bhuvana giri
-
వచ్చే ఎన్నికల్లో భువనగిరి నియోజకవర్గంని జయించేది ఎవరు?
భువనగిరి నియోజకవర్గం భువనగిరి నియోజకవర్గంలో టిఆర్ఎస్ పక్షాన పోటీచేసిన పైళ్ల శేఖర్ రెడ్డి రెండోసారి గెలిచారు. ఆయన తన సమీప కాంగ్రెస్ ఐ ప్రత్యర్ది కుంభా అనిల్‌కుమార్ రెడ్డిపై 24063 ఓట్ల ఆదిక్యతతో గెలిచారు. తెలంగాణ ఉద్యమ ప్రభావం బాగా ఉన్న ఈ ప్రాంతం నుంచి టిఆర్ఎస్ తేలికగా గెలించింది. కాగా ఇక్కడ యువ తెలంగాణ పార్టీ పక్షాన పోటీచేసిన జిట్టా బాలకృష్ణారెడ్డికి 13400 పైచిలుకు ఓట్లు వచ్చాయి. శేఖర్ రెడ్డికి 84898 ఓట్లు రాగా, అనిల్ కుమార్ రెడ్డికి 60556 ఓట్లు వచ్చాయి. శేఖర్ రెడ్డి సామాజికవర్గం పరంగా రెడ్డి వర్గం నేత. 1985 నుంచి భువనగిరిలో అప్రతిహతంగా విజయ దుంధుభి మోగిస్తున్న తెలుగుదేశం పార్టీ 2014లో తొలిపారి ఓడిపోయింది. మాజీ మంత్రి, దివంగత నేత ఎ.మాధవరెడ్డి, ఆయన భార్య ఉమ మూడు దశాబ్దాలుగా ఇక్కడ ప్రాతి నిద్యం వహించారు. 2014లో టిఆర్ఎస్ నేత పైళ్ల శేఖర్‌రెడ్డి భువనగిరిలో విజయం సాధించారు. విశేషం ఏమిటంటే ఆయన సమీప ప్రత్యర్ధిగా స్వతంత్ర అభ్యర్ధిగా రంగంలో ఉన్న జిట్టా బాలకృష్ణారెడ్డి కావడం. శేఖర్‌రెడ్డి 15416 ఆధిక్యతతో గెలిచారు. ఉమా మాధవరెడ్డికి 24569 ఓట్లు వచ్చాయి. ఆమె ఇక్కడ రెండో స్థానంలో కూడా లేరు. తెలంగాణ ఉద్యమ ప్రభావం బాగా ఉండడం కూడా కారణం కావచ్చు. మాధవరెడ్డి నాలుగుసార్లు విజయం సాధిస్తే ఆయన భార్య ఉమా మాధవరెడ్డి మూడుసార్లు గెలుపొందారు. 1999 ఎన్నికల తర్వాత నక్సల్ ఘాతుకానికి మాధవరెడ్డి బలైపోయారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికలోను, 2004, 2009లలో ఉమా మాధవరెడ్డి గెలిచారు. మాధవరెడ్డి గతంలో ఎన్.టి.ఆర్, ఆ తర్వాత చంద్రబాబు క్యాబినెట్లలో పనిచేశారు. ఉమ కూడా చంద్రబాబు క్యాబినెట్లో పనిచేశారు. భార్యభర్తలిద్దరూ మంత్రులైన ఘనత వీరికి దక్కింది. భువనగిరి, ఆలేరులలో గతంలో గెలుపొందిన ఆరుట్ల రామచంద్రారెడ్డి, కమలాదేవిలు రెండుసార్లు గెలుపొంది శాసన సభ్యులుగా ఉండడం మరోరికార్డు. రామచంద్రారెడ్డి ఒకసారి మెదక్‌జిల్లా నుంచి, ఒకసారి ఇక్కడ నుంచి గెలవగా, కమలాదేవి ఆలేరు నుంచి మూడుసార్లు గెలిచారు. భువనగిరిలో పిడిఎఫ్ రెండుసార్లు, సిపిఐ ఒకసారి, కాంగ్రెస్, కాంగ్రెస్ఐ కలిసి ఐదుసార్లు గెలుపొందగా, టిడిపి ఏడుసార్లు టిఆర్ఎస్ రెండుసార్లు గెలిచింది. కేంద్ర మాజీ మంత్రి ఎ. నరేంద్ర 2004లో ఇక్కడ టిఆర్ఎస్ పక్షాన పోటీచేసి ఓడిపోయారు. కాగా జిట్టా బాలకృష్ణరెడ్డి 2009లో టిఆర్ఎస్ తిరుగుబాటు అభ్యర్ధిగా రంగంలో ఉండగా, 2014, 2018లలో స్వతంత్రుడిగా పోటీచేశారు. తెలంగాణ పోరాట యోధుడు, కమ్యూనిస్టు పార్టీ నేత రావి నారాయణరెడ్డి భువనగిరిలో రెండుసార్లు గెలిచారు. 1952లో ఈయన ఒకేసారి లోక్‌సభకు, అసెంబ్లీకి గెలుపొందారు. తర్వాత అసెంబ్లీకి రాజీనామా చేశారు. ఇక్కడ రెండుసార్లు గెలిచిన కొండా లక్ష్మణ్‌బాపూజీ మరో రెండుసార్లు చినకొండూరులో గెలిచారు. అంతకుముందు ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్‌లో కూడా ఒకసారి విజయం సాధించారు. ఈయన దామోదరం సంజీవయ్య, కాసు మంత్రివర్గాలలో పనిచేశారు. భువనగిరిలో పద్నాలుగుసార్లు రెడ్లు గెలుపొందితే, రెండుసార్లు పద్మశాలి, ఒకసారి ఎస్.సి వర్గం నేతలు గెలుపొందారు. భువనగిరి నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
మామిడిలో సస్యరక్షణకు హోమియో మందులు
మామిడి పూత, పిందె దశలో సస్యరక్షణకు హోమియో మందులు ఎంతగానో ఉపయోగపడతాయని యాదాద్రి భువనగిరి జిల్లా రామకృష్ణాపురంలోని అమేయ కృషి వికాస కేంద్రం వ్యవస్థాపకులు, రైతు శాస్త్రవేత్త జిట్టా బాల్‌రెడ్డి చెబుతున్నారు. ఆయన మాటల్లోనే.. ► మామిడి చెట్లకు పూత సరిగ్గా రావాలంటే ZINCUMET-30, MAGPHOS-30, BORAN / BORAX-30 ఆౖఖఅగీ30 మందులను వారం రోజుల వ్యవధిలో 3 సార్లు చొప్పున.. ఒకదాని వెంట మరొకటి 3 సార్లు పిచికారీ చేసుకోవాలి. అట్లనే పూత బలంగా రావటం కోసం PULSATILLA-30 ను కూడా పిచికారీ చేసుకోవాలి. ► దోమ నుంచి పూతను, పిందెను కాపాడుకోవడానికి COCCINELLA SEPTE - 30 పిచికారీ చేసుకోవాలి. ► రేగు కాయల పరిమాణంలోకి వచ్చిన మామిడి కాయలు రాలిపోతుంటే BOVISTA -30 పొటెన్సీలో పిచికారీ చేసుకోవాలి. మంచు ఎక్కువగా పడుతుంటే పూత, పిందెను రక్షించుకోవడానికి CUPRUM SULPH-30 పిచికారీ చేసుకోవాలి. ► మంగుతో కాయ నల్లగా మారుతూ ఉంటే, ముడ్డుపుచ్చు (ఆంత్రాక్నోస్)ను నివారించుకోవడానికి ALYSIC ACID-30 CARBOVEG-30 పిచికారీ చేసుకోవాలి. ► కొమ్మెండు తెగులు నుంచి రక్షించుకోవడానికి CUPRUM SULPH-30 పిచికారీ చేసుకోవాలి. ► పాత తోటల్లో మామిడి ఆకులపైన బుడిపెలు (మాల్ ఫార్మేషన్) వస్తే కొమ్మలను కత్తిరించి, దూరంగా తీసుకెళ్లి తగులబెట్టాలి. ఇది అంటు వ్యాధి. అరికట్టకపోతే దిగుబడిపై కూడా ప్రభావితం చూపిస్తుంది. TUJA-200 ను వారంలో 3 సార్లు పిచికారీ చేసుకుంటే పోతుంది. ► కాయ పెరుగుదల మొదటి దశలోAMONIUMPHOS-30 పిచికారీ చేసుకోవచ్చు. తర్వాత కాయ పెరుగుతున్న దశలో UPHALA-30ను పిచికారీ చేసుకోవచ్చు. ఇది అమేయ కృషి వికాస కేంద్రం రూ΄పొం దించిన మందు. బయట మందుల షాపులో దొరకదు. త్రిబుల్19కు ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది. ► మామిడి రైతులకు మరో ముఖ్య సూచన ఏమిటంటే.. 15 రోజులకోసారి నీటి తడులతో పాటు ఎకరానికి 800 నుంచి 1,000 లీటర్ల వరకు గోకృపామృతం పారించుకుంటే.. కాయ పరిమాణం బాగుంటుంది, కాయ రాలకుండా ఉంటుంది. మరిన్ని వివరాలకు ఈ కింది వీడియో చూడొచ్చు. www.youtube.com/@ameyakrishivikasakendram5143 -
ఖిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలి
సాక్షి, భూదాన్‌పోచంపల్లి : వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధిక మెజారిటీతో గెలిపించి భువనగిరి ఖిలాపై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని ఆ పార్టీ అభ్యర్థి కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని పెద్దరావులపల్లి రజక సంఘం నాయకులు కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రూ.2 లక్షల రుణమాఫీ, రూ.3వేల నిరుద్యోగ భృతి, లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తుందని అన్నారు. కార్యకర్తలంతా సమష్టిగా పనిచేసి కాంగ్రెస్ గెలుపునకు కృషి చేయాలని కోరారు. పోచంపల్లి రెడీమేడ్ వస్త్ర వ్యాపారులు కుంభం సమక్షంలో కాంగ్రెస్ చేరారు. పార్టీలో చేరిన వారిలో సంగెం రంగులు, రాములు, కిష్టయ్య, యాదయ్య, వెంకయ్య, నర్సింహ, గణేశ్, బాలకృష్ణ, సంజీవ, తోటకూర బాలయ్య, దానయ్య, సంగెం శ్రీను, లింగం, శ్రీకాంత్, నాగేశ్, మహేశ్, మక్తాల కృష్ణ, గుర్రం నర్సింహ, జెల్ల బాలయ్య, భువనగిరి రాములు, కీర్తి భాస్కర్, దోర్నాల బాలరాజు తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో తడక వెంకటేశం, కొట్టం కరుణాకర్‌రెడ్డి, భారత లవకుమార్, మలిపెద్ది అంబరీష్‌రెడ్డి, ఎంపీటీసీ ఆర్.సంధ్యాలాలయ్య, గంజి గణేశ్, కందాల గణేశ్, శీలం అంజయ్య, వడకాల రమేష్, బాలకృష్ణ, జంగయ్య, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గాన్ని సస్యశామలం చేస్తా బీబీనగర్ : ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడుతన్న తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే భువనగిరి నియోజకవర్గాన్ని సస్యశామలం చేస్తానని కాంగ్రెస్ అభ్యర్థి కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. మండలంలోని జంపల్లి, గుర్రాలదండి, చిన్న, పెద్ద పలుగుతుండాలతో పాటు ముగ్దుంపల్లి, రావిపహాడ్, మాదారం తదితర గ్రామాల్లో శనివారం ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని పదేపదే చెప్పుకుంటున్న పైళ్ల శేఖర్‌రెడ్డి ఎక్కడి సమస్యలు అక్కడే వదిలేశాడని దుయ్యబట్టారు. పబ్లిసిటీ కోసం ప్రజలను మభ్యపెడుతూ నీటి క్యాన్లు, హెల్మెట్లు పంపిణీ చేసి చేతులు దులుపుకుంటున్నాడని విమర్శించారు. కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ నారాయణరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు శ్యామ్‌గౌడ్, జెడ్పీటీసీ బస్వయ్య, ఎంపీటీసీ వెంకటేష్, రామాంజనేయులు, మంగ్తానాయక్, రాజేశ్వర్, రాజేందర్, గోపి, రాములు, రాము, కొండల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
25కు 24 కిలోలే..!
