
ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. ఇప్పుడు ఈ చిత్రం జపాన్‌లో విడుదల కానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. ప్రభాస్ కెరీర్‌లో బాహుబలి తర్వాత అంతటి విజయాన్ని కల్కి అందుకుంది. సుమారు రూ. 1200 కోట్లకు పైగానే ఈ చిత్రం కలెక్షన్స్ రాబట్టింది.
కల్కి చిత్రం జపాన్‌లో విడుదల చేస్తున్నట్లు వైజయంతీ మూవీస్ ప్రకటించింది. భారతీయ చలనచిత్ర చరిత్రలో అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన చిత్రం జపనీస్‌లో కూడా విడుదల కానుందని ఒక వీడియోతో మేకర్స్ పంచుకున్నారు. 2025 జనవరి 3న జపాన్‌లో గ్రాండ్‌గా ఈ చిత్రం రిలీజ్ కానుంది.
పురాణాలను, సైన్సును ముడిపెడితూ తీసిన ఈ చిత్రం ఈ ఏడాది జూన్ 27న భారత్‌లో విడుదలైంది. ఇందులో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె వంటి స్టార్స్ నటించారు. విజువల్ వండర్‌లా దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
Comments
Please login to add a commentAdd a comment