
నాగర్ కర్నూల్ : ఓ ఫేక్ బెదిరింపు నాగర్ కర్నూల్ కలెక్టరేట్ లో అలజడి సృష్టించింది. కలెక్టరేట్ ను పేల్చేస్తామంటూ టైమ్ మరీ చెప్పి నాగర్ కర్నూల్ కలెక్టర్ కు వచ్చిన ఓ బెదిరింపు మెయిల్.. కాసేపు మొత్తం యంత్రాగాన్ని పరుగులు పెట్టించింది. ఈ రోజు ఉదయం 7. 30 కి ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి కలెక్టర్ కు మెయిల్ వచ్చింది.
మధ్యాహ్నం గం. 3.30 ని.లకు కలెక్టరేట్ ను పేల్చేస్తామని అందులో ఉంది. దీంతో కలెక్టర అప్రమత్తమై సిబ్బందిని అలెర్ట్ చేశారు. మొత్తం కలెక్టరేట్ అంతా తనిఖీలు చేసింది బాంబు స్క్వాడ్, అయితే అది చివరకు ఫేక్ మెయిల్ అని తేలింది. ఎక్కడా బాంబు లేకపోవడంతో సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. అది ఫేక్ మెయిల్ అని తేల్చిన కలెక్టర్ రెట్ ఏవో చంద్రశేఖర్.. అయితే అసలు ఆ మెయిల్ చేసింది ఎవరనే దానిని కనిపెట్టే పనిలో పడ్డారు పోలీసులు.