♦ సమగ్ర దర్యాప్తు జరిపిన అనంతరం
♦ వివరాలు వెల్లడిస్తాం: ఎస్పీ దుగ్గల్
♦ కలకలం సృష్టించిన ‘సాక్షి’ కథనం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: జిల్లాలో గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న కిడ్నీ రాకెట్ వ్యవహారంలో మరిన్ని ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఈ రాకెట్‌కు కేవలం మహారాష్ట్రకే కాకుండా ఉత్తరప్రదేశ్, జమ్మూ-కశ్మీర్‌లకు కూడా లింకు ఉందని, కనీసం మూడు రాష్ట్రాలకు సంబంధముందని పోలీసువర్గాలు భావిస్తున్నాయి. తమ అదుపులో ఉన్న నిందితుడి నుంచి అన్ని వివరాలు రాబట్టేందుకు పోలీసులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. నిందితుడు ఇచ్చిన వివరాల ఆధారంగా దాదాపు బాధితులందరి వివరాలు రాబట్టారని తెలిసింది. అసలు ఈ రాకెట్‌లో ఉన్నది ఆ ఒక్కడేనా? నల్లగొండకు చెందిన ఇంకెవరైనా ఉన్నారా? వారికి లింకు ఎక్కడ ఉంది? అక్కడ ఉన్న ముఠాల వివరాలేంటి? అనే అంశాలను కూపీ లాగే పనిలో పడ్డారు పోలీసులు.
అయితే, ఈ కిడ్నీ రాకెట్‌పై మంగళవారం ‘సాక్షి’ పత్రికలో ప్రచురితమైన కథనాలు జిల్లాలో సంచలనం సృష్టిం చాయి. ముఖ్యంగా నల్లగొండ జిల్లా కేంద్రంలో జరుగుతున్న ఈ రాకెట్‌పై స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎస్పీ దుగ్గల్ కూడా జిల్లా పోలీసు అధికారులతో ఈ విషయమై చర్చించి పలు సూచనలు చేసినట్టు సమాచారం. ఈ రాకెట్‌ను ‘సాక్షి’ వెలుగులోకి తేవడం తో అప్రమత్తమైన బాధితులు కొందరు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పోలీసులకు వివరాలు అందిస్తుండగా, మరికొందరు వెనుకంజ వేస్తున్నారు.
అన్ని వివరాలు వచ్చాక వెల్లడిస్తాం: ఎస్పీ దుగ్గల్
ఈ కిడ్నీ రాకెట్ వ్యవహారంపై జిల్లా ఎస్పీ విక్రమ్‌జీత్ దుగ్గల్ ‘సాక్షి’తో మాట్లాడుతూ విచారణ జరుగుతున్న మాట వాస్తవమేనన్నారు. అయితే, ఈ విచారణలో చాలా అంశాలు తెలియాల్సి ఉందని, విచారణ కొనసాగుతోందని చెప్పారు. విచారణలో అన్ని వివరాలు స్పష్టంగా తెలిసిన తర్వాత అధికారికంగా బయటకు వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు.
తీగ లాగితే కదులుతున్న ‘కిడ్నీ’లు
Published Wed, Jan 6 2016 3:41 AM | Last Updated on Tue, Aug 21 2018 5:52 PM
Advertisement
Advertisement