నెలదాటినా.. నోటొక్క కష్టాలు
► సామాన్యులకు తప్పని తిప్పలు
►వేతన జీవుల వెతలు వర్ణనాతీతం
►తగ్గని బారులు
►కొనసాగుతున్న క్యాష్ కష్టాలు
►నష్టాల్లో మార్కెట్ రంగం
తిరుపతి (అలిపిరి) : పెద్ద నోట్లు రద్దయి నెల రోజులు పూర్తరుునా జిల్లా వాసులకు కరెన్సీ కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. సరిపడా నిల్వలు ఉండక పోవడంతో ఖాతా దారులకు అవసరమైన నగదు లభించడం లేదు. నిత్యం బ్యాంకుల ముందు బారులు తీరుతూనే ఉన్నారు. ఆర్బీఐ నుంచి అరకొర నగదు జిల్లాకు అందుతుండడంతో క్యాష్ కష్టాలు రోజు రోజుకు జఠిలమవుతోంది. నెల జీతం కోసం ఎదురు చూసే వేతన జీవుల కష్టాలు వర్ణనాతీతంగా మారారుు. పండుటాకులు పింఛ న్ కోసం గంటల తరబడి క్యూలో నిలుచున్నా నగదు అందే పరిస్థితులు లేకుండా పోయింది. నగదు కొరతతో నిత్యం గంటల తరబడి బ్యాంకుల్లో లావాదేవీలు స్తంభిస్తున్నారుు. దీంతో బ్యాంకు ముందు బారులు తీరిన జనం అవస్థలు పడక తప్పడం లేదు.
ఇక పెద్ద నోట్ల రద్దుతో మార్కెట్ రంగం కుదైలేంది. కనివిని ఎరుగని రీతిలో రూ.కోట్లలో నష్టాలను చవిచూడాల్సివచ్చింది. జిల్లాలో నగదు కష్టాలు అంచలంచలుగా దూరమవుతాయనుకున్న సామాన్యుల లెక్కలు తారుమారయ్యారుు. నగదు కష్టాలు రోజు రోజు కు జఠిలమవుతూనే ఉంది. నిత్యం బ్యాంకుల ముందు ఖాతాదారులు బారులు తీరుతూనే ఉన్నారు. జిల్లా వ్యాప్తం గా 40 జాతీయ బ్యాంకులకు సంబంధించిన 593 శాఖలు ఉంటే గత నెల రోజుల్లో ఖాతాదారులకు పూర్తి స్థారుులో సేవలందించినవి 50 శాతానికి మించలేదు. గ్రామీణ స్థారుు బ్యాంకుల సేవలు పూర్తిగా స్తంభించారుు. ఏటీఎం కేంద్రాలు కూడా పేలవమైన సేవలు అం దిస్తుండడంతో ఖాతాదారులు అవస్థలు వర్ణనాతీతంగా మారారుు. ఏటీఎంలలో నగదు నిమిషాల వ్యవధిలో ఖాళీ అవుతోంది. దీంతో ఏటీఎం ముందు బారులు తీరిన ఖాతాదారులందరికీ నగదు అందక ఇబ్బందులు పడాల్సివస్తోంది. ఆర్బీఐ నుంచి జిల్లా అవసరాలకు తగ్గట్టుగా నగ దు బదిలీ కాకపోవడంతో జిల్లా యంత్రాంగం తలలు పట్టుకుంటోంది. వేతన జీవులు, పింఛ న్‌దారులు, సామాన్య ఖాతాదారులకు నగదు కష్టాలు తీరాలంటే జిల్లాలకు రూ. 1800 కోట్లు అవసరమని పది రోజుల కిందట ఆర్బీఐకి జిల్లా యంత్రాంగం విన్నవించింది.
అరుుతే ఆర్బీఐ నుంచి స్పందన కరువైంది. గడిచిన పది రోజుల్లో ఆర్బీఐ నుంచి జిల్లాకు చేరింది కేవలం రూ.400 కోట్లు మాత్రమే. ప్రభుత్వ ఉద్యోగులకు విత్‌డ్రాను కేంద్రం రూ.10వేలకు పరిమి తం చేసింది. దీంతో వేతన జీవుల వెతలు వర్ణనాతీతంగా మారారుు. కనీసం ఫించనుదారులకు భృతి అందక అవస్థలు పడుతూనే ఉన్నారు. ఉదయం ఆరు గంటలకు బ్యాంకుల వద్దకు చేరుకుంటున్న ఫింఛన్‌దారులకు నో క్యాష్ అంటూ సమాధానం వస్తుండడంతో అవస్థలు పడుతున్నారు.
42 లక్షల ఖాతాలు
జిల్లా వ్యాప్తంగా 593 బ్యాంకు శాఖల్లో 42 లక్షల మంది ఖాతాదారులు ఉన్నా రు. ఇందులో సామాన్య, పింఛన్, ఉపాధి హామీ పథకం, జన్‌థన్ ఇలా అనేక విభాగాల వారీగా ఖాతాదారులు ఉన్నారు. 42 లక్షల ఖాతాదారుల్లో 75 శాతంపైగా ఖాతాల్లో లావాదేవీలు జరుగుతున్నారుు. ఇంత మంది ఖాతాదారులకు బ్యాంకు శాఖలు సేవలందించాలంటే ఆర్బీఐ అధిక మొత్తంలో నగదును జిల్లాకు బదిలీ చేయాల్సి ఉంది. అరుుతే ఆర్బీఐ అరకొర నగదును విదులుస్తుండడంతో సామాన్య ప్రజ లకు కరెన్సీ కష్టాలు తప్పడం లేదు.
మార్కెట్‌కు భారీ నష్టం
కేంద్రం గత నెల 8న పెద్ద నోట్ల రద్దు ప్రకటన వెలువరించింది. ఈ నెల రోజుల కాలంలో కూరగాయలు మొదలు కార్ల షోరూం వరకు అన్ని రంగాలు నష్టాలను చవిచూశారుు. జిల్లాలో కూరగాయల మార్కెట్ రంగానికి నెల రోజుల్లో రూ.30 కోట్ల మేర నష్టం వాటిల్లింది. బంగారం వ్యాపారం సంక్షోభంలో కూరుకుపోరుుంది. ద్విచక్రవాహనాలు, కార్ల కొనుగోళ్లు స్తంభించారుు. ఎలక్ట్రానిక్ రంగానికి నష్టాలు తప్పలేదు. ప్రతి రంగం నష్టాలను చవిచూడాల్సి వచ్చింది.
రూ.1,800 కోట్లు అవసరమని విన్నవించాం
జిల్లా అవసరాలరీత్యా యుద్ధప్రాతిపదికన రూ.1800 కోట్లు అవసరమని పది రోజుల కిందట ఆర్బీఐకి విన్నవించాం. ఇప్పటి వరకు రూ.400 కోట్లు మాత్రమే విడులయ్యారుు. పూర్తి స్థారుులో నగదు అందకపోవడం వల్ల బ్యాంకుల్లో నగదు కొరత నెలకుంది. ఆర్బీఐ నుంచి అధిక మొత్తంలో జిల్లాకు నగదు చేరితేనే బ్యాంకు లావాదేవీలు సమర్థవంతం జరగడానికి వీలవుతుంది. - రామ్మోహన్‌రావు, మేనేజర్, లీడ్ బ్యాంక్, చిత్తూరు