
కిడ్నీ వ్యాపారం కేసులో అరెస్ట్ అయిన వ్యక్తి
- డాక్టర్‌తో పాటు ముగ్గురు బ్రోకర్ల అరెస్టు
- శ్రీలంక, ఇరాన్‌లలో కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు
- హైదరాబాద్‌లో క్రయ,విక్రయ ఒప్పందాలు
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ కిడ్నీ రాకె ట్ ముఠా గుట్టును హైదరాబాద్ పోలీసులు రట్టు చేశారు. ముఠా నాయకుడైన డాక్టర్‌తో పాటు ముగ్గురు బ్రోకర్లను అరెస్టు చేశారు. కిడ్నీ మార్పిడికి దేశంలోని చట్టాలు అనుమతించకపోవడంతో ఈ ముఠా శ్రీలంక, ఇరాన్ దేశాలు కేంద్రంగా తమ దందాను కొనసాగిస్తున్నాయి. కిడ్నీ అమ్మేవారు, కొనే వారిని అక్కడి ఆస్పత్రిలో చేర్పించి కిడ్నీ మార్పిడి చేయిస్తున్నాయి.
సోషల్ మీడియా వేదికగా అమాయకులకు గాలం వేస్తున్న ఈ ముఠా గుట్టును సోమవారం పోలీసులు చాకచక్యం గా పట్టుకోగలిగారు. వీరి నుంచి తొమ్మిది పాస్‌పోర్టులు, మెడికల్ రిపోర్టులు, కంప్యూటర్, ప్రింటర్, ల్యాప్‌టాప్‌లు, ఆరు సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. ముఠా వివరాలను టాస్క్‌ఫోర్స్ డీసీపీ లింబారెడ్డితో కలసి అదనపు పోలీసు కమిషనర్ అంజనీకుమార్ బషీర్‌బాగ్‌లోని తన కార్యాలయంలో వెల్లడిం చారు. మహారాష్ట్రలోని షిర్డీకి చెందిన డాక్టర్ హర్‌దేశ్ సక్సేనా అలియాస్ కుమార్ సక్సేనా(60) ఈ ముఠాకు నాయకుడు.
ఇతని ద్వారానే హయత్‌నగర్‌కు చెందిన వ్యాపారి కె.రాఘవేందర్ అతని భార్య స్వాతి తమ కిడ్నీలను రెండేళ్ల క్రితం శ్రీలంక వెళ్లి విక్రయిం చారు. హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన తరువా త సక్సేనాతో కలసి ఈ దందా నిర్వహించాలనుకున్న రాఘవేందర్, విశాఖపట్నంకు చెందిన వ్యక్తి, అమీర్‌పేట్‌కు చెందిన డిగ్రీ విద్యార్థి ఎ.అశోక్ (22)తో జత కట్టారు. ఈ ముగ్గురు సోషల్ మీడియా ద్వారా కిడ్నీ క్ర య, విక్రయాలు చేస్తామని ప్రకటనలు ఇచ్చా రు. నగరంలోని ఆసుపత్రిలో కిడ్నీ సంబంధిత రోగుల వివరాలు తెలుసుకుని వారిని సంప్రదించేవారు. కిడ్నీ అమ్మేవారు, కొనేవా రు ఇద్దరూ అంగీకరించాక వా రికి లాల్‌దర్వాజాకు చెందిన పాస్‌పోర్టు బ్రోకర్ సంజయ్‌కుమార్ జైన్ పాస్‌పోర్టులు తీసి ఇచ్చేవారు.
ఒప్పందం ఇక్కడ... ఆపరేషన్ అక్కడ..
ఈ ముఠా కిడ్నీ అమ్మేవారు, కొనేవారిని సం ప్రదించి వారితో హైదరాబాద్‌లోనే ఒప్పం దం చేసుకొనేది. కిడ్నీ కొనేవారు సక్సేనాకు రూ.30 లక్షలు చెల్లించాలి. ఇందులోంచి రూ.5 లక్షలు కిడ్నీ విక్రేతకు, రూ.13 లక్షలు శ్రీలంక, ఇరాన్‌లలోని ఆసుపత్రి ఖర్చులకు, లక్ష రూపాయలు ట్రావెల్స్ ఖర్చులుకు వె ళ్తా యి. మిగతా మొత్తంలో రూ.3 లక్షలు అశోక్, రాఘవేందర్‌లు, రూ.8 లక్షలు సక్సేనా తీసుకొనేవారు. ఈ ముఠాకు చెన్నై, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో నెట్‌వర్క్ ఉంది.
పోలీసుల విచారణలో హైదరాబాద్‌కు చెందిన కె.రాఘవేంద్ర అతని భార్య కె.స్వాతి, షరీఫ్, రఫీ, మనోజ్, రషీద్, మాలిక్, వీసీకే నాయుడు, పాండు రంగారావు, అశోక్‌లు ఇరాన్, శ్రీలంకకు వెళ్లి కిడ్నీల ను విక్రయించినట్లు తె లిసింది. ఈ ముఠాకు సంబంధించి మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు త్వరలో పోలీసు బృందాన్ని శ్రీలంకకు పంపనున్నట్లు పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కాగా, గత ఏడాది ఏప్రిల్‌లో కొత్తగూడెంకు చెందిన దినేశ్ (26)ను ఉద్యోగం పేరుతో శ్రీలంకకు తీసుకెళ్లి అక్కడ కిడ్నీ ఆపరేషన్ నిర్వహిస్తుండగా చనిపోయిన విషయం తెలిసిందే. ఈ కేసులో అప్పట్లో కిడ్నీ బ్రోకర్లను అరెస్టు చేశారు. అయితే ప్రధాన సూత్రధారి ప్రశాంత్‌సేఠ్ ఇంకా పరారీలోనే ఉన్నాడు.