Narsamma
-
డబ్బుల కోసం తల్లిదండ్రుల హత్య
నర్సాపూర్: డబ్బుల కోసం తల్లిదండ్రులను హత్య చేశాడో కిరాతకుడు. వారు నిద్రిస్తున్న సమయంలో గొంతునులిమి చంపి.. అనంతరం మృతదేహాలను పెట్రోల్‌పోసి తగులబెట్టాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా నర్సాపూర్‌లో చోటుచేసుకుంది. తూప్రాన్ డీఎస్పీ వెంకట్‌రెడ్డి కథనం ప్రకారం.. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం సాదుల్లానగర్‌కు చెందిన చాకలి కిష్టయ్య (75), నర్సమ్మ (70) దంపతులు. గ్రామంలో ఉన్న భూమిని అమ్మగా వచ్చిన డబ్బును పిల్లలకు సమానంగా ఇచ్చారు. తన వాటా కింద వచ్చిన రూ.4 లక్షలను చిన్న కుమారుడు లక్ష్మణ్ ఫైనాన్స్‌లో కారు రుణం కోసం చెల్లించాడు. అయినా రుణం తీరలేదు. ఫైనాన్స్ వాయిదాలు చెల్లించేందుకు అతను పలుమార్లు తల్లిదండ్రులను డబ్బు కావాలని ఒత్తిడి చేయగా.. కొంత డబ్బు ఇచ్చారు. ఈ క్రమంలో గత నెలలో మళ్లీ డబ్బుల కోసం ఒత్తిడి చేయగా తల్లిదండ్రులు నిరాకరించారు. దీంతో ఎలాగైనా వారిని హతమార్చి వారి వద్ద ఉన్న బంగారు నగలు తీసుకోవాలన్న దురాశతో హత్యకు పథకం రచించాడు.గుమ్మడిదల మండలం బొంతపల్లిలో నివాసం ఉంటున్న లక్ష్మణ్.. గత నెల 17న సాదుల్లానగర్‌కు వెళ్లి తల్లిదండ్రులను మరుసటి రోజు తనతో పాటు కారులో తాను నివాసం ఉంటున్న బొంతపల్లికి తీసుకెళ్లాడు. మర్నాడు డబ్బులు ఇవ్వాలని తల్లిదండ్రులను మరోసారి అడిగినా వారు నిరాకరించడంతో కోపంతో లక్ష్మణ్ అదేరోజు రాత్రి నిద్రిస్తున్న తల్లిదండ్రులను గొంతు నులిమి చంపాడు. తల్లి వద్ద ఉన్న 3 తులాల నగలు తీసుకున్నాడు. అనంతరం మృతదేహాలను కారులో తీసుకుని నర్సాపూర్ చెరువు వద్దకు తెచ్చి శవాలపై పెట్రోల్ పోసి తగలపెట్టి వెళ్లిపోయాడు. వాట్సాప్ గ్రూపుల్లో పోలీసుల ప్రచారం: గుర్తు తెలియని జంట శవాలు దొరికిన విషయాన్ని వాట్సాప్ గ్రూప్‌ల ద్వారా తమ సిబ్బంది ప్రచారం చేశారని డీఎస్పీ వెంకట్‌రెడ్డి చెప్పారు. రెండు శవాలు దొరికిన విషయం సాదుల్లానగర్ గ్రామస్తులకు తెలియడంతో వారు అనుమానంతో లక్ష్మణ్‌ను నిలదీయగా అసలు విషయం బయటకు వచి్చందని డీఎస్పీ వివరించారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
కొడుకు కోత
కన్నబిడ్డ పోతే తల్లిదండ్రులకు మిగిలేది కడుపుకోత. బిడ్డ ఉండీ నిరాదరణకు గురిచేస్తుంటే... అది కడుపుకోతను మించిన కొడుకు కోత. తల్లిదండ్రులను దైవంగా చూసుకునే సమాజంలో కనీసం మనుషుల్లా చూసే అవకాశం కూడా కపడట్లేదు. నేను అంటే ఏంటి? నేను సంపాదించుకున్న జ్ఞానం! అంటే నేను చదువుకున్న పుస్తకాలు, నా అనుభవానికి అందిన జీవితం! ఈ జీవితంలో అమ్మానాన్న లేకుండా ఉంటారా? మనకు కనపడిన మొదటి పుస్తకాలు వాళ్లేగా? అక్షరం నేర్చుకుని ఆప్యాయత పోగొట్టుకున్నామా? ఆదాయం వచ్చాక అభిమానాలు చంపుకున్నామా? ఎలాంటి కథైనా వినొచ్చు. కాని ఇలాంటి కథైతే ఎప్పుడూ వినకూడదు. మనకు తెలియకుండా.. మనకు తెలిసీ.. మన చుట్టుపక్కల ఇలాంటి కథలు, వ్యధలు, బాధలు ఎన్నో గట్టిగా అరిచి వాటి ఉనికిని తెలియజేస్తూనే ఉంటాయి. యాంత్రిక జీవితంలో మనకు ఈ వ్యధలు కనపడవు. వినపడవు. వనపర్తి జిల్లా, వనపర్తి మండలం సవాయిగూడెం గ్రామంలోని 70 ఏళ్ల బాల్‌రెడ్డి, 60 ఏళ్ల నర్సమ్మ దంపతులది అలాంటి గాథే! ఈ వాస్తవ సంఘటన మనల్నందరినీ తట్టిలేపుతుందని... మన బాధ్యతను గుర్తుచేస్తుందనే ఆశతో జీవిత చరమాంకంలో ఆ తల్లిదండ్రులు అనుభవిస్తున్న వేదనను చెప్తున్నాం.ఈ దంపతులకు ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకు ప్రభాకర్‌రెడ్డి ఉన్నారు. ఒంట్లో శక్తి ఉన్నంత వరకు వ్యవసాయం చేశాడు బాల్‌రెడ్డి. ఉన్న పొలంలో రెండు ఎకరాలు కొడుకు కోసం ఉంచి మిగిలినది అమ్మి ఆడపిల్లలకు పెళ్లి చేశాడు. ఆడపిల్లల బాధ్యత తీరాక కొడుక్కి పెళ్లిచేశారు. అప్పటి నుంచే కష్టాలు మొదలయ్యాయి. భార్యమాట వింటూ తల్లిదండ్రులను పట్టించుకోవడం మానేశాడు కొడుకు. రోజులు గడుస్తున్నాయి. కొడుక్కి పిల్లలు పుట్టారు. పెరిగారు. కొడుకు, కోడలు చీదరింపులు, సాధింపులు ఎక్కువయ్యాయి తప్ప తగ్గలేదు. కొడుకు కూతురు పెళ్లీడుకొచ్చింది. పెళ్లి చేయడానికి తన దగ్గర డబ్బుల్లేవని, ఆ రెండెకరాల పొలాన్ని అమ్మేద్దామని తండ్రిని అడిగాడు ప్రభాకర్‌రెడ్డి. కొడుకు అడిగిందే తడవుగా ఒప్పుకొని మనవరాలి పెళ్లికి సహాయం చేశాడు బాల్‌రెడ్డి. అయినా ఆ కొడుకుకు తల్లిదండ్రుల మీద ప్రేమ రాలేదు. చీటికి మాటికి గొడవ పడడమే కాక చేయి కూడా చేసుకున్నాడు. దీంతో మనస్థాపం చెందిన ఆ వృద్ధులు కూతుళ్ల దగ్గరకు వెళ్లారు. ఇది జీర్ణించుకోలేని ప్రభాకర్‌రెడ్డి అక్కాచెల్లెళ్లతోనూ గొడవపడ్డాడు. ‘అమ్మానాన్నకు అన్నం పెట్టొద్దు. వాళ్లను మీ దగ్గర ఉంచుకోవద్దు’ అని వాళ్లను బెదిరించాడు. దాంతో వారు కూడా తల్లిదండ్రులను బయటికి పంపించారు. వాటర్షెడ్హాల్... వృద్ధాప్య ఫించన్ కొడుకు చూడక.. బిడ్డలనూ చూడనివ్వకపోవడంతో ఆ అమ్మానాన్న ఊళ్లోని కమ్మూనిటీ హాల్లో తలదాచుకున్నారు. బాల్రెడ్డికి వచ్చే వెయ్యి రూపాల వృద్ధాప్య పింఛనే ఆ భార్యాభర్తకు జీవనాధారం. అవి మందులకే సరిపోతున్నాయి. ఇరుగుపొరుగు వారు పెట్టేది తింటూ బతుకీడుస్తున్నారు. ఏదో ఒకలా రోజులు గడుస్తున్నాయనుకుంటుంటే... బాల్‌రెడ్డి కింద పడి కాలు విరిగి మంచానికి పరిమితమయ్యాడు. అన్నీ తానై భర్తను చూసుకుంటోంది నర్సమ్మ. జీవిత చరమాంకంలో వీరికి తినడానికి తిండి, ఉండడానికి వసతి తప్ప మరే ఆశలూ లేవు. కొడుకు నుంచి రక్షణ, సంరక్షణ కల్పించాలని మొరపెట్టుకుంటున్నారు. ఈ విషయం తెలుసా? ప్రభాకర్‌రెడ్డిలాంటి పిల్లలకు ఒక విషయం తెలుసో లేదో? వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను సరిగా చూడకపోతే... వాళ్ల యోగక్షేమాలను పట్టించుకోకపోతే జైలు శిక్ష ఉంటుంది. మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ బిల్, 2007 ప్రకారం పిల్లలకు మూడు నెలల జైలు శిక్ష విధిస్తారు. ఈ శిక్షను తప్పించుకోవడానికి వీలు లేదు. అప్పీలుకు చాన్స్ లేదు. ఈ కష్టం ఎవరికీ రావద్దు ‘ఎన్నో బాధలుపడి కొడుకును పెంచి పెద్ద చేశాం. ఈ రోజు వాడు మమ్మల్ని పగవాళ్లలా చూస్తున్నాడు. ఈ కష్టం ఎవరికీ రావద్దు’ అంటున్నాడు బాల్‌రెడ్డి. మమ్ముల్ని ఎక్కడా ఉండనీయడం లేదు. ఊళ్లోవాళ్ల సాయంతో ఈ వాటర్‌షెడ్ హాల్లో ఉంటున్నాం. బిడ్డలు మాకు ఏ కష్టం రాకుండా చూసుకుంటామని చెప్పారు. కానీ నా కొడుకు పడనీయట్లేదు. వాళ్లతో కొట్లాడ పెట్టుకుంటున్నాడు. ఆ భయంతో వాళ్లు మా దగ్గరికి రావట్లేదు. మేము ఎక్కడున్నా అక్కడికొచ్చి గొడవపడుతున్నాడు. భయంభయంగా గడుపుతున్నాం’ అంటు కళ్లనీళ్ల పర్యంతమైంది నర్సమ్మ. – సిలివేరు యాదగిరి, సాక్షి, వనపర్తి -
తల్లిని చంపి.. గదికి తాళం వేసి..
