సమావేశానికి హాజరైన డీఆర్‌డీఏ, మెప్మా అధికారులు,(ఇన్‌సెట్‌లో) కలెక్టర్ రామ్మోహన్‌రావు
సాక్షి, ఇందూరు (నిజామాబాద్): జిల్లాలో స్త్రీనిధి రుణాల మంజూరు, రికవరీ తీరుపై కలెక్టర్ రామ్మోహన్‌రావు అసహనం వ్యక్తం చేశారు. గత సంవత్సరాల్లో స్త్రీనిధి రుణాల మంజూరు, రికవరీలో ముందున్న జిల్లా... కొన్ని నెలులుగా ఎందుకు ఒక్కసారిగా వెనుకబడి పోయిందని ఆరా తీశారు. రుణాల ప్రగతి ఇంతగా పడిపోవడానికి గల కారణాలేంటని సంబంధిత అధికారులను ప్రశ్నించారు. సోమవారం స్థానిక ప్రగతిభవన్‌లో డీఆర్‌డీఏ, మెప్మా అధికారులు, సిబ్బందితో స్త్రీనిధి రుణాల ప్రగతిపై ఆయన సమీక్షించారు. స్త్రీనిధి పథకం కింద ఈ ఏడాది రూ.207 కోట్ల లక్ష్యానికి గాను ఇప్పటివరకు రూ.135 కోట్ల రుణాలు మహిళా సంఘాల సభ్యులకు మంజూరు చేయాల్సి ఉండగా, కేవలం 19 శాతంతో రూ.39 కోట్లు ఇవ్వడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ విషయంలో బ్యాంకుల అశ్రద్ద ఉంటే వాటి వివరాలు తెలుపాలని, వారానికోసారి సమీక్షించుకుని సమస్య ఎక్కడుందో దృష్టి పెట్టి రుణాల పురోగతిని సాధించేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. వచ్చే జనవరిలో అభివృద్ధి కనిపించాలని, నిర్లక్ష్యం చేయరాదని హెచ్చరించారు. మహిళా సంఘాల బలోపేతానికి, మహిళల ఆర్థికాభివృద్ధికి దోహదపడే స్త్రీనిధి రుణాల లక్ష్యానికి అనుగుణంగా మంజూరు చేయాలన్నారు. మంజూరు చేసిన రుణాలకు రికరీకి ప్రత్యేక కార్యచరణ సిద్ధం చేసుకుని ముందుకెళ్లాలని సూచించారు. డీఆర్‌డీవో రమేశ్ రాథోడ్, మెప్మా పీడీ రాములు, స్త్రీనిధి ఆర్‌ఎం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment