి వారెవరైనా ఫిర్యాదు చేస్తారేమోనని ఈ యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి. -
టర్కీ తీసుకెళ్లి తస్కరించారు
సాక్షి, సిటీబ్యూరో: అంతర్జాతీయ కిడ్నీ రాకెట్ కేసులో రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు మరో నిందితుడిని పట్టుకున్నారు. ఈ ముఠా సృష్టించిన నకిలీ సర్టిఫికెట్లపై కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ (ఎంఈఏ) నుంచి స్టాంపింగ్ చేయించిన ఆరోపణలపై ఉత్తరప్రదేశ్ వాసి సందీప్‌కుమార్‌ను అరెస్టు చేసినట్లు కమిషనర్ మహేష్ మురళీధర్ భగవత్ గురువారం వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే అధికారులు ముగ్గురిని కటకటాల్లోకి పంపిన విషయం విదితమే. ఢిల్లీలో స్థిరపడిన భోపాల్ వాసి అమ్రిష్ మెడికల్ టూరిజం ఏజెంట్‌గా పని చేసేవాడు. మొదట్లో చట్ట వ్యతిరేకమైన ‘అద్దెకు తల్లులు’ సరోగసీ నుంచి మొదలెట్టి ఆ తరవాత మానవ అవయవాల మార్పిడి వ్యాపారం వైపు మళ్లాడు. పలువురు డాక్టర్లు, డయాగ్నోస్టిక్ సెంటర్లు, ప్రభుత్వ అధికారులు, ఏజెంట్లు, బ్రోకర్లతో కుమ్మక్కై దందాకు పాల్పడుతున్నాడు. డబ్బు అవసరమున్న వారిని గుర్తించి వారి అవయవాలు మార్పిడి చేసి డబ్బు ఇవ్వకుండా మోసం చేసేవాడు. ఈ క్రమంలోనే ఇతడికి మరో ఇద్దరితో పరిచయం ఏర్పడింది. ముగ్గురూ ముఠాగా ఏర్పడి కిడ్నీల మార్పిడి దందా మొదలెట్టారు. ఒక్కో కిడ్నీ మార్పిడికి రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు రోగుల నుంచి వసూలు చేసేవారు. రోగులు, దాతలను శ్రీలంక రాజధాని కొలంబో, ఈజిప్ట్‌లోని కైరో, టర్కీలోని ఇజ్మిర్ ప్రాంతాల్లోని వివిధ ఆస్పత్రులకు తీసుకెళ్లి 40 కిడ్నీల క్రయవిక్రయాలు చేపట్టారు. వీటిలో అత్యధికంగా బోగస్ పత్రాలతో అక్రమంగా జరిగినవే. వీరిలో ఓ నిందితుడు ఫేస్బుక్లో రోహన్ మాలిక్ పేరుతో ఖాతా తెరిచి, కిడ్నీ అవసరముంటూ పోస్టు చేశాడు. దీనిని చూసిన రాచకొండ కమిషనరేట్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి అతడిని సంప్రదించాడు. అనంతరం ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఒక ముఠా సభ్యుడు వాట్సాప్ ద్వారా ఇతడితో సంప్రదింపులు జరిపి కిడ్నీకి రూ.20 లక్షల వెలకట్టాడు. అతడు అంగీకరించడంతో ఢిల్లీకి తీసుకువెళ్లాడు. అక్కడికి వెళ్లిన బాధితుడిని నోయిడాలోని ఓ హోటల్లో ఉంచి వైద్య పరీక్షలు చేయించారు. బాధితుడు రోగి బంధువుగా నకిలీ సర్టిఫికెట్ సృష్టించారు. ఈ నకిలీ పత్రాల ఆధారంగా కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖకు స్టాంపింగ్ నిమిత్తం దాఖలు చేశారు. ఈ వ్యవహారాన్ని న్యూ ఢిల్లీలోని రోఖాదియా ఓవర్సీస్ కంపెనీకి చెందిన సందీ‹ప్ కుమార్ పర్యవేక్షించాడు. పత్రాలు నకిలీవని తెలిసీ స్టాంపింగ్ పూర్తి చేయించాడు. ఇలా పొందిన మెడికల్ వీసాపై బాధితుడిని టర్కీకి తీసుకెళ్లారు. అక్కడే అతడిని మోసం చేసి, బెదిరించి ఆపరేషన్ ద్వారా కిడ్నీ ‘తస్కరించారు’. అతికష్టమ్మీద నగరానికి తిరిగి వచ్చిన బాధితుడు రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏసీపీ హరినాథ్ నేతృత్వంలో ఈ కేసు దర్యాప్తు చేసిన పోలీసులు అమ్రిష్ సహా ఇద్దరిని గత నెలలో అరెస్టు చేశారు. ఎంఈఏలో తమ నకిలీ పత్రాలకు స్టాంపింగ్ పూర్తి చేయించడానికి తాము సందీప్ కుమార్‌కు రూ.10 వేల చొప్పున ఇచ్చే వారిమని బయటపెట్టారు. దీంతో అతడి కోసం గాలించిన సైబర్ క్రైమ్ పోలీసులు ఉత్తరప్రదేశ్‌లో పట్టుకున్నారు. అక్కడి కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్‌పై సిటీకి తీసుకువచ్చారు. ఈ గ్యాంగ్ దుబాయ్, వియత్నాం, చైనా, సింగపూర్, ఫిలీప్పిన్స్, బ్యాంకాక్, ఇండోనేషియా, మెక్సికోలకూ వెళ్లి వచ్చినట్లు తేలింది. దీంతో అక్కడా ఇలాంటి దందాలే చేశారా? అనే కోణంలో ఆరా తీçస్తున్నారు. -
కిడ్నీ రాకెట్ సూత్రధారి అరెస్ట్
విశాఖపట్నం పీఎం పాలెం(భీమిలి): నిరుపేదలను, డబ్బు అవసరం ఉన్న వారిని లక్ష్యంగా చేసుకుని కిడ్నీల రాకెట్ నడపడంలో ప్రధాన సూత్రధారి కనకమహాలక్ష్మిని పీఎం పాలెం పోలీసులు మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇందుకు సంబంధించి స్థానిక సీఐ కె.లక్ష్మణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం... గాజువాక బీసీ కాలనీకి చెందిన కనక మహాలక్ష్మి (40) ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నవారితో పరిచయాలు పెంచుకునేది. కిడ్నీ దానం చేసే వారికి లక్షలాది రూపాయలు చెల్లించే వారు తనకు తెలుసునని నమ్మించేది. పాతిక నుంచి 40 లక్షల రూపాయల వరకూ లబ్ధి పొందవచ్చునని ఎర వేసేది. ఆవిధంగా గోపాలపట్నం, ఆరిలోవ, కేఆర్ఎం కాలనీ ప్రాంతాలకు చెందిన కొంతమంది ఆమె మాటల వలకు చిక్కారు. కిడ్నీ ఇచ్చే వారు ముందుగా సుమారు రూ. 40 వేలు విలువ చేసే ఇంజక్షన్లు నాలుగు దపాలుగా వేయించుకోవాల్సి ఉంటుందని నమ్మించింది. అలా డాక్టర్‌తో ఇంజక్షన్లు వేయించి డబ్బు కాజేయడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. విచారణ చేపట్టి కనకమహాలక్ష్మిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని సీఐ తెలిపారు. -
కిడ్నీ రాకెట్ సూత్రధారులను అరెస్టు చేయకపోతే పోరాటం
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కిడ్నీ రాకెట్ కేసులో పోలీసులు అసలు సూత్రధారులను పక్కన పెట్టి, కేవలం డీల్ కుదిర్చిన మధ్యవర్తులనే అరెస్టు చేశారని నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వెనుక చక్రం తిప్పిన బడా వ్యాపారి ప్రమేయాన్ని, రాజకీయ జోక్యాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. శుక్రవారం నరసరావుపేటలో మీడియా మాట్లాడుతూ ప్రధాన నిందితులను అరెస్టు చేయకపోతే పోరాటం చేస్తామని హెచ్చరించారు. నరసరావుపేట: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కిడ్నీ రాకెట్ కేసులో అసలైన దోషులను తప్పించి కేవలం మధ్యవర్తులుగా వ్యవహరించిన వారినే అరెస్టు చేయడం హేయమని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. అసలైన నిందితులను అరెస్టు చేయకపోతే న్యాయ పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. శుక్రవారం పట్టణంలోని రామ్కీ ఫౌండేషన్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేసులో పోలీసులు నామమాత్రపు దర్యాప్తు చేసి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. రెవెన్యూ అధికారులు, కిడ్నీ దాతలకు మధ్యవర్తులుగా వ్యవహరించిన వారినే అరెస్టు చూపించారంటే పోలీసుల దర్యాప్తు ఎలా జరిగిందో అర్థం చేసుకోవచ్చన్నారు. కేసులో రెవెన్యూ అధికారుల తప్పుందని, పెద్ద నాయకులు సిఫారస్ చేస్తేనే తహసీల్దార్ రెసిడెన్సీ సర్టిఫికేట్ ఇచ్చారని స్వయంగా ఎస్పీనే చెప్పారన్నారు. రెవెన్యూ అధికారులకు తెలియకుండా ఏవిధంగా అనుమతులు లభించాయనేది స్పష్టం కావాల్సిఉందన్నారు. నాగమల్లేశ్వరరావు అనే వ్యక్తి ఆర్డీవో కార్యాలయంలో మూడుపత్రాలు తీసుకున్నట్లు సాక్ష్యాలు కూడా కార్యాలయంలో ఉన్నాయన్నారు. కపలవాయి విజయకుమార్ అనే వ్యాపారి కాల్ చేసినందునే సర్టిఫికెట్లు ఇచ్చామని తహసీల్దార్, జిల్లా ఎస్పీలు ఇద్దరూ చెప్పారన్నారు. వీరందరినీ వదిలేసి కేవలం దళారులనే బాధ్యులుగా చేయడం సరికాదన్నారు. నరసరావుపేట తహసీల్దార్ కార్యాలయం అక్రమాలకు కేంద్రంగా మారిందని, కిడ్నీ రాకెట్ వ్యవహారం ముగియకముందే ఎన్నికల కమిషన్ బీఎల్వోలకు ఇచ్చే పారితోషికం చెల్లింపుల్లో అవకతవకలు బయటపడ్డాయన్నారు. వారికి ఇవ్వాల్సిన డబ్బులను రెవెన్యూ అధికారులు, ఉద్యోగులు స్వాహా చేశారని విమర్శించారన్నారు. ల్యాండ్ కన్వర్షన్ చేయాలంటే ఎకరానికి రూ.5 లక్షలు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. భూమి అడంగల్‌లో ఎక్కించాలంటే దానికొక ఫీజు నిర్ణయించి వసూలుచేస్తున్నారన్నారు. ఆయన వెంట వైఎస్సార్ సీపీ యువజన విభాగ రాష్ట్ర కార్యదర్శి కాకుమాను సదాశివరెడ్డి, మాజీ ఎంపీపీ కంజుల వీరారెడ్డి , జిల్లా కార్యదర్శి కందుల ఎజ్రా తదితరులు ఉన్నారు. -
కిడ్నీ రాకెట్లో కొత్త కోణం
సాక్షి, గుంటూరు : నరసరావుపేట పట్టణంలో వెలుగు చూసిన కిడ్నీ రాకెట్లో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. కిడ్నీ మార్పిడికి రిఫర్ చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వేదాంత ఆసుపత్రి ఎండీ రామకృష్ణ శనివారం సంచలన విషయాలను వెల్లడించారు. పేషెంట్ శివ నాగేశ్వర్రావు కుటుంబం తమను మోసం చేసిందని, కిడ్నీ దానం చేసే రావూరి రవి కుమార్ స్ధానంలో వెంకటేశ్వర నాయక్‌ను తీసుకొచ్చారని చెప్పారు. వ్యక్తిని మార్చి ఆసుపత్రిని మోసగించారని ఆరోపించారు. నకిలీ ఆధార్ కార్డు పెట్టడంతో విచారణలో వెంకటేశ్వర నాయక్ దొరికాడని తెలిపారు. నాయక్ దొరకడంతో దేవరగట్టు గోపి అనే కొత్త వ్యక్తిని తెరపైకి తెచ్చారని అన్నారు. కిడ్నీ మార్పిడికి గుంటూరు ఎమ్మార్వో మూడు నెలల సమయాన్ని ఎలా ఇచ్చారో తనకు అర్థం కావడం లేదన్నారు. ఆసుపత్రికి గోపి అందించిన అడ్రస్ కూడా తప్పని తేలినట్లు చెప్పారు. తెలుగుదేశం నేత కపిలవాయి విజయకుమార్‌కు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. నరసరావుపేటలో సినిమా థియేటర్ నిర్మాణానికి దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు. అయితే, థియేటర్ నిర్మాణానికి అనుమతి ఇచ్చేందుకు ఎమ్మార్వో విజయ జ్యోతి కుమారి లంచం డిమాండ్ చేశారని వెల్లడించారు. డబ్బు ఇవ్వనందుకే వేదాంత ఆసుపత్రిపై ఆమె ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. పేషంట్ శివనాగేశ్వరావు, వెంకటేశ్వరనాయక్, గోపిల మధ్య ఎలాంటి ఆర్థిక లావాదేవీలు ఉన్నాయో ఆసుపత్రి యజమాన్యానికి తెలియదని చెప్పారు. కిడ్నీ రాకెట్‌పై పూర్తి విచారణ చేస్తేనే నిజనిజాలు బయటకు వస్తాయని అన్నారు. -
కిడ్నీ రాకెట్‌ను బట్టబయలు చేసిన టీకొట్టు..!
సాక్షి, డెహ్రాడూన్: చిన్న టీకొట్టు దగ్గర సంభాషణ ఓపెద్ద కిడ్నీ రాకెట్ పట్టుకోవడానికి కారణం అయ్యింది. పక్కా సమాచారం ఉన్న కేసుల్లోనే చేతులెత్తేస్తున్న పోలీసులు ఉన్న ఈరోజుల్లో ఒక చిన్న టీకొట్టు దగ్గర జరిగిన సంభాషణ కారణంగా పెద్ద కుంభకోణాన్ని వెలికి తీశారు డెహ్రాడూన్ పోలీసులు. వివరాల్లోకి వెళ్తే హరిద్వార్‌లోని రాణీపూర్ పోలీసు స్టేషన్లో పంకజ్ శర్మ నెలరోజుల క్రితం విధుల్లో చేరాడు. ఒక రోజు సాధారణ దుస్తుల్లో సమీపంలోని చిన్న టీకొట్టు దగ్గర టీతాగడానికి వెళ్లాడు. ఆసమయంలో నగరంలోని గంగోత్రి ఛారిటబుల్ హాస్పిటల్లో కిడ్నీ రాకెట్ జరుతుందని ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటుండగా విన్నాడు. వెంటనే సమాచారాన్ని పోలీసు స్టేషన్‌లోని ఉన్నతాధికారులకు చేరవేశారు. అంతేకాకుండా జిల్లాస్థాయి అధికారులకు కూడా గంగోత్రి హాస్సిటల్లో కిడ్నీతో పాటు జరుగుతున్న అవయవ రాకెట్‌ను గురించి సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పక్కా ప్రణాళిక ప్రకారం హాస్సిటల్ పరిసరాల్లో నెలరోజులు పాటు రెక్కీ నిర్వహించారు. నిందితులను పట్టుకోవడానికి హాస్పిటల్లో రహస్యంగా ప్రత్యేక నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకున్నారు. అనంతరం సీక్రెట్ కెమెరాల ద్వారా ఈ అక్రమాలకు పాల్పడుతున్న వారి కీలక సమాచారం సేకరించారు. ఇందులో కీలక సూత్రధారి అమిత్‌కుమార్, డాక్టర్లకు కిడ్నీలను సరఫరా చేస్తున్న జావేద్ ఖాన్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. కేసును ఛేధించడంలో కీలకపాత్ర పోషించిన పంకజ్ శర్మకు వచ్చే ఏడాది గణతంత్రదినోత్సవం రోజున రివార్డు వచ్చేవిధంగా రాష్ట్ర పోలీసు హెడ్‌క్వార్టర్స్‌కు సిఫారసు చేశారు. -
కార్పొరేట్ ఆసుపత్రిలో కిడ్నీ రాకెట్: డాక్టర్ల అరెస్ట్
అచ్చం సినిమాల్లో చూపించినట్లే జరిగింది. జబ్బున పడ్డ ఓ డబ్బున్న వ్యక్తికి కిడ్నీ అవసరమైంది. డాక్టర్ల ద్వారా విషయం తెలుసుకున్న బ్రోకర్లు.. డబ్బు అవసరం ఉన్న ఓ మహిళకు వలవేశారు. భారీ మొత్తంలో డీల్ కుదిరింది. ఆమెను రోగి భార్యగా చిత్రీకరించి, అతను చికిత్స పొందుతున్న కార్పొరేట్ ఆసుపత్రిలోనే కిడ్నీ మార్పిడి ఆపరేషన్ కు రంగం సిద్ధం చేశారు. కానీ చివర్లో పోలీసుల ఎంట్రీతో గుట్టు రట్టైంది. ఆసుపత్రి సీఈవో, నలుగు సీనియర్ డాక్టర్లు, రోగి బంధువులు, కిడ్నీ ఇచ్చేందుకు సిద్ధమైన మహిళ సహా మొత్తం 13 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈశాన్య ముంబైలోని ఎల్ హెచ్ హీరానందాని కార్పొరేట్ ఆసుపత్రిలో జరగనున్న అక్రమ కిడ్నీ ఆపరేషన్ ను పువాయి పోలీసులు మంగళవారం రాత్రి అడ్డుకున్నారు. ఆసుపత్రి సీఈవో సుర్జీత్ ఛటర్జీ, సీనియర్ డాక్టర్లయిన అనురాగ్ నాయక్, ముఖేశ్ సేథి, ముఖేశ్ షా, ప్రకాశ్ శెట్టిలతో పాటు 13 మందిని అరెస్టు చేశారు. ముంబై పోలీస్ శాఖ అధికార ప్రతినిధి అశోక్ దుబే కిడ్నీ రాకెట్ వివరాలు వెల్లడించాడు. సూరత్ కు చెందిన వ్యాపారవేత్త బ్రిజ్ కిషోర్ జైస్వాల్ కిడ్నీలు చెడిపోవడంతో ముంబైలోని హీరానందాని ఆసుపత్రిలో చేరాడు. ట్రాన్స్ ప్లాంటేషన్ అవసరమని డాక్టర్లు చెప్పారు. ఆసుపత్రిలోనే తిష్టవేసిన నీలేశ్ కాంబ్లే అనే బ్రోకర్.. జైస్వాల్ కుటుంబీకులను సంప్రదించి కిడ్నీ ఏర్పాటుచేస్తానని భారీ మొత్తామనికి డీల్ కుదుర్చుకున్నాడు. శోభా ఠాకూర్ అలియాస్ రేఖా దేవి అనే మహిళను కిడ్నీ దానానినిక ఒప్పించిన కాంబ్లీ.. అందుకుగానూ ఆమెకు రూ.21 లక్షలు ఇవ్వజూపాడు. తర్వాత.. కిడ్నీ దాత శోభను రోగి జైస్వాల్ భార్యగా డాక్టర్ల ముందు ప్రవేశపెట్టారు. కీలకమైన ఈ ఆపరేషన్ లో దాత రోగి బంధువా? కాదా? అనే విషయాన్ని నిర్ధారించుకోకుండానే డాక్టర్లు ఆపరేషన్ కు రంగం సిద్ధం చేశారు. మహేశ్ తన్నా అనే సామాజిక కార్యకర్త ఈ కిడ్నీ రాకెట్ వ్యవహారంపై పోలీసులకు సమాచారం అందించడంతో గుట్టురట్టైంది. బిసేన్ అనే సూత్రధారి ఆధ్వర్యంలో కిడ్నీ రాకెట్ నడుస్తున్నదన్న పోలీసులు.. ఇప్పటివరకు 100కుపైగా అక్రమ ఆపరేషన్లు నిర్వహించి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. నిందితులైన జైస్వాల్ కొడుకు కిషన్, ప్రధాన ఏజెంట్ కాంబ్లీ, సబ్ ఏజెంట్లు భిజేందర్, భరత్ శర్మ, ఇక్బాల్ సిద్దిఖీ, దాత రేఖ, ఆసుపత్రి సీఈవో, నలుగురు డాక్టర్లు సహా నిందితులందరినీ బుధవారం అంధేరీ కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. వీరిపై మానవ అవయవ మార్పిడి చట్టం-1994 ను అనుసరించి కేసులు నమోదుచేశామని, రేఖ నుంచి 8 లక్షలు రికవరీ చేశామని, ఈ కేసుకు సంబంధించి ఇంకొందరిని విచారిస్తామని పేర్కొన్నారు. కాగా, హీరానందాల్ ఆసుపత్రి యాజమాన్యం మాత్రం భిన్నంగా స్పందించింది. అక్రమ కిడ్నీ ఆపరేషన్ వ్యవహారంపై అంతర్గత దర్యాప్తు చేపడతామని ప్రకటించింది. -
కిడ్నీ రాకెట్లో అపోలో డాక్టర్ల విచారణ
ఇటీవల బయటపడిన కిడ్నీ రాకెట్‌కు సంబంధించి ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆస్పత్రికి చెందిన నలుగురు లేదా ఐదుగురు వైద్యులను పోలీసులు విచారించనున్నారు. ఈ విషయాన్ని ఢిల్లీ ఆగ్నేయ మండలం జాయింట్ కమిషనర్ రాజేందర్ పాల్ ఉపాధ్యాయ తెలిపారు. ఒకటి రెండు రోజుల్లో ఆ ఆస్పత్రిలోని వైద్యులకు సమన్లు పంపుతామని, ప్రధానంగా కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేసినవారినే పిలుస్తామని ఆయన అన్నారు. డాక్టర్ అశోక్ సరిన్, డాక్టర్ అన్షుమన్ అగర్వాల్ తదితర డాక్టర్లతో పాటు వాళ్ల పీఏలు అయిన శైలేష్ సక్సేనా, ఆదిత్య సింగ్‌లను కూడా పిలిపిస్తామని తెలిపారు. ఈ కిడ్నీ రాకెట్లో ఇంకా అసీమ్ సిక్దర్, సత్యప్రకాష్, దేవాశీష్ మౌలిక్ తదితరుల హస్తం కూడా ఉందని తెలిపారు. ఇందులో మరింతమంది వైద్యుల హస్తం కూడా ఉండే అవకాశం ఉందన్నారు. జూన్ రెండో తేదీన ఢిల్లీ పోలీసులు ఈ కిడ్నీ రాకెట్‌ను ఛేదించారు. ఇంద్రప్రస్థ అపోలో ఆస్పత్రికి చెందిన ఇద్దరు ఉద్యోగులతో పాటు ముగ్గురు కిడ్నీ బ్రోకర్లను కూడా అరెస్టు చేశారు. కోల్‌కతాకు చెందిన టి. రాజ్‌కుమార్ ఈ రాకెట్ సూత్రధారి. అతడతో పాటు ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ ప్రాంతానికి చెందిన ఇద్దరు మహిళలు, పశ్చిమబెంగాల్ లోని సిలిగురి జిల్లాకు చెందిన ఓ వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. ఢిల్లీ జలమండలి అధికారి భూలేసింగ్ కుమారుడు అశుతోష్ కూడా ఇలాంటి బ్రోకర్ల ద్వారానే కిడ్నీ పొందినందుకు అతడిని సైతం జూన్ 23న పోలీసులు అరెస్టుచేశారు. -
కిడ్నీ రాకెట్‌కు 2008లోనే బీజం
-
కిడ్నీ రాకెట్‌కు 2008లోనే బీజం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: నల్లగొండ కేంద్రంగా వెలుగుచూసిన కిడ్నీ రాకెట్‌కు ఏడేళ్ల క్రితమే బీజం పడిందా? అప్పటి నుంచి పకడ్బందీగా నెరపుతున్న ఆన్లైన్ లావాదేవీలతో ఎవరికీ అంతుచిక్కని విధంగా నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేశారా? ఈ రాకెట్‌తో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు చెందిన వందలాది మందికి సంబంధముందా? ఇప్పటి వరకు ఈ రాకెట్ ద్వారా దేశంలో 60 మంది కిడ్నీలు అమ్ముకున్నారా? ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే అంటున్నాడు కిడ్నీ రాకెట్లో దేశంలోనే కీలక ఏజెంట్‌గా వ్యవహరిస్తున్న సురేశ్‌భాయ్ అమృత్‌భాయ్ ప్రజాపతి. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌లోని సఫాల్వివాన్ ప్రాంతానికి చెందిన ఇతను పోలీసు విచారణలో పలు ఆసక్తికర వెల్లడించారు. నల్లగొండ జిల్లా ఎస్పీ విక్రమ్‌జీత్ దుగ్గల్ వెల్లడించిన వివరాల ప్రకారం జాతీయ స్థాయిలో జరిగిన ఈ కిడ్నీ కుంభకోణం పూర్వాపరాలివి. 2008లోనే ‘ఆన్లైన్’ పోస్టింగ్.. గుజరాత్‌కు చెందిన సురేశ్ ప్రజాపతికి ఏడేళ్ల క్రితమే కిడ్నీ వ్యాపారం చేయాలనే ఆలోచన వచ్చింది. అయితే, వ్యాపారానికి నెట్వర్క్ కావాల్సి ఉన్నందున ఆ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకునేందుకు అతను ఇంటర్నెట్ను ఆయుధంగా ఉపయోగించుకున్నాడు. 2008లోనే పలు వెబ్సైట్లు, బ్లాగ్‌లలో కిడ్నీ అమ్మకానికి పెట్టాడు. ‘ఐ వాంట్ టు హెల్ప్ యూ. ఐ వాంట్ సమ్ మనీ. ఐ విల్ గివ్ యు మై కిడ్నీ.’ అంటూ కిడ్నీలు అవసరమున్నవారిని ఆకర్షించే ప్రయత్నం చేశాడు. అతను ఏ స్థాయిలో ఆన్లైన్ లావాదేవీలు నిర్వహించాడంటే ‘బ్లాగ్స్.