ప్రభుత్వ వాదనలు వినాలన్న సుప్రీంకోర్టు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏఎస్పీ తిరుపతన్న బెయిల్ పిటిషన్
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో రిమాండ్‌లో ఉన్న ఏఎస్పీ మేకల తిరుపతన్న బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తిరుపతన్న దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను గురువారం జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్‌ల ధర్మాసనం విచారించింది. పిటిషనర్ తరఫున మోహిత్ రావు వాదనలు వినిపిస్తూ... ఫోన్ ట్యాపింగ్ కేసులో తిరుపతన్న, భూపాలపల్లి ఏఎస్పీ భుజంగరావులు గత మార్చి 23న అరెస్టు అయ్యారని చెప్పారు. తిరుపతన్న 211 రోజులుగా జైల్లోనే ఉన్నారని తెలిపారు. చార్జ్ïÙట్‌ను దాఖలు చేశారని, ఇది దాఖలు చేసి కూడా మూడు నెలలవుతోందని వివరించారు. ట్రయల్ కోర్టు, హైకోర్టులను ఆశ్రయించగా... బెయిల్ పిటిషన్లను కొట్టివేసినట్లు చెప్పారు.
ఈ సందర్భంగా ధర్మాసనం జోక్యం చేసుకొని... 211 రోజులుగా నిందితుడు జైల్లో ఎందుకున్నారని, ఆయన చేసిన నేరం ఏంటని న్యాయవాదిని ప్రశ్నించింది. ఇందుకు మోహిత్ రావు సమాధానమిస్తూ.... ‘ఎస్‌ఐబీ వింగ్ అనేది నా కంట్రోల్‌లో నడుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ చేయడం, ప్రొఫైల్ తయారు చేయడం, ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ప్రభుత్వానికి తెలియజేయడం అధికారిగా నా విధి’అని తెలిపారు. రాష్ట్ర శాంతిభద్రతలను కాపాడేందుకు మాత్రమే ఫోన్ ట్యాపింగ్ చేశారని, చట్టవిరుద్ధంగా చేయలేదని విన్నవించారు. ఈ వాదనలపై మరోసారి న్యాయస్థానం జోక్యం చేసుకొని... ‘‘ఇందులో నేరం ఏంటో మాకు అర్థం కావడం లేదు’అని అభిప్రాయపడింది. అయితే ప్రభుత్వ వాదనలు సైతం వినాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. అనంతరం కౌంటర్ దాఖలుచేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నవంబర్ 27కు వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment