అక్రమంగా పేలుడు పదార్థాలు కలిగి ఉన్నారనే ఆరోపణలపై కోర్టుకు హాజరైన చింటూకు రిమాండు గడువును పొడిగిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
చిత్తూరు (అర్బన్): అక్రమంగా పేలుడు పదార్థాలు కలిగి ఉన్నారనే ఆరోపణలపై కోర్టుకు హాజరైన చింటూకు రిమాండు గడువును పొడిగిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న చింటూకు సంబంధించి బంగారుపాళ్యం వద్ద ఉన్న క్వారీలో పేలుడు పదార్థాలు ఉన్నాయని అక్కడి పోలీసులు కేసు నమోదు చేయడం తెలిసిందే.
విచారణలో భాగంగా మంగళవారం చింటూను పోలీసులు చిత్తూరులోని నాలుగో అదనపు మున్సిఫ్ మేజిస్ట్రేట్ న్యాయస్థానంలో హాజరు పరచగా, విచారణను ఈనెల 22కు వాయిదా వేస్తూ న్యాయమూర్తి యుగంధర్ ఆదేశాలు జారీ చేశారు. అనంతరం చింటూను కడప జైలుకు తరలించారు.