సులేఖ.కామ్’లో కిడ్నీ ట్రాన్స్‌ప్లాం ట్ ఆర్గనైజర్‌ను క్లిక్ చేస్తే నేరుగా సురేశ్ ప్రజాపతి వివరాలు లభిస్తాయి. అదే విధంగా 2009, మే14న ఎంఆర్ఐషాన్షరీఫ్.బ్లాగ్స్పాట్.ఇన్ అనే వెబ్సైట్లో కూడా అతని వివరాలు పొందుపరిచాడు. ఈ క్రమంలో అతనికి మహారాష్ట్రకు చెందిన మరో వ్యక్తి సబ్ ఏజెంట్‌గా కలిశాడు. ఆన్లైన్ ద్వారా పరిచయం చేసుకుని సురేశ్ ప్రజాపతిని అతను ఇద్దరూ కలసి ఈ వ్యాపారం ప్రారంభించారు. ఈ మహారాష్ట్రకు చెందిన సబ్ఏజెంట్ను అరెస్టు చేయాల్సి ఉంది. 2013లో మొదలు.. అసలు ఈ వ్యాపారాన్ని 2013లో ప్రారంభించాడు సురేశ్ ప్రజాపతి. ఆన్లైన్ ద్వారా మంచి నెట్‌వర్క్‌ను తయారు చేసుకున్న అతను శ్రీలంకలోని ఏజెంట్ల సహకారంతో అక్కడి నాలుగు ఆసుపత్రులకు చెందిన డాక్టర్లతో కుమ్మక్కయ్యాడు. మూడేళ్లలో ఇప్పటివరకు 60 మంది కిడ్నీలను శ్రీలంకలో అమ్మించాడు. కొలంబోలోని నవలోక్, హేమ, లంకన్ ఆసుపత్రులతో పాటు బొరెల్లాలోని వెస్టర్న్ ఆసుపత్రులలో ఈ వ్యవహారాన్ని గుట్టు చప్పుడు కాకుండా నడిపించాడు. ఇందుకు ఆయా ఆసుపత్రుల్లో పనిచేస్తున్న డాక్టర్ మాధవ, డాక్టర్ మోనిక్, డాక్టర్. సాధన (నవలోక్), డాక్టర్. చమిల (హేమ), డాక్టర్. నిరోషిని (లంకన్), డాక్టర్. హబీబా షరీఫ్ (వెస్టర్న్)లు సహకరించారు. వీరంతా శ్రీలంకీయులే. వీరి సహకారంతో పాటు ఆయా ఆసుపత్రుల యజమానులు డాక్టర్. హర్షిద్ (నవలోక్), డాక్టర్. శరత్ (లంకన్), డాక్టర్. రిజ్వీ షరీఫ్ ఆయన కుమారుడు రికజ్ షరీఫ్‌లు కూడా తోడయ్యారు. కిడ్నీలు ఇండియావి..అమ్మేది శ్రీలంకలో.. రేటు మాత్రం డాలర్లలో ఇక, ఈ కిడ్నీ రాకెట్‌కు సహకరించేందుకు గాను శ్రీలంకలోని ఆసుపత్రులకు పెద్ద మొత్తంలో ముట్టజెప్పాడు సురేశ్ప్రజాపతి. ఒక్కో కిడ్నీని మార్పిడి చేసేందుకు గాను ఆస్పత్రి ఫీజుల కింద 22 వేల డాలర్లు చెల్లించాడు. కిడ్నీ మార్పిడి చేసేందుకు ఆసుపత్రి ఎథిక్స్ కమిటీ అనుమతి అవసరం. కాగా, అందులో ఒక ఆసుపత్రి డాక్టర్, మరో ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్‌తో పాటు ఆరోగ్య శాఖ నుంచి మరో ఉన్నతాధికారి సభ్యులుగా ఉంటారు. ఈ సభ్యులను మేనేజ్ చేసేందుకు గాను 500 డాలర్లు చెల్లించారా..? లేక ఎథిక్స్ కమిటీకి కూడా చెప్పకుండా కేవలం ఫీజు రూపంలో చెల్లించారా అనేది విచారణలో తేలాల్సి ఉంది. ఇక, ఈ కిడ్నీ మార్పిడి వ్యవహారంలో ఒక్కో కిడ్నీకి రూ.28 నుంచి 30 లక్షలను వసూలు చేస్తుంటాడు సురేశ్ ప్రజాపతి. అందులో రూ.5 లక్షలు కిడ్నీ విక్రేతలకు ఇచ్చి మిగిలినవి డాక్టర్లు, ఆసుపత్రి ఖర్చులతోపాటు ఏజెంట్లకు, ప్రయాణచార్జీలకు, వీసా ప్రాసెసింగ్, శ్రీలంక వెళ్లి వచ్చేందుకు టికెట్లు, అక్కడ వసతి సదుపాయాలకు ఖర్చు పెట్టేవాడు. సురేశ్ కూడబెట్టిన ఆస్తులివే.. ఏడేళ్ల క్రితమే తాను కిడ్నీని అమ్ముతానని ఆన్లైన్లో పెట్టిన సురేశ్ ప్రజాపతికానీ, అతనికి సహకరించిన దిలీప్కానీ కిడ్నీలు అమ్ముకోకపోవడం కొసమెరుపు. మరో విశేషమేమిటంటే ఈ రాకెట్ ద్వారా సురేశ్ ప్రజాపతి రూ.3 కోట్ల వరకు ఆస్తులు సంపాదించాడు. అహ్మదాబాద్‌లో రూ.1.40 కోట్ల విలువైన ఓ ఇల్లు, రూ.30 లక్షలతో ఓ ఆఫీసు, రూ.27 లక్షలతో తన ఆఫీసుకు, ఇంటికి ఫర్నీచర్, రూ.8.5 లక్షలు చెల్లించి, మిగతా బ్యాంకు నుంచి రుణం తీసుకుని ఓ ఆడి కారు కూడా కొన్నాడు. రూ. లక్ష వెచ్చించి బజాజ్ ఎవెంజర్ మోటార్ సైకిల్ కూడా కొన్నాడు. మొత్తం రూ.45 లక్షల వరకు ఏజెంట్లకు ముట్టచెప్పాడు. తాను గతంలో కొన్న అపార్ట్‌మెంట్‌కు ఉన్న రూ. 7లక్షల బ్యాంకు రుణం కూడా తీర్చేశాడు. ఇప్పుడు సురేశ్ ప్రజాపతి బ్యాంకు బాలెన్స్ ఎంతో తెలుసా.. రూ.21లక్షలు. ఇతనికి సహకరించిన దిలీప్ కూడా 15లక్షలు పెట్టి అహ్మదాబాద్‌లో ఇల్లు కొనుక్కుని మరో రూ.లక్ష ఖర్చుచేశాడు. మరో ముగ్గురు అరెస్టు ఈ కుంభకోణంలో కీలక పాత్రధారి, దేశవ్యాప్త ఏజెంట్ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన సురేశ్‌భాయ్ అమృత్‌భాయ్ ప్రజాపతిని నల్లగొండ పోలీసులు అరెస్టు చేశారు. అతనికి సహకరిస్తున్న మరో ఏజెంట్ దిలీప్చౌహాన్ (గుజరాత్), తన కిడ్నీని అమ్ముకుని ఏజెంట్‌గా మారిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన జెను నూకరాజులను కూడా అదుపులోనికి తీసుకున్నారు. ముగ్గురినీ నల్లగొండ ఎస్పీ విక్రమ్‌జీత్ దుగ్గల్ మంగళవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ ముగ్గురి అరెస్టుతో ఇప్పటివరకు ఈ కేసులో అరెస్టయిన వారి సంఖ్య పదికి చేరింది. సమావేశంలో ఏఎస్పీ గంగారాం, నల్లగొండ డీఎస్పీ సుధాకర్, సీఐలు రవీందర్, టి.శ్రీనివాస్. శాలిగౌరారం సీఐ ప్రవీణ్ పాల్గొన్నారు. అమ్మినవాళ్లు... కొన్నవాళ్లు వీరే.. సురేశ్ ప్రజాపతి నెట్వర్క్ ద్వారా 60 మంది కిడ్నీలు అమ్ముకోగా, 54 మంది డబ్బు లు చెల్లించి కిడ్నీలు మార్పిడి చేయించుకున్నారని తేలింది. కిడ్నీలు అమ్ముకున్న వారిలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెందిన వారు 22 మంది ఉన్నారు. తమిళనాడు ఆరుగురు, మహారాష్ట్ర ఐదుగురు, క ర్నాటక నలుగురు, ఢిల్లీకి చెందిన ముగ్గురు, జమ్ము-కాశ్మీర్, మధ్యప్రదేశ్, కేరళ, ఛత్తీస్‌గఢ్‌లకు చెందిన ఒక్కొక్కరున్నారు. ఇతర రాష్ట్రాల వారు మరో 11 మంది ఉన్నారు. ఇక, కిడ్నీలు మార్పిడి చేసుకున్నవారిలో ఢిల్లీ (2), గుజరాత్ (8), మహారాష్ట్ర (6),జమ్ము-కాశ్మీర్ (5), పంజాబ్ (3)తోపాటు రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, అస్సాం రాష్ట్రాల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. వీరితో పాటు మరో ఇద్దరు కూడా ఉన్నారు. అవయవ మార్పిడి చట్టం ప్రకారం అనుమతి లేకుండా కిడ్నీలు దానం చేయడంతో పాటు డబ్బులు వెచ్చించి మార్పిడి చేయించుకోవడం కూడా నేరమేనని, ఈ రాకెట్‌తో సంబంధమున్న అందరినీ అరెస్టు చేస్తామని ఎస్పీ దుగ్గల్ వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించిన కీలక నిందితుడి అరెస్టుతో శ్రీలంకకు సంబంధించిన సాక్ష్యాధారాలు బలంగా లభిస్తున్నాయని, అవసరమైతే శ్రీలంక వెళ్లి విచారణ జరిపేందుకు కూడా నల్లగొండ పోలీసులు సిద్ధంగా ఉన్నారని ఆయన వెల్లడించారు. -
కిడ్నీ రాకెట్‌పై డీజీపీకి నివేదిక
-
కిడ్నీ రాకెట్‌పై డీజీపీకి నివేదిక
♦ వివరాలను పోలీస్‌బాస్‌కు పంపిన నల్లగొండ ఎస్పీ ♦ శ్రీలంక వెళ్లేందుకు ప్రభుత్వ అనుమతి కోరిన దుగ్గల్? ♦ హైదరాబాద్‌లో మరొకరిని అదుపులోకి తీసుకున్న నల్లగొండ పోలీసులు సాక్షి ప్రతినిధి, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో వెలుగుచూసిన సంచలన కిడ్నీ రాకెట్ వ్యవహారంపై పూర్తిస్థాయి నివేదిక రాష్ట్ర డీజీపీకి అందింది. ఈ మేరకు నల్లగొండ జిల్లా ఎస్పీ విక్రమ్‌జీత్ దుగ్గల్ రాకెట్‌కు సంబంధించి తాము వెలికితీసిన అన్ని అంశాలతో కూడిన నివేదికను డీజీపీ అనురాగ్‌శర్మకు పంపారు. ఇప్పటికే చాలావరకు దర్యాప్తులో తేలిందని, అయితే, కిడ్నీలు అమ్ముకున్న వారు పలు రాష్ట్రాల్లో ఉన్నందున అక్కడకు వెళ్లి వారిని తీసుకువస్తే మరిన్ని విషయాలు వెలుగులోనికి వస్తాయని కూడా ఎస్పీ తన నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. మరోవైపు శ్రీలంక రాజధాని కొలంబో కేంద్రంగా ఈ రాకెట్ నడుస్తున్న నేపథ్యంలో కొలంబో వెళ్లి విచారణ జరిపేందుకు ప్రభుత్వంతో తమకు అనుమతి ఇప్పించాలని కూడా నల్లగొండ ఎస్పీ దుగ్గల్ కోరినట్టు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. మొత్తంమీద ఈ కిడ్నీ రాకెట్ వివరాలు హైదరాబాద్ చేరడంతో దర్యాప్తు మరింత వేగిరం అవుతుందని భావిస్తున్నారు. అదుపులో మరొకరు? ఇక, ఈ రాకెట్లో సూత్రధారి అయిన మరొకరిని నల్లగొండ పోలీసులు అదుపులోనికి తీసుకున్నారని తెలుస్తోంది. ఈ రాకెట్లో అరెస్టయిన నల్లగొండ పట్టణానికి చెందిన కస్పరాజు సురేశ్‌తో పాటు మరో ముగ్గురు యువకులు ఇచ్చిన సమాచారం మేరకు ఏయే రాష్ట్రాల్లో కిడ్నీ కుంభకోణం లింకులున్నాయో విచారించేందుకు నల్లగొండకు చెందిన ఓ పోలీసు బృందం హైదరాబాద్‌కు వెళ్లింది. అక్కడ విచారణలో భాగంగా నాంపల్లికి చెందిన ఓ యువకుడిని నల్లగొండ పోలీసులు అదుపులోనికి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ రాకెట్లో కీలకంగా భావిస్తున్న ఇతను ఇచ్చే సమాచారం కూడా దర్యాప్తును వేగిరం చేయనుందని పోలీసువర్గాలు చెబుతున్నాయి. -
ఆపరేషన్ కిడ్నీ
-
లక్ష ఇస్తేనే బతుకుతా..
‘నాన్నా.. నేను ఇక బతకలేను.. మీకు నేను కావాలనుకుంటే రూ.లక్ష నా బ్యాంకు ఖాతాలో వేయండి. ఎంత త్వరగా డిపాజిట్ చేస్తే అంత మంచిది....లేకుంటే ఇక మీరు నన్ను చూడలేరు’’ అంటూ దమ్మపేట మండలం నాయుడుపేట గ్రామానికి చెందిన మువ్వా నరేష్కుమార్ మాట్లాడలేని స్థితిలో తండ్రి సుబ్బారావుకు ఫోన్ చేశాడు. ఎకరం న్నర భూమిలో వ్యవసాయం చేసి కుటుంబాన్ని పోషించే తండ్రికి ఏం చేయాలో పాలుపోలేదు. కొడుకు ప్రాణాలు కాపాడుకోవాలనే తాపత్రయంతో బ్యాంకు ఖాతాలో రూ.లక్ష డిపాజిట్ చేశాడు. తిరిగి రెండ్రోజుల తర్వాత మరో రూ.3 లక్షలు కావాలని కొడుకు ఫోన్ చేశాడు. తీగ లాగితే... కిడ్నీ రాకెట్ డొంక కదిలింది. * డబ్బు పంపాలని తండ్రికి కిడ్నీ బాధితుడి ఫోన్ * మూడు రోజుల తర్వాత రూ. 3 లక్షలు పంపమన్న కొడుకు * అనుమానంతో పోలీసులను ఆశ్రయించిన తండ్రి * వెలుగుచూసిన కిడ్నీ రాకెట్ సాక్షిప్రతినిధి, ఖమ్మం / అశ్వారావుపేట: మరో రూ.3 లక్షలు కావాలని.. లేకుంటే నేను చనిపోతానని చెప్పడంతో అనుమానం వచ్చిన తండ్రి దమ్మపేట పోలీసులకు సమాచారం అందించాడు. కేసు నమోదు చేయకున్నా.. మానవతాదృక్పథంతో నరేష్ ఉంటున్న ప్రాంతాన్ని సెల్ టవర్ ఆధారంగా గుర్తించిన పోలీసులు తండ్రికి సమాచారం అందించడంతో విజయవాడ వన్‌టౌన్ ప్రాంతంలో ఉన్న నరేష్‌ను ఇంటికి తీసుకొచ్చాడు. ఇంటికి వచ్చాక నరేష్ ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో ఉండటంతోపాటు పొట్టపై కోసినట్లు గాయం ఉంది. దీంతో ఈనెల 7న సత్తుపల్లిలోని ఓప్రైవేటు ఆస్పత్రిలో పరీక్ష చేయించారు. అక్కడ పరీక్షించిన వైద్యుడు ఒక కిడ్నీ లేదని చెప్పాడు. నరేష్ ఏమీ మాట్లాడలేక పోవడంతో దమ్మపేట పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన కుమారుడికి అన్యాయం జరిగిందంటూ తండ్రి ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు దమ్మపేట పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం ఉదయమే అశ్వారావుపేట సీఐ రవికుమార్ నేతృత్వంలో పోలీసులు నరేష్కుమార్, అతని తండ్రి సుబ్బారావును సత్తుపల్లి డీఎస్పీ కవిత ఎదుట హాజరుపరిచారు. విచారణ అనంతరం నల్లగొండ జిల్లాలో ఇలాంటి కేసే నమోదు కావడంతో, మరింత సమాచారం కోసం న ల్లగొండ జిల్లాకు తీసుకువెళ్లారు. అంతుపట్టని సందేహాలు.. దమ్మపేట మండలం నాయుడుపేట గ్రామంలో ఎవరితో వివాదాలు లేకుండా కేవలం చదువు మీద మాత్రమే దృష్టి పెట్టే నరేష్కుమార్ కిడ్నీ రాకెట్లో ఇరుక్కున్నాడని తెలియడంతో గ్రామస్తులు అవాక్కయ్యారు. ఈనెల 4న తండ్రి జమచేసిన రూ.లక్ష ప్రకాశం జిల్లాకు చెందిన బీఎన్ రెడ్డి అనే వ్యక్తి ఖాతాకు బదిలీ చేయడంతోపాటు గతంలో కూడా ఇదే ఖాతాకు నరేష్ ఖాతా నుంచి డబ్బులు బదిలీ అవటానికి కారణాలు అర్థం కావడంలేదు. దీనికి తోడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు తండ్రి పంపిన లక్ష రూపాయలతో క్రికెట్ బెట్టింగ్ ఆడితే.. రూ. 5లక్షలు వస్తాయని.. తద్వారా తన కిడ్నీ తనకు ఇస్తారని నరేష్‌ను మోసగాళ్లు నమ్మించారని.. దీంతో నరేష్ తన వద్ద ఉన్న లక్షను బెట్టింగ్‌లో ఉంచినట్లు తండ్రి దమ్మపేట పోలీసులతో చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ తన కిడ్నీని గతడాది నవంబర్‌లో తొలగిస్తే.. ఈనెల 2వరకు కొలంబో, చెన్నై, విజయవాడలో పోలీసులను ఎందుకు ఆశ్రయించలేక పోయాడనే అంశాలపై పోలీసులు దృష్టి సారించినట్లు సమాచారం. కొలంబోలో విమానం ఎక్కించిన తర్వాత చెన్నైలో రెండు వారాల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పనిచేయడానికి ఆస్పత్రి యాజమాన్యం ఎలా అనుమతించిందనేది అంతుపట్టని విషయం. ఉన్నట్లుండి తనను మోసం చేసిన బ్రోకర్ చెన్నై మహానగరంలో తారసపడటం.. రెండోసారి మోసపోవడం.. తండ్రి నుంచి డబ్బులు రప్పించి బెట్టింగ్ ఆడటం... మళ్లీ డబ్బులు కావాలని ఫోన్‌చేయడంతో తండ్రి కుమారుడి ఆచూకీ కనిపెట్టాడే తప్ప నరేష్ తనకు తానుగా ఇంటికి రాకపోవడంపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఓ పోలీస్ ఉన్నతాధికారిని సంప్రదించగా.. కిడ్నీ అపహరణకు గురైందా..?. అమ్మకం జరిగిందా అనే కోణంలో పూర్తి దర్యాప్తు జరుగుతుందన్నారు. ఏదేమైనా పోలీసుల విచారణ నాయుడు పేట నుంచి కొలంబో వరకు జరిగితేనే అన్ని వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈవిషయమై సత్తుపల్లి డీఎస్సీ కవితను సంప్రదించగా కేసుకు సంబంధించిన అన్ని విషయాలను అశ్వారావుపేట సీఐ రవికుమార్ పర్యవేక్షిస్తున్నారని అన్నారు. ఆయనను సంప్రదించగా నరేష్ ఏమీ మాట్లాడటం లేదని.. ప్రస్తుతానికి కావలసిన వివరాలను కాగితంపై రాసి ఇస్తున్నాడని.. విచారణ ప్రాథమిక దశలోనే ఉందన్నారు. కిడ్నీ రాకెట్‌ను ఛేదించేందుకు రంగంలోకి టాస్క్‌ఫోర్స్ మువ్వా నరేశ్‌కుమార్‌ను నల్లగొండ పోలీసులు కూడా విచారించారు. రెండు జిల్లాల్లోనూ కిడ్నీ రాకెట్ ఉదంతాలు వెలుగుచూడడంతో పోలీసులు విచారణను మరింత వేగవంతం చేశారు. హైదరాబాద్ నుంచి వచ్చిన పోలీసులు నల్లగొండ జైలులో ఉన్న నలుగురు నిందితులను కలిసి కొన్ని వివరాలు సేకరించి వెళ్లినట్టు తెలుస్తోంది. ఇక, ఈ కిడ్నీ రాకెట్లో పాత్రధారులైన వారందరి వివరాల ఆధారంగా వారిని పట్టుకునేందుకు కూడా నల్లగొండ జిల్లా పోలీసులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఎలాగైనా రాకెట్ ఛేదించండి: నల్లగొండ ఎస్పీ ఆదేశాలు ఇక, ఈ కిడ్నీ రాకెట్ విషయంలో నల్లగొండ ఎస్పీ విక్రమ్‌జీత్ దుగ్గల్ సీరియస్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ వ్యవహారంతో సంబంధమున్న అందరి నిగ్గూ తేల్చాల్సిందేనని, పకడ్బందీగా దర్యాప్తు చేయాలని జిల్లా పోలీసులకు ఆదేశాలిచ్చారు. మరోవైపు ఈ రాకెట్‌ను ఛేదించేందుకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు కూడా రంగంలోనికి దిగారు. హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బందం గురువారమే నల్లగొండకు వచ్చి విచారణ చేసినట్టు తెలుస్తోంది. వీరు జైలులో ఉన్న నలుగురు నిందితులను కూడా కలిసి వివరాలు తెలుసుకుని వెళ్లారని పోలీసు వర్గాల సమాచారం. మరోవైపు ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఈ కిడ్నీ లింకులను తెలుసుకునేందుకు కూడా నల్లగొండ, హైదరాబాద్ పోలీసులు సంయుక్తంగా ఇతర రాష్ట్రాలకు వెళ్లారని తెలుస్తోంది. ఈ రాకెట్ ద్వారా కిడ్నీలు అమ్ముకుని వారందరినీ తీసుకువస్తే అన్ని విషయాలు కూలంకషంగా వెలుగులోకి వస్తాయనే ఆలోచనతో పోలీసులున్నట్టు తెలుస్తోంది. -
వీసా టూరిస్టుది.. వెళ్లేది కిడ్నీ విక్రయానికి
-
వీసా టూరిస్టుది.. వెళ్లేది కిడ్నీ విక్రయానికి
* కిడ్నీ రాకెట్లో మరిన్ని వాస్తవాలు వెలుగులోకి * దేశవ్యాప్తంగా నలుగురు ఏజెంట్ల కీలకపాత్ర! * గతంలోనూ హైదరాబాద్ కేంద్రంగా మూడుసార్లు రాకెట్ బట్టబయలు * కేంద్రం పట్టించుకుంటేనే ఈ రాకెట్‌కు చెక్ సాక్షి ప్రతినిధి, నల్లగొండ: నల్లగొండలో వెలుగుచూసిన కిడ్నీ రాకెట్లో మరిన్ని ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ రాకెట్‌తో సంబంధం ఉండి కిడ్నీలు అమ్ముకున్న వారందరూ టూరిస్టు వీసాలపై శ్రీలంకకు వెళ్లారని పోలీసుల విచారణలో తేలింది. నల్లగొండ జిల్లాతోపాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వెళ్లిన వీరు కొలంబోలో ఉన్న ఏజెంట్లను కలసి కిడ్నీలు అమ్ముకుని గుట్టుచప్పుడు కాకుండా తిరిగి వచ్చినట్టు వెల్లడైంది. ఈ రాకెట్‌తో సంబంధమున్న నలుగురిని నల్లగొండ పోలీసులు బుధవారంరాత్రి అరెస్ట్ చేసిన విషయం విదితమే. ఈ రాకెట్లో దేశవ్యాప్తంగా నలుగురు ఏజెంట్లు కీలకపాత్ర పోషిస్తున్నట్టు పోలీ సు విచారణలో నిందితులు వెల్లడించినట్లు తెలుస్తోంది. దేశంలోని మిగతా రాష్ట్రాలకు చెందిన వారే కీలకంగా ఉన్నారని తెలుస్తోంది. అందులో కూడా పశ్చిమబెంగాల్ కేంద్రంగా ఈ రాకెట్ సూత్రధారులు పనిచేస్తున్నట్టు సమాచారం. పోలీసుల దర్యాప్తులో కూడా బెంగాల్ రాష్ట్రానికి చెందిన కొందరు కొలంబో వెళ్లి కిడ్నీలు అమ్ముకున్నట్టు తేలింది. వీరిని నల్లగొండకు చెందిన కీలక పాత్రధారి ఇంటర్నెట్లో పరిచయం చేసుకున్నా, అక్కడ ఉన్న కీలక ఏజెంట్లతో కలసి వారిని శ్రీలంకకు పంపారని తెలుస్తోంది. అయితే, ప్రతిసారీ ఈ ఏజెంట్లు శ్రీలంకకు వెళ్లలేదని, అక్కడ ఉన్న మూడు ఆసుపత్రుల నెట్‌వర్క్‌తోపాటు మరికొంత మంది వ్యక్తుల సాయంతో ఒక్కొక్కరే వెళ్లి కిడ్నీలు అమ్ముకుని వచ్చారని తెలుస్తోంది. ఇక్కడి కీలక వ్యక్తులు అక్కడి ముఠాలోని ఏజెంట్లకు సమాచారం ఇస్తారని, వారి ఫోన్ నంబర్లు, అడ్రస్‌లు ఇక్కడే కిడ్నీ దాతలకు ఇచ్చి పంపిస్తారని పోలీసుల అదుపులో ఉన్న నిందితులు వెల్లడించినట్టు తెలుస్తోంది. ట్రాన్స్‌ప్లాంటేషన్ ఖర్చు తక్కువ ఈ రాకెట్‌తో శ్రీలంకకు సంబంధాలు ఉండేందుకు రెండు కారణాలు ఉన్నాయని పోలీసువర్గాలు భావిస్తున్నాయి. కిడ్నీ మార్పిడికి అయ్యే ఖర్చు శ్రీలంకలో చాలా తక్కువ(మన దేశంతో పోలిస్తే) ఉంటుందని, దీంతో పాటు కిడ్నీ మార్పిడి కోసం అవసరమైన న్యాయపరమైన డాక్యుమెంట్లను సమర్పించడం కూడా సులువుగా ఉంటుందని, అందుకే కిడ్నీ కుంభకోణం అంటేనే వేళ్లు శ్రీలంక వైపు చూపెడుతున్నాయని పోలీసులంటున్నారు. గతంలోనూ మూడుసార్లు గతంలో కూడా హైదరాబాద్ కేంద్రంగా మూడుసార్లు ఈ కిడ్నీ రాకెట్ బయటకు వచ్చింది. ప్రస్తుత డీజీపీ అనురాగ్‌శర్మ సిటీ పోలీస్ కమిషనర్‌గా పనిచేస్తున్నప్పుడు కూడా కిడ్నీ డొంక కదిలించారు. అప్పుడు కూడా శ్రీలంకతో సంబంధాలున్నట్టు తేలింది. మరోసారి శ్రీలంకతో, ఇంకోసారి ఇరాన్‌తో కిడ్నీ రాకెట్‌కు సంబంధాలున్న కేసులు కూడా పోలీసులకు లభించాయి. ఎన్నిసార్లు కిడ్నీ రాకెట్ బయటకు వచ్చినా కేసును ఛేదించలేకపోయారు. ఈ రాకెట్లకు అంతర్జాతీయ సంబంధాలున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించాల్సి ఉంటుందని, జాతీయ స్థాయి దర్యాప్తు సంస్థలతో సమగ్ర విచారణ జరపాల్సి ఉంటుందని, ఈ కేసుల విషయంలో ఇతర దేశాల సహకారం కూడా అవసరం ఉంటుందని రాష్ట్రస్థాయిలో పనిచేస్తోన్న ఓ పోలీసు అధికారి ‘సాక్షి’తో మాట్లాడుతూ వ్యాఖ్యానించడం గమనార్హం. శ్రీలంకకు వెళ్తాం ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టేందుకుగాను శ్రీలంకకు వెళ్లే యోచనలో జిల్లా పోలీసులున్నట్టు తెలుస్తోంది. తమకు అనుమతి ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులను అడిగే యోచనలో జిల్లా పోలీసులున్నారు. ‘ఈ కేసును మేమే దర్యాప్తు చేయాలనుకుంటున్నాం. అందుకుగాను శ్రీలంకకు వెళ్తామని ప్రభుత్వాన్ని అనుమతి అడుగుతాం. మాకు అనుమతి లభిస్తే మేమే వెళ్తాం. లేదంటే అప్పుడు ఈ కేసును సీఐడీకి లేదా ఇతర దర్యాప్తు సంస్థలకు అప్పగించే దిశలో నిర్ణయం తీసుకోవచ్చు. అప్పటివరకు కేసు మా దగ్గరే ఉంటుంది.’ అని జిల్లాకు చెందిన ఓ పోలీసు ఉన్నతాధికారి ‘సాక్షి’కి వెల్లడించారు. -
