ఆ కి‘లేడీ’ పై 15 కేసులు | 15 cases filed on women cheater | Sakshi
Sakshi News home page

ఆ కి‘లేడీ’ పై 15 కేసులు

Published Mon, Apr 25 2016 11:12 PM | Last Updated on Sat, Jul 28 2018 6:26 PM

15 cases filed on women cheater

జియాగూడ(హైదరాబాద్ సిటీ): మాయమాటలతో ప్రజలను మోసం చేస్తూ తప్పించుకు తిరుగుతున్న ఓ మహిళను కుల్సుంపురా పోలీసులు అరెస్టు చేశారు. ఆమెపై పలు పోలీస్‌స్టేషన్‌లలో కేసులు ఉన్నందున పీడీ యాక్ట్ విధించి చంచల్‌గూడ మహిళా జైలుకు తరలించినట్లు కుల్సుంపురా ఇన్‌స్పెక్టర్ రామ్మోహన్‌రావు తెలిపారు. ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా, రాజేంద్రనగర్ ఖాలీజ్‌ఖాన్ దర్గా ప్రాంతానికి చెందిన చల్లా నర్సమ్మ(40) కొన్ని నెలలుగా మాయమాటలు చెప్పి ప్రజల వద్ద నుంచి బంగారు వస్తువులు చోరీ చేస్తోంది.

ఈమెపై సుమారు 15 వరకు కేసులు పలు పోలీస్‌స్టేషన్‌లలో నమోదై ఉన్నాయి. కాగా కుల్సుంపురా పోలీస్‌స్టేషన్‌లో ఓ కేసులో నిందితురాలు కావడంతో నర్సమ్మను పోలీసులు అరెస్టు చేసి పీడీ యాక్ట్ విధించి చంచల్‌గూడ మహిళా జైలుకు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement