-
హోం మంత్రి అమిత్ షాకు కోల్‌కతా డాక్టర్ తండ్రి లేఖ
కోల్‌కతా: కోల్‌కతా ఆర్జీకర్ మెడికల్ కాలేజీ ఘటనలో హత్యాచారానికి గురైన యువ లేడీ డాక్టర్ తండ్రి మంగళవారం(అక్టోబర్22) కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు లేఖ రాశారు. తమ కుటుంబం తీవ్ర మానసిక ఒత్తిడి ఎదుర్కొంటోందని లేఖలో ఆయన అమిత్‌షాకు తెలిపారు.‘నా కుమార్తెకు జరిగిన అమానవీయ ఘటనతో మా కుటుంబం మొత్తం తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటోంది. మేం నిస్సహాయులమని అనిపిస్తోంది. ఈ కేసు దర్యాప్తు వేగంగా పూర్తయ్యేందుకు,మా కుమార్తెకు న్యాయం జరిగేందుకు మీ మార్గదర్శకత్వం ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను. ఈ విషయమై మిమ్మల్ని కలుసుకునే అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను’ అని లేఖలో పేర్కొన్నారు. మంత్రికి బాధితురాలి తండ్రి తన లేఖను ఈ-మెయిల్ చేశారు.ఇదీ చదవండి: వక్ఫ్ జేపీసీలో గొడవ.. టీఎంసీ ఎంపీ సస్పెన్షన్ -
ట్రంప్ టీమ్ ఈ మెయిళ్లు హ్యాక్.. ఇరాన్ పనే?
వాషింగ్టన్: తమ ఈమెయిళ్లు హ్యాకయ్యాయని అమెరికా అధ్యక్ష ఎన్నికల రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ క్యాంపెయిన్ టీమ్ వెల్లడించింది. ఇది ఇరాన్ పనేనని ఆరోపించింది. కీలక అంతర్గత సమాచారాన్ని దొంగిలించి బహిర్గతం చేశారని పేర్కొంది. అయితే ఇందుకు కచ్చితమైన ఆధారాలను మాత్రం ట్రంప్ బృందం వెల్లడించలేదు. అమెరికా ఎన్నికలు, ముఖ్యంగా ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకొని ఇరాన్ సైబర్ దాడులకు పాల్పడుతోందని మైక్రోసాఫ్ట్ తాజాగా ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలు వచ్చిన మరుసటిరోజే ట్రంప్ ప్రచార బృందం మెయిళ్లు హ్యాకవడం గమనార్హం. ట్రంప్ టీమ్ ఆరోపణలపై అమెరికా విదేశాంగ శాఖ స్పందించింది.తమ దేశ ఎన్నికల్లో విదేశీ జోక్యాన్ని ఏమాత్రం సహించబోమని హెచ్చరించింది. మరోవైపు ట్రంప్ టీమ్ ఆరోపణలను ఇరాన్ రాయబార అధికారులు ఖండించారు. అమెరికా ఎన్నికల్లో జోక్యం చేసుకునే ఉద్దేశం తమకు ఏమాత్రం లేదని తెలిపింది. కాగా, అమెరికా ఎన్నికలను ప్రభావితం చేసే దిశగా ఇరాన్ ఆన్లైన్ కార్యకలాపాలు పుంజుకున్నట్లు మైక్రోసాఫ్ట్ శుక్రవారం ఓ నివేదికలో తెలిపింది. -
కేంద్ర హోం శాఖకు బాంబు బెదిరింపు.. నార్త్ బ్లాక్ హై అలర్ట్
సాక్షి,ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర హోం శాఖ కొలువు దీరిన నార్త్ బ్లాక్ భవనానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. హోం శాఖకు బుధవారం(మే22) బాంబు బెదిరింపుల మెయిల్ అందినట్లు పోలీస్ కంట్రోల్ రూమ్ వెల్లడించింది. బాంబు బెదిరింపులు వచ్చిన వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్త చర్యగా రెండు ఫైర్ ఇంజిన్లను నార్త్‌బ్లాక్ వద్దకు తరలించారు. గత కొన్ని రోజులుగా దేశంలోని పలు ప్రాంతాల్లోని స్కూళ్లకు, ఎయిర్‌పోర్టులకు ఫేక్ బెదిరింపు కాల్స్ వస్తున్న విషయం తెలిసిందే. -
అహ్మదాబాద్‌లో స్కూళ్లకు బాంబు బెదిరింపులు
గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరంలో సోమవారం పలు స్కూళ్లకు వచ్చిన బాంబు బెదిరింపులు కలకాలం రేపాయి. దీంతో అప్రమత్తమైన పోలీసు యాత్రాంగం, బాంబ్ స్క్వాడ్స్ బెదిరింపులు వచ్చిన అన్ని పాఠశాలల్లో తనిఖీలు చేపట్టాయి. అయితే ఎటువంటి బాంబులు లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు. సియా గురుకుల పాఠశాల, థాల్తేజ్‌లోని ఆనంద్ నికేతన్, డీసీఎస్ బోపాల్, మెమ్నగర్లోని హెచ్‌బీకే పాఠశాల, థాల్తేజ్‌లోని జెబార్ పాఠశాల, ఎస్జీ రోడ్డులోని కాస్మోస్ క్యాజిల్ ఇంటర్నేషనల్ స్కూల్, చంద్ఖేడా, షాహిబాగ్ కంటోన్మెంట్‌లోని రెండు కేంద్రీయ విద్యాలయాలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్ వచ్చింది. వెంటనే అప్రమత్తమైన స్కూళ్ల యాజమాన్యం విద్యార్థులను ఖాళీ చేయించాయి.ఈ ఘటనపై అహ్మదాబాద్ పోలీసు కమినిషనర్ జీఎస్ మాలిక్ మాట్లాడుతూ.. రష్యన్ సర్వర్ నుంచి బాంబు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. అరబిక్‌లో భాషా పదాలలో బాంబు బెదిరింపులు వచ్చాయి. బాంబు బెదిరింపు మెయిల్స్‌పై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. గుజరాత్లో ఎన్నికల పోలింగ్‌కు ఒకరోజు ముందు బాంబు బెదిరింపులు వచ్చాయని తెలిపారు. ఇటీవల ఢిల్లీ పరిధిలోని దాదాపు 200 స్కూళ్లకు బాంబు బెదిరింపు మియిల్స్ వచ్చిన విషయం తెలిసిందే. -
ప్రపంచంలోనే తొలి పోస్టల్ స్టాంప్ వేలానికి
సాక్షి, నేషనల్ డెస్క్... ప్రపంచంలోనే మొదటిదని భావిస్తున్న 180 ఏళ్ల నాటి పోస్టల్ స్టాంప్ వేలానికి వచ్చింది. ఒక పెన్నీ ముఖ విలువతో కూడిన దీనికి దాదాపు రూ.20 కోట్ల (25 లక్షల డాలర్ల) దాకా పలకవచ్చని భావిస్తున్నారు. 1850 మే 2 నాటి తేదీ ఉన్న ఈ నల్లరంగు స్టాంప్‌ను పెన్నీ బ్లాక్ స్టాంప్‌గా పిలుస్తారు. ఇంగ్లండ్‌లో బెడ్లింగ్టన్ పట్టణానికి చెందిన విలియం బ్లెంకిన్స్లోప్ అనే వ్యక్తికి అక్కడికి 300 మైళ్ల దూరంలోని లండన్ నుంచి పంపిన లెటర్‌పై దీన్ని అంటించారు. ఇలా స్టాంపులంటించడం ద్వారా పోస్టేజీ చార్జీలను ముందుగానే చెల్లించే పద్ధతి అప్పటిదాకా ఉండేది కాదు. లెటర్లను అందుకునే వాళ్లే పోస్ట్‌మాన్‌కు పోస్టేజ్ రుసుము చెల్లించేవాళ్లు. వాళ్లు గనక లెటర్లను తీసుకునేందుకు నిరాకరిస్తే పోస్టల్ శాఖకు నష్టమే మిగిలేది. దీనికి చెక్ పెట్టేందుకు సర్ రోలాండ్ హిల్ ఈ పెన్నీ బ్లాక్ పోస్టల్ స్టాంప్‌ను రూపొందించాడు. ప్రఖ్యాత వేలం సంస్థ సోత్బీ ఫిబ్రవరిలో దీన్ని వేలం వేయనుంది. ప్రపంచ సమాచార వ్యవస్థలోనే విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టిన ఈ పోస్టల్ స్టాంప్ వేలానికి రావడం ఎంతో ఎక్సైటింగ్‌గా ఉందని సోత్బీ గ్లోబల్ హెడ్ రిచర్డ్ ఆస్టిన్ అన్నారు. చదవండి: లండన్ మేయర్ ఎన్నికల బరిలో ఇద్దరు భారత సంతతి వ్యాపారవేత్తలు -
బెంగళూరులో స్కూల్స్‌కు బాంబు బెదిరింపులు