కిడ్నీ రాకెట్ గుట్టురట్టు
♦ నల్లగొండ కిడ్నీ రాకెట్‌కు అంతర్జాతీయ లింక్ ♦ కొలంబోలోని మూడు ఆస్పత్రుల్లో నెట్వర్క్ ♦ ఒక్కో కిడ్నీకి రూ.25 లక్షలు ♦ ఖర్చుపోనూ దాతకు ఇచ్చేది రూ. 5 లక్షలు ♦ రాకెట్ ఏజెంట్ సహా ముగ్గురు అరెస్టు ♦ కారు, ఏటీఎం కార్డు, పాస్‌పోర్టుల స్వాధీనం ♦ సాక్షి కథనాలతో వెలుగులోకి.. వెల్లడించిన ఎస్పీ నల్లగొండ క్రైం: నల్లగొండ జిల్లా కిడ్నీ రాకెట్‌కు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సంబంధాలు ఉన్నాయని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇంటర్నెట్ ద్వారా అమాయకులకు ఎరవేసి జాతీయస్థాయిలో వ్యాపారం నిర్వహిస్తున్న విషయాన్ని సాక్షి కథనాలను ప్రచురించిన విషయం విదితమే. ఎస్పీ విక్రమ్ జీత్ దుగ్గల్ బుధవారం రాత్రి తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ రాకెట్ వివరాలు వెల్లడించారు. జిల్లా కేంద్రంలో సురేష్‌తో పాటు మరో ముగ్గురు వ్యక్తులు, బెంగాల్లో నలుగురు, హైదరాబాద్‌లో నలుగురు, తమిళనాడులో ఇద్దరు, ముంబైలో ఒక్కరు, న్యూఢిల్లీలో ఒక్కరు చొప్పున కిడ్నీలను అమ్మించి సొమ్ము చేసుకున్నట్లు తెలిపారు. నల్లగొండలోని ఏజెంటు కస్పరాజు సురేష్ (22) తన కిడ్నీని అమ్ముకుని.. అనంతరం ఏజెంటుగా అవతారమెత్తి 15 మంది కిడ్నీలను వివిధ ప్రాంతాల్లో అమ్మేసినట్లు తెలిపారు. అయితే అవసరమున్న వారు ఒక్కో కిడ్నీకి రూ. 25 లక్షలు చెల్లిస్తారని తెలిపారు. దాంట్లో కిడ్నీ దాతకు అన్ని ఖర్చులు పోను రూ. 5 లక్షలు చెల్లిస్తారని వివరించారు. ఈ రాకెట్‌కు మహారాష్ట్ర, కర్నాటక, న్యూఢిల్లీ, బెంగాల్, ముంబై, కొలంబో ప్రాంతాలకు సంబంధాలు ఉన్నాయని ఎస్పీ వివరించారు. అమాయకులను ఎరవేసి కిడ్నీలను కొలంబోలోని నవలోక, వెస్ట్రన్, లంకన్ ఆస్పత్రుల్లో ఇస్తున్నట్లు తెలిపారు. గుజరాత్లో మెడికల్ టెస్ట్‌లు నిర్వహిస్తూ అందుకు అవసరమయ్యే ఆపరేషన్, రవాణా ఖర్చులను ఓ ఏజెంటు ద్వారా నడిపిస్తున్నట్లు వివరించారు. కిడ్నీ నెట్‌వర్క్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు విచారణలో వెలుగులోకి రావాల్సి ఉందన్నారు. ఏజెంటు సురేష్‌తో పాటు జిల్లా కేంద్రానికి చెందిన మరో ముగ్గురు అబ్దుల్ హఫీజ్ అలీయాస్ ఖాజీం, పాలెం మహేష్, నరేష్‌ను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. వీరి వద్ద మూడు పాస్‌పోర్టులు, మోటారు బైకు, టాటా ఇండిగో కారు, డెబిట్ కార్డు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. -
తీగ లాగితే కదులుతున్న ‘కిడ్నీ’లు
-
తీగ లాగితే కదులుతున్న ‘కిడ్నీ’లు
♦ సమగ్ర దర్యాప్తు జరిపిన అనంతరం ♦ వివరాలు వెల్లడిస్తాం: ఎస్పీ దుగ్గల్ ♦ కలకలం సృష్టించిన ‘సాక్షి’ కథనం సాక్షి ప్రతినిధి, నల్లగొండ: జిల్లాలో గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న కిడ్నీ రాకెట్ వ్యవహారంలో మరిన్ని ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఈ రాకెట్‌కు కేవలం మహారాష్ట్రకే కాకుండా ఉత్తరప్రదేశ్, జమ్మూ-కశ్మీర్లకు కూడా లింకు ఉందని, కనీసం మూడు రాష్ట్రాలకు సంబంధముందని పోలీసువర్గాలు భావిస్తున్నాయి. తమ అదుపులో ఉన్న నిందితుడి నుంచి అన్ని వివరాలు రాబట్టేందుకు పోలీసులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. నిందితుడు ఇచ్చిన వివరాల ఆధారంగా దాదాపు బాధితులందరి వివరాలు రాబట్టారని తెలిసింది. అసలు ఈ రాకెట్లో ఉన్నది ఆ ఒక్కడేనా? నల్లగొండకు చెందిన ఇంకెవరైనా ఉన్నారా? వారికి లింకు ఎక్కడ ఉంది? అక్కడ ఉన్న ముఠాల వివరాలేంటి? అనే అంశాలను కూపీ లాగే పనిలో పడ్డారు పోలీసులు. అయితే, ఈ కిడ్నీ రాకెట్‌పై మంగళవారం ‘సాక్షి’ పత్రికలో ప్రచురితమైన కథనాలు జిల్లాలో సంచలనం సృష్టిం చాయి. ముఖ్యంగా నల్లగొండ జిల్లా కేంద్రంలో జరుగుతున్న ఈ రాకెట్‌పై స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎస్పీ దుగ్గల్ కూడా జిల్లా పోలీసు అధికారులతో ఈ విషయమై చర్చించి పలు సూచనలు చేసినట్టు సమాచారం. ఈ రాకెట్‌ను ‘సాక్షి’ వెలుగులోకి తేవడం తో అప్రమత్తమైన బాధితులు కొందరు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పోలీసులకు వివరాలు అందిస్తుండగా, మరికొందరు వెనుకంజ వేస్తున్నారు. అన్ని వివరాలు వచ్చాక వెల్లడిస్తాం: ఎస్పీ దుగ్గల్ ఈ కిడ్నీ రాకెట్ వ్యవహారంపై జిల్లా ఎస్పీ విక్రమ్‌జీత్ దుగ్గల్ ‘సాక్షి’తో మాట్లాడుతూ విచారణ జరుగుతున్న మాట వాస్తవమేనన్నారు. అయితే, ఈ విచారణలో చాలా అంశాలు తెలియాల్సి ఉందని, విచారణ కొనసాగుతోందని చెప్పారు. విచారణలో అన్ని వివరాలు స్పష్టంగా తెలిసిన తర్వాత అధికారికంగా బయటకు వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు. -
నల్లగొండలో కిడ్నీ ‘రాకెట్’?
♦ ఇంటర్నెట్ ద్వారా కిడ్నీ అమ్ముకుని ఏజెంట్‌గా మారిన యువకుడు ♦ తనకు పరిచయమున్న వారిని రాకెట్లోకి లాగుతున్న వైనం ♦ మహారాష్ట్రలో కిడ్నీల అమ్మకం.. ఒక్కో కిడ్నీకి రూ.5 లక్షలు ♦ ఏజెంట్‌కు రూ.25 వేల అడ్వాన్స్.. రూ.50 వేల కమీషన్ ♦ ఖరీదైన వాహనాలు, మొబైల్ఫోన్లు కొని జల్సా ♦ పోలీసుల అదుపులో నిందితుడు..? సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఓ యువకుడికి కిడ్నీ దానం చేసే వాళ్లు కావాలంటూ ఇంటర్నెట్ లో కనిపించిన సమాచారం ఏకంగా కిడ్నీ ‘నెట్వర్క్’ ఏర్పాటుకు దారి తీసింది. ఇంటర్నెట్లో లభించిన సమాచారం మేరకు కిడ్నీ అమ్ముకునేందుకు వెళ్లిన ఆ యువకుడు ఆ తర్వాత ఏకంగా ఏజెంట్ అవతారమెత్తి కిడ్నీ రాకెట్ సూత్రధారిగా మారాడు. తనకు పరిచయమున్న వారికి డబ్బు ఎరవేస్తూ.. కిడ్నీలను అమ్మిస్తూ సొమ్ము చేసుకునేందుకు అలవాటు పడ్డాడు. యాదృచ్ఛికంగా లభించిన సమాచారాన్ని తొలుత అవసరానికి, ఆ తర్వాత అక్రమ సంపాదనకు వినియోగించుకున్న ఆ యువకుడు ఇప్పుడు నల్లగొండ పోలీ సుల అదుపులో ఉన్నట్లు సమాచారం. ఆ యువకుడిని రెండు రోజుల క్రితం అదుపులోకి తీసుకుని విచారిస్తున్న నల్లగొండ పోలీసులకు ఈ కిడ్నీ ‘నెట్వర్క్’కు సంబంధించిన వాస్తవాలు విచారణలో తెలుస్తున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. నల్లగొండ పట్టణంలోని గంధవారిగూడెం రోడ్డులో నివసిస్తున్న ఓ యువకుడు (26) ఎలాంటి ఉద్యోగం లేకుండా తిరుగుతుండేవాడు. నల్లగొండ, హైదరాబాద్‌లో ఉంటూ కాలక్షేపం చేస్తుండేవాడు. ఆరునెలల క్రితం అతను ఓ రోజు ఇంటర్నెట్ చూస్తుండగా, కిడ్నీ దాతలు కావాలనే సమాచారం కనిపించింది. ఆర్థికంగా ఎలాంటి ఆసరా లేకపోవడంతో కిడ్నీ ఇచ్చి డబ్బులు సంపాదించుకోవాలనే నిర్ణయానికి వచ్చాడు. నెట్లో ఉన్న సమాచారం ఫాలో అవుతూ మహారాష్ట్రకు వెళ్లి కిడ్నీ అమ్ముకున్నాడు. కిడ్నీ అమ్ముకోవడం ద్వారా వచ్చిన రూ.5 లక్షలతో ఖరీదైన ద్విచక్ర వాహనం, మొబైల్‌ఫోన్ కొనుక్కుని ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో నల్లగొండ పట్టణానికే చెందిన ఓ సస్పెండైన ప్రభుత్వ ఉద్యోగి అతనికి పరిచయం అయ్యాడు. అత డిని కూడా ఆ యువకుడు కిడ్నీ అమ్ముకునేందుకు ఒప్పించి మహారాష్ట్రకు తీసుకెళ్లి రూ.5 లక్షలు ఇప్పించాడు. ఆ ఉద్యోగి కూడా నల్లగొండకు వచ్చి డబ్బులు జల్సాగా ఖర్చు పెట్టడం మొదలుపెట్టాడు. అక్కడే కథ రివర్స్ అయింది. సస్పెండ్ అయిన ఉద్యోగి కూడా ఆ డబ్బుతో జల్సాలు చేస్తుండడంతో అతడి బంధువులకు అనుమానం వచ్చింది. నిలదీయడంతో ఫలానా వ్యక్తి మహారాష్ట్రకు తీసుకెళ్లి తన కిడ్నీ అమ్మించాడని వెల్లడించాడు. దీంతో కోపోద్రిక్తులైన అతని బంధువులు ఆ యువకుడిపై దాడి చేశారు. ఆ నోటా ఈనోటా పోలీసులకు తెలియడంతో వారు ఆ యువకుడిని అదుపులోనికి తీసుకుని విచారించడంతో అసలు కథ బయటకు వచ్చింది. మరో నాలుగు రోజులు ? రెండు రోజుల క్రితం ఆ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకోగా, విచారణ పూర్తయ్యే సరికి మరో నాలుగైదు రోజులు పట్టవచ్చని సమాచారం. అయితే పోలీసుల అదుపులో ఉన్న నిందితుడితోపాటు ఇతర వివరాల గురించి ఆరా తీసినా తమకేమీ తెలియదని, తమ అదుపులో లేరనివారు చెబుతున్నారు. కిడ్నీ రాకెట్ అంశాన్ని వెల్లడించేందుకు స్థానికపోలీసులు నిరాకరిస్తుం డడం గమనార్హం. నిందితుడు వెల్లడిం చిన వివరాల ఆధారంగా మహారాష్ట్రలో ఎక్కడ అమ్ముతున్నారు? అక్కడ ఎవరైనా ఏజెంట్ ఉన్నారా? లేదంటే ఏదైనా ఆస్పత్రికి తీసుకెళుతున్నాడా? అక్కడ ఏదైనా ముఠా పనిచేస్తుందా? అనే కోణం లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. బాధితుడు టు ఏజెంట్ తొలుత ఆర్థిక అవసరాలం కోసం మహారాష్ట్రకు వెళ్లి వచ్చిన ఆ యువకుడికి ఈ కిడ్నీల వ్యాపారం ద్వారా డబ్బు సంపాదించాలనే ఆలోచన వచ్చింది. వచ్చిందే తడవుగా తనకు పరిచయమున్న వారిని డబ్బు ఆశ చూపెట్టి (ఆర్థిక అవసరాలు, వారి పరిస్థితిని గమనించి) మహారాష్ట్రకు తీసుకెళ్లి కిడ్నీలు అమ్మిస్తున్నాడు. అలా కిడ్నీలు ఇచ్చినందుకు ఒక్కో బాధితుడికి రూ.5 లక్షలు ఇప్పిస్తున్నాడు. కిడ్నీలు అమ్మించినందుకు తొలుత అడ్వాన్స్‌గా రూ,.25 వేలు ఇస్తున్నారని, మొత్తం ఒక్కో కిడ్నీకి రూ.50 వేల కమీషన్ వస్తుందని, అడ్వాన్స్ అందగానే మహారాష్ట్రకు తీసుకెళ్లి కిడ్నీలు ఇప్పిస్తుంటానని సదరు యువకుడు పోలీసుల ముందు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఇలా 18 మంది వరకు మహారాష్ట్రకు తీసుకెళ్లాడని, అందులో 10 మందివి మాత్రమే కిడ్నీలు అమ్మించాడని, మిగిలిన వారివి పనికిరాలేదని తెలుస్తోంది. ఈ సంఖ్య 30 వరకు ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. -
ఇంటర్నేషనల్ కిడ్నీ రాకెట్ గుట్టురట్టు
-
ఇంటర్నేషనల్ కిడ్నీ రాకెట్ గుట్టురట్టు
డాక్టర్‌తో పాటు ముగ్గురు బ్రోకర్ల అరెస్టు శ్రీలంక, ఇరాన్లలో కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు హైదరాబాద్‌లో క్రయ,విక్రయ ఒప్పందాలు సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ కిడ్నీ రాకె ట్ ముఠా గుట్టును హైదరాబాద్ పోలీసులు రట్టు చేశారు. ముఠా నాయకుడైన డాక్టర్‌తో పాటు ముగ్గురు బ్రోకర్లను అరెస్టు చేశారు. కిడ్నీ మార్పిడికి దేశంలోని చట్టాలు అనుమతించకపోవడంతో ఈ ముఠా శ్రీలంక, ఇరాన్ దేశాలు కేంద్రంగా తమ దందాను కొనసాగిస్తున్నాయి. కిడ్నీ అమ్మేవారు, కొనే వారిని అక్కడి ఆస్పత్రిలో చేర్పించి కిడ్నీ మార్పిడి చేయిస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా అమాయకులకు గాలం వేస్తున్న ఈ ముఠా గుట్టును సోమవారం పోలీసులు చాకచక్యం గా పట్టుకోగలిగారు. వీరి నుంచి తొమ్మిది పాస్‌పోర్టులు, మెడికల్ రిపోర్టులు, కంప్యూటర్, ప్రింటర్, ల్యాప్‌టాప్‌లు, ఆరు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ముఠా వివరాలను టాస్క్‌ఫోర్స్ డీసీపీ లింబారెడ్డితో కలసి అదనపు పోలీసు కమిషనర్ అంజనీకుమార్ బషీర్‌బాగ్‌లోని తన కార్యాలయంలో వెల్లడిం చారు. మహారాష్ట్రలోని షిర్డీకి చెందిన డాక్టర్ హర్దేశ్ సక్సేనా అలియాస్ కుమార్ సక్సేనా(60) ఈ ముఠాకు నాయకుడు. ఇతని ద్వారానే హయత్‌నగర్‌కు చెందిన వ్యాపారి కె.రాఘవేందర్ అతని భార్య స్వాతి తమ కిడ్నీలను రెండేళ్ల క్రితం శ్రీలంక వెళ్లి విక్రయిం చారు. హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన తరువా త సక్సేనాతో కలసి ఈ దందా నిర్వహించాలనుకున్న రాఘవేందర్, విశాఖపట్నంకు చెందిన వ్యక్తి, అమీర్‌పేట్‌కు చెందిన డిగ్రీ విద్యార్థి ఎ.అశోక్ (22)తో జత కట్టారు. ఈ ముగ్గురు సోషల్ మీడియా ద్వారా కిడ్నీ క్ర య, విక్రయాలు చేస్తామని ప్రకటనలు ఇచ్చా రు. నగరంలోని ఆసుపత్రిలో కిడ్నీ సంబంధిత రోగుల వివరాలు తెలుసుకుని వారిని సంప్రదించేవారు. కిడ్నీ అమ్మేవారు, కొనేవా రు ఇద్దరూ అంగీకరించాక వా రికి లాల్‌దర్వాజాకు చెందిన పాస్‌పోర్టు బ్రోకర్ సంజయ్‌కుమార్ జైన్ పాస్‌పోర్టులు తీసి ఇచ్చేవారు. ఒప్పందం ఇక్కడ... ఆపరేషన్ అక్కడ.. ఈ ముఠా కిడ్నీ అమ్మేవారు, కొనేవారిని సం ప్రదించి వారితో హైదరాబాద్‌లోనే ఒప్పం దం చేసుకొనేది. కిడ్నీ కొనేవారు సక్సేనాకు రూ.30 లక్షలు చెల్లించాలి. ఇందులోంచి రూ.5 లక్షలు కిడ్నీ విక్రేతకు, రూ.13 లక్షలు శ్రీలంక, ఇరాన్లలోని ఆసుపత్రి ఖర్చులకు, లక్ష రూపాయలు ట్రావెల్స్ ఖర్చులుకు వె ళ్తా యి. మిగతా మొత్తంలో రూ.3 లక్షలు అశోక్, రాఘవేందర్‌లు, రూ.8 లక్షలు సక్సేనా తీసుకొనేవారు. ఈ ముఠాకు చెన్నై, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో నెట్వర్క్ ఉంది. పోలీసుల విచారణలో హైదరాబాద్‌కు చెందిన కె.రాఘవేంద్ర అతని భార్య కె.స్వాతి, షరీఫ్, రఫీ, మనోజ్, రషీద్, మాలిక్, వీసీకే నాయుడు, పాండు రంగారావు, అశోక్‌లు ఇరాన్, శ్రీలంకకు వెళ్లి కిడ్నీల ను విక్రయించినట్లు తె లిసింది. ఈ ముఠాకు సంబంధించి మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు త్వరలో పోలీసు బృందాన్ని శ్రీలంకకు పంపనున్నట్లు పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కాగా, గత ఏడాది ఏప్రిల్‌లో కొత్తగూడెంకు చెందిన దినేశ్ (26)ను ఉద్యోగం పేరుతో శ్రీలంకకు తీసుకెళ్లి అక్కడ కిడ్నీ ఆపరేషన్ నిర్వహిస్తుండగా చనిపోయిన విషయం తెలిసిందే. ఈ కేసులో అప్పట్లో కిడ్నీ బ్రోకర్లను అరెస్టు చేశారు. అయితే ప్రధాన సూత్రధారి ప్రశాంత్‌సేఠ్ ఇంకా పరారీలోనే ఉన్నాడు. -
పేదలే పెట్టుబడి
కిడ్నీ రాకెట్ గుట్టురట్టు హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు ఐదుగురు సభ్యులను అరెస్టు చేసిన విజయవాడ పోలీసులు పరారీలో కీలక నిందితుడు సాయికుమార్ తెరవెనుక పలువురు వైద్యులు, రాజకీయ నేతలు! ‘సాక్షి’ వరుస కథనాలకు విశేష స్పందన సాక్షి ప్రతినిధి, విజయవాడ : పేదల రక్తమాంసాలతో వ్యాపారం చేస్తున్న కిడ్నీ రాకెట్ గుట్టురట్టయింది. హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న ఈ ముఠాతో సంబంధాలున్న ఐదుగురు నిందితులను మంగళవారం విజయవాడ పోలీసులు అరెస్టుచేశారు. వారిలో మిరియాల క్రాంతి దుర్గాప్రసాద్, బాలాజీసింగ్, నాగసాయిదుర్గ, గొడవర్తి ఉమాదేవి, పృథ్వీరాజ్‌సింగ్ ఉన్నారు. హైదరాబాద్‌కు చెందిన సాయి కుమార్ ఈ రాకెట్‌ను నడుపుతున్నట్లు గుర్తించారు. కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాలతోపాటు హైదరాబాద్‌లో కూడా కిడ్నీ రాకెట్ ముఠా కార్యకలాపాలు సాగిస్తున్నట్లు వెల్లడైంది. తన సంతకం ఫోర్జరీ చేశారని ఈ నెల 15వ తేదీన విజయవాడ అర్బన్ తహశీల్దార్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కిడ్నీ రాకెట్ విషయం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి కిడ్నీ రాకెట్ ముఠా వ్యవహారంపై ‘సాక్షి’ ప్రచురించిన వరుస కథనాలకు విశేష స్పందన లభించింది. పేదలే లక్ష్యంగా... హైదరాబాద్‌లో నివసించే సాయికుమార్ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలను గుర్తించి వారికి డబ్బు ఆశ చూపి కిడ్నీలు విక్రయించేలా పురమాయిస్తాడు. ఇదే తరహాలో పలువురు కిడ్నీలు విక్రయించాడు. కిడ్నీలు ఇచ్చేవారికి రూ.2లక్షల నుంచి రూ.5లక్షల వరకు ఇచ్చేవాడు. మధ్యవర్తులకు రూ.15 వేల నుంచి రూ.20వేలు వరకు అందజేస్తాడు. మరోవైపు బాధితులను కూడా మధ్యవర్తులుగా మార్చుకుని సాయికుమార్ సొమ్ము చేసుకుంటున్నాడు. అతని కోసం పోలీసులు 15 రోజులు గాలించినా దొరకలేదు. సాయికుమార్‌తోపాటు మహావీర్ అనే వ్యక్తి, మరికొందరికి కూడా ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నట్లు భావిస్తున్నారు. త్వరలోనే కీలక నిందితులను పట్టుకొని కిడ్నీ రాకెట్‌ను ఛేదిస్తామని పోలీసులు చెబుతున్నారు. ఫోర్జరీ సంతకాల వెనుకా ఓ ముఠా.. ఎవరి సంతకాలైనా ఫోర్జరీ చేసే ముఠా సభ్యులు కూడా కిడ్నీ రాకెట్లో భాగస్వాములుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఎవరైనా కిడ్నీ ఇస్తామని చెప్పిన వెంటనే ఇందుకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలను ఫోర్జరీ సంతకాలతో వారు సిద్ధం చేస్తారు. బాలాజీ సింగ్ తండ్రి దేవరాజ్, అన్న పృథ్వీరాజ్ సింగ్‌లు ఈ వ్యవహారాన్ని నడిపిస్తారని తేలింది. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు అమ్మినందుకు గొడవర్తి ఉమాదేవిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈమెకు కూడా ఈ కిడ్నీ రాకెట్ కేసుతో సంబంధం ఉన్నట్లు సమాచారం. నకిలీ పత్రాలను తయారు చేస్తారని తెలిసే ఈ డాక్యుమెంట్లు విక్రయించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. తెరవెనుక బడాబాబులు! కిడ్నీ రాకెట్లో పలువురు రాజకీయ నాయకుల హస్తం ఉన్నట్లు సమాచారం. పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖ వైద్యులతో తనకు సంబంధాలున్నట్లు సాయికుమార్ తనతో పలుమార్లు చెప్పాడని బాలాజీసింగ్ విలేకరుల ఎదుట వెల్లడించడం ఇందుకు బలాన్నిస్తోంది. అయితే అంతకుమించి తనకు పూర్తి వివరాలు తెలియవని ఆయన చెప్పాడు. దీనిని బట్టి ఈ వ్యవహారంలో రాజకీయ నేతల హస్తం కూడా ఉన్నట్లు స్పష్టమతోంది. ప్రధానంగా ఓ బడా వైద్యశాలకు చెందిన కొందరు వైద్యులు ఈ వ్యాపారంలో ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు ఈ కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు నిర్వహిస్తే కిడ్నీ రాకెట్ ముఠా సభ్యులు పూర్తిస్థాయిలో దొరికే అవకాశం ఉంది. తెరవెనుక చక్రం తిప్పుతున్న రాజకీయ, వైద్య ప్రముఖుల వ్యవహారం కూడా వెలుగులోకి వస్తుంది. ఎలాగైనా ఈ కేసులో నిందితులందరినీ పట్టుకుంటామని ఇన్చార్జి ఏసీపీ గుణ్ణం రామకృష్ణ, సీఐ సత్యానందం, ఎస్ఐ నరేష్ తెలిపారు. నిందితులు ఎంతటి వారైనా పేదల రక్తమాంసాలతో వ్యాపారం చేస్తున్నందున వదిలేది లేదని వారు స్పష్టంచేశారు. బాధితుడే మధ్యవర్తిగా మారిన వైనం... తాను హైదారాబాద్‌లోని స్విమ్స్ ఆస్పత్రి వద్ద ఉండగా ఒకరోజు సాయికుమార్ కనిపించాడని, మాటామాట కలిపాడని ఈ కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన బాలాజీ సింగ్ తెలిపాడు. కొద్దిసేపటి తర్వాత ఎవరైనా కిడ్నీలు దానం చేస్తే రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఇస్తానని చెప్పాడని పేర్కొన్నాడు. అయితే దానం చేసేవారితోపాటు కిడ్నీలు అవసరమైన వారి బ్లడ్ గ్రూప్ ఒకటే అయి ఉండాలని తెలిపాడని వివరించారు. అరుదైన బ్లడ్ గ్రూపు ఉన్న వారికి ఎక్కువ మొత్తంలో డబ్బులు చెల్లిస్తానని చెప్పాడన్నారు. అదే సమయంలో తన భార్య పద్మాసింగ్ కిడ్నీని రెండు లక్షల రూపాయలకు విక్రయించినట్లు బాలాజీసింగ్ వెల్లడించాడు. అప్పటి నుంచి తనకు పరిచయం ఉన్న వ్యక్తులతో మాట్లాడి కిడ్నీలు విక్రయించేలా చూస్తున్నానని తెలిపాడు. ఈ క్రమంలోనే విజయవాడలో కూలర్ల వ్యాపారం చేస్తున్న క్రాంతి దుర్గాప్రసాద్ పరిచయం కావడంతో కిడ్నీ ఇస్తే డబ్బులు వస్తాయని చెప్పానని పేర్కొన్నాడు. ప్రస్తుతం చక్రవర్తి శ్రీనివాస్ అనే వ్యక్తికి కిడ్నీ కావాలని సాయికుమార్ చెప్పినట్లు తెలిపాడు. చక్రవర్తి శ్రీనివాస్ బ్లడ్ గ్రూపు ఓ పాజ్టివ్ కావడం, క్రాంతి దుర్గాప్రసాద్‌ది కూడా అదే గ్రూపు కావడంతో ఎంత డబ్బు అయినా ఇచ్చేందుకు చక్రవర్తి శ్రీనివాస్ వెనుకాడలేదని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఆయన సత్య కిడ్నీ సెంటర్లో డయాలసిస్ పేషంట్‌గా ఉన్నట్లు చెప్పాడు. ఇప్పటివరకు తాను ఐదుగురి నుంచి కిడ్నీలు ఇప్పించినట్లు బాలజీసింగ్ వివరించాడు. స్విమ్స్‌లో ఒకరికి, హైదరాబాద్‌లోని సత్య కిడ్నీ సెంటర్లో మరో నలుగురికి కిడ్నీలు ఇప్పించానని తెలిపాడు. తనకు ఒక్కో కిడ్నీకి రూ.15 వేలు ఇచ్చాడని బాలాజీసింగ్ విలేకరుల ఎదుట వెల్లడించాడు. ఆర్థిక ఇబ్బందుల వల్లే కిడ్నీ అమ్మేందుకు సిద్ధం : క్రాంతి దుర్గాప్రసాద్ ఆర్థిక ఇబ్బందుల వల్లే తాను కిడ్నీని విక్రయించుకునేందుకు సిద్ధమయ్యానని విజయవాడకు చెందిన మిరియాల క్రాంతి దుర్గాప్రసాద్ చెప్పాడు. తాను మొదట్లో ఆటో కొనుగోలుచేసి నడిపానని నష్టం వచ్చిందని తెలిపాడు. ఆ తర్వాత ఆటో విక్రయించి కూలర్ల వ్యాపారం ప్రారంభించగా, దానిలోనూ నష్టం వచ్చినట్లు పేర్కొన్నాడు. దీంతో కిడ్నీని అమ్ముకునేందుకు సిద్ధపడినట్లు వివరించాడు. తాను కిడ్నీ అమ్మేందుకు తన భార్య అంగీకరించలేదని తెలిపాడు. అందువల్ల తన స్నేహితుడైన విజయవాడకు చెందిన సాయిలోకేష్ భార్య నాగసాయిదుర్గను తన భార్యగా చూపించేందుకు ఫోర్జరీ సర్టిఫికెట్లు తయారుచేసినట్లు పేర్కొన్నాడు. ఆ సర్టిఫికెట్ల సాయంతో ఆమె అంగీకారపత్రం రూపొందించి కిడ్నీ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలిపాడు. చివరికి ఫోర్జరీ సర్టిఫికెట్ల వల్లే తాము ఇరుక్కున్నామని వెల్లడించాడు. -
రోజుకో కొత్తకోణం..!
కిడ్నీ రాకెట్‌పై ముమ్మర దర్యాప్తు కృష్ణప్రసాద్‌ను ప్రశ్నించిన పోలీసులు! సాక్షి ప్రతినిధి, విజయవాడ : కిడ్నీ రాకెట్‌పై పోలీసుల దర్యాప్తులో మరో కోణం వెలుగులోకి వచ్చింది. తూర్పుగోదావరి జిల్లా రావులపాలేనికి చెందిన వ్యక్తికి ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు అతడి కోసం ఓ బృందం రావులపాలెం వెళ్లినట్లు సమాచారం. మరో బృందం హైదరాబాద్‌లోని సత్య కిడ్నీ సెంటర్‌తో వివరాలు సేకరించేందుకు వెళ్లింది. అసలు కిడ్నీ విక్రయించేందుకు సిద్ధమైన మిరియాల క్రాంతి దుర్గాప్రసాద్ తండ్రి కృష్ణప్రసాద్ విజయవాడ సత్యనారాయణపురంలో ఉంటున్నట్లు గుర్తించిన పోలీసులు సోమవారం అతన్ని ప్రశ్నించగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించినట్లు తెలిసింది. కిడ్నీ విక్రయించడం తెలియకే... క్రాంతి దుర్గాప్రసాద్ కిడ్నీని అమ్ముకునేందుకు సిద్ధపడినట్లు తెలిసింది. ఎలా విక్రయించాలో తెలియక కొంతమందిని సంప్రదించినట్లు సమాచారం. వారి సూచన మేరకు తూర్పుగోదావరి జిల్లా రావులపాలేనికి చెందిన కిడ్నీ రాకెట్ ముఠా సభ్యుడిని కలిసినట్లు తెలిసింది. ఆయన సూచనల మేరకు దొంగ సర్టిఫికెట్లు పుట్టించి హైదరాబాద్‌లోని సత్య కిడ్నీ సూపర్‌స్పెషాలిటీ వైద్యశాలను సంప్రదించినట్లు సమాచారం. రావులపాలేనికి చెందిన వ్యక్తి గతంలోనూ కొందరి కిడ్నీలు విక్రయించినట్లు తెలుస్తోంది. ఆ వ్యక్తిని పట్టుకుంటేనే కిడ్నీ రాకెట్ ఎలా సాగుతుందనేది తేలే అవకాశం ఉంది. విజయవాడలోనే క్రాంతి దుర్గాప్రసాద్! క్రాంతి దుర్గాప్రసాద్ ప్రస్తుతం ఎయిర్ కూలర్లకు మరమ్మతులు చేసుకుంటూ విజయవాడలోనే ఉంటున్నాడు. పోలీసులకు అతను దొరికాడా.. అతను ఇచ్చిన సమాచారం మేరకే దర్యాప్తును ముమ్మరం చేశారా.. లేక మరెవరైనా సమాచారం ఇచ్చారా.. అనేది వెల్లడికావాల్సి ఉంది. ఈ కేసు దర్యాప్తు గురించి పోలీసులు మాత్రం నోరుమెదపడం లేదు. -
దర్యాప్తు ముమ్మరం
కిడ్నీ రాకెట్‌పై కదలిక దుర్గాప్రసాద్ కూలర్ మెకానిక్‌గా గుర్తింపు నేడు అదుపులోకి తీసుకునే అవకాశం? సాక్షి ప్రతినిధి, విజయవాడ : కిడ్నీ రాకెట్ ముఠాపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఆదివారం విజయవాడలోని పలు ప్రాంతాల్లో పోలీసులు విచారణ జరిపారు. మిరియాల క్రాంతిదుర్గాప్రసాద్ ఎవరు.. ఎక్కడున్నాడు.. ఎందుకు తహశీల్దార్, సబ్ కలెక్టర్ సంతకాలు ఫోర్జరీ చేసి కిడ్నీని అమ్ముకునేందుకు ప్రయత్నించాడు.. అనే కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు. ‘ఫోర్జరీ మాటున కిడ్నీ రాకెట్’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనాన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ఈ కేసు దర్యాప్తునకు ఉన్నతాధికారులు సత్యనారాయణపురం పోలీస్‌స్టేషన్ ఎస్ఐ నరేష్‌ను రంగంలోకి దించారు. ‘సాక్షి’లో వార్తను చదివిన దుర్గాప్రసాద్ బంధువులు పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. దర్యాప్తులో పురోగతి సత్యనారాయణపురంలోని టి.రామారావు అనే వ్యక్తి ఇంట్లో నాలుగేళ్ల కిందట క్రాంతిదుర్గాప్రసాద్, ఆయన తండ్రి అద్దెకు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. క్రాంతిదుర్గాప్రసాద్ తండ్రి కృష్ణప్రసాద్ రైల్వేలో నాలుగో తరగతి ఉద్యోగిగా తేలింది. ప్రస్తుతం విజయవాడలోని సత్యనారాయణపురం రైల్వే కాలనీలో నివాసం ఉంటున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. క్రాంతిదుర్గాప్రసాద్ కూడా తండ్రితో పాటు ఉంటున్నట్లు నిర్ధారించారు. అయితే పోలీసులు వెళ్లిన సమయంలో ఇద్దరూ ఇంట్లో లేరు. సోమ, మంగళవారాల్లో అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలిసింది. సర్టిఫికెట్లలో ఒకటి, అర్జీలో మరోపేరు... ఫోర్జరీ సంతకాలతో పొందిన రెసిడెన్స్, ఫ్యామిలీ స్ట్రక్చర్ సర్టిఫికెట్ ఆఫ్ డోనర్‌లో మిరియాల క్రాంతి దుర్గాప్రసాద్ అని ఉంది. అయితే తహశీల్దార్‌కు పెట్టుకున్న అర్జీలో మాత్రం తాను ప్రైవేట్ ఉద్యోగినని, తన భార్య, తాను తప్ప తమకు ఎవరూ లేరని, తన పేరు మిరియాల క్రాంతికుమార్ అని పేర్కొని ఉంది. సర్టిఫికెట్స్‌లో ఒకపేరు, అర్జీలో మరోపేరు రాయడం కూడా చర్చకు దారితీసింది. దీనిపై కూడా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. అసలు పేరు ఏమిటనేది పోలీసుల దర్యాప్తులో వెల్లడి కావాల్సి ఉంది. ఫోర్జరీ సంతకాలతో పొందిన సర్టిఫికెట్లపై 2014, ఏప్రిల్ 24వ తేదీ ఉంది. ప్రస్తుతం మా వద్దకు క్రాంతి దుర్గాప్రసాద్ రాలేదు... మిరియాల క్రాంతి దుర్గాప్రసాద్ అనే వ్యక్తి కిడ్నీ ఇవ్వడానికి వచ్చాడా.. అని హైదరాబాద్‌ని సత్య కిడ్నీ సెంటర్‌కు ఫోన్‌చేసి ‘సాక్షి ప్రతినిధి’ ప్రశ్నించగా.. ప్రస్తుతం అటువంటి వారు ఎవరూ లేరని బదులిచ్చారు. గతంలో వచ్చి ఉంటే రికార్డులు పరిశీలించాల్సి ఉందన్నారు. ఇందుకు సంబంధించిన ప్రత్యేక వైద్యుడు సోమవారం డ్యూటీకి వస్తాడని ఆయన్ను సంప్రదిస్తే పూర్తి వివరాలు తెలుస్తాయని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. విజయవాడలో రెండు ఆస్పత్రులకే లెసైన్స్... విజయవాడలో కిడ్నీ ఆపరేషన్ చేసేందుకు రెండు ఆస్పత్రులకు మాత్రమే ప్రభుత్వ లెసైన్స్ ఉంది. ఒకటి ఎన్ఆర్ఐ ఆస్పత్రి కాగా రెండోది అరుణ్ కిడ్నీ సెంటర్. గుంటూరులో గుంటూరు సిటీ హాస్పిటల్‌కు లెసైన్స్ ఉంది. ఈ ఆస్పత్రులకు వెళ్తే వెంటనే గుర్తించి అరెస్ట్ చేయించే అవకాశం ఉన్నట్లు తెలుసుకున్న దుర్గాప్రసాద్ హైదరాబాద్‌లోని సత్య కిడ్నీ సెంటర్‌ను ఆశ్రయించినట్లు సమాచారం. హైదరాబాద్‌లో కిడ్నీ ఇస్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవని, తనను ఎవరూ ప్రశ్నించే అవకాశం లేదని దుర్గాప్రసాద్ భావించి ఉండవచ్చని తెలుస్తోంది. ఆరేళ్ల కిందట జోరుగా కిడ్నీల వ్యాపారం విజయవాడలో ఆరు సంవత్సరాల కిందట కిడ్నీల వ్యాపారం జోరుగా సాగింది. ఆటోవాలాలు ఎక్కువ మంది కిడ్నీలు అమ్ముకున్నారు. దీంతో అప్పట్లో పోలీసులు రంగంలోకి దిగి పలువురిని అరెస్ట్ చేశారు. పేదరికాన్ని ఆసరాగా చేసుకుని మాయమాటలు చెప్పి కిడ్నీలు తీసి అమ్ముకున్నారు. దీనివెనుక పలువురు వైద్యుల హస్తం అప్పట్లో ఉన్నట్లు స్పష్టమైంది. అవయవ దానం చట్టం ప్రకారం.. ప్రధానంగా కిడ్నీ దానం చేయాలంటే తన రక్తసంబంధీకులై ఉండాలి. భార్యాభర్తలు కిడ్నీలు దానం చేసుకోవాలంటే వారి వివాహానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు చూపించాలి. రక్త సంబంధీకులైతే డీఎన్ఏ పరీక్షలు చేస్తారు. అవయవ మార్పిడి చట్టం-1994 ప్రకారం రెవెన్యూ అధికారుల నుంచి ధ్రువీకరణ పత్రాలు పొందాల్సి ఉంది. -
ఫోర్జరీ మాటున కిడ్నీ రాకెట్!
తహశీల్దార్, సబ్‌కల్టెర్ సంతకాలు ఫోర్జరీ సర్టిఫికెట్లో ఇచ్చిన అడ్రస్ బోగస్ దొంగ సర్టిఫికెట్లతో వ్యాపారం? సాక్షి ప్రతినిధి, విజయవాడ : విజయవాడ కేంద్రంగా కిడ్నీ రాకెట్ ముఠా అమాయకులకు వల విసురుతున్నట్లు తెలుస్తోంది. డబ్బు కోసం కిడ్నీలు ఇచ్చేందుకు ముందుకొచ్చేవారికి అవసరమైన సర్టిఫికెట్లను ఫోర్జరీ సంతకాలతో మరో ముఠా సమకూరుస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్‌లోని ఓ హాస్పిటల్ నిర్వాహకులు అప్రమత్తంగా వ్యవహరించడంతో వారి బండారం బయటపడింది. విచారణ జరిపి పూర్తి వివరాలు సేకరించాలని పోలీసులకు అధికారులు ఫిర్యాదు చేశారు. వెలుగుచూసిందిలా.. మిరియాల క్రాంతిదుర్గాప్రసాద్ అనే వ్యక్తి కిడ్నీ దానం చేసేందుకు కొద్ది రోజుల కిందట హైదరాబాద్‌లోని సత్య కడ్నీ సెంటర్‌కు వెళ్లారు. తన తండ్రి పేరు మిరియాల కృష్ణప్రసాద్ అని, తాను విజయవాడ సత్యనారాయణపురంలోని తిరుమలశెట్టి వారి వీధిలో (ఇంటి నెం: 23-15-100/ఎ) నివాసం ఉంటున్నామని, తమ ఇంటి యజమాని ముదిగంటి శ్రీనివాస చక్రవర్తి అనారోగ్యంతో ఉన్నందున ఆయనకు స్వచ్ఛదంగా కిడ్నీ ఇస్తున్నానని చెప్పాడు. ఇందుకు సంబంధించి తహశీల్దార్ జారీచేసిన ధ్రువీకరణ పత్రాన్ని సత్య కిడ్నీ సెంటర్‌కు అందజేశారు. ఆస్పత్రి వారు ఈ సర్టిఫికెట్‌ను వెరిఫికేషన్ కోసం విజయవాడ అర్బన్ తహశీల్దార్ ఆర్.శివరావ్కు పంపించారు. సర్టిఫికెట్‌ను పరిశీలించిన తహశీల్దార్ తన సంతకంతోపాటు సబ్ కలెక్టర్ సంతకాన్ని కూడా ఫోర్జరీ చేసినట్లు గుర్తించారు. నాలుగు రోజుల క్రితం వచ్చిన ఈ ఫోర్జరీ సంతకాల సర్టిఫికెట్‌ను గవర్నర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఇచ్చి దీనిపై దర్యాప్తు చేయాల్సిందిగా కోరారు. అయితే సదరు వ్యక్తి సత్యనారాయణపురంలో నివాసం ఉంటున్నట్లు పేర్కొన్నందున స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని తహశీల్దార్‌కు పోలీసులు సూచించారు. దీంతో తహశీల్దార్ శనివారం రాత్రి సత్యనారాయణపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అంతా బోగస్.. మిరియాల క్రాంతి దుర్గాప్రసాద్ నివాసం ఉంటున్నట్లు పేర్కొన్న ఇంటికి శనివారం రాత్రి ‘సాక్షి’ బృందం వెళ్లి పరిశీలించగా పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. ఆ ఇంటి యజమాని టి.రామారావు హైదరాబాద్‌లో ఉంటున్నట్లు తేలింది. ఈ నంబరు గల ఇంట్లో రెండు పోర్షన్లు ఉన్నాయి. పై పోర్షన్లో వెంకటేశ్వరరావు, కింది పోర్షన్లో గడ్డం కళ్యాణ చక్రవర్తి కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. దీనిని బట్టి మిరియాల క్రాంతి దుర్గాప్రసాద్ పేరుతో ఇక్కడ ఎవరూ నివాసం లేరని స్పష్టమైంది. అయితే.. ఇదే ఇంటి నంబరుపై మిరియాల కృష్ణప్రసాద్ పేరు ఓటర్ల జాబితాలో ఉంది. దీనిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కృష్ణప్రసాద్, క్రాంతి దుర్గాప్రసాద్ పేర్లతో ఈ ఇంట్లో ఇటీవల కాలంలో ఎవరూ లేరని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం కింది పోర్షన్లో నివాసం ఉంటున్న గడ్డం కళ్యాణచక్రవర్తిని.. ప్రశ్నించగా తాను నాలుగు సంవత్సరాలుగా ఇదే ఇంట్లో నివాసం ఉంటున్నానని, ఇక్కడ కృష్ణప్రసాద్ పేరుతో ఎవరూ లేరని చెప్పారు. ఇంటి ఓనర్ హైదరాబాద్‌లో ఉంటారని తెలిపాడు. ఫోర్జరీ ముఠాకు, కిడ్నీ రాకెట్‌కు లింకు! ఈ పరిణామాలను పరిశీలిస్తే కిడ్నీ రాకెట్ ముఠాతో కృష్ణప్రసాద్, ఆయన కుమారుడు క్రాంతి దుర్గాప్రసాద్‌లకు సంబంధం ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. వీరిద్దరు ప్రస్తుతం ఎక్కడున్నారనే విషయంపై పోలీసులు విచారణ చేపట్టారు. ఫోర్జరీ సంతకాల ముఠాకు, కిడ్నీ రాకెట్ ముఠాకు కూడా సంబంధాలు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. కిడ్నీ రాకెట్ ముఠాలో హైదరాబాద్, విజయవాడతోపాటు ఇంకా ఏయే ప్రాంతాల వారు ఉన్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. కలెక్టర్‌కు వివరించిన తహశీల్దార్ తన సంతకం ఫోర్జరీ గురించి తహశీల్దార్ శివరావ్ కలెక్టర్‌కు వివరించారు. ఫోర్జరీ సంతకాల ముఠా ను గుర్తించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించినట్లు సమాచారం. -