ఆపై ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించిన కూతురు నాలుగు రోజులుగా ఇంట్లోనే మృతదేహం దుర్వాసన రావడంతో ఆలస్యంగా వెలుగులోకి.. నవాబుపేట: తల్లిని ఓ కూతురు దారుణంగా హత్య చేసింది. 4 రోజులపాటు ఇంట్లోనే మృతదేహాన్ని ఉంచింది. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. నవా బుపేట మండలం ఇప్పటూర్‌కు చెందిన నర్సమ్మ(79), జంగయ్య భార్యాభర్తలు. వారికి ముగ్గురు కూతుళ్లు, ఇద్దరు కుమారులు ఉన్నారు. రెండో కూతురు పార్వతమ్మను భర్త వదిలేయడంతో కొన్నేళ్లుగా తల్లి వద్దే ఉంటోంది. తరచూ తల్లితో గొడవ పడేది. ఈ క్రమంలో 4 రోజుల క్రితం కూడా గొడవ పడింది. కర్రతో తలపై బాదడంతో తల్లి రక్తస్రావమై పడిపోయింది. ఆత్మహత్యగా చిత్రీకరించడానికి వృద్ధురా లిపై కిరోసిన్ పోసి నిప్పంటించింది. మృతదేహంతో నాలుగు రోజులు తల్లిని హత్య చేసిన పార్వతమ్మ భయాందోళనకు గురై మృతదేహంతో నాలుగు రోజులు గడిపింది. తల్లి ఉన్న గదికి తాళం వేసి వేరేగదిలో ఉంది. మృతదేహం కుళ్లిపోయి ఇం ట్లో నుంచి దుర్వాసన రావటంతో గురువారం ఇరుగు పొరుగువారు నిలదీశారు. దీంతో అమ్మ ఆత్మహత్య చేసు కుందని నమ్మించే ప్రయత్నం చేసింది. ఆమెపై అనుమానం వచ్చి వారు ఇంట్లోకి వెళ్లి చూడగా అక్కడి ఆనవాళ్లను బట్టి కూతురే హత్య చేసినట్లు అనుమానించారు. వెంటనే పోలీ సులకు సమాచారమివ్వడంతో వారొచ్చి విచారణ చేప ట్టారు. చేసేదిలేక చేసిన నేరం ఒప్పుకుంది. కోపంలో 4 రోజుల క్రితమే చంపానని ఒప్పుకుంది. చేరదీసినా చంపేసింది.. పన్నెండేళ్ల కిందట హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తికి ఇచ్చి పార్వతమ్మకు పెళ్లి చేసింది. కొంతకాలానికే కూతురు వ్యవ హార శైలి నచ్చక భర్త వదిలేశాడు. దీంతో తల్లి చేరదీసి తనతోపాటే ఇంట్లో పెట్టుకుంది. కూలీనాలీ చేసుకుంటూ తల్లీకూతుళ్లు కాలం వెళ్లదీసేవారు. తల్లి వయసు మీద పడినప్పటి నుంచి ఆమెతో తగువు పడటం మొదలుపెట్టింది. డీఎస్పీ విచారణ విషయం తెలుసుకున్న డీఎస్పీ భాస్కర్ గ్రామంలో విచారణ చేపట్టారు. ఇరుగు పొరుగు వారితో సంఘటన గురించి తెలుసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. నాడు కొడుకు చేతిలో తండ్రి ఐదేళ్ల క్రితం నర్సమ్మ భర్త జంగయ్యను కన్నకొడుకే హత్య చేశాడు. పెద్ద కుమారుడు నారాయణ తాగిన మైకంలో ఇంట్లోనే కర్రతో మోది దారుణంగా చంపేశాడు. అతనిపై కేసు నమోదవగా ప్రస్తుతం ఆయన జైలుశిక్ష అనుభవిస్తున్నాడు. తల్లికి ఆసరాగా ఉంటుందనుకున్న కూతురు కూడా అదేబాటలో నడవడంతో గ్రామస్తులు ఆమెపై శాపనార్థాలు పెట్టారు. -
డీసీఎం ఢీకొని పారిశుద్ధ్య కార్మికురాలి మృతి
చందానగర్‌లో డీసీఎం వాహనం ఢీకొని నర్సమ్మ(29) అనే పారిశుద్ధ్య కార్మికురాలు మృతిచెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోన్నారు. ఈ ఘటనతో ఆ మార్గంలో ట్రాఫిక్‌కు కాసేపు అంతరాయమేర్పడింది. -
విద్యుదాఘాతంతో విద్యార్థి మృతి
చదువుపై ఆసక్తితో కళాశాలకు వెళ్లిన ఓ అంధ విద్యార్థి కరెంట్‌షాక్‌తో చనిపోయాడు. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో చోటుచేసుకుంది. మండలంలోని కూనంనేనివారిపాలెం గ్రామానికి చెందిన యాకోబు, నర్సమ్మ దంపతుల కుమారుడు చింటు(16) పుట్టుకతోనే అంధుడు. అయినప్పటికీ, అతడు పట్టుదలతో చ దివి పదో తరగతి మంచి మార్కులు తెచ్చుకున్నాడు. ఇటీవలే చీమకుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సీఈసీ గ్రూప్‌లో చేరాడు. మంగళవారం కళాశాలకు వెళ్లిన చింటు తెలియక తరగతి గది గోడకు ఉన్న విద్యుత్ వైర్లను తాకాడు. అందులో విద్యుత్ ప్రసారం అవుతుండటంతో షాక్‌తో అక్కడికక్కడే చనిపోయాడు. తమ కుమారుడి మృతికి కళాశాల సిబ్బంది నిర్లక్ష్యమే కారణమంటూ తల్లిదండ్రులు, బంధువులు కొద్దిసేపు ఆందోళన చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
ఆ కి‘లేడీ’ పై 15 కేసులు
జియాగూడ(హైదరాబాద్ సిటీ): మాయమాటలతో ప్రజలను మోసం చేస్తూ తప్పించుకు తిరుగుతున్న ఓ మహిళను కుల్సుంపురా పోలీసులు అరెస్టు చేశారు. ఆమెపై పలు పోలీస్స్టేషన్లలో కేసులు ఉన్నందున పీడీ యాక్ట్ విధించి చంచల్‌గూడ మహిళా జైలుకు తరలించినట్లు కుల్సుంపురా ఇన్స్పెక్టర్ రామ్మోహన్రావు తెలిపారు. ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా, రాజేంద్రనగర్ ఖాలీజ్‌ఖాన్ దర్గా ప్రాంతానికి చెందిన చల్లా నర్సమ్మ(40) కొన్ని నెలలుగా మాయమాటలు చెప్పి ప్రజల వద్ద నుంచి బంగారు వస్తువులు చోరీ చేస్తోంది. ఈమెపై సుమారు 15 వరకు కేసులు పలు పోలీస్స్టేషన్లలో నమోదై ఉన్నాయి. కాగా కుల్సుంపురా పోలీస్‌స్టేషన్‌లో ఓ కేసులో నిందితురాలు కావడంతో నర్సమ్మను పోలీసులు అరెస్టు చేసి పీడీ యాక్ట్ విధించి చంచల్‌గూడ మహిళా జైలుకు తరలించారు. -
మంత్రాల నెపంతో పెద్దమ్మను చంపేశారు!
మంత్రాలు చేస్తోందనే అనుమానంతో ఓ వృద్ధురాలిని గొంతుకోసి చంపారు. ఈ దారుణం కరీంనగర్ జిల్లా వెల్గటూర్ మండలం జగదేవ్‌పేటలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పల్లపు నర్సమ్మ(65) కుమారులు, కూతుళ్లకు పెళ్లిళ్లయి పోవటంతో వేర్వేరుగా ఉంటున్నారు. ఆమె మరిది కుటుంబ సభ్యులు తరచూ వివిధ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ఇందుకు కారణం పెద్దమ్మ నర్సమ్మ మంత్రాలే కారణమని వారు అనుమానం పెంచుకున్నారు. ఒంటరిగా ఉండే నర్సమ్మను ఆదివారం రాత్రి గొంతుకోసి చంపారు. సోమవారం ఉదయం ఈ ఘోరం వెలుగుచూసింది. పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని, వివరాలు సేకరిస్తున్నారు. -
వాడిపోతున్నా వీడలేరు
ఓ పూలబుట్టను ముందుపెట్టుకొని భగభగా మండుతున్న నేలపై కూర్చొని, ఎండను తట్టుకుంటూ పూలమ్ముకుంటున్న నలభై ఏళ్ల నర్సమ్మను పలకరిస్తే కష్టాన్ని కడుపారా చెప్పుకుంది. నర్సమ్మ అమ్మే పూలు పరిమళాన్ని వెదజల్లుతున్నాయి కానీ నర్సమ్మ జీవితం మాత్రం వాడిన పూలలా నిర్జీవంగా సాగుతోంది. పెద్ద ఆపరేషన్ ‘‘మాది రాజమండ్రి. అక్కడున్నప్పుడు పొలాల్లో కలుపు తీయడానికి పోయేదాన్ని. ఎప్పుడైతే పెద్దాపరేషన్ అయిందో అప్పటి నుంచి నేను ఏ బరువు పనులు చేయలేకపోయాను. మా ఆయనకు కూడా ఏ పని సరిగ్గా దొరక్కపోయేది. అందుకే ఏడేళ్ల క్రితం హైదరాబాద్‌లోని మూసాపేట్‌కు వచ్చేశాం. అప్పటి నుంచీ ఈ పూల వ్యాపారం చేస్తున్నా. నేను రోజూ ఇటు పూలు అమ్మడానికొస్తే మా ఆయనేమో సిమెంట్ పనికి పోతాడు. లాభమెంతన్నది దేవుడి దయ గిరాకీ అంటారా? అది ఆ రోజు మా అదృష్టాన్ని బట్టి ఉంటుంది. ఓ రోజు రూ.150 వస్తే ఆ మరుసటి రోజే రూ.50 కూడా వచ్చిన రోజులున్నాయి. నేను విడి చామంతులు, గులాబీలూ అమ్ముతా. అల్లిన మల్లెలు, కనకాంబరాలను జనం బాగా కొంటారు. కానీ నాకు అల్లడం రాక విడి పూలు అమ్ముతున్నా. వర్షాకాలంలో అయితే ఓ రోజుకు ఎన్ని పూలు అమ్ముతామో, అన్ని పూలు వానకు తడిసి పాడయిపోతాయి. పోలీసు సార్లు మమ్మల్ని రోడ్లపై కూర్చోనివ్వరు. గొడుగులూ పెట్టుకోనివ్వరు. మరి షట్టర్లు పెట్టుకునే స్తోమత మాకు ఎక్కడుంది. అందుకే ఇలా రోడ్లపైన కూర్చొని అమ్మక తప్పదు. కుదిరితేనే తింటాం ప్రతి రోజూ పొద్దున్నే ఏడు గంటలకు పూలు పట్టుకొని ఇంటి నుంచి మెహిదీపట్నానికి వస్తా. తెచ్చిన పూలు పూర్తిగా అమ్ముడుపోయే రోజులు తక్కువే. రాత్రి తొమ్మిది గంటలకు మిగిలిన పూలను తీసుకొని మళ్లీ ఇంటి బాట పట్టాల్సిందే. పండ్లో, కాయలో అయితే దాచి పెట్టేవాళ్లం కానీ పూలు కదా, త్వరగా వాడిపోతాయి. వచ్చేటప్పుడు టిఫిన్ బాక్స్ తెచ్చుకుంటా కానీ ఒక్కోసారి తినడానికి కుదరక అలాగే తిరిగి పట్టుకెళ్తుంటా.’’ - నిఖిత ఫొటో: నోముల రాజేశ్‌రెడ్డి -
బయటపడని డెత్ సీక్రెట్స్
పరకాల : వరుస మరణాలు.. వాటికి అంతుచిక్కని కారణాలు.. హత్యా ? ఆత్మహత్యా ? అనేది తేల్చలేని సందిగ్ధత. ఈ కేసులను ఛేదించేందుకు రంగంలోకి దిగిన పోలీసులకు అన్నిదారులు మూసుకుపోతున్నారుు. ఇటీవల చోటుచేసుకున్న అనేక అనుమానాస్పద మరణాల్లో మిస్టరీ వీడడం లేదు. వారి డెత్ సీక్రెట్స్ వెల్లడి కావడం లేదు. ఇటీవల రెండు కేసులు ఓ కొలిక్కి వచ్చినప్పటికీ మరో మూడు కేసుల్లో మిస్టరీ వీడలేదు. మండలవ్యాప్తంగా ఈ మిస్టరీ మరణాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. పైడిపల్లిలో నర్సమ్మ... మండలంలోని నాగారం శివారు పైడిపల్లి గ్రామానికి చెందిన గుజ్జుల నర్సమ్మ(81) జనవరి 21న దారుణ హత్యకు గురైంది. పట్ట పగలు ఆమెను ఇంట్లోనే హత్య చేసి మెడలోని బండారు గొలుసు, చేతికి ఉన్న బంగా రు గాజులను అపహరించారు. అప్పట్లో నర్సమ్మ మృతి గ్రామంలో సంచలనం సృష్టించింది. పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేసి నేటికి నిందితులను గుర్తించలేకపోయారు. పులిగిల్లలో లక్ష్మి మండలంలోని పులిగిల్లలో స్వాతంత్య్ర సమరయోధురాలు వెల్ధండి లక్ష్మి(82) కట్టెల కోసం వెళ్లి మృత్యువాతపడింది. సాయంత్రం బయటకు వెళ్లిన ఆమె వరికోల్ రోడ్డులోని పత్తి చేనులో ఫిబ్రవరి 13న శవమై కన్పించింది. ఆమె తలకు గాయాలు ఉండడంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి. బీపీ తగ్గిపోవడంతో కిందపడి చనిపోయినట్లుగా నిర్ధారించారు.రాయపర్తిలో తల్లికుమారుడుమండలంలోని రాయపర్తిలో కిన్నెర రమ(22), 9 నెలల బాబు చింటు బావిలో పడి ఈ నెల 8న ఆత్మహత్యకు పాల్పడ్డారు. భర్త తిరుపతి వేధింపులు తట్టులేక రమ తన కుమారుడితో బావిలో దూకిందా లేక తిరుపతే బలవంతంగా బావిలోకి తోశాడా ? అనే కోణంలో విచారణ చేస్తున్నారు. తమ కూతురును అల్లుడే చంపేశాడని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. -
విస్ఫోటం
వంట ప్రయత్నంలో పేలుడు ఇద్దరు చిన్నారుల దుర్మరణం మృత్యువుతో పోరాడుతున్న బాలుడు కెమికల్ డబ్బానే కారణంగా భావిస్తున్న పోలీసులు వెంగళరావునగర్: వంట కోసం వెలిగించిన నిప్పు తమ చితిమంటగా మారుతుందని ఆ చిన్నారులు ఊహించలేదు. అమ్మానాన్నలు వచ్చేసరికి భోజనం సిద్ధం చేస్తామని తలచిన వారు అనుకోకుండా మృత్యువాత పడ్డారు. ఇంట్లో దాచిన కచ్చా సొల్యూషన్ స్పిరిట్ (సినిమా షూటింగ్స్‌లో త్వరగా మంటలు వ్యాపించే సీన్ల కోసం వాడేది) డబ్బానే మృత్యుపాశమైంది. ఇద్దరు చిన్నారులను బలి తీసుకుంది. వెంగళరావునగర్ డివిజన్ జవహర్ నగర్ బస్తీలో శుక్రవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కింగ్‌కోఠిలో నివాసం ఉండే బర్కత్ జవహర్‌నగర్‌లోని 60 గజాల స్థలంలో ఆరు గదుల ఇళ్లు నిర్మించి కూలీలకు అద్దెకు ఇచ్చాడు. అందులో శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఆదినారాయణ, హేమలత దంపతులు, దాలయ్య, సరస్వతి దంపతులు అద్దెకు ఉంటున్నారు. శుక్రవారం ఉదయం వారు తమ పిల్లలను ఇళ్ల వద్దనే వదిలిపెట్టి కూలి పనులకు వెళ్లారు. ఆదినారాయణ,హేమలత దంపతుల పిల్లలు కీర్తివాణి(7), యోగి(5)తో పాటు దాలయ్య, సరస్వతి దంపతుల కుమార్తె నర్సమ్మ(13) ఇంట్లో కూర వండుకునేందుకు కట్టెల పొయ్యి వెలిగించే ప్రయత్నంలో స్పిరిట్‌ను కట్టెలపై పోశారు. దీంతో అకస్మాత్తుగా డబ్బాకు నిప్పంటుకోవడంతో అది భారీ శబ్దంతో పేలింది. పేలుడు దాటికి ఇంటి ఆవరణలోని ఇనుప గేటు విరిగింది. ముగ్గురు పిల్లలు అమాంతం గాల్లోకి ఎగిరి తలోదిక్కున పడ్డారు. బాలుడు సంపులో పడగా... నర్సమ్మ ఇంటి ఆవరణలోనే మరోదిక్కున పడిపోయింది. కీర్తివాణి మాత్రం తలుపునకు కొట్టుకుంది. ఇద్దరు బాలికలకు ముఖం, కాళ్లపై తీవ్ర గాయాలు కాగా, బాలుడికి ఒళ్లంతా గాయాలయ్యాయి. పేలుళ్ల శబ్దం విని పక్కనే ఉన్న కీర్తివాణి తాతయ్య హుటాహుటిన చిన్నారుల వద్దకు వచ్చి చూడగా రక్తపు మడుగులో విలవిలలాడుతున్నారు. దాంతో కేకలు వేస్తూ ఆయన చుట్టుపక్కల వారిని పిలిచాడు. స్థానిక యువకులు 108 అంబులెన్స్‌కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. 108 సిబ్బంది బాధితులను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఇద్దరు బాలికలు నర్సమ్మ(13), కీర్తివాణి(7)లు చికిత్సపొందుతూ మృతిచెందారు. ఐదేళ్ల బాలుడు యోగి ప్రస్తుతం ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు. ఆ చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకొని సంఘటనా స్థలానికి చేరుకున్న పిల్లల తల్లిదండ్రులు ఘోర దుర్ఘటన చూసి హతాశులయ్యారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పేలుడు సంభవించిన ఇంట్లో ఉన్న రెండు గ్యాస్ సిలిండర్లు (పెద్దది, చిన్నది), స్టౌ, విద్యుత్ సామాగ్రి ఎలాంటి ప్రమాదానికి గురికాలేదు. ఇంట్లోని విద్యుత్ వైర్లు కూడా ఏ మాత్రం చెక్కు చెదరలేదు. స్పిరిట్ డబ్బానే ప్రమాదానికి కారణం పేలుడు ఘటనకు ఇంట్లో దాచిన కచ్చా సొల్యూషన్ స్పిరిటే కారణం. మృతిచెందిన బాలిక నర్సమ్మ తల్లి సరస్వతి రెండు నెలల కిందట వరకు సారథి స్టూడియోలో పని చేసేది. స్టూడియోలో సినిమా షూటింగ్స్‌లలో భాగంగా త్వరగా మంటలు అంటుకునేందుకు కచ్చా సొల్యూషన్ అనే స్పిరిట్‌ను వాడతారు. తన ఇంట్లో కూడా కట్టెల పొయ్యిని త్వరగా వెలిగించేందుకు ఆమె దీన్ని ఇంట్లో తెచ్చిపెట్టు -
కొడుకును చంపి.. ఆత్మహత్యగా చిత్రీకరించారు
మునిపల్లి : ‘నా కొడుకును చంపి ఆత్మహత్యగా చిత్రీకరించారు.. నిందితులు గ్రామంలోనే ఉన్నారు.. వారిని పట్టుకుని కఠినంగా శిక్షించి నాకు న్యాయం చేయండి’ అని బాధిత తల్లిదండ్రులు పోలీసులకు విజ్ఞప్తి చేశాడు. వివరాలిలా ఉన్నాయి.. రాయికోడ్ మండలం సంగాపూరం గ్రామానికి చెందిన ఉప్పరి అశోక్ గురువారం అనుమానాస్పద స్థితిలో మునిపల్లి మండలం తాటిపల్లి గ్రామ శివారులో మృతి చెందిన విషయం తెలిసిందే. సంగాపురం గ్రామానికి చెందిన ఉప్పరి లక్ష్మయ్య, నర్సమ్మ దంపతులకు ఇద్దరు కుమారులతో పాటు ఇద్దరు కుమార్తెలున్నారు. లక్ష్మయ్య వీరందరికీ వివాహాలు చేయగా.. పదేళ్ల క్రితం లక్ష్మయ్య పెద్దకుమారుడు సంగయ్య మృతి చెందాడు. ఉన్న ఒక్కగానొక్క కుమారుడు అశోక్‌తో తనకున్న కొద్ది పాటి భూమితో వ్యవసాయం చేసుకుంటున్నారు. అయితే దాయాదులతో అశోక్‌కు గొడవలుండేవి. ఇదిలా ఉండగా.. గురువారం మునిపల్లి మండలం తాటిపల్లి గ్రామ శివారులో అశోక్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. సమాచారం అందుకున్న బుదేరా ఎస్ఐ, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడే ఉన్న మృతుడి తల్లిదండ్రులతో ఎస్ఐ మాట్లాడారు. ఎవరిపైనైనా అనుమానం ఉందా అని ప్రశ్నించగా.. అనుమానితుల్లో ఒక్కరు ఇక్కడే ఉన్నాడని చెప్పడంతో ఎస్ఐ అక్కడే ఉన్న ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఎస్ఐ గ్రామస్తులతో మాట్లాడి వివరాలు రాబపట్టారు. మృతుడి తండ్రి లక్ష్మయ్య ఫిర్యాదు మేరకు కేసును దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. భార్యాభర్తల చిన్నపాటి గొడవతో మృతుడి భార్య (సరిత) సావిత్రి నాలుగు నెలల క్రితం తన పుట్టింటికి వెళ్లినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. మృతుడికి ఇద్దరు పిల్లలున్నారు. -
బాల్య వివాహానికి బ్రేక్!
కడియం : మండలంలోని మురమండ గ్రామంలో గురువారం జరగనున్న బాల్యవివాహాన్ని అధికారులు ముందుగానే అడ్డుకున్నారు. వధువు తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అధికారుల కథనం ప్రకారం... మురమండ ఏఎంజీ నగర్‌కు చెందిన 13 ఏళ్ల బాలికకు గురువారం ఆమె మేనమామతో వివాహం చేసేందుకు తల్లిదండ్రులు నిర్ణయించారు. అయితే ఐసీడీఎస్, రెవెన్యూ అధికారులకు స్థానికులు ఫోన్ ద్వారా సమాచారాన్ని అందజేశారు. దీంతో ఐసీడీఎస్ సీడీపీఓ నర్సమ్మ సూచన మేరకు సూపర్వైజర్ సీహెచ్ హెలెన్ విషయాన్ని గ్రామ సర్పంచ్ ఈదర పాపారావుకు తెలిపారు. దీంతో వీరందరూ కలసి బుధవారం బాలిక ఇంటికి చేరుకున్నారు. చిన్నవయస్సులో వివాహం చట్టరీత్యా నేరమని, దీని వల్ల ఎదురయ్యే సమస్యలను తల్లిదండ్రులు, బంధువులకు వివరించారు. దీంతో అమ్మాయి తల్లిదండ్రులు వివాహాన్ని నిలిపివేస్తామని అధికారులకు లిఖితపూర్వంగా హామీ ఇచ్చారు. బాలిక మేనమామ తల్లి ఇటీవలే మరణించారని, ఏడాదిలోపు పెళ్లి చేస్తే మంచిదని ఈ నిర్ణయం తీసుకున్నట్టు బాలిక తల్లిదండ్రులు చెప్పారు. బాలిక తల్లిదండ్రులు, బంధువులు చుట్టుపక్కల వారి నుంచి వివాహం నిలిపివేస్తున్నట్టుగా వీఆర్వో పి. శంకర్రావు లిఖితపూర్వకంగా రాయించుకున్నారు. -
మాట మందుగుండు పాట మహిళాదండు
వీధి మొహం చూడకుండా... ఎన్నాళ్లు బతుకులీడుస్తారు?! ఎంత మందుగుండు సామగ్రి ఉందీ మాటలో! దబదబా ఇల్లూవాకిలి ఊడ్చేసి గబగబా వంటావార్పూ చేసేసి చకచకా పిల్లల్ని బళ్లోకి తోలేసి ఉన్న కోకనే శుభ్రంగా చుట్టేసుకుని ‘ఏమయ్యో! క్యాంపుకెళ్లొస్తా’ అని పరుగులు పెట్టించేంత మందుగుండు! నర్సమ్మ మాట, పాట కూడా ఇలాగే... దట్టించిన శతఘు్నల్లా ఉంటాయి. ‘‘ప్రపంచం మారాలీ అంటే, మహిళను బయటి ప్రపంచాన్ని చూడనివ్వాలి’’ అంటున్న నర్సమ్మ... మొదట ఎలాంటి జీవితాన్ని చూశారు? గరళాన్ని వదిలి, ఎలా తన గళాన్ని సవరించుకున్నారు? చదవండి... ఈవారం ‘జనహితం’లో. పాతికేళ్ల క్రితం... నర్సమ్మ పాడే పాటలు వింటుంటే... పల్లెలలో పేదరికంతో కాపురం చేస్తున్న మహిళలు గుర్తుకొచ్చేవారు. ఎందుకంటే ఆ పాటలలో పల్లె పడుచుల జీవన విధానం నిండి ఉండేది. నర్సమ్మ ఇప్పుడు కూడా పాడుతోంది. కాని వాటిలో మునుపటి భావాలు లేవు. ఆమె గొంతులో ఒక చైతన్యం ఉంది. ఒక ఆశయం ఉంది. ప్రతి మహిళ చదువుకోవాలని, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని తన గళంలో పలుకుతోంది. నర్సమ్మది మెదక్ జిల్లా పుల్కల్ మండలం బసపూర్ గ్రామం. ఆటపాటలతో గడపవలసిన వయసులోనే అత్తింటిలో అడుగుపెట్టింది. అక్కడ వేధింపులు తట్టుకోలేక పుట్టిల్లు చేరింది. నర్సమ్మది నిరుపేద కుటుంబం. పని చేసినరోజు పొట్ట నిండుతుంది. లేదంటే పస్తులుండాల్సిందే. అటువంటి నేపథ్యంలో నుంచి, ఏం జరిగిందో ఏమో కాని ఆమె కల్లు కాంపౌండ్ పంచన చేరింది. అక్కడే పని చేస్తూ, కడుపునిండా కల్లు తాగుతూ, ఆశలు చిగర్చని మోడులా మిగిలింది నర్సమ్మ. అంతటి వెనుకబాటుగా ఏ మాత్రం క్రమశిక్షణ లేకుండా ఉన్న ఆమె, ఈరోజు తోటి మహిళలకు అండగా నిలుస్తోంది. వారి జీవితాల్లో వెలుగురేఖలు నింపడానికి తన వంతు కృషి చేస్తోంది. నర్సమ్మ తల్లిదండ్రులు కూలిపని చేసి జీవించేవారు. ఆమెకు ముగ్గురు అన్నలు, ఒక చెల్లి. వీరంతా రోజు కూలీలే. కల్లు కాంపౌండ్ దగ్గర, టీ కొట్టు దగ్గర పనిచేసుకుంటూ బతికే నర్సమ్మ కల్లుకి బానిసైపోయింది. వద్దని తల్లి ఎంత చెప్పినా, ఆమె మాటను కూడా లెక్కచేసేది కాదు. పెళ్లికి ముందు నర్సమ్మ గేదెల్ని తోలుకెళ్లి, గడ్డి మేపేది. నెత్తికి ఒక వస్త్రం చుట్టుకుని, చేతిలో కర్రను భుజాన వేసుకుని ఆమె పాటలు పాడుతుంటే వ్యవసాయ కూలీలు ఎంతో ఆసక్తిగా వినేవారు. నర్సమ్మ స్వరం మాత్రమే కాదు, అప్పటికప్పుడు కల్పించుకుని పాడే సాహిత్యం కూడా అందరికీ బాగా నచ్చేది. అప్పటికి నర్సమ్మకున్న ఏకైక ఆస్తి ఆమె పాటలే. పెళ్లి తర్వాత ఛిద్రమైపోయిన సంసారం, కల్లు కాంపౌండ్‌తో జతకట్టడంతో... అందరూ నర్సమ్మ జీవితం నాశనమైపోయిందనుకున్నారు. ఇక తల్లిదండ్రుల బాధ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటి సమయంలో మహిళలల్లో చైతన్యం తేవడానికి ఆ ఊళ్లోకి మహిళా సమతా సొసైటీవారొచ్చారు. వారు చేసే ప్రతి ప్రయత్నాన్ని నర్సమ్మతోపాటు ఆ గ్రామంలోని మహిళలంతా వ్యతిరేకించారు. ‘మాకు చదువెందుకు? మేం చదువుకుని ఏం చేయాలి? ఏదన్నా పనుంటే ఇప్పించండి. అంతేగాని చదువు, చైతన్యం ఇవేమీ మాకొద్దు’ అని తిప్పికొట్టారు. అయినా పట్టువిడవకుండా సమతా సొసైటీ వారు అక్కడి మహిళలందరికీ నచ్చజెప్పారు. అలా ఆరుగురు సభ్యులతో సమతాసొసైటీని ఏర్పాటుచేశారు. నర్సమ్మ పాటలు, ఉన్నదున్నట్లు ధైర్యంగా మాట్లాడే తీరుచూసి ఆ సొసైటీకి నర్సమ్మనే లీడర్ని చేశారు. అంతే! అక్కడి నుంచి జీవితం ఊహించని మలుపులు తిరిగింది. అక్షరాస్యత శిబిరాలు... విద్య, ఆరోగ్యం, పంచాయితీ, వ్యవసాయం, సామాజిక సమస్యలు...అంటూ ఐదు అంశాలపై పోరాడే సమతా సొసైటీలో చదువు నేర్చుకున్న నర్సమ్మ ఆ గ్రామానికి సంస్థ తరఫున నాయకత్వం వహించే స్థాయికి ఎదిగింది. దాంతో ఆమె రూపురేఖలు, హావభావాలు, ఆలోచనలు అన్నీ మారిపోయాయి. విమానమెక్కిన వేళ... గ్రామ, మండల, జిల్లా స్థాయి దాటి రాష్ర్టస్థాయి మహిళా సొసైటీ మీటింగ్‌లకు హాజరవ్వడం మొదలయ్యాక నర్సమ్మలో ఉద్యమలక్షణాలు బయటపడ్డాయి. ‘వీధి మొహం చూడకుండా ఎన్నాళ్లిలా బతుకులీడుస్తారు’ అని తన పాటల ద్వారా పల్లె మహిళల్ని నిలదీయడం మొదలుపెట్టింది. పేద బతుకులకు తెలిసినంత గొప్పగా ఇంకెవరికీ జీవితం బరువు తెలియదు. అందుకే పంచాయితీలు తీర్చే బాధ్యతను ఎంచుకుంది. కుటుంబ సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న గ్రామీణ మహిళలకు కౌన్సెలింగ్ చేసింది. తన జీవితాన్ని సాక్ష్యంగా చూపి మరీ వారిని ఓదార్చింది. నర్సమ్మ పాటలకు, పాఠాలకు మహిళలెక్కువగా ఆకర్షితులవుతున్న విషయం గమనించిన ‘మహిళా సమతా’ నిర్వహకులు... నర్సమ్మను ఢిల్లీ పర్యటనకు కూడా పంపారు. ‘‘మీది మోటారును (విమానాన్ని) చూడడం అదే మొదటిసారి. దానిపై ఢిల్లీలో జరిగిన ఒక మీటింగ్‌కి వెళ్లినపుడు నాకు చాలా ఆనందం వేసింది. దానిలో కూర్చున్నంతసేపు చిన్నప్పుడు బర్రెలు మేపుతున్నప్పుడు ఆకాశంలో చిన్నగా కనిపించిన మోటార్లే గుర్తుకొచ్చాయి. ఈ సొసైటీ పుణ్యమాని అది ఎక్కే అవకాశం వచ్చింది. ఆ మీటింగ్‌లో మన రాష్ర్టంలో మహిళలకు సంబంధించిన సామాజికాంశాలపై పావుగంటసేపు మాట్లాడే అవకాశం వచ్చింది నాకు. నేను అప్పటి ఉపరాష్ర్టపతి కృష్ణకాంత్ భార్య సుమన్ కృష్ణకాంత్ పక్కనే కూర్చోవడం నాకు సంతోషం కలిగించింది’’ అంటూ ఎంతో సంబరపడుతూ చెప్పారు నర్సమ్మ. మహిళల సంక్షేమం కోసం పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలు మన చుట్టూ చాలానే ఉన్నాయి. కాని వాటి ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకుని, బతుకుల్ని బాగుచేసుకునే పేదమహిళలే చాలా అరుదు. నర్సమ్మలో ఉన్న పట్టుదల అందరిలోనూ కనిపించదు. నెలకు రెండు జిల్లాలు చొప్పున 14 జిల్లాల్లో నర్సమ్మ ఫీల్డ్ వర్క్ ఉంటుంది. అక్కడ మాటలకంటే ఎక్కువగా ఆమె పాటలే వినిపిస్తాయి. అక్కడి పరిస్థితుల్ని, వాతావరణాన్ని, మహిళల ఆలోచన తీరుని బట్టి, క్షణాల్లో పదాలు కట్టి, పాటలు పాడి, తోటిమహిళల్ని తన చైతన్య రథంలోకి ఎక్కించుకుంటున్న నర్సమ్మకు హ్యాట్సాఫ్ చెబుదాం. - భువనేశ్వరి, ఫొటోలు: పి.గురివిరెడ్డి సమత వారు నన్ను మెచ్చుకుంటున్న ప్రతిసారీ, ఇరవైఏళ్ల కిందటి నా గతం గుర్తుకొస్తుంటుంది. కల్లు తప్ప నాకు వేరే లోకం ఉండేది కాదు. మహిళా సమతా సొసైటీలో చేరాక తోటిసభ్యులు. నా చేత కల్లు మాన్పించి, ఉపాధి, ఇల్లు, చదువు, మీటింగ్‌లు... అంటూ నన్ను ఒక జీవితంలోకి తోసేశారు. అప్పటికి నాకు తెలిసింది... పాటలు పాడటాన్నే ఆయుధంగా మలిచి మహిళా సమతకు పేరు తేవాలని. మహిళా చైతన్యం, మహిళలపై వేధింపులు, కష్టాలు...అన్ని అంశాలకు సంబంధించి జానపద గీతాలను సేకరించేదాన్ని. చాలావరకూ నేను సొంతంగా పాటలు రాసుకునేదాన్ని. ఎక్కడ సమతా మీటింగ్‌లు పెట్టినా నా గళం వినిపించేదాన్ని. - నర్సమ్మ