మంటల్లో పరిశ్రమలు
బీబీనగర్‌లో కాలిన కెమికల్ ల్యాబ్
పోలేపల్లి సెజ్‌లో హెటిరో ఫార్మా రూ. కోట్లలో ఆస్తినష్టం
భువనగిరి/జడ్చర్ల, న్యూస్‌లైన్: వేర్వేరు ప్రాంతాల్లో రెండు పరిశ్రమల్లో భారీ అ గ్నిప్రమాదాలు సంభవించాయి. నల్లగొండ జిల్లా బీబీనగర్‌లోని శ్రీయాం కెమిక ల్ ల్యాబ్, మహబూబ్‌నగర్ జిల్లా పోలేపల్లి సెజ్‌లోని హెటిరో ఫార్మా కంపెనీల్లో జరిగిన ఈ ప్రమాదాల్లో రూ. కోట్లలో ఆస్తినష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచ నా వేస్తున్నారు. బీబీనగర్‌లోని శ్రీయాం రసాయన కంపెనీలో సోమవారం రసాయనాన్ని డ్రమ్ముల్లోకి నింపుతున్న సమయంలో జనరేటర్ నుంచి నిప్పురవ్వలు వెలువడి మంటలు చెలరేగాయి. కొద్దిసేపట్లోనే మంటలు వ్యాపించాయి. కంపెనీలోని రసాయనాల డ్రమ్ములు, నాలుగు రియాక్టర్లు పెద్ద శబ్దంతో పేలిపోయా యి. కంపెనీ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది. భువనగిరి, చౌటుప్ప ల్ నుంచి అగ్నిమాపక దళాలు వచ్చి మంటలను అదుపులోకి తీసుకువ చ్చారుు.
హెటిరో ఫార్మా కంపెనీలో...
మరోవైపు మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల సమీపంలోని పోలేపల్లి సెజ్‌లోని హెటిరో ఫార్మా కంపెనీలో కూడా పెద్దఎత్తున చెలరేగిన మంటలకు పరిశ్రమలోని ఓ యూనిట్ పూర్తిగా దగ్ధమైంది. పరిశ్రమ జనరల్ బ్లాక్‌లోని నాలుగో యూనిట్ లో షాట్‌సర్క్యూట్‌తో మంటలు వ్యాపించాయి. వ్రాటర్ వాల్ త్వరితగతిన తెరుచుకోకపోవడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. జిల్లాలోని వివిధ చోట్ల నుంచి నా లుగు అగ్నిమాపక యంత్రాలు వచ్చి మంటలను ఆర్పివేశాయి. ఈ ప్రమాదంలో నాలుగో యూనిట్ పూర్తిగా దగ్ధం కాగా, అందులోని ప్యాకింగ్ మెటీరియల్ పూర్తిగా కాలిపోయింది. రూ. కోటి వరకు నష్టం వాటిల్లినట్లు భావిస్తున్నారు.