అక్కడి ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన ప్రభాస్‌... ఎందుకంటే? | Prabhas Apologises to Japanese Fans, Reason is | Sakshi
Sakshi News home page

Prabhas: జపనీస్‌లో మాట్లాడిన ప్రభాస్‌.. వారికి సారీ చెప్తూ..

Published Wed, Dec 18 2024 6:50 PM | Last Updated on Wed, Dec 18 2024 7:10 PM

Prabhas Apologises to Japanese Fans, Reason is

ప్రభాస్‌ ప్రధాన పాత్రలో నటించిన కల్కి 2898 ఏడీ మూవీ బాక్సాఫీస్‌ వద్ద సంచలనాలు సృష్టించింది. దాదాపు రూ.1200 కోట్లపైచిలుకు వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా జపాన్‌లో రిలీజ్‌ చేయనున్నట్లు ఆ మధ్య వైజయంతి మూవీస్‌ ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి 3న జపాన్‌లో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది.

జపాన్‌ భాషలో సారీ చెప్తూ..
అంతేకాదు, జపాన్‌ను సైతం వస్తానని మాటిచ్చాడు ప్రభాస్‌. కానీ ప్రస్తుతం కాలికి గాయంతో బాధపడుతున్నందున ఆ ప్లాన్‌ను వాయిదా వేశాడు. దీంతో జపాన్‌ భాషలో అక్కడివారికి సారీ చెప్తూ సోషల్‌ మీడియాలో ఓ వీడియో రిలీజ్‌ చేశాడు. 'నాపై, నా సినిమాలపై మీరు చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు. 

గాయం వల్లే..
జపాన్‌కు రావాలని ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నాను. కానీ నా కాలికి గాయం కావడం వల్ల రాలేకపోతున్నాను. కానీ త్వరలోనే మీ ముందుకు వస్తానని మాటిస్తున్నాను. జనవరి 3న జపాన్‌లో రిలీజయ్యే కల్కి 2898 ఏడీ మూవీ చూసి ఎంజాయ్‌ చేయండి' అని పేర్కొన్నాడు. ఇకపోతే సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ జపాన్‌ పర్యటనలో బిజీగా ఉన్నాడు.

కల్కి సినిమా సంగతులు
కల్కి విషయానికి వస్తే.. అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటించారు. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహించాడు. జూన్‌ 27న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ అమెజాన్‌ ప్రైమ్‌ (తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ వర్షన్స్‌)తో పాటు నెట్‌ఫ్లిక్స్‌ (హిందీ వర్షన్‌)లో అందుబాటులో ఉంది.

చదవండి: నటిపై లైంగిక వేధింపులు.. యూట్యూబర్ ప్రసాద్ బెహరా అరెస్ట్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement