Ram Mohan Rao
-
విశాఖ అభివృద్ధిలో పోర్టుదే కీలక పాత్ర: చైర్మన్ కె రామ్మోహనరావు
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం వేదికగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన గ్లోబల్ ఇన్వెస్టర్ సదస్సు(జీఐఎస్) జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సదస్సుకు దిగ్గజ పారిశ్రామిక వేత్తలు. ప్రముఖులు హాజరయ్యారు కూడా. ఈ సందర్భంగా సాక్షి టీవితో విశాఖ పోర్టు చైర్మన్ కే రామ్మోహన్రావు కాసేపు ముచ్చటించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. "ఏపీ పెట్టుబడులకు అనువైన రాష్ట్రం. ఏపీలో సహజ వనరుల తోపాటు తగినంతలో మానవ వనరులు కూడా ఉన్నాయి. సుదీర్ఘమైన కోస్తా తీర ప్రాంత ఏపీ సొంతం. గ్లోబల్ ఇన్వెస్టర్ సదస్సు(జీఐఎస్)కి ప్రముఖ పారిశ్రామిక వేత్తలు హాజరు కావడం ఎంతో శుభపరిణామం. ఏపీ ప్రభుత్వ విధానాల వల్లే లక్షల కోట్ల రూపాయాలు పెట్లుబడుల వచ్చాయాని సీఎం జగన్ ప్రభుత్వాన్ని కొనియాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏపీలో మౌలిక సదుపాయాలు, రహదారులు, పోర్టులు అభివృద్ధిపై దృష్టి సారించడం వల్లే పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారు. అంతేగాదు ఈ విశాఖపట్నం అభివృద్ధిలో పోర్టులదే కీలక పాత్ర. ఈ విశాఖ పోర్టు ఏర్పాటై సుమారు 90 ఏళ్లు అయ్యింది. ఈ పోర్టు ద్వారా రికార్డు స్థాయిలో 77 మిలియన్ల టన్నుల సరుకు రవాణ అయ్యింది. అంతేగాదు పెట్టుబడులకు విశాఖ నగరం అన్ని విధాల అనువైన నగరమే గాక ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీనే అగ్రగామిగా ఉంది. ప్రస్తుతం ఈ పోర్టు నుంచి భోగాపురం వరకు నాలుగు లైన్ల రహదారి నిర్మాణ జరగబోతుంది. "అని చెప్పుకొచ్చారు. (చదవండి: ఎలాంటి సహకారానికైనా ఒక్క ఫోన్‌కాల్ దూరంలో: సీఎం జగన్) -
ప్రముఖ నిర్మాతకు మాతృవియోగం
సాక్షి, మంచిర్యాల: నిర్మాత, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పుస్కూర్ రామ్మోహన్ రావు మాతృమూర్తి పుస్కూర్ కమలాదేవి (93) ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె సోమవారం ఉదయం మంచిర్యాలలో తుదిశ్వాస విడిచారు. ఆమె మృతి పట్ల ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు సంతాపం తెలిపి, రామ్మోహన్ రావుని ఓదార్చారు. కాగా రామ్మోహన్ రావు ‘లక్ష్య, లవ్ స్టోరీ’ చిత్రాలతో పాటు ఇటీవల ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున హీరోగా ప్రారంభమైన చిత్రానికి కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. చదవండి: జూబ్లీహిల్స్ పబ్‌లో సిద్ శ్రీరాంకు అవమానం! -
అసలేం జరుగుతోంది?
సాక్షి, ఇందూరు (నిజామాబాద్): జిల్లాలో స్త్రీనిధి రుణాల మంజూరు, రికవరీ తీరుపై కలెక్టర్ రామ్మోహన్రావు అసహనం వ్యక్తం చేశారు. గత సంవత్సరాల్లో స్త్రీనిధి రుణాల మంజూరు, రికవరీలో ముందున్న జిల్లా... కొన్ని నెలులుగా ఎందుకు ఒక్కసారిగా వెనుకబడి పోయిందని ఆరా తీశారు. రుణాల ప్రగతి ఇంతగా పడిపోవడానికి గల కారణాలేంటని సంబంధిత అధికారులను ప్రశ్నించారు. సోమవారం స్థానిక ప్రగతిభవన్‌లో డీఆర్డీఏ, మెప్మా అధికారులు, సిబ్బందితో స్త్రీనిధి రుణాల ప్రగతిపై ఆయన సమీక్షించారు. స్త్రీనిధి పథకం కింద ఈ ఏడాది రూ.207 కోట్ల లక్ష్యానికి గాను ఇప్పటివరకు రూ.135 కోట్ల రుణాలు మహిళా సంఘాల సభ్యులకు మంజూరు చేయాల్సి ఉండగా, కేవలం 19 శాతంతో రూ.39 కోట్లు ఇవ్వడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ విషయంలో బ్యాంకుల అశ్రద్ద ఉంటే వాటి వివరాలు తెలుపాలని, వారానికోసారి సమీక్షించుకుని సమస్య ఎక్కడుందో దృష్టి పెట్టి రుణాల పురోగతిని సాధించేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. వచ్చే జనవరిలో అభివృద్ధి కనిపించాలని, నిర్లక్ష్యం చేయరాదని హెచ్చరించారు. మహిళా సంఘాల బలోపేతానికి, మహిళల ఆర్థికాభివృద్ధికి దోహదపడే స్త్రీనిధి రుణాల లక్ష్యానికి అనుగుణంగా మంజూరు చేయాలన్నారు. మంజూరు చేసిన రుణాలకు రికరీకి ప్రత్యేక కార్యచరణ సిద్ధం చేసుకుని ముందుకెళ్లాలని సూచించారు. డీఆర్డీవో రమేశ్ రాథోడ్, మెప్మా పీడీ రాములు, స్త్రీనిధి ఆర్ఎం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
గిట్టుబాటు కోసం రైతుల కలెక్టరేట్ ముట్టడి
