నాగ్‌ అశ్విన్‌.. మీ చెప్పులిస్తే ముద్దు పెట్టుకుంటా: బ్రహ్మాజీ | Actor Brahmaji Praises On Kalki 2898 AD Movie Director Nag Ashwin | Sakshi

నాగ్‌ అశ్విన్‌.. మీ చెప్పులిస్తే ముద్దు పెట్టుకుంటా: బ్రహ్మాజీ

Jul 2 2024 1:09 PM | Updated on Jul 2 2024 1:31 PM

Actor Brahmaji Praises On Kalki 2898 AD Movie Director Nag Ashwin

నాగ్‌ అశ్విన్‌.. మొన్నటి వరకు ఈ పేరు టాలీవుడ్‌ ప్రేక్షకులకు తప్పితే..పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు  దేశం  మొత్తం మార్మోగిపోతోంది. యావత్‌ సినీ ప్రపంచం అతనిపై ప్రశంసల వర్షం కురిపిస్తోంది. దానికి కారణంగా ‘కల్కి 2898 ఏడీ’ సినిమా. ఆయన దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా నటించిన ఈ చిత్రం జూన్‌ 27న విడుదలై బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ టాక్‌తో దూసుకెళ్తోంది. నాలుగు రోజుల్లోనే దాదాపు రూ. 600 కోట్ల కలెక్షన్స్‌ రాబట్టి రికార్డులు సృష్టిస్తోంది.

(చదవండి: కల్కి దెబ్బకు 'షారుఖ్‌ ఖాన్‌' రికార్డ్‌ బద్దలైంది)

 నాగ్‌ అశ్విన్‌ మేకింగ్‌పై విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. హాలీవుడ్‌ సినిమాలకు ఏ మాత్రం తీసిపోకుండా ‘కల్కి 2898 ఏడీ’ చిత్రాన్ని తెరకెక్కించాడని పొగిడేస్తున్నారు. సామాన్యులు మొదలు..స్టార్‌ హీరోల వరకు ప్రతి ఒక్కరు సోషల్‌ మీడియా వేదికగా ‘కల్కి 2898 ఏడీ’పై రివ్యూ ఇస్తూ.. నాగ్‌ అశ్విన్‌ గురించి గొప్పగా మాట్లాడుతున్నారు. తాజాగా టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు బ్రహ్మాజీ తనదైన శైలీలో ‘కల్కి 2898 ఏడీ’ టీమ్‌పై ప్రశంసలు జల్లు కురిపించారు.

 (చదవండి: ఆ సంఘటనతో భయమేసింది: నాగ్ అశ్విన్)

ఈ సినిమా కోసం నాగ్‌ అశ్విన్‌ దాదాపు నాలుగేళ్ల పాటు కష్టపడ్డాడు. ఆ విషయాన్ని పరోక్షంగా తెలియజేస్తూ రిలీజ్‌ రోజు అరిగిపోయిన చెప్పులను తన ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశాడు. దాదాపు రూ.600 ‍కోట్ల బడ్జెట్‌తో సినిమా తీసే డైరెక్టర్‌ ఎంత సింపుల్‌ ఉంటాడో చూడండి అంటూ.. ఆయన చెప్పుల ఫోటోలను వైరల్‌ చేశారు నెటిజన్స్‌. దానికి సింక్‌ ఆయ్యేలా బ్రహ్మాజీ తన ఎక్స్‌ ఖాతాలో ఇలా రాసుకొచ్చాడు. తెలుగు సినిమా అనుకొంటే వరల్డ్‌ సినిమా తీశారు . నాగ్‌ అశ్విన్‌ గారు.. మీ అరిగిపోయిన చెప్పులు ఇస్తే ముద్దు పెట్టుకొంటా. థ్యాంక్యూ  ప్రియాంక ,స్వప్న (నిర్మాతలు). మీ రిస్కులే మీకు  శ్రీరామ రక్ష’ అని బ్రహ్మాజీ ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టాడు. ప్రస్తుతం బ్రహ్మాజీ పోస్ట్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement