భువనగిరి నియోజకవర్గం
భువనగిరి నియోజకవర్గంలో టిఆర్‌ఎస్ పక్షాన పోటీచేసిన పైళ్ల శేఖర్ రెడ్డి రెండోసారి గెలిచారు. ఆయన తన సమీప కాంగ్రెస్ ఐ ప్రత్యర్ది కుంభా అనిల్‌కుమార్ రెడ్డిపై 24063 ఓట్ల ఆదిక్యతతో గెలిచారు. తెలంగాణ ఉద్యమ ప్రభావం బాగా ఉన్న ఈ ప్రాంతం నుంచి టిఆర్‌ఎస్ తేలికగా గెలించింది. కాగా ఇక్కడ యువ తెలంగాణ పార్టీ పక్షాన పోటీచేసిన జిట్టా బాలకృష్ణారెడ్డికి 13400 పైచిలుకు ఓట్లు వచ్చాయి. శేఖర్ రెడ్డికి 84898 ఓట్లు రాగా, అనిల్ కుమార్ రెడ్డికి 60556 ఓట్లు వచ్చాయి.
శేఖర్ రెడ్డి సామాజికవర్గం పరంగా రెడ్డి వర్గం నేత. 1985 నుంచి భువనగిరిలో అప్రతిహతంగా విజయ దుంధుభి మోగిస్తున్న తెలుగుదేశం పార్టీ 2014లో తొలిపారి ఓడిపోయింది. మాజీ మంత్రి, దివంగత నేత ఎ.మాధవరెడ్డి, ఆయన భార్య ఉమ మూడు దశాబ్దాలుగా ఇక్కడ ప్రాతి నిద్యం వహించారు. 2014లో టిఆర్‌ఎస్ నేత పైళ్ల శేఖర్‌రెడ్డి భువనగిరిలో విజయం సాధించారు. విశేషం ఏమిటంటే ఆయన సమీప ప్రత్యర్ధిగా స్వతంత్ర అభ్యర్ధిగా రంగంలో ఉన్న జిట్టా బాలకృష్ణారెడ్డి కావడం.
శేఖర్‌రెడ్డి 15416 ఆధిక్యతతో గెలిచారు. ఉమా మాధవరెడ్డికి 24569 ఓట్లు వచ్చాయి. ఆమె ఇక్కడ రెండో స్థానంలో కూడా లేరు. తెలంగాణ ఉద్యమ ప్రభావం బాగా ఉండడం కూడా కారణం కావచ్చు. మాధవరెడ్డి నాలుగుసార్లు విజయం సాధిస్తే ఆయన భార్య ఉమా మాధవరెడ్డి మూడుసార్లు గెలుపొందారు. 1999 ఎన్నికల తర్వాత నక్సల్ ఘాతుకానికి మాధవరెడ్డి బలైపోయారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికలోను, 2004, 2009లలో ఉమా మాధవరెడ్డి గెలిచారు. మాధవరెడ్డి గతంలో ఎన్.టి.ఆర్, ఆ తర్వాత చంద్రబాబు క్యాబినెట్‌లలో పనిచేశారు. ఉమ కూడా చంద్రబాబు క్యాబినెట్‌లో పనిచేశారు.
భార్యభర్తలిద్దరూ మంత్రులైన ఘనత వీరికి దక్కింది. భువనగిరి, ఆలేరులలో గతంలో గెలుపొందిన ఆరుట్ల రామచంద్రారెడ్డి, కమలాదేవిలు రెండుసార్లు గెలుపొంది శాసన సభ్యులుగా ఉండడం మరోరికార్డు. రామచంద్రారెడ్డి ఒకసారి మెదక్‌జిల్లా నుంచి, ఒకసారి ఇక్కడ నుంచి గెలవగా, కమలాదేవి ఆలేరు నుంచి మూడుసార్లు గెలిచారు. భువనగిరిలో పిడిఎఫ్ రెండుసార్లు, సిపిఐ ఒకసారి, కాంగ్రెస్, కాంగ్రెస్‌ఐ కలిసి ఐదుసార్లు గెలుపొందగా, టిడిపి ఏడుసార్లు టిఆర్‌ఎస్ రెండుసార్లు గెలిచింది.
కేంద్ర మాజీ మంత్రి ఎ. నరేంద్ర 2004లో ఇక్కడ టిఆర్‌ఎస్ పక్షాన పోటీచేసి ఓడిపోయారు. కాగా జిట్టా బాలకృష్ణరెడ్డి 2009లో టిఆర్‌ఎస్ తిరుగుబాటు అభ్యర్ధిగా రంగంలో ఉండగా, 2014, 2018లలో స్వతంత్రుడిగా పోటీచేశారు. తెలంగాణ పోరాట యోధుడు, కమ్యూనిస్టు పార్టీ నేత రావి నారాయణరెడ్డి భువనగిరిలో రెండుసార్లు గెలిచారు.
1952లో ఈయన ఒకేసారి లోక్‌సభకు, అసెంబ్లీకి గెలుపొందారు. తర్వాత అసెంబ్లీకి రాజీనామా చేశారు. ఇక్కడ రెండుసార్లు గెలిచిన కొండా లక్ష్మణ్‌బాపూజీ మరో రెండుసార్లు చినకొండూరులో గెలిచారు. అంతకుముందు ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్‌లో కూడా ఒకసారి విజయం సాధించారు. ఈయన దామోదరం సంజీవయ్య, కాసు మంత్రివర్గాలలో పనిచేశారు. భువనగిరిలో పద్నాలుగుసార్లు రెడ్లు గెలుపొందితే, రెండుసార్లు పద్మశాలి, ఒకసారి ఎస్.సి వర్గం నేతలు గెలుపొందారు.
భువనగిరి నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..
Comments
Please login to add a commentAdd a comment