అది 2000 సంవత్సరం అప్పుడప్పుడే కంప్యూటర్ వచ్చిన రోజులవి. గ్రామంలోకి అప్పుడే అడుగులు వేసుకుంటూ వచ్చిందో వయ్యారి కంప్యూటర్. అమ్మాయి వెంట చూసే దిక్కులను కంప్యూటర్ వైపు చూసి, ఈ కంప్యూటర్‌ను ఎలాగైనా నేర్చుకోవాలనే తాపత్రాయంతో ఉండే ఓ అబ్బాయి. ఆ కంప్యూటర్‌లో వచ్చే ఒక మెయిల్‌తో మోసపోయే అబ్బాయిల అమాయకత్వం. ప్రతిసారి లాగా ఈ సారి తను నేర్పించే శిక్షణతో ఎవరు నాకు పొటీ రాకుండా నేర్చుకోవడానికి వచ్చిన వారికి ముందుగానే షరతు పెట్టి, తను మోసపోయానని చెప్పే అమాయకత్వం ఇంకోకరిది. ఇప్పటికీ మీ అందరికీ గుర్తువచ్చే ఉంటుంది. మాకు ఎందుకు తెలియదు..! మరీ ఇంతా అమాయకులు ఉంటారా..అని అనుకున్న చిత్రమే..కంబాలకథలు ‘మెయిల్’. ఈ చిత్రం ప్రేక్షకుల మనసును గెలుచుకొని, అద్భుత విజయం సాధించింది. కాగా తాజాగా ఈ చిత్రం మరో అరుదైన ఘనతను సృష్టించింది.
గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన కంబాలపల్లి కథలు ‘మెయిల్’ చిత్రం ‘న్యూయర్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ 2021’ కు ఎంపిక చేశారు. ‘కేరాఫ్ కంచరపాలెం’ సినిమా తర్వాత న్యూయర్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అవకాశం దక్కింది. ఈ విషయాన్ని నిర్మాతలు శనివారం తెలిపారు. జూన్ 4 న ప్రారంభమయ్యే న్యూయర్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. ఈ సంవత్సరం ఓటీటి ప్లాట్‌ఫాం ఆహాలో రిలీజ్ అయింది. ఈ చిత్రంలో ప్రియదర్శి, హర్ష, ప్రియ తదితరులు తమ నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని ఉదయ్ గుర్రాల దర్శకత్వం వహించగా, ప్రియాంక దత్ నిర్మాతగా వ్యవహరించారు.
#Mail has been now an 'Official selection at the New York Indian Film Festival'.
— Priyadarshi (@priyadarshi_i) May 8, 2021
A big thanks to each and everyone who made it possible♥️ #ReasonToSmile @SwapnaCinema @ahavideoIN #UdayGurrala pic.twitter.com/Rl2Y41q75N
Comments
Please login to add a commentAdd a comment