బెంగళూరు: బెంగళూరులో బాంబు బెదిరింపు ఈ-మెయిల్ కలకలం సృష్టించింది. సుమారు 15 పాఠశాలలకు బాంబు బెదిరింపు మొయిల్స్ రావడంతో విద్యార్థులు, స్కూల్స్ యాజమాన్యం వణికిపోయింది. దీంతో, ఒక్కసారిగా గందరగోళం నెలకొనడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విద్యార్థులు, ఉపాధ్యాయులను పాఠశాలలను నుంచి బయటకు పంపించారు. వివరాల ప్రకారం.. కర్ణాటక రాజధాని బెంగళూరులోని పలు పాఠశాలలకు శుక్రవారం ఉదయం బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. గుర్తుతెలియని ఒక ఈ మెయిల్ నుంచి ఈ బెదిరింపులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన పాఠశాలల యజమాన్యం పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో అప్రమత్తమైన పోలీసులు.. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విద్యార్థులు, ఉపాధ్యాయులను పాఠశాలలను నుంచి బయటకు పంపించారు. తర్వాత బాంబ్‌స్క్వాడ్ బృందాలు అక్కడికి చేరుకొని తనిఖీలు చేపట్టాయి. ప్రస్తుతం తనిఖీలు కొనసాగుతున్నాయి. కాగా, బెదిరింపులపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇది నకిలీ బెదిరింపు అయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, శుక్రవారం మధ్యాహ్నం కర్ణాటకలోని సుమారు 15 పాఠశాలలకు బాంబు బెదిరింపు వచ్చింది. తొలుత ఏడు స్కూళ్లకు ఈ బెదిరింపు మెయిళ్లు రాగా.. ఆ తర్వాత కొద్దిసేపటికే మరికొన్ని విద్యాసంస్థలకు అదే తరహా ఈ మెయిళ్లు వచ్చాయి. దీంతో, అప్రమత్తమైన స్కూల్స్ యాజమాన్యం.. విద్యార్థుల పేరెంట్స్‌కు సమాచారం అందించారు. ‘ఈ రోజు మన పాఠశాల అనూహ్య పరిస్థితిని ఎదుర్కొంది. గుర్తుతెలియని వర్గాల నుంచి ఒక ఈ మెయిల్ వచ్చింది. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని, వెంటనే వారిని బయటకు పంపించాలని నిర్ణయించుకున్నాం’ అని తెలిపారు. మరోవైపు.. బాంబు బెదిరింపు మెయిల్ వచ్చిన పాఠశాల్లలో ఒక్క స్కూల్.. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ నివాసానికి అతి సమీపంలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక, వైట్‌ఫీల్డ్, కొరెమంగళ, బసవేశ్వరనగర్, యెళహంక, సదాశివనగర్‌లోని పాఠశాలలకు ఈ బెదిరింపులు వచ్చాయి. ఇదిలా ఉండగా.. గత ఏడాది కూడా బెంగళూరులోని ఏడు పాఠశాలలకు ఇలాగే బాంబు బెదిరింపు వచ్చింది. అయితే, తర్వాత అది నకిలీ బెదిరింపు అని తేలింది. ఇదీ చదవండి: తమిళనాడులో భారీ వర్షాలు .. ఐఎమ్‌డీ హెచ్చరిక -
అంబానీకి మళ్లీ బెదిరింపులు
ముంబై: కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీకి మరోసారి బెదిరింపులు వచ్చాయి. రూ.20 కోట్లు ఇవ్వాలని లేకుంటే చంపేస్తామని శుక్రవారం ఓ అగంతకుడు మెయిల్ ద్వారా బెదిరించిన విషయం తెలిసిందే. ఆదివారం మళ్లీ అదే అడ్రస్‌తో మరోసారి బెదిరింపు మెయిల్ పంపినట్లు పోలీసులు తెలిపారు. రూ.200 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తామని అందులో ఉందన్నారు. అంబానీ నివా సం ఆంటీలియా భద్రతాధికారి దేవేంద్ర ము న్షీరామ్ ఫిర్యాదు చేశారు. నిందితుడు యూరప్‌కు చెందిన ఈ–మెయిల్ సరీ్వస్ ప్రొవైడర్ ఉపయోగించాడని చెప్పారు. అతడిపై ఐపీసీ 387, 506(2) సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్నారు. అయితే షాదాబ్ ఖాన్ అనే వ్యక్తి నుంచి ఆ బెదిరింపు మెయిల్ వచి్చనట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. అతడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. -
సార్.. ప్రేమలో పడ్డా కాస్త డబ్బు సర్దండి!
కోహిమా: రాజకీయ నాయకులకు తరచూ ఉద్యోగం, ఉపాధి, డబ్బు సాయం కావా లంటూ విజ్ఞాపనలు అందుతుండటం సహజంగా జరిగేదే. కానీ, ఓ యువకుడు మాత్రం తన కలల రాణితో ప్రేమ వ్యవ హారం సాగించేందుకు డబ్బు సర్దాలంటూ ప్రాధేయ పడ్డాడు. ఈ విడ్డూరం నాగాలాండ్‌లో చోటుచేసుకుంది. బీజేపీ నాగాలాండ్ అధ్యక్షుడు టెమ్జెన్ ఇమ్నా అలోంగ్ తనకు ఎదురైన అరుదైన అనుభవాన్ని స్వయంగా ‘ఎక్స్’లో వివరించారు. ఆయనకు అరవింద పాండా అనే ఓ యువకుడు పంపిన మెయిల్లో ఇలా ఉంది.. ‘సర్, ఈ నెల 31వ తేదీన నా గర్ల్‌ఫ్రెండ్‌తో మొద టిసారిగా డేటింగ్‌కు వెళ్తున్నాను. కానీ, ఇప్పటి వరకు నాకు ఉద్యోగం రాలేదు. దయవుంచి కొద్దిగా సాయం చేయండి. ఏదో ఒకటి చేయండి సార్’అని అందులో ఉంది. అందుకాయన, ‘ఎలాంటి సాయం కావాలో చెప్పండి’అంటూ బదులి చ్చారు. ‘ఎక్స్’లో అలోంగ్ పోస్టుకు నెటిజన్లు తమాషా వ్యాఖ్యలతో స్పందించారు. యువకు డితోపాటు డేటింగ్‌కు వెళ్లాలంటూ అలోంగ్‌కు ఒకరు సూచించగా, అతడికి డబ్బు సాయం చేయాలని మరొకరు కోరారు. లవర్ బోయ్ అరవింద పాండాకు ఎమ్మెల్యేగా అవకాశమి వ్వాలని, అతడికి ఉద్యోగమి వ్వాలని.. ఇలా రకరకాల సూచ నలు చేశారు. తల్లిదండ్రులు ఎంపిక చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని మరొకరు ఆ యువకుడికి తెలిపారు. ఆ యు వకుడు జీవితంలో కఠినమైన పాఠా లను నేర్చు కోవాల్సిన అవసరం ఉన్నందున ఆ వినతిని పట్టించుకోవద్దని కొందరు పేర్కొన్నారు. -
'తపాల శాఖ' ద్వారా.. ఇక విదేశాలకు పార్సిళ్లు..!
ఆదిలాబాద్: ఆదిలాబాద్ ప్రధాన తపాల కార్యాలయం నుంచి డాక్ నిర్యాత్ కేంద్ర సర్వీస్ ద్వారా తక్కువ ఖర్చుతో విదేశాలకు సులభంగా పార్సల్స్ పంపే సేవలు ప్రారంభించినట్లు ఆదిలాబాద్ సబ్ డివిజన్ ఇన్స్పెక్టర్ సుజిత్‌కుమార్ తెలిపారు. శుక్రవారం ఉట్నూర్ పరిధిలోని బ్రాంచి పోస్ట్ మాస్టర్లతో సమావేశం నిర్వహించారు. విదేశాలకు పార్సల్ సేవలు అందుబాటులోకి వచ్చినట్లు తెలిపారు. శుక్రవారం ప్రధాన తపాల కార్యాలయంలో సైతం విదేశాలకు పార్సెల్ సర్వీస్ కరపత్రాలు జారీ చేసినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్విని యోగం చేసుకోవాలని కోరారు. ఇతర వివరాలకు సమీప పోస్టు ఆఫీసుల్లో సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీఎం తిరుపతి, రమేశ్, బీపీఎంలు చంద్రశేఖర్, ప్రవీన్, గోకు ల్, విజయ్, సాద్ తదితరులు పాల్గొన్నారు. -
మెసేజ్ లింక్స్‌తో జాగ్రత్త..!
ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించుకునే పూర్ణిమ(పేరుమార్చడమైనది) ప్రతి పైసా జాగ్రత్తగా ఖర్చుపెడుతుంది. రాత్రి పడుకునే ముందు సోషల్‌మీడియా అకౌంట్స్‌తో పాటు, మెయిల్‌కి వచ్చిన నోటిఫికేషన్స్ చూడటం అలవాటు. వాటిలో తన ఆఫీసు నుంచి, స్నేహితుల నుంచి వచ్చిన మెసేజ్‌లకు రిప్లై చేసింది. అదే సమయంలో మరో మెసేజ్ వచ్చింది. గోల్డ్స్కీమ్కి సంబంధించిన సమాచారం అది. ఆసక్తిగా అనిపించడంతో దానిని ఓపెన్ చేసింది. ఆ స్కీమ్‌లో చేరితే తక్కువ ధరలో బంగారం కొనుగోలు చేయవచ్చు. అది, పేరున్న కంపెనీ వెబ్సైట్ నుంచి వచ్చింది. లిమిటెడ్ టైమ్‌లో వచ్చిన ఆఫర్ అది. మంచి అవకాశాన్ని ఎందుకు వదులుకోవడం అని, అప్లికేషన్లో తన వివరాలను పొందుపరిచి, సెండ్ చేసింది. మిగతావి ఏమైనా ఉంటే రేపు చూసుకుందాం అని ఫోన్ పక్కన పెట్టేసి పడుకుంది. ఉదయం పనిచేసుకుంటూనే ఫోన్ చేతిలోకి తీసుకుంది. వచ్చిన బ్యాంక్ మెసేజ్‌లు చూసి షాక్ అయ్యింది. యాభై వేల రూపాయలు డెబిట్ అయినట్టుగా బ్యాంక్ మెసేజ్ అది. నిన్నరాత్రి ఆ డబ్బు ట్రాన్స్ఫర్ అయింది. స్కీమ్‌లో చేరినట్టుగా వివరాలు ఇచ్చింది కానీ, బ్యాంక్ అకౌంట్స్‌కి సంబంధించిన సమాచారం ఏమీ ఇవ్వలేదు తను. తన డబ్బు మరెలా పోయినట్టు? మెయిల్ ఐడీలో ఉన్న కస్టమర్ కేర్‌కి మెసేజ్ చేసింది. ఫోన్ చేసింది. కానీ, ఎలాంటి సమాచారమూ లేదు. పూర్ణిమ మాదిరే చాలామంది మెసేజ్‌లు లేదా మెయిల్స్‌కు వచ్చిన ఆకర్షణీయమైన పథకాలతో ఉన్న లింక్స్‌ను ఓపెన్ చేయడం, వాటి ద్వారా మోసాలకు గురికావడం అతి సాధారణంగా జరుగుతున్నాయి. దీనికి కారణం అధికారిక కంపెనీల నుంచి వచ్చినట్టుగా మెసేజ్ లింక్స్ ఉండటం ప్రధాన కారణం. ఈ రోజుల్లో స్పూఫింగ్ అనేది మన భద్రత, గోప్యతకు తీవ్రమైన ముప్పుగా పరిణమిస్తుంది. ఈ రకమైన దాడుల గురించి తెలుసుకోవడం, వాటి నుండి తమను తాము రక్షించుకోవడానికి అందరం సిద్ధపడాల్సిన సమయం ఇది. పేరున్న కంపెనీల పేరుతో అధికారిక వెబ్సైట్లనుంచి వచ్చినట్టు మెసేజ్‌లు మెయిల్స్‌కు వస్తుంటాయి. అయితే, వాటిలో ఏవి కరెక్ట్ అనేది పెద్ద సంశయం. ఇలాగే, క్రెడిట్ కార్డ్ నంబర్లు, ఓటీపీ, లాగిన్ ద్వారా మోసగాళ్లు మన సమాచారాన్ని బయటపెట్టేలా చూస్తుంటారు. లాటరీ వచ్చింది, డబ్బు డిపాజిట్ చేయడానికి బ్యాంక్ వివరాలు ఇవ్వమని అడగడం, ఓటీపీ చెప్పమని కోరడం, బ్యాంక్ లేదా ఏదైనా ఇతర సంస్థ నుండి ఫోన్ కాల్స్ చేస్తుంటారు. ఈ కాల్స్ ద్వారా బ్యాంకుకు సంబంధించిన సమాచారాన్ని మనం బయటపెట్టేలా మోసం చేసే అవకాశం ఉంది. మనలో నమ్మకాన్ని కలిగించడానికి సులువైన, ఆకర్షణీయమైన పద్ధతులను మోసగాళ్లు ఎంచుకుంటారు కాబట్టి, మనమే జాగ్రత్త వహించాలి. ఇ–మెయిల్ ద్వారా.. ఫేక్ మెయిల్ ఐడీతో మన ఇన్‌బాక్స్‌లో ఓ మెసేజ్ వస్తుంది. అది వేరొకరి నుండి వచ్చినట్లు కనిపిస్తుంది. ఇది సాధారణంగా ఫిషింగ్ దాడులలో ఉపయోగించబడుతుంది, ఇక్కడ దాడి చేసే వ్యక్తి సున్నితమైన సమాచారాన్ని బహిర్గతం చేయడానికి లేదా హానికరమైన సాఫ్ట్‌వేర్‌ను డౌన్ లోడ్ చేయడానికి, మోసగించడానికి ప్రయత్నిస్తాడు. ♦ పంపినవారి ఇ–మెయిల్ చిరునామా అనుమానాస్పదంగా ఉండచ్చు. ఉదాహరణకు.. మనకు వచ్చిన ఫేక్ మెయిల్ ఐడీలో లెక్కకు మించి, అక్షర దోషాలు లేదా వింత భాష ఉండచ్చు. గమనించాలి. ♦మోసపూరిత ఇ–మెయిల్లు ఎలా ఉంటాయంటే.. తరచుగా క్రెడిట్ కార్డ్ నంబర్లు, సోషల్ సెక్యూరిటీ నంబర్లు లేదా పాస్‌వర్డ్‌ల వంటి వ్యక్తిగత సమాచారం కోసం రిక్వెస్ట్‌లు కోరుతుంటాయి. ♦ ఇ–మెయిల్లోని అనుమానాస్పద లింక్‌లు చట్టబద్ధమైన వెబ్సైట్లా కనిపించే నకిలీ వెబ్‌సైట్‌కి దారితీయవచ్చు. లేదా అవి అసాధారణమైన అక్షరాలను కలిగి ఉండవచ్చు. లేదా వేరే వెబ్‌సైట్‌కి దారి మళ్లించవచ్చు. ఫోన్ ద్వారా దాడులు ♦ ఫోన్ ద్వారా దాడులకు పాల్పడే వ్యక్తులు ఉంటారు. వీరు వినియోగదారుడిని రకరకాల ఆకర్షణీయ పథకాల ద్వారా అతని వ్యక్తిగత, బ్యాంకు వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. ♦ మీ ఫోన్‌కి బయటి దేశాల నుంచి కూడా ఫోన్లు వస్తుంటాయి. ♦ మీకు తక్కువ సమయంలో ఎక్కువ కాల్స్ వచ్చినా, పగలు లేదా రాత్రి అసాధారణ సమయాల్లో మీకు కాల్స్ వచ్చినా, అది కాలర్ ఐడీ స్పూఫింగ్‌కు సంకేతం కావచ్చు. ♦మీరు గుర్తించని కంపెనీలు లేదా వ్యక్తుల నుండి అయాచిత కాల్స్‌ను స్వీకరిస్తే, అది కాలర్ ఐడీ స్పూఫింగ్‌కు సంకేతం కావచ్చు. ♦కాలర్ ఐడీ స్పూఫింగ్ తరచూ క్రెడిట్ కార్డ్ నంబర్లు లేదా సామాజిక భద్రతా నంబర్ల వంటి వ్యక్తిగత సమాచారం కోసం రిక్వెస్ట్‌లు ఉంటాయి. ♦ఫోన్ కాల్లో అవతలి వారి మాటల్లో ఏ మాత్రం క్వాలిటీ లేకపోయినా, కాల్ సమయంలో అసాధారణ శబ్దాలు లేదా అంతరాయాలు ఉంటే, అది కాలర్ ఐడీ స్పూఫింగ్‌కు సంకేతం కావచ్చు. ఇలా సురక్షితం... ♦ అపరిచిత ఇ–మెయిల్లు, మెసేజ్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ♦ బ్రౌజర్ అడ్రస్ బార్లో లాక్ గుర్తు ఉండదు. అడ్రస్ బార్‌పై అక్షరాల్లో చిన్న చిన్న తేడాలు ఉంటా యి. ఈ చిన్న అక్షరాలను కూడా గమనించాలి. ♦యుఆర్ఎల్ అక్షరాలు సరిగా ఉన్నా డిజైన్లలో కూడా తేడాలు ఉంటాయి. గమనించాలి. ♦బ్యాంక్, డిజిటల్ రెండు రకాల కార్యకలాపాలకు రెండు కారకాల ఫోన్ ప్రమాణీకరణను ప్రారంభించడం శ్రేయస్కరం. - ఇన్పుట్స్: అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
ముంబైపై ఉగ్రదాడి చేస్తామని ఎన్ఐఏకు బెదిరింపు మెయిల్
ముంబైలో ఉగ్రదాడి జరగుతుందంటూ జాతీయ దర్యాప్తు సంస్థకు బెదిరింపు మొయిల్ వచ్చింది. తాను తాలిబాస్ సభ్యుడనంటూ దర్యాప్తు సంస్థకు ఓ గుర్తు తెలియని వ్యక్తి మెయిల్ పంపాడు. ఈ నేపథ్యంలోనే దర్యాప్తు సంస్థ మహారాష్ట్రలోని ముంబై పోలీసుల అప్రమత్తం చేసింది. దీంతో పోలీసులు ముంబైలోని వివిధ నగరాలకు హైఅలర్ట్ జారీ చేశారు. బెదిరింపు మెయిల్లో గర్తు తెలియని వ్యక్తి తనను తాను తాలిబానీ సభ్యుడిగా పేర్కొన్నాడు. ముంబైలో ఉగ్రదాడి జరుగుతుందంటూ బాంబు పేల్చాడని పోలీసుల వర్గాలు చెప్పాయి. ఈ మెయిల్ తదనంతరం దర్యాప్తు సంస్థ, ముంబై పోలీసులు సంయుక్తంగా ఇందులో నిజానిజాలను వెలికితీసే పని ప్రారంభించాయి. అంతేగాదు ఆ వ్యక్తి మెయిల్లో ముంబైలోని పలు కీలక ప్రాంతాల్లో బాంబులు అమర్చినట్లు తెలిపినట్లు సమాచారం. అందులో భాగంగా నగరంలో ఇన్ఫినిటీ మాల్ అంధేరి, పీవీఆర్ మాల్ జుహు, సహారా హోటల్ ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు భద్రతను కట్టుదిటట్టం చేశారు. ఈ ఏడాది జనవరిలో ముంబైలోని ధీరుభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూలకు ఇలానే ఓ బెదిరింపు కాల్ వచ్చింది. అలాగే గతేడాది అక్టోబర్‌లో కూడా ఇదే తరహాలో బెదిరింపు కాల్ వచ్చింది. (చదవండి: బాల్య వివాహాలపై ఉక్కుపాదం..ఏకంగా 18 వందల మంది అరెస్టు!) -
సినిమా రేంజ్లో గాల్లోకి ఎగిరిపడ్డ ట్రక్! వైరల్ వీడియో