కిడ్నీ రాకెట్ కలకలం
సెవెన్ హిల్స్ ఆస్పత్రి డెరైక్టర్ అరెస్టుతో వెలుగులోకి నకిలీ పత్రాలతో అక్రమాలు యథేచ్ఛగా అవయవమార్పిడి కిడ్నీ రాకెట్ వ్యవహారం నగరంలో సంచలనమైంది.ఒడిశా-విశాఖ కేంద్రంగా నడుస్తున్న ఈ వ్యవహారం సెవెన్‌హిల్స్ ఆస్పత్రి డెరైక్టర్ అరెస్టుతో వెలుగులోకి వచ్చింది. నకిలీ పత్రాలతో అక్రమాలకు పాల్పడినట్టు తేలింది. కార్పొరేట్ ఆస్పత్రుల మాయాజాలంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విశాఖపట్నం, మెడికల్ : ఒడిశా, ఛత్తీస్‌గఢ్, బెంగాల్లో సాగుతున్న కిడ్నీ కుంభకోణ ఛాయలు విశాఖ నగరాన్ని తాకాయా?.. నగర పరిధిలోని కిడ్నీ మార్పిడులు నిబంధనలకు విరుద్ధంగా యథేచ్చగా జరుగుతున్నాయా అంటే అవుననే సమాధానం వస్తోంది. దీనికి నిదర్శనంగా మంగళవారం విశాఖ సెవెన్ హిల్స్ ఆస్పత్రి డెరైక్టర్ అరెస్టు ఉదంతం నిలుస్తోంది. దీంతో విశాఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లో అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలు చేయించుకోవాలంటే ప్రజల్లో భయం పట్టుకుంటోంది. విశాఖ నగరంలోని కార్పొరేట్ ఆస్పత్రులు ఉత్తరాంధ్ర సరిహద్దు రాష్ట్రాలకు వైద్యపరంగా పెద్దదిక్కు. ఎటువంటి వైద్యానికైనా విశాఖపైనే ఆధారపడుతుంటారు. దీనిని ఆసరాగా చేసుకున్న కొన్ని ఆస్పత్రుల యాజమాన్యాలు డబ్బు యావకు లోనై రోగుల ఆరోగ్యంతో వ్యాపారం చేస్తున్నాయన్న అనుమానాలను సెవెల్‌హిల్స్ నిజం చేసింది. కిడ్నీ మార్పిడి సంఘటనలో ఆస్పత్రి డెరైక్టర్ అరెస్టు ఇప్పుడు కలకలం రేపింది. అవయవ మార్పిడికి సంబంధించి రక్త సంబంధీకులు, ఇతర బంధు వర్గాల నుంచి అవయవాలను దానంగా పొందాలంటే ఏపీ అవయవమార్పిడి చట్టం నిబంధనల ప్రకారం స్థానికంగా ఉండే బోధనాస్పత్రి పరిధిలోని ఆథరైజేషన్ కమిటీ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. భార్యాభర్తల విషయంలో అనుమతుల్లో అస్పష్టత ఉండడంతో దీనిని ఆసరాగా తీసుకొని కార్పొరేట్ ఆస్పత్రులు కాసులు దండుకుంటున్నాయన్న విమర్శలు గుప్పుమంటున్నాయి. నగరంలో చాలా కార్పొరేట్ ఆస్పత్రులు ఈ నిబంధనలను తుంగలో తొక్కుతూ దొడ్డిదారిన యథేచ్ఛగా అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలు నిర్వహిస్తూ సొమ్ము చేసుకుంటున్నాయన్న ఆరోపణలున్నాయి. ప్రధానంగా నగరంలోని కేర్, అపోలో ఆస్పత్రుల్లో గుండె, కాలేయం, కిడ్నీ, కళ్లు తదితర అవయవాలను మార్పిడి చేసేందుకు అనుమతులున్నాయి. కీలక అవయవాల మర్పిడికి సంబంధించి ఏపీ జీవన్‌దాన్ అనుమతులను అవయవదాతలు, స్వీకరణకర్తలు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. కళ్లు, కిడ్నీ వంటి అవయవదానాలకు స్థానికంగా ఉండే ఆథరైజేషన్ కమిటీ అనుమతులు తప్పనిసరి అయినప్పటికీ ఎవరూ పాటించడం లేదు. ఈ అనుమతుల కోసం ఆథరైజేషన్ కమిటీ కూడా భారీ మొత్తంలో సొమ్ములు వసూలు చేస్తుండడంతో, కమిటీకి తెలియకుండా అవయవమార్పిడి శస్త్ర చికిత్సలు నిర్వహిస్తుండడం విశేషం. -
కిడ్నీల వ్యాపారంలో కొత్తకోణం!!
కిడ్నీ రాకెట్ రోజుకో కొత్త కథను వెలుగులోకి తెస్తోంది. ఇంతకుముందు మన రాష్ట్రం నుంచి శ్రీలంక తీసుకెళ్లి కిడ్నీలు అమ్ముకున్న విషయాలు వెలుగులోకి రాగా, తాజాగా ఒడిషాలోని కటక్‌లో కూడా ఈ దందా జరగుతున్నట్లు తెలియవచ్చింది. ఇందులోనూ మన రాష్ట్ర ప్రమేయం ఉంది. తన వద్ద నుంచి కిడ్నీ తీసుకున్న మధ్యవర్తులు.. తనను మోసం చేశారని, వాళ్లు తనకు ముందుగా చెప్పినంత మొత్తం ఇవ్వలేదంటూ ఓ మహిళ కటక్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసును తాము పరిశీలించామని, ఇందులో నేరానికి ప్రాథమిక ఆధారాలు ఉన్నట్లు తేలిందని పోలీసులు చెప్పారు. ఆమెకు 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి మధ్యవర్తులు ఆమెవద్ద నుంచి కిడ్నీ తీసుకున్నారని, కానీ చివరకు కేవలం 45 వేలు మాత్రమే చేతిలో పెట్టి పంపేశారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో గల ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కిడ్నీ తీసినట్లు పోలీసులు చెప్పారు. మధ్యవర్తులు దీన్ని అవయవదానంగా పేర్కొంటూ నకిలీ పత్రాలు సృష్టించారని, బాధితుడి భార్య స్థానంలో ఈమెను చూపించి.. ఈమెవద్ద నుంచి కిడ్నీ తీసుకున్నారని వివరించారు. మొత్తం కేసును తాము క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నామని, కిడ్నీ దాతకు.. ఈమెకు అసలు ఏమైనా సంబంధం ఉందా లేదా అని కూడా చూస్తున్నామని కటక్ నగర పోలీసు కమిషనర్ ఆర్పి శర్మ తెలిపారు. -
కిడ్నీ రాకెట్ కేసులో ముగ్గురి అరెస్ట్
హైదరాబాద్: కిడ్నీ రాకెట్ కేసులో పోలీసులు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. వెంకటేషం, షణ్మఖ పవన్, సూర్యనారాయణలను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కేంద్రంగానే కిడ్నీ రాకెట్ నడుస్తుందని సీసీఎస్ పోలీసుల దర్యాప్తులో తేలిన విషయం తెలిసిందే. ఉద్యోగం ఇప్పిస్తామంటూ తీసుకెళ్లిన ఓ యువకుడి నుంచి కిడ్నీ దొంగిలించి, ఆ తర్వాత ఉద్యోగం కూడా ఇవ్వకుండా వెళ్లగొట్టడంతో మొత్తం విషయం బయటపడింది. హైదరాబాద్‌కు చెందిన ఓ 26 ఏళ్ల డిగ్రీ చదివిన దినేష్ కుమార్ అనే ఆ యువకుడు సూపర్ మార్కెట్ పనిమీద విశాఖ వెళ్తున్నానని గత నెల 22న ఇంట్లో చెప్పి వెళ్లిపోయాడు. కొద్ది రోజుల తర్వాత మార్చి 30న దినేష్ గుండెపోటుతో మృతి చెందినట్లు కొలంబో పోలీసులు దినేష్ అన్న గణేష్‌కు ఫోన్ చెప్పారు. వెంటనే వారు భారత హైకమీషన్ అధికారుల సాయంతో దినేష్ మృతదేహాన్ని తెప్పించుకుని అంత్యక్రియలు జరిపించారు. అయితే విశాఖ వెళ్లిన వాడు కొలంబోకు ఎందుకు వెళ్లాడు అని కుటుంబ సభ్యులకు వచ్చిన అనుమానంతో వ్యవహారం మలుపు తిరిగింది. పక్కా క్లూ లభించడంతో నిందితులను పట్టుకునేందుకు రెండు ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగి దర్యాప్తు చేశాయి. దినేష్ కేసు విచారణలో సీసీఎస్ పోలీసులకు కిడ్నీ రాకెట్‌కు సంబంధించిన కొత్త విషయాలు వెల్లడయ్యాయి. చెన్నైకి చెందిన ప్రధాన సూత్రధారి ఆధ్వర్యంలో గతంలో కిడ్నీలు అమ్ముకున్నవారే ఒక ముఠా గా ఏర్పడి దీన్ని నడిపిస్తున్నట్లు తేల్చారు. -
కిడ్నీ రాకెట్లో మరో కొత్త కోణం
జాబ్ పేరుతో యువకుడికి ఎర వైద్య పరీక్షలని నమ్మించి.. కొలంబోలో కిడ్నీ కాజేత దినేష్ మృతితో మరో యువకుడి ఉదంతం వెలుగులోకి.. బాధితుడు వస్తే వాంగ్మూలం రికార్డు చేస్తాం: సీసీఎస్ పోలీసులు సాక్షి, సిటీబ్యూరో: కిడ్నీ రాకెట్ కేసులో మరో కొత్త కోణం.. జాబ్ ఇంటర్వ్యూ పేరుతో కొలంబో పిలిపించుకుని, వైద్యపరీక్షల పేరుతో కిడ్నీ దోచుకున్న ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడి కథనం ప్రకారం... పశ్చిమగోదావరి జిల్లా లింగంపాలెం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు, రాణి దంపతుల కుమారుడు మాదాసి కిరణ్ (24) ఇంటర్ పూర్తి చేసి ఉద్యోగం కోసం అన్వేషిస్తున్నాడు. ఈ క్రమంలో ఫ్లికర్, టైమ్స్ జాబ్ వెబ్సైట్లను పరిశీలిస్తుండగా.. ఉస్మానియా కన్స్ట్రక్షన్ కంపెనీలో జాబ్ ఉందని యాడ్ కనిపించింది. వారిని సంప్రదించగా పాస్‌పోర్ట్ తీసుకొని చెన్నైకి రావాలని చెప్పారు. గతనెల 23న కిరణ్ చెన్నై వెళ్లి ఆ కంపెనీ ప్రతినిధులను కలిశాడు. జాబ్‌కు సంబంధించి పది రోజుల ట్రైనింగ్ కోసమని అతడిని కొలంబో తీసుకెళ్లారు. ముందుగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని చెప్పి అతడిని అదే నెల 29న ఉదయం 7.30కి ఆసుపత్రికి తీసుకెళ్లారు. వెళ్లగానే ఏదో ఇంజక్షన్ ఇవ్వడంతో సృ్పహ కోల్పోయాడు. మధ్యాహ్నం 12 గంటలకు స్పృహలోకి వచ్చిన కిరణ్ తనకు ఏం జరిగిందని అడగ్గా.. బాత్రూంలో జారిపడ్డావని కంపెనీ ప్రతినిధులు చెప్పారు. ఉద్యోగానికి సెలక్ట్ అయ్యావని, టీఏ, డీఏలతో కలిపి నెలకు రూ.25 వేల జీతం వస్తుందని చెప్పారు. హైదరాబాద్‌లో జాబ్ చేయాల్సి ఉంటుందని, నీ ఈ-మెయిల్‌కు త్వరలో అపాయింట్మెంట్ లెటర్ పంపిస్తామని చెప్పి రూ.2 వేల డాలర్లు ఇచ్చి అతడిని స్వగ్రామానికి పంపించారు. అపాయింట్‌మెంట్‌లెటర్ కోసం ఎదురు చూస్తున్న కిరణ్‌కు... కిడ్నీ అమ్మేందుకు కొలంబో వెళ్లి మృత్యువాత పడిన కొత్తగూడెంవాసి దినేష్ ఉదంతం పేపర్లలో కనిపించింది. దినేష్ ఫొటోను గుర్తించిన కిరణ్.. అతను కూడా తనతో పాటు కొలంబో రూమ్‌లో కనిపించాడని ‘న్యూస్‌లైన్’కు చెప్పాడు. ఆ రూమ్‌లో తమతో పాటు తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు చెందిన పది మంది యువకులు ఉన్నారని, అయితే తనలాగే వారు కూడా జాబ్ కోసం వచ్చారని భావించానని కిరణ్ తెలిపాడు. దినేష్ ఉదంతం తెలిసిన వెంటనే అనుమానంతో తాను వైద్యుడికి చూపించుకోగా.. తన కిడ్నీ కూడా కొలంబోలో కాజేసినట్టు బయటపడిందని కిరణ్ కన్నీరుపెట్టుకున్నాడు. బాధితుడు ముందుకొస్తే అతని స్టేట్మెంట్ రికార్డు చేస్తామని సీసీఎస్ పోలీసులన్నారు. ఇదిలా ఉండగా, దినేష్ కేసులో గుంటూరుకు చెందిన కిషోర్‌ను పోలీసులు విచారిస్తున్నారు. అదే జిల్లాకు చెందిన వెంకటేశ్వర్లు ఆచూకీ కూడా పోలీసులకు లభించింది. వీరిచ్చిన సమాచారంతో ఓ పోలీసు బృందం చెన్నైకి వెళ్లింది. ప్రధాన నిందితుడిని త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.