ప్రముఖ నిర్మాతకు అల్లుడు కానున్న దర్శకుడు | Director Nag Ashwin to wed Ashwini Dutt's daughter | Sakshi
Sakshi News home page

ప్రముఖ నిర్మాతకు అల్లుడు కానున్న దర్శకుడు

Published Sat, Oct 10 2015 3:56 PM | Last Updated on Sun, Sep 3 2017 10:44 AM

ప్రముఖ నిర్మాతకు అల్లుడు కానున్న దర్శకుడు

ప్రముఖ నిర్మాతకు అల్లుడు కానున్న దర్శకుడు

హైదరాబాద్: ఎవడే సుబ్రమణ్యం డైరెక్టర్ నాగ్ అశ్విన్  త్వరలో ఒక ఇంటివాడు కాబోతున్నాడట..  ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ కుమార్తె ప్రియా దత్ ను ఆయన ప్రేమ వివాహం చేసుకోనున్నట్లు తెలుస్తోంది.  నాగ్ అశ్విన్ తో  ప్రియాంక చిరకాలంగా ప్రేమలో పడినట్లు, ఇప్పుడు పెళ్లి బాజాలు మోగనున్నట్లు తెలుస్తోంది. ఎవడే సుబ్రమణ్యం ప్రాజెక్టు ప్రారంభమైనప్పటి నుంచి వీరి మధ్య ప్రేమ చిగురించిదట.

ఈ విషయాన్ని స్వయంగా నాగ్ ఓ వార్తాసంస్థకు తెలిపారు. ఈ విషయంలో  క్రెడిట్ తనకే  దక్కుతుందని నాగ్ అన్నారు. ప్రియాంకే ముందుగా తనకు ప్రపోజ్ చేసిందన్నాడు.  దీంతో తాను  సంతోషంగా అంగీకరించానని నాగ్ తెలిపారు. ఇద్దరూ కలిసి పనిచేస్తున్న క్రమంలో తమ అభిప్రాయాలు కలిసి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నామన్నారు. దీనికి  ఇరు కుటుంబాల సభ్యులు కూడా అంగీకరించినట్టు చెప్పారు.  ఇంకా పెళ్లి ముహూర్తాన్ని ఖరారు చేయలేదని తెలిపాడు.

స్వతహాగా సినిమా కుటుంబం నుంచి వచ్చిన ప్రియాంక కూడా సినిమా రంగంలోనే ఉన్నారు. అమెరికాలో డైరెక్షన్కు సంబంధించి శిక్షణ కూడా పొందారు. తిరిగి వచ్చాక అనేక వైవిధమైన చిన్న సినిమాలు తమ బ్యానర్ లో అందించడంలో కీలక పాత్ర వహించారు.  అటు నాగ్ అశ్విన్ ఓ కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన స్క్రిప్ట్ పనిలో  బిజీగా ఉంటే, ఇటు ప్రియాంక కొత్త కథలను పరిశీలించే పనిలో మునిగి తేలుతోందట. అందుకే పెళ్లి తేదీని ఇంకా ఖరారు చేయలేదట.  ఇద్దరూ మంచి టేస్ట్ ఉన్నవ్యక్తులే. అందుకే ఇద్దరికీ జత కలిసిందని  టాలీవుడ్  జనాలు  భావిస్తున్నారట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement