ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం 'కల్కి 2898 ఏడీ'. తాజాగా విడుదలైన సినిమాకు రికార్డ్ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుంది. తొలిరోజు ఏకంగా రూ.191.5 కోట్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. సినిమా పట్ల హిట్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ ఏమాత్రం తగ్గడం లేదు. కల్కి నాలుగు రోజుల్లో రూ. 555 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ అధికారికంగా ప్రకటించింది.
దర్శకుడు నాగ్ అశ్విన్ ఫ్యూచరిస్టిక్ ఇండియన్ సినిమాగా కల్కిని రూపొందించాడు. ప్రభాస్, దీపికా పదుకొణె,శోభన, దిశా పటానీ, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి స్టార్స్ కల్కి మూవీలో నటించి మెప్పించారు. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమా జూన్ 27న విడుదలైంది. ఇప్పటికే సినిమా చూసిన ప్రేక్షకులు ఆ విజువల్ వండర్ ప్రపంచాన్ని మరిచిపోలేకపోతున్నారు. మహాభారతాన్ని ఫ్యూచర్ కథకు ముడి పెట్టి కల్కిని తెరకెక్కించిన నాగ్ అశ్విన్‌ను నెటిజన్లు అభిమానిస్తున్నారు.
కల్కి నాలుగు రోజుల్లో రూ. 555 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. తెలుగులో 204.5 కోట్లు, హిందీలో రూ. 134.5 కోట్లు, తమిళ్‌లో రూ. 32.9 కోట్లు, మలయాళంలో రూ.35.1 కోట్లు, ఇతర దేశాల్లో రూ. 158 కోట్లు వచ్చాయి. అదె నెట్ పరంగా అయితే కల్కి ప్రపంచ వ్యాప్తంగా నాలుగురోజుల్లో రూ. 320 కోట్లు రాబట్టింది.
Comments
Please login to add a commentAdd a comment