భువనగిరి : జిల్లాలో బియ్యం కొనుగోలుదారుల నమ్మకాన్ని వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. ఉండాల్సిన తూకం కంటే తక్కువ ఉన్న బియ్యం బస్తాలను విక్రయిస్తున్నారు. 25 కేజీల బియ్యం బ్యాగుల్లో అర కేజీ కొన్నిసార్లు 750 గ్రాముల వరకు తరుగుదల వస్తున్నాయి. ఈ లెక్కన వినియోగదారులు ప్రతి బ్యాగు మీద నెలకు రూ.18.40 పైసల చొప్పున నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తుండటంతో వివిధ బ్రాండ్ల పేర్లతోవ్యాపారులు తక్కువ తూకం ఉన్న బియ్యం బ్యాగులను మార్కెట్లోకి సరఫరా చేస్తున్నారు. బియ్యం తక్కువ ఉన్నప్పటికీ నిర్ణీత ధరకే విక్రయిస్తుడటంతో విక్రయదారులు లాభపడుతూ విని యోగదారులు నష్టపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా 50నుంచి 60వరకు 25కేజీల బ్యాగులను విక్రయించే దుకాణాలు ఉన్నాయి.వీటిల్లో ప్రధానంగా భువనగిరి, చౌటుప్పల్, యాదగిరిగుట్ట, అలేరు, రామన్నపేట, మోత్కూర్, భూదాన్‌పోచంపల్లి, వలిగొండ ప్రాంతాల్లో వీటిని విక్రయిస్తున్నారు. జిల్లాలో బియ్యం అవసరాలు ఇలా.. జిల్లాలో 7,39,448 జనాభా ఉండగా మహిళలు 3,64,729, పురుషులు 3,74,719 ఉన్నారు. కుటుంబాలు 1,80,677 ఉన్నాయి. ప్రతి కుటుం బం సగటును ప్రతి నెలా 37కేజీల వరకు బియ్యం వినియోగిస్తున్నారు. ఈ ప్రకారంగా ప్రతి నెలా జిల్లాలో 66,750 క్వింటాళ్ల బియ్యాన్ని ఆహారంగా తీసుకుంటున్నారు. ఇందులో 45,169 కుటుం బాలు బియ్యాన్ని కొనుగోళ్లు చేస్తుండగా మిగతా వారు వ్యవసాయం ద్వారా వచ్చిన బియ్యాన్ని వినియోగిస్తున్నారు. కొనుగోలు చేసి ఆహారంగా తీసుకుంటున్న వారికి ప్రతి నెలా 16,712 క్వింటాళ్ల బియం అవసర పడుతుంది. ప్రతి నెలా రూ.23లక్షలు నష్టం సాధారణంగా మార్కెట్లో కొత్త బియ్యం 25 కిలోల బ్యాగుకు రూ.1,000కు, పాత వాటిని రూ.1,150కి అమ్ముతున్నారు. ఇందులో పాతవి కిలో రూ.46 వరకు, 100 గ్రాముల బియ్యానికి రూ.4.60 పైసలు ఉంటుంది. ప్రతి 25 కేజీల బ్యాగులో రూ.300 నుంచి రూ.500గ్రాముల వరకు బియ్యం తక్కువగా వస్తుండటం వల్ల ప్రతి నెలా ఒక్కో బ్యాగుపై రూ.18.40 వరకు వినియోగదారుడు నష్టపోతున్నాడు. కాగా బియ్యాన్ని కొ నుగోలు చేస్తున్న 45,169 కుటుంబాల్లో సుమారు 50శాతం అనగా వీరిలో 22,584 కుటుంబాలు తక్కువ బియ్యం వస్తున్న బ్యాగులను కొనుగోళ్లు చేస్తున్నారు. దీని ప్రకారం ఈ కుటుంబాలు ప్రతి నెలా రూ.4,15,554 నష్టపోతున్నారు. కొన్నిసార్లు కిలో వరకు తూకం తేడా ఉంటుంది. ఇలాంటి సమయంలో వినియోగదారులు ఎక్కువగా నష్టపోతున్నారు. లోకల్ బ్రాండ్లలో ఎక్కువగా.. సాధారణంగా జిల్లాలోని వ్యాపారులు బియ్యం బ్యాగులను హైదరాబాద్ నుంచి దిగుమతి చేసుకుంటారు. ఇందులో కొన్ని బ్యాగులు నాణ్యమైన బ్రాండ్ పేరుతో, మరికొన్ని లోకల్ బ్రాండ్ పేరుతో విక్రయిస్తున్నారు.ఎక్కువ శాతం లోకల్ బ్రాం డ్ పేరుతో వచ్చే 25 కేజీల బ్యాగుల్లో బియ్యం తక్కువగా వస్తున్నాయి. బ్యాగు పై 25 కేజీల బియ్యం ఉన్నట్లు ముద్ర ఉన్నప్పటికీ తూకం వేస్తే తక్కువగా ఉంటున్నాయి. జిల్లా జనాభా : 7,39,448 కుటుంబాల సంఖ్య : 1,80,677 ప్రతి నెలా ఒక్కో కుటుంబానికి అవసరంఅయ్యే బియ్యం : 37 కేజీల వరకు ప్రతి నెలా మొత్తం కుటుంబాలకు కావాల్సిన బియ్యం :66,850క్వింటాళ్లు మార్కెట్లో బియ్యం కొనుగోలు చేస్తున్న కుటుంబాలు : 45,169 వీరికి కావాల్సిన బియ్యం : 16,712 క్వింటాళ్లు బియ్యం తక్కువగా వస్తున్న బ్యాగులను కొనుగోలు చేస్తున్న కుటుంబాలు సగటున : 22,584 ప్రతి నెలా కుటుంబాలు నష్టపోతున్న ఆదాయం : రూ.23.22 లక్షలు 25 కిలోలు ఉండాల్సిందే.. నిబంధనల ప్రకారం 25 కేజీల బ్యాగులో 25 కిలోలు తప్పనిసరిగా ఉండాలి. తగ్గుదల ఉన్నట్లు మా దృష్టికి వస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. త్వరలోనే జిలా వ్యాప్తంగా బియ్యం విక్రయించే దుకాణాల్లో తనిఖీలు నిర్వహిస్తాం. తక్కువగా ఉన్నట్లు తేలినట్లయితే వెంటనే వారిపై కేసు నమోదు చేస్తాం. సరోజిని, తూనికల కొలతల శాఖ, జిల్లా అధికారి -
కాంగ్రెస్ నాయకులు పారిపోతుండ్రూ...
భువనగిరి : అసెంబ్లీ సమావేశాలంటే కాంగ్రెస్ నాయకులు భయపడి పారిపోతుండ్రని విద్యుత్, ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం బీబీనగర్ మండల కేంద్రంలో రూ. 3.64 కోట్లతో చేపట్ట నున్న సీసీరోడ్లు, అండర్ డ్రెయినేజీ, ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ వద్ద ఎమ్మె ల్యే పైళ్ళ శేఖర్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తుంటే కాంగ్రెస్ నాయకుల తీరు పదో తరగతి విద్యార్థులు పరీక్ష కు ఎగ్గొట్టేలా ఉందని ఎద్దేవా చేశారు. 2014లో టీఆర్ఎస్ ఇచ్చిన ఎన్నికల హామీలను మూడేళ్లో అమలు చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. హామీ ఇవ్వని అనేక సంక్షే మ పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టారన్నారు. రైతులు పండించిన ధరను వారే నిర్ణయించుకోవడానికి రైతుల సమన్వయ సమి తులను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. రాష్ట్రంలో నిర్మిస్తున్న ప్రాజెక్టులకు అధిక నిధులు కేటా యించినట్టు చెప్పారు. గంధమల్ల, బస్వాపూర్ రిజర్వాయర్ ద్వారా 44 లక్షల ఎకరాల భూమి సస్యశ్యామలం చేయనున్నట్టు తెలిపారు. బీబీనగర్‌లో ఎస్సీ ఫంక్షన్ హాల్‌కు అవసరమైతే మరి న్ని నిధులు అందజేస్తామని హామీ ఇచ్చారు. నిధులను సద్వినియోగం చేసుకోవాలి – ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి బీబీనగర్‌కు మంజూరైన సుమారు రూ.4 కోట్ల నిధులను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి సూచించారు. 70ఏళ్ల కాలంలో ఎన్నడూ రాని నిధులు ఒకేసారి వచ్చినందున గ్రామ అభివృద్ధికి ఖర్ఛు చేయాలని సూచించారు. అంతకు ముందు కొండమడుగు మెట్టు నుంచి బీబీనగర్ వరకు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. డప్పులు, బాణాసంచా కాల్చి మం త్రికి స్వాగతం పలికారు. కళాకారులు నిర్వహించిన ఆట, పాట అందరినీ అలరించాయి. సమావేశంలో కలెక్టర్ అనితారామచంద్రన్, రాష్ట్ర గిడ్డంగుల చైర్మన్ మందుల సామేల్, డీఆ ర్ఓ రావుల మహేదంర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డా. జడల అమరేందర్‌గౌడ్, రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్ కొలుపుల అమరేందర్, భువనగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ పంతులు నాయక్, ఎంపీపీ గోలి ప్రణితా పింగల్‌రెడ్డి, నాయకులు సుధాకర్, నరేందర్‌రెడ్డి,వెంకన్నగౌడ్, వెంకట్ కిషన్, మండలాల జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి కేటీఆర్ సాయం – ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి భువనగిరి నియోజకవర్గంలో హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న మండలాల అభివృద్ధికి మంత్రి కేటీఆర్ నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి తెలిపారు. ఇప్పటికే భూ దాన్‌పోచంపల్లికి రూ. 3 కోట్లు ఇవ్వడం సంతోషకరం అన్నారు. బీబీనగర్, భూదాన్‌పోంచంపల్లి, వలిగొండ, భువనగిరి మండలాల అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరిన వెంటనే మంత్రి కేటీఆర్ సిద్ధంగా ఉన్నట్లు చెప్పారన్నారు. గ్రామాల్లో అభివృద్ధి పరుగులు – ఎంపీ బూర నర్సయ్యగౌడ్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రా మాల్లో అభివృద్ధి పరిగెడుతుందని ఎంపీ బూర నర్సయ్యగౌడ్ తెలిపారు. కేంద్రం నుంచి నిధులను రాబట్టేందుకు ముఖ్య మంత్రి కేసీఆర్ కొత్తగా రాష్ట్రంలో 4,380 గ్రామ పంచాయతీలు 147 మున్సిపాలిటీలను ఏర్పాటు చేశారన్నారు. గ్రామంలో సర్పంచ్, ఉపసర్పంచ్‌కు జాయింట్ చెక్‌పవర్‌ను కల్పించినట్టు తెలిపారు. జిల్లాకు బీసీ స్టడీ సర్కిల్ మంజూరైందని, ఎస్సీ స్టడీ సర్కిల్ మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి జగదీశ్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. -
ప్రేమజంట ఆత్మహత్యాయత్నం
యాదాద్రి భువనగిరి : భువనగిరి రైల్వేస్టేషన్లో ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పురుగుల మందు తాగిన ప్రేమ జంట పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రేమికులు పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలం కోపల్లికి చెందిన ధనుంజయ్(20), కోమలి(17)గా గుర్తించారు. ప్రేమికులిద్దరూ సోమవారం రాత్రి పశ్చిమగోదావరి నుంచి హైదరాబాద్ వెళ్లే రైలులో వచ్చినట్లు తెలిసింది. ఉదయం 11 గంటలకు భువనగిరిలో దిగారు. అనంతరం వాళ్ల బంధువులకు ఫోన్ చేసి తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపారు. దీంతో బంధువులు బీబీనగర్ మండలం రాఘవాపురంలో తెలిసిన వాళ్లకు ఫోన్ చేయడంతో వారు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. అప్పటికే ప్రేమికులు పురుగుల మందు తాగారు. స్పృహలో ఉండటంతో వెంటనే స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. ధనుంజయ్ పరిస్థితి విషమంగా ఉందని, మెరుగైన చికిత్స నిమిత్తం వెంటనే హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించాలని అక్కడి వైద్యులు సూచించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
భువనగిరి ఖిల్లాపై డీజీపీ కుమార్తె సాహసం
నల్లగొండ జిల్లాలోని భువనగిరి ఖిల్లాను డీజీపీ అనురాగ్ శర్మ భార్య, కుమార్తె సోమవారం ఉదయం సందర్శించారు. వీరి వెంట ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నారు. డీజీపీ కుమర్తె, ఇద్దరు విదేశీయులు ఖిల్లాపైకి ఎక్కి పరిశీలించారు. అనంతరం ఖిల్లాలో ఏర్పాటు చేసిన రాఫ్టింగ్ సెక్షన్ లో సాహసాలు చేశారు. ఖిల్లా పై నుంచి తాడు సాయంతో కిందకు దిగారు. ఈ పర్యటనలో డీజీపీ కుటుంబ సభ్యులతో పాటు.. డీఎస్పీ మోహన్ రెడ్డి కూడా ఉన్నారు. -
వినియోగదారులకు ‘చింత’
పచ్చిచింత ధరాభారం ఈ యేడాది తగ్గుతున్న దిగుబడి ఇబ్బందుల్లో వ్యాపారులు కిలో రూ.35నుంచి రూ.40వరకు అమ్మకాలు భువనగిరి, న్యూస్‌లైన్ చింతకాయ పచ్చడి అంటే నోరూరని వారుం డరు. ఎండకాలం వచ్చిందంటే చాటు.. పచ్చి చింతకాయ, పండు మిరపకాయలతో పచ్చడి చేసుకునేందుకు ఇష్టపడతారు. దీంతో వీటి అమ్మకాలు జోరుగా సాగుతాయి. అయితే, ఈసారి చింతకాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గత సంవత్సరం కిలో చింతకాయలు రూ.30కు అమ్మారు. ఈ సంవత్సరం వాటిని రూ.35నుంచి రూ.40వరకు అమ్ముతున్నారు. దీంతో వినియోగదారులు తక్కువ కొంటున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే చింతకాయ కాపు తగ్గింది. గత ఏడాది మంచి చెట్టుకు సుమారుగా 10క్వింటాల కాయ కాసేది. ఈ యేడా ది 4క్వింటాళ్లకు తగ్గింది. చిగురు కోయడం, మంచు కురవడంతో దిగుబడిపై ప్రభావం చూపిం ది. దీనికితోడు కాయ తెంపడానికి కూలీలు దొరకడం లేదు. కూలిరేట్లు, రవాణా చార్జీలు కూడా భారీగా పెరి గాయి. చింతకాయకంటే పండుకు ఎక్కువ ధర వస్తుందని భావించిన కొందరు చెట్ల యజమానులు కాయ తెంపడం లేదు. దీంతో ధరలు పెరిగాయి. ధరలు గిట్టుబాటు కావడం లేదు : సుగుణమ్మ, చింతకాయ వ్యాపారి, భువనగిరి ధరలు గిట్టుబాటు కావడంలేదు. గత ఏడాదితో పోలిస్తే దిగుబడి బాగా తగ్గింది. చెట్లు లీజుకు తీసుకున్న వారికి లాభం రావడం లేదు. చెట్ల యజమానులు ఎక్కువ ధర చెబుతున్నారు. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి పట్టిన చింతచెట్ల నుంచి దిగుబడి రావడంలేదు. ఈసారి ఎంతో వ్యాపారం సాగుతుందని ఆశపడ్డాం, కానీ లాభం చేకూరడం లేదు. -
మంటల్లో పరిశ్రమలు
బీబీనగర్‌లో కాలిన కెమికల్ ల్యాబ్ పోలేపల్లి సెజ్‌లో హెటిరో ఫార్మా రూ. కోట్లలో ఆస్తినష్టం భువనగిరి/జడ్చర్ల, న్యూస్‌లైన్: వేర్వేరు ప్రాంతాల్లో రెండు పరిశ్రమల్లో భారీ అ గ్నిప్రమాదాలు సంభవించాయి. నల్లగొండ జిల్లా బీబీనగర్‌లోని శ్రీయాం కెమిక ల్ ల్యాబ్, మహబూబ్‌నగర్ జిల్లా పోలేపల్లి సెజ్‌లోని హెటిరో ఫార్మా కంపెనీల్లో జరిగిన ఈ ప్రమాదాల్లో రూ. కోట్లలో ఆస్తినష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచ నా వేస్తున్నారు. బీబీనగర్‌లోని శ్రీయాం రసాయన కంపెనీలో సోమవారం రసాయనాన్ని డ్రమ్ముల్లోకి నింపుతున్న సమయంలో జనరేటర్ నుంచి నిప్పురవ్వలు వెలువడి మంటలు చెలరేగాయి. కొద్దిసేపట్లోనే మంటలు వ్యాపించాయి. కంపెనీలోని రసాయనాల డ్రమ్ములు, నాలుగు రియాక్టర్లు పెద్ద శబ్దంతో పేలిపోయా యి. కంపెనీ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది. భువనగిరి, చౌటుప్ప ల్ నుంచి అగ్నిమాపక దళాలు వచ్చి మంటలను అదుపులోకి తీసుకువ చ్చారుు. హెటిరో ఫార్మా కంపెనీలో... మరోవైపు మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల సమీపంలోని పోలేపల్లి సెజ్‌లోని హెటిరో ఫార్మా కంపెనీలో కూడా పెద్దఎత్తున చెలరేగిన మంటలకు పరిశ్రమలోని ఓ యూనిట్ పూర్తిగా దగ్ధమైంది. పరిశ్రమ జనరల్ బ్లాక్‌లోని నాలుగో యూనిట్ లో షాట్‌సర్క్యూట్‌తో మంటలు వ్యాపించాయి. వ్రాటర్ వాల్ త్వరితగతిన తెరుచుకోకపోవడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. జిల్లాలోని వివిధ చోట్ల నుంచి నా లుగు అగ్నిమాపక యంత్రాలు వచ్చి మంటలను ఆర్పివేశాయి. ఈ ప్రమాదంలో నాలుగో యూనిట్ పూర్తిగా దగ్ధం కాగా, అందులోని ప్యాకింగ్ మెటీరియల్ పూర్తిగా కాలిపోయింది. రూ. కోటి వరకు నష్టం వాటిల్లినట్లు భావిస్తున్నారు.