Chintu
-
చింటూ జీవితం ఓ గుణపాఠం
పదిహేనేళ్ల క్రితం మెరైన్ ఇంజినీరింగ్ చదువుకున్న వ్యక్తి జీవితం ఇప్పుడెలా ఉంటుందని అడిగితే విదేశీ కంపెనీల్లో ఉద్యోగం. గగనంలో విహారాలు.. ఆరంకెల జీతం. అని ఠక్కున చెప్పేస్తారు. అదే వ్యక్తి గొడవల్లోకి దిగి ఎవరి కోసమో జీవితం పణంగా పెడితే ఎలా ఉంటుందోనని అడిగితే చిత్తూరుకు చెందిన చింటూను చూపించే పరిస్థితి. హత్య కేసులో జీవిత ఖైదు పడ్డ చింటూ అలియాస్ చంద్రశేఖర్ జీవితం నేటి యువతకు తప్పకుండా ఓ పాఠం నేర్పుతోంది. విదేశీ ఓడల నుంచి జైలుగోడల వరకు.. చిత్తూరు అర్బన్: చిత్తూరుకు చెందిన చింటూ పదిహేనేళ్ల కిత్రమే మెరైన్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన విద్యావంతుడు. అప్పటికే షిప్‌యార్డులో ఉద్యోగం రావడంతో ఓడల్లో ఏటా 20కు పైగా దేశాలు తిరుగుతూ చేతినిండా డబ్బులు సంపాదిస్తున్నాడు. 2005లో సొంత మేనమామ కటారి మోహన్‌పై జరిగిన దాడికి ప్రతీకారం తీర్చుకోవాలనుకుని... చివరకు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు పై హత్యాయత్నానికి పాల్పడి జైలు పాలయ్యాడు. 2007లో సీకే బాబుపై జరిగిన మందుపాతర దాడి కేసులో రెండో నిందితుడిగా మారిన అత డు.. దాని తరువాత అరెస్టయి బెయిల్‌పై వచ్చి విద్యాసంస్థలు స్థాపించి, యువతకు ఉచిత శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ... సమాజంలో తనకు ప్రత్యేక గుర్తింపు కావాలనే క్రమంలో రక్త సంబంధీకులతో ఏర్పడ్డ గొడవలు.. అదే రక్తాన్ని కళ్లారా చూడటానికి సైతం వెనుకాడని స్థాయికి చేరుకున్నాయి. ఏ మామ కోసమైతే చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నాడో ...అదే మామను మట్టుపెట్టాడనే ఆరోపణలపై ఇంకా జైలు జీవితం గడుపతున్నాడు. నేటితరం మారాలి.. ‘రూలింగ్‌లో ఉన్నది మన పార్టీనే. నువ్వు నా వెనుక ఉండు చాలు. నీకేం కావాలో నేను చూసుకుంటా..’ అంటూ పలువురు నాయకులు జిల్లాలోని యువతను పెడదారి పట్టిస్తున్నారు. పొద్దున్నుంచి పొద్దుపోయే వరకు నిరుద్యోగ యువతను వెంట తిప్పుకుని చేతిలో రూ.500 నోటు, ఓ క్వార్టర్ బాటిల్ మందు పెడుతున్నారు. ‘ రేయ్ నువ్వు అన్న దగ్గరకు వచ్చేయ్, అన్న బండిలో పోతుంటే మనం వెనుక స్కూటర్లో ఫాలో అవ్వాలి. అన్న కారు దిగితే వెనకే బాడీగార్డుగా ఉండాలి. అన్న చెప్పిన వాడిని తన్నాలి. పోలీసోళ్లే అన్న కాడికి వచ్చి సలాం కొడతారు. మనల్ని ఏమీ చేయరు..’ అనే అధికార పార్టీ నాయకుల మాటలకు నేటితరం యువతలో చాలా మంది బలవుతున్నారు. చింటూ విషయంలో కూడా ఇదే జరిగింది. మాజీ మేయర్ అనురాధ, కటారి దంపతుల హత్య కేసులో చింటూ ఓ పావు మాత్రమే. ఇతన్ని రెచ్చగొట్టి.. పక్కకు తప్పుకున్న టీడీపీ నాయకులు ఎవరనేది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే. తల్లితండ్రుల మాట వినకుండా.. రాజకీయ నాయకుల వద్ద గులాంగిరి చేసి తీరా కేసుల్లో ఇరుక్కున్న తరువాత ఏం జరుగుతుందో చింటూ పయనం నేటితరానికి ఓ గుణపాఠంగా మిగిలింది. చేసిన తప్పుల నుంచి తాత్కాలికంగా నేతలు కాపాడొచ్చు. కానీ అధికారంలోంచి తప్పుకున్న తరువాత నాయకుల వద్ద పనిచేసిన అనుచరులు ఏదో ఒక రోజు ఊచలు లెక్కించక తప్పదు. రాజకీయం అంటే ఫ్యాక్షనూ కాదు.. ఫ్యాషనూ కాదు నేటి యువతకు ప్రధానంగా చదువు అవసరం. యువత రాజకీయాల్లోకి కచ్చితంగా రావాల్సిందే. కానీ నాయకుల్ని నమ్ముకుని చట్టవ్యతిరేక పనులు చేయొద్దు. మిమ్మల్ని నిన్న గలీజు పనులకు వాడుకున్నవాడే రేపు నడిరోడ్డులో వదిలేస్తాడని గుర్తుపెట్టుకోండి. రాజకీయం అంటే ఫ్యాక్షన్ కాదు..ఫ్యాషనూ కాదు..తల్లితండ్రులు ఎన్ని కష్టాలుపడి మిమ్మల్ని చదివిస్తున్నారో మరచిపోవద్దు. – సుబ్బారావు, డీఎస్పీ, చిత్తూరు. -
సీకే బాబుపై హత్యాయత్నం కేసులో తీర్పు వెల్లడి
-
సీకే బాబుపై హత్యాయత్నం కేసులో తీర్పు వెల్లడి
సాక్షి,చిత్తూరు: పదేళ్ల క్రితం సంచలనం కలిగించిన చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకేబాబుపై హత్యాయత్నం కేసులో 9వ అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు సోమవారం తీర్పును వెలువరించింది. 2007 డిసెంబర్ 31న సీకే బాబు ప్రయాణిస్తున్న కారును లక్ష్యంగా చేసుకుని నిందితులు మందుపాతర పేల్చారు. ఈ ఘటనలో సీకే బాబు గన్‌మెన్ సురేంద్ర మృతి చెందగా, సీకే బాబుకు, అతని అనుచరులకు గాయాలయ్యాయి. దీనిపై దర్యాప్తును ప్రారంభించిన వన్‌టౌన్ పోలీసులు 18 మందిని నిందితులుగా గుర్తిస్తూ అప్పటి డీఎస్పీ రవీంద్రారెడ్డి, సీఐలు కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. సీకే బాబు సహా 81మంది సాక్షుల్ని పోలీసులు చేర్చగా, కోర్టు 51 మందిని విచారించి 13 మందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ సోమవారం తీర్పునిచ్చింది. ఇందులో ఏ-1 నిందితుడు, టీడీపీ నాయకుడు కటారి మోహన్ మృతిచెందగా, ఏ-2 నిందితుడైన చింటూకు కోర్టు జీవితఖైదును విధించింది. మేయర్ కటారి అనూరాధ, ఆమె భర్త మోహన్ హత్య కేసులో చింటూ ప్రధాన నిందితుడుగా ఇప్పటికే వైఎస్ఆర్ కడప జిల్లా సెంట్రల్ జైలులో అండర్ ట్రయల్ ఖైదీగా శిక్ష అనుభవిస్తున్నాడు. -
విద్యుదాఘాతంతో విద్యార్థి మృతి
చదువుపై ఆసక్తితో కళాశాలకు వెళ్లిన ఓ అంధ విద్యార్థి కరెంట్‌షాక్‌తో చనిపోయాడు. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో చోటుచేసుకుంది. మండలంలోని కూనంనేనివారిపాలెం గ్రామానికి చెందిన యాకోబు, నర్సమ్మ దంపతుల కుమారుడు చింటు(16) పుట్టుకతోనే అంధుడు. అయినప్పటికీ, అతడు పట్టుదలతో చ దివి పదో తరగతి మంచి మార్కులు తెచ్చుకున్నాడు. ఇటీవలే చీమకుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సీఈసీ గ్రూప్‌లో చేరాడు. మంగళవారం కళాశాలకు వెళ్లిన చింటు తెలియక తరగతి గది గోడకు ఉన్న విద్యుత్ వైర్లను తాకాడు. అందులో విద్యుత్ ప్రసారం అవుతుండటంతో షాక్‌తో అక్కడికక్కడే చనిపోయాడు. తమ కుమారుడి మృతికి కళాశాల సిబ్బంది నిర్లక్ష్యమే కారణమంటూ తల్లిదండ్రులు, బంధువులు కొద్దిసేపు ఆందోళన చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
బావిలో పడి ఇద్దరు యువకుల దుర్మరణం
కడెం: ఆదిలాబాద్ జిల్లాలో ప్రమాదవశాత్తూ బావిలోపడి ఇద్దరు యువకులు మృతిచెందారు. ఈ సంఘటన కడెం మండలం గుడితిర్యాల గ్రామ శివారులో సోమవారం చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లా పెరికి గ్రామానికి చెందిన నరేష్(24), చింటు(20) అనే యువకులు దైవదర్శనార్థం గుడితిర్యాలకు వచ్చారు. పక్కనే ఉన్న వ్యవసాయ బావిలో స్నానం చేసేందుకు వెళ్లిన నరేష్ నీటిలో మునిగిపోతుండగా గట్టుపై ఉన్న చింటూ కాపాడేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఇద్దరూ నీటిలో మునిగిపోయారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇద్దరి మృతి దేహాలను వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. -
చింటూ రిమాండు పొడిగింపు
చిత్తూరు (అర్బన్): అక్రమంగా పేలుడు పదార్థాలు కలిగి ఉన్నారనే ఆరోపణలపై కోర్టుకు హాజరైన చింటూకు రిమాండు గడువును పొడిగిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న చింటూకు సంబంధించి బంగారుపాళ్యం వద్ద ఉన్న క్వారీలో పేలుడు పదార్థాలు ఉన్నాయని అక్కడి పోలీసులు కేసు నమోదు చేయడం తెలిసిందే. విచారణలో భాగంగా మంగళవారం చింటూను పోలీసులు చిత్తూరులోని నాలుగో అదనపు మున్సిఫ్ మేజిస్ట్రేట్ న్యాయస్థానంలో హాజరు పరచగా, విచారణను ఈనెల 22కు వాయిదా వేస్తూ న్యాయమూర్తి యుగంధర్ ఆదేశాలు జారీ చేశారు. అనంతరం చింటూను కడప జైలుకు తరలించారు. -
చింటూ రిమాండు పొడిగింపు
చిత్తూరు (అర్బన్): చిత్తూరు మేయర్ అనురాధ, ఆమె భర్త కటారి మోహన్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న చింటూ రిమాండు గడువును పొడిగిస్తూ స్థానిక నాలుగో అదనపు మునిసిఫ్ మేజిస్ట్రేట్ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. కేసు విచారణలో భాగంగా శుక్రవారం చింటూతో పాటు మేయర్ హత్య కేసులో ఉన్న నిందితులను పోలీసులు న్యాయస్థానం ఎదుట హాజరుపరచారు. ఈ కేసులో నిందితుడిగా ఉంటూ బెయిల్‌పై ఉన్న కాసారం రమేష్ జిల్లాలోకి ప్రవేశించ కూడదని షరతు ఉండటంతో ఇతను కోర్టుకు రాలేదు. మిగిలిన నిందితులు న్యాయస్థానం ఎదుట హాజరవగా, తదుపరి విచారణను ఈనెల 18కి వాయిదా వేస్తూ న్యాయమూర్తి యుగంధర్ ఆదేశాలు జారీ చేశారు. -
యువఘర్షణ
హెచ్సీయు, జేఎన్‌యూలు ‘జాతివ్యతిరేక కార్యకలాపా’లకు అడ్డాగా మారాయి’ అంటూ వార్తల్లోకెక్కాయి.దీంతో దేశంలోని విద్యార్థులే కాదు మేధావులూ ‘దేశభక్తి’, ‘దేశద్రోహం’ అనే అంశాలపై చర్చోపచర్చలకు దిగారు. ప్రస్తుత వాతావరణం ప్రచ్ఛన్న యుద్ధాన్ని తలపిస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ జేఎన్‌యూ విద్యార్థి నాయకురాలు చింటూతో సాక్షి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ... మీరు చదువుకునే విద్యార్థులు. కాని ఇవాళ మిమ్మల్ని దేశద్రోహులని కొందరు అంటున్నారు? దానికి మీ సమాధానం? చింటూ: అణ్వాయుధాల నుంచి ఆకలి చావుల వరకు, కశ్మీర్ నుంచి మా కాలేజీ కాంట్రాక్ట్ వర్కర్ల సమస్యల వరకు అనేకానేక సమస్యల పై పగలూరేయీ తేడా లేకుండా జేఎన్‌యూలో మా విద్యార్థులం చర్చిస్తాం. అది మా విశ్వవిద్యాలయ సత్సంప్రదాయం. దళితులు, ఆదివాసీలు, విద్యార్థుల హక్కుల కోసం మాట్లాడితే మేం దేశ ద్రోహులమా? జాతివిద్రోహులమా? ఇటీవల ఫిబ్రవరి 9 ఘటనలోనే కాదు గతంలో కూడా అనేక సార్లు మా పై దేశ ద్రోహం ముద్ర వేసారు. స్వయంగా బిజెపి నాయకుడు సుబ్రహ్మణ్యస్వామి మాకా బిరుదిచ్చారు. ఈ దేశంలో ఎవరు దేశభక్తులో, ఎవరు దేశద్రోహులో ఈ దేశప్రజలు నిర్ణయిస్తారు. అఫ్జల్ గురు ఉరిని మీరు వ్యతిరేకించడాన్ని చాలా మంది తప్పుపడుతున్నారు. దానికి మీ స్పందన. చింటూ: అఫ్జల్ గురు, మెమన్‌ల ఉరిశిక్షలే కాదు, అసలు ఉరిశిక్షలనే మేం రద్దుచేయాలని అడుగుతున్నాం. ఈ ప్రపంచంలో వందకుపైగా దేశాలు ఉరిశిక్షలను రద్దు చేశాయి. మన దేశంలో కూడా ఎందరో న్యాయమూర్తులు ఉరిశిక్షలను వ్యతిరేకిస్తున్నారు. వారంతా జాతివిద్రోహులా? ప్రాణానికి ప్రాణం ప్రతీకారమౌతుంది. న్యాయం ఎలా అవుతుంది? కశ్మీరీ ఆజాదీ గురించిన నినాదాలు చేశారన్న ఆరోపణపై మీరేమంటారు? చింటూ: కశ్మీర్ ప్రజలకు తమ భవిష్యత్తును తాము నిర్ణయించుకునే హక్కు వుంది. వాళ్ళు పాకిస్తాన్‌తో ఉండాలా? ఇండియాతో ఉండాలా అన్నది అక్కడి ప్రజల ఇష్టం. మేం ఈ దేశాన్ని భౌగోళికంగా కాదు మనుషులుగా ప్రేమిస్తాం. మట్టికి కాదు మనుషుల అభిప్రాయాలకు విలువివ్వండని కోరుతున్నాం. పాకిస్తాన్‌కి అనుకూల నినాదాలిచ్చారని మీపై ఆరోపణ. చింటూ: అటువంటి నినాదాలెవ్వరూ ఇవ్వలేదు. సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్న కన్హయ్య ఉపన్యాసం వీడియోలో అతని వెనుక ముక్కలైన భారతదేశ పటం కనిపిస్తుంది. సభ జరిగినప్పుడు అతని వెనుక ఏ బ్యానర్లేదు. మరి హఠాత్తుగా ముక్కలైన భారతదేశపటాన్ని కన్హయ్య వెనుక ఎవరుంచారు? ఇదే కాదు ఇంకా చాలా అవాస్తవాలను వాస్తవాలుగా ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. కన్హయ్య అరెస్టులో వాస్తవాలేమిటి? చింటూ: ఇది అనుకోకుండా జరిగిన సంఘటన కాదు. కావాలని ప్రీప్లాన్డ్‌గా చేశారు. కన్హయ్య అరెస్టు తీరు చూస్తే అది మరింత స్పష్టమవుతుంది. గతంలో మాదిరిగానే ఆ రోజు చాలా శాంతియుతంగా అఫ్జల్‌గురు సభ జరుపుకుంటున్నాం. రెండు రోజులు ముందుగానే విశ్వవిద్యాలయం పర్మిషన్ తీసుకున్నాం. పర్మిషన్ ఇవ్వకూడదనుకుంటే ముందే చెప్పొచ్చు. కానీ అలా జరగలేదు. సరిగ్గా సభ జరగడానికి 5 నిముషాల ముందు విశ్వవిద్యాలయంలో పోలీసులు మోహరించారు. ఢిల్లీ ప్రధాన నగరం నుంచి జేఎన్‌యూకి చేరుకోవాలంటే రెండున్నరగంటలు. మీడియా వాహనాలు కూడా టైమ్‌కి అక్కడికెలా చేరుకున్నాయి? అప్పటికప్పుడు మాకు వ్యతిరేకంగా ప్లకార్డులు ఎలా వచ్చాయి? వీటన్నింటికీ సమాధానం ఒక్కటే. ఎ.బి.వి.పి విద్యార్థులు పక్కా ప్లాన్ ప్రకారం ఈ దాడికి పూనుకున్నారు. అంతెందుకు న్యాయస్థానాల సాక్షిగా మా విద్యార్థులపై దాడులు జరుగుతున్నాయి. ఏరోజూ విద్యార్థులు హింసాత్మకంగా వ్యవహరించలేదు. కానీ నేను కూడా వారి హిట్ లిస్టులో ఉన్నాను. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో ఒకే ఎత్తులో త్రివర్ణపతాకాన్ని ఎగురేయాలని మంత్రి స్మృతీ ఇరానీ అంటున్నారు? మీ అభిప్రాయం. చింటూ: ఈ దేశంలో త్రివర్ణపతాకాన్ని ఎగురేయడంపై మాకెటువంటి సమస్యలేదు. మేం ఈ దేశాన్ని అమితంగా ప్రేమిస్తున్నాం. ఇంకా ఎత్తులో ఎగురేయండి. మేం గౌరవిస్తాం. కానీ త్రివర్ణపతాకాన్ని ఎగురవేయాలంటున్నవారికి ఆ పతాకంపై ఎంత గౌరవం ఉంది? జాతీయ జెండా గౌరవం గురించి మాట్లాడుతున్నవాళ్లే జనవరి 26 వ తేదీన ఆ పతాకాన్ని కాకుండా కాషాయ జెండాలను వీధివీధినా ఎగురవేస్తున్నారు. ఈ దేశంలోని విశ్వవిద్యాలయాలను శాఫ్రనైజ్ చేయొద్దంటున్నాం. మేం ఈ దేశాన్ని కాషాయీకరించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అందుకే మాపై ఈ దేశవిద్రోహ ప్రచారం. అంతేకాదు ఇప్పుడు జేఎన్‌యూ బయటకి వెళ్ళాలంటే మాకు ఆటో కూడా దొరకదు. మమ్మల్ని పాకిస్తానీయులు అంటున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మమ్మల్ని వ్యభిచారులంటున్నారు. జేఎన్‌యూ విద్యార్థినులకిప్పుడు భద్రత లేదు. స్మృతీ ఇరానీకి ఇవేమీ పట్టవా? త్రివర్ణ పతాకాలెగురవేస్తే కులం పేరుతో, మతం పేరుతో, జెండర్ పేరుతో జరుగుతున్న దాడులు పరిష్కారం అవుతాయా... ఆమె సమాధానం చెప్పాలి. దేశ సరిహద్దులను కాపాడుతూ ప్రాణాలు కోల్పోతున్న వారిని గురించి మీరేమంటారు? చింటూ: దేశసరిహద్దులను కాపాడే సైనికుల్లాగానే ఈ దేశాన్ని అన్ని రకాల దోపిడీలనుంచి కాపాడేది విద్యార్థులే. రోహిత్ వేముల విషయంలోనూ, కన్హయ్య విషయంలోనూ అది స్పష్టమైంది. ఈ దేశంలోని విశ్వవిద్యాలయాలన్నింటిలో కొనసాగుతోన్న వివక్ష ఈ రోజు చర్చనీయాంశం అయ్యింది. దానికి సమాధానం చెప్పలేక, వారి మంత్రులను కాపాడుకొనేందుకు ఈ రోజు హెచ్‌సియు విద్యార్థులను, జేఎన్‌యూ విద్యార్థులను దేశద్రోహులుగా చిత్రీకరిస్తున్నారు. జేఎన్‌యూ పై ఇదంతా ఎందుకు జరుగుతోంది? చింటూ: ప్రగతిశీల, అభ్యుదయ భావాలకు జేఎన్‌యూ వేదిక. సమాజాభివృద్ధిని స్వచ్ఛంగా కోరుకునేవారమే మేమంతా. ఈ దేశంలోని ప్రతి పైసా ఈ దేశ ప్రజలకే చెందాలన్నది మా అభిప్రాయం. కానీ ఈ దేశంలోని కూలినాలీ చేసుకునే జనం కష్టార్జితాన్ని దోచుకొని ఆ డబ్బును విదేశీ బ్యాంకుల్లో జమ చేసుకుంటున్న వారిని ఏ పేరుతో పిలవాలి? ఈ దేశంలో ఆడపిల్లలపై అత్యాచారాలకు పాల్పడి యథేచ్ఛగా తిరుగుతున్న వారినేమనాలి? ఈ దేశ స్త్రీలను కించపరుస్తూ మాట్లాడేవారు దేశభక్తులుగా చలామణీ అవుతున్నారు... వారినేమనాలి? జేఎన్‌యూలో చదువుకొని వెళ్ళినవాళ్ళనేక మంది ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలుగా, న్యాయమూర్తులుగా, న్యాయవాదులుగా ఈ దేశాన్ని తీర్చే దిద్దే గొప్పవ్యక్తులుగా దేశానికి సేవ చేస్తున్నారు. అభ్యుదయభావాలకు నిలయంగా ఉన్న జేఎన్‌యూ ప్రతిష్టను దెబ్బతీసే ఈ ప్రయత్నాలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రోహిత్ చట్టంపై మీ పోరాటం ఎలా ఉండబోతోంది? చింటూ: రోహిత్ వేముల చట్టం కోసం, జేఎన్‌యూ విద్యార్థుల సమస్యలు, దేశవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాల్లో కొనసాగుతోన్న అన్ని రకాల వివక్షలకి వ్యతిరేకంగా మా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళతాం. - అత్తలూరి అరుణ, సాక్షి, ప్రిన్సిపల్ కరస్పాండెంట్ ఇందులో మా ప్రమేయం లేదు ఢిల్లీ జేఎన్‌యూ ఘటనలో ఏబీవీపీ స్టూడెంట్స్ పోలీసులకు ఫోన్ చేయలేదు. సభ జరిగే మూడు రోజుల ముందు నుంచి యూనివర్శిటీలో జేఎన్‌యూ స్టూడెంట్స్ యూనియన్ వాళ్లు అతికించిన పోస్టర్లను చూసి వీసీకి కంప్లయింట్ ఇచ్చాం. అలాగే ప్లకార్డులు పట్టుకుంది మేం అని వాళ్లు ఆరోపిస్తున్నారు. మా దగ్గర దేశభక్తి కోసం, జాతీయ జెండా కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులు 42 మంది ఉన్నారు. అలాంటి మేమెందుకు ఆ ప్లక్కార్డులు పట్టుకుంటాం? ఇక కన్హయ్య మాట్లాడిన వీడియోను మార్ఫింగ్ చేయాల్సిన అవసరం మాకులేదు. మా వీడియోలనే వాళ్లు మార్ఫింగ్ చేశారు. దీని మీద మేం సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లయింట్ కూడా ఇచ్చాం. - జువ్వాజి దిలీప్ ఏబీవీపీ గ్రేటర్ హైదరాబాద్ సిటీ సెక్రటరీ మట్టికి కాదు మనిషికి విలువివ్వండి దళితులు, ఆదివాసీలు, విద్యార్థుల హక్కుల కోసం మాట్లాడితే మేం జాతివిద్రోహులమా? అఫ్జల్ గురు, మెమన్‌ల ఉరిశిక్షలే కాదు, అసలు ఉరిశిక్షలనే మేం రద్దుచేయాలని అడుగుతున్నాం. ఈ ప్రపంచంలో వందకుపైగా దేశాలు ఉరిశిక్షలను రద్దు చేశాయి. మన దేశంలోకూడా ఎందరో న్యాయమూర్తులు ఉరిశిక్షలను వ్యతిరేకిస్తున్నారు. వారంతా జాతివిద్రోహులా? ప్రాణానికి ప్రాణం ప్రతీకారమౌతుంది. న్యాయం ఎలా అవుతుంది? ఈ దేశంలోని విశ్వవిద్యాలయాలను శాఫ్రనైజ్ చేయొద్దంటున్నాం. మట్టికి కాదు మనుషుల అభిప్రాయాలకు విలువివ్వండని కోరుతున్నాం. ఈ దేశంలోని కూలినాలీ చేసుకునే జనం కష్టార్జితాన్ని దోచుకొని ఆ డబ్బును విదేశీ బ్యాంకుల్లో జమ చేసుకుంటున్న వారిని ఏ పేరుతో పిలవాలి?ఈ దేశంలో ఆడపిల్లలపై అత్యాచారాలకు పాల్పడి యథేచ్ఛగా తిరుగుతున్న వారిని ఏమనాలి? ఈ దేశ స్త్రీలను కించపరుస్తూ మాట్లాడేవారు దేశభక్తులుగా చలామణీ అవుతున్నారు వారినేమనాలి? -
పావని కేసులో కొత్త మలుపు
చిత్తూరు : జిల్లా వ్యాప్తంగా పలువురు మహిళల్ని మోసం చేసి బంగారు ఆభరణాలను కాజేసిన పావని కేసు కొత్త మలుపు తిరిగింది. చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న చింటూకు పావని ఇచ్చినట్లు గుర్తించిన రూ.50 లక్షల నగదు, ముత్తూట్ ఫైనాన్స్ నుంచి 460 గ్రాముల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలను ఎస్పీ శ్రీనివాస్, కేసు దర్యాప్తు అధికారి గిరిధర్ శుక్రవారం వివరించారు. చిత్తూరుకు చెందిన ఆటో డ్రైవర్ చరణ్ భార్య పావని 2013 నుంచి 2015 వరకు పలువురు మహిళలకు మాయ మాటలు చెప్పి వారి నుంచి సుమారు 8 కిలోల బంగారు ఆభరణాలు తీసుకుంది. వీటిని ఆమె చిత్తూరులోని ముత్తూట్ ఫైనాన్స్‌లో 244 ఖాతాల్లో కుదువ పెట్టి రూ.1.52 కోట్ల రుణం తీసుకుంది. ఆభరణాలు ఇచ్చిన మహిళలు వాటిని వెనక్కు ఇవ్వాలని అడగడంతో పావని హరిదాస్ ద్వారా చింటూను ఆశ్రయించింది. చింటూ తనను బెదిరించాడంటూ ఓఎంఆర్ జ్యోత్స్న పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణలో వాస్తవాలన్నీ వెలుగు చూశాయి. ఒత్తిళ్ల నుంచి తప్పించినందుకు పావని చింటూకు రూ.50 లక్షలు ఇచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇందులో రూ.45 లక్షలు బెంగళూరులోని చింటూకు పరిచయం ఉన్న వ్యక్తి వద్ద, మిగిలిన రూ.5 లక్షలు గంగనపల్లెలోని చింటూ నివాసంలో స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు లో ఉందని, మరిన్ని వివరాలను త్వరలో రాబడతామని ఎస్పీ పేర్కొన్నారు. పావని కోసం గాలింపు ఈ కేసులో పరారీలో ఉన్న పావని, ఆమె భర్త చరణ్ కోసం ప్రత్యేక బృందాలు తీవ్రంగా గాలిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. త్వరలోనే ఇద్దరినీ అరెస్టు చేస్తామన్నారు. -
చింటూ నుంచి రూ.50 లక్షల నగదు స్వాధీనం
చిత్తూరు (అర్బన్): చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న చింటూ నుంచి శుక్రవారం పోలీసులు రూ.50 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరుకు చెందిన పావని అనే మహిళ 2013 నుంచి 2015 వరకు పలువురు మహిళల్ని మోసం చేసి 8 కిలోల బంగారు ఆభరణాలను తీసుకుని ముత్తూట్ ఫైనాన్స్‌లో 244 ఖాతాల్లో ఈ మొత్తాన్ని తాకట్టు పెట్టింది. ఫైనాన్స్ కంపెనీ నుంచి రూ.1.52 కోట్లు రుణం తీసుకుంది. నగలు అడిగిన మహిళల్ని చింటూ ద్వారా బెదిరించింది. మేయర్ హత్యకు ముందే పావని అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం, పావని తన నగలు ఇవ్వలేదని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పావని, ఆమె భర్త చరణ్, చింటూ, హరిదాస్ అనే నలుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇటీవల ఈ కేసులో చింటూ, హరిదాస్‌లను కస్టడీకు తీసుకుని విచారించారు. పావని తనకు ఇచ్చిన రూ.50 లక్షలు ఎక్కడ ఉన్నాయనే విషయం చింటూ చెప్పడంతో ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. అలాగే ముత్తూట్ ఫైనాన్స్ నుంచి 460 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో పావని, చరణ్ పరారీలో ఉన్నారని త్వరలోనే వీళ్లను పట్టుకుంటామని ఎస్పీ తెలిపారు. ఇక ముత్తూట్ ఫైనాన్స్‌పై కూడా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. -
ఖతర్నాక్ పావని!
- పైకి చీరల వ్యాపారం.. చేసేది వడ్డీ వ్యాపారం - ముత్తూట్‌లో 244 ఖాతాల్లో 8 కిలోల బంగారం తాకట్టు - పావనికి చింటూ అండ.. కస్టడీకి కోరనున్న పోలీసులు చిత్తూరు: నగరంలోని ఎస్బీఐ కాలనీకి చెందిన పావని గురించి బాధితుల్ని విచారిస్తున్న పోలీసులకు దిమ్మతిరిగే వాస్తవాలు తెలుస్తున్నాయి. మూడేళ్లుగా పావని చిత్తూరులో చీరల వ్యాపారం చేస్తోంది. ఆమె భర్త చరణ్ అలియాస్ చెర్రీ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. పావని కాలనీలోని మహిళలతో సన్నిహితంగా మెలుగుతూ వారి నుంచి అప్పులు తీసుకునేది. మూడేళ్ల కాలంలో చిత్తూరు నగరంతో పాటు శ్రీకాళహస్తి ఇతర ప్రాంతాలకు చెందిన పలువురు మహిళల నుంచి నగదు, బంగారు ఆభరణాలు అప్పుగా తీసుకుంది. 2013 నవంబరు నుంచి 2015 డిసెంబరు వరకు చిత్తూరులోని ముత్తూట్ గోల్డ్ ఫైనాన్స్‌లో 244 ఖాతాలు తెరిచి 7.882 కిలోల బంగారు ఆభరణాలు కుదువ పెట్టింది. ఇందులో 1.30 కిలోల బంగారు ఆభరణాలను ముత్తూట్ సంస్థ వేలం వేయగా, 4.308 కిలోల ఆభరణాలను రూ.91 లక్షలు చెల్లించి పావని విడిపించుకుంది. 1.600 కిలోల ఆభరణాలను వారం క్రితం చిత్తూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా మూడు నెలల క్రితం శ్రీకాళహస్తి కోర్టులో ఐపీ దాఖలు చేసిన పావనిని నగల యజమానులు ఆభరణాలను ఇచ్చేయమని ఒత్తిడి తెచ్చారు. పావని తనను మోసగించి 406 గ్రాముల బంగారు ఆభరణాలు తీసుకెళ్లినట్లు నగరానికి చెందిన ఓఎం. రాందాస్ భార్య జ్యోత్న్స పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ బండారం బయటపడింది. చింటూపై కేసు ఈ నేపథ్యంలో పావని హరిదాస్ ద్వారా చింటూ వద్దకు వెళ్లి పరిచయం పెంచుకుంది. రాందాస్ భార్య జ్యోత్న్సతోపాటు పలువురు మహిళలను చింటూ బెదిరించినట్లు పోలీసుల రికార్డుల్లో నమోదయ్యింది. దీంతో పోలీసులు చింటూ, హరిదాస్, పావని, చెర్రీలపై ఐపీసీ 420, 384, 109 ఆర్డబ్ల్యూ 34 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసులో విచారించడానికి చింటూ, హరిదాస్‌ను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. మేయర్ దంపతుల హత్యకు వారం ముందే పావనిని చింటూ బయటకు పంపించేశాడని, తరువాత ఇతను కూడా ఆమె వద్దకు వెళ్లనున్నట్లు సమాచారం రావడంతో ఆ దిశగా కూడా నెలక్రితం గాలింపు చర్యలు చేపట్టినట్టు పోలీసులు చెబుతున్నారు. -
మేయర్ హత్యకేసు విచారణ: కార్పొరేటర్ ఆత్మహత్య
చిత్తూరు: చిత్తూరు నగరంలోని 36వ డివిజన్ కార్పొరేటర్ శివప్రసాద్ రెడ్డి (46) గురువారం ఉదయం 11 గంటలకు ఆత్మహత్య చేసుకున్నారు. చిత్తూరు మేయర్ కఠారి అనూరాధ, కఠారి మోహన్ దంపతుల హత్య కేసులో బుధవారం మధ్యాహ్నం పోలీసులు శివప్రసాద్ రెడ్డిని తీసుకెళ్లి విచారించారు. గురువారం ఉదయం 10 గంటలకు ఆయనను వదిలిపెట్టారు. అయితే, ఈ హత్యకేసులో అనవసరంగా తనను ఇరికించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని భావించిన శివ ప్రసాద్ రెడ్డి మనోవేదనకు గురై ఇంటికి వస్తూనే గదిలో ఫ్యానుకు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. 36వ డివిజన్ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా శివప్రసాద్ రెడ్డి గెలిచారు. పోలీసుల వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు ఆయన సూసైడ్ నోట్ రాసినట్లు తెలుస్తుంది. -
మేయర్ హత్యకేసు విచారణ: కార్పొరేటర్ ఆత్మహత్య
-
వాళ్లు నా పెళ్లి చెడగొట్టారు: చింటూ
చిత్తూరు (అర్బన్): చిత్తూరు మేయర్ అనురాధ, ఆమె భర్త కఠారి మోహన్ల హత్య కేసుకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు తెరపైకి వస్తున్నాయి. మేయర్ దంపతులు చింటూ పెళ్లిని చెడగొట్టడం కూడా హత్యకు దారితీసిన కారణాల్లో ఒకటిగా తెలుస్తుంది. ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ చిత్తూరులో సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. కఠారి దంపతులను తానే హత్య చేసినట్టు చింటూ పోలీసు కస్టడీలో అంగీకరించాడని తెలిపారు. కార్పొరేషన్లో సివిల్ పనులు, లేబర్ కాంట్రాక్టులు ఇవ్వకపోవడం, కూరగాయల మార్కెట్ వేలం పాటలో ఇబ్బందులు పెట్టడం, తన పెళ్లి చెడగొట్టడం లాంటి అంశాలు తనను తీవ్రంగా బాధించాయని, అందువల్లే జంట హత్యలు చేసినట్లు చింటూ తమ కస్టడీలో ఒప్పుకున్నాడని ఎస్పీ తెలిపారు. చింటూ అలియాస్ చంద్రశేఖర్‌కు దాదాపు రూ.40 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్టు గుర్తించామని ఆయన తెలిపారు. హత్య జరిగిన తరువాత చింటూ నివాసాలు, కార్యాలయాలు, వ్యాపారాల వద్ద దాడులు చేసి రూ.40 కోట్ల విలువైన ఆస్తులకు సంబంధించి డాక్యుమెంట్లు, ఆస్తుల వివరాలున్న హార్డ్‌డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ వివరాలను ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ డైరెక్టరేట్ (ఈడీ), ఐటీ, వాణిజ్య పన్నుల శాఖలకు పంపనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు హత్య కేసులో ప్రత్యక్షంగా, పరోక్షంగా సహాయపడిన 25 మందిని అరెస్టు చేశామని, నిందితుల నుంచి ఆరు తుపాకులు, ఐదు కత్తులు, 31 బుల్లెట్లు, నాలుగు వాహనాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కేసు దర్యాప్తు 90 శాతం పూర్తయిందని, త్వరలోనే మిగిలిన దర్యాప్తును పూర్తి చేస్తామన్నారు. భవిష్యత్తులో ఇతను బయటకు వస్తే ప్రజలు సామాజిక బహిష్కరణ విధించాలని పిలుపునిచ్చారు. -
ఆ హత్యలు చేసింది చింటూనే : ఎస్పీ
చిత్తూరు: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన చిత్తూరు మేయర్ అనురాధ, ఆమె భర్త కఠారి మోహన్ ల హత్యను తానే చేసినట్లు ప్రధాన నిందితుడు చింటూ అలియాస్ చంద్రశేఖర్ ఒప్పుకొన్నాడని జిల్లా ఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. హత్యకు ఆర్థిక, కుటుంబ తగాదాలే ప్రధాన కారణమని తమ విచారణలో తేలిందని ఆయన చెప్పారు. మేయర్ దంపతులను హత్య చేసేందుకు చింటూ ఆరు నెలల ముందే ప్రణాళిక రచించాడని...గతంలో రెండుసార్లు ప్రయత్నించి విఫలమైనట్లు ఎస్పీ తెలిపారు. ఈ కేసులో ఇప్పటి వరకు 20 మందిని అరెస్ట్ చేశామని.. మరో ముగ్గురు నిందితులను పట్టుకోవాల్సిందని చెప్పారు. హత్యకు ఉపయోగించిన 7 రివాల్వర్లు, 13 కత్తులు, 31 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు విచారణ కొనసాగుతుందని అందులో భాగంగా మరో 12 మందిని విచారిస్తున్నామని ఎస్పీ తెలిపారు. -
కడప జైలుకు చింటూ
చిత్తూరు మేయర్ అనురాధ, ఆమె భర్త కఠారి మోహన్ల హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న చింటూను పోలీసులు కడప జైలుకు తరలించారు. జంట హత్య కేసులో నిందితుడిగా ఉన్న చింటూను కస్టడీకు తీసుకున్న గడువు పూర్తవడంతో ఆదివారం అతన్ని పోలీసులు చిత్తూరు నగరంలోని నాలుగో అదనపు మునిసిఫ్ మేజిస్ట్రేట్ యుగంధర్ ముందు హాజరుపరిచారు. కాగా చింటూకు కోర్టు విధించిన రిమాండ్ పూర్తవడంతో సోమవారం అతన్ని కడప నుంచి చిత్తూరుకు తీసుకొచ్చే అవకాశం ఉంది. -
చింటూ కారుడ్రైవర్ అరెస్ట్
చిత్తూరు జిల్లా: చిత్తూరు మేయర్ కఠారి అనురాధ, ఆమె భర్త కఠారి మోహన్ హత్య కేసులో పోలీసులు మరొకరిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో ముద్దాయిగా ఉన్న గంగనపల్లి వెంకటేశ్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రధాన ముద్దాయి చింటూ అలియాస్ చంద్రశేఖర్ కారు డ్రైవర్‌గా వెంకటేష్ పని చేసేవాడు. చింటూతో కలిసి వెంకటేశ్ ప్రత్యక్షంగా నేరంలో పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి నుంచి ఓ కత్తి, తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం నిందితుడిని రిమాండ్‌కు తరలించనున్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు ఈ కేసులో అరెస్టయిన వారిసంఖ్య 19కి చేరింది. -
మేయర్ హత్య కేసులో 22కు చేరిన అరెస్టులు
-
మేయర్ హత్య కేసులో 22కు చేరిన అరెస్టులు
గత నెల 17వ తేదీన జరిగిన చిత్తూరు మేయర్ అనురాధ, ఆమె భర్త మోహన్ హత్య కేసులో పోలీసులు మరో నలుగురిని అరెస్టుచేశారు. ఎస్పీ శ్రీనివాస్ సోమవారం అరెస్టు వివరాలు వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న చింటూకు తుపాకీ, బుల్లెట్లు ఇచ్చారనే ఆరోపణలపై చిత్తూరుకు చెందిన రజనీకాంత్ (35), నరేంద్రబాబు అలియాస్ పకోడి (42), కర్ణాటకలోని చింతామణి చెందిన శ్రీనివాస ఆచారి (72)ని అరెస్టు చేశారు. చింటూ నేరం చేశాడని తెలిసీ బెంగళూరులో ఆశ్రయం కల్పించడంతోపాటు వాహనాలు సమకూర్చినందుకు కమలాకర్ (44) అనే వ్యక్తిని సైతం అరెస్టు చేశారు. వీరి నుంచి చింటూ పారిపోతూ కారులో పడేసిన 0.22 ఎంఎం పిస్టోలు, 16 బుల్లెట్లు, హత్యానంతరం పారిపోయిన స్విఫ్ట్ కారు, బెంగళూరులో తిరిగిన డస్టర్ కారును స్వాధీనం చేసుకున్నారు. దీంతో మేయర్ జంట హత్యల కేసులో అరెస్టుల సంఖ్య 22కు చేరింది. వీరితో పాటు మరి కొందరిని కూడా త్వరలోనే అరెస్టు చేయనున్నట్లు ఎస్పీ వెల్లడించారు. -
ఉరుకులు.. పరుగులు..!
-
ఉరుకులు.. పరుగులు..!
చింటూ విచారణతో ఖాకీల అలెర్ట్ నీవానదిలో రెండు రివాల్వర్లు, కత్తులు స్వాధీనం పోలీసుల అదుపులో బెంగళూరు వ్యక్తి చిత్తూరు (అర్బన్): మేయర్ అనురాధ, ఆమె భర్త కఠారి మోహన్ హత్య కేసులో పలు కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. పోలీసు కస్టడీలో చింటూ పలు విషయాలు చెబుతున్నట్లు తెలుస్తోంది. అతనిచ్చే సమాచారంతో పోలీసులు పరుగులు పెడుతున్నారు. మేయర్ హత్య తర్వాత చింటూ కార్పొరేషన్ కార్యాలయంపై నుంచి కిందకు వచ్చేప్పుడు తన చేతిలో ఉన్న రివాల్వర్ చూపిస్తూ అందరినీ పక్కకు వెళ్లమని హెచ్చరించి గోడదూకి జీడీనెల్లూరు వైపు పారిపోయినట్లు పోలీసుల విచారణలో తేలింది. గోడ దూకే సమయంలో ఎయిర్ పిస్టల్ కింద పడిపోయింది. మేయర్‌పై హత్యకు ఉపయోగించిన రివాల్వర్ దొరక్కపోవడంతో అది నిందితుడి వద్దే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం కస్టడీలో ఉన్న చింటూను విచారించిన పోలీసులు రివాల్వర్లు, కత్తులను జీడీనెల్లూరు వద్ద ఉన్న బ్రిడ్జిపై నుంచి నీవానదిలో పడేసినట్లు తెలుసుకున్నారు. ఎక్కడ వేశారనే విషయాన్ని తెలుసుకోవడానికి చింటూను బ్రిడ్జి వద్దకు తీసుకెళ్లినట్టు విశ్వసనీయంగా తెలిసింది. నిందితుడు చూపించిన ప్రాంతంలో అయస్కాంతం సాయంతో రెండు రివాల్వర్లు, కత్తి స్వాధీనం చేసుకున్నారు. ఈ రివాల్వర్లు నాటువిగా పోలీసులు చెబుతున్నారు. మేయర్‌పై జరిపిన కాల్పుల్లో కింద పడ్డ బుల్లెట్ కవచం విదేశాలకు చెందినది కావడంతో హత్యకు ఉపయోగించిన రివాల్వర్ కోసం నీవానది వద్ద పోలీసుల గాలింపు కొనసాగుతోంది. కస్టడీ నుంచి జైలుకు ఈ కేసులో తొలుత అరెస్టు చేసిన వెంకటాచలపతి, మంజునాథ్, జయప్రకాష్‌ను కోర్టు అనుమతితో పోలీసులు పది రోజుల కస్టడీకి తీసుకున్నారు. ఆ గడువు శనివారంతో పూర్తయ్యింది. ఈ క్రమంలో వారిని ఆదివారం న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి చిత్తూరులోని జిల్లా జైలుకు తరలించారు. నలుగురిపై కేసు నమోదు చిత్తూరు మేయర్ హత్య కేసులో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. హత్యాఘటనలో సంబంధాలున్నాయనే ఆరోపణలపై ఇప్పటికే 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. తాజాగా నలుగురిపై కేసు నమోదు చేశారు. నింది తుల అరెస్టును సోమవారం చూపనున్నారు. అదుపులో మరో వ్యక్తి... ప్రధాన నిందితుడు చింటూకు బెంగళూరులో ఆశ్రయం కల్పించారనే ఆరోపణలపై ఓ వ్యక్తిని పోలీసు లు అదుపులోకి తీసుకున్నారు. పోలీసు కస్టడీలో ఉన్న నిందితులు చెప్పిన వివరాల ఆధారంగా విచారణ చేసేందుకు శనివారం ఓ పోలీసు బృందం బెంగళూరుకు వెళ్లింది. అక్కడ చింటూకు కారును ఇచ్చారని నిర్ధారించుకుని అతన్ని అదుపులోకి తీసుకుని చిత్తూరుకు తరలించారు. ఈ క్రమంలో నగరంలోని ఓ ప్రదేశంలో ఉంచి రహస్యంగా విచారిస్తున్నారు. నిందితులకు రిమాండు మేయర్ దంపతుల హత్య కేసులో పోలీసులు అరెస్టు చేసిన నలుగురు నిందితులకు 14 రోజుల రిమాండు విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. చింటూకు ఆశ్రయం కల్పించారనే ఆరోపణలపై పుంగనూరుకు చెందిన లోకేష్, రఘుపతి, న్యాయవాది కీలపట్ల ఆనంద్‌కుమార్, కర్ణాటకకు చెందిన నాగరాజును శనివారం పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వారిని ఆదివారం ఉదయం స్థానిక నాలుగో అదనపు మునిసిఫ్ మేజిస్ట్రేట్ యుగంధర్ ముందు హాజరుపరచారు. వారికి ఈ నెల 18 వరకు రిమాండు విధిస్తూ ఆయన ఆదేశాలు జారీ చేశారు. -
చింటూ డ్రైవర్ అరెస్ట్
చిత్తూరు: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిత్తూరు మేయర్ అనురాధ, ఆమె భర్త కఠారి మోహన్ హత్య కేసులో ఇప్పటికే 11 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు గురువారం మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. చింటూ డ్రైవర్‌గా పని చేస్తున్న వెంకటేష్ ఈ కేసులో మూడవ నిందితుడిగా ఉన్నాడు. ఈ రోజు ఉదయం వెంకటేష్ ను చిత్తూరు కోర్టు ఆవరణలో పోలీసలు అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో లొంగిపోవడానికి వెంకటేష్ వచ్చాడని పోలీసులు చెబుతున్నారు. కాగా మరో నిందితుడు మొగిలి కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
బెంగళూరు నుంచి చిత్తూరు వచ్చిన చింటూ
చిత్తూరు (అర్బన్): చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న చింటూ బెంగళూరు నుంచి కారులో చిత్తూరు చేరుకుని న్యాయస్థానంలో లొంగిపోయినట్టు పోలీసులు గుర్తించారు. కాగా చింటూతో పాటు పారిపోయిన డ్రైవర్ వెంకటేష్ ఆచూకీ ఇప్పటి వరకు లభించలేదు. అతను కూడా న్యాయస్థానంలో లొంగిపోతాడనే సమాచారం రావడంతో చిత్తూరులోని న్యాయస్థానాల సముదాయం వద్ద గట్టి నిఘా ఉంచారు. పెరిగిన దర్యాప్తు వేగం: చింటూ లొంగిపోవడంతో పోలీసులు కేసు దర్యాప్తును వేగం పెంచారు. కేసులో సంబంధాలున్నాయని, హత్య కుట్ర తెలుసుననే ఆరోపణలపై కొందరు టీడీపీ నాయకులతో పాటు ఇద్దరు న్యాయవాదులు, మరికొంత మంది ప్రముఖుల్ని అదుపులోకి తీసుకున్నారని తెలిసింది. అలాగే చిత్తూరుకు చెందిన మాజీ కౌన్సిలర్, ఓ కార్పొరేటర్, నీళ్ల వ్యాపారం చేసే మరో వ్యక్తి, లారీల యజమాని ఒకరు, ఎర్రచందనం కేసు ఉన్న వ్యక్తి, శ్రీకాళహస్తి ట్రస్టు బోర్డులోని ఓ సభ్యుడిని 48 గంటలుగా విచారిస్తున్నారు. -
నోరువిప్పుతున్న చింటూ?
పెరగనున్న నిందితుల సంఖ్య ఇప్పటికే పోలీసుల అదుపులో ఎనిమిది మంది హత్య కుట్ర తెలిసిన వారిపై కేసులు షురూ బయటపడుతున్న పెద్దల భాగోతం మేయర్ దంపతుల హత్య కేసు చిత్తూరు (అర్బన్): మేయర్ అనురాధ, ఆమె భర్త కఠారి మోహన్ హత్య కేసులో చింటూ పోలీసుల ఎదుట నోరు విప్పుతున్నాడా..? హత్య కుట్రలో ఎవరెవరు ఉన్నారు..? ఎవరికి ముందే తెలుసు..? అనే వివరాలు చెబుతున్నాడా..? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. పోలీసుల కస్టడీలో ఉన్న చింటూ మేయర్ హత్య ఘటనపై పలు విషయాలు పూసగుచ్చినట్లు చెప్పినట్టు సమాచారం. ఆ వివరాల ఆధారంగా పోలీసులు ఇప్పటికే ఎనిమిది మంది ప్రముఖులను అదుపులోకి తీసుకున్నారు. వారికి హత్య కుట్రలో ఏ మేరకు సంబంధాలున్నాయనే విషయం నిర్ధారించుకున్న తర్వాత కేసులు నమోదు చేయడానికి పోలీసులు సమాయత్తమవుతున్నారు. పెరగనున్న నిందితుల సంఖ్య... గత నెల 17న చిత్తూరు కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన మేయర్ దంపతుల జంట హత్య కేసులో పోలీసులు ప్రాథమికంగా 11 మందిపై కేసులు నమోదు చేశారు. వీరిలో ప్రధాన నిందితుడిగా చింటూ, ఇతర నిందితులుగా వెంకటాచలపతి, జయప్రకాష్, మంజునాథ్, వెంకటేష్, మురుగ, యోగ, పరంధామ, హరిదాస్, మొగిలి, శశిధర్ ఉన్నారు. మొగిలి, వెంకటేష్‌ను ఇంకా అరెస్టు చేయలేదు. చింటూ చెబుతున్న విషయాల ఆధారంగా నిందితుల సంఖ్య పెరగనుందని కేసును విచారిస్తున్న పోలీసు అధికారి ఒకరు తెలిపారు. అందరినీ అరెస్టు చేయబోమని, హత్య కుట్రలో పాలు పంచుకున్నవారు, కుట్ర విషయం ముందుగానే తెలిసినా పోలీసులకు సమాచారం ఇవ్వని వారు ఎవరెవరు ఉన్నారో తెలుసుకుని సాక్ష్యాలు సేకరిస్తామని, అనంతరం కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు. మరోవైపు చింటూను 15 రోజుల కస్టడీకి తీసుకున్న పోలీసులు బుధవారం ఇతన్ని చిత్తూరు నగరంలోని ఓ రహస్య ప్రదేశంలో ఉంచి విచారించారు. కస్టడీ గడువు పూర్తయ్యేంత వరకు ఇతన్ని తమ వద్దే ఉంచుకుని తరువాత కోర్టులో హాజరుపరచనున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఇప్పటికే పోలీసులు అరెస్టు చేసిన తొమ్మిది మంది నిందితులను విచారించిన తరువాత సజ్ జైలులో, జిల్లా జైలులో ఉంచాలి. వీళ్లందరినీ ఒకే చోట ఉంచినా ఒకరికి ఒకరు తారసపడకుండా ఉండేలా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. -
పథకం ప్రకారమే?
కఠారి దంపతుల హత్య నుంచి చింటూ లొంగుబాటు వరకు.. వ్యవహారాన్ని నడిపించిందెవరు..? చిత్తూరు మేయర్ దంపతుల హత్యకేసు సోమవారం కీలక మలుపు తిరిగింది. ప్రధాన నిందితుడు చింటూ చిత్తూరు కోర్టులో లొంగిపోయాడు. ఈ నేపథ్యంలో మొత్తం 11 మంది నిందితుల్లో చింటూ కారు డ్రైవర్ తప్ప మిగిలిన వారందరూ అరెస్టు అయ్యారు. ఇదిలా ఉండగా.. ఈ కేసు వ్యవహారం జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశం గా మారింది. చిత్తూరు (అర్బన్): చిత్తూరు మేయర్ కఠారి అనురాధ దంపతులను హత్య చేయడం నుంచి చింటూ లొంగుబాటు వరకు అంతా పథకం ప్రకారమే జరిగి నట్లు తెలుస్తోంది. ఈ నెల 17న చిత్తూరు మేయర్ అనురాధ, ఆమె భర్త మోహన్ కార్పొరేషన్ కార్యాలయంలో తుపాకీ గుళ్లు, కత్తిపోట్లకు బలయ్యారు. ఈ హత్యను తామే చేశామంటూ వెంకటాచలపతి, మంజునాథ్ వన్‌టౌన్ పోలీసు స్టేషన్లో లొంగిపోయారు. మరో వ్యక్తి జయప్రకాష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. 18వ తేదీన ఈ కేసులో ప్రధాన నిందితుడు కఠారి మోహన్ మేనల్లుడు చింటూనేనని పోలీసులు తేల్చారు. సీఎం చంద్రబాబుతో సహా పలువురు మంత్రులు హత్యను ఖండిస్తూ, నిందితుడిని పట్టుకుంటామని చెప్పారు. 19న మేయర్ దంపతుల అంత్యక్రియలు నిర్వహించారు. 20వ తేదీన రాష్ట్ర శాంతిభద్రతల అదనపు డీజీపీ ఠాకూర్ చిత్తూరుకు చేరుకున్నారు. చింటూను పట్టుకోవడానికి పది బృందాలను ఏర్పాటు చేశామని, అతని ఆచూకీ చెబితే రూ.లక్ష రివార్డు ఇస్తామని ప్రకటించారు. 24న మేయర్ హత్య కేసులో లొంగిపోయిన వెంకటాచలపతి, మంజునాథ్, జయప్రకాష్ అరెస్టు. 25న ఈ కేసులో యోగ, శశిధర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. 27న రాష్ట్ర సీఐడీ అదనపు డీజీపీ ద్వారక తిరుమలరావు చిత్తూరు చేరుకుని కేసుపై సమీక్షించారు. ఇదే రోజు చింటూ తనకు ఈ కేసుతో సంబంధం లేదంటూ లేఖ రాశాడు. 28న రాష్ట్ర డీజీపీ రాముడు చిత్తూరు చేరుకుని కేసును సమీక్షించారు. చింటూ కోసం మొత్తం గాలిస్తున్నామని, అతన్ని త్వరలోనే పట్టుకుంటామన్నారు. చింటూ రాసిన ఉత్తరం చూస్తే ఇతను కోర్టులో లొంగిపోయే అవకాశం ఉందని చెప్పారు. 30వ తేదీ ఉదయం 11.05 గంటలకు పోలీసు అతిథి గృహంలో ఎస్పీ ప్రెస్‌మీట్ ప్రారంభించారు. కేసులో మురుగ, పరంధామ, హరిదాస్ అరెస్టు చూపించారు. హత్యలో వారి పాత్రను వివరించారు. చింటూ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. 11.33 గంటలకు ప్రెస్‌మీట్ పూర్తయ్యింది. అదేరోజు ఉదయం 11.37 గంటల ప్రాంతంలో చిత్తూరు న్యాయస్థానాల సముదాయంలోకి ఓ ఆల్టో కారు వచ్చి ఆగింది. అందులోంచి దిగిన ఓ వ్యక్తి గొడుగు వేసుకుని, చేతిలో రెండు పేపర్లు ఉంచుకుని నాలుగో అదనపు న్యాయస్థానంలోకి ప్రవేశిస్తూ గొడుగు తీసేశాడు. అక్కడున్న వారంతా ఒక్కసారిగా అతన్ని ఆశ్చర్యంగా చూశారు. వచ్చిన వ్యక్తి చింటూ. తనకు ఈ కేసులో సంబంధం లేదని పిటిషన్‌ను న్యాయమూర్తికి అందించాడు. చింటూ న్యాయస్థానంలోనే దాదాపు మధ్యాహ్నం ఒంటిగంట వరకు కూర్చున్నాడు. ఇప్పటికే చింటూపై పోలీసులు కేసు నమోదు చేసి ఉండడం, చింటూను తమ కస్టడీకి అప్పగించాలని పోలీసులు పిటిషన్ వేయడంతో న్యాయమూర్తి 14 రోజులు జ్యుడిషియల్ కస్టడీకి, 15 రోజులు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం అతన్ని అత్యంత భద్రత నడుమ కడప జైలుకు తరలించారు. ఈ మొత్తం ఎపిసోడ్‌ను చింటూ వెనుకవైపు ఉన్న వ్యక్తులు పక్కా ప్రణాళికతో నడిపించారు. చింటూతో పాటు అతని డ్రైవర్ వెంకటేష్ కూడా లొంగిపోతే ఇద్దరికీ కేసులో సంబంధం ఉన్నట్లు తెలిసిపోతుందని గ్రహించిన చింటూ తాను ఒక్కడే లొంగిపోయినట్లు న్యాయ నిపుణులు చెబుతున్నారు. దొరకాల్సింది ఒక్కడే మేయర్ హత్య కేసులో ఇప్పటి వరకు పోలీసులు 11 మందిపై ప్రాథమికంగా కేసులు నమోదు చేశారు. ఇందులో తొలుత ఇద్దరు నిందితులు లొంగిపోగా ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా ప్రధాన నిందితుడు చింటూ న్యాయస్థానంలో లొంగిపోయాడు. ఇక ఈ కేసులో మరో నిందితుడు మొగిలి పోలీసుల అదుపులో ఉండగా, చింటూ డ్రైవర్ వెంకటేష్ ఒక్కడే దొరకాల్సి ఉంది. ఇదిలా ఉండగా జిల్లా వ్యాప్తంగా చింటూ లొంగుబాటు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఎక్కడ జనాలు గుమిగూడినా ఈ విషయం చుట్టూనే చర్చలు సాగాయి.