Nag Aswin
-
అక్కడి 'ప్రభాస్' ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్
ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. ఇప్పుడు ఈ చిత్రం జపాన్‌లో విడుదల కానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. ప్రభాస్ కెరీర్లో బాహుబలి తర్వాత అంతటి విజయాన్ని కల్కి అందుకుంది. సుమారు రూ. 1200 కోట్లకు పైగానే ఈ చిత్రం కలెక్షన్స్ రాబట్టింది.కల్కి చిత్రం జపాన్‌లో విడుదల చేస్తున్నట్లు వైజయంతీ మూవీస్ ప్రకటించింది. భారతీయ చలనచిత్ర చరిత్రలో అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన చిత్రం జపనీస్‌లో కూడా విడుదల కానుందని ఒక వీడియోతో మేకర్స్ పంచుకున్నారు. 2025 జనవరి 3న జపాన్‌లో గ్రాండ్‌గా ఈ చిత్రం రిలీజ్ కానుంది.పురాణాలను, సైన్సును ముడిపెడితూ తీసిన ఈ చిత్రం ఈ ఏడాది జూన్ 27న భారత్‌లో విడుదలైంది. ఇందులో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె వంటి స్టార్స్ నటించారు. విజువల్ వండర్లా దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. -
నాలుగు రోజుల్లో కల్కి కలెక్షన్స్.. ఎక్కడ ఎంత వచ్చిందంటే..?
ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం 'కల్కి 2898 ఏడీ'. తాజాగా విడుదలైన సినిమాకు రికార్డ్ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుంది. తొలిరోజు ఏకంగా రూ.191.5 కోట్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. సినిమా పట్ల హిట్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ ఏమాత్రం తగ్గడం లేదు. కల్కి నాలుగు రోజుల్లో రూ. 555 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ అధికారికంగా ప్రకటించింది.దర్శకుడు నాగ్ అశ్విన్ ఫ్యూచరిస్టిక్ ఇండియన్ సినిమాగా కల్కిని రూపొందించాడు. ప్రభాస్, దీపికా పదుకొణె,శోభన, దిశా పటానీ, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి స్టార్స్ కల్కి మూవీలో నటించి మెప్పించారు. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమా జూన్ 27న విడుదలైంది. ఇప్పటికే సినిమా చూసిన ప్రేక్షకులు ఆ విజువల్ వండర్ ప్రపంచాన్ని మరిచిపోలేకపోతున్నారు. మహాభారతాన్ని ఫ్యూచర్ కథకు ముడి పెట్టి కల్కిని తెరకెక్కించిన నాగ్ అశ్విన్‌ను నెటిజన్లు అభిమానిస్తున్నారు.కల్కి నాలుగు రోజుల్లో రూ. 555 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. తెలుగులో 204.5 కోట్లు, హిందీలో రూ. 134.5 కోట్లు, తమిళ్లో రూ. 32.9 కోట్లు, మలయాళంలో రూ.35.1 కోట్లు, ఇతర దేశాల్లో రూ. 158 కోట్లు వచ్చాయి. అదె నెట్ పరంగా అయితే కల్కి ప్రపంచ వ్యాప్తంగా నాలుగురోజుల్లో రూ. 320 కోట్లు రాబట్టింది. -
నాగ్ అశ్విన్ సక్సెస్ స్టోరీ.. ప్రియాంక దత్తో ప్రేమ ఎలా మొదలైంది..?
డైరెక్టర్ నాగ్ అశ్విన్.. ఆయన మాటలు చాలా పొదుపు కానీ, తనలోని ప్రతిభకు అవధులంటూ ఉండవు. నాగ్ అశ్విన్ గురించి తెలియని వారు ఆయన సింప్లిసిటీని చూస్తే ఇతను దర్శకుడా..? అని ఆశ్చర్యపోతారు. సెట్స్‌లో నాగ్ అశ్విన్ ప్రతిభను చూసి మెచ్చుకోని వారు అంటూ ఉండరు. ఈ క్రమంలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ వంటి స్టార్స్ నాగ్ టాలెంట్‌కు ఫిదా అయ్యారు. నేడు ఆయన డైరెక్ట్ చేసిన 'కల్కి 2898 ఏడీ' విడుదలైంది. ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. హాలీవుడ్ స్థాయికి టాలీవుడ్‌ను నాగ్ అశ్విన్ తీసుకుబోయాడంటూ ప్రశంసలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో నాగ్ అశ్విన్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.అసలు పేరు నాగ్ అశ్విన్ రెడ్డి.. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వైద్యులు జయరాం రెడ్డి, జయంతి దంపతులకు నాగ్ జన్మించారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివిన నాగ్ అశ్విన్ ఆపై మాస్ కమ్యూనికేషన్స్, జర్నలిజంలో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేశారు. స్కూల్లో టాప్ టెన్ ర్యాంక్‌లో ఉన్న నాగ్ తల్లిదండ్రుల మాదిరి డాక్టర్ అవుతాడని అనుకుంటే.. మణిపాల్ మల్టీమీడియా కోర్సులో చేరారు. అక్కడ వీడియో ఎడిటింగ్‌తో పాటు సినిమాకు అవసరమైన నాలెడ్జ్‌ను సంపాదించుకున్నాడు.సినిమాల్లోకి ఎంట్రీ ఎలా..?సినిమాలపై నాగ్ అశ్విన్ చూపుతున్న ఆసక్తిని తల్లిదండ్రులు గుర్తించారు. ఈ క్రమంలో వారు డైరెక్టర్ శేఖర్ కమ్ముల వద్దకు నాగ్ అశ్విన్‌ను పంపారు. ఆ సమయంలో 'గోదావరి' సినిమా చిత్రీకరణ జరుగుతుండటంతో తర్వాత ప్రాజెక్ట్‌లో తన వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేర్చుకుంటానని శేఖర్ కమ్ముల మాట ఇచ్చారు. ఈ గ్యాప్‌లో మంచు మనోజ్ హీరోగా నటించిన 'నేను మీకు తెలుసా?' చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. అందుకు రెమ్యునరేషన్‌గా రూ. 4 వేలు తీసుకున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ తర్వాత శేఖర్ కమ్ముల నుంచి పిలుపు వచ్చింది. లీడర్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆ సమయంలో నాగ్ ప్రతిభను శేఖర్ కమ్ముల మెచ్చుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి.డైరెక్టర్‌గా ఛాన్స్ ఎవరిచ్చారు..?శేఖర్ కమ్ముల నుంచి నేర్చుకున్న పాఠాలతో 'యాదోం కీ బరాత్' అనే ఇంగ్లీష్ లఘు చిత్రాన్ని నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేశారు. ఈ చిత్రానికి ప్రియాంక దత్ నిర్మాత కావడం విశేషం. కేన్స్ షార్ట్ ఫిల్మ్ కార్నర్ కోసం ఈ చిత్రం ఎంపిక చేయబడింది. దీంతో ఆయన జీవితం టర్న్ అయిపోయింది. ఆ షార్ట్‌ఫిల్మ్ వల్ల నిర్మాత అశ్వనీదత్ కుమార్తెలు ప్రియాంక, స్వప్న సినిమా అవకాశాన్ని ఇచ్చేందుకు ముందుకొచ్చారు. అప్పుడు వారికి 'ఎవడే సుబ్రమణ్యం' కథను నాగ్ వినిపించారు. ఆ చిత్రాన్ని నిర్మిస్తామని ప్రియాంక, స్వప్న మాట ఇచ్చారు. అలా నాని, విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రల్లో 2015లో నాగ్ అశ్విన్ తొలి సినిమా వెండితెరపై మెరిసింది. తక్కువ బడ్జెట్లో చాలా రిచ్‌గా ఈ చిత్రాన్ని అశ్విన్ తీశాడు. సినిమాకు కూడా మంచి మార్కులే పడ్డాయి. ఆ ఏడాది ఉత్తమ చిత్రంగా నంది అవార్డు కూడా దక్కింది. ఇదే సమయంలో ఆయన పలు యాడ్ చిత్రాలకు కూడా డైరెక్ట్ చేయడం విశేషం.ప్రియాంక దత్తో ప్రేమ, పెళ్లిప్రియాంక దత్.. తన 21వ యేట 2004లో పవన్ కల్యాణ్ 'బాలు' చిత్రం ద్వారా సహనిర్మాతగా చిత్ర రంగంలోనికి ప్రవేశించారు. ఆ తర్వాత 'శక్తి' చిత్రాన్ని కూడా ఆమె నిర్మించారు. త్రీ ఏంజల్స్ స్టుడియో పేరుతో సారొచ్చారు, బాణం, ఓం శాంతి, యాదోంకీ బరత్ వంటి చిత్రాలకు నిర్మాతగా ఉన్నారు. ప్రియాంక కొన్ని యాడ్స్ కూడా నిర్మించారు. ఆ సమయంలో ఆమెకు నాగ్ అశ్విన్ పరిచయం కావడం.. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి యాదోంకీ బరత్ అనే లఘు చిత్రం కోసం పనిచేయడం జరిగింది. అలా 'ఎవడే సుబ్రమణ్యం' చిత్రంతో వీరి స్నేహం కాస్త ప్రేమగా మారిపోయింది.ప్రియాంక దత్‌కు తన ఇంట్లో పెళ్లి చూపులు చూస్తున్న సమయంలో ఇలా ప్రపోజ్ చేశారు. 'మీకు ఎవరైనా నచ్చితే సరే... లేదంటే మనం పెళ్లి చేసుకుందాం' అని నాగ్ అశ్విన్ తన ప్రేమ గురించి చెప్పినట్లు ఓ ఇంటర్వ్యూలో వెళ్లడించారు. అప్పటికే చాలా కాలంగా నాగ్ అశ్విన్‌తో ఆమె ట్రావెల్ చేశారు. ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. ఆయనలోని మంచితనాన్ని గ్రహించిన ప్రియాంక కూడా వెంటనే ఓకే చెప్పడంతో వారి పెళ్లి 2015లో జరిగింది. అలా దర్శకుడుగా నాగ్ అశ్విన్ మంచి విజయం సాధించకముందే అతన్ని ఆమె నమ్మారు. సినీ ప్రయాణంలో స్నేహితులైన అశ్విన్- ప్రియాంకలు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరికి ఓ బాబు ఉన్నాడు. ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రం ద్వారా స్టేట్ నంది అవార్డు అందుకున్న అశ్విన్.. మహానటి చిత్రంతో నేషనల్ అవార్డు అందుకున్నారు. ఇప్పుడు కల్కి సినిమాతో అంతర్జాతీయ అవార్డును నాగ్ అశ్విన్ తప్పకుండా అందుకోవాలని కోరుకుందాం. -
'కల్కి' గెస్ట్ రోల్స్‌లో మరో ఐదుగురు.. ఎవరూ ఊహించని పేర్లు
ప్రభాస్- నాగ్ అశ్విన్ 'కల్కి 2898 ఏడీ' చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నారు. భారీ బడ్జెట్‌తో ఎనలేని తారాగాణంతో వైజయంతీ మూవీస్ బ్యానర్లో ఈ చిత్రాన్ని అశ్వనీదత్ నిర్మించారు. ఇప్పటికే భైరవగా థియేటర్స్‌లో దుమ్మురేపుతున్నాడు ప్రభాస్. ఈ సినిమా కోసం భవిష్యత్ కాశీ, కాంప్లెక్స్, శంబల అనే మూడు ప్రపంచాల్ని దర్శకుడు నాగ్ అశ్విన్ అద్బుతంగా క్రియేట్ చేశాడు. ఆ మూడు ప్రపంచాల నేపథ్యంలోనే ఈ కథ సాగుతుంది. అందుకు అనుగుణంగానే ఈ మూవీలో భారీ అగ్ర తారాగణం ఉంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, శోభన,దిశా పటాని, కీర్తి సురేష్ వాయిస్ ఇలా ఎన్నో ప్రత్యేకతలు కల్కిలో ఉన్నాయి.కల్కి చిత్రాన్ని ఇప్పటికే చాలామంది ప్రేక్షకులు చూశారు. ఈ మూవీలో గెస్ట్ రోల్స్‌లో మరికొందరు పోషించారు. ఇప్పుడు వారందరి పేర్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ మూవీలో ఉన్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అయితే, కల్కిలో మృణాళ్ ఠాకూర్, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ, కె.వి. అనుదీప్‌తో పాటు ఫరియా అబ్దుల్లా కూడా ఉన్నారు. వీరందరూ కూడా గెస్ట్ రోల్స్ కనిపించినా కథకు తగ్గట్లు ఉండటం విశేషం. -
తనకు ఇష్టమైన 'బుజ్జి'ని పరిచయం చేసిన ప్రభాస్.. ఆసక్తిగా వీడియో
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ 'కల్కి 2898 ఏడీ'. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా గత కొన్ని రోజులుగా ట్రెండింగ్‌లో కొనసాగుతూనే ఉంది. కొన్ని గంటల క్రితం ప్రభాస్ చేసిన ఒక పోస్ట్‌తో కల్కి సినిమా పేరు భారీగా ట్రెండ్ అయింది. 'ఎట్టకేలకు మన జీవితంలోకి ఓ ప్రత్యేక వ్యక్తి రాబోతున్నారు. వెయిట్ చేయండి.' అంటూ అయిన షేర్ చేసిన పోస్ట్‌పై అందరూ ఎంతగానో ఆసక్తి కనపరిచారు. కొంత సమయం తర్వాత 'నా బుజ్జిని మీకు పరిచయం చేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.' అంటూ మరో పోస్ట్ చేశారు. దీంతో అసలు బుజ్జి ఎవరు..? ఎలా ఉంటుంది..? అని అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.తాజాగా బుజ్జికి సంబంధించిన ఒక గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. చాలా ఆసక్తిగా కొనసాగిన ఈ విడియోలో ఒక చిన్న రోబోను బుజ్జి అని అందరూ పిలుస్తూ ఉంటారు. బుజ్జికి వాయిస్‌ను కీర్తి సురేష్ ఇచ్చింది. 'నా లైఫ్ ఎంటి..? బాడీ లేకుండా బతికేయాల్సిందేనా' అంటూ బుజ్జి చెబుతుండగా ఇంతలో ప్రభాస్ ఎంట్రీ ఇచ్చి 'నీ టైమ్ మొదలైంది బుజ్జి' అంటూ ఒక వాహనాన్ని రివీల్ చేయబోయాడు. కానీ ఇంతలోనే ట్విస్ట్ ఇస్తూ బుజ్జి గురించి పూర్తిగా తెలుసుకోవాలంటూ జూన్ 22 వరకు వేచి ఉండాల్సిందేనని తెలిపారు. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా 'కల్కి' విడుదల కానుంది. -
ప్రభాస్ 'కల్కి' కోసం స్పెషల్ గన్స్.. వీడియో చూశారా..?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ‘కల్కి 2898 ఏడీ’. భారీ బడ్జెట్‌తో పాటు ఇండియన్ సినిమా అంచనాలకు మించి ఈ చిత్రం తెరకెక్కుతోంది. సలార్ చిత్రం సూపర్ హిట్ కావడంతో ఫుల్ జోష్‌లో ఉన్న డార్లింగ్ ఇప్పుడు కల్కి చిత్రం గురించి కొన్ని అప్టేట్స్ ఇస్తూ ఫ్యాన్స్‌లో జోష్ నింపుతున్నాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ మరో 90 రోజుల్లో వస్తుందని డైరెక్టర్ నాగ్ అశ్విన్ చెప్పాడు. ఈ క్రమంలో కల్కి సినిమాలో ఉపయోగించిన గన్స్ ఎలా తయారు చేశారో తెలుపుతూ ఒక వీడియోను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఆ వీడియో కూడా అందరినీ నవ్విస్తూ ఆసక్తిగా సాగింది. ఇందులో సరికొత్తగా ఉన్న గన్స్‌ను పరిచయం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ‘కల్కి 2898 ఏడీ’ విషయానికొస్తే.. ప్రభాస్ సరసన దీపిక పదుకొణె నటిస్తుండగా కమల్‌హాసన్ ఇందులో ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని రెండు పార్ట్స్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అమితాబ్ బచ్చన్, దిశా పటానీ కీలక పాత్రల్లో నటిస్తోన్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్‌నకు ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. హాలీవుడ్ స్థాయిలో ఈ సినిమా విజువల్స్ ఉన్నాయని అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. -
ప్రభాస్ 'కల్కి' వాయిదా?.. అదే ప్రధాన కారణమా!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ భామ దీపికా పదుకొణె జంటగా తెరకెక్కిస్తోన్న సైన్స్ ఫిక్షన్ మూవీ 'కల్కి 2898 AD'. ఇటీవలే ఈ చిత్రానికి టైటిల్ రివీల్ చేసిన చిత్రబృందం.. శాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్లో గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇప్పటికే ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొనగా.. తాజాగా వచ్చిన గ్లింప్స్ మరింత హైప్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ సినిమా కోసం పాన్ ఇండియా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా.. ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ మూవీ రిలీజ్ డేట్ ప్రకటిస్తారని ఆశించిన అభిమానులకు చిత్రబృందం పెద్ద షాక్ ఇచ్చింది. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుందని అభిమానులు భావించగా.. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దర్శకధీరుడు రాజమౌళి సైతం ట్వీట్ చేస్తూ రిలీజ్ డేట్ కోసం వెయిటింగ్ అంటూ పోస్ట్ చేశారు. దీంతో ఈ చిత్రం ఎంత ఆసక్తిగా ఉన్నారో అర్థమవుతోంది. (ఇది చదవండి: జూనియర్ ఎన్టీఆర్- లక్ష్మీ ప్రణతి పెళ్లి.. ఆమె ధరించిన చీర ఎన్ని కోట్లంటే?) ఈ నేపథ్యంలో కల్కికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. రిలీజ్ ప్రకటించకపోవడంతో వాయిదా పడనుందనే వార్తలు వినిపించాయి. మరోవైపు ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారని.. మొదటి పార్ట్‌ను మే 9న విడుదల చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. ఆ సెంటిమెంట్ కోసమేనా? అయితే మరీ ముఖ్యంగా మే 9వ తేదీ అశ్వనీదత్‌కు చాలా సెంటిమెంట్ అని సమాచారం. గతంలో మే9న విడుదలైన మహానటి మళ్లీ బ్లాక్ బస్టర్ అందించింది.. చిరంజీవి నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి కూడా అదే రోజు రిలీజై వసూళ్ల వర్షం కురిపించింది. దీంతో ఈ సినిమాకు సైతం ఆయన ఇదే సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నారని భావిస్తున్నారు. దీంతో ఈ సినిమా వాయిదా వేయడమే మంచిదని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై మేకర్స్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాగా.. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్, కోలీవుడ్ స్టార్ కమల్‌హాసన్, దిశా పటానీ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. (ఇది చదవండి: కలెక్షన్స్‌లో 'బేబీ' ఆల్‌టైమ్ రికార్డ్!) -
ప్రభాస్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. 'కల్కి' ఇప్పట్లో రావడం కష్టమే!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న 'కల్కి 2898 AD' సినిమా ప్రస్తుతం టాక్ ఆఫ్ ఇండస్ట్రీగా మారింది. వైజయంతి మూవీస్ బ్యానర్లో నాగ్ అశ్విన్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే ప్రధాన పాత్రలలో నటిస్తుండగా కమల్ హాసన్ విలన్ పాత్రలో మెప్పించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ ఇప్పటికే విడుదలైంది. హాలీవుడ్ రేంజ్లో స్క్రీన్ ప్రజెంటేషన్ ఉంది అంటూ పలువురు కామెంట్లు కూడా చేస్తున్నారు. (ఇదీ చదవండి: యాంకర్ రష్మీపై వల్గర్ కామెంట్ చేసిన కమెడియన్) కానీ తాజాగా కల్కి సినిమాకు సంబంధించి ఒక విషయం వైరల్ అవుతుంది. ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు ఇది చేదు వార్త అనే చెప్పవచ్చు. ఈ సినిమా విడుదల తేదీని మార్చేస్తున్నట్లు నెట్టింట వైరల్ అవుతుంది. ఈ చిత్రం 2024 జనవరి 12న విడుదల కావాల్సి ఉంది. కానీ ఈ తేదీన ప్రేక్షకుల ముందుకు కల్కి రావడం కష్టమేనని తెలుస్తోంది. ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ మరికొంత కాలం వెయిట్ చేయక తప్పదని సమాచారం. మే 9న 2024 సమ్మర్లో ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. చిత్ర నిర్మాత అశ్విన్ దత్ స్వయంగా సినిమా విడుదల తేదీని మార్చినట్లు పలు మీడియాలలో వార్తలు కూడా వస్తున్నాయి. కానీ సినిమా విడుదల తేదీలో మార్పుపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. విడుదల తేదీని మార్చడానికి కారణాలు కల్కి 2898 AD విడుదల తేదీని మార్చడానికి ప్రధాన కారణం VFX పనులే అని తెలుస్తోంది. సైన్స్ ఫిక్షన్ సినిమా కాబట్టి ఎక్కువగా గ్రాఫిక్స్ నిర్మాణ విలువలు ఉంటాయి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన విఎఫ్ఎక్స్ పనులు జరుగుతున్నాయి. ఇందులో ఎక్కువగా భారీ సీన్లన్ని VFX మీదే అధారపడి ఉన్నాయి. ఈ కారణంగానే సినిమా విడుదల తేదీని పొడిగించారని సమాచారం. (ఇదీ చదవండి: అరియానా లుక్‌పై ట్రోల్స్.. ఈ కార్యక్రమం ఏమైనా ప్లాన్ చేశావా అంటూ..?) -
'కల్కి' టైటిల్ రిలీజ్‌కు ఎందుకు రాలేదంటే: అమితాబ్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో వస్తున్న 'కల్కి 2898 ఏడీ' థ్రిల్లింగ్ టీజర్‌ను ముందుగా శాన్ డియాగో కామిక్-కాన్‌లో ఆవిష్కరించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం టైటిల్ విడుదల కార్యక్రమంలో పాల్గొనకపోవడంపై అమితాబ్ బచ్చన్ తాజాగా తన బ్లాగ్‌లో ఇలా వివరించారు. (ఇదీ చదవండి: 'గుంటూరు కారం' నుంచి తమన్ ఔట్.. త్రివిక్రమే అసలు సమస్యా?) 'ప్రాజెక్ట్ కె' టైటిల్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ఇదొక గ్రేట్ మూమెంట్‌గా నిలుస్తుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని దర్శకులు నాగ్ అశ్విన్ ఎంతగానో నన్ను కోరారు. కానీ రావాలనే కోరిక ఉన్నా రాలేని పరిస్థితి ఏర్పడింది. ఏం చేద్దాం..? వర్క్, వైద్య పరమైన పరిమితుల వల్ల ఇలాంటి మంచి కార్యక్రమాలకు దూరం కావాల్సి వస్తుంది. 'కల్కి 2898 ఏడీ' గురించి ఒక్కటి మాత్రం చెబుతా. ఫస్ట్ లుక్ అదిరిపోయింది. ఇందులో సంగీతం, ఫ్రేమ్‌లు అన్ని బాగున్నాయి.' అని ఆయన తెలిపారు. (ఇదీ చదవండి: చంద్రముఖి–2 అభిమానులకు అప్డేట్ ఇచ్చిన మేకర్స్) అమితాబ్ బచ్చన్ ఈ సినిమాలో కీలకపాత్రలో కనిపించనున్నారు. హాలీవుడ్ స్థాయిలో రానున్న ఈ సినిమాలో కమల్ హాసన్ విలన్‌గా కనిపించనున్నారు. ప్రభాస్‌కు జోడీగా దీపికా పదుకొణె నటించనుదంది. 'కల్కి 2898 ఏడీ' గ్లింప్స్ విడుదలైన వెంటనే ఒక్కసారిగా ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఇది విజువల్ వండర్‌గా ఉందని పలువురు ప్రశంసలు కురిపించారు. ఇప్పటి వరకు దీనిని 18 మిలియన్స్ పైగా చూశారు. -
ప్రభాస్ 'ప్రాజెక్ట్ కె' టైటిల్, గ్లింప్స్ విడుదల.. హాలీవుడ్ రేంజ్లో సీన్స్
ప్రభాస్ హీరోగా నటిస్తున్న టైమ్‌ట్రావెల్ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ ‘ప్రాజెక్ట్ కె’ టైటిల్,గ్లింప్స్‌ను ‘కామిక్ కాన్ –2023’ వేడుకల్లో మేకర్స్ విడుదల చేశారు. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. దీపికా పదుకోన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో కమల్‌హాసన్ , అమితాబ్ బచ్చన్ , దిశా పటానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'ప్రాజెక్ట్ కె' రివీల్ అయింది. ఈ సినిమాకు 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) అనే టైటిల్‌ను ఫైనల్ చేశారు. పురాణాల ప్రకారం కలియుగం చివర్లో విష్ణువు పదో అవతారమే కల్కి. ప్రపంచాన్ని చీకటి కమ్మేసినప్పుడు ఒక శక్తిలా కల్కి ఉద్భవిస్తుందని మన పురాణాల్లో ఉంది. కలియుగం అంతంలో జరిగే కథా నేపథ్యంలో ఈ చిత్రం ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా భవిష్యత్‌లోకి తీసుకెళ్తుంది. అందుకే దీనిని టైమ్‌ట్రావెల్ సైన్స్ ఫిక్షన్లో తీస్తున్నారు. ప్రభాస్ 'కల్కి 2898 AD' గ్లింప్స్ ట్రీట్ (ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందిన తొలి హీరో ప్రభాస్‌నే.. ఇప్పుడు హాలీవుడ్ రేంజ్లో కల్కి గ్లింప్స్ ఉంది. ఈ సినిమా మంచి విజయం సాధిస్తే హలీవుడ్లో ప్రభాస్ ఆగమనం ఖాయంగానే ఉంది. ప్రభాస్ పోస్టర్‌ను విడుదల చేసిన వైజయంతి మూవీస్‌పై ఫ్యాన్స్ కూడా ఫైర్ అయ్యారు. వాస్తవంగా అది అంతగా ఆకట్టుకోలేదు. తాజాగా విడుదల చేసిన గ్లింప్స్ మాత్రం అదిరిపోతుంది. ఫ్యాన్స్‌ను నాగ్ అశ్విన్ ఏమాత్రం నిరాశపరచలేదు. అదొక వండర్లా కల్కిని క్రియేట్ చేశాడని చెప్పవచ్చు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌లో కూడా సంతోష్ నారాయణ్ రచ్చలేపాడని చెప్పవచ్చు. ఇందులో విజువల్స్ అందరినీ కట్టిపడేశాయి. ఇక ప్రభాస్ లుక్ అదిరిపోయింది. అమెరికాలో జరుగుతోన్న ప్రతిష్ఠాత్మక ‘శాన్ డియాగో కామిక్ కాన్’ వేడుకలో ప్రచార చిత్రాన్ని ఆవిష్కరించుకున్న తొలి భారతీయ సినిమాగా ఇది రికార్డుకెక్కింది. -
Project K: దీపికా పదుకోన్ ఫస్ట్ లుక్ వచ్చేసింది
ఆమె కళ్లు ఎటో తీక్షణంగా చూస్తున్నాయి. దీర్ఘాలోచనలో ఉన్నట్లు కనబడుతోందామె. ‘ప్రాజెక్ట్ కె’లో దీపికా పదుకోన్ చేస్తున్న పాత్ర లుక్ ఇది. ‘‘ఆమె కళ్లల్లో కొత్త ప్రపంచంపై నమ్మకం కనిపిస్తోంది’’ అంటూ దీపికా లుక్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ప్రాజెక్ట్ కె’. ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోన్ తెలుగు చిత్ర పరిశ్రమకు కథానాయికగా పరిచయమవుతున్నారు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో సి. అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దిశా పటానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘ప్రాజెక్ట్ కె’ టైటిల్, ట్రైలర్, సినిమా విడుదల తేదీని ఈ నెల 20న అమెరికాలోని ‘శాన్ డియాగో కామిక్– కాన్ 2023’ వేడుకలో లాంచ్ చేస్తారు. ఈ వేడుకకు ప్రభాస్, కమల్‌హాసన్, దీపికా పదుకోన్, నాగ్ అశ్విన్, అశ్వనీదత్ హాజరు కానున్నారు. In her eyes she carries the hope of a new world 🌍 @deepikapadukone from #ProjectK pic.twitter.com/RUt9T1MAyZ — Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 18, 2023 -
ప్రాజెక్ట్- కే యూనిట్‌పై ఫైర్ అవుతున్న ప్రభాస్ ఫ్యాన్స్
ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న పాన్ ఇండియా చిత్రం 'ప్రాజెక్ట్- కే'పై ఫ్యాన్స్‌కు భారీ అంచనాలు ఉన్నాయి. అశ్వీనీదత్ వైజయంతి మూవీస్‌లో నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో దీపికా పదుకోన్ హీరోయిన్. అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దిశా పటానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జులై 20న ‘శాన్ డియాగో కామిక్–కాన్ 2023’ వేడుకలో 'ప్రాజెక్ట్ కే' టైటిల్‌ను రివీల్ చేస్తామని కూడా ప్రకటించారు. (ఇదీ చదవండి: ఎన్ని పెళ్లిళ్లు అయినా చేసుకోండి కానీ...: ఎంఎస్ ధోని) మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా 'ప్రాజెక్ట్ కే' అంటే ఏమిటి? అంటూ మేకర్స్ ప్రకటన జారీ చేశారు. అందులో భాగంగా ఫ్రీగా టీ షర్ట్స్ ఇస్తున్నామంటూ ప్రచారం కూడా చేశారు. టీ షర్ట్స్ కోసం వైజయంతీ మూవీస్ అధికారిక ట్విట్టర్ అకౌంట్లో లింక్‌ను కూడా ఉంచారు. కానీ ఈ విషయంపై అశ్వీనీదత్ వైజయంతి మూవీస్ చేస్తుంది పెద్ద చీటింగ్ అని సోషల్ మీడియా వేదికగా ప్రభాస్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అందుకు సంబంధించి నెట్టింట కామెంట్లు కూడా చేస్తున్నారు. టీ షర్ట్స్ అందుబాటులో ఉంచుతున్నామని ఇప్పటికే మూడు సార్లు లింక్ ఓపెన్ చేసినా ఎలాంటి ఉపయోగం లేదని వారు తెలుపుతున్నారు. జులై 10న కూడా సాయంత్రం 7:11 నిమిషాలకు లింక్ ఓపెన్ చేశారు. సెకన్ల వ్యవధిలోనే లింక్ ఓపెన్ చేస్తే సర్వర్ ఎర్రర్ అని చూపిస్తుందని ట్వీట్లు చేస్తున్నారు. ఎన్నో గంటల పాటు వేచి ఉన్నటువంటి ఫ్యాన్స్‌కు మూడోసారి కూడా నిరాశే ఎదురైందని తెలుపుతున్నారు. జస్ట్ 4 నిమిషాల తర్వాత స్టాక్ అయిపోయిందని ప్రకటించారు. లింకే ఓపెన్ కాలేదు, స్టాక్ అయిపొవడం ఏంటని ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. సినిమా ప్రచారం కోసం ఫ్యాన్స్‌తో గేమ్స్ ఆడుతున్నారా..? ఇది పెద్ద స్కామ్, చీటింగ్ అంటూ సోషల్ మీడియా వేదికగా వారు సీరియస్ అవుతున్నారు. (ఇదీ చదవండి: రెండోపెళ్లి చేసుకోనున్న ఐశ్వర్య రజనీకాంత్..?) అంతేకాకుండా ఇప్పటి వరకు టీ షర్ట్స్ అందినట్లు ఎవరూ కూడా సోషల్ మీడియాలో పోస్ట్‌లు కూడా చేయలేదు. దీంతో వీళ్లు నిజంగానే టీ షర్ట్స్ ఇస్తున్నారా? అనే సందేహాలు కూడా వస్తున్నాయని చెబుతున్నారు. మెజారిటీ ఫ్యాన్స్‌కే దక్కలేదు... ఇక సాధారణమైన వాళ్లకు ఏం దక్కింటాయని వారు అంటున్నారు. ఇది కేవలం ప్రమోషనల్ ట్రిక్ అంటూ.. కనీసం వందల్లో కూడా టీ షర్ట్స్ ఇచ్చి ఉండరని ఫ్యాన్స్ వాపోతున్నారు. Thank you for the BLASTing response for 'The Rise' 💥💥💥 After multiple Krashes all stock claimed in 4 minutes.#ProjectK #WhatisProjectK pic.twitter.com/QBPg4JpE6v — Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 10, 2023 -
ప్రాజెక్ట్- కె సెట్స్‌లో ప్రభాస్ బర్త్‌డే సెలబ్రేషన్స్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రాజెక్ట్ కె అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో దీపికా పదుకొణె హీరోయిన్గా నటిస్తుంది. ఈ చిత్రంతోనే ఆమె టాలీవుడ్‌కు పరిచయం అవుతుంది. తాజాగా ఆదివారం ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా ప్రాజెక్ట్ కె సెట్లో ప్రభాస్ బర్త్‌డే వేడుకలు జరిగాయి. సెట్లో భారీగా టపాసులు పేల్చుతూ మూవీ టీం డార్లింగ్‌కు బర్త్‌డే విషెస్‌ను తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను వైజయంతి మూవీస్ ట్విటర్ వేదికగా పంచుకుంది. From the Sets of #ProjectK, Wishing the one and only darling #Prabhas a very Happy Birthday ❤️💫@nagashwin7 @SrBachchan @deepikapadukone @AshwiniDuttCh @VyjayanthiFilms #HappyBirthdayPrabhas pic.twitter.com/GJY9ClRUHu — Vyjayanthi Movies (@VyjayanthiFilms) October 22, 2022 -
'ప్రాజెక్ట్ కె'లో బాలీవుడ్ హీరోయిన్, వైరల్ అవుతున్న పోస్ట్!
బాహుబలితో పాన్ ఇండియా స్టార్‌గా ఇమేజ్ తెచ్చుకున్న ప్రభాస్‌కు ఈ మధ్య ఏదీ కలిసిరావడం లేదు. బాహుబలి రెండు భాగాల తర్వాత చేసిన సాహో హిందీలో బాగా ఆడినప్పటికీ తెలుగులో మాత్రం అంతంతమాత్రంగానే కలెక్షన్లు వసూలు చేసింది. ఆ తర్వాత భారీ బడ్జెట్‌తో చేసిన రాధేశ్యామ్ బాక్సాఫీస్ దగ్గర చతికిలపడింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆశలన్నీ సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె మీదనే పెట్టుకున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ప్రాజెక్ట్ కెలో దీపికా పదుకోన్ హీరోయిన్గా నటిస్తుండగా అమితాబ్ బచ్చన్ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇదిలా ఉంటే ప్రాజెక్ట్ కె మూవీలోకి మరో హీరోయిన్ను తీసుకున్నారు. బాలీవుడ్ భామ దిశా పటానీకి వెల్కమ్ చెప్తూ ఆమెకు పుష్పగుచ్చాన్ని పంపారు. దీంతో సర్ప్రైజ్ అయిన దిశాపటానీ బొకే ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంది. కాగా పాన్ ఇండియాగా తెరెక్కుతున ప్రాజెక్ట్ కె తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి తోట రమణి ఓ ఆర్ట్ డైరెక్టర్. వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వనీదత్ నిర్మిస్తున్నాడు. చదవండి: ‘శివకార్తికేయన్ చేసిన ఒక్క ఫోన్‌కాల్ నా జీవితాన్నే మార్చేసింది’ యాంకర్ లాస్య నోట ర్యాప్ సాంగ్, అట్లుంటది ఆమెతోని! -
‘ఆ మూవీ తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదు’
సాక్షి, హైదరాబాద్ : మహానటి సినిమాతో దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నాగ్ అశ్విన్. ఎవడే సుబ్రమణ్యం సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్‌కు ఆయన పరిచమయ్యారు. నాని హీరోగా నటించిన ఎవడే సుబ్రమణ్యం సినిమా ఓ మోస్తరుగా ఆడినా దర్శకుడిగా అశ్విన్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది. రెండో సినిమాగా బయోపిక్‌ను ఎంచుకోవడం.. అందులోనూ మహానటి సావిత్రి జీవితాన్ని వెండి తెరపై ఆవిష్కరించాలనుకోవడం.. అనుకున్న దానికంటే అద్భుతంగా సినిమాను తీర్చిదిద్దిన తీరు ఆయనపై అంచనాలను అమాంతం పెంచేశాయి. సావిత్రి బయోపిక్ తీయాలనుకోవడం ఒక సాహసమైతే.. ఒకే సినిమాతో దిగ్గజాలను తెరపైన ఆవిష్కరించానుకోవడం మరో సాహసం. జెమినీ గణేషన్, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్వీఆర్, కేవీ రెడ్డి, చక్రపాణి, ఎల్వీప్రసాద్ ఇలా అలనాటి మేటి సినీ వర్గాన్ని తెరపైన చూపించాలంటే వారి అభినయాన్ని, ఆహార్యాన్ని స్ఫురణకు తెచ్చే నేటి నటులను తెరపైకి తేవాలి. ఇది అంత సామాన్యమైన విషయం కాదు. అలాంటిది మేటి తారలకు తగ్గట్టుగా వారి పాత్రలలో నేటి తారలను చూపించి ఔరా అనిపించారు అశ్విన్. సినిమాతో మ్యాజిక్ చేసి అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు. నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. ‘ఎవడే సుబ్రమణ్యం తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదని, ఏదైనా చేస్తే అది భవిష్యత్తును ముందుకు నడిపేదిగా ఉండాలి. చిన్నప్పటి నుంచి నటిగా సావిత్రి అంటే చాలా ఇష్టం. అందుకే ఆమె గురించిన విషయాలు తెలుసుకోవడానికి రెండేళ్లు కష్టపడ్డాను. ఏది ఎప్పుడు జరగాలని ఉంటే అప్పుడే జరుగుతుంది. రెండో సినిమాగా బయోపిక్ తీయడం అలా జరిగిపోయింది. రానున్న రోజుల్లో ప్రయోగాలు చేస్తానో లేదో తెలియదు. కొన్ని విజయాలు, అపజయాల తర్వాత జీవితం ఎలా మారుతుందో. ఇప్పుడు తీసినంత నిజాయితీగా తర్వాతి రోజుల్లో తీస్తానో లేదో. మహానటి విజయం ఆశ్చర్యంగానూ, ఆనందంగానూ ఉంది. సావిత్రి గురించి తెలుసుకోవడానికి చాలా పుస్తకాలు చదివాను, సావిత్రితో కలిసి నటించిన వారు ఆమె గురించి ఇచ్చిన ఇంటర్వ్యూలలోని విషయాలను కూడా తెలుసుకున్నాను. ముఖ్యంగా ఆమె కూతురితో సినిమాకు అవసరమైన అన్ని విషయాలపై చర్చించాను. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరు తమ బాధ్యతను నిజాయితీతో పూర్తి చేశారు. కీర్తి సురేష్ నటన సినిమా విజయానికి ఓ ముఖ్య భూమిక పోషించింది. శేఖర్ కమ్ముల వద్ద పని చేసినపుడు పాత్రల విషయంలో ఎక్కువ ఆసక్తి చూపేవాడిని. మొదట సావిత్రి పాత్రకోసం చాలా మందిని అనుకున్నప్పటికి చివరగా కీర్తి సురేష్‌ను ఎంచుకున్నాం. ధనుష్ హీరోగా నటించిన తమిళ సినిమా తొడరిలో కీర్తి సురేష్ నటన నచ్చడంతో ఆమె ఈ పాత్రకు న్యాయం చేస్తుందని నమ్మాను. మహానటి సినిమాలో నటించిన దుల్కర్ సల్మాన్, సమంతా అక్కినేని, విజయ్ దేవరకొండ, మోహన్‌బాబు, రాజేంద్రప్రసాద్, బానుప్రియ, ఇతరులతో కలిసి పనిచేయడం ఛాలెంజింగ్‌గా అనిపించింది. వారి షెడ్యూల్స్‌ను మేనేజ్ చేయడమే ఇబ్బందిగా మారేదని, కేవలం సావిత్రి బయోపిక్ అన్న ఒక్క కారణంతో సినిమా పాత్ర నిడివి తక్కువైనా చేయడానికి ఒప్పుకున్నారు. ఈ సినిమా కోసం కష్టపడిన వారందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నన్ను నమ్మి సినిమా చేసిన నిర్మాతలు ప్రియాదత్, స్వప్నదత్‌ల వల్లే మహానటి విజయం సాధ్యపడింది. మహానటి సినిమాతో తన బాధ్యత మరింత పెరింగిందంటూ’ పలు విషయాలు షేర్ చేసుకున్నారు. -
చిరును డైరెక్ట్ చేయనున్న నాగ్ అశ్విన్?
-
‘మహానటి’పై మెగాస్టార్ ప్రశంసల జల్లు
-
నా ప్రియ సావిత్రి
నా అంటే నాగ్ అశ్విన్ ప్రియ అంటే ప్రియాంకా దత్ సావిత్రి అంటే కీర్తీ.. అందుకే ఈ ఇంటర్వ్యూని ‘నా ప్రియ సావిత్రి’ అని మీకు పరిచయం చేయాలనిపించింది. ఇవాళ్టి జనరేషన్‌కి ఇలాంటి సినిమా ఏంటి? అని ఇండస్ట్రీలో ఎందరో అనుకున్నారు. కానీ ఈ యంగ్ డైరెక్టర్ విజన్... ఈ యంగ్ ప్రొడ్యూసర్స్ సాహసం... అప్పటి సావిత్రి మరిపించినట్లే ఇప్పటి కీర్తీ మైమరిపిస్తుందేమో చూడాలి. కేవలం ఒక్క సినిమా అనుభవం ఉన్న దర్శకుడు ‘మహానటి’ సావిత్రిగారి బయోపిక్ తీయటం కొంచెం ఎర్లీ ఏమో? నాగీ (నాగ్ అశ్విన్): ‘ఎవడే సుబ్రమణ్యం’ తీశాక ఆ సనిమా చాలా ఎర్లీగా తీశానేమో అనిపించింది (నవ్వుతూ). జనరల్‌గా చాలా సినిమాలు తీసి తీసి విరక్తి పుట్టి అలాంటి సినిమా తీస్తారు. కానీ నేను మాత్రం ఇప్పుడే తీయాలనుకున్నాను. సావిత్రిగారి బయోపిక్ తీయడానికి ఇదే రైట్ టైమ్ అని నాకనిపించింది. అంటే.. ఏజ్ పెరిగాక, దర్శకుడిగా ఇంకా అనుభవం సాధించాక ‘మహానటి’ లాంటి సినిమా చేయాలనేది కొందరి ఒపీనియన్.. నాగీ: నా ఒపీనియన్ ఏంటంటే.. ఇంకో రెండు మూడు సినిమాలు తీశాక ఫ్లాప్ లేదా హిట్ వచ్చిందనుకోండి.. ఎంత బ్యాలెన్డ్స్‌గా ఉందామనుకున్నా మైండ్ హిట్ వైపు అట్రాక్ట్ అవ్వొచ్చు లేదా ఫ్లాప్‌కి కుంగిపోవచ్చు. దానికి తోడు ‘ఇలాంటి సినిమా ఇప్పుడెందుకు’ అనేవాళ్లు ఎక్కువైపోతారు. పదేళ్ల తర్వాత ఇన్‌సెక్యూర్టీ రావొచ్చు. కమర్షియల్ అవుతానేమో. అప్పుడు లెక్కలు వేసుకోవడం మొదలవుతుంది. ఆ లెక్కలే ముఖ్యమై నేను అనుకున్నది తీయలేనేమో. అందుకే ఈ సినిమా తీయడానికి ఇదే బెస్ట్ టైమ్. ఈ సినిమా నిర్మించింది మీ హజ్బెండ్ నాగీ మీద ఉన్న ప్రేమతోనా? సావిత్రిగారి మీద అభిమానంతోనా? ప్రియాంకా: సావిత్రిగారి మీద ఉన్న ప్రేమతోనే. ‘ఎవడే సుబ్రమణ్యం’ జరుగుతున్నప్పుడే ‘సావిత్రిగారి బయోపిక్ చేయాలనే ఐడియా ఉంది’ అన్నాడు నాగీ. నాకు, స్వప్నాకీ (ప్రియాంక అక్క స్వప్నా దత్) సింక్ అవ్వడానికి రెండు రోజులు పట్టింది. ‘ఎవడే..’ రిలీజ్ అయిన కొన్ని రోజుల తర్వాత ‘నిజంగానే సినిమా తీయాలనుకుంటున్నావా’ అని నాగీని అడిగాం. అవునని చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పాడు. మా అందరికీ కూడా సావిత్రిగారంటే ఇష్టం. ఇలాంటి అవకాశం మళ్లీ రాదని వెంటనే మేమూ ఒప్పేసుకున్నాం. సావిత్రిగారి లైఫ్ హిస్టరీ తీయాలని ఎందుకు అనుకున్నారు? నాగీ: నా తరం మాత్రమే కాదు.. నా తర్వాత నా చెల్లెలు వయసున్న వాళ్లు ఈ మహానటిని మర్చిపోకూడదని తీశాను. చిన్నప్పుడు అమ్మమ్మతో కలసి సావిత్రిగారి సినిమాలు చూశాను. ఆ తర్వాత ఆమె జీవితం గురించి తెలుసుకున్నాను. నటిగా, వ్యక్తిగా ఆమె లైఫ్ యంగర్ జనరేషన్‌కి ఆదర్శం అవుతుంది. ఆవిడ ఎరాను యంగర్ జనరేషన్ కోసం పొందుపరచటానికి ఈ సినిమా తీశాను. సినిమా బాగుంటే కాంప్లిమెంట్స్.. లేకపోతే క్రిటిసిజమ్... నాగీ: ఇంకా అంత దూరం ఆలోచించలేదు. ప్రస్తుతం ప్రింట్స్ డెలివరీతో బిజీగా ఉన్నాం. అయితే ఒక మహా వ్యక్తి లైఫ్ హిస్టరీ కాబట్టి ఆషామాషీగా తీయలేదు. రిసెర్చ్ చేశాం. సావిత్రిగారి పాత్రకి కీర్తీ సురేశ్ యాప్ట్ అని ఆమె యాక్ట్ చేసిన మూవీస్ చూసి ఫిక్సయ్యారా? ఫొటోలు చూశా? నాగీ: తమిళ సినిమా ‘తొడరి’ (తెలుగులో ‘రైల్’)లో కీర్తీ సురేశ్ చేసిన సాంగ్ చూశా. అంతకుముందు ఆమె చేసిన సినిమాలు చూశాను కానీ, ఈ సినిమాలో మాత్రం యంగ్ సావిత్రిగారు విలేజ్ లుక్‌లో ఎలా ఉంటారో అలా అనిపించింది. కళ్లలో అమాయకత్వం, తుంటరితనం కనిపించాయి. అయితే అందర్నీ ఒప్పించటానికి చాలా టైమ్ పట్టింది (నవ్వుతూ). ఇంత పెద్ద సినిమా తీస్తున్నావు. ఆల్మోస్ట్ కొత్త హీరోయిన్ని తీసుకుంటానంటున్నావు, మార్కెట్ గురించి ఆలోచించావా? అన్నారు. అయినా నేను కీర్తీకే ఫిక్సయ్యాను. కీర్తీ సురేశ్ పేరు చెప్పగానే మీకేమనిపించింది? ప్రియాంకా: అర్థం కాలేదు. తను అప్పటికి జస్ట్ వన్ మూవీ ఓల్డ్. మేం తన తమిళ సినిమాలు ఏమీ చూడలేదు. అప్పటికి ‘నేను శైలజా’ ఒక్కటే రిలీజ్ అయింది. నాకు, స్వప్నాకి చాలా టైమ్ పట్టింది సింక్ చేసుకోవడానికి. నాగీ మాత్రం ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. నాగీ: ఫ్రాంక్‌గా చెప్పాలంటే నాకు చాయిస్ కూడా లేకుండా పోయింది. వేరే ఎవర్నీ ఊహించలేకపోయాను. 16 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ ఏజ్ క్యారెక్టర్ ప్లే చేసే యాక్టర్స్ ఎవ్వరూ లేరు. అన్ని ఏజ్ గ్రూప్స్‌కి కీర్తీ సెట్ అవుతుందనిపించింది. ముందు లుక్స్ పరంగా మ్యాచ్ అవ్వాలి. ఆ తర్వాత యాక్టింగ్ వైజ్‌గా బెస్ట్ అనిపించాలి. కీర్తీ బెస్ట్ అనుకున్నాను. ఇంట్లో మీ అమ్మా, నాన్నగారు, మీ సిస్టర్... అందరూ డాక్టర్స్. మీకు ఫిల్మ్ ఇండస్ట్రీకి రావాలని ఎందుకనిపించింది? నాగీ: చిన్నప్పుడు ఇంగ్లీష్ కాంపోజిషన్లో మనంఅనుకున్నది సృష్టించి రాసుకోవచ్చు. కొత్తగా క్రియేట్ చేయగలుగుతాం కాబట్టి అది నా ఫేవరెట్ సబ్జెక్ట్ అయింది. పెద్దయ్యాక జర్నలిజం అనుకున్నా. తర్వాత అడ్వరై్టజింగ్ అనుకున్నా. ఫైనల్‌గా నా థాట్ సినిమాపై మళ్లింది. బేసిక్‌గా క్రియేషన్ అంటే ఇష్టం ఉండటంతో సినిమాకి అట్రాక్ట్ అయ్యాను. శేఖర్ కమ్ముల గారి లీడర్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’కి వర్క్ చేశా. చిన్న ప్రొడక్షన్ హౌస్ పెట్టుకొని కమర్షియల్ యాడ్స్ తీశాను. ‘ఎవడే సుబ్రమణ్యం’తో డైరెక్టర్‌గా మారాను. సావిత్రి గారి నడక, మూతి విరుపు చూడచక్కగా ఉంటాయి. ఆమెలా నటించడానికి కీర్తీ హోమ్‌వర్క్ చేశారా? నాగీ: కీర్తీ ఎక్కువగా హోమ్ వర్క్ చేసే హీరోయిన్లా కనిపించదు. కష్టపడి లైన్స్ గుర్తుపెట్టుకొని కెమెరా ముందు అప్పజెప్పే టైప్ హీరోయిన్ కాదు. సీన్ చెబితే చాలు. కెమెరా ముందు ఆ క్యారెక్టర్లానే మారిపోతుంది. కీర్తీ బ్లెస్డ్ యాక్టర్. సావిత్రిగారి భర్త జెమినీ గణేశన్‌గారి మొదటి భార్యకు పుట్టిన రేఖ (సౌత్, నార్త్‌లో ఫేమస్ యాక్ట్రెస్) గారి పాత్ర సినిమాలో ఉందా? నాగీ: లేదు. లైఫ్ స్టోరీ మొత్తం చెప్పాలని ఉన్నా టైమ్ లిమిట్ ఉంటుంది కదా. ఆమె జీవితంలో ఉన్న ఇంపార్టెంట్ క్యారెక్టర్స్‌ని పెట్టాలనిపించి, చాలా రాశాను. ఫైనల్ స్క్రిప్ట్ చూస్తే.. ఇదంతా తీస్తే ఎడిటింగ్ లెవెల్లో కష్టమైపోతుందని స్క్రిప్ట్ లెవల్లోనే ఎడిట్ చేసుకున్నాను. సావిత్రిగారి లైఫ్‌లోని బ్యాడ్ ఫేజ్ కూడా చూపించారా? నాగీ: మన జనరేషన్ అంతా ఆమె గురించి సెలబ్రేట్ చేసుకోవాలనే ఈ సినిమా తీశాను. అలా అని ఏదీ స్కిప్ చేయలేదు. డౌన్ ఫాల్ అనేవి ఆమె లైఫ్‌లో భాగమే కదా. అవి కూడా చూపించాం. సినిమా తీసినప్పుడు అన్నీ చెప్పాలి. ఓన్లీ సక్సెస్ మాత్రమే చూపించడం కరెక్ట్ కాదు. అలా చేస్తే అసంపూర్ణంగా ఉంటుంది. ఏయన్నార్‌గా చేసిన నాగచైతన్య గురించి? నాగీ: చైతన్య రోల్ చిన్న సర్ప్రైజ్లా ఉంటుంది. అడగ్గానే ఒప్పుకున్నాడు. బాగా చేశాడు. సమంత, విజయ్ దేవరకొండ కూడా వెంటనే ఒప్పుకున్నారు. ఈ ఏజ్ గ్రూప్ యాక్టర్స్ ఈ సినిమాలోకి రావడం బెస్ట్ థింగ్. వాళ్లు మెయిన్ లీడ్ కాకపోయినా సరే చేశారు. నీకెన్ని సీన్స్ ఉన్నాయి? నాకెన్ని ఉన్నాయి? అని లెక్కలు వేసుకోలేదు. ఇలాంటి ఆర్టిస్టులు ఉంటే నెక్ట్స్ జనరేషన్‌కి బోలెడు కథలు చెప్పొచ్చు. నిర్మాతగా మీరు ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నారు? ప్రియాంకా: ఎక్కువమంది ఆర్టిస్టులు ఉన్నారు కాబట్టి డేట్స్ విషయంలోనే కొంచెం ఇబ్బంది అనిపించింది. ‘ఎంత అదృష్టం ఉండి ఉంటే ఇలాంటి సినిమా చేస్తున్నాం’ అనే ఫీల్ కలగని రోజు లేదు. అంతా సజావుగా జరిగింది. భర్త డైరెక్టర్.. భార్య ప్రొడ్యూసర్ అయితే ఆ ప్రాజెక్ట్ ఇలా సాఫీగానే సాగుతుందేమో కదా? ప్రియాంకా: అలా ఏమీ లేదండి. మేం గొడవ పడని రోజు లేదు. కొన్ని సార్లు అభిప్రాయాలు కలిసేవి కావు. తను ఒకటి చెబితే మేం ఒకటి. ఆ ఆర్గ్యుమెంట్ లేకపోతే మంచి అవుట్‌పుట్ రాదు. అసలు ఒకరి మీద ఒకరు అరుచుకోవచ్చని, గొడవపడొచ్చనే పెళ్లి చేసుకున్నాం (నవ్వుతూ). మీ లవ్ స్టోరీ గురించి. నాగీతో ఎప్పుడు లవ్‌లో పడ్డారు? ప్రియాంకా: ఎప్పటి నుంచో తను తెలుసు. ‘ఎవడే సుబ్రమణ్యం’కి బాగా ట్రావెల్ చేశాం. నాగీలో గుడ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఆ టైమ్‌లో మా పేరెంట్స్ పెళ్లి చేసుకోమని ప్రెషర్ చేస్తే, ఎవర్నో ఎందుకు? బెస్ట్ ఫ్రెండ్‌నే పెళ్లి చేసుకుంటే లైఫ్ కంఫర్టబుల్‌గా ఉంటుందనిపించింది. నాగీ: డైరెక్టర్, ప్రొడ్యూసర్‌గా ఇద్దరం కలసి చేసిన ట్రావెల్లో ఒకర్నొకరు అర్థం చేసుకున్నాం. ప్రియాంక నాకు బెస్ట్ ఫ్రెండ్. ఇదేదో ‘ఐ లవ్ యు’ అని చెప్పుకుని, టిపికల్ లవ్ మ్యారేజ్‌లా చేసుకున్నది కాదు. తనతో లైఫ్ కంఫర్ట్‌గా ఉంటుందనిపించి, చేసుకున్నా. గడ్డం, పొడువైన జుట్టుతో నాగీ చూడచక్కగానే ఉన్నా.. మీకెప్పుడైనా అనిపించిందా ఈ గెటప్ అంతా మార్చేయాలని? ప్రియాంకా: మా పెళ్లి అవ్వకముందు ఓసారి ట్రై చేశా. హెయిర్ షార్ట్‌గా కట్ చేసుకుని, గడ్డం తీశాడు. నువ్వేనా అన్నాను? ఆ తర్వాత నుంచి ఇప్పటివరకూ కొంచెం లాంగ్ హెయిర్, గడ్డం.. ఇదే మెయిన్టైన్ చేస్తున్నాడు. ఇదే బాగుంది. ఫస్ట్ ‘ఎవడే సుబ్రమణ్యం’, ఇప్పుడు ‘మహానటి’ తీశారు. మరి.. రెగ్యు లర్ ఫార్మాట్ సినిమాలు చేయాలని మీకు లేదా? నాగీ: ఒక సినిమా తీయాలంటే కథ రాయడానికి ఒక ఆరు నెలలు పడుతుంది. మళ్లీ కాస్టింగ్‌కి ఒక ఆరు నెలలు. సినిమా పూర్తయ్యేసరికి సంవత్సరం. మొత్తం రెండేళ్లు. మనం 60 ఏళ్లు బ్రతుకుతాం అనుకుంటే అందులో ప్రతి సినిమాకి రెండేళ్లు కేటాయించినప్పుడు.. స్టాండర్డ్ సినిమా అయినా ఏదైనా.. డబ్బులు వచ్చినా రాకపోయినా ఆ రెండేళ్ల జీవితం వర్తీగా ఉండాలి. 100 మందిని కొట్టడం, ఐటమ్ సాంగ్స్ ఉన్న సినిమాలు మీరు ఎంజాయ్ చేస్తారా? నాగీ, ప్రియాంకా: యా.. పర్ఫెక్ట్గా చేసిన సినిమాలను కచ్చితంగా ఎంజాయ్ చేస్తాం. ‘రంగస్థలం’ వెల్ మేడ్ కమర్షియల్ మూవీ. అవునూ.. ‘ఎవడే సుబ్రమణ్యం’కి స్వప్నా, ప్రియాంకా లిమిటెడ్ బడ్జెట్ ఇచ్చారట. ఈ సినిమాకు బడ్జెట్ విషయంలో లిమిటేషన్స్ ఏమైనా పెట్టారా? నాగీ: ‘ఎవడే..’ లో–బడ్జెట్లో చేయాల్సిన సినిమా. అప్పటికి నాని కెరీర్ పెద్దగా హిట్లో లేదు. విజయ్ దేవరకొండ ఫేమస్ కాదు. నాకు ఫస్ట్ మూవీ. ఎవరికీ మార్కెట్ లేదు. పైగా స్టోరీయేమో వెరీ డిఫరెంట్. తెలుగులో చూస్తారా లేదా? అనే డౌట్ కూడా ఉంది. యాక్చువల్‌గా నేనే చేద్దామనుకున్నాను. అయితే స్వప్నా, ప్రియాంకా కథ విని, మేమే చేస్తామన్నారు. దాంతో ఓ మెయిన్ క్యారెక్టర్‌కి కృష్ణంరాజుగారిని తీసుకున్నాం. అలా డీసెంట్ మీడియమ్ బడ్జెట్ సినిమా అయింది. వాళ్లు ఖర్చు పెడుతుంటే నాకు భయం అనిపించేది. ఏదైనా తేడా జరిగితే బ్లేమ్ చేస్తారేమో అనుకున్నా (నవ్వుతూ). ‘మహానటి’కి అయితే నేను వద్దన్నా ఖర్చు పెట్టారు. ఫలానా సీన్‌కి 100 మంది ఆర్టిస్టులు కావాలంటే.. 150 మందిని తీసుకుందామనేవారు. చిన్న సీన్లోనూ కాంప్రమైజ్ అవ్వలేదు. అలా అని నీళ్లలా ఖర్చు పెట్టాం అని చెప్పడం లేదు. ఫైనల్లీ... సావిత్రిగారి కూతురు విజయ చాముండేశ్వరిగారు ఈ సినిమా చూశారా? ప్రియాంకా: చూశారు. సావిత్రిగారి అబ్బాయి సతీష్‌గారు కూడా చూశారు. చాలా బావుందని ఎమోషనల్ అయ్యారు. కాంట్రవర్శీ లేదని హ్యాపీ ఫీలయ్యారు. మా అమ్మగారిని నీలో చూసుకుంటాను అన్నారు అందరి మనసుల్లో మహానటిగా నిలిచిపోయిన సావిత్రిలాంటి అద్భుత నటి పాత్రను అంగీకరించడం అంటే ఎంతో ధైర్యం కావాలి. సావిత్రిగా చేయడానికి ముందు సంశయించినా కీర్తీ సురేశ్ ఆ తర్వాత ధైర్యంగా ఒప్పుకున్నారు. ‘మహానటి’ సినిమా గురించి తన మనోభావాలను ఇలా పంచుకున్నారు. ♦ నాగ్ అశ్విన్ ఫస్ట్ అప్రోచ్ అయి, ఐడియా చెప్పగానే భయం అనిపించింది. స్క్రిప్ట్ విన్నాక ఇంకా భయపడ్డాను. నా భయమేంటంటే సావిత్రిగారు లెజెండరీ యాక్ట్రెస్. సరిగ్గా చేయగలనా లేదా? కన్విన్స్ చేయ గలుగుతానా? లేదా.. ఇలా ఎన్నో డౌట్స్ ఉండేవి. ♦ లుక్ టెస్ట్ చేసేవరకూ అస్సలు కాన్ఫిడెన్స్ లేదు. తన బొట్టు, వంకీల జుట్టు, కాస్ట్యూమ్స్.. ఇవన్నీ నా మీదకు వచ్చేసరికి నమ్మడం మొదలెట్టాను (నవ్వుతూ). నిజం చెప్పాలంటే అసలు నేను సావిత్రిగారిలా ఉంటానా? అనుకున్నాను. ట్రైలర్, ఫొటోలు చూసుకున్నాక నమ్మకం ఏర్పడింది. ♦ సావిత్రిగారిలో గొప్పతనం ‘సహాయ గుణం’. మన దగ్గర డబ్బుండి దానం చేయటం ఓకే. కానీ లేనప్పుడు కూడా సహాయం చేయాలని ఆరాటపడటం సావిత్రిగారి గొప్పతనం. ఆమె సెన్స్ ఆఫ్ హ్యూమర్, విల్ పవర్ సూపర్. ‘మీరు చేయలేరు’ అని పొరపాటున ఆవిడ ముందు అంటే చేసి చూపించగల విల్‌పవర్ ఉన్న వ్యక్తి సావిత్రిగారు. ♦ ఫస్ట్ సావిత్రిగా కీర్తీ అనుకున్నప్పుడు చాలా మంది పెదవి విరిచారు. నాకేం తప్పుగా అనిపించలేదు. ఎందుకంటే నాకే కాన్ఫిడెన్స్ లేనప్పుడు వాళ్లు అనుకోవడంలో తప్పులేదని వదిలేశాను. ♦ సావిత్రిగారి పాత్ర చేస్తున్నాను అని మా అమ్మ (నటి మేనక)గారికి చెప్పినప్పుడు సావిత్రి గారి బొట్టు, జాకెట్ స్లీవ్స్, తన ఎడమ చేతి వాటం గురించి చాలా ఇన్‌ఫుట్స్ ఇచ్చారు. నిజానికి అప్పట్లో బ్లౌజ్ ఫిటింగ్ చాలా టైట్‌గా ఉండేది. ఇప్పుడా ఫిటింగ్ అంటే కష్టం. షూటింగ్ పూర్తయి, కాస్ట్యూమ్స్ చేంజ్ చేసుకున్నాక చూసుకుంటే, నా చేతులు బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేక గ్రీన్‌గా మారిపోయి ఉండేవి. ♦ ప్రొస్థటిక్ మేకప్ వేసుకోవడానికి మూడు నాలుగు గంటలు పట్టేది. ఒక్కసారి మేకప్ వేసుకున్నాక బాత్రూమ్కి వెళ్లటం, ఫుడ్ తినడం కష్టం. అప్పుడు ఓన్లీ లిక్విడ్ ఫుడ్స్ తీసుకునేదాన్ని. ♦ డబ్బింగ్ చెప్పడానికి 11 రోజులు పట్టింది. సావిత్రిగారు చాలా బాగా మాట్లాడేవారు. ఆమె డిక్షన్ మ్యాచ్ చేయడానికి చాలా కేర్ తీసుకున్నాను. ♦ నా చిన్నప్పుడు మోహన్‌బాబు గారి దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకున్నాను. ఇప్పుడు ఆయనతో నటించడం చాలా బాగా అనిపించింది. ఆ ఆటోగ్రాఫ్ చూపించగానే ‘ఏంటీ నేను ముసలివాడిని అయ్యానని గుర్తు చేస్తున్నావా?’ అన్నారు సరదాగా. ♦ సావిత్రిగారి కుమార్తె విజయ చాముండేశ్వరిగారు చాలా ఇన్‌ఫుట్స్ ఇచ్చారు. మా సినిమాలోని ‘మాయాబజార్’లో కొన్ని సీన్స్ చూపిస్తే, ‘సూపర్బ్’ అని చాలా సంతోషపడ్డారు. అప్పటినుంచి నన్ను ‘క్యూట్ లిటిల్ మామ్’ అంటున్నారు. ఎప్పుడైనా మా అమ్మగారు గుర్తొస్తే నీలో అమ్మగారిని చూసుకుంటాను, నువ్వు దగ్గర ఉంటే హగ్ చేసుకుంటాను అన్నారు. -
సావిత్రమ్మ
-
సమంత క్యారెక్టర్‌పై మరో ట్విస్ట్..!
ఎవడే సుబ్రమణ్యం సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరో సినిమా మహానటి. అలనాటి అందాల తార సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై చాలా రోజులుగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా టైటిల్ రోల్లో ఎవరు నటిస్తారన్న ప్రశ్నకు ఈ మధ్యే సమాధానం దొరికింది. ముందుగా ఈ పాత్రలో సమంత నటిస్తుందన్న ప్రచారం జరిగినా ఫైనల్‌గా కీర్తి సురేష్, సావిత్రిగా నటిస్తోందని ప్రకటించారు. అయితే సమంత కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తోందన్న ప్రకటనతో మరోసారి ఊహాగానాలకు తెర లేచింది. సమంత లాంటి స్టార్ హీరోయిన్ చేస్తోందంటే అది కీలక పాత్ర అయి ఉంటుందని, సావిత్రి హీరోయిన్గా ఉన్న సమయంలో ఆమెతో పోటి పడిన జమున పాత్రలో సమంత నటించబోతుందన్న ప్రచారం జరిగింది. అయితే తాజాగా సమాచారం ప్రకారం సమంత చేయబోయే పాత్ర పై కొత్త ప్రచారం జరుగుతోంది. మహానటి సినిమాలో సమంత జర్నలిస్ట్ పాత్రలో కనిపిస్తోందట. 80లలో సావిత్రి జీవితం పై పరిశోదన చేసిన విలేఖరి పాత్ర ద్వారా కథ నడిపించాలని ఫిక్స్ అయిన దర్శకుడు, ఆ పాత్రకు సమంతను ఎంచుకున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న యూనిట్, త్వరలోనే సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తోంది. -
'తరాలను నిర్మించే స్త్రీ జాతికోసం'
ఎవడే సుబ్రమణ్యం సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన నాగ్ అశ్విన్, మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. చాలా రోజులుగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఇంతవరకు నటీనటులతో పాటు ఇతర వివరాలేవి వెల్లడించలేదు. ముఖ్యంగా సావిత్రి పాత్రలో ఎవరు కనిపించబోతున్నారన్న చర్చ పెద్ద ఎత్తున జరిగింది. ఉమెన్స్ డే సందర్భంగా సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన దర్శకుడు మరింత కన్ఫ్యూజన్ పెంచాడు. మాయబజార్ సినిమాలోని సావిత్రి స్టిల్, వెనుక ఒకవైపు కీర్తి సురేష్, మరోవైపు సమంత ఫోటోలను యాడ్ చేశారు. అయితే ఈ ఇద్దరిలో సావిత్రిగా ఎవరు కనిపించబోతున్నారన్న విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అదే సమయంలో ఈ చరిత్రలో భాగమయ్యేందుకు మీరు ముందుకు రండి అంటూ కాస్టింగ్ కాల్ కూడా ఇచ్చారు. 'తరాలను నిర్మించే స్త్రీ జాతికోసం, తరతరాలు గర్వించే మహానటి సావిత్రి కథ' అనే లైన్‌తో రిలీజ్ చేసిన ఈ పోస్టర్లో టైటిల్‌ను మాత్రం రివీల్ చేయలేదు. -
ప్రముఖ నిర్మాతకు అల్లుడు కానున్న దర్శకుడు
హైదరాబాద్: ఎవడే సుబ్రమణ్యం డైరెక్టర్ నాగ్ అశ్విన్ త్వరలో ఒక ఇంటివాడు కాబోతున్నాడట.. ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ కుమార్తె ప్రియా దత్ ను ఆయన ప్రేమ వివాహం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. నాగ్ అశ్విన్ తో ప్రియాంక చిరకాలంగా ప్రేమలో పడినట్లు, ఇప్పుడు పెళ్లి బాజాలు మోగనున్నట్లు తెలుస్తోంది. ఎవడే సుబ్రమణ్యం ప్రాజెక్టు ప్రారంభమైనప్పటి నుంచి వీరి మధ్య ప్రేమ చిగురించిదట. ఈ విషయాన్ని స్వయంగా నాగ్ ఓ వార్తాసంస్థకు తెలిపారు. ఈ విషయంలో క్రెడిట్ తనకే దక్కుతుందని నాగ్ అన్నారు. ప్రియాంకే ముందుగా తనకు ప్రపోజ్ చేసిందన్నాడు. దీంతో తాను సంతోషంగా అంగీకరించానని నాగ్ తెలిపారు. ఇద్దరూ కలిసి పనిచేస్తున్న క్రమంలో తమ అభిప్రాయాలు కలిసి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నామన్నారు. దీనికి ఇరు కుటుంబాల సభ్యులు కూడా అంగీకరించినట్టు చెప్పారు. ఇంకా పెళ్లి ముహూర్తాన్ని ఖరారు చేయలేదని తెలిపాడు. స్వతహాగా సినిమా కుటుంబం నుంచి వచ్చిన ప్రియాంక కూడా సినిమా రంగంలోనే ఉన్నారు. అమెరికాలో డైరెక్షన్‌కు సంబంధించి శిక్షణ కూడా పొందారు. తిరిగి వచ్చాక అనేక వైవిధమైన చిన్న సినిమాలు తమ బ్యానర్ లో అందించడంలో కీలక పాత్ర వహించారు. అటు నాగ్ అశ్విన్ ఓ కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన స్క్రిప్ట్ పనిలో బిజీగా ఉంటే, ఇటు ప్రియాంక కొత్త కథలను పరిశీలించే పనిలో మునిగి తేలుతోందట. అందుకే పెళ్లి తేదీని ఇంకా ఖరారు చేయలేదట. ఇద్దరూ మంచి టేస్ట్ ఉన్నవ్యక్తులే. అందుకే ఇద్దరికీ జత కలిసిందని టాలీవుడ్ జనాలు భావిస్తున్నారట.