నకిరేకల్ (ఎస్సి) నియోజకవర్గం
2009లో నియోజకవర్గ పునర్ విభజనలో రామన్నపేట నియోజకవర్గం రద్దై నకిరేకల్ (ఎస్సి) నియోజకవర్గం నూతనంగా ఏర్పడింది.
నకిరేకల్ రిజర్వుడ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఐ పక్షాన పోటీచేసిన చిరుమర్తి లింగయ్య రెండోసారి విజయం సాదించారు. ఆయన గతంలో 2009లో ఒకసారి, తిరిగి 2018లో మరోసారి గెలిచారు. లింగయ్య తన సమీప ప్రత్యర్ది, సిట్టింగ్ టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే వేముల వీరేశంపై 8259 ఓట్ల మెజార్టీతో నెగ్గారు. ఆ తర్వాత కొద్ది కాలానికి లింగయ్య కాంగ్రెస్ ఐకి గుడ్ బై చెప్పి అదికార టిఆర్‌ఎస్‌లో చేరిపోవడం విశేషం. లింగయ్యకు 93699 ఓట్లు రాగా, వీరేశంకు 85440 ఓట్లు వచ్చాయి. ఇక్కడ ఎస్.ఎఫ్ బి అభ్యర్దిగా పోటీచేసిన డి.రవికుమార్‌కు పదివేలకు పైగా ఓట్లు వచ్చాయి.
నకిరేకల్ నియోజకవర్గంలో 2014లో టిఆర్‌ఎస్ అభ్యర్ధి వేముల వీరేశం సిటింగ్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ అభ్యర్ది చిరుమర్తి లింగయ్యను 2370 ఓట్ల తేడాతో ఓడిరచారు. ఇక్కడ టిఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన చెరుకు సుధాకర్ తన భార్య లక్ష్మిని బిజెపి పక్షాన రంగంలో దించినా ప్రయోజనం దక్కలేదు. ఆమెకు38440 ఓట్లు వచ్చాయి. సిపిఎం పక్షాన పోటీచేసిన ఎమ్.సర్వయ్యకు 12741 ఓట్లు వచ్చాయి. 2018లో లింగయ్య గెలవగలిగారు. నకిరేకల్ నియోజకవర్గంలో సిపిఐ ఒకసారి, సిపిఎం ఎనిమిదిసార్లు, కాంగ్రెస్ కాంగ్రెస్‌లు మూడుసార్లు, టిఆర్‌ఎస్, పిడిఎఫ్ ఒక్కొక్కసారి గెలుపొందాయి.
2009లో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత నకిరేకల్ రిజర్వుడ్ కేట గిరిలోకి వెళ్లింది. అంతకు ముందు జనరల్‌గా ఉన్నప్పుడు సిపిఎం నేత నర్రా రాఘవరెడ్డి ఇక్కడ నుండి ఆరుసార్లు గెలిచారు. టిడిపి ఇక్కడ ఒక్కసారి కూడా గెలవలేదు. సిపిఎం నేత నోముల నరసింహయ్య ఇక్కడ రెండుసార్లు గెలిచారు. ఆయన 2009లో భువనగిరి లోక్‌సభకు పోటీచేసి ఓడిపోయారు.
2014లో టిఆర్‌ఎస్‌లో చేరి సాగర్ నుంచి పోటీచేసి ఓడినా, 2018లో గెలవగలిగారు. దాదాపు మూడు దశాబ్దాల పాటు సిపిఎం నకిరేకల్‌లో పట్టు నిలబెట్టుకున్నా, 2009 నుంచి ఓడిపోతోంది. 1957లో ఇక్కడ గెలిచిన ధర్మభిక్షం నల్గొండలో, సూర్యాపేటలలో కూడా గెలిచారు. ఈయన రెండుసార్లు లోక్‌సభకు కూడా గెలుపొందారు. నకిరేకల్ రిజర్వుడ్ కాకముందు ఏడుసార్లు రెడ్లు, నాలుగుసార్లు బిసిలు (రెండుసార్లు గౌడ, రెండుసార్లు యాదవ) ఎన్నికయ్యారు.
రామన్నపేటలో (2009లో రద్దు)
1952లో ఏర్పడిన రామన్నపేట శాసనసభ నియోజకవర్గంలో ఒక ఉప ఎన్నికతో సహా 13సార్లు ఎన్నికలు జరగ్గా, పిడిఎఫ్ రెండుసార్లు, కాంగ్రెస్, కాంగ్రెస్ (ఐ)లు ఏడుసార్లు, సిపిఐ నాలుగుసార్లు గెలుపొందాయి. ఈ నియోజకవర్గానికి చెందిన ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి శాసనసభకు రెండుసార్లు గెలిచారు. 1999, 2004లలో ఆయన గెలుపొందారు.
ఆయన శాసనమండలి సభ్యునిగా ఎక్కువ కాలం ఉన్నారు. పురుషోత్తంరెడ్డి 1971లో కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గంలోను, 1973లో జలగం వెంగళరావు క్యాబినెట్‌లోను సభ్యునిగా ఉన్నారు. కొమ్ము పాపయ్య 1981లో టి.అంజయ్య మంత్రివర్గంలో సభ్యునిగా ఉన్నారు.సిపిఐ నేతలు కె.రామచంద్రారెడ్డి, జి.యాదగిరిరెడ్డిలు మూడేసి సార్లు అసెంబ్లీకి గెలిచారు. రామన్నపేట లో ఎనిమిది సార్లు రెడ్లు, రెండుసార్లు బిసిలు, మూడుసార్లు ఎస్.సిలు ఎ న్నికయ్యారు.
నకిరేకల్ (ఎస్సి) నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..
Comments
Please login to add a commentAdd a comment