సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాజకీయంగా మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నేడు పోలీసుల విచారణకు హాజరు కానున్నారు. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో అప్పటి బీఆర్‌ఎస్ అభ్యర్థి పోలీసుల ద్వారా డబ్బులు పంపిణీ చేశారనే ఆరోపణలు ఉన్నాయి.
ఫోన్ ట్యాపింగ్ కేసులో పొలిటికల్ లింక్‌లు బయటపడుతున్నాయి. ఈ క్రమంలోనే బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నేడు పోలీసు విచారణకు హాజరుకానున్నారు. కాగా, మునుగోడు ఉప ఎన్నికల సమయంలో జరిగిన పరిణామాలపై పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. ఉప ఎన్నికల సమయంలో అప్పటి బీఆర్‌ఎస్ అభ్యర్థి.. పోలీసులతో డబ్బులు పంపిణీ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. డబ్బుల తరలింపులో కూడా బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యేలు కీలకంగా వ్యవహరించినట్టు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు.. ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్‌కు చెందిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. మరోవైపు.. వరంగల్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేతకు త్వరలో నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్దమైనట్టు సమాచారం. అయితే, తిరుపతన్న ఫోన్ డేటా రిట్రీవ్‌తో కీలక ఆధారాలు లభించినట్టు పోలీసులు చెబుతున్నారు. ఫోన్ సీడీఆర్ ఆధారంగా చేసుకునే బీఆర్‌ఎస్ నేతలకు నోటీసులు ఇస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు.
ఇక, అంతకుముందు.. చిరుమర్తి లింగయ్యకు ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరు కావాలని నోటీసులు అందిన విషయం తెలిసిందే. నవంబర్11న జూబ్లీహిల్స్ ఏసీపీ ఎదుట విచారణకు హాజరు కావాలని సిట్ అధికారులు ఆదేశించారు. అయితే.. ఆ సమయంలో అనారోగ్య కారణంగా విచారణకు రాలేనని పోలీసులకు తెలిపారు. నేడు (నవంబర్ 14) విచారణకు హాజరవుతాని చిరుమర్తి లింగయ్య కోరాడు. ఈమేరకు గురువారం ఫోన్ ట్యాపింగ్ కేసులో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే విచారణకు హాజరు కానున్నారు.
ఇది కూడా చదవండి: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో చిక్కిన ఏసీపీ.. పోలీసులతో వాగ్వాదం!
Comments
Please login to add a commentAdd a comment