నార్కట్‌పల్లి: నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టు గ్రామంలోని శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయ బ్రహ్మోత్సవాలలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకి చేదు అనుభవం ఎదురైంది. మంగళవారం బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యా యి. మొదటి రోజు పూజల్లో పాల్గొనేందుకు వెళ్తున్న చిరుమర్తి కారును అనుమతి లేదంటూ టోల్‌గేట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అరగంట తర్వాత పైఅధికారుల సమాచారంతో ఎమ్మెల్యే ఒక్కరి కారునే అనుమతించారు. గన్‌మన్ మరో కారులో ఉండటంతో దానిని అనుమతించలేదు. దీనికి నిరసనగా ఎమ్మెల్యే అక్కడి నుంచి కాలినడకన చెర్వుగట్టు పైకి చేరుకు న్నారు.
ఎమ్మెల్యేకు ఇవ్వాల్సిన ప్రొటోకాల్‌ను కూడా దేవాలయ సిబ్బంది పాటించకపోవడం గమనార్హం. కొండపైకి చేరుకున్న తర్వాత గేటుకు తాళం వేసి ఉం చారు. దీంతో ఆయన పక్కదారి నుంచి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం గట్టుపైనే కార్య కర్తలతో కలసి ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను దళిత ఎమ్మెల్యే అయినందుకే గట్టుపైకి అనుమతి ఇవ్వకుండా అవమానించారన్నారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల విషయంలోనూ స్థానిక ఎమ్మెల్యేకు తెలియజేయలేదని, ప్రొటోకాల్ సమాచారం కూడా ఇవ్వడం లేదని కలెక్టర్‌కు తెలిపినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment