Prabhas Project K: Disha Patani Gets a Warm Welcome - Sakshi
Sakshi News home page

Prabhas: ప్రాజెక్ట్‌ కెలో దీపికా పదుకోన్‌తో పాటు మరో హీరోయిన్‌!

May 8 2022 12:54 PM | Updated on May 8 2022 1:39 PM

Prabhas Project K: Disha Patani Gets a Warm Welcome - Sakshi

నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్న ప్రాజెక్ట్‌ కెలో దీపికా పదుకోన్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా అమితాబ్‌ బచ్చన్‌ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇదిలా ఉంటే ప్రాజెక్ట్‌ కె మూవీలోకి మరో హీరోయిన్‌ను తీసుకున్నారు.

బాహుబలితో పాన్‌ ఇండియా స్టార్‌గా ఇమేజ్‌ తెచ్చుకున్న ప్రభాస్‌కు ఈ మధ్య ఏదీ కలిసిరావడం లేదు. బాహుబలి రెండు భాగాల తర్వాత చేసిన సాహో హిందీలో బాగా ఆడినప్పటికీ తెలుగులో మాత్రం అంతంతమాత్రంగానే కలెక్షన్లు వసూలు చేసింది. ఆ తర్వాత భారీ బడ్జెట్‌తో చేసిన రాధేశ్యామ్‌ బాక్సాఫీస్‌ దగ్గర చతికిలపడింది. దీంతో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఆశలన్నీ సలార్‌, ఆదిపురుష్‌, ప్రాజెక్ట్‌ కె మీదనే పెట్టుకున్నారు. 

నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్న ప్రాజెక్ట్‌ కెలో దీపికా పదుకోన్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా అమితాబ్‌ బచ్చన్‌ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇదిలా ఉంటే ప్రాజెక్ట్‌ కె మూవీలోకి మరో హీరోయిన్‌ను తీసుకున్నారు. బాలీవుడ్‌ భామ దిశా పటానీకి వెల్‌కమ్‌ చెప్తూ ఆమెకు పుష్పగుచ్చాన్ని పంపారు. దీంతో సర్‌ప్రైజ్‌ అయిన దిశాపటానీ బొకే ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంది. కాగా పాన్‌ ఇండియాగా తెరెక్కుతున​ ప్రాజెక్ట్‌ కె తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో వచ్చే ఏడాది రిలీజ్‌ కానుంది. ఈ చిత్రానికి తోట రమణి ఓ ఆర్ట్‌ డైరెక్టర్‌. వైజయంతీ మూవీస్‌ పతాకంపై అశ్వనీదత్‌ నిర్మిస్తున్నాడు.

చదవండి: ‘శివకార్తికేయన్‌ చేసిన ఒక్క ఫోన్‌కాల్‌ నా జీవితాన్నే మార్చేసింది’

యాంకర్‌ లాస్య నోట ర్యాప్‌ సాంగ్‌, అట్లుంటది ఆమెతోని!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement