Chirumarthi Lingaiah
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు విచారణకు చిరుమర్తి లింగయ్య
-
ఫోన్ టాపింగ్ కేసులో హైకోర్టును ఆశ్రయించిన భుజంగరావు
Updates..ఫోన్ టాపింగ్ కేసులో హైకోర్టును ఆశ్రయించిన భుజంగరావుమధ్యంతర బెయిల్ పొడిగించాలని కోరిన భుజంగరావుఇదివరకు భుజంగరావుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టుఈరోజు సాయంత్రంతో ముగిసిన మద్యంతర బెయిల్ గడువుదీంతో హైకోర్టును ఆశ్రయించిన అదనపు ఎస్పీ భుజంగరావుసోమవారం సాయంత్రం వరకు మధ్యంతర బెయిలు గడువును పొడిగించిన హైకోర్టువిచారణ సోమవారానికి వాయిదాహైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసినా టాస్క్‌ఫోర్స్ మాజీ డిసిపి రాధా కిషన్ రావుతదుపరి విచారణ సోమవారానికి వాయిదాఫోన్ టాపింగ్ కేసులో మాజీ ఎమ్మెల్యే లింగయ్య ముగిసిన విచారణఅడిషనల్ ఎస్పీ తిరుపతన్నతో మాట్లాడిన కాల్స్‌పైన విచారణ చేసిన పోలీసులుచినమర్ధి లింగయ్య, మాజీ ఎమ్మెల్యే :-పోలీసులు అడిగిన ప్రశ్నలకు తాను సమాధానం చెప్పానుతనకు తెలిసిన అధికారి కాబట్టి నేను గతంలో అడిషనల్ ఎస్పీ తిరుపతన్న తో మాట్లాడనుమదన్ రెడ్డి, రాజ్ కుమార్ ఫోన్ నంబర్లు తిరుపతన్న అడిగాడువారి ఇద్దరు ఫోన్ నంబర్స్ మా అనుచరు తో తీసుకొని అడిషనల్ ఎస్పీ తిరుపత కి ఇచ్చానుఈ నంబర్స్ ఎందుకు ఆడిగావ్ అని తిరుపతన్నను ప్రశ్నించాను.మునుగోడు ఎన్నికల సమయంలో ప్రచారం ఎలా జరుగుతుందని నన్ను తిరుపతన్న అడిగాడు.ప్రచారం బాగా జరుగుతుందని నేను ఫోన్లో మాట్లాడానువేముల వీరేశం అనుచరులు ఫోన్ టాప్ చేశాననేది అవాస్తవంమీడియాలో ఎక్స్పోజ్ అవ్వాలని ఉద్దేశంతో కొంతమంది నా పైన కామెంట్స్ చేస్తున్నారుఈ కేసులో ఎప్పుడు విచారానికి పిలిచినా నేను పోలీసులకు సహకరిస్తానుఈ కేసుకు నాకు ఎలాంటి సంబంధం లేదు.తిరుపతన్నతో మాట్లాడిన కాల్ లిస్ట్ ఆధారంగానే నన్ను ప్రశ్నించారు.పోలీసుల దగ్గర ఏదో ఆధారం ఉంది కాబట్టే నన్ను విచారించారని నేను భావిస్తున్నా.నా స్టేట్మెంట్ ను వీడియో రికార్డ్ చేశారు.ఎప్పుడు విచారణకు పిలిచిన వస్తాను. పోలీసులకు సహకరిస్తాను 👉 జూబ్లీహిల్స్ పీఎస్‌కు చిరుమర్తి లింగయ్య చేరుకున్నారు. 👉ఫోన్ ట్యాపింగ్ కేసులో లింగయ్య విచారణకు హాజరయ్యారు. 👉జూబ్లీహిల్స్ పీఎస్‌లో మిర్యాలగూడ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు. 👉ఈ సందర్బంగా భాస్కర్ మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్‌కు నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను నా పర్సనల్ పని మీద వచ్చానని చెప్పారు. అనంతరం, పీఎస్ నుంచి వెళ్లిపోయారు.👉ఫోన్ ట్యాపింగ్ కేసులో తొలిసారిగా ఓ రాజకీయ నేత విచారణకు హాజరు కావడం ఇదే ప్రథమం. 👉చిరుమర్తి లింగయ్య తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నాకు నోటీసులు ఇచ్చారు. ఈనెల తొమ్మిదో తేదీన నాకు నోటీసులు అందాయి. నేడు విచారణకు హాజరవుతున్నాను. ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడటానికి నేనేమీ అధికారిని కాదు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నందుకు నాకు నోటీసులు ఇచ్చారు. విచారణ అధికారి అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తాను. 👉తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాజకీయంగా మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నేడు పోలీసుల విచారణకు హాజరు కానున్నారు. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో అప్పటి బీఆర్ఎస్ అభ్యర్థి పోలీసుల ద్వారా డబ్బులు పంపిణీ చేశారనే ఆరోపణలు ఉన్నాయి.👉ఫోన్ ట్యాపింగ్ కేసులో పొలిటికల్ లింక్‌లు బయటపడుతున్నాయి. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నేడు పోలీసు విచారణకు హాజరుకానున్నారు. కాగా, మునుగోడు ఉప ఎన్నికల సమయంలో జరిగిన పరిణామాలపై పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. ఉప ఎన్నికల సమయంలో అప్పటి బీఆర్ఎస్ అభ్యర్థి.. పోలీసులతో డబ్బులు పంపిణీ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. డబ్బుల తరలింపులో కూడా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు కీలకంగా వ్యవహరించినట్టు తెలుస్తోంది.👉ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు.. ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్‌కు చెందిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. మరోవైపు.. వరంగల్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేతకు త్వరలో నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్దమైనట్టు సమాచారం. అయితే, తిరుపతన్న ఫోన్ డేటా రిట్రీవ్తో కీలక ఆధారాలు లభించినట్టు పోలీసులు చెబుతున్నారు. ఫోన్ సీడీఆర్ ఆధారంగా చేసుకునే బీఆర్ఎస్ నేతలకు నోటీసులు ఇస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు.👉ఇక, అంతకుముందు.. చిరుమర్తి లింగయ్యకు ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరు కావాలని నోటీసులు అందిన విషయం తెలిసిందే. నవంబర్11న జూబ్లీహిల్స్ ఏసీపీ ఎదుట విచారణకు హాజరు కావాలని సిట్ అధికారులు ఆదేశించారు. అయితే.. ఆ సమయంలో అనారోగ్య కారణంగా విచారణకు రాలేనని పోలీసులకు తెలిపారు. నేడు (నవంబర్ 14) విచారణకు హాజరవుతాని చిరుమర్తి లింగయ్య కోరాడు. ఈమేరకు గురువారం ఫోన్ ట్యాపింగ్ కేసులో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే విచారణకు హాజరు కానున్నారు. ఇది కూడా చదవండి: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో చిక్కిన ఏసీపీ.. పోలీసులతో వాగ్వాదం! -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాజకీయ మలుపు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు రాజకీయ నాయకుల వైపు మలుపు తిరిగింది. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత చిరుమర్తి లింగయ్యకు దర్యాప్తు అధికారులు నోటీసులు జారీ చేశారు. సోమవారం విచారణకు హాజరుకావాలని వారు కోరగా... మూడు రోజులు గడువు ఇవ్వాలంటూ దర్యాప్తు అధికారికి లింగయ్య సమాచారం పంపారు. దీంతో గురువారం (14వ తేదీ) హాజరుకావడానికి అనుమతి ఇచ్చారు. ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న కీలక నిందితుడు, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ అదనపు ఎస్పీ మేకల తిరుపతన్న తరచూ లింగయ్యతో సంప్రదింపులు జరిపినట్టు తేలడంతో.. అధికారులు నోటీసులు ఇచ్చినట్టు తెలిసింది. ఇప్పటివరకు పోలీసు అధికారుల చుట్టూనే.. ఈ ఏడాది మార్చిలో ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైనప్పటి నుంచీ మొత్తం పోలీసు అధికారుల చుట్టూనే తిరిగింది. డీఎస్పీ ప్రణీత్‌రావు, అదనపు ఎస్పీలు నాయిని భుజంగరావు, మేకల తిరుపతన్న, మాజీ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు అరెస్టు అయ్యారు. కీలక సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావుతోపాటు ఓ మీడియా చానల్ అధినేత శ్రవణ్‌కుమార్ అమెరికాలో ఉన్నారు. నిజానికి ఈ కేసులలో కొందరు రాజకీయ నాయకుల పేర్లు ప్రస్తావనకు వచ్చినా.. ఇప్పటివరకు ఎవరికీ నోటీసులిచ్చి విచారించలేదు. గతంలో ఓ ఎమ్మెల్సీపై లుకౌట్ సర్క్యులర్ (ఎల్ఓసీ) జారీ అయింది. అయితే తొలిసారిగా మాజీ ఎమ్మెల్యేను దర్యాప్తు అధికారులు విచారణకు పిలిచారు. నకిరేకల్ ఎమ్మెల్యేగా వ్యవహరించిన చిరుమర్తి లింగయ్య బీఆర్ఎస్ పారీ్టకి చెందినవారు కావడం గమనార్హం. ఫోన్ల నుంచి డేటాను వెలికితీసి.. ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు తర్వాత కొన్ని రోజులకు పోలీసు అధికారుల అరెస్టులు జరిగాయి. ఈ క్రమంలో నిందితులు తిరుపతన్న, మరికొందరు అధికారులు, మాజీ అధికారులు తమ ఫోన్లను మార్చేయడం, ఫార్మాట్ చేయడం వంటి చేశారు. అయితే పోలీసులు ప్రణీత్‌రావు, తిరుపతన్న, భుజంగరావు, రాధాకిషన్‌రావుల అరెస్టు తర్వాత వారి నుంచి సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని.. ఫార్మాట్ చేసిన, డిలీట్ చేసిన డేటాను వెలికితీయడానికి (రిట్రీవ్) ఆ ఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. ఇటీవలే ల్యాబ్ నుంచి నివేదికలు వచ్చాయి. నిందితుల ఫోన్ల నుంచి వెలికితీసిన డేటాను అధికారులు విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలో తిరుపతన్న ఫోన్ డేటాను విశ్లేషించగా.. ఆయనతో చిరుమర్తి లింగయ్య చేసిన సంప్రదింపులు బయటపడ్డాయి. 2022 అక్టోబర్ రెండో వారంలో జరిగిన మునుగోడు ఉప ఎన్నికతోపాటు గతేడాది డిసెంబర్లో జరిగిన సాధారణ ఎన్నికల సమయంలో.. వీరి మధ్య కీలక అంశాలకు సంబంధించి సమాచార మార్పిడి జరిగినట్లుగా గుర్తించినట్టు తెలిసింది. దీనితో సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు కేసు దర్యాప్తు అధికారిగా ఉన్న జూబ్లీహిల్స్ ఏసీపీ ఎదుట హాజరుకావాల్సిందిగా ఆదేశిస్తూ లింగయ్యకు నోటీసులు జారీ చేశారు. అనారోగ్య కారణాల నేపథ్యంలో విచారణకు హాజరుకావడానికి మూడు రోజుల సమయం ఇవ్వాలని లింగయ్య కోరగా.. గురువారం విచారణ రావాలని అధికారులు తెలిపారు. మరి కొందరు రాజకీయ నాయకులకూ..నిందితుల ఫోన్ల నుంచి వెలికితీసిన డేటా ఆధారంగా మరికొందరు రాజకీయ నాయకులకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో లింకు ఉందని దర్యాప్తు అధికారులు గుర్తించినట్టు సమాచారం. ఆ డేటా ఆధారంగా లింగయ్యను విచారించిన తర్వాత మరికొందరు నేతలకు నోటీసులు జారీ చేసి, విచారించడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది. ఎన్నికల సమయంలో ప్రత్యర్థుల ఫోన్లు ట్యాపింగ్, రాజకీయ పారీ్టకి చెందిన నగదు రవాణా అంశాలపైనే రాజకీయ నేతల్ని దర్యాప్తు అధికారులు ప్రశ్నించనున్నట్టు పోలీసు వర్గాలు చెప్తున్నాయి. -
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో BRS మాజీ ఎమ్మెల్యేకు నోటీసులు
-
ఫోన్ ట్యాపింగ్ కేసు: విచారణకు బీఆర్ఎస్ నేత గైర్హాజరు
హైదరాబాద్,సాక్షి: ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరిగింది. మొదటిసారిగా ఓ రాజకీయ నాయకుడిని పోలీసులు విచారణకు పిలిచారు. తమ ఎదుట హాజరుకావాలంటూ బీఆర్ఎస్ పార్టీ నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు సమన్లు జారీ చేశారు. అయితే సోమవారం(నవంబర్ 11) లింగయ్య ఈ కేసులో విచారణకు హాజరు కావాల్సి ఉండగా ఆయన రాలేదు. అనారోగ్య కారణాల వల్ల రాలేకపోయానని పోలీసులకు కబురందించారు. ఈ నెల 14వ తేదీన విచారణకు హాజరవుతానని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు చేస్తున్న బృందం.. జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయం కేంద్రంగా తమ విచారణ కొనసాగిస్తోంది. ఈ క్రమంలో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు సమన్లు జారీ చేసింది. ఇప్పటిదాకా కేవలం పోలీస్ అధికారులు(మాజీ)లనే విచారణ జరిపిన దర్యాప్తు బృందం.. తొలిసారి ఓ రాజకీయ నేతను ప్రశ్నిస్తుండడం గమనార్హం. లింగయ్యనే కాకుండా పలువురు ఇతర నేతలను కూడా ఈకేసులో విచారించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. -
కాంగ్రెస్ ప్రభంజనం చూసి బీఆర్ఎస్ నేతలకు భయం పట్టుకుంది
-
వచ్చే ఎన్నికల్లో నకిరేకల్ (ఎస్సి) నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు
నకిరేకల్ (ఎస్సి) నియోజకవర్గం 2009లో నియోజకవర్గ పునర్ విభజనలో రామన్నపేట నియోజకవర్గం రద్దై నకిరేకల్ (ఎస్సి) నియోజకవర్గం నూతనంగా ఏర్పడింది. నకిరేకల్ రిజర్వుడ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఐ పక్షాన పోటీచేసిన చిరుమర్తి లింగయ్య రెండోసారి విజయం సాదించారు. ఆయన గతంలో 2009లో ఒకసారి, తిరిగి 2018లో మరోసారి గెలిచారు. లింగయ్య తన సమీప ప్రత్యర్ది, సిట్టింగ్ టిఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల వీరేశంపై 8259 ఓట్ల మెజార్టీతో నెగ్గారు. ఆ తర్వాత కొద్ది కాలానికి లింగయ్య కాంగ్రెస్ ఐకి గుడ్ బై చెప్పి అదికార టిఆర్ఎస్లో చేరిపోవడం విశేషం. లింగయ్యకు 93699 ఓట్లు రాగా, వీరేశంకు 85440 ఓట్లు వచ్చాయి. ఇక్కడ ఎస్.ఎఫ్ బి అభ్యర్దిగా పోటీచేసిన డి.రవికుమార్‌కు పదివేలకు పైగా ఓట్లు వచ్చాయి. నకిరేకల్ నియోజకవర్గంలో 2014లో టిఆర్ఎస్ అభ్యర్ధి వేముల వీరేశం సిటింగ్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ అభ్యర్ది చిరుమర్తి లింగయ్యను 2370 ఓట్ల తేడాతో ఓడిరచారు. ఇక్కడ టిఆర్ఎస్కు రాజీనామా చేసిన చెరుకు సుధాకర్ తన భార్య లక్ష్మిని బిజెపి పక్షాన రంగంలో దించినా ప్రయోజనం దక్కలేదు. ఆమెకు38440 ఓట్లు వచ్చాయి. సిపిఎం పక్షాన పోటీచేసిన ఎమ్.సర్వయ్యకు 12741 ఓట్లు వచ్చాయి. 2018లో లింగయ్య గెలవగలిగారు. నకిరేకల్ నియోజకవర్గంలో సిపిఐ ఒకసారి, సిపిఎం ఎనిమిదిసార్లు, కాంగ్రెస్ కాంగ్రెస్‌లు మూడుసార్లు, టిఆర్ఎస్, పిడిఎఫ్ ఒక్కొక్కసారి గెలుపొందాయి. 2009లో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత నకిరేకల్ రిజర్వుడ్ కేట గిరిలోకి వెళ్లింది. అంతకు ముందు జనరల్‌గా ఉన్నప్పుడు సిపిఎం నేత నర్రా రాఘవరెడ్డి ఇక్కడ నుండి ఆరుసార్లు గెలిచారు. టిడిపి ఇక్కడ ఒక్కసారి కూడా గెలవలేదు. సిపిఎం నేత నోముల నరసింహయ్య ఇక్కడ రెండుసార్లు గెలిచారు. ఆయన 2009లో భువనగిరి లోక్‌సభకు పోటీచేసి ఓడిపోయారు. 2014లో టిఆర్ఎస్లో చేరి సాగర్ నుంచి పోటీచేసి ఓడినా, 2018లో గెలవగలిగారు. దాదాపు మూడు దశాబ్దాల పాటు సిపిఎం నకిరేకల్‌లో పట్టు నిలబెట్టుకున్నా, 2009 నుంచి ఓడిపోతోంది. 1957లో ఇక్కడ గెలిచిన ధర్మభిక్షం నల్గొండలో, సూర్యాపేటలలో కూడా గెలిచారు. ఈయన రెండుసార్లు లోక్‌సభకు కూడా గెలుపొందారు. నకిరేకల్ రిజర్వుడ్ కాకముందు ఏడుసార్లు రెడ్లు, నాలుగుసార్లు బిసిలు (రెండుసార్లు గౌడ, రెండుసార్లు యాదవ) ఎన్నికయ్యారు. రామన్నపేటలో (2009లో రద్దు) 1952లో ఏర్పడిన రామన్నపేట శాసనసభ నియోజకవర్గంలో ఒక ఉప ఎన్నికతో సహా 13సార్లు ఎన్నికలు జరగ్గా, పిడిఎఫ్ రెండుసార్లు, కాంగ్రెస్, కాంగ్రెస్ (ఐ)లు ఏడుసార్లు, సిపిఐ నాలుగుసార్లు గెలుపొందాయి. ఈ నియోజకవర్గానికి చెందిన ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి శాసనసభకు రెండుసార్లు గెలిచారు. 1999, 2004లలో ఆయన గెలుపొందారు. ఆయన శాసనమండలి సభ్యునిగా ఎక్కువ కాలం ఉన్నారు. పురుషోత్తంరెడ్డి 1971లో కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గంలోను, 1973లో జలగం వెంగళరావు క్యాబినెట్‌లోను సభ్యునిగా ఉన్నారు. కొమ్ము పాపయ్య 1981లో టి.అంజయ్య మంత్రివర్గంలో సభ్యునిగా ఉన్నారు.సిపిఐ నేతలు కె.రామచంద్రారెడ్డి, జి.యాదగిరిరెడ్డిలు మూడేసి సార్లు అసెంబ్లీకి గెలిచారు. రామన్నపేట లో ఎనిమిది సార్లు రెడ్లు, రెండుసార్లు బిసిలు, మూడుసార్లు ఎస్.సిలు ఎ న్నికయ్యారు. నకిరేకల్ (ఎస్సి) నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
నకిరేకల్ బీఆర్ఎస్లో వర్గపోరు.. వీరేశంపై ఎమ్మెల్యే చిరుమర్తి ఫైర్..
నల్లగొండ: నకిరేకల్ బీఆర్ఎస్లో వర్గపోరు మరోసారి బయటపడింది. మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని టార్గెట్ చేస్తూ ప్రస్తుత ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తీవ్ర విమర్శలు చేశారు. నాలుగు సంవత్సరాలుగా ఆయనకు పార్టీలో సభ్యత్వమే లేదని వ్యాఖ్యానించారు. వీరేశం ఎక్కడ ఉంటున్నాడో, ఏం చేస్తున్నాడో ఎవరికీ తెలియదని ఎద్దేవా చేశారు. 'ఒకసారి ఎంపీగా పోటీ చేస్తా అంటావు. మరొకసారి ఇంకో నియోజకవర్గం పేరు చెప్తావు. ఇంకోసారి ఎమ్మెల్సీ, మంత్రి అంటున్నావు. గతంలో తొడలుకొట్టి ఓ పేపరు చూపించారు. ఇప్పుడు అది ఎటుపోయిందో ఎవరికీ తెలియదు. ప్రజల్ని అనుచరులని అయోమయానికి గురి చేస్తున్నావు. గతంలో జిల్లాలో ఎక్కడపడితే అక్కడ కబ్జాలు జరిగేవి. నకిరేకల్‌కు గతంలో కంటే ఎక్కువ నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్నా.' అని చిరుమర్తి వ్యాఖ్యానించారు. చదవండి: రాజకీయం రసకందాయం! సబిత పెత్తనం ఏమిటంటున్న తీగల -
కేసీఆర్ ప్రకటనే అసలు సమస్య.. మాజీ ఎమ్మెల్యే దారేటు?
గతంలో మాదిరిగా ఈసారి కూడా సిటింగ్‌లకే సీట్లిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అనేక స్థానాల్లో ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు ఉన్నారు. గతం నుంచీ అక్కడ గులాబీ పార్టీకి సేవ చేస్తున్నవారి పరిస్థితి ఏంటి? గతం నుంచి సీటిస్తామంటూ హామీ పొందినవారి సంగతేంటి? ఇటువంటి వారంతా సీట్ల కోసం ఏం చేయబోతున్నారు? ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నేతలు ఏమంటున్నారు? నకిరేకల్‌లో రసవత్తరం ఈసారి టికెట్ వస్తుందో రాదో అన్న అనుమానం ఉన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు పార్టీ అధినేత ఇచ్చిన భరోసా వెయ్యి ఏనుగుల బలాన్నిచ్చింది. సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ పట్టరాని సంతోషం కలిగించింది. కొందరిని మాత్రం తీవ్ర కలవరపాటుకు గురిచేస్తోంది. సిట్టింగులకే సీట్లు అంటే తమ పరిస్థితి ఏంటని పార్టీలో ఉన్న ఆశావాహులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నికల తర్వాత గెలిచిన పార్టీ ఫిరాయించి టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలున్న స్థానాల్లో ఈ ఆందోళనలు కాస్త ఎక్కువే ఉన్నట్లు తెలుస్తోంది. అలాంటి నియోజకవర్గాల్లో నల్లగొండ జిల్లా నకిరేకల్ కూడా ఒకటి. ఇక్కడ గత ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన వేముల వీరేశంపై కాంగ్రెస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్య స్వల్ప ఆధిక్యంతో విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్లో చేరిపోయారు. ఈ ఫిరాయింపుతోనే అసలు సమస్య మొదలైంది. కారు నడిపేది నేనే..! ప్రత్యర్థులుగా పోటీ చేసి గెలిచిన, ఓడిన నాయకులు ఇద్దరు ప్రస్తుతం ఒకే పార్టీలో ఉన్నారు. ఇద్దరు కూడా వచ్చే ఎన్నికల్లో తమకే టికెట్ వస్తుందని ప్రచారం చేసుకున్నారు. కానీ అధినేత మాత్రం సిట్టింగులకే సీట్లు అని ప్రకటించడంతో మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన అనుచరులతో సమావేశమైన సందర్భంలో కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఎలా అయినా పోటీ చేస్తానని అందుకు మీరు కూడా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కేసులు పెట్టినా ధైర్యంగా ఎదుర్కొందామని... మన మౌనం పిరికితనం కాదని గోడకు వేలాడ దీసిన తుపాకీ లాంటిదని ఘాటు కామెంట్స్ చేశారు. ఎంత తొక్కాలని చూస్తే బంతిలా అంత పైకి ఎగురుదామని వీరేశం మాట్లాడిన తీరు చూస్తే ఆయన ఖచ్చితంగా పోటీలో ఉండటం ఖాయం అని తెలుస్తోంది. కమలం కొత్త వ్యూహం అయితే వీరేశం ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనేది క్లారిటీ లేదు. ఇప్పటి వరకు టీఆర్ఎస్ లోనే కొనసాగినా.. మున్సిపల్ ఎన్నికల్లో తన వర్గానికి చెందిన వారిని ఫార్వర్డ్ బ్లాక్ నుంచి పోటీ చేయించి సొంత పార్టీకి ధీటుగా కౌన్సిలర్లను గెలిపించుకున్నారు. అందువల్ల ఆయన కూడా ఫార్వర్డ్ బ్లాక్ గుర్తు మీద పోటీ చేస్తారా? లేక ఇతర పార్టీల నుంచి పోటీ చేస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే వేముల వీరేశంపై ఇటు కాంగ్రెస్ తో పాటు అటు బీజేపీ కూడా ఓ కన్నేసి ఉంచాయి. కాని ఇప్పటికే చెరుకు సుధాకర్ కాంగ్రెస్‌లో చేరి ఆయన భార్య లక్ష్మీని నకిరేకల్ నుంచి బరిలో దింపేందుకు ప్లాన్ చేశారు. ఇలాంటి సమయంలో వేముల కాంగ్రెస్ పార్టీలో చేరడం అనేది అనుమానమే. అదే సమయంలో బీజేపీలో చేరడానికి సిద్ధాంత వైరం అడ్డుగా ఉంది. వీరేశం మాజీ మావోయిస్టు. అలాంటి వ్యక్తి బీజేపీలో చేరుతారా అన్న ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. టికెట్ వచ్చినా రాకున్నా.. బరిలో ఉంటా.! వీరేశానికి టీఆర్ఎస్ టికెట్ రాకున్నా పోటీ చేస్తానని ప్రకటించిన నేపథ్యంలో ఏ పార్టీ నుంచి బరిలో ఉంటారన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఆయన అనుచరులు మాత్రం ఇండిపెండెంట్ గా పోటీ చేయవద్దనే సూచిస్తున్నారు. పలు సంస్థలు చేసిన సర్వేల్లో ప్రస్తుత ఎమ్మెల్యే కంటే తనకే అనుకూలత ఎక్కువ ఉందని వీరేశం చెబుతున్నట్లు తెలుస్తోంది. ఈ సర్వేలతో పాటు టీఆర్ఎస్ చేయించిన సర్వేలో కూడా సానుకూలత తనకే ఉందని వీరేశం అంటున్నారని టాక్. తనకు టీఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోతుందా అన్న నమ్మకం ఆయనకు ఏమూలనో ఉందని అంటున్నారు. నకిరేకల్‌లో వేముల వీరేశం, చిరుమర్తి లింగయ్య మధ్య మరోసారి రసవత్తర పోరు జరగనుందని అర్థం అవుతోంది. పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
మూడు నెలల్లో ‘ఉదయ సముద్రం’ ఎత్తిపోతల
నార్కట్‌పల్లి: నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండల పరిధిలోని బ్రాహ్మణ వెల్లంల ఉదయ సముద్రం ఎత్తిపోతల ప్రాజెక్టును మూడు నెలల్లో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభిస్తామని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య చెప్పారు. మంగళవారం ఆయన నార్కట్‌పల్లిలో విలేకరులతో మాట్లాడారు. ప్రాజెక్టును ప్రారంభించే రోజు లక్ష మందితో సభ ఏర్పాటు చేస్తామన్నారు. లక్ష ఎకరాలకు సాగునీరు అందించాలన్న సంకల్పంతో ఎత్తిపోతల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టామని చెప్పారు. ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ, పెండింగ్ బిల్లులపై ఎప్పటికప్పుడు అధికారులతో సమన్వయం చేస్తున్నామని చెప్పారు. సోమవారం ప్రగతి భవన్లో జరిగిన సమావేశంలో సీఎం కేసీఆర్‌తో ఉదయ సముద్రంపై చర్చజరిగిందని, తక్షణమే సీఎం స్పందించి అధికారులతో మాట్లాడి త్వరితగతిన పూర్తి చేసేలా ఆదేశాలు జారీ చేశారని ఆయన వివరించారు. ప్రాజెక్టులో ప్రధానమైన అప్రోచ్ కాలువ, సొరంగం, సర్జ్‌పూల్, పంప్‌హౌస్, సబ్ స్టేషన్, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులు చివరి దశకు చేరుకున్నట్లు తెలిపారు. -
ఎమ్మెల్యే చిరుమర్తికి మంత్రి కేటీఆర్ ఫోన్..!
నకిరేకల్ : నియోజకవర్గంలో కరోనా వైరస్ విజృంభణపై రాష్ట్ర మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఆరా తీశారు. ఆదివారం ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు ఫోన్ చేసి కరోనా పరిస్థితులు, మహమ్మారి నిర్ధారణ పరీక్షలు, వ్యాక్సినేషన్ ఏ విధంగా సాగుతోందని అడిగి తెలుసుకున్నారు. బాధితుల్లో మనోధైర్యాన్ని నింపాలని, మెరుగైన వైద్య సదుపాయాలు అందేలా చూడాలని ఆదేశించారు. ప్రభుత్వ పరంగా అన్ని సౌకర్యాలు సమకూర్చుతామని తెలిపారు. కరోనా బాధితులకు అండగా ఉంటా : ఎమ్మెల్యే కరోనా బాధితులకు అండగా ఉంటానని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య భరోసా ఇచ్చారు. నకిరేకల్ మున్సిపాలిటిలోని 1,2,5,6,17,20 వార్డులలో ఆదివారం ఆయన పర్యటించారు. కరోనా బారిన పడి మృతి చెందిన 15 కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.10 వేల చొప్పున రూ.1.50లక్షల ఆర్థిక సాయాన్ని ఆయన అందజేశారు. కరోనా వచ్చిందని అధైర్యపడకుండా మహమ్మారిని ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు. అదే విధంగా అన్ని పీహెచ్సీలలో కరోనా టెస్టులు చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్‌గౌడ్, ఆయా వార్డుల కౌన్సిలర్లు కందాల భిక్షం రెడ్డి, రాచకొండ సునీల్‌గౌడ్, పల్లేవిజయ్, చెవుగోని రాములమ్మ ఉన్నారు. చదవండి: Corona: పిల్లల్లో కోవిడ్ లక్షణాలను ఎలా గుర్తుపట్టాలి? -
ముగ్గురు జల సమాధి
రామన్నపేట: మహా శివరాత్రి సందర్భంగా సంతోషంగా ఉన్న ఆ కుటుంబంలో ఒక్కసారిగా విషాదం అలుముకుంది. చెరువులో కారు కడగడానికి వెళ్లిన తండ్రి, కొడుకు, స్నేహితుడు జలసమాధి అయ్యారు. ఈ హృదయ విదారక ఘటన శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకిలో వెలుగుచూసింది. రామన్నపేట మండలం సర్నేనిగూడెం గ్రామ సర్పంచ్ ధర్నె రాణి భర్త మధు (35) టీఆర్ఎస్ నాయకుడు. వీరికి కుమారుడు మణికంఠ (10), కుమార్తె అభినయ ఉన్నారు. శుక్రవారం శివరాత్రి సందర్భంగా కారును కడిగేందుకు ఉదయం 11 గంటల సమయంలో సర్నేనిగూడెంలోని తన ఇంటి నుంచి స్నేహితుడైన నన్నూరి శ్రీధర్‌రెడ్డి (25)తో కలిసి వెల్లంకిలోని మరో మిత్రుడి పొలంలో ఉన్న వ్యవసాయ బావి వద్దకు పయనమయ్యారు. పండుగ సందర్భంగా స్కూల్‌కు సెలవు కావడంతో కుమారుడు మణికంఠ కూడా వస్తానని మారాం చేయడంతో తండ్రి మధు వద్దని వారించాడు. తాత యాదయ్య మధుకి నచ్చజెప్పి మనవడిని తండ్రితో పాటు పంపించాడు. ఈ క్రమంలో రాణి, ఆమె భర్త మధు, అత్తా మామలు అందరూ కలసి శుక్రవారం సాయంత్రం వెల్లంకిలోని శివాలయానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. వ్యవసాయ బావి వద్ద ఉన్న వీరికి గుడికి వెళ్దామని ఇంటి నుంచి ఫోన్ రావడంతో సాయంత్రం 4.30 గంటల సమయంలో బావి వద్ద నుంచి ముగ్గురు కారులో బయలుదేరారు. అయితే కొద్దిసేపటికే వారి ఫోన్లు స్విచ్ఛాఫ్ అయ్యాయి. గుడికి వెళ్లడానికి ఆలస్యం అవుతుందని కుటుంబ సభ్యులు ఎంత ప్రయత్నించినా వారి ఫోన్లు కలువ లేదు. రాత్రి వరకు ముగ్గురు తిరిగి రాకపోవడం, ఫోన్లు అందుబాటులో లేకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. అలాగే వారి ఆచూకీ కోసం బంధువులు, స్నేహితులు ఇళ్లతో పాటు వ్యవసాయ పొలాల వద్ద వెతికినా లాభం లేకుండాపోయింది. శనివారం ఉదయం చౌటుప్పల్ ఏసీపీ సత్తయ్య, సీఐ ఏవీ రంగా, ఎస్ఐలు సీహెచ్ సాయిలు, శివనాగప్రసాద్ సిబ్బందితో కలిసి వివిధ ప్రాంతాల్లోని సీసీ ఫుటేజీలు, సెల్ టవర్ల నెట్వర్క్ (సీడీఆర్) ఆధారంగా ఆ ముగ్గురు స్థానిక ఈదుల చెరువు శివారులోనే అదృశ్యమైనట్లు గుర్తించారు. చెరువులో జల సమాధి..: సీడీఆర్ ఆధారంగా ఫోన్ మాట్లాడిన కొద్దిసేపటికే సెల్ఫోన్లు స్విచ్ఛాఫ్ కావడం, కారు కడిగిన బావికి 500 మీటర్ల దూరంలోనే చెరువు ఉండటంతో పోలీసుల దృష్టి సమీపంలోని ఈదుల చెరువుపై పడింది. అప్పటికే అక్కడికి చేరుకున్న నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఏసీపీ, సీఐతో చర్చించారు. వెల్లంకికి చెందిన యువకుల సాయంతో ఈదుల చెరువులోకి దిగి కారు కోసం వెతికారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో చెరువు ఒడ్డు సమీపంలో కారు మునిగినట్లుగా గుర్తించారు. జేసీబీ సాయంతో కారును వెలికి తీసి అందులో ఉన్న ముగ్గురి మృతదేహాలను బయటకు తీశారు. కారు అదుపు తప్పడంతోనే..: బావి వద్ద నుంచి బయలుదేరిన కారు ఈదుల చెరువుపై నిర్మించిన కట్ట మీదకు రాగానే అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. ఇది ఎవరూ గమనించకపోవడంతో విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. తల్లిని ఓదార్చిన కుమార్తె..: భర్త అదృశ్యమై పుట్టెడు దుఃఖంలో ఉన్న మధు భార్య రాణిని ఆమె కుమార్తె అభినయ ఓదార్చిన తీరు కంటతడి పెట్టించింది. వెల్లంకి హైస్కూల్లో 7వ తరగతి చదువుతున్న అభియన.. తల్లి, బంధువులతోపాటు కారు కడిగిన వ్యవసాయ బావి వద్దకు వచ్చింది. తన భర్త, కుమారిడి ఆచూకీ చెప్పా లని కనిపించిన వారినల్లా గుండెలవిసేలా రోదిస్తూ అడుగుతుండటంతో.. నాన్న, తమ్ముడు క్షేమంగా తిరిగి వస్తారని, నువ్వు ఏడవద్దని తల్లిని ఓదార్చిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. సహాయక చర్యల్లో ఎమ్మెల్యే..: నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఘటనా స్థలాన్ని సందర్శించారు. సర్పంచ్ రాణిని ఓదార్చి ధైర్యం చెప్పారు. అనంతరం స్థానిక యువకులతో ఘటనా స్థలానికి వెళ్లి జేసీబీ సాయంతో కారును బయటకు తీశారు. మృతదేహాలను బయటకు తీసిన అనంతరం పోస్టుమార్టం పూర్తయ్యే వరకు ఆస్పత్రిలోనే ఉన్నారు. -
టీఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు షాక్
సాక్షి, నల్గొండ: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో చిట్యాలలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు షాక్ తగిలింది. సొంత పార్టీ నేతలే లింగయ్య వర్గానికి వ్యతిరేకంగా రెబల్స్‌గా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున నకిరేకల్ నుంచి గెలుపొందిన చిరుమర్తి లింగయ్య అనంతర రాజకీయ పరిణామాల్లో టీఆర్ఎస్ గూటికి చేరుకున్నారు. అయితే, ఆయన చేతిలో ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం వర్గీయులు రెబల్స్‌గా గట్టిపోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అంతేకాకుండా స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నాయకులతో వేముల వర్గం టీఆర్ఎస్ నేతలు భేటీ అయినట్టు సమాచారం ఎమ్మెల్యే చిరుమర్తి వర్గానికి గట్టి పోటీ ఇచ్చేందుకు ఇటు టీఆర్ఎస్ రెబల్స్, అటు కాంగ్రెస్ నేతలు చేతులు కలిపినట్టు సమాచారం. -
‘ఉత్తమ్ ఉత్త మెంటల్ కేస్’
సాక్షి, నల్గొండ: తెలంగాణలోని హుజూర్నగర్ శాసనసభ స్థానానికి అక్టోబర్ 21న ఉప ఎన్నిక జరుగుతుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మీడియాతో మాట్లాడారు. హుజుర్నగర్లో టీఆర్ఎస్సే విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఉత్తమ్ ఉత్త మెంటల్ కేసని..మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉండడని ఆరోపించారు. ఆమె ప్రజలకు అందుబాటులో ఉండదని తెలిసే.. పద్మావతిని కోదాడలో ఓడించారని పేర్కొన్నారు. పద్మావతి ఓడిపోతుందని.. ఆమెను గెలిపిస్తామన్న నేతలకు కూడా తెలుసని లింగయ్య స్పష్టం చేశారు. ఇక పోతే హుజుర్నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా సైదిరెడ్డి ఖరారయినట్లు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో సైదిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద స్వల్ప మెజారిటీతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. -
కాంగ్రెస్‌కు మరో షాక్
-
నల్గొండ కాంగ్రెస్‌లో.. కలకలం!
సాక్షిప్రతినిధి, నల్లగొండ : అధికార టీఆర్ఎస్ విసిరిన ‘ఆపరేషన్ ఆకర్ష్’ వలకు నల్లగొండ జిల్లాలో ఓ చేప చిక్కింది. శాసనసభకు గత డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌నుంచి విజయం సాధించిన నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గులాబీ గూటికి చేరనున్నారు. పార్టీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు ఆయన ఆదివారం సీఎం కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరే అవకాశం ఉంది. చిరుమర్తి లింగయ్య శనివారం హైదరాబాద్‌లో తాను పార్టీ మారతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. ఆయన చేరికకు సంబంధించి ఇప్పటికే లాంఛనాలన్నీ పూర్తయ్యాయని, సీఎం కేసీఆర్‌తో ప్రత్యేక భేటీ కూడా ముగిసిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గత డిసెంబర్లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పన్నెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కేవలం మూడు స్థానాల్లో విజయం సాధించింది. భువనగిరి లోక్‌సభస్థానం పరిధిలోని మునుగోడు, నకిరేకల్, నల్లగొండ ఎంపీ స్థానం పరిధిలోని హుజూర్‌నగర్‌లో ఆ పార్టీ గెలిచింది. రేపో మాపో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుందని భావిస్తున్న తరుణంలో ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఒకరు పార్టీని వీడనుండడం కాంగ్రెస్‌లో కలకలం రేపుతోంది. మరోవైపు గత ఎన్నికల్లో ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం వర్గం లింగయ్యతో కలిసి పనిచేస్తుందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. వీరిద్దరి చేతులు కలుస్తాయా అన్నది ప్రశ్నార్థకమే అని అభిప్రాయం పడుతున్నారు. తెర వెనుక ఏం జరిగింది? ముందుస్తు ఎన్నికల ఫలితాలు వెలువడి, టీఆర్ఎస్ భారీ మెజారిటీతో అధికారం చేపట్టిన మరుసటి రోజు నుంచే కొందరు కాంగ్రెస్ నాయకులు పార్టీ మారుతారంటూ ప్రచారం జరిగింది. ఇందులో కోమటిరెడ్డి సోదరుల పేర్లూ ప్రచారంలోకి వచ్చాయి. కానీ, వారు ఈ ప్రచారాన్ని ఖండిం చారు. వారి వెంటే ఉండే చిరుమర్తి లింగయ్య గురించి ప్రత్యేకంగా ఎలాంటి ప్రచారం జరగలేదు. మరోవైపు కోమటిరెడ్డి సోదరులను పార్టీలోకి తీసుకోవద్దని, లింగయ్యను తీసుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరమూ లేదని జిల్లా నాయకులు, ఎమ్మెల్యేలు అధినేత కేసీఆర్‌కు వివరించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే కోటాలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఐదో స్థానానికి కాంగ్రెస్ నల్లగొండ ఉమ్మడి జిల్లాకు చెందిన టీ.పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డిని అభ్యర్ధిగా బరిలో పెట్టింది. ఐదో స్థానాన్ని కూడా కైవసం చేసుకునేందుకు వ్యూహం రచించిన టీఆర్ఎస్ అగ్ర నాయకత్వం కాంగ్రెస్ ఎమ్మెల్యేకు గాలం వేసిందంటున్నారు. దీనిలో భాగంగానే, చిరుమర్తి లింగయ్యను పార్టీలోకి తీసుకువచ్చే బాధ్యతను జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డికి అధినేత కేసీఆర్ అప్పజెప్పారని తెలుస్తోంది. అన్నీ తామైన ‘కోమటిరెడ్డి’ సోదరులకు ఝలక్ వాస్తవానికి చిరుమర్తి లింగయ్య కోమటిరెడ్డి సోదరులు గీసిన గీత దాటరని ఓ అభిప్రాయం బలంగా ఉంది. కానీ, తాజా పరిణామాలు కోమటిరెడ్డి సోదరులకు లింగయ్య ఝలక్ ఇచ్చారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. గత డిసెంబర్లో జరిగిన ఎన్నిక సమయంలో మహా కూటమి పొత్తుల్లో భాగంగా తెలంగాణ ఇంటి పార్టీకి నకిరేకల్ స్థానం కేటాయిస్తున్నారన్న వార్త బయటకు వచ్చింది. టీ.పీసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ కుంతియా ఢిల్లీలో ఈ ప్రకటన చేయడంతో కోమటిరెడ్డి సోదరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. లింగయ్యకు నకిరేకల్ టికెట్ ఇవ్వకుంటే తాను నల్లగొండ నుంచి పోటీ కూడా చేయనని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బహిరంగంగా ప్రకటించారు. లింగయ్యకు మద్దతుగా నార్కట్‌పల్లిలో నిర్వహించిన ర్యాలీలో కూడా పాల్గొన్నారు. ఆ తర్వాత పరిణామాల్లో లింగయ్యకే నకిరేకల్ టికెట్ దక్కడం, ఆ ఎన్నికల్ల ఆయన గెలవడం వరుసగా జరిగిపోయాయి. తమ వెంటే ఉంటాడనుకున్న లింగయ్య తమను వీడి గులాబీ గూటికి చేరనుండడాన్ని కోమటిరెడ్డి సోదరులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఎంపీ ఎన్నికల నేపథ్యంలో... ఎమ్మెల్యే కోటాలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల కోసమే కాకుండా.. ప్రధానంగా ఎంపీ ఎన్నికలను కూడా దృష్టిలో పెట్టుకుని టీఆర్ఎస్ నాయకత్వం వ్యూహ రచన చేసిందంటున్నారు. భువనగిరి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలోని మునుగోడు, నకిరేకల్‌లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఇబ్రహీంపట్నం, తుంగతుర్తి నియోజకవర్గాల్లో మెజారిటీ రాలేదు. దీంతో ఏడు సెగ్మెంట్లలో నాలుగు చోట్లా బలహీనంగా కనిపిస్తోంది. పదహారు ఎంపీ స్థానాలపై కన్నేసిన టీఆర్ఎస్ ఈ విషయాన్ని తీవ్రంగానే తీసుకుందంటున్నారు. ఫలితంగా నకిరేకల్ ఎమ్మెల్యేను పార్టీలోకి ఆహ్వానించిందని విశ్లేషిస్తున్నారు. -
త్వరలో టీఆర్ఎస్లో చేరతా
సాక్షి, హైదరాబాద్: నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు చిరుమర్తి లింగయ్య తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)లో చేరడం ఖాయమైంది. ఇప్పటికే ఇద్దరు కాంగ్రెస్ శాసనసభ్యులు టీఆర్ఎస్ గూటికి చేరుకోగా లింగయ్య కూడా అధికార పార్టీలో చేరుతున్నట్లు రెండు రోజులుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్లో తన చేరికను ఖరారు చేస్తూ చిరుమర్తి లింగయ్య శనివారం రెండు పేజీల లేఖను విడుదల చేశారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు నాయకత్వంలోనే నల్లగొండ జిల్లాతోపాటు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నకిరేకల్ నియోజకవర్గం అభివృద్ధి సాధ్యమవుతుందని లింగయ్య లేఖలో పేర్కొన్నారు. ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వైఖరిని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించినా పార్టీ నాయకుల వైఖరి మారడం లేదని ఆయన విమర్శించారు. అవసరమైతే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తానని చిరుమర్తి లింగయ్య తన లేఖలో స్పష్టం చేశారు. తాను టీఆర్ఎస్లో చేరడానికి గల కారణాలను లేఖలో వివరించారు. ‘ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ నాయకత్వంపై రాష్ట్ర ప్రజలు అచంచల విశ్వాసం ప్రకటించి అఖండ విజయాన్ని అందించారు. రాష్ట్రంలోని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు పూర్తి నమ్మకం ఉందనడానికి ఎన్నికల ఫలితాలే నిదర్శనం. దేశంలో ఎక్కడా జరగని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణలో అమలవుతున్నాయి’అని లేఖలో చిరుమర్తి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో పెద్ద నాయకులమని చెప్పుకొనే నల్లగొండ జిల్లా కాంగ్రెస్ నాయకులు గతంలో పార్టీ లో, ప్రభుత్వంలో పెద్ద పదవులు పోషించినా 2014 వరకు ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. కేసీఆర్ నాయకత్వంలోనే నల్లగొండ అభివృద్ధి 2014 శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించి కేసీఆర్ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాతే నల్లగొండ జిల్లాలో కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ది జరుగుతోందని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రశంసించారు. నల్లగొండ జిల్లా నుంచే ప్రారంభమైన మిషన్ భగీరథ ద్వారా ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారంతోపాటు చెరువుల పునరుద్ధరణ జరిగిందన్నారు. పాలమూరు ఎత్తిపోతల ద్వారా కృష్ణా, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నదీ జలాలు బీడుపడిన నల్లగొండ జిల్లా భూములను సస్యశ్యామలం చేస్తున్నాయన్నారు. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న ఉదయసముద్రం ఎత్తిపోతల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా పూర్తి చేస్తోందని చిరుమర్తి లేఖలో పేర్కొన్నారు. దీంతో తన సొంత నియోజకవర్గం నకిరేకల్‌తోపాటు నల్లగొండ, మునుగోడు నియోజకవర్గాల్లోని లక్ష ఎకరాలకు ఈ ఏడాది ఖరీఫ్‌లో సాగునీరు అందుతుందన్నారు. నల్లగొండ, సూర్యాపేటలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటయ్యాయని, రూ. 24 వేల కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న 4 వేల మెగావాట్ల యాదాద్రి పవర్ ప్లాంటు ద్వారా నల్లగొండ ఆర్థిక ముఖచిత్రం మారుతుందని చిరుమర్తి లింగయ్య తన లేఖలో పేర్కొన్నారు. ఈ ప్లాంటు ద్వారా స్థానికంగా 8 వేల మందికి ప్రత్యక్షంగా, వేలాది మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు. ఓడినా మార్పులేదు యాదాద్రి పవర్ ప్రాజెక్టుతోపాటు ఇతర సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసులు వేయడం దురదృష్టకరమని చిరుమర్తి లింగయ్య వ్యాఖ్యానించారు. ప్రగతి నిరోధకులుగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ నేతల తీరును ఆయన ఖండించారు. ప్రభుత్వం అమలు చేసున్న అభివృద్ధి పనులకు సహకరించకుండా కాంగ్రెస్ నేతలు అడ్డుకుంటున్నారని లింగయ్య ఆరోపించారు. కాంగ్రెస్ నేతల వైఖరిలో మార్పు వచ్చే అవకాశం లేనందునే తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నకిరేకల్ నియోజకవర్గంతోపాటు నల్లగొండ జిల్లా అభివృద్ధి కోసం కేసీఆర్ నాయకత్వంలో పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. నల్లగొండ జిల్లా సమగ్రాభివృద్ధి కోసం కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్లో చేరాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. అవసరమైతే తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి టీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తానన్నారు. -
కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. టీఆర్ఎస్లోకి మరో ఎమ్మెల్యే
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. నకిరేకల్ శాసన సభ్యుడు చిరుమర్తి లింగయ్య పార్టీని వీడుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కాంగ్రెస్‌ను రాజీనామా చేసి త్వరలోనే టీఆర్ఎస్లో చేరుతున్నట్లు లింగయ్య వెల్లడించారు. అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, టీఆర్ఎస్ బీ ఫాంపై పోటీచేసి మరోసారి గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసినా కాంగ్రెస్ నేతల్లో మార్పు రావడంలేదని లింగయ్య విమర్శించారు. నల్గొండ జిల్లా అభివృద్ధి సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమని, అందుకే పార్టీలో చేరుతున్నానని పేర్కొన్నారు. ఈమేరకు శనివారం ఆయన బహిరంగ లేఖను విడుదల చేశారు. ‘టీఆర్ఎస్లో చేరితే అంతకన్నా మోసం ఇంకోటి లేదు’ కేసీఆర్ అభివృద్ధిని ప్రజలు గుర్తించి గత ఎన్నికల్లో అఖండ విజయాన్ని అందించారని, కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు తిరస్కరించారు చిరుమర్తి లింగయ్య అభిప్రాయపడ్డారు. అభివృద్ధికి ఆటంకం కలిగే విధంగా కాంగ్రెస్ నేతలు కోర్టుల్లో కేసులు వెయ్యడం తప్ప చేసింది మరొకటి లేదని అన్నారు. కాగా పార్టీని వీడుతున్నట్లు ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రకటించిన విషయం తెలిసిందే. రేగా కాంతారావు, ఆత్రం సక్కు త్వరలోనే కారెక్కుతున్నట్లు ప్రకటించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి ఈపరిణామం పెద్ద షాకే. చిరుమర్తి లింగయ్య ప్రకటనతో కాంగ్రెస్ పార్టీని వీడేవారి సంఖ్య ముగ్గురికి చేరింది. టీడీపీ నుంచి గెలిచిన సత్తుపల్లి శాసన సభ్యుడు సండ్ర వెంకటవీరయ్య కూడా టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయనకు టికెట్ రాకపోతే.. నేను పోటీ చేయను..! -
లింగయ్యది నమ్మకద్రోహమే!