A truck carrying United States Postal Service (USPS) mail: చాలా భయంకరమైన ప్రమాదాలు గురించి విన్నాం. పైగా అంతపెద్ద ప్రమాదం జరిగినప్పటికీ త్రుటిలో బయట పడ్డ మృత్యుంజయులను చూశాం. బతికే అవకాశం లేదనే ప్రమాదంలో గాయాలు పాలుకాకుండా బయటపడి అందర్నీ ఆశ్చర్య పరిచని ఘటనలు కోకొల్లలు. అచ్చం అలాంటి సంఘటనే అమెరికాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..యునైటెడ్ స్టేట్స్ పోస్టల్ సర్వీస్(యూఎస్పీఎస్) మెయిల్‌ను తీసుకువెళ్తున్న ట్రక్కు 50 అడుగుల వంతెన పై నుంచి బోస్టన్ సమీపంలోని మంచుతో నిండిన నదిలో పడింది. అయితే డ్రైవర్ మాత్రం అద్భుతంగా ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ డ్రైవర్‌కి ఈత రాకపోవడంతో పాక్షికంగా నీట మునిగిన ట్రక్ పై ఉన్నాడు. అంతేకాదు అతనికి ఎలాంటి గాయాలు అవ్వలేదు. అయితే దగ్గరలోనే అగ్నిమాపక సిబ్బంది ఉన్నందును సత్వరమే స్పందించి ఆ డ్రైవర్ని ఒడ్డుకు చేర్చారు. ఆ తర్వాత అతన్ని బ్రిగ్హామ్ అండ్ ఉమెన్స్ హాస్పిటల్‌కు తరలించారు. ఈ మేరకు ఈ ఘటన ఆ నదికి సమీపంలో ఉన్న సీసీ కెమరాలో రికార్డు అయ్యింది. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. EXCLUSIVE FOOTAGE: Never before seen video of the major TT crash Saturday in Weston Click here for more:https://t.co/CRRpYWhfAS (@MassStatePolice, @WESTON_FIRE, @NewtonFireDept, @SPAMPresident, @wbz, @WCVB, @7News, @NBC10Boston, @boston25, @bostonherald, @LiveBoston617) pic.twitter.com/ZUmJJbXF6Z — State Police Association of Massachusetts (@MSPTroopers) February 27, 2022 (చదవండి: ఒంటి చేత్తో యుద్ధ ట్యాంక్‌ని ఆపాడు! వైరల్ వీడియా) -
మరో తెలుగు చిత్రానికి అరుదైన ఘనత
అది 2000 సంవత్సరం అప్పుడప్పుడే కంప్యూటర్ వచ్చిన రోజులవి. గ్రామంలోకి అప్పుడే అడుగులు వేసుకుంటూ వచ్చిందో వయ్యారి కంప్యూటర్. అమ్మాయి వెంట చూసే దిక్కులను కంప్యూటర్ వైపు చూసి, ఈ కంప్యూటర్ను ఎలాగైనా నేర్చుకోవాలనే తాపత్రాయంతో ఉండే ఓ అబ్బాయి. ఆ కంప్యూటర్లో వచ్చే ఒక మెయిల్‌తో మోసపోయే అబ్బాయిల అమాయకత్వం. ప్రతిసారి లాగా ఈ సారి తను నేర్పించే శిక్షణతో ఎవరు నాకు పొటీ రాకుండా నేర్చుకోవడానికి వచ్చిన వారికి ముందుగానే షరతు పెట్టి, తను మోసపోయానని చెప్పే అమాయకత్వం ఇంకోకరిది. ఇప్పటికీ మీ అందరికీ గుర్తువచ్చే ఉంటుంది. మాకు ఎందుకు తెలియదు..! మరీ ఇంతా అమాయకులు ఉంటారా..అని అనుకున్న చిత్రమే..కంబాలకథలు ‘మెయిల్’. ఈ చిత్రం ప్రేక్షకుల మనసును గెలుచుకొని, అద్భుత విజయం సాధించింది. కాగా తాజాగా ఈ చిత్రం మరో అరుదైన ఘనతను సృష్టించింది. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన కంబాలపల్లి కథలు ‘మెయిల్’ చిత్రం ‘న్యూయర్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ 2021’ కు ఎంపిక చేశారు. ‘కేరాఫ్ కంచరపాలెం’ సినిమా తర్వాత న్యూయర్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్లో అవకాశం దక్కింది. ఈ విషయాన్ని నిర్మాతలు శనివారం తెలిపారు. జూన్ 4 న ప్రారంభమయ్యే న్యూయర్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. ఈ సంవత్సరం ఓటీటి ప్లాట్‌ఫాం ఆహాలో రిలీజ్ అయింది. ఈ చిత్రంలో ప్రియదర్శి, హర్ష, ప్రియ తదితరులు తమ నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని ఉదయ్ గుర్రాల దర్శకత్వం వహించగా, ప్రియాంక దత్ నిర్మాతగా వ్యవహరించారు. #Mail has been now an 'Official selection at the New York Indian Film Festival'. A big thanks to each and everyone who made it possible♥️ #ReasonToSmile @SwapnaCinema @ahavideoIN #UdayGurrala pic.twitter.com/Rl2Y41q75N — Priyadarshi (@priyadarshi_i) May 8, 2021 -
ప్రేక్షకుల మనసును హత్తుకుంటున్న ‘మెయిల్’
మాల్గుడి అనే ఊళ్లో కథలు అందమైనవి. ఆ ఊరు కర్ణాటకలో ఉన్నట్టుగా కల్పితం. కాని నిజమైన మాల్గుడిలు ఎన్నో మన తెలుగు నేల మీద ఉన్నాయి ప్రతి ఊళ్లో ఎన్నో కతలు. ఎన్నో అనుభవాల తలపోతలు.వాటిని రాసేవారు కొందరు రాశారు. ఇప్పుడు తీసేవారు తీస్తున్నారు. ‘కంబాలపల్లి కతలు’ పేరుతో ఓటిటి ప్లాట్‌ఫామ్ ఆహాలో మొదలైన వెబ్ సిరీస్‌లో మొదటిది ‘మెయిల్’. ఇది తెలంగాణ పల్లెలోని ఒక ఇన్నోసెంట్ కథ.మరో మాల్గుడి డేస్ లాంటి కత. 1990ల తర్వాత నాటి ఆంధ్రప్రదేశ్‌లో కంప్యూటర్ కోర్సులు మొదలయ్యాయి. కాలేజీల్లో రెండు మూడు కంప్యూటర్లు పెట్టి, అవి ఉన్న చోటుకు కంప్యూటర్ ల్యాబ్ అని పేరు పెట్టి, కంప్యూటర్ కోర్సులు నేర్పించేవారు. వాటికి ఖర్చు జాస్తి. డబ్బున్న పిల్లలు చదివేవారు. బిఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదివినవారు ఆ కాలంలో సులువుగా ఎం.సి.ఏలు చేసి ఇవాళ అమెరికాలో సెటిల్ అయ్యారు. అయితే 1990ల ఈ కంప్యూటర్ చిన్న వూళ్లకు చేరడానికి ఇంకో పదేళ్లే పట్టింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో చిన్న చిన్న ఊళ్లల్లో వీటి సెంటర్లు వచ్చి తెలిసీ తెలియని పని మొదలయ్యింది. కంప్యూటర్లు ఆపరేట్ చేసేవారు తెలివైనవారుగా గొప్పవారుగా పరిగణింపబడ్డారు. వాటితో కొత్తగా పరిచయం పెంచుకున్న గ్రామీణ యువకులు కొన్ని కొత్త జీవితానుభవాలను నేర్చుకున్నారు. ఆ వరుసలో 2000 కాలంలో తెలంగాణ పల్లెలో ఒక కంప్యూటర్ ఎంత సందడి చేసిందో చెప్పే సినిమా ‘మెయిల్’. ఇప్పటితరానికి చేతిలోని ఫోనే ఒక కంప్యూటర్. కాని ఆ కాలంలో కంప్యూటర్ కుయ్మన్నా బీప్మన్నా భయమే. వైరస్ అన్నా భయమే. మౌస్‌ను చూసినా భయమే. మెయిల్ వచ్చింది తెలంగాణలోని మెహబూబాబాద్కు పూర్వనామం మానుకోట. దీనికి దగ్గరగా ఉండే ఊరు కంబాలపల్లి. వ్యవసాయం, వృత్తి విద్యలు, సైకిళ్ల మీద కాలేజీలకు వెళ్లే పిల్లలు, నోటు రాయించుకుని అప్పులు ఇచ్చే వ్యక్తులు... వీరందరి మధ్య హైబత్ (ప్రియదర్శి) అనే కుర్రాడు కంప్యూటర్ సెంటర్ పెడతాడు. కంప్యూటర్ సెంటర్ అంటే ఒకే ఒక కంప్యూటర్ ఉన్న కొట్టు. పిల్లలకు గేమ్స్ ఆడించి గంటకు పదిరూపాయలు సంపాదించుకునే హైబత్ దగ్గర ఉన్న కంప్యూటర్ను చూసి దానిని నేర్చుకోవాలని అనుకుంటాడు రవి (హర్షిత్ రెడ్డి) అనే డిగ్రీ కుర్రాడు. హైబత్ అతనికి ఒక మెయిల్ ఐడి క్రియేట్ చేస్తాడు. ఇక అతనికి మెయిల్స్ వస్తాయని చెబుతాడు. ఇతని మెయిల్ ఐడి ఎవరికి తెలుసని? ఇతని మెయిల్‌కు ఎవరు మెయిల