వెల్దుర్తి (కర్నూలు) : వాహన తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు ఓ వాహనంలో తరలిస్తున్న పేలుడు పదార్థాలను గుర్తించి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో శుక్రవారం వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఓ ట్రాక్టర్‌లో తరలిస్తున్న 225 జిలెటిన్‌స్టిక్స్, 400 ఎలక్ట్రికల్ పరికరాలు, 15 కిలోల అమ్మోనియంను గుర్తించారు. దీంతో వాటిని స్వాధీనం చేసుకుని ట్రాక్టర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మైనింగ్‌కు ఉపయోగించడం కోసం ఎటువంటి అనుమతులు లేకుండా నల్లగొండ నర్సయ్య అనే వ్యక్తి వీటిని తరలిస్తున్నాడని తెలిసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.