సాక్షిప్రతినిధి, నల్లగొండ: నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గులాబీ గూటికి చేరడం ఖాయమైంది. కేసీఆర్ సమక్షంలో అధికారికంగా టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారని సమాచారం. లింగయ్య ఇప్పటికీ బహిరంగంగా తాను పార్టీ మారుతున్నట్లు ప్రకటించలేదు. తాజా పరిణామాలతో నల్లగొండ జిల్లా కాంగ్రెస్ శ్రేణులతోపాటు కోమటిరెడ్డి సోదరులు షాక్‌కు గురయ్యారు. ‘లింగయ్య పార్టీ మారే విషయం నాకు తెలి యదు. ఆయన నన్ను సంప్రదించి పార్టీ మారడం లేదు. రెండుసార్లు టికెట్ ఇప్పించాం. ఇంత నమ్మకద్రోహం చేస్తాడనుకోలేదు’ అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శుక్రవారం తిరుపతిలో వ్యాఖ్యానించారు. లింగయ్య పార్టీ మారే విషయంలో మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఏం జరిగింది? కోమటిరెడ్డి సోదరులను పార్టీలోకి తీసుకోవద్దని, లింగయ్యను తీసుకుంటే తమకు అభ్యంతరం లేదని టీఆర్ఎస్ జిల్లా నేతలు, ఎమ్మెల్యేలు అధినేత కేసీఆర్‌కు వివరించినట్లు సమాచారం. లింగయ్యను పార్టీలోకి తీసుకొచ్చే బాధ్యతను మంత్రి జగదీశ్‌రెడ్డికి కేసీఆర్ అప్పజెప్పారని తెలుస్తోంది. లింగయ్య టీడీపీ జెడ్పీటీసీ సభ్యుడిగా పనిచేసిన సమయంలో ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్‌తో ఉన్న సంబంధాలను, మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్‌తో ఉన్న పరిచయాలను ముందుపెట్టి జగదీశ్‌రెడ్డి పావులు కదిపారని అంటున్నారు. -
‘చే’జారిన మరో ఎమ్మెల్యే!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతోంది. ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మొదలైన ఈ ఆపరేషన్ లోక్‌సభ ఎన్నికల్లోగా పూర్తయ్యే పరిస్థితి కనిపిస్తోంది. లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ స్థైర్యాన్ని పూర్తిగా దెబ్బతీసేలా టీఆర్ఎస్ వ్యూహం రచిం చింది. దీంట్లో భాగంగానే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక్కరొక్కరుగా అధికార పార్టీకి దగ్గరవుతున్నారు. మొన్నటికి మొన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు (పినపాక), ఆత్రం సక్కు (ఆసిఫాబాద్).. టీఆర్ఎస్లో చేరుతున్నట్లు అధికారికంగా ప్రకటించగా.. వారంలోపే మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే అధికార పార్టీలో చేరడం ఖాయమైంది. చిరుమర్తి లింగయ్య (నకిరేకల్) రెండ్రోజుల్లో అధికారికంగా గులాబీ కండువా కప్పుకోనున్నారు. ఆదివారం లింగయ్య చేరిక కార్యక్రమం ఉంటుందని తెలుస్తోంది. ఇటీవలి ఎన్నికల్లో నకిరేకల్‌లో టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి ఓడిపోయిన వేముల వీరేశంతో చిరుమర్తి లింగయ్య శుక్రవారం ఫోన్లో మాట్లాడారు. ‘అన్నా పార్టీలో చేరుతున్నాను. కలిసి పని చేద్దాం. సహకరించాలన్నా’అని కోరారు. నకిరేకల్‌లోని కాంగ్రెస్ శ్రేణులతోనూ సైతం లింగయ్య ఇదే అంశంపై చర్చించారు. తాజా పరిణామాలతో టీఆర్ఎస్లో చేరుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య 3కు చేరింది. శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఈ నెల 12న జరగనుంది. అప్పటిలోపు మరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరతారని టీఆర్ఎస్ ముఖ్యనేతలు చెబుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి తదుపరి చేరికలు ఉంటాయంటున్నారు. లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ శ్రేణులు, నేతల స్థైర్యాన్ని దెబ్బతీసేలా టీఆర్ఎస్ వ్యూహం అమలు చేయాలని నిర్ణయించింది. కేటీఆర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న లోక్‌సభ సెగ్మెంట్ల వారీ సన్నాహక సమావేశాలు ముగిసేలోపు మరికొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరనున్నట్లు తెలిసింది. భువనగిరి లోక్‌సభ నియోజకవర్గం సన్నాహక సమావేశం ముగిసిన మరుసటి రోజే ఆ సెగ్మెంట్ పరిధిలోని నకిరేకల్ ఎమ్మెల్యే లింగయ్య టీఆర్ఎస్లో చేరిక ఖాయమైంది. మిగిలిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల చేరిక విషయంలోనూ టీఆర్ఎస్ ఇదే వ్యూహాన్ని అమలు చేసే పరిస్థితి ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు దెబ్బ కాంగ్రెస్‌కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరడం ఖాయమైపోవడంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ గెలుపు ఖాయమైనట్లు కనిపిస్తోంది. శాసనసభ కోటాలోని ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. టీఆర్ఎస్–మజ్లిస్ కలిపి ఈ ఎన్నికల్లో పోటీకి దిగాయి. టీఆర్ఎస్ తరుపున నలుగురు, ఎంఐఎం నుంచి ఒక్కరు పోటీ చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 19 స్థానాల్లో గెలిచింది. మిత్రపక్షంగా పోటీ చేసిన టీడీపీ 2 స్థానాల్లో విజయం సాధించింది. రెండు పార్టీలు కలిపి 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నందున ఒక స్థానం గెలుచుకోవచ్చన్న ఆలోచనతో కాంగ్రెస్ తమ తరఫున గుడూరు నారాయణ రెడ్డిని బరిలోకి దించింది. ఆ వెంటనే ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఒక టీడీపీ ఎమ్మెల్యే టీఆర్ఎస్లో చేరుతున్నట్లు వారం క్రితమే ప్రకటించారు. దీంతో కాంగ్రెస్, టీడీపీ కూటమి బలం 18కి తగ్గింది. అయినా ఎమ్మెల్సీ ఎన్నికలలో విజయం కోసం కాంగ్రెస్ ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సైతం అధికార పార్టీలో చేరడం ఖరారైంది. అసెంబ్లీ ఎన్నికలలో టీఆర్ఎస్ 88 స్థానాల్లో గెలిచింది. అనంతరం ఇద్దరు ఇండిపెండెంట్లు టీఆర్ఎస్లో చేరారు. నామినేటెడ్ ఎమ్మెల్యే ఉన్నారు. మజ్లిస్ 7 స్థానాల్లో గెలిచింది. కాంగ్రెస్ నుంచి ముగ్గురు, టీడీపీ నుంచి ఒక ఎమ్మెల్యే ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్కు మద్దతు తెలపనున్నారు. ప్రస్తుత లెక్కల ప్రకారం టీఆర్ఎస్, మజ్లిస్ ఎమ్మెల్యేల సంఖ్య 102కు పెరిగింది. రెండు పార్టీలు కలిపి ఐదు ఎమ్మెల్సీ స్థానాలను గెలుచుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. -
‘టీఆర్ఎస్లో చేరితే అంతకన్నా మోసం ఇంకోటి లేదు’
సాక్షి, భువనగిరి: నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పార్టీ మారుతారన్న వార్తలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మునుగోడు శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. లింగయ్య టీఆర్ఎస్లో చేరితే ఇంతకన్నా ఘోరం ప్రపంచంలో మరొకటి ఉండదని అన్నారు. ఆయనను తన కుటుంబ సభ్యుడిలా భావించి, నకిరేకల్ ఎమ్మెల్యేగా గెలిపించామని గుర్తుచేశారు. ఆయన పార్టీ మారితే ప్రపంచంలో దీన్ని మించిన మోసం ఇంకోటి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లు పదవిలో లేకున్నా, తమని నమ్మకున్న దళితుడికి అన్యాయం జరగొద్దని అధిష్టానంతో కొట్లాడి టికెట్ దక్కేలా చేశామని పేర్కొన్నారు. అలాంటి వ్యక్తి ప్రాణం పోయిన పార్టీ మారకూడదని, కాంగ్రెస్ పార్టీకి అన్యాయం చేయకుండా వెంటనే తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని రాజగోపాల్ రెడ్డి కోరారు. (కారెక్కనున్న మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే!) కాగా కోమటి రెడ్డి బ్రదర్స్‌కు ప్రధాన అనుచరుడైన చిరుమర్తి లింగయ్య టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఆయన కేసీఆర్‌ను కలిసినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. లింగయ్యను సంప్రదించడానికి కోమటి బ్రదర్స్ ప్రయత్నించగా ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆయన పార్టీని వీడితే లోక్‌సభ ఎన్నికలు ముందు ఉమ్మడి నల్గొండలో కోమటి బ్రదర్స్‌కి పెద్ద షాక్ తగిలినట్లే. -
కోమటిరెడ్డి బ్రదర్స్‌కు షాక్..!
సాక్షి, నల్గొండ : ఎమ్మెల్సీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి మరోషాక్ తగిలింది. ఇప్పటికే ఆ పార్టీ ఇద్దరు ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు(అసిఫాబాద్), రేగ కాంతారావు (పినపాక)లు అధికార టీఆర్ఎస్ పార్టీ చేరనున్నట్లు బహిరంగానే ప్రకటించారు. తాజాగా నకిరేకర్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కారెక్కనున్నట్లు తెలుస్తోంది. గురువారం రాత్రి ఆయన సీఎం కేసీఆర్‌ను కలిసినట్లు ప్రచారం జరుగుతోంది. నల్గొండ జిల్లాలో ముఖ్య నేతలైన కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రధాన అనుచరుడైన చిరుమర్తి.. కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్లో చేరనున్నాడనే ప్రచారం తీవ్రచర్చనీయాంశమైంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్టానం చిరుమర్తికి టికెట్ నిరాకరించగా.. కోమటిరెడ్డి బ్రదర్స్ పట్టుబట్టి మరి టికెట్ ఇప్పించారు. ఈ వార్తల నేపథ్యంలో ఆయనను సంప్రదించడానికి మీడియా ప్రయత్నించగా.. ఆయన అందుబాటులోకి రావడంలేదు. చిరుమర్తి, ఆయన సిబ్బంది ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసుకున్నారు. ఇంతటి నమ్మకద్రోహమా? ఇక చిరుమర్తి పార్టీ మారుతున్నాడనే వార్తలపై మునగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందిచారు. ఇంతటి నమ్మకద్రోహం చేస్తారనుకోలేదని, పార్టీ మారే విషయం కనీసం తనకు కూడా చెప్పలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను వార్తల ద్వారనే తెలుసుకొని ఆశ్చర్యపోయానన్నారు. రెండు సార్లు టికెట్ ఇప్పించి ఆయన గెలుపు కోసం కృషి చేశామన్నారు. ఇక చిరుమర్తి పార్టీ మారడంతో జిల్లాలో కొమటిరెడ్డి బ్రదర్స్‌కు రాజకీయంగా గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. అటు కాంగ్రెస్ అధిష్టానం కూడా ఈ వ్యవహారంపై కోమటిరెడ్డి బ్రదర్స్‌పై సీరియస్ అయ్యే అవకాశం ఉంది. -
ఎమ్మెల్యే కారుకు నో పర్మిషన్
నార్కట్‌పల్లి: నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టు గ్రామంలోని శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయ బ్రహ్మోత్సవాలలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకి చేదు అనుభవం ఎదురైంది. మంగళవారం బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యా యి. మొదటి రోజు పూజల్లో పాల్గొనేందుకు వెళ్తున్న చిరుమర్తి కారును అనుమతి లేదంటూ టోల్గేట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అరగంట తర్వాత పైఅధికారుల సమాచారంతో ఎమ్మెల్యే ఒక్కరి కారునే అనుమతించారు. గన్‌మన్ మరో కారులో ఉండటంతో దానిని అనుమతించలేదు. దీనికి నిరసనగా ఎమ్మెల్యే అక్కడి నుంచి కాలినడకన చెర్వుగట్టు పైకి చేరుకు న్నారు. ఎమ్మెల్యేకు ఇవ్వాల్సిన ప్రొటోకాల్‌ను కూడా దేవాలయ సిబ్బంది పాటించకపోవడం గమనార్హం. కొండపైకి చేరుకున్న తర్వాత గేటుకు తాళం వేసి ఉం చారు. దీంతో ఆయన పక్కదారి నుంచి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం గట్టుపైనే కార్య కర్తలతో కలసి ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను దళిత ఎమ్మెల్యే అయినందుకే గట్టుపైకి అనుమతి ఇవ్వకుండా అవమానించారన్నారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల విషయంలోనూ స్థానిక ఎమ్మెల్యేకు తెలియజేయలేదని, ప్రొటోకాల్ సమాచారం కూడా ఇవ్వడం లేదని కలెక్టర్‌కు తెలిపినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. -
చెర్వుగట్టు బ్రహ్మోత్సవాలకు రండి
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల 12 నుంచి ప్రారంభం కానున్న నల్లగొండ జిల్లా నార్కెట్‌పల్లి మండలం చెర్వుగట్టు జడల రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించారు. ఆదివారం అసెంబ్లీలోని సీఎం చాంబర్లో ఆయనను కలిసిన చిరుమర్తి చెర్వుగట్టు అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయాలని కోరారు. ప్రస్తుతం చెర్వుగట్టుకు ఒకటే రోడ్డు ఉందని, వచ్చి వెళ్లేందుకు వేర్వేరు మార్గాలు ఉంటే బాగుంటుందని, అదే విధంగా గుట్ట కింద పార్కింగ్ ప్లేస్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని, సత్రాలు నిర్మించాలని కోరారు. గట్టుపై ఉన్న భూమిని చదును చేసేందుకు నిధులు మంజూరు చేయాలని, నార్కెట్‌పల్లి నుంచి చెర్వుగట్టు మీదకు వచ్చే సర్వీసు రోడ్డును పూర్తి చేయాలని ఆయన కోరారు. అదే విధంగా నకిరేకల్ పట్టణం నుంచి నల్లగొండకు వెళ్లే సింగిల్ రోడ్డు చాలా ప్రమాదకరంగా మారిందని, దానికి మరమ్మతులు చేపట్టాలని కోరారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డిలు తమ నియోజకవర్గ సమస్యలపై వేర్వేరుగా సీఎంకు వినతిపత్రాలు అందజేశారు. -
పంతం నెగ్గించుకున్న కోమటిరెడ్డి బ్రదర్స్..!
నల్గొండ: కోమటిరెడ్డి సోదరులు పంతం నెగ్గించుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన తొలి జాబితాలో ఏకంగా మూడు స్థానాలు సాధించి తమ సత్తా ఏమిటో చాటారు. నల్లగొండ నుంచి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మునుగోడు నుంచి కోమటిరెడ్డి సోదరుడు రాజగోపాల్‌రెడ్డి, నకిరేకల్ నుంచి వారి అనుచరుడు చిరుమర్తి లింగయ్య టికెట్లు సాధించారు. తొలిజాబితాలోనే తనతోపాటు తన సోదరుడికి, అనుచరుడికి టికెట్ ఖరారవ్వడంపై తాజా మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. గతంలో ఎప్పుడూలేని విధంగా కాంగ్రెస్ హైకమాండ్ టికెట్ల విషయంలో జాగ్రత్తలు పాటించిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన సీట్లను బట్టి చూస్తే కచ్చితంగా మహా కూటమి అధికారంలోకి వస్తుందన్న నమ్మకం కుదిరిందన్నారు. రేపటి నుంచి ప్రచారం ముమ్మరంగా ఉంటుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు సోనియా గాంధీ, అధ్యక్షుడు రాహుల్ గాంధీ సభలతో కొత్త జోష్ తీసుకువస్తామని ధీమా వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి సోదరులకు రుణపడి ఉంటా: చిరుమర్తి కోమటిరెడ్డి సోదరుల ఆశీస్సులతోనే మళ్లీ తనకు టికెట్ దక్కిందని నకిరేకల్ అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్య తెలిపారు. జీవితాంతం కోమటిరెడ్డి సోదరులకు రుణపడి ఉంటానని ఉద్వేగంగా అన్నారు.