ఇందూరు (నిజామాబాద్ అర్బన్): ఎర్రజొన్న, పసుపు పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ సోమవారం రైతులు కలెక్టరేట్‌ను ముట్టడించారు. సుమారు రెండు వేల మంది రైతులు తరలిరాగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. చివరకు కొంత మంది రైతు సంఘం నాయకులను లోనికి ప్రవేశం కల్పించడంతో వారు కలెక్టర్ రామ్మోహన్‌రావును కలసి వినతిపత్రం సమర్పించారు. ఎర్రజొన్నను ప్రభుత్వమే కొనుగోలు చేసి క్వింటాలుకు రూ.3,500 చెల్లించాలని, పసుపు క్వింటాలుకు రూ.15,000 ధర ఇప్పించాలని కోరారు. ప్రభుత్వం ఆదుకోకపోతే పెట్టిన పెట్టుపడి కోల్పోయి అప్పులపాలయ్యే ప్రమాదం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై కమిటీ వేస్తున్నట్లు కలెక్టర్ రామ్మోహన్రావు రైతులకు హామీ ఇచ్చారు. కాగా, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికపై చర్చించుకున్న రైతులు, ఈ నెల 20న ఎమ్మెల్యేలను కలసి సమస్యను విన్నవించాలని, వారు స్పందించకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేయాలని తీర్మానించారు. -
జయకు విదేశీ వైద్యం వద్దనుకున్నారు
సాక్షి ప్రతినిధి, చెన్నై: అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలోనే ముఖ్యమంత్రి జయలలితను మెరుగైన వైద్యం కోసం విదేశాలకు తరలించేందుకు మంత్రులు సిద్ధపడినా, తరువాత వెనక్కి తగ్గారని తమిళనాడు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రామమోహన్‌రావు వెల్లడించారు. జయ మరణంపై విచారణ జరుపుతున్న కమిషన్‌కు ఆయన ఇచ్చిన వాంగ్మూలం ఆరు నెలల తరువాత బహిర్గతమైంది. తమిళ దినపత్రికలు ఆ విషయాల్ని గురువారం ప్రముఖంగా ప్రచురించాయి. రిటైర్డు న్యాయమూర్తి ఆర్ముగస్వామి గత డిసెంబరు 21న రామమోహన్ రావును విచారించారు. ‘అత్యుత్తమ వైద్యం అందించేందుకు జయను విదేశాలకు తరలించాలని మంత్రులకు సూచించాను. ఈ విషయంపై వారు 4 రోజులు ఆలోచించి, ఆ తరువాత పూర్తిగా విస్మరించారు’ అని ఆయన వివరించారు. మంత్రులకు మరెక్కడి నుంచైనా అనుమతులు రావాల్సి ఉండే దా? అని కమిషన్ ప్రశ్నించగా తనకు తెలియద ని బదులిచ్చారు. ‘జయ పరిస్థితి విషమంగా ఉన్నట్లు 2016 డిసెంబరు 4న వైద్యులు చెప్పగానే ఆసుపత్రికి వెళ్లి చూడగా, ఆమె శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడుతున్నారు. అదే రోజు రాత్రి 10.30 గంటలకు ఇక లాభం లేదని వైద్యులు తేల్చేశారు. ఇదంతా జరిగినప్పుడు అప్పటి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఆసుపత్రిలోనే ఉన్నారు’ అని చెప్పారు. -
ఇదేం తీరు!
► స్వతంత్ర సంస్థ అన్నది గుర్తుంచుకోండి ► స్థానిక ఎన్నికలపై హైకోర్టు ఆగ్రహం ఎన్నికల యంత్రాంగం స్వతంత్ర సంస్థ అన్నది గుర్తుంచుకోండి, స్వతంత్రంగా వ్యవహరించండంటూ రాష్ట్ర ఎన్నికల యంత్రాంగం తీరుపై మద్రాసు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తీరు మారని పక్షంలో ఎన్నికల అధికారిని కోర్టు మెట్లు ఎక్కించాల్సి ఉంటుందని న్యాయమూర్తులు హెచ్చరించారు. సాక్షి, చెన్నై: గత ఏడాది కోర్టు కన్నెర్రతో స్థానిక సంస్థలకు జరగాల్సిన ఎన్నికలు వాయిదా పడ్డ విషయం తెలిసిందే. సింగిల్ బెంచ్ తీర్పును వ్యతిరేకిస్తూ దాఖలైన అప్పీలు పిటిషన్ విచారణ న్యాయమూర్తులు రామ్మోహన్ రావు, ఎస్ఎం.సుబ్రమణ్యం నేతృత్వంలోని బెంచ్ విచారిస్తోంది. ఎన్నికల ఆగడం, అప్పీలు పిటిషన్ విచారణతో స్థానిక సంస్థలకు ప్రత్యేక అధికారుల్ని నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పరిస్థితుల్లో గత విచారణ సమయంలో ఎన్నికల నిర్వహణకు తగ్గట్టు ప్రస్తుతం తీసుకున్న చర్యలపై కోర్టుకు నివేదిక సమర్పిం చాలని న్యాయమూర్తు లు ఆదేశించారు. ఏప్రిల్‌లోపు ఎన్నికలు నిర్వహించేందుకు తగ్గ ఏర్పాట్లతో ఆ నివేదిక సమర్పించాలని సూచించారు. అయితే, ఏప్రిల్‌లోపు ఎన్నికల నిర్వహణ అసాధ్యమని పేర్కొంటూ, ప్రత్యేక అధికారుల పదవీ కాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ వివరాలతో కూడిన నివేదిక కోర్టు ముందుకు గత వారం చేరింది. నివేదిక పరిశీలనానంతరం శుక్రవారం మళ్లీ పిటిషన్ విచారణకు వచ్చింది. ఎన్నికల నిర్వహణకు తగ్గట్టు ఎన్నికల యంత్రాంగం ఎలాంటి చర్యలు ఇంత వరకు తీసుకోకపోవడంపై హైకోర్టు బెంచ్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. స్వతంత్ర సంస్థ: న్యాయమూర్తులు రామ్మోహన్ రావు, సుబ్రమణ్యం నేతృత్వంలోని బెం చ్ ఉదయం విచారణను చేపట్టగా, డీఎంకే తరఫు న్యాయవాది విల్సన్ హాజరై వాదనల్ని వినిపించారు. ఎన్నికల నిర్వహణకు ఇంత వరకు ఎలాంటిచర్యలు తీసుకోలేదని బెంచ్ ముందు ఉంచారు. ఈసందర్భంగా ఎన్నికల యంత్రాంగం తరఫు న్యాయవాది పి కుమార్ తన వాదనల్ని వినిపించారు. అన్ని ఏర్పాట్లకు తాము సిద్ధంగా ఉన్నా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంత వరకు ఎలాంటి ఆదేశాలు రాలేదని వివరించారు. ప్రభుత్వం నుంచి తమకు కొన్ని రకాల అనుమతులు, ఉత్తర్వులు రావాల్సి ఉందని కోర్టు దృష్టికి తెచ్చారు. ఇందుకుగాను మరింత సమయం తమకు కేటాయించాలని కోరారు. దీంతో న్యాయమూర్తులు తీవ్రంగానే స్పందించారు. ఎన్నికల యంత్రాంగం స్వతంత్ర సంస్థ అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. స్వతంత్రంగా వ్యవహరించకుండా ప్రభుత్వ అనుమతి, ఉత్తర్వులు అని జాప్యం చేయడం మంచి పద్ధతి కాదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత వరకు కనీస ఏర్పాట్లుకూడా చేయకపోవడం శోచనీయమని అసహనం వ్యక్తం చేశారు. పద్ధతి మారని పక్షంలో రాష్ట్ర ఎన్నికల అధికారిని కోర్టుమెట్లు ఎక్కించాల్సి ఉంటుందని హెచ్చరిస్తూ, తదుపరి విచారణ 14వ తేదీకి వాయిదా వేశారు. స్థానిక ఎన్నికల నిర్వహణలో సాగుతున్న అలసత్వంపై కోర్టు సైతం ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం బట్టి చూస్తే, రాష్ట్రంలో పరిపాలన ఏ మేరకు సంక్షోభంలో ఉన్నదో స్పష్టం అవుతోందని డీఎంకే కార్యనిర్వహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ విమర్శించారు. -
రావు విమర్శల బాకు
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్రావు మంగళవారం మీడియా ముం దు చేసిన వ్యాఖ్యలు రాజకీయ కలకలం రేపాయి. ఐఏఎస్ అధికారులను కలవరపాటుకు గురి చేశాయి. ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండవలసింది కాదని వి విధ వర్గాలు ఆయనకు హితవు పలికాయి. రామ్మోహన్రావు, ఆయన కుమారుడు వివేక్ ఇళ్లు, కార్యాలయాలపై ఇటీవల ఐటీ అధికారులు దాడులు నిర్వహించి పెద్ద ఎత్తున ఆస్తులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఐటీ దాడుల కారణంగా ప్రభుత్వం రామ్మోహన్‌రావును సస్పెండ్ చేసి సీఎస్ బాధ్యతల నుంచి తొలగించింది. దాడుల అనంతరం రావును, ఆయన కుమారుడిని అరెస్ట్ చేస్తారని భావిస్తున్న తరుణంలో గుండెపోటుకు గురై ఆసుపత్రిలో చేరారు. సోమవారం రాత్రి ఆసుపత్రి నుంచి డిశ్చార్జయి ఇంటికి చేరుకున్నారు. చెన్నై అన్నానగర్‌లోని తన ఇంటి వద్ద మంగళవారం ఉదయం 10.45 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేసి పరుషపదజాలంతో విమర్శలు గుప్పించడం రాజకీయ కలకలం రేపింది. తన ఇంటిలో జరిగిన దాడులు చట్ట విరుద్ధమని అన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వ్యాఖ్యలు చేయడం, తనను బదిలీ చేసే ధైర్యం కూడా కేంద్రానికి లేదని సవాలు విసరడం పలువురికి ఆశ్చర్యం కలిగించింది. తన ఇంటిపై ఐటీ దాడులు, సచివాలయంలోని సీఎస్ ఛాంబర్లో తనిఖీలు, సచివాలయంలోకి సీఆర్పీఎఫ్ దళాలు ఏమిటని అన్నారు. ముఖ్యమంత్రి జయలలిత హయాంలో ఇలా జరిగి ఉండేదా అని పదే పదే ప్రశ్నించడం కూడా రాజకీయ వర్గాల వారికి కలవరపాటుకు గురి చేసింది. అసలు అన్నాడీఎంకేకు ఏమైందని ప్రశ్నించడం విశేషం. సచివాలయంలో తనిఖీకి సీఎం పన్నీర్‌సెల్వం అనుమతించారా అని సందేహాన్ని వెలిబుచ్చారు. తనను కొందరు టార్గెట్ చేశారు, తనకు వారి వల్ల ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేయడం మరింత కలకలానికి కారణమైంది. కేంద్రానికి తమిళనాడు అన్నా, ఇక్కడి అధికారులనా చిన్నచూపు, అసలు తమిళనాడుకే భద్రత కరువైందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ విషయాల్లో జోక్యం చేసుకుంటోందని ప్రత్యక్షంగా వ్యాఖ్యానించడం గమనార్హం. మమత, రాహుల్‌కు ధన్యవాదాలు: సమావేశంలో రావు నోరువిప్పేలోగానే మీడియా పలు ప్రశ్నలు సంధించగా, ఓపిగ్గా ఉండండి చాలా విషయాలు చెప్పాలి అని వారిస్తూ ముందుగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, అన్నాడీఎంకే పార్లమెంటు సభ్యుడు ఎస్ఆర్.బాలసుబ్రహ్మణ్యం, పార్టీ అధికార ప్రతినిధి ధీరన్లతోపాటు ఐటీ దాడులకు నిరసన తెలిపిన అందరికీ కృతజ్ఞతలు అని అన్న తరువాతనే అసలు అంశానికి రావడం విచిత్రం. ఒక ఐఏఎస్ ఉన్నతాధికారిలా కాక రాజకీయ నాయకుడిలా ప్రతిపక్ష నేతలకు ధన్యవాదాలు తెలపడం అందరినీ ముక్కున వేలేసుకునేలా చేసింది. రామ్మెహనరావు చేసిన వ్యాఖ్యలు రాబోయే కాలంలో ఎటువంటి పరిణామాలకు దారి తీస్తాయోనని ఆందోళన చెందుతున్నారు. ఐటీ దాడుల తరువాత రావును అరెస్టు చేస్తారని ప్రచారం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఎటువంటి పరిణామాలకు దోహదం చేస్తుందని ప్రశ్నించుకుంటున్నారు. ఐటీ అధికారుల వివరణ రామ్మెహనరావు ఇంట్లో దాడులు, సోదాలు చేసే అధికారం తమకు ఉందని, వివేక్‌కు, శేఖర్‌రెడ్డికి సంబంధాలు ఉన్నట్లుగా తమ వద్ద ఆధారాలున్నాయని ఐటీ అధికారులు వివరణ ఇచ్చారు. తనిఖీలకు తాము వివేక్ పేరుతో వారెంట్ పొందాం, ఆ వారెంట్ తోనే పదికి పైగా ప్రాంతాల్లో తనిఖీలు చేశామని తెలిపారు. తనిఖీల సమయంలో పారామిలటరీ దళాలను భద్రత కోసం పెట్టుకోకూడదని నిబంధన ఏదీ లేదని అన్నారు. ఇప్పటికే అనేకసార్లు సీఆర్పీఎఫ్ సేవలను వినియోగించుకున్నామని అన్నారు. రామ్మోహనరావు ఇంట్లో, సచివాలయంలో ఆయన ఛాంబర్లో తనిఖీలకు ఢిల్లీ నుంచి అనుమతి పొందామన్నారు. చట్ట ప్రకారమే అన్ని నిర్వహించామని తెలిపారు. రావు ఆరోపణలపై ఐటీశాఖ చీఫ్ కమిషనర్ కే.శ్రీవాత్సవ బుధవారం మీడియాకు వివరణ ఇవ్వనున్నట్లు సమాచారం. రామ్మోహనరావు చేసిన వ్యాఖ్యలు, విమర్శలపై కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖలో ఐటీ అధికారులు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. మాజీ ఐఏఎస్‌ల విమర్శ అవినీతి ఊబిలో కూరుకుపోయిన వారు ఇలాంటి వ్యాఖ్యలే చేస్తారని మాజీ ఐఏఎస్ అధికారి దేవ సహాయం వ్యాఖ్యానించారు. తానింకా ప్రధాన కార్యదర్శిగా చెప్పుకోవడం అవివేకమని అన్నారు. ఒక ఐఏఎస్ అధికారిగా ఐఆర్ఎస్ అధికారుల తీరును ప్రశ్నించడం శోచనీయమన్నారు. మాజీ న్యాయమూర్తి వళ్లి నాయగం మాట్లాడుతూ ఆరోపణలు ఎదుర్కొన్న అధికారి చట్టపరంగా తన నిజాయితీ నిరూపించుకోకుండా మీడియా ముందుకెళ్లడం శోచనీయమని వ్యాఖ్యానించారు. అన్నాడీఎంకే సభ్యునిలా మాట్లాడుతున్నారని కొందరు ఐఏఎస్ అధికారులు ఎద్దేవా చేశారు. సీఎం సమాధానం చెప్పాలి – స్టాలిన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా తానింకా కొనసాగుతున్నట్లు రామ్మెహనరావు చేసిన వ్యాఖ్యలపై íసీఎం పన్నీర్‌సెల్వం సమాధానం చెప్పాలని డీఎంకే కోశాధికారి, ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్ డిమాండ్ చేశారు. అలాగే ఐటీ దాడులపై ఆయన చేసిన విమర్శలపై కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని అన్నారు. రాజకీయం చేస్తున్నారు – బీజేపీ కేంద్రమంత్రి పొన్‌రాధాకృష్ణన్ మాట్లాడుతూ రామ్మెహనరావు వ్యాఖ్యలతో రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు లేవనే విషయం స్పష్టమైందని అన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న రామ్మెహనరావు ఇలా మాట్లాడడం సరికాదని హితవు పలికా>రు. రామ్మెహనరావు వ్యవహారాన్ని కొందరు రాజకీయం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై వ్యాఖ్యానించారు. తమిళనాడు ప్రభుత్వం తనను రక్షించే ప్రయత్నం చేయడం లేదని తన ప్రాణాలకు ముప్పు ఉందని పేర్కొనడం విచిత్రమని అన్నారు. ఒకవేళ తన ఇంటిలో అక్రమంగా ఐటీ దాడులు జరిగి ఉంటే స్పందించాల్సిన తీరు ఇది కాదని అన్నారు. రావు వెనకుండి ఎవరో రెచ్చగొడుతున్నారని ఆమె అనుమానించారు. రావు వ్యాఖ్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివరణ ఇవ్వాలని తమిళ మానిల కాంగ్రెస్ అధ్యక్షుడు జీకే వాసన్ కోరారు.అన్నాడీఎంకే అధినేత్రి మరణం తరువాత రాష్ట్ర రాజకీయాల్లో తల దూర్చడానికి బీజేపీ చూపిస్తున్న ఆసక్తి రామ్మెహనరావు వ్యాఖ్యలతో బట్టబయలైంది. రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం చిన్నచూపు చూస్తోందని చెప్పడం, ఐటీ దాడులకు పారామిలటరీ దళాలను ప్రయోగించడం వంటివి కొన్ని ఉదాహరణలు. జయలలిత మరణించగానే రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం ఏర్పడడానికి కేంద్ర ప్రభుత్వ జోక్యమే కారణమని రామ్మెహనరావు చెప్పకనే చెప్పడం గమనార్హం -
నెలదాటినా.. నోటొక్క కష్టాలు
► సామాన్యులకు తప్పని తిప్పలు ►వేతన జీవుల వెతలు వర్ణనాతీతం ►తగ్గని బారులు ►కొనసాగుతున్న క్యాష్ కష్టాలు ►నష్టాల్లో మార్కెట్ రంగం తిరుపతి (అలిపిరి) : పెద్ద నోట్లు రద్దయి నెల రోజులు పూర్తరుునా జిల్లా వాసులకు కరెన్సీ కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. సరిపడా నిల్వలు ఉండక పోవడంతో ఖాతా దారులకు అవసరమైన నగదు లభించడం లేదు. నిత్యం బ్యాంకుల ముందు బారులు తీరుతూనే ఉన్నారు. ఆర్బీఐ నుంచి అరకొర నగదు జిల్లాకు అందుతుండడంతో క్యాష్ కష్టాలు రోజు రోజుకు జఠిలమవుతోంది. నెల జీతం కోసం ఎదురు చూసే వేతన జీవుల కష్టాలు వర్ణనాతీతంగా మారారుు. పండుటాకులు పింఛ న్ కోసం గంటల తరబడి క్యూలో నిలుచున్నా నగదు అందే పరిస్థితులు లేకుండా పోయింది. నగదు కొరతతో నిత్యం గంటల తరబడి బ్యాంకుల్లో లావాదేవీలు స్తంభిస్తున్నారుు. దీంతో బ్యాంకు ముందు బారులు తీరిన జనం అవస్థలు పడక తప్పడం లేదు. ఇక పెద్ద నోట్ల రద్దుతో మార్కెట్ రంగం కుదైలేంది. కనివిని ఎరుగని రీతిలో రూ.కోట్లలో నష్టాలను చవిచూడాల్సివచ్చింది. జిల్లాలో నగదు కష్టాలు అంచలంచలుగా దూరమవుతాయనుకున్న సామాన్యుల లెక్కలు తారుమారయ్యారుు. నగదు కష్టాలు రోజు రోజు కు జఠిలమవుతూనే ఉంది. నిత్యం బ్యాంకుల ముందు ఖాతాదారులు బారులు తీరుతూనే ఉన్నారు. జిల్లా వ్యాప్తం గా 40 జాతీయ బ్యాంకులకు సంబంధించిన 593 శాఖలు ఉంటే గత నెల రోజుల్లో ఖాతాదారులకు పూర్తి స్థారుులో సేవలందించినవి 50 శాతానికి మించలేదు. గ్రామీణ స్థారుు బ్యాంకుల సేవలు పూర్తిగా స్తంభించారుు. ఏటీఎం కేంద్రాలు కూడా పేలవమైన సేవలు అం దిస్తుండడంతో ఖాతాదారులు అవస్థలు వర్ణనాతీతంగా మారారుు. ఏటీఎంలలో నగదు నిమిషాల వ్యవధిలో ఖాళీ అవుతోంది. దీంతో ఏటీఎం ముందు బారులు తీరిన ఖాతాదారులందరికీ నగదు అందక ఇబ్బందులు పడాల్సివస్తోంది. ఆర్బీఐ నుంచి జిల్లా అవసరాలకు తగ్గట్టుగా నగ దు బదిలీ కాకపోవడంతో జిల్లా యంత్రాంగం తలలు పట్టుకుంటోంది. వేతన జీవులు, పింఛ న్‌దారులు, సామాన్య ఖాతాదారులకు నగదు కష్టాలు తీరాలంటే జిల్లాలకు రూ. 1800 కోట్లు అవసరమని పది రోజుల కిందట ఆర్బీఐకి జిల్లా యంత్రాంగం విన్నవించింది. అరుుతే ఆర్బీఐ నుంచి స్పందన కరువైంది. గడిచిన పది రోజుల్లో ఆర్బీఐ నుంచి జిల్లాకు చేరింది కేవలం రూ.400 కోట్లు మాత్రమే. ప్రభుత్వ ఉద్యోగులకు విత్‌డ్రాను కేంద్రం రూ.10వేలకు పరిమి తం చేసింది. దీంతో వేతన జీవుల వెతలు వర్ణనాతీతంగా మారారుు. కనీసం ఫించనుదారులకు భృతి అందక అవస్థలు పడుతూనే ఉన్నారు. ఉదయం ఆరు గంటలకు బ్యాంకుల వద్దకు చేరుకుంటున్న ఫింఛన్‌దారులకు నో క్యాష్ అంటూ సమాధానం వస్తుండడంతో అవస్థలు పడుతున్నారు. 42 లక్షల ఖాతాలు జిల్లా వ్యాప్తంగా 593 బ్యాంకు శాఖల్లో 42 లక్షల మంది ఖాతాదారులు ఉన్నా రు. ఇందులో సామాన్య, పింఛన్, ఉపాధి హామీ పథకం, జన్‌థన్ ఇలా అనేక విభాగాల వారీగా ఖాతాదారులు ఉన్నారు. 42 లక్షల ఖాతాదారుల్లో 75 శాతంపైగా ఖాతాల్లో లావాదేవీలు జరుగుతున్నారుు. ఇంత మంది ఖాతాదారులకు బ్యాంకు శాఖలు సేవలందించాలంటే ఆర్బీఐ అధిక మొత్తంలో నగదును జిల్లాకు బదిలీ చేయాల్సి ఉంది. అరుుతే ఆర్బీఐ అరకొర నగదును విదులుస్తుండడంతో సామాన్య ప్రజ లకు కరెన్సీ కష్టాలు తప్పడం లేదు. మార్కెట్‌కు భారీ నష్టం కేంద్రం గత నెల 8న పెద్ద నోట్ల రద్దు ప్రకటన వెలువరించింది. ఈ నెల రోజుల కాలంలో కూరగాయలు మొదలు కార్ల షోరూం వరకు అన్ని రంగాలు నష్టాలను చవిచూశారుు. జిల్లాలో కూరగాయల మార్కెట్ రంగానికి నెల రోజుల్లో రూ.30 కోట్ల మేర నష్టం వాటిల్లింది. బంగారం వ్యాపారం సంక్షోభంలో కూరుకుపోరుుంది. ద్విచక్రవాహనాలు, కార్ల కొనుగోళ్లు స్తంభించారుు. ఎలక్ట్రానిక్ రంగానికి నష్టాలు తప్పలేదు. ప్రతి రంగం నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. రూ.1,800 కోట్లు అవసరమని విన్నవించాం జిల్లా అవసరాలరీత్యా యుద్ధప్రాతిపదికన రూ.1800 కోట్లు అవసరమని పది రోజుల కిందట ఆర్బీఐకి విన్నవించాం. ఇప్పటి వరకు రూ.400 కోట్లు మాత్రమే విడులయ్యారుు. పూర్తి స్థారుులో నగదు అందకపోవడం వల్ల బ్యాంకుల్లో నగదు కొరత నెలకుంది. ఆర్బీఐ నుంచి అధిక మొత్తంలో జిల్లాకు నగదు చేరితేనే బ్యాంకు లావాదేవీలు సమర్థవంతం జరగడానికి వీలవుతుంది. - రామ్మోహన్రావు, మేనేజర్, లీడ్ బ్యాంక్, చిత్తూరు -
ఆ కి‘లేడీ’ పై 15 కేసులు
జియాగూడ(హైదరాబాద్ సిటీ): మాయమాటలతో ప్రజలను మోసం చేస్తూ తప్పించుకు తిరుగుతున్న ఓ మహిళను కుల్సుంపురా పోలీసులు అరెస్టు చేశారు. ఆమెపై పలు పోలీస్స్టేషన్లలో కేసులు ఉన్నందున పీడీ యాక్ట్ విధించి చంచల్‌గూడ మహిళా జైలుకు తరలించినట్లు కుల్సుంపురా ఇన్స్పెక్టర్ రామ్మోహన్రావు తెలిపారు. ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా, రాజేంద్రనగర్ ఖాలీజ్‌ఖాన్ దర్గా ప్రాంతానికి చెందిన చల్లా నర్సమ్మ(40) కొన్ని నెలలుగా మాయమాటలు చెప్పి ప్రజల వద్ద నుంచి బంగారు వస్తువులు చోరీ చేస్తోంది. ఈమెపై సుమారు 15 వరకు కేసులు పలు పోలీస్స్టేషన్లలో నమోదై ఉన్నాయి. కాగా కుల్సుంపురా పోలీస్‌స్టేషన్‌లో ఓ కేసులో నిందితురాలు కావడంతో నర్సమ్మను పోలీసులు అరెస్టు చేసి పీడీ యాక్ట్ విధించి చంచల్‌గూడ మహిళా జైలుకు తరలించారు. -
లెనిన్ ఆశయాలు సాధించాలి
విజయవాడ స్పోర్ట్స్ : అంతర్జాతీయ ఆర్చర్, కోచ్ చెరుకూరి లెనిన్ నాలుగో వర్ధంతి నగరంలో చెరుకూరి లెనిన్ -వీఎంసీ ఆర్చరీ అకాడమీలో శుక్రవారం జరిగింది. అకాడమీ ఆవరణంలో లెనిన్ విగ్రహానికి పలువురు నివాళులర్పించారు. అనంతరం నగర మేయర్ కోనేరు శ్రీధర్, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బొండా ఉమామహేశ్వరరావు, జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ బి.ఎల్.చెన్నకేశవరావు ప్రసంగించారు. గద్దె రామ్మోహన్రావు మాట్లాడుతూ సంప్రదాయ విలువిద్య క్రీడలో అహర్నిశలు శ్ర మించి కామన్వెల్త్ గేమ్స్‌లో తన శిష్యబృందంతో పతకాలు సాధించడంలో సఫలీకృతుడయ్యారని గుర్తుచేశారు. బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ తమ ప్రభుత్వం రాష్ట్ర రాజధానిని క్రీడా రాజధానిగా తీర్చిది ద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తోందని పేర్కొన్నారు. రియో ఒలింపిక్స్‌లో దేశానికి ఆర్చరీ పతకాన్ని అందించే క్రీడాకారులు శిక్షణ పొందుతున్న చెరుకూరి ఓల్గా ఆర్చరీ అకాడమీకి అవసరమైన కొరియన్ కోచ్ నియామకంపై ముఖ్యమంత్రితో చర్చిస్తానని హామీ ఇచ్చారు. చెరుకూరి లెనిన్ స్ఫూర్తితో శిక్షణ పొందుతున్న క్రీడాకారులు ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలని సూచించారు. మేయర్ శ్రీధర్ మాట్లాడుతూ చిన్నతనంలో ద్రాణాచార్యుడిగా పిలిపించుకున్న ఘనత ఒక్క లెనిన్కే దక్కిందన్నారు. ఆయన ఆశయ సాధనకు నగర పాలక సంస్థ సహాయసహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు. ఇటీవల జరిగిన ఏషియన్ గేమ్స్ పతక విజేత పూర్వాష సుధీర్ షిండే సన్మాన కార్యక్రమంలో జిల్లా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, కలెక్టర్ రఘునందన్‌రావు, పోలీసు కమిషనర్ ఎ.