
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రియల్ లైఫ్‌కి, రీల్ లైఫ్‌కి చాలా తేడా ఉంటుంది. సినిమాల్లో చాలా చలాకీగా ఉంటూ..ఎలాంటి పాత్రనైనా తనదైన నటనతో ఆకట్టుకుంటాడు. కానీ రియల్ లైఫ్‌లో మాత్రం ఇంట్రోవర్ట్. ఎక్కువగా మాట్లాడడు. స్టైజ్‌పై మాట్లాడమంటే సిగ్గుపడుతుంటాడు. అంతేకాదు ఇతరులతో మాటలు కలిపేందుకు కూడా వెనుక ముందు ఆలోచిస్తుంటాడు. తనకు క్లోజ్ అయిన వారితో సరదాగే ఉన్నా..కొత్త వారితో మింగిల్ అయ్యేందుకు చాలా సమయం తీసుకుంటాడని ప్రభాస్ సన్నిహితులు చెబుతుంటారు. ఒక్కసారి తనతో స్నేహం ఏర్పడితే.. వారిని తన సొంత కుటుంబ సభ్యులుగా చూసుకుంటాడట. ఇక షూటింగ్ టైమ్‌లో అందరికి భోజనాలు తెప్పించే అలవాటు డార్లింగ్‌కి ముందు నుంచే ఉంది.
(చదవండి: బాక్సాఫీస్ షేక్ చేస్తోన్న కల్కి.. ఐదు రోజుల్లో ఎన్ని కోట్లంటే?)
తాజాగా టాలీవుడ్ హీరోయిన్ హంసనందిని ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ‘మిర్చి’ సినిమాలో టైటిల్ సాంగ్‌కి ప్రభాస్‌తో కలిసి స్టెప్పులేసింది ఈ బ్యూటీ. అయితే వేరే సినిమా షూటింగ్ కారణంగా ఆ సినిమా తాను చూడలేకపోయానని.. ఈ విషయం తెలిసి ప్రభాసే టికెట్ బుక్ చేసి సినిమా చూపించారని హంసనందిని చెప్పింది.
(చదవండి: నాగ్ అశ్విన్.. మీ చెప్పులిస్తే ముద్దు పెట్టుకుంటా: బ్రహ్మాజీ)
‘ప్రభాస్‌కి చాలా సిగ్గు. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడడు. మిర్చి సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత నేను వేరే సినిమాలో బిజీ అయ్యాడు. ఆ సినిమా ఆడియో ఫంక్షన్‌ని అందుబాటులో లేను. అలాగే రిలీజ్ టైమ్‌లో కూడా నేను హైదరాబాద్‌కి రాలేదు. కొద్ది రోజుల తర్వాత వేరే సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చాను. ఓ పార్టీలో ప్రభాస్ కలిసి.. ‘నీ సాంగ్ పెద్ద హిట్ అయిందని నీకు తెలుసా?’అని అడిగాడు. నేను సినిమా చూడలేదని చెప్పాను. వెంటనే టికెట్ బుక్ చేసి సినిమా చూడమని చెప్పాడు. అంతేకాదు సినిమాలో నా సాంగ్ ఏ టైమ్‌కి వస్తుందో కూడా చెప్పాడు. నేను అదే టైమ్‌కి థియేటర్‌కి వెళ్లి సినిమా చూశాను’ అని హంసనందిని చెప్పుకొచ్చింది. ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 మూవీ తాజాగా రిలీజై బాక్సాఫీస్ వద్ద రికార్డులను సృష్టిస్తోంది. విడుదలైన ఐదు రోజుల్లో 625 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.
#Prabhas Anna Mirchi Movie ki Ticket book chesi, ‘Mirchi’ Song oche timing cheppi mari Theatre ki pampadu anta Hamsa ni! 🥰😅❤️ pic.twitter.com/CgVqqKlkzg
— . (@charanvicky_) July 2, 2024
Comments
Please login to add a commentAdd a comment