
ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన బ్లాక్‌బస్టర్ హిట్ 'కల్కి 2898 ఏడీ'. జూన్ 27న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశాపటానీ, దీపికా పదుకొణె కీలక పాత్రల్లో నటించారు.
థియేట్రికల్ రిలీజ్ సూపర్ హిట్ కావడంతో కల్కి మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈ నెల 22 నుంచి అమెజాన్‌ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. మరికొన్ని గంటల్లోనే కల్కి ఓటీటీలో సందడి చేయనుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది. హిందీ వెర్షన్ అదే తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇంకేందుకు ఆలస్యం ఇవాళ అర్థరాత్రి నుంచే ఎంచక్కా ఓటీటీలో చూసేయండి.
Comments
Please login to add a commentAdd a comment