Tirupatanna
-
ఫోన్ టాపింగ్ కేసులో హైకోర్టును ఆశ్రయించిన భుజంగరావు
Updates..ఫోన్ టాపింగ్ కేసులో హైకోర్టును ఆశ్రయించిన భుజంగరావుమధ్యంతర బెయిల్ పొడిగించాలని కోరిన భుజంగరావుఇదివరకు భుజంగరావుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టుఈరోజు సాయంత్రంతో ముగిసిన మద్యంతర బెయిల్ గడువుదీంతో హైకోర్టును ఆశ్రయించిన అదనపు ఎస్పీ భుజంగరావుసోమవారం సాయంత్రం వరకు మధ్యంతర బెయిలు గడువును పొడిగించిన హైకోర్టువిచారణ సోమవారానికి వాయిదాహైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసినా టాస్క్‌ఫోర్స్ మాజీ డిసిపి రాధా కిషన్ రావుతదుపరి విచారణ సోమవారానికి వాయిదాఫోన్ టాపింగ్ కేసులో మాజీ ఎమ్మెల్యే లింగయ్య ముగిసిన విచారణఅడిషనల్ ఎస్పీ తిరుపతన్నతో మాట్లాడిన కాల్స్‌పైన విచారణ చేసిన పోలీసులుచినమర్ధి లింగయ్య, మాజీ ఎమ్మెల్యే :-పోలీసులు అడిగిన ప్రశ్నలకు తాను సమాధానం చెప్పానుతనకు తెలిసిన అధికారి కాబట్టి నేను గతంలో అడిషనల్ ఎస్పీ తిరుపతన్న తో మాట్లాడనుమదన్ రెడ్డి, రాజ్ కుమార్ ఫోన్ నంబర్లు తిరుపతన్న అడిగాడువారి ఇద్దరు ఫోన్ నంబర్స్ మా అనుచరు తో తీసుకొని అడిషనల్ ఎస్పీ తిరుపత కి ఇచ్చానుఈ నంబర్స్ ఎందుకు ఆడిగావ్ అని తిరుపతన్నను ప్రశ్నించాను.మునుగోడు ఎన్నికల సమయంలో ప్రచారం ఎలా జరుగుతుందని నన్ను తిరుపతన్న అడిగాడు.ప్రచారం బాగా జరుగుతుందని నేను ఫోన్లో మాట్లాడానువేముల వీరేశం అనుచరులు ఫోన్ టాప్ చేశాననేది అవాస్తవంమీడియాలో ఎక్స్పోజ్ అవ్వాలని ఉద్దేశంతో కొంతమంది నా పైన కామెంట్స్ చేస్తున్నారుఈ కేసులో ఎప్పుడు విచారానికి పిలిచినా నేను పోలీసులకు సహకరిస్తానుఈ కేసుకు నాకు ఎలాంటి సంబంధం లేదు.తిరుపతన్నతో మాట్లాడిన కాల్ లిస్ట్ ఆధారంగానే నన్ను ప్రశ్నించారు.పోలీసుల దగ్గర ఏదో ఆధారం ఉంది కాబట్టే నన్ను విచారించారని నేను భావిస్తున్నా.నా స్టేట్మెంట్ ను వీడియో రికార్డ్ చేశారు.ఎప్పుడు విచారణకు పిలిచిన వస్తాను. పోలీసులకు సహకరిస్తాను 👉 జూబ్లీహిల్స్ పీఎస్‌కు చిరుమర్తి లింగయ్య చేరుకున్నారు. 👉ఫోన్ ట్యాపింగ్ కేసులో లింగయ్య విచారణకు హాజరయ్యారు. 👉జూబ్లీహిల్స్ పీఎస్‌లో మిర్యాలగూడ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు. 👉ఈ సందర్బంగా భాస్కర్ మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్‌కు నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను నా పర్సనల్ పని మీద వచ్చానని చెప్పారు. అనంతరం, పీఎస్ నుంచి వెళ్లిపోయారు.👉ఫోన్ ట్యాపింగ్ కేసులో తొలిసారిగా ఓ రాజకీయ నేత విచారణకు హాజరు కావడం ఇదే ప్రథమం. 👉చిరుమర్తి లింగయ్య తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నాకు నోటీసులు ఇచ్చారు. ఈనెల తొమ్మిదో తేదీన నాకు నోటీసులు అందాయి. నేడు విచారణకు హాజరవుతున్నాను. ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడటానికి నేనేమీ అధికారిని కాదు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నందుకు నాకు నోటీసులు ఇచ్చారు. విచారణ అధికారి అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తాను. 👉తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాజకీయంగా మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నేడు పోలీసుల విచారణకు హాజరు కానున్నారు. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో అప్పటి బీఆర్ఎస్ అభ్యర్థి పోలీసుల ద్వారా డబ్బులు పంపిణీ చేశారనే ఆరోపణలు ఉన్నాయి.👉ఫోన్ ట్యాపింగ్ కేసులో పొలిటికల్ లింక్‌లు బయటపడుతున్నాయి. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నేడు పోలీసు విచారణకు హాజరుకానున్నారు. కాగా, మునుగోడు ఉప ఎన్నికల సమయంలో జరిగిన పరిణామాలపై పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. ఉప ఎన్నికల సమయంలో అప్పటి బీఆర్ఎస్ అభ్యర్థి.. పోలీసులతో డబ్బులు పంపిణీ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. డబ్బుల తరలింపులో కూడా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు కీలకంగా వ్యవహరించినట్టు తెలుస్తోంది.👉ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు.. ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్‌కు చెందిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. మరోవైపు.. వరంగల్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేతకు త్వరలో నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్దమైనట్టు సమాచారం. అయితే, తిరుపతన్న ఫోన్ డేటా రిట్రీవ్తో కీలక ఆధారాలు లభించినట్టు పోలీసులు చెబుతున్నారు. ఫోన్ సీడీఆర్ ఆధారంగా చేసుకునే బీఆర్ఎస్ నేతలకు నోటీసులు ఇస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు.👉ఇక, అంతకుముందు.. చిరుమర్తి లింగయ్యకు ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరు కావాలని నోటీసులు అందిన విషయం తెలిసిందే. నవంబర్11న జూబ్లీహిల్స్ ఏసీపీ ఎదుట విచారణకు హాజరు కావాలని సిట్ అధికారులు ఆదేశించారు. అయితే.. ఆ సమయంలో అనారోగ్య కారణంగా విచారణకు రాలేనని పోలీసులకు తెలిపారు. నేడు (నవంబర్ 14) విచారణకు హాజరవుతాని చిరుమర్తి లింగయ్య కోరాడు. ఈమేరకు గురువారం ఫోన్ ట్యాపింగ్ కేసులో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే విచారణకు హాజరు కానున్నారు. ఇది కూడా చదవండి: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో చిక్కిన ఏసీపీ.. పోలీసులతో వాగ్వాదం! -
ఆయన చేసిన నేరం ఏంటి?
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో రిమాండ్‌లో ఉన్న ఏఎస్పీ మేకల తిరుపతన్న బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తిరుపతన్న దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను గురువారం జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్‌ల ధర్మాసనం విచారించింది. పిటిషనర్ తరఫున మోహిత్ రావు వాదనలు వినిపిస్తూ... ఫోన్ ట్యాపింగ్ కేసులో తిరుపతన్న, భూపాలపల్లి ఏఎస్పీ భుజంగరావులు గత మార్చి 23న అరెస్టు అయ్యారని చెప్పారు. తిరుపతన్న 211 రోజులుగా జైల్లోనే ఉన్నారని తెలిపారు. చార్జ్ïÙట్ను దాఖలు చేశారని, ఇది దాఖలు చేసి కూడా మూడు నెలలవుతోందని వివరించారు. ట్రయల్ కోర్టు, హైకోర్టులను ఆశ్రయించగా... బెయిల్ పిటిషన్లను కొట్టివేసినట్లు చెప్పారు.ఈ సందర్భంగా ధర్మాసనం జోక్యం చేసుకొని... 211 రోజులుగా నిందితుడు జైల్లో ఎందుకున్నారని, ఆయన చేసిన నేరం ఏంటని న్యాయవాదిని ప్రశ్నించింది. ఇందుకు మోహిత్ రావు సమాధానమిస్తూ.... ‘ఎస్ఐబీ వింగ్ అనేది నా కంట్రోల్లో నడుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ చేయడం, ప్రొఫైల్ తయారు చేయడం, ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ప్రభుత్వానికి తెలియజేయడం అధికారిగా నా విధి’అని తెలిపారు. రాష్ట్ర శాంతిభద్రతలను కాపాడేందుకు మాత్రమే ఫోన్ ట్యాపింగ్ చేశారని, చట్టవిరుద్ధంగా చేయలేదని విన్నవించారు. ఈ వాదనలపై మరోసారి న్యాయస్థానం జోక్యం చేసుకొని... ‘‘ఇందులో నేరం ఏంటో మాకు అర్థం కావడం లేదు’అని అభిప్రాయపడింది. అయితే ప్రభుత్వ వాదనలు సైతం వినాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. అనంతరం కౌంటర్ దాఖలుచేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నవంబర్ 27కు వాయిదా వేసింది. -
ట్యాపింగ్ కేసులో ఇద్దరు నిందితులను కస్టడీ కోరిన పోలీసులు
-
ఫోన్ ట్యాపింగ్ కేసు: ఇద్దరు అదనపు ఎస్పీలకు రిమాండ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు, అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలకు నాంపల్లి కోర్టు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించించారు. ఇదిలా ఉండగా.. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇద్దరు అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలకు శనివారం అర్ధరాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం, ఈరోజు ఉదయమే వారిద్దరికి గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరిచారు. ఈ క్రమంలో వీరికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో, పంజాగుట్ట పోలీసులు వీరిని చంచల్గూడా జైలుకు తరలిస్తున్నారు. ఇక, విచ్చలవిడిగా ఫోన్‌ట్యాపింగ్‌లకు పాల్పడిన వ్యవహారంలో ప్రణీత్‌తోపాటు వీరిద్దరి పాత్రను గుర్తించిన దర్యాప్తు అధికారులు వారిని అరెస్ట్ చేశారు. రాజకీయ ప్రముఖుల, వ్యాపారుల ఫోన్లను ట్యాప్ చేయడంలో వీరిద్దరి ప్రమేయం గురించి కీలకాధారాలను సేకరించే పనిలో దర్యాప్తు బృందం నిమగ్నమైంది. భుజంగరావు ఎన్నికల ముందు వరకు పొలిటికల్ ఇంటెలిజెన్స్ విభాగంలో, తిరుపతన్న ఎస్ఐబీలో అదనపు ఎస్పీగా విధులు నిర్వర్తించారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు, హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు, ఓ మీడియా సంస్థ నిర్వాహకుడు శ్రవణ్ రావుకు పాత్ర ఉన్నట్లు గుర్తించారు. ఈ ముగ్గురూ ఇప్పటికే దేశం దాటినట్లు వెల్లడి కావడంతో లుక్అవుట్ సర్క్యులర్ జారీ చేశారు. ప్రభాకర్ రావు అమెరికా, రాధాకిషన్ లండన్, శ్రవణ్‌రావు నైజిరియాలో ఉన్నట్టు సమాచారం. వీరితో పాటే విచారణకు రావాలని గతంలో ఎస్ఐబీలో పనిచేసిన తొమ్మిది మందికి నోటీసులిచ్చారు. ప్రణీత్‌రావు ఫోన్‌ట్యాపింగ్ సొంత నిర్ణయంతో జరిగింది కాదని.. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన కొందరు నేతల కారణంగా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు సిట్ బృందం భావిస్తోంది. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం: ఇద్దరు అదనపు ఎస్పీలు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసులో భూపాలపల్లి అదనపు ఎస్పీ భుజంగరావు, హైదరాబాద్ నగర భద్రత విభాగం అదనపు డీసీపీ తిరుపతన్నను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. శనివారం అర్ధరాత్రి సమయంలో పోలీసులు వీరిని అరెస్ట్ చేశారు. వివరాల ప్రకారం.. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్ఐబీ) డీఎస్పీగా పనిచేసి సస్పెండైన దుగ్యాల ప్రణీత్‌రావు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. కాగా, తాజాగా ఈ కేసులో ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం రాత్రే వీరి ఇళ్లకు వెళ్లిన పోలీసులు.. సోదాలు నిర్వహించారు. శనివారం ఉదయం వీరిద్దరినీ బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు పిలిచి సుదీర్ఘంగా విచారించారు. అనంతరం రాత్రి సమయంలో అరెస్టు చేశారు. ఇక, విచ్చలవిడిగా ఫోన్‌ట్యాపింగ్‌లకు పాల్పడిన వ్యవహారంలో ప్రణీత్‌తోపాటు వీరిద్దరి పాత్రను గుర్తించిన దర్యాప్తు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజకీయ ప్రముఖుల, వ్యాపారుల ఫోన్లను ట్యాప్ చేయడంలో వీరిద్దరి ప్రమేయం గురించి కీలకాధారాలను సేకరించే పనిలో దర్యాప్తు బృందం నిమగ్నమైంది. భుజంగరావు ఎన్నికల ముందు వరకు పొలిటికల్ ఇంటెలిజెన్స్ విభాగంలో, తిరుపతన్న ఎస్ఐబీలో అదనపు ఎస్పీగా విధులు నిర్వర్తించారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు, హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు, ఓ మీడియా సంస్థ నిర్వాహకుడి పాత్ర ఉన్నట్లు గుర్తించారు. ఈ ముగ్గురూ ఇప్పటికే దేశం దాటినట్లు వెల్లడి కావడంతో లుక్అవుట్ సర్క్యులర్ జారీ చేశారు. విచారణకు రావాలని గతంలో ఎస్ఐబీలో పనిచేసిన తొమ్మిది మందికి నోటీసులిచ్చారు. ప్రణీత్‌రావు ఫోన్‌ట్యాపింగ్ సొంత నిర్ణయంతో జరిగింది కాదని.. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన కొందరు నేతల కారణంగా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు సిట్ బృందం భావిస్తోంది. ఫోన్లతో మొదలుపెట్టి.. నిఘా విభాగాలు జాతీయ భద్రతతోపాటు రాజద్రోహం తదితర అంశాలపైనా కన్నేసి ఉంచడానికి ట్యాపింగ్ చేస్తుంటాయి. అలా నిఘా అధికారులు చేసిన ఫోన్ ట్యాపింగ్ కారణంగానే 2015 నాటి ‘ఓటుకు కోట్లు’ వ్యవహారం వెలుగు లోకి వచ్చినట్టు సమాచారం. అయితే ప్రభాకర్ రావు ఎస్ఐబీ చీఫ్‌గా మారిన తర్వాత ట్యాపింగ్ దుర్వినియోగం కావడం మొదలైంది. తొలినాళ్లలో ఈ విభాగం నిబంధనల ప్రకారమే అవసర మైన ఫోన్లను ట్యాప్ చేసింది. ఉప ఎన్నికల వేళ ట్యాపింగ్.. దీనివల్ల జరుగుతున్న లాభాలు తెలిసిన రాజకీయ నాయకులు వీలైనన్ని నంబర్లను అక్రమంగా ట్యాప్ చేసేలా ప్రేరేపించారు. దీనికోసం విదేశాల నుంచి పరికరాలు, సాఫ్ట్వేర్లు అక్రమంగా దిగుమతి అయ్యాయి. 2018 ఎన్నికల నాటి నుంచి వీరి ట్యాపింగ్ పంథా మారిపోయింది. దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో ఫోన్లతోపాటు సోషల్ మీడియాను ట్యాప్ చేయడం మొద లెట్టారు. దీనికోసం టెక్నా లజీ కన్సల్టెంట్ రవి పాల్ సహకారంతో ఇజ్రాయిల్ నుంచి పెగాసిస్ తరహా సాఫ్ట్వేర్ తెప్పించుకుని విని యోగించినట్టు సమాచారం. ‘ట్యాపింగ్’ ఆధారంగా వసూళ్లు! కొన్నాళ్లుగా ప్రభాకర్‌రావుతోపాటు మరో ఇద్దరు ఉన్నతాధికారులు, ఓ రాజకీయ నాయకుడు కలసి బెదిరింపుల దందాకు దిగారు. కొందరు ప్రైవేట్ వ్యక్తులు, వ్యాపారులు, బిల్డర్లు, ఇన్ఫ్రా కంపెనీల యజమానుల ఫోన్లను ట్యాప్ చేశారు. దీనికోసం హైదరాబాద్‌లోని పర్వతగిరి, వరంగల్, సిరిసిల్లలోనూ వార్ రూమ్‌లు ఏర్పాటు చేసుకున్నారు. ప్రణీత్‌రావు, ఎస్ఐబీ, ఇంటెలిజెన్స్‌లలో పనిచేసిన ఇద్దరు అధికారులు, మరికొందరు బృందంతో కలసి ఆ ట్యాపింగ్స్‌లోని అంశాలను విశ్లేషించేవారు. కీలక అంశాలను పట్టుకుని.. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లకు చెందిన ప్రత్యేక విభాగాల్లో పనిచేసే కొందరి దృష్టికి తీసుకువెళ్లేవారు. వారు సదరు రాజకీయ నాయకుడితోపాటు ప్రభాకర్‌రావు నుంచి క్లియరెన్స్ తీసుకుని.. సదరు టార్గెట్ల నుంచి వీలైనంత వరకు వసూళ్లు చేసేవారు. అప్పట్లో ఈ మూడు ప్రత్యేక విభాగాలకు నేతృత్వం వహించిన అధికారులు.. నాటి ప్రభుత్వంతోపాటు ప్రభాకర్‌రావుతోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నవారేనని సమాచారం. కొన్ని వసూళ్ల వ్యవహారాలను ఓ ఎంపీ, ఎమ్మెల్సీ సూచనలతోనూ కొనసాగించినట్టు సమాచారం. -
మీసం మెలేస్తే..!
ఆయన మీసం మెలేస్తే...! సగటు మనిషికి ఓ భరోసా... సంఘ విద్రోహులకు భయం.. పోలీసు పౌరుషానికి ప్రతీక. పని చేసిన ప్రతి చోటా ఆయన పేరు ఓ ఫైర్ బ్రాండ్. జిల్లాను కలవర పెడుతున్న రోడ్డు ప్రమాదాలు, యువత ఆత్మహత్యల నివారణకు ఆయన చర్యలు తీసుకుంటున్నారు. ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకుని పోలీసు కళాజాత బృందాలతో కలిసి ప్రజల్లోకి వెళ్తామంటున్నారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణలోనైనా, ఆత్మహత్యల నివారణలో అయినా ప్రజా చైతన్యమే కీలకమంటున్న సంగారెడ్డి డీఎస్పీ తిరుపతన్న ‘సాక్షి’తో మాట్లాడారు. ఫైర్ బ్రాండ్‌గా సంగారెడ్డి డీఎస్పీ ⇒ తాగి బండి నడిపితే జైలుకే.. ⇒ రోడ్డు ప్రమాదాల నియంత్రణలో ప్రజా చైతన్యమే కీలకం ⇒ ‘సాక్షి’ ఇంటర్వ్యూలో తిరుపతన్న సాక్షి ప్రతినిధి,సంగారెడ్డి: జిల్లాలో రోడ్డు ప్రమాదాలు ఎక్కుగానే ఉన్నాయి. జిల్లాలో రెండు ప్రధాన రహదారులు ఉన్నాయి. 67 నంబర్ ముంబయి జాతీయ రహదారిపై మొత్తం ఏడు యాక్సిడెంట్ స్పాట్లను గుర్తించాం. పెద్దాపూర్, కంకోల్, బుదేరా చౌరస్తా, హుగ్గెల్లి, గంగ్వార్, చిరాగ్పల్లి చౌరస్తా, మల్కాపూర్‌ల వద్ద ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక్కడ హెచ్చరిక బోర్డులు పెట్టాం. కేవలం ట్రాఫిక్ నియంత్రణ కోసమే రాత్రి వేళలో ఒక మొబైల్ పార్టీతో జాతీయ రహదారి మీద పెట్రోలింగ్ చేస్తున్నాం. సెల్‌ఫోన్ డ్రైవింగ్, డ్రంగ్ అండ్ డ్రైవింగ్‌తోనే 90 శాతం ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాల్లో మృత్యువాత పడుతున్న వారిలో ఎక్కువ మంది యువతే ఉండడం ఆందోళన కలిగిస్తోంది. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా కళాశాలలు, పాఠశాలల్లో చైతన్య సదస్సులు ఏర్పాటు చేస్తున్నాం. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు అవసరమైనంత స్వేచ్ఛ ఇస్తూనే... వారిని ఒక కంట కనిపెట్టాలి. ఎప్పటికప్పుడు వారిని హెచ్చరిస్తే ప్రమాదాలు తప్పకుండా తగ్గుతాయి. ప్రస్తుతానికి హెల్మెట్ పెట్టుకోకపోతే రూ.500 అధిక స్పీడ్‌కు రూ.1000, ట్రిపుల్ రైడ్‌కు రూ.500 జరిమానా విధిస్తున్నాం. తాగి బండినడిపితే మాత్రం కేసు పెట్టి కోర్డుకు పంపుతున్నాం. తాగి బండి నడిపిన వారు జైలుకు వెళ్లాల్సిందే. ఇవన్నీ రోడ్డు ప్రమాదాల నియంత్రణలో ఒక భాగం మాత్రమే. వీటి ద్వారా 100 శాతం ఫలితాలు సాధించలేము. ప్రజలే చైతన్య వంతులు కావాలి. ఎవరికి వారుగా స్వయం నియంత్రణ పాటిస్తే ప్రమాదాలు తగ్గుతాయి. కళాజాతతో ప్రజల్లోకి వెళ్తాం... జిల్లాలో ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎఫ్ఐఆర్ రికార్డు పరంగా చూసుకుంటే కుటుంబ కలహాలు, అప్పుల బాధతో జరుగుతున్న ఆత్మహత్యలే ఎక్కువగా ఉంటున్నాయి. అన్ని కూడా క్షణిక ఆవేశంలో లిప్తకాలంలో జరిగిపోతున్న అనర్థాలే. ఒక్క క్షణం మనం వాళ్లను ఆపగలిగితే వాళ్లు జీవితకాలం బతికిపోతారు. ఆత్మహత్యలను నివారించేందుకు ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తోంది. పోలీసుశాఖ పరంగా మేం కూడా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టబోతున్నాం. గతంలో ఉన్న పోలీసు కళాజాతను మళ్లీ పునరుద్ధరించే ప్రయత్నంలో ఉన్నాం. గ్రామాల్లో కళాజాత బృందాలను తిప్పుతాం. ఆత్మహత్యల సమస్య తీవ్రంగా ఉన్న ప్రాంతాలను ఇప్పటికే గుర్తించాం. అక్కడ సంచార కౌన్సిలింగ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేసే ఆలోచనతో ఉన్నాం. గ్యాంగ్ లీడర్‌ను పట్టుకుంటాం.. మీడియా ముందు ప్రవేశపెట్టలేదు గానీ, ముత్తూట్ ఫైనాన్స్ దొంగలను భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులోని మాల్ధా అనే ప్రాంతంతో పట్టుకున్నాం. ఇదో ఇంటర్నేషనల్ గ్యాంగ్. ఈ ముఠా నాయకుడు ఖాట్మాండ్లో ఉన్నట్లు గుర్తించాం. మాల్ధాలో ఖమ్రుద్దీన్, రాజులషేక్ అనే ఇద్దరు కీలక వ్యక్తులను పట్టుకున్నాం. వారి నుంచి 7.5 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నాం. కేసు దర్యాప్తు రీత్యా పురోగతి వివరాలు చెప్పలేను, కానీ త్వరలోనే కీలక వ్యక్తిని అరెస్టు చేసి కనీసం 20 కిలోల బంగారం రికవరీ చూపిస్తాం. ప్రతి బ్యాంకుకు సాయుధ గార్డులను అనుమతిస్తున్నాం. కచ్చితంగా సాయుధ గార్డులను పెట్టుకోవాలని ఇప్పటికే బ్యాంకులకు నోటీసులు పంపించాం. గ్రామీణ ప్రాంతంలో ఉన్న బ్యాంకుల రక్షణ కోసం ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేస్తున్నాం. రాత్రివేళల్లో కనీసం ఒకటి, రెండు సార్లైనా పోలీసు పార్టీ ఆయా బ్యాంకులను పరిశీలించి రావాలి. అయితే మారుమూల ప్రాంతంలో ఉండే బ్యాంకులు ఒక రోజు లావాదేవీలకు మించి డబ్బు ఉంచుకోవద్దని కోరాం. ఎక్కువ మొత్తంలో డబ్బు ఉంటే సురక్షితమైన బ్రాంచ్‌లోనే దాచుకోవాలని కోరాం. చోరీల నివారణ కోసం విజువల్ పోలీసింగ్ పద్ధతిని అమలు చేస్తున్నాం. సాయంత్రం 5 నుంచి రాత్రి 7 వరకు పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తారు. ఇలా చేయడం వలన దొంగలకు భయం ఉంటుంది. భూ పంచాయితీల్లో పోలీసులు తలదూర్చరు.. డీఎస్పీ: భూ తగాదాల విషయంలో పోలీసులు తలదూర్చరు. అది మా పరిధి కూడా కాదు. మా దగ్గరికి ఎవరు వచ్చినా కోర్టులోనే తేల్చుకొమ్మని పంపిస్తున్నాం. అయితే క్లియర్ టైటిల్ ఉండి, భూమిని అనుభవిస్తున్న వారిని బెదిరించి, దురాక్రమణ చేస్తే అది క్రిమినల్ కేసు అవుతుంది. అప్పు కచ్చితంగా మేం వాళ్ల మీద కేసులు పెడుతున్నాం. కోర్టుకు పంపుతున్నాం. ఇలాంటివి నెలలో కనీసం కనీసం 8 నుంచి 10 కేసులు మా దగ్గరకు వస్తున్నాయి.