సాక్షి,హైదారబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping case)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మంగళవారం మాజీ అడిషినల్ ఎస్పీ మేకల తిరుపతన్న చంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ4గా ఉన్న తిరుపతన్నకు సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దీంతో పదినెలల తర్వాత తిరుపతన్న బెయిల్పై విడుదలయ్యారు. బెయిల్ పత్రాలు జైలు అధికారులకు అందించిన అనంతరం ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment