Priyanka Dutt
-
నాగ్ అశ్విన్.. మీ చెప్పులిస్తే ముద్దు పెట్టుకుంటా: బ్రహ్మాజీ
నాగ్ అశ్విన్.. మొన్నటి వరకు ఈ పేరు టాలీవుడ్ ప్రేక్షకులకు తప్పితే..పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు దేశం మొత్తం మార్మోగిపోతోంది. యావత్ సినీ ప్రపంచం అతనిపై ప్రశంసల వర్షం కురిపిస్తోంది. దానికి కారణంగా ‘కల్కి 2898 ఏడీ’ సినిమా. ఆయన దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రం జూన్ 27న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. నాలుగు రోజుల్లోనే దాదాపు రూ. 600 కోట్ల కలెక్షన్స్ రాబట్టి రికార్డులు సృష్టిస్తోంది.(చదవండి: కల్కి దెబ్బకు 'షారుఖ్ ఖాన్' రికార్డ్ బద్దలైంది) నాగ్ అశ్విన్ మేకింగ్‌పై విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. హాలీవుడ్ సినిమాలకు ఏ మాత్రం తీసిపోకుండా ‘కల్కి 2898 ఏడీ’ చిత్రాన్ని తెరకెక్కించాడని పొగిడేస్తున్నారు. సామాన్యులు మొదలు..స్టార్ హీరోల వరకు ప్రతి ఒక్కరు సోషల్ మీడియా వేదికగా ‘కల్కి 2898 ఏడీ’పై రివ్యూ ఇస్తూ.. నాగ్ అశ్విన్ గురించి గొప్పగా మాట్లాడుతున్నారు. తాజాగా టాలీవుడ్ సీనియర్ నటుడు బ్రహ్మాజీ తనదైన శైలీలో ‘కల్కి 2898 ఏడీ’ టీమ్‌పై ప్రశంసలు జల్లు కురిపించారు. (చదవండి: ఆ సంఘటనతో భయమేసింది: నాగ్ అశ్విన్)ఈ సినిమా కోసం నాగ్ అశ్విన్ దాదాపు నాలుగేళ్ల పాటు కష్టపడ్డాడు. ఆ విషయాన్ని పరోక్షంగా తెలియజేస్తూ రిలీజ్ రోజు అరిగిపోయిన చెప్పులను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. దాదాపు రూ.600 కోట్ల బడ్జెట్‌తో సినిమా తీసే డైరెక్టర్ ఎంత సింపుల్ ఉంటాడో చూడండి అంటూ.. ఆయన చెప్పుల ఫోటోలను వైరల్ చేశారు నెటిజన్స్. దానికి సింక్ ఆయ్యేలా బ్రహ్మాజీ తన ఎక్స్ ఖాతాలో ఇలా రాసుకొచ్చాడు. తెలుగు సినిమా అనుకొంటే వరల్డ్ సినిమా తీశారు . నాగ్ అశ్విన్ గారు.. మీ అరిగిపోయిన చెప్పులు ఇస్తే ముద్దు పెట్టుకొంటా. థ్యాంక్యూ ప్రియాంక ,స్వప్న (నిర్మాతలు). మీ రిస్కులే మీకు శ్రీరామ రక్ష’ అని బ్రహ్మాజీ ఎక్స్‌లో పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం బ్రహ్మాజీ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తెలుగు సినిమా అనుకొంటే world సినిమా తీశారు .@nagashwin7 గారు మీ అరిగిపోయిన చెప్పులు ఇస్తే ముద్దు పెట్టుకొంటాను ❤️..thank యూ ప్రియాంక ..స్వప్న ..మీ రిస్కులే మీకు శ్రీరామ రక్ష 🙏🏼 .#Kalki2808AD 🔥@VyjayanthiFilms 🙏🏼— Brahmaji (@actorbrahmaji) July 1, 2024 -
నాగ్ అశ్విన్ సక్సెస్ స్టోరీ.. ప్రియాంక దత్తో ప్రేమ ఎలా మొదలైంది..?
డైరెక్టర్ నాగ్ అశ్విన్.. ఆయన మాటలు చాలా పొదుపు కానీ, తనలోని ప్రతిభకు అవధులంటూ ఉండవు. నాగ్ అశ్విన్ గురించి తెలియని వారు ఆయన సింప్లిసిటీని చూస్తే ఇతను దర్శకుడా..? అని ఆశ్చర్యపోతారు. సెట్స్‌లో నాగ్ అశ్విన్ ప్రతిభను చూసి మెచ్చుకోని వారు అంటూ ఉండరు. ఈ క్రమంలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ వంటి స్టార్స్ నాగ్ టాలెంట్‌కు ఫిదా అయ్యారు. నేడు ఆయన డైరెక్ట్ చేసిన 'కల్కి 2898 ఏడీ' విడుదలైంది. ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. హాలీవుడ్ స్థాయికి టాలీవుడ్‌ను నాగ్ అశ్విన్ తీసుకుబోయాడంటూ ప్రశంసలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో నాగ్ అశ్విన్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.అసలు పేరు నాగ్ అశ్విన్ రెడ్డి.. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వైద్యులు జయరాం రెడ్డి, జయంతి దంపతులకు నాగ్ జన్మించారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివిన నాగ్ అశ్విన్ ఆపై మాస్ కమ్యూనికేషన్స్, జర్నలిజంలో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేశారు. స్కూల్లో టాప్ టెన్ ర్యాంక్‌లో ఉన్న నాగ్ తల్లిదండ్రుల మాదిరి డాక్టర్ అవుతాడని అనుకుంటే.. మణిపాల్ మల్టీమీడియా కోర్సులో చేరారు. అక్కడ వీడియో ఎడిటింగ్‌తో పాటు సినిమాకు అవసరమైన నాలెడ్జ్‌ను సంపాదించుకున్నాడు.సినిమాల్లోకి ఎంట్రీ ఎలా..?సినిమాలపై నాగ్ అశ్విన్ చూపుతున్న ఆసక్తిని తల్లిదండ్రులు గుర్తించారు. ఈ క్రమంలో వారు డైరెక్టర్ శేఖర్ కమ్ముల వద్దకు నాగ్ అశ్విన్‌ను పంపారు. ఆ సమయంలో 'గోదావరి' సినిమా చిత్రీకరణ జరుగుతుండటంతో తర్వాత ప్రాజెక్ట్‌లో తన వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేర్చుకుంటానని శేఖర్ కమ్ముల మాట ఇచ్చారు. ఈ గ్యాప్‌లో మంచు మనోజ్ హీరోగా నటించిన 'నేను మీకు తెలుసా?' చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. అందుకు రెమ్యునరేషన్‌గా రూ. 4 వేలు తీసుకున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ తర్వాత శేఖర్ కమ్ముల నుంచి పిలుపు వచ్చింది. లీడర్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆ సమయంలో నాగ్ ప్రతిభను శేఖర్ కమ్ముల మెచ్చుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి.డైరెక్టర్‌గా ఛాన్స్ ఎవరిచ్చారు..?శేఖర్ కమ్ముల నుంచి నేర్చుకున్న పాఠాలతో 'యాదోం కీ బరాత్' అనే ఇంగ్లీష్ లఘు చిత్రాన్ని నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేశారు. ఈ చిత్రానికి ప్రియాంక దత్ నిర్మాత కావడం విశేషం. కేన్స్ షార్ట్ ఫిల్మ్ కార్నర్ కోసం ఈ చిత్రం ఎంపిక చేయబడింది. దీంతో ఆయన జీవితం టర్న్ అయిపోయింది. ఆ షార్ట్‌ఫిల్మ్ వల్ల నిర్మాత అశ్వనీదత్ కుమార్తెలు ప్రియాంక, స్వప్న సినిమా అవకాశాన్ని ఇచ్చేందుకు ముందుకొచ్చారు. అప్పుడు వారికి 'ఎవడే సుబ్రమణ్యం' కథను నాగ్ వినిపించారు. ఆ చిత్రాన్ని నిర్మిస్తామని ప్రియాంక, స్వప్న మాట ఇచ్చారు. అలా నాని, విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రల్లో 2015లో నాగ్ అశ్విన్ తొలి సినిమా వెండితెరపై మెరిసింది. తక్కువ బడ్జెట్లో చాలా రిచ్‌గా ఈ చిత్రాన్ని అశ్విన్ తీశాడు. సినిమాకు కూడా మంచి మార్కులే పడ్డాయి. ఆ ఏడాది ఉత్తమ చిత్రంగా నంది అవార్డు కూడా దక్కింది. ఇదే సమయంలో ఆయన పలు యాడ్ చిత్రాలకు కూడా డైరెక్ట్ చేయడం విశేషం.ప్రియాంక దత్తో ప్రేమ, పెళ్లిప్రియాంక దత్.. తన 21వ యేట 2004లో పవన్ కల్యాణ్ 'బాలు' చిత్రం ద్వారా సహనిర్మాతగా చిత్ర రంగంలోనికి ప్రవేశించారు. ఆ తర్వాత 'శక్తి' చిత్రాన్ని కూడా ఆమె నిర్మించారు. త్రీ ఏంజల్స్ స్టుడియో పేరుతో సారొచ్చారు, బాణం, ఓం శాంతి, యాదోంకీ బరత్ వంటి చిత్రాలకు నిర్మాతగా ఉన్నారు. ప్రియాంక కొన్ని యాడ్స్ కూడా నిర్మించారు. ఆ సమయంలో ఆమెకు నాగ్ అశ్విన్ పరిచయం కావడం.. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి యాదోంకీ బరత్ అనే లఘు చిత్రం కోసం పనిచేయడం జరిగింది. అలా 'ఎవడే సుబ్రమణ్యం' చిత్రంతో వీరి స్నేహం కాస్త ప్రేమగా మారిపోయింది.ప్రియాంక దత్‌కు తన ఇంట్లో పెళ్లి చూపులు చూస్తున్న సమయంలో ఇలా ప్రపోజ్ చేశారు. 'మీకు ఎవరైనా నచ్చితే సరే... లేదంటే మనం పెళ్లి చేసుకుందాం' అని నాగ్ అశ్విన్ తన ప్రేమ గురించి చెప్పినట్లు ఓ ఇంటర్వ్యూలో వెళ్లడించారు. అప్పటికే చాలా కాలంగా నాగ్ అశ్విన్‌తో ఆమె ట్రావెల్ చేశారు. ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. ఆయనలోని మంచితనాన్ని గ్రహించిన ప్రియాంక కూడా వెంటనే ఓకే చెప్పడంతో వారి పెళ్లి 2015లో జరిగింది. అలా దర్శకుడుగా నాగ్ అశ్విన్ మంచి విజయం సాధించకముందే అతన్ని ఆమె నమ్మారు. సినీ ప్రయాణంలో స్నేహితులైన అశ్విన్- ప్రియాంకలు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరికి ఓ బాబు ఉన్నాడు. ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రం ద్వారా స్టేట్ నంది అవార్డు అందుకున్న అశ్విన్.. మహానటి చిత్రంతో నేషనల్ అవార్డు అందుకున్నారు. ఇప్పుడు కల్కి సినిమాతో అంతర్జాతీయ అవార్డును నాగ్ అశ్విన్ తప్పకుండా అందుకోవాలని కోరుకుందాం. -
వర్షం సినిమా చూశాక అమ్మలో సంతోషం.. మళ్లీ ఇప్పుడా పరిస్థితి
‘‘అన్నీ మంచి శకునములే’ కుటుంబమంతా కూర్చొని చూసే సినిమా. ఇంకా చూడనివారు థియేటర్స్‌కి వెళ్లి చూడండి. మా బ్యానర్లో ఇంతకుముందు వచ్చిన చిత్రాల్లానే ‘అన్నీ మంచి శకునములే’ వంటి ఓ మంచి సినిమా తీశామనే సంతృప్తి ఉంది’’ అని నిర్మాత ప్రియాంకా దత్ అన్నారు. సంతోష్ శోభన్, మాళవికా నాయర్ జంటగా నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అన్నీ మంచి శకునములే’. ప్రియాంకా దత్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదలైంది. ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్ మీట్లో నిర్మాత స్వప్నా దత్ మాట్లాడుతూ–‘‘ప్రస్తుత ట్రెండ్‌లోనూ ఇలాంటి సినిమా తీసినందుకు గర్వంగా ఉంది. మా బ్యానర్లో నటించిన ఎన్టీఆర్, నాని, విజయ్ దేవరకొండ మంచి స్టార్స్ అయ్యారు.. అలాగే సంతోష్‌కి కూడా ఆ రేంజ్ వస్తుందని ఆశిస్తున్నాం’’ అన్నారు. ‘‘సినిమా అంటే కేవలం మాస్ కాదు.. ఫ్యామిలీ అంతా చూడగలిగే సినిమా ఇది’’ అన్నారు నందినీ రెడ్డి. ‘‘20 ఏళ్ల క్రితం నాన్నగారు (డైరెక్టర్ సంతోష్) తీసిన ‘వర్షం’ సినిమా చూశాక మా అమ్మలో సంతోషం చూశాను. ఇప్పుడు ‘అన్నీ మంచి శకునములే’ మా అమ్మలో అదే ఆనందం తీసుకువచ్చింది’’ అన్నారు సంతోష్ శోభన్ . -
అది మా అదృష్టం
‘‘ఏ సినిమానీ చిన్న సినిమా, పెద్ద సినిమా అనలేం. ఆ తేడాలు మాకు లేవు. మంచి కథ చేయడం ముఖ్యం. ప్రాజెక్ట్ కె’ (ఇందులో ప్రభాస్ హీరో) చాలా పెద్ద ప్రాజెక్ట్. కానీ మేము ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాతో మొదలయ్యాం. మా జీవితం ఓ మలుపు తీసుకుంది ఆ చిత్రంతోనే. సో.. మా వరకు అది బిగ్ ఫిల్మ్. ఓ మంచి కథ చెప్పాలనే ఉద్దేశంతో ‘అన్నీ మంచి శకునములే’ సినిమా తీశాం’’ అన్నారు నిర్మాత స్వప్నాదత్. సంతోష్ శోభన్, మాళవికా నాయర్ జంటగా నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అన్నీ మంచి శకునములే’. మిత్ర విందా మూవీస్‌తో కలిసి ప్రియాంకా దత్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం జరిగిన విలేకర్ల సమావేశంలో నిర్మాతలు స్వప్నా దత్, ప్రియాంకా దత్ చెప్పిన విశేషాలు. ► ‘అన్నీ మంచి శకునములే’ రెండు కుటుంబాల మధ్య జరిగే కథ. మంచి ఎమోషనల్ మూవీ. ఆడియన్స్ కంటతడి పెడతారు. దర్శకురాలు నందిని ఈ కథ చెప్పినప్పుడు అది కున్నూర్ బ్యాక్‌డ్రాప్‌లో లేదు. కథ రీత్యా ఆ లొకేషన్స్ అవసరం కాబట్టి అక్కడ తీశాం. హిల్‌స్టేషన్ బ్యాక్‌డ్రాప్‌లో ఓ ఫ్యామిలీ కథ తీయాలనే ఆశ ‘అన్నీ మంచి శకునములే..’తో నెరవేరింది. ఈ సినిమా కోసం నందినీ విక్టోరియా అనే చిన్న ప్రదేశాన్ని సెట్ చేశారు. ఆడియన్స్‌ని మరో లోకంలోకి తీసుకెళ్లే సినిమా ఇది. ఇక ఈ సినిమాతో సంతోష్ శోభన్‌కు కొత్త ఇమేజ్ వస్తుందని నమ్ముతున్నాం. తన కెరీర్ మారుతుంది. నందినీ రెడ్డిగారి ‘అలా.. మొదలైంది’ చిత్రం యూత్‌ఫుల్ ట్రెండ్ సెట్టర్. ‘కళ్యాణ వైభోగమే’ కొత్తగా పెళ్లి చేసుకున్న జంట కథ. ‘ఓ బేబీ’ డిఫరెంట్ స్టోరీ. ఈ కోవలో ‘అన్నీ మంచి శకునములే’ చిత్రం ఓ డిఫరెంట్ ఫ్యామిలీ స్టోరీ. ఆడియన్స్‌కు ఈ సినిమా నచ్చుతుంది. ► దుల్కర్ పరభాష హీరో, ఖరీదైన లొకేషన్స్, మార్కెట్ ఎదురీత .. ‘సీతారామం’ సినిమా విషయంలో ఇలా ప్రతి అడుగూ ఓ సవాలే. కానీ నమ్మి చేశాం. విజయం సాధించింది. మనం నమ్మింది జరిగిందనే తృప్తి కలిగింది. ► ప్రతి సినిమాపై మాకు ఒత్తిడి ఉంటుంది. మా మనసుకు నచ్చిన కథలనే సినిమాలుగా తీస్తున్నాం. అయితే మేం ఇష్టపడి చేసిన చిత్రాలు ప్రేక్షకుల అభిరుచికి దాదాపుగా మ్యాచ్ కావడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం. ► సినిమా ఇండస్ట్రీలో నాన్నగారు (నిర్మాత అశ్వినీదత్) 50 ఏళ్ళుగా నిలబడ్డారు. ఇప్పుడు ఆయన పిల్లలు సినిమాలు తీస్తున్నారు. ఆయన ఏ రోజూ లెక్కలు వేసుకుని సినిమాలు తీయలేదు. ఈ దారిలో మేం కూడా వెళ్తున్నాం. సినిమాల్లోకి వచ్చామంటే ప్యాషన్‌తోనే. లెక్కలు వేసుకుంటే సినిమాలు తీయలేం. ► అందరం చర్చించుకునే ఓ జడ్జ్‌మెంట్‌కు వస్తాం. ‘జాతిరత్నాలు’ సినిమాను నేను (స్వప్న) ఓటీటీకి అమ్మేద్దాం అన్నాను. కానీ నాగీ (‘మహానటి’ ఫేమ్ దర్శకుడు నాగ్ అశ్విన్), ప్రియాంక ఆ సినిమాను నమ్మారు. ‘ఈ సినిమా అయితే బ్లాక్ బస్టర్ అవుతుంది. పోతే మొత్తం పోతుంది. థియేటర్స్‌లో రిలీజ్ చేద్దాం’ అన్నాడు నాగీ. సినిమా మంచి హిట్ అయింది. ‘మహానటి’ని నేనెక్కువగా నమ్మాను. చాలా బాధ్యతతో ఆ సినిమా చేశాం. నాగీ నిర్ణయాలు మా బ్యానర్‌కు బలం. ► నిర్మాతలుగా మీరు కష్టపడుతున్నారు. నేను కూడా ఎందుకని మా చెల్లి (స్రవంతి) అన్నారు. ఇంట్లో పిల్లలు సేఫ్‌గా ఉన్నారు, అమ్మా, చెల్లి చూసుకుంటున్నారనే ధైర్యం ఉండబట్టే మేం సినిమాలు తీస్తున్నాం. -
'అన్నీ మంచి శకునములే' అంటోన్న నందినీ రెడ్డి
'ఏక్ మినీ కథ' సినిమాతో హిట్ కొట్టిన కుర్ర హీరో సంతోష్ శోభన్. ఈ మూవీ సక్సెస్‌తో జోష్ మీదున్న ఈ యంగ్ హీరో ఇప్పుడు మరో క్రేజీ మూవీతో ముందుకు వస్తున్నాడు. నందినీ రెడ్డి దర్వకత్వంలో ఓ మూవీ సైన్ చేసినట్లు గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ రూమర్స్‌ను నిజం చేస్తూ నందినీ రెడ్డి ఈ ప్రాజెక్టును అఫిషియల్‌గా అనౌన్స్ చేసింది. తాను డైరెక్ట్ చేసిన ఓ బేబీ సినిమా రెండేళ్లు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా తన కొత్త ప్రాజెక్టును అనౌన్స్ చేయడం సంతోషంగా ఉందని నందినీ రెడ్డి ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొంది. ఇక ఈ సినిమాకు 'అన్నీ మంచి శకునములే' అనే క్రేజీ టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మేరకు మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్ . స్వప్న సినిమా, మిత్ర వింద మూవీస్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. సంతోష్ శోభన్‌కు జంటగా మళవిక నాయర్ హీరోయిన్గా నటించనుంది. మిక్కీ జె మేయర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇక ఇప్పటికే హీరో సంతోష్ శోభన్.. మారుతి దర్శకత్వంలో ఓ ప్రాజెక్టుకు సైన్ చేసిన సంగతి తెలిసిందే. మెహ్రీన్ హీరోయిన్గా నటించనుంది. -
మరో తెలుగు చిత్రానికి అరుదైన ఘనత
అది 2000 సంవత్సరం అప్పుడప్పుడే కంప్యూటర్ వచ్చిన రోజులవి. గ్రామంలోకి అప్పుడే అడుగులు వేసుకుంటూ వచ్చిందో వయ్యారి కంప్యూటర్. అమ్మాయి వెంట చూసే దిక్కులను కంప్యూటర్ వైపు చూసి, ఈ కంప్యూటర్ను ఎలాగైనా నేర్చుకోవాలనే తాపత్రాయంతో ఉండే ఓ అబ్బాయి. ఆ కంప్యూటర్లో వచ్చే ఒక మెయిల్‌తో మోసపోయే అబ్బాయిల అమాయకత్వం. ప్రతిసారి లాగా ఈ సారి తను నేర్పించే శిక్షణతో ఎవరు నాకు పొటీ రాకుండా నేర్చుకోవడానికి వచ్చిన వారికి ముందుగానే షరతు పెట్టి, తను మోసపోయానని చెప్పే అమాయకత్వం ఇంకోకరిది. ఇప్పటికీ మీ అందరికీ గుర్తువచ్చే ఉంటుంది. మాకు ఎందుకు తెలియదు..! మరీ ఇంతా అమాయకులు ఉంటారా..అని అనుకున్న చిత్రమే..కంబాలకథలు ‘మెయిల్’. ఈ చిత్రం ప్రేక్షకుల మనసును గెలుచుకొని, అద్భుత విజయం సాధించింది. కాగా తాజాగా ఈ చిత్రం మరో అరుదైన ఘనతను సృష్టించింది. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన కంబాలపల్లి కథలు ‘మెయిల్’ చిత్రం ‘న్యూయర్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ 2021’ కు ఎంపిక చేశారు. ‘కేరాఫ్ కంచరపాలెం’ సినిమా తర్వాత న్యూయర్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్లో అవకాశం దక్కింది. ఈ విషయాన్ని నిర్మాతలు శనివారం తెలిపారు. జూన్ 4 న ప్రారంభమయ్యే న్యూయర్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. ఈ సంవత్సరం ఓటీటి ప్లాట్‌ఫాం ఆహాలో రిలీజ్ అయింది. ఈ చిత్రంలో ప్రియదర్శి, హర్ష, ప్రియ తదితరులు తమ నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని ఉదయ్ గుర్రాల దర్శకత్వం వహించగా, ప్రియాంక దత్ నిర్మాతగా వ్యవహరించారు. #Mail has been now an 'Official selection at the New York Indian Film Festival'. A big thanks to each and everyone who made it possible♥️ #ReasonToSmile @SwapnaCinema @ahavideoIN #UdayGurrala pic.twitter.com/Rl2Y41q75N — Priyadarshi (@priyadarshi_i) May 8, 2021 -
జాతిరత్నాలు డైరెక్టర్‌కు కాస్ట్లీ లంబోర్గిని కారు!
నవీన్ పొలిశెట్టి ప్రధాన పాత్రలో అనుదీప్ దర్శకత్వంలో నటించిన చిత్రం ‘జాతి రత్నాలు’.థియేటర్లోకి అడుగు పెట్టిన ప్రేక్షకులు సినిమా చూస్తున్నంతసేపు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారు. చిన్న సినిమాగా వచ్చిన ఈ చిత్రం ఊహించని స్థాయిలో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. నిర్మాతలకు కాసుల పంట కురిపించింది. దీంతో డైరెక్టర్ అనుదీప్‌కు స్వప్నా సినిమా బ్యానర్ అదిరిపోయే గిప్ట్ ఇచ్చింది. ప్రొడ్యూసర్స్ స్వప్న దత్, ప్రియాంక దత్‌లు కాస్ట్లీ లంబోర్గిని కారును బహుమతిగా ఇచ్చారు. అయితే ఇది నిజమైన కారు కాదు..లంబోర్గిని మోడల్లోని ఓ బొమ్మకారును అనుదీప్‌కు గిఫ్ట్‌గా ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నా పంచులతో అందరినీ అందరినీ ఫూల్స్ చేస్తుంటే..వీళ్లు బొమ్మ కారిచ్చి నన్నే ఫూల్‌ని చేస్తున్నారు అంటూ అనుదీప్ చెబుతున్నట్లు కొన్ని మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. ఇప్పటికే అనుదీప్ తన పంచులు, కౌంటర్లతో హీరోకు సమానంగా పాపులారిటీ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Arey Entra Edi 😂 (@na_page_ni_rechagotaku) చదవండి: బాహుబలి రికార్డును బ్రేక్ చేసిన జాతిరత్నాలు! 'ఆస్కార్' బరిలో జాతిరత్నాలు! -
డైరీ ఫుల్
హీరోయిన్ పూజా హెగ్డే ఫుల్‌ఫామ్‌లో ఉన్నారు. టాలీవుడ్లో ప్రభాస్‌తో ఓ సినిమా (ఓ మై డియర్), అఖిల్‌తో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ సినిమాలో పూజ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ బ్యూటీ మరో మంచి ఆఫర్ కొట్టేశారని సమాచారం. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించబోతున్న సినిమాలో హీరోయిన్గా నటించనున్నారట పూజా హెగ్డే. ఆల్రెడీ ఆన్లైన్ ద్వారా కథ కూడా విన్న పూజ హీరోయిన్గా నటించేందుకు ఓకే అన్నారట. ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ ఫేమ్ హను రాఘవపూడి తెరకెక్కించనున్న సినిమాలోనే దుల్కర్, పూజ జంటగా నటించనున్నారని సమాచారం. స్వప్నా దత్, ప్రియాంకా దత్ ఈ సినిమాను నిర్మించబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ హీరోగా నటించనున్న ‘కబీ ఈద్ కబీ దీవాలి’ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా కన్ఫార్మ్ అయిన సంగతి తెలిసిందే. అక్షయ్ కుమార్ నటించనున్న ‘బచ్చన్ పాండే’ చిత్రంలోనూ పూజయే హీరోయిన్ అట. సో.. పూజ డైరీ ప్రస్తుతానికి ఫుల్ అన్నమాట. -
నాన్నను చూసి ఎంచుకున్నాం
►స్క్రీన్ మీద స్త్రీలు కనిపించడం సాధారణమే. కానీ కెమెరా వెనక పని చేస్తున్న వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. కారణం? స్వప్నా దత్: సినిమా నిర్మాణం ఎందుకు ఎంచుకున్నాం అంటే మా నాన్నగారిని (అశ్వనీదత్) చూశాం. ఆయన ప్యాషన్‌తో సినిమాలు నిర్మించడం చూశాం. కథను ఎంచుకోవడం, నటీనటులను, దర్శకుడిని ఎంపిక చేసుకోవడం వంటి విషయాలు చూసి ప్రొడక్షన్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది. సాధారణంగా అమ్మాయిలు ఎక్కువగా యాక్టింగ్ అయినా, డిజైనింగ్ పైన అయినా ఆసక్తి చూపుతారు. కానీ మా ఇంట్లో అంత మంచి ఎగ్జాంపుల్ ఉన్నప్పుడు నిర్మాణం కాకుండా ఏం చేస్తాం చెప్పండి. సినిమా నిర్మాణమే అన్నింటికంటే సాహసమైనది అనిపించింది. అదే చేస్తున్నాం (నవ్వుతూ). ►స్త్రీలు నిర్మాతలైతే షూటింగ్ లొకేషన్లో ఎలాంటి వాతావరణం ఏర్పడుతుంది? ప్రియాంకా దత్: నిర్మాత ఆడవారైనా మగవారైనా సరే అందరూ సురక్షితంగా పని చేసుకునే వాతావరణం కల్పించాలి. లేడీ నిర్మాతలంటే.. మేం కొంచెం ఎక్కువ సెన్సిటివ్‌గా ఉంటాం కాబట్టి సెట్లో అమ్మాయిలు ఉంటే వాళ్లు సేఫ్‌గా ఇంటికి వెళ్లగలుగుతున్నారా? వాళ్ల బాత్రూమ్స్ సరిగ్గా ఉంటున్నాయా? అని చూస్తాం. అలాగే ఏదైనా ఇష్యూలు వస్తే వెంటనే మాతో చెప్పగలిగే వాతావరణం ఉంటుంది. మా మేనేజర్లతో అన్నీ సరిగ్గా చూసుకోమని చెబుతాం. నిర్మాత ఆడైనా మగైనా ఎవ్వరైనా సరే సెట్లో అమ్మాయిల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ►రామానాయుడుగారు నిర్మాతగా వంద సినిమాలుపైనే నిర్మించారు. లేడీ ప్రొడ్యూసర్స్ కూడా ఆ రికార్డుని అందుకోగలుగుతారా? స్వప్నా: ఇది ఆడా మగా సమస్య అని చెప్పను. కొంచెం మేల్ డామినేటెడ్ ప్రపంచంలో ఉమెన్‌కి కచ్చితంగా చాలెంజెస్ ఉంటాయి. కష్టం అయితే అందరికీ ఒకటే. రామానాయుడిగారి అంత విజన్ ఉంటే ప్రయత్నించొచ్చు అనుకుంటా. ►నాన్నగారి బాటలో నిర్మాతలు అయి ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి, దేవదాస్ వంటి సినిమాలు నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ లెగసీని మోయడం ఒత్తిడి ఏమైనా? స్వప్నా: అవును. ఏదైనా పెద్ద పెద్ద పనులు చేస్తున్నప్పుడు కచ్చితంగా ఉంటుంది. అలాంటిది 50 ఏళ్ల హిస్టరీ ఉన్న సంస్థ (వైజయంతీ మూవీస్)ను ముందుకు తీసుకెళ్లడం కచ్చితంగా ప్రెషరే. అలాగే ప్లెషర్ కూడా. ►లేడీ ప్రొడ్యూసర్స్ ఎదుర్కొనే చాలెంజ్‌లు? స్వప్నా: ప్రొడక్షన్ అంటేనే చాలెంజ్. ప్రొడ్యూసర్స్ అంటేనే చాలెంజెస్ ఎదుర్కొనేవారు. అందులో ఆడామగా అని ఉండదనుకుంటున్నాను. జెన్యూన్‌గా సినిమా తీసేవాళ్లకు ఇబ్బంది ఎదురవుతూనే ఉంటుంది. -
మహా విజయం
-
ప్రముఖ నిర్మాతకు అల్లుడు కానున్న దర్శకుడు
హైదరాబాద్: ఎవడే సుబ్రమణ్యం డైరెక్టర్ నాగ్ అశ్విన్ త్వరలో ఒక ఇంటివాడు కాబోతున్నాడట.. ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ కుమార్తె ప్రియా దత్ ను ఆయన ప్రేమ వివాహం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. నాగ్ అశ్విన్ తో ప్రియాంక చిరకాలంగా ప్రేమలో పడినట్లు, ఇప్పుడు పెళ్లి బాజాలు మోగనున్నట్లు తెలుస్తోంది. ఎవడే సుబ్రమణ్యం ప్రాజెక్టు ప్రారంభమైనప్పటి నుంచి వీరి మధ్య ప్రేమ చిగురించిదట. ఈ విషయాన్ని స్వయంగా నాగ్ ఓ వార్తాసంస్థకు తెలిపారు. ఈ విషయంలో క్రెడిట్ తనకే దక్కుతుందని నాగ్ అన్నారు. ప్రియాంకే ముందుగా తనకు ప్రపోజ్ చేసిందన్నాడు. దీంతో తాను సంతోషంగా అంగీకరించానని నాగ్ తెలిపారు. ఇద్దరూ కలిసి పనిచేస్తున్న క్రమంలో తమ అభిప్రాయాలు కలిసి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నామన్నారు. దీనికి ఇరు కుటుంబాల సభ్యులు కూడా అంగీకరించినట్టు చెప్పారు. ఇంకా పెళ్లి ముహూర్తాన్ని ఖరారు చేయలేదని తెలిపాడు. స్వతహాగా సినిమా కుటుంబం నుంచి వచ్చిన ప్రియాంక కూడా సినిమా రంగంలోనే ఉన్నారు. అమెరికాలో డైరెక్షన్‌కు సంబంధించి శిక్షణ కూడా పొందారు. తిరిగి వచ్చాక అనేక వైవిధమైన చిన్న సినిమాలు తమ బ్యానర్ లో అందించడంలో కీలక పాత్ర వహించారు. అటు నాగ్ అశ్విన్ ఓ కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన స్క్రిప్ట్ పనిలో బిజీగా ఉంటే, ఇటు ప్రియాంక కొత్త కథలను పరిశీలించే పనిలో మునిగి తేలుతోందట. అందుకే పెళ్లి తేదీని ఇంకా ఖరారు చేయలేదట. ఇద్దరూ మంచి టేస్ట్ ఉన్నవ్యక్తులే. అందుకే ఇద్దరికీ జత కలిసిందని టాలీవుడ్ జనాలు భావిస్తున్నారట.