పచ్చిచింత ధరాభారం
ఈ యేడాది తగ్గుతున్న దిగుబడి
ఇబ్బందుల్లో వ్యాపారులు
కిలో రూ.35నుంచి రూ.40వరకు అమ్మకాలు
భువనగిరి, న్యూస్‌లైన్
చింతకాయ పచ్చడి అంటే నోరూరని వారుం డరు. ఎండకాలం వచ్చిందంటే చాటు.. పచ్చి చింతకాయ, పండు మిరపకాయలతో పచ్చడి చేసుకునేందుకు ఇష్టపడతారు. దీంతో వీటి అమ్మకాలు జోరుగా సాగుతాయి. అయితే, ఈసారి చింతకాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గత సంవత్సరం కిలో చింతకాయలు రూ.30కు అమ్మారు. ఈ సంవత్సరం వాటిని రూ.35నుంచి రూ.40వరకు అమ్ముతున్నారు. దీంతో వినియోగదారులు తక్కువ కొంటున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే చింతకాయ కాపు తగ్గింది. గత ఏడాది మంచి చెట్టుకు సుమారుగా 10క్వింటాల కాయ కాసేది. ఈ యేడా ది 4క్వింటాళ్లకు తగ్గింది. చిగురు కోయడం, మంచు కురవడంతో దిగుబడిపై ప్రభావం చూపిం ది. దీనికితోడు కాయ తెంపడానికి కూలీలు దొరకడం లేదు. కూలిరేట్లు, రవాణా చార్జీలు కూడా భారీగా పెరి గాయి. చింతకాయకంటే పండుకు ఎక్కువ ధర వస్తుందని భావించిన కొందరు చెట్ల యజమానులు కాయ తెంపడం లేదు. దీంతో ధరలు పెరిగాయి.
ధరలు గిట్టుబాటు కావడం లేదు : సుగుణమ్మ, చింతకాయ వ్యాపారి, భువనగిరి
ధరలు గిట్టుబాటు కావడంలేదు. గత ఏడాదితో పోలిస్తే దిగుబడి బాగా తగ్గింది. చెట్లు లీజుకు తీసుకున్న వారికి లాభం రావడం లేదు. చెట్ల యజమానులు ఎక్కువ ధర చెబుతున్నారు. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి పట్టిన చింతచెట్ల నుంచి దిగుబడి రావడంలేదు. ఈసారి ఎంతో వ్యాపారం సాగుతుందని ఆశపడ్డాం, కానీ లాభం చేకూరడం లేదు.
వినియోగదారులకు ‘చింత’
Published Tue, Feb 11 2014 5:52 AM | Last Updated on Sat, Sep 2 2017 3:35 AM
Advertisement