SP Duggal
-
బరిలో దిగిన బాస్..
స్పెషల్ డ్రైవ్‌తో హడలెత్తించిన ఎస్పీ దుగ్గల్ 23 కేసులు నమోదు, భారీగా జరిమానా ఆదిలాబాద్ క్రైం : ట్రాఫిక్ నిబంధనలు కఠినంగా అమలు చేసేందుకు ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ స్వయంగా బరిలోకి దిగారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ చౌరస్తాలో ఎస్పీ స్వయంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి హడలెత్తించారు. పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు వాహనాలు తనిఖీ చేశారు. హెల్మెట్ ధరించని ద్విచక్ర వాహనదారులకు జరిమానా విధించారు. లెసైన్సు, వాహన ధ్రువపత్రాలు, ఇన్సురెన్స్లేని వాహనాలకు జరిమానా విధించడంతోపాటు అసలే పత్రాలు లేని 23 వాహనాలపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా నిబంధనలు కఠినంగా అమలు చేయాలని ఆదేశించారు. ట్రాఫిక్ నియమాలు పాటించి, రోడ్డు ప్రమాదాలను నివారించే చర్యల్లో భాగస్వాములు కావాలని కోరారు. వాహనాలు అతివేగంగా నడపకూడదని, ఎదురుగా వాహనాలు వచ్చే సమయంలో ఓవర్‌టేకింగ్ చేయకూడదని సూచించారు. హెల్మెట్ ధరించడం తప్పని సరిచేస్తూ భారీ జరిమానాలు విధించేందుకు స్పెషల్‌డ్రైవ్‌లు నిర్వహిస్తామన్నారు. వాహనదారులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తనిఖీల్లో పట్టణ సీఐలు వెంకటస్వామి, సత్యనారాయణ, ఎస్సైలు వేణుగోపాల్‌రావు, రాజలింగు, శ్రీనివాస్ ఉన్నారు. -
కానిస్టేబుల్ పరీక్షలు విజయవంతం
ఎస్పీ విక్రమ్‌సింగ్ దుగ్గల్ వ్యాయామ ఉపాధ్యాయులకు సన్మానం ఆదిలాబాద్ క్రైం : జిల్లా కేంద్రంలోని పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో పదిహేను రోజులపాటు నిర్వహించిన కానిస్టేబుల్ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ విజయవంతంగా ముగిసిందని ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ అన్నారు. ఎంపిక ప్రక్రియ క్రమపద్ధతిలో నిర్వహించినందుకు వ్యాయామ ఉపాధ్యాయులకు అభినంధనలు తెలిపారు. శుక్రవారం స్థానిక పోలీసు పరేడ్ మైదానంలో వ్యాయామ ఉపాధ్యాయులు జి.మహేశ్, హరిచరణ్, శాస్త్రీ, భూమన్న, నాందేవ్, రవికుమార్, ఎన్.స్వామి, కృష్ణ, సత్యనారాయణ, శబ్బీర్, జె.రవీందర్లను శాలువాతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. చివరి రాత పరీక్ష కోసం 4221 మంది పురుషులు, 1117 మహిళా అభ్యర్థులు ఎంపికైనట్లు తెలిపారు. ఈ ప్రక్రియలో పోలీసు అధికారులు సమర్థవంతంగా విధులు నిర్వర్తించారని పేర్కొన్నారు. వ్యాయామ ఉపాధ్యాయులు ఈ పరీక్షల నిర్వహణలో కీలక పాత్రపోషించారని తెలిపారు. బయోమెట్రిక్ విధానం ద్వారా ఆధార్‌కార్డు గుర్తింపు ప్రక్రియలో కంప్యూటర్ విభాగం అధికారులు ఎంతో కృషిచేశారని వివరించారు. పోలీసు కార్యాలయ అధికారులు, పోలీసు అధికారులను ప్రతీ ఒక్కరికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీలు జీఆర్ రాధిక, విజయ్‌కుమార్, పోలీసు అధికారులు ఉన్నారు. -
పరీక్షలు విజయవంతం
ఎస్పీ విక్రమ్‌సింగ్ దుగ్గల్ వ్యాయామ ఉపాధ్యాయులకు సన్మానం ఆదిలాబాద్ క్రైం : జిల్లా కేంద్రంలోని పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో పదిహేను రోజులపాటు నిర్వహించిన కానిస్టేబుల్ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ విజయవంతంగా ముగిసిందని ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ అన్నారు. ఎంపిక ప్రక్రియ క్రమపద్ధతిలో నిర్వహించినందుకు వ్యాయామ ఉపాధ్యాయులకు అభినంధనలు తెలిపారు. శుక్రవారం స్థానిక పోలీసు పరేడ్ మైదానంలో వ్యాయామ ఉపాధ్యాయులు జి.మహేశ్, హరిచరణ్, శాస్త్రీ, భూమన్న, నాందేవ్, రవికుమార్, ఎన్.స్వామి, కృష్ణ, సత్యనారాయణ, శబ్బీర్, జె.రవీందర్లను శాలువాతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. చివరి రాత పరీక్ష కోసం 4221 మంది పురుషులు, 1117 మహిళా అభ్యర్థులు ఎంపికైనట్లు తెలిపారు. ఈ ప్రక్రియలో పోలీసు అధికారులు సమర్థవంతంగా విధులు నిర్వర్తించారని పేర్కొన్నారు. వ్యాయామ ఉపాధ్యాయులు ఈ పరీక్షల నిర్వహణలో కీలక పాత్రపోషించారని తెలిపారు. బయోమెట్రిక్ విధానం ద్వారా ఆధార్‌కార్డు గుర్తింపు ప్రక్రియలో కంప్యూటర్ విభాగం అధికారులు ఎంతో కృషిచేశారని వివరించారు. పోలీసు కార్యాలయ అధికారులు, పోలీసు అధికారులను ప్రతీ ఒక్కరికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీలు జీఆర్ రాధిక, విజయ్‌కుమార్, పోలీసు అధికారులు ఉన్నారు. -
'కిడ్నీ రాకెట్' పై త్వరలోనే నివేదిక: దుగ్గల్
నల్లగొండ: సంచలనం సృష్టించిన కిడ్నీ రాకెట్ కేసుపై తెలంగాణ ప్రభుత్వానికి త్వరలోనే నివేదిక అందజేస్తామని జిల్లా ఎస్పీ దుగ్గల్ తెలిపారు. నల్లగొండలో ఆయన శుక్రవారం సాక్షి మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతానికైతే ఈ కేసులో నిందితుడుగా ఉన్న సురేష్ ప్రజాపతి ఇచ్చిన సమాచారం మేరకు విచారణ చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాల ప్రజలు డబ్బుల కోసం శ్రీలంకలో కిడ్నీలు అమ్ముకుంటున్న ఘటన ఇటీవలే వెలుగుచూసింది. ఈ కేసుతో సంబంధం ఉన్న నిందితులను పోలీసులు విచారిస్తున్నారు. కిడ్నీ రాకెట్ ఉదంతంలో శ్రీలంకలో నాలుగు ఆస్పత్రులు, ఆరుగురు డాక్టర్లకు కిడ్నీ అక్రమ ట్రాన్స్ ప్లాంటేషన్ల పాత్ర ఉన్నట్లు గుర్తించినట్లు వివరించారు. మధ్యప్రదేశ్ లో మరో నిందితుడి కోసం గాలిస్తున్నట్లు ఎస్పీ దుగ్గల్ సాక్షి మీడియాకు తెలిపారు. శ్రీలకం ప్రభుత్వం కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్లను నిలిపివేయడాన్ని అభినందించారు. ప్రభుత్వం అనుమతిస్తే శ్రీలంకలో కూడా విచారణ జరపడానికి సిద్ధమని ఎస్పీ వివరించారు. -
తీగ లాగితే కదులుతున్న ‘కిడ్నీ’లు
-
తీగ లాగితే కదులుతున్న ‘కిడ్నీ’లు
♦ సమగ్ర దర్యాప్తు జరిపిన అనంతరం ♦ వివరాలు వెల్లడిస్తాం: ఎస్పీ దుగ్గల్ ♦ కలకలం సృష్టించిన ‘సాక్షి’ కథనం సాక్షి ప్రతినిధి, నల్లగొండ: జిల్లాలో గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న కిడ్నీ రాకెట్ వ్యవహారంలో మరిన్ని ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఈ రాకెట్‌కు కేవలం మహారాష్ట్రకే కాకుండా ఉత్తరప్రదేశ్, జమ్మూ-కశ్మీర్లకు కూడా లింకు ఉందని, కనీసం మూడు రాష్ట్రాలకు సంబంధముందని పోలీసువర్గాలు భావిస్తున్నాయి. తమ అదుపులో ఉన్న నిందితుడి నుంచి అన్ని వివరాలు రాబట్టేందుకు పోలీసులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. నిందితుడు ఇచ్చిన వివరాల ఆధారంగా దాదాపు బాధితులందరి వివరాలు రాబట్టారని తెలిసింది. అసలు ఈ రాకెట్లో ఉన్నది ఆ ఒక్కడేనా? నల్లగొండకు చెందిన ఇంకెవరైనా ఉన్నారా? వారికి లింకు ఎక్కడ ఉంది? అక్కడ ఉన్న ముఠాల వివరాలేంటి? అనే అంశాలను కూపీ లాగే పనిలో పడ్డారు పోలీసులు. అయితే, ఈ కిడ్నీ రాకెట్‌పై మంగళవారం ‘సాక్షి’ పత్రికలో ప్రచురితమైన కథనాలు జిల్లాలో సంచలనం సృష్టిం చాయి. ముఖ్యంగా నల్లగొండ జిల్లా కేంద్రంలో జరుగుతున్న ఈ రాకెట్‌పై స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎస్పీ దుగ్గల్ కూడా జిల్లా పోలీసు అధికారులతో ఈ విషయమై చర్చించి పలు సూచనలు చేసినట్టు సమాచారం. ఈ రాకెట్‌ను ‘సాక్షి’ వెలుగులోకి తేవడం తో అప్రమత్తమైన బాధితులు కొందరు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పోలీసులకు వివరాలు అందిస్తుండగా, మరికొందరు వెనుకంజ వేస్తున్నారు. అన్ని వివరాలు వచ్చాక వెల్లడిస్తాం: ఎస్పీ దుగ్గల్ ఈ కిడ్నీ రాకెట్ వ్యవహారంపై జిల్లా ఎస్పీ విక్రమ్‌జీత్ దుగ్గల్ ‘సాక్షి’తో మాట్లాడుతూ విచారణ జరుగుతున్న మాట వాస్తవమేనన్నారు. అయితే, ఈ విచారణలో చాలా అంశాలు తెలియాల్సి ఉందని, విచారణ కొనసాగుతోందని చెప్పారు. విచారణలో అన్ని వివరాలు స్పష్టంగా తెలిసిన తర్వాత అధికారికంగా బయటకు వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు. -
నేడు ‘భారీ’ వాహనాల దారి మళ్లింపు
అమరావతి శంకుస్థాపన,దసరా సందర్భంగా నిర్ణయం సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమంతోపాటు దసరా పండగ సందర్భంగా గురువారం హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే భారీ వాహనాలు నల్లగొండ జిల్లాలో రూటు మార్చుకోనున్నారు. నల్లగొండ ఎస్పీ దుగ్గల్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా చెన్నై వాహనాలు నార్కట్‌పల్లి మీదుగా నల్లగొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, అద్దంకిల మీదుగా ఒంగోలుకు వెళ్లి, అక్కడి నుంచి చెన్నై వెళ్లాల్సి ఉంటుంది. హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా వైజాగ్ వెళ్లే వాహనాలు సూర్యాపేట నుంచి ఖమ్మం రూటులో వెళ్లి వైజాగ్‌కు వెళ్లాలి. ఒడిశా, బెంగాల్‌కు వెళ్లే వాహనాలు కోదాడ నుంచి దారి మళ్లాల్సి ఉంటుంది. ఈ మూడు రూట్లలో గురువారం ఒక్కరోజు మాత్రమే ఈ ఆదేశాలు వర్తిస్తాయని ఎస్పీ దుగ్గల్ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
సాగులలో సాహసం
మావోయిస్టు ప్రాబల్య ప్రాంతంలో ఎస్పీ దుగ్గల్ సద్భావన యాత్ర ద్విచక్రవాహనంపై ప్రదర్శనగా ప్రయాణం పాతికేళ్లలో ఎస్పీ పర్యటన ఇదే ప్రథమం మారుమూల ప్రాంతాల్లో కాలినడకన పర్యటన గిరిజనులతో మమేకం.. అడవిబిడ్డల ఆత్మీయ స్పందన గూడెం కొత్తవీధి, న్యూస్‌లైన్ : మావోయిస్టు ప్రాబల్య ప్రాంతంగా పేరొందిన సాగుల అటవీ ప్రాంతంలో ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ సాహసోపేత రీతిలో పర్యటించారు. అసాధారణ రీతిలో అడవుల్లోకి అడుగుపెట్టి గిరిజనులతో మమేకమయ్యారు. సద్భావన యాత్ర జరిపి దుర్గమ ప్రాంతాల్లో గిరిజన గూడేల్లో కలయతిరిగారు. గత ఏడాది ఫిబ్రవరిలో సాగుల గ్రామ గిరి జనులపై మావోయిస్టులు దాడిచేయడంతో ముగ్గురు గిరిజనులు మృతి చెందిన సంగతి తెలిసిందే. వీరి కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం మంజూరు చేసింది. దీనిని నేరుగా సాగుల గ్రామంలో నివాసముం టున్న కుటుంబసభ్యులకు అందజేయాలన్న ఉద్దేశంతో పోలీసులు సోమవారం సద్భావనయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పా ల్గొనేందుకు జిల్లా ఎస్పీ దుగ్గల్ సోమవారం జి.కె.వీధి చేరుకున్నారు. జి.కె.వీధి నుండి ద్విచక్రవాహనాలపై అటవీ మార్గంలో ర్యాలీగా తరలివచ్చారు. కొంత దూరం ప్రయాణించి అక్కడ నుండి వాహనం కూడా వెళ్లలేని పరిస్థితుల్లో అధ్వానంగా ఉన్న రహదారుల్లో కాలినడకన ఎ స్పీ తన బృందంతో సాగుల గ్రామానికి చేరుకున్నారు. తొలిసారిగా తమ గ్రామానికి చేరుకున్న జిల్లా ఎస్పీకి గిరిజనులు బ్రహ్మరథం పట్టారు. పూలదండలు వేసి హారతులు పట్టి ఎస్పీకి ఘనస్వాగతం పలికారు. పాతికేళ్లలో ఎస్పీ స్థాయి అధికారి ఇక్కడ పర్యటించడం ఇదే ప్రథమం. సాయం పంపిణీ : సాగులలో మావోయిస్టుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు గిరిజనులు బవుడు తొండయ్య, అడపా బాలయ్యపడాల్, వంజరి హనుమంతరావుల కుటుంబాలకు తలా రూ. 5 లక్షల సాయం అందజేశారు. ఇందుకు సంబంధించిన బ్యాంకు పాస్ పుస్తకాలను మృతుల కుటుంబసభ్యులకు ఎస్పీ చేతుల మీదుగా అందజేశారు. అంతకుముందు ఈ యాత్రకు హాజరైన గిరిజనులకు పండ్లు, మిఠాయిలు పంపిణీ చేశారు. చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చిన వందలాది మంది గిరిజనులకు దుప్పట్లు, చీరలు, గిరిజన యువతకు వాలీబాల్ కిట్లనుపంపిణీ చేశారు. కార్యక్రమం అనంతరం సదస్సుకు హాజరైన గిరిజనులతో ఎస్పీ దుగ్గల్, నర్సీపట్నం ఓఎస్డీ దామోదర్, చింతపల్లి డీఎస్పీ అశోక్‌కుమార్, ఇతర పోలీసు అధికారులు సహపంక్తి భోజనం చేశారు. భద్రత నడుమ పర్యటన : మావోయిస్టు కంచుకోటగా పేరొందిన గ్రామాలలో ఎస్పీ స్థా యి అధికారి తొలిసారిగా పర్యటించడతో జిల్లా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటుచేసింది. ఎస్పీ పర్యటించిన అన్ని గ్రా మాల్లో ఆదివారం రాత్రే ప్రత్యేక బలగాలను మోహరించారు. గ్రేహౌండ్స్, స్పెషల్‌పార్టీ, సీఆర్పీఎఫ్ బలగాలు గాలింపుచర్యలు ముమ్మ రం చేశాయి. పాతికేళ్లుగా ఎస్పీ స్థాయి అధికారి ఒక్కరూ అడుగుపెట్టని ప్రాంతంలో దుగ్గల్పర్యటించారు. యాత్ర విజయవంతం కావడంతో పోలీసు యంత్రాం గం ఊపిరి పీల్చుకుంది. కార్యక్రమంలో ట్రైనీ డీఎస్పీ శ్రీహరి, జి.కె.వీధి సీఐ రాంబాబు, చింతపల్లి సీఐ ప్రసాద్, ఎస్ఐలు విజయ్‌కుమార్, కోటేశ్వరరావు, నర్సింహమూర్తి పాల్గొన్నారు.