పరీక్షలు విజయవంతం | constable exams success | Sakshi
Sakshi News home page

పరీక్షలు విజయవంతం

Published Fri, Jul 29 2016 10:06 PM | Last Updated on Mon, Sep 4 2017 6:57 AM

వ్యాయామ ఉపాధ్యాయులతో ఎస్పీ

వ్యాయామ ఉపాధ్యాయులతో ఎస్పీ

  • ఎస్పీ విక్రమ్‌సింగ్‌ దుగ్గల్‌
  • వ్యాయామ ఉపాధ్యాయులకు సన్మానం
  • ఆదిలాబాద్‌ క్రైం : జిల్లా కేంద్రంలోని పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో పదిహేను రోజులపాటు నిర్వహించిన కానిస్టేబుల్‌ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ విజయవంతంగా ముగిసిందని ఎస్పీ విక్రమ్‌జిత్‌ దుగ్గల్‌ అన్నారు. ఎంపిక ప్రక్రియ క్రమపద్ధతిలో నిర్వహించినందుకు వ్యాయామ ఉపాధ్యాయులకు అభినంధనలు తెలిపారు. శుక్రవారం స్థానిక పోలీసు పరేడ్‌ మైదానంలో వ్యాయామ ఉపాధ్యాయులు జి.మహేశ్, హరిచరణ్, శాస్త్రీ, భూమన్న, నాందేవ్, రవికుమార్, ఎన్‌.స్వామి, కృష్ణ, సత్యనారాయణ, శబ్బీర్, జె.రవీందర్‌లను శాలువాతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు.
     
    చివరి రాత పరీక్ష కోసం 4221 మంది పురుషులు, 1117 మహిళా అభ్యర్థులు ఎంపికైనట్లు తెలిపారు. ఈ ప్రక్రియలో పోలీసు అధికారులు సమర్థవంతంగా విధులు నిర్వర్తించారని పేర్కొన్నారు. వ్యాయామ ఉపాధ్యాయులు ఈ పరీక్షల నిర్వహణలో కీలక పాత్రపోషించారని తెలిపారు. బయోమెట్రిక్‌ విధానం ద్వారా ఆధార్‌కార్డు గుర్తింపు ప్రక్రియలో కంప్యూటర్‌ విభాగం అధికారులు ఎంతో కృషిచేశారని వివరించారు. పోలీసు కార్యాలయ అధికారులు, పోలీసు అధికారులను ప్రతీ ఒక్కరికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీలు జీఆర్‌ రాధిక, విజయ్‌కుమార్, పోలీసు అధికారులు ఉన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement