గంగాధర్‌ను కిందకు దింపుతున్న దృశ్యం
ఇందూరు (నిజామాబాద్ అర్బన్): ‘తహసీల్దార్ నాకు న్యాయం చేయడం లేదు.. అందుకే ఉరివేసుకుంటున్నా..’ అని ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. కలెక్టరేట్ ఆవరణలో ఉన్న చెట్టెక్కి ఉరేసుకునేందుకు యత్నించడం కలకలం సృష్టించింది. ధర్పల్లి మం డలం దుబ్బాక గ్రామానికి చెందిన అక్కం గంగాధర్‌కు రేకులపల్లిలో వ్యవసాయ భూమి ఉంది. గంగాధర్ తమ్ముడు సంతోష్ పొలం కూడా పక్కనే ఉంది. సంతోష్ తన పొలంలో బోరు వేసినప్పటి నుంచి గంగాధర్ బోరులో నీళ్లు రావడంలేదు.
దీనిపై తహసీల్దార్‌కు ప్రజావాణిలో పలుమార్లు ఫిర్యాదులు చేశానా న్యాయం జరగడం లేదనే ఆవేదనతో గంగాధర్ సోమవారం కలెక్టర్ కార్యాలయానికి వచ్చి తాడుతో ఉరి వేసు కునేందుకు యత్నించాడు. ప్రజావాణికి వచ్చిన వారంతా చెట్టె క్కిన గంగాధర్‌ను ఎంత సముదాయించినా కిందికి దిగలేదు. గంగాధర్‌కు తెలియకుండా చెట్టు ఎక్కిన ఓ వ్యక్తి గంగాధర్‌ను పట్టుకుని తాడును విప్పాడు. గంగాధర్‌ను కిందికి దింపి నిజామాబాద్ ఆర్‌డీఓ వద్దకు తీసుకెళ్లి సమస్య ఏంటో తెలుసుకున్నారు. ధర్పల్లి తహసీల్దార్‌తో మాట్లాడిన ఆర్డీఓ బుధవారం విచారణకు వస్తున్నానని, అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment