పూజా హెగ్డే
హీరోయిన్ పూజా హెగ్డే ఫుల్‌ఫామ్‌లో ఉన్నారు. టాలీవుడ్‌లో ప్రభాస్‌తో ఓ సినిమా (ఓ మై డియర్), అఖిల్‌తో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ సినిమాలో పూజ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ బ్యూటీ మరో మంచి ఆఫర్ కొట్టేశారని సమాచారం. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించబోతున్న సినిమాలో హీరోయిన్‌గా నటించనున్నారట పూజా హెగ్డే. ఆల్రెడీ ఆన్‌లైన్ ద్వారా కథ కూడా విన్న పూజ హీరోయిన్‌గా నటించేందుకు ఓకే అన్నారట.
‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ ఫేమ్ హను రాఘవపూడి తెరకెక్కించనున్న సినిమాలోనే దుల్కర్, పూజ జంటగా నటించనున్నారని సమాచారం. స్వప్నా దత్, ప్రియాంకా దత్ ఈ సినిమాను నిర్మించబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్ హీరోగా నటించనున్న ‘కబీ ఈద్ కబీ దీవాలి’ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా కన్ఫార్మ్ అయిన సంగతి తెలిసిందే. అక్షయ్ కుమార్ నటించనున్న ‘బచ్చన్ పాండే’ చిత్రంలోనూ పూజయే హీరోయిన్ అట. సో.. పూజ డైరీ ప్రస్తుతానికి ఫుల్ అన్నమాట.
Comments
Please login to add a commentAdd a comment