చదువుపై ఆసక్తితో కళాశాలకు వెళ్లిన ఓ అంధ విద్యార్థి కరెంట్‌షాక్‌తో చనిపోయాడు. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో చోటుచేసుకుంది. మండలంలోని కూనంనేనివారిపాలెం గ్రామానికి చెందిన యాకోబు, నర్సమ్మ దంపతుల కుమారుడు చింటు(16) పుట్టుకతోనే అంధుడు. అయినప్పటికీ, అతడు పట్టుదలతో చ దివి పదో తరగతి మంచి మార్కులు తెచ్చుకున్నాడు.
ఇటీవలే చీమకుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సీఈసీ గ్రూప్‌లో చేరాడు. మంగళవారం కళాశాలకు వెళ్లిన చింటు తెలియక తరగతి గది గోడకు ఉన్న విద్యుత్ వైర్లను తాకాడు. అందులో విద్యుత్ ప్రసారం అవుతుండటంతో షాక్‌తో అక్కడికక్కడే చనిపోయాడు. తమ కుమారుడి మృతికి కళాశాల సిబ్బంది నిర్లక్ష్యమే కారణమంటూ తల్లిదండ్రులు, బంధువులు కొద్దిసేపు ఆందోళన చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.