బి.వెంకటేశ్వరరావు సమక్షంలో కొరియన్ కోచ్ కావాలని లెనిన్ తండ్రి చెరుకూరి సత్యనారాయణ కోరారని, స్పందించిన సీపీ తక్షణమే బడ్జెట్ ఎంత కావాలని కోరగా, రూ.1.39 కోట్లకు నివేదిక ఇచ్చారని గుర్తుచేశారు. ఆ మొత్తాన్ని ప్రభుత్వం నుంచి, స్పాన్సర్ల నుంచి సేకరించేందుకు కృషి చేస్తామన్నారు. జిల్లా ఒలింపిక్ సంఘ కార్యదర్శి కె.పి.రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డీఎస్డీవో పి.రామకృష్ణ, ఏపీ ఆర్చరీ అసోసియేషన్ చైర్మన్ రామ్ బొబ్బా, జిల్లా చైర్మన్ కె.పార్థసారథి, కార్యదర్శి చెరుకూరి సత్యనారాయణ, కార్పొరేటర్లు దేవినేని అపర్ణ, చెన్నుపాటి గాంధీ, దాసరి మల్లేశ్వరి, కాంగ్రెస్ నేత దేవినేని అవినాష్, సీపీఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్, ఐద్వా నాయకురాలు వనజకుమారి, అకాడమీ ఆర్చర్లు, క్రీడాకారులు, క్రీడా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. అకాడమీకి రూ.లక్ష విరాళం ఆసియా క్రీడల్లో తన కుమార్తె కాంస్య పతకం సాధించడంలో కీలక పాత్ర పోషించిన చెరుకూరి ఓల్గా-వీఎంసీ అకాడమీకి పూర్వాష సుధీర్ షిండే తండ్రి సుధీర్షిండే (మహారాష్ట్ర-అమరావతి) లక్ష రూపాయలను విరాళంగా అందజేశారు. తొలుత విశాఖపట్నం హుదూద్ బాధితల కోసం సీఎం సహాయ నిధికి ఇవ్వాలని రూ.లక్ష చెక్కును ఆయన ఎమ్మెల్యేలకు ఇవ్వగా వారు అకాడమీకి ఇవ్వాలని సూచించా రు. ఈ మేరకు ఆ చెక్కును తన కుమార్తె పూర్వాషతో కలిసి ఎమ్మెల్యేల చేతులు మీదుగా చెరుకూరి సత్యనారాయణకు అందజేశారు. -
పాఠం నేర్వలే !
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఓ వైపు రాష్ట్రం తీవ్ర విద్యుత్ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నా జెన్కో మాత్రం నిర్లక్ష్యాన్ని వీడిన దాఖలా కనిపించడం లేదు. దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రంలో బుధవారం రాత్రి జరిగిన ఘటనతో గతం నుంచి జెన్కో పాఠాలు నేర్వలేదనే విషయాన్ని తేటతెల్లం చేసింది. అత్యంత చవకగా విద్యుత్‌ను ఉత్పత్తి చేసే జల విద్యుత్ కేంద్రాల నిర్మాణం, నిర్వహణలో జెన్కో వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఓ వైపు బుధవారం రాత్రి జరిగిన ఘటనలో ప్రాణనష్టం జరగకపోవడంపై హర్షం వ్యక్తమవుతోంది. మరోవైపు విద్యుత్ కేంద్రం నిర్మాణంలో లోపాలపై అనుమానాలు, ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రక్షణగోడ బలహీనంగా నిర్మించడం, ఇన్నర్‌గేట్ల నిర్మాణంలో లోపం ప్రమాదానికి దారితీసినట్లు తెలుస్తోంది. మరోవైపు నిర్మాణం పూర్తి చేసుకున్న యూనిట్లకు నడుమ విభజన గోడ నిర్మాణం ఆలస్యం కావడం వల్లే నష్ట తీవ్రత ఎక్కువగా ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. ఘటన జరిగిన తర్వాత అప్రోచ్ కెనాల్ బండ్ నిర్మాణం పేరిట అధికారులు చేస్తున్న హడావుడిపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారం రోజుల వ్యవధిలోనే బండ్‌ను నిర్మించి, విద్యుత్ కేంద్రం నుంచి వరద నీటిని పూర్తిగా తోడి వేస్తామని చెప్పడం ఆచరణ సాధ్యంగా కనిపించడం లేదని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు. రోజుకు 20లక్షల యూనిట్ల మేర విద్యుత్ ఉత్పత్తి నష్టపోతుండడంపై అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేశారు. జులై 16న జెన్కో సీఈ రామ్మోహన్రావు బృందం దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రాన్ని సందర్శించి పలు సూచనలు ఇచ్చింది. కొద్దిపాటి జాగ్రత్తలు పాటించి ఉంటే ప్రమాదం జరిగేది కాదనే విమర్శలు వస్తున్నాయి. ‘ఎగువ’ బాధ్యులపై చర్యలేవీ? విద్యుత్ ఉత్పత్తికి సందర్భమైన వేళ గత యేడాది ఆగస్టు 27న ఎగువ జూరాల జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో షార్ట్ సర్క్యూట్ సంభవించింది. ఆరు యూనిట్లకు గాను నాలుగు యూనిట్లలో టర్బైన్లు కాలిపోవడంతో భారీ నష్టం వాటిల్లింది. విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైన 37రోజులకే ప్రమాదం జరగడంతో జెన్కో రోజుకు సుమారు రూ.70లక్షల మేర విద్యుత్ ఉత్పాదన నష్టపోయింది. మరమ్మతుల పేరిట తిరిగి కోట్లాది రూపాయలు వెచ్చించి మరమ్మతులు చేపట్టింది. తాజాగా ఎగువ జూరాలలోనూ విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైనప్పటికీ తరచూ టర్బైన్లు మొరాయిస్తున్నట్లు సమాచారం. సాంకేతిక కారణాలను సాకుగా చూపుతూ ఎగువ జూరాల ప్రమాద ఘటనలో నేటికీ ఎవరిపైనా చర్యలు తీసుకోలేదు. దిగువ జూరాల ప్రమాదంపై నివేదిక వచ్చిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని సీఎండీ చేసిన ప్రకటన మొక్కుబడిగానే కనిపిస్తోంది. మరో రెండు నెలల పాటు మాత్రమే వరద నీరు ఆధారంగా జల విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉండటంతో జెన్కో నిర్లక్ష్యంతో భారీ నష్టాన్నే రాష్ట్రం ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. -
రేపు ఎంసెట్
నెల్లూరు(టౌన్), న్యూస్‌లైన్ : ఇంజనీరింగ్, డాక్టర్ కోర్సులు చదవాలనుకునే విద్యార్థుల కోసం ప్రభుత్వం గురువారం నిర్వహించనున్న ఎంసెట్‌కు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఎంసెట్ కన్వీనర్ రామ్మోహన్రావు తెలిపారు. పరీక్షలకు సంబంధించిన ఏర్పాట్లు గురించి ఆయన మంగళవారం అధికారులతో కలిసి ‘న్యూస్‌లైన్’తో మాట్లాడారు. 10,943 మంది విద్యార్థులు ఇంజనీరింగ్, 3397 మంది మెడికల్ కోర్సు కోసం పరీక్షలు రాయబోతున్నారని తెలిపారు. ఇందుకోసం మొత్తం 27 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. నెల్లూరు నగరానికి దూరంగా కొన్ని కేంద్రాలు ఉన్నాయన్నారు. విద్యార్థులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ముందు రోజు అంటే బుధవారమే పరీక్ష కేంద్రాల వద్దకు వెళ్లి పరిశీలించుకోవాలని సూచించారు. పరీక్ష సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించే ప్రసక్తే లేదన్నారు. పరీక్ష కేంద్రానికి గంటముందే చేరుకోవాలని తెలిపారు. అలా చేరుకున్నప్పుడు విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉంటారన్నారు. పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసేందుకు ఇంజనీరింగ్ విభాగానికి ఇద్దరు, మెడిసిన్ విభాగానికి ఏడుగురు జేఎన్టీయూ విశ్వవిద్యాలయం నుంచి ప్రత్యేక పరిశీలికులు వస్తున్నారని చెప్పారు. వీరు ప్రతి కేంద్రాన్ని తనిఖీ చేస్తారన్నారు. వీరు కాక ప్రతి సెంటర్‌కు ఒక పరిశీలకులు ఉంటారని తెలిపారు. 25 మందితో కూడిన తహశీల్దార్ స్థాయి కలిగిన రెవెన్యూ స్క్వాడ్ కూడా కలెక్టర్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహిస్తుందని చెప్పారు. ఎలక్ట్రానిక్ పరికరాలు, కళ్లద్దాలపై డేగకన్ను ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను విద్యార్థులు తీసుకొచ్చినా వెంటనే డిబార్ చేస్తామని రామ్మోహన్రావు తెలిపారు. రంగుల కళ్లద్దాలు, పెన్‌లాంటి పరికరాలు, ఎలక్ట్రానిక్ వాచీలను నిషేధించినట్లు చెప్పారు. చూసేదానికి కళ్లద్దాలు, వాచీలు లాగా ఉన్నప్పటికీ అవి ప్రశ్నపత్రాన్ని స్కాన్ చేస్తాయన్నారు. అందుకే అలాంటి వాటిని నిషేధించినట్లు చెప్పారు. అంతేకాకుండా పరిస్థితులను బట్టి ఎలక్ట్రానిక్ పరికరాలు సమీపంలో బయట కూడా పనిచేయకుండా ఉండేందుకు జామర్‌ను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. తగిన పోలీసు బందో బస్తు ఉందన్నారు. పరీక్షలు ఉదయం ఇంజనీరింగ్ విభాగానికి, మధ్యాహ్నం మెడిసిన్ ఎంట్రెన్స్ విభాగానికి జరుగుతాయని తెలిపారు. -
అమ్మో!... ఆయనకు టిక్కెట్టు రాకపోతేనా!?
- ఇదీ కేంద్ర మంత్రి కృపారాణి ఆందోళన కేంద్రమంత్రి కిల్లి కృపారాణి ఇంట పరిస్థితి కాస్త భిన్నంగా ఉంది. శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ టిక్కెట్టు ఆమెకే దక్కనుంది. కానీ కృపారాణి అంతటితో సంతృప్తి చెందలేకపోతున్నారు. టెక్కలి ఎమ్మెల్యే టిక్కెట్టు తన భర్త రామ్మోహనరావుకే ఇప్పించుకోవడం ఆమెకు సవాల్‌గా పరిణమించింది. ఇంటలిజెన్స్ నివేదికల ప్రకారం టిక్కెట్లు ఖరారు చేస్తామని రాహుల్‌గాంధీ చెబుతుండటమే ఇందుకు కారణం. దానికితోడు ఒకే ఇంటికి రెండు టిక్కెట్లు ఇవ్వకూడదని రాహుల్ భావిస్తున్నారన్న సమాచారం కృపారాణిని కలవరపరుస్తోంది. ఎందుకంటే రామ్మోహన్రావు వ్యవహారం శైలి గత కొన్నేళ్లుగా తీవ్ర వివాదాస్పదమైంది. నియోజకవర్గంలోని అధికారులను ఆయన వేధిస్తున్నారన్న ఆరోపణలు తీవ్రస్థాయిలో వినిపిస్తున్నాయి. ఆయన వేధింపులను తాళలేక పలువురు బదిలీ చేయించుకుని వెళ్లిపోయారు. ఇక ఇతరాత్రా వ్యవహా రాల్లో కూడా రామ్మోహన్రావు తీవ్ర వివాదాస్పదుడిగా ముద్రపడ్డారు. ఇక కాలేజీలోనూ, బయటా దుందుడుకు చర్యలు, సహచర విద్యార్థుల పట్ల వేధింపులకు పాల్పడ్డ కుమారుడిని రామ్మోహన్రావు వెనకేసుకువచ్చిన తీరు వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో రామ్మోహన్‌రావుకు టెక్కలి అసెంబ్లీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వడంపై సందేహాలు ముసురుకున్నాయి. రామ్మోహన్రావు టిక్కెట్టు కోసం అధిష్టానం వద్ద కృపారాణి చేసిన ప్రయత్నాలకు సానుకూల స్పందన రాలేదని తెలుస్తోంది. వేరే అభ్యర్థిని సూచించమని అధిష్టానం ప్రతినిధులు సూచించడంతో ఆమెలో కలవరం మొదలైంది. టిక్కెట్టు రాకపోతే రామ్మోహన్‌నరావు ఎలా స్పందిస్తారోనని ఆమె ఆందోళన చెందుతున్నారని సమాచారం. ఎలాగైనాసరే ఆయనకు టిక్కెట్టు వచ్చేలా చేయడం కోసం కృపారాణి ప్రయత్నాలు ముమ్మ రం చేశారు. ఇలా.. టిక్కెట్ రాజకీయాలు ఇటు గుండ కుటుంబంలోను, అటు కిల్లి కుటుంబంలోనూ అలజడి సృష్టిస్తున్నాయి. అదండీ సంగతి. -
దర్యాప్తు అధికారులెవ్వరినీ బదిలీ చేయవద్దు...
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘంలో జరిగిన నిధుల దుర్వినియోగం, టిక్కెట్ల కుంభకోణం తదితర అంశాలపై ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాల మేరకు దర్యాప్తు చేస్తున్న బృందంలోని అధికారులెవ్వరినీ బదిలీ చెయ్యొద్దని హైకోర్టు ఏసీబీ డెరైక్టర్ జనరల్‌ను బుధవారం ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహనరావు ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాక ఈ మొత్తం వ్యవహారంలో ఫిబ్రవరి 28 నాటికి దర్యాప్తు పూర్తి చేస్తామని మౌఖికంగా చెప్పొద్దని, రాతపూర్వకంగా ఓ అఫిడవిట్‌ను కోర్టు ముందుంచాలని ఏసీబీ అధికారులను న్యాయమూర్తి ఆదేశించారు. హెచ్‌సీఏలో నిధుల దుర్వినియోగం, ఇతర అవకతవకలపై సాగర్ క్లబ్ కార్యదర్శి సి.బాబురావ్ సాగర్ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో 2011లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన కోర్టు, ఈ మొత్తం వ్యవహారంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని, దర్యాప్తు నివేదికను తమ ముందుంచాలని ఏసీబీ అధికారులను ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు ఏసీబీ అధికారులు 2011 ఏప్రిల్ 13న... 22 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఇప్పటి వరకు దర్యాప్తులో ఎటువంటి పురోగతి లేదని, నిందితుల్లో ఏ ఒక్కరినీ కూడా అరెస్ట్ చేయలేదని, ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తును పర్యవేక్షించాలని హైకోర్టును కోరుతు బాబూరావ్సాగర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని బుధవారం జస్టిస్ రామ్మోహనరావు విచారించారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న అధికారులెవ్వరినీ కూడా బదిలీ చేయవద్దని స్పష్టం చేశారు. కేసును తదుపరి విచారణ నిమిత్తం మార్చి 10కి వాయిదా వేశారు. -
కొత్త కలయికలతో కలహాలు
తలనొప్పిలా మారిన సమీకరణలు చంద్రబాబు వద్దే అమీతుమీ జిల్లా టీడీపీలో వింత పరిస్థితి సాక్షి ప్రతినిధి, విజయవాడ : తెలుగుదేశం పార్టీలో విజయవాడ పార్లమెంట్ సీటుపై అనిశ్చితి కొనసాగుతోంది. వల్లభనేని వంశీ, గద్దె రామ్మోహన్రావు పేర్ల తరువాత కేశినేని నాని అభ్యర్థిత్వాన్ని బలపరిచిన నాయకత్వం నేడు మరో అభ్యర్థి వేటలో పడింది. రెండుకళ్ల సిద్ధాంతాన్ని నమ్ముకున్న పార్టీపై ప్రజల్లో ఆదరణ తగ్గడంతో కేవలం ‘ఆర్థిక’ బలవంతులనే అభ్యర్థులుగా ప్రకటించాలని నాయకత్వం యోచిస్తోంది. అధిష్టానం ఆలోచనలు తమ్ముళ్ల మధ్య కీచులాటలకు దారితీస్తోంది. రెండు రోజల క్రితం నగరానికి వచ్చిన పార్టీ పరిశీలకుడు సుజనాచౌదరి ముందే తమ్ముళ్లు వ్యవహరించిన తీరు జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఉమ-నాని వర్గపోరు.. కొంతకాలంగా దేవినేని ఉమ కేంద్రంగా జిల్లా టీడీపీలో నివురుగప్పిన నిప్పులా రగులుతున్న విభేదాల సెగ తాజాగా మరింత రాజుకుంది. ఇందుకు దారితీసిన కారణాలు అనేకం ఉన్నాయి. ‘వస్తున్నా మీ కోసం’ అంటూ గత ఏడాది జిల్లాలో చంద్రబాబు నిర్వహించిన పాదయాత్ర ఖర్చులకోసం కేశినేని నానికి పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడంపై ఇక్కడి పార్టీలో వర్గపోరు తీవ్రమైంది. అదేక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమ తీరుపై వల్లభనేని వంశీమోహన్, గద్దే రామ్మోహన్, బొండా ఉమ అనుయాయులు తీవ్రంగా మండిపడ్డారు. మారిన సమీకరణల నేపథ్యంలో దేవినేని ఉమ విజయవాడ పార్లమెంట్‌కు మరో అభ్యర్థిని నేరుగా చంద్రబాబు వద్దకు తీసుకెళ్లారని తెలుసుకున్న కేశినేని నాని తనకు ఎంపీ టికెట్ రాదేమోనన్న కలవరపాటుకు గురికావడంతో వర్గ విభేదాలు తారస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో నాని జిల్లాలోని పలువురు నేతల వద్ద ఉమ వ్యవహారశైలిపై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో వివాదం రాజుకుంది. పాతనీరు దారెటు.. అధికార పార్టీలోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలోకి వచ్చేందుకు ఆసక్తిగా ఉన్నారని సుజనాచౌదరి గొప్పలు చెప్పినా.. కొత్తనీరు వస్తే పాతనీరు పోవాల్సిందేనా అంటూ తెలుగుతమ్ముళ్లు ఆందోళన చెందుతున్నారు. సీటు కోసం, పదవుల కోసం కొందరు కీలక నేతలు టీడీపీలో చేరేందుకు ఆసక్తిగా ఉన్నా.. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల టికెట్లపై ఆశలుపెట్టుకున్న వారంతా కినుకవహించే ప్రమాదం లేకపోలేదు. కొత్త చేరికల కోసం టీడీపీ ఆసక్తిచూపితే పాత నేతల నుంచి తిరుగుబాటు తప్పదన్న సంకేతాలు వెలువడుతున్నాయి. చంద్రబాబు వద్దే అదనుచూసి పంచాయితీ పెట్టాలని నిర్ణయించుకున్నారు. కలహాలకు కారణాలివీ.. సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంలో టీడీపీ పరిస్థితి మునిగిపోయే నావలా ఉండడంతో ఆ పార్టీ ప్రజాప్రతినిధులు ఇతర పార్టీలవైపు చూస్తున్నారు. జిల్లా మంత్రి కొలుసు పార్థసారథి, ఆయన సన్నిహితుడైన మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావుతోపాటు మరికొందరు టీడీపీలో చేరతారని ప్రచారం జరిగింది. మంత్రి సారథిని టీడీపీలో చేర్చుకుని సీటిస్తే పెనమలూరులో తమ సంగతేమిటని ఆ నియోజకవర్గ టీడీపీ నేతలు సుజనా చౌదరి వద్ద నిలదీసినంత పనిచేశారు. ఇప్పటికే వైవీబీ రాజేంద్రప్రసాద్, బోడే ప్రసాద్ నడుమ రగులుతున్న వర్గపోరు ఆ పార్టీ పుట్టి ముంచేలా మారింది. ఇది చాలన్నట్టు మంత్రి సారథి చేరిక ప్రస్తావన తెలుగుదేశం పార్టీకి ఇంటిపోరును మరింత పెంచడానికి దారితీసింది. మంత్రికి సన్నిహితుడైన ముద్దరబోయిన వెంకటేశ్వరరావు వస్తే నూజివీడు టీడీపీ టికెట్ ఇస్తారన్న ప్రచారంతో ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బచ్చుల అర్జునుడు తీవ్రంగా స్పందించినట్టు సమాచారం. తనకు నూజివీడు సీటు ఇవ్వొచ్చు కదా, కాంగ్రెస్ నుంచి నాయకుల్ని తెచ్చుకుని టికెట్ ఇస్తారా.. అంటూ ఎదురుదాడి చేయడంతో టీడీపీ నేతలకు మింగుడు పడటంలేదు.