ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమంతోపాటు దసరా పండగ సందర్భంగా గురువారం హైదరాబాద్ నుంచి విజయవాడకు
అమరావతి శంకుస్థాపన,దసరా సందర్భంగా నిర్ణయం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమంతోపాటు దసరా పండగ సందర్భంగా గురువారం హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే భారీ వాహనాలు నల్లగొండ జిల్లాలో రూటు మార్చుకోనున్నారు. నల్లగొండ ఎస్పీ దుగ్గల్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా చెన్నై వాహనాలు నార్కట్‌పల్లి మీదుగా నల్లగొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, అద్దంకిల మీదుగా ఒంగోలుకు వెళ్లి, అక్కడి నుంచి చెన్నై వెళ్లాల్సి ఉంటుంది.
హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా వైజాగ్ వెళ్లే వాహనాలు సూర్యాపేట నుంచి ఖమ్మం రూటులో వెళ్లి వైజాగ్‌కు వెళ్లాలి. ఒడిశా, బెంగాల్‌కు వెళ్లే వాహనాలు కోదాడ నుంచి దారి మళ్లాల్సి ఉంటుంది. ఈ మూడు రూట్లలో గురువారం ఒక్కరోజు మాత్రమే ఈ ఆదేశాలు వర్తిస్తాయని ఎస్పీ దుగ్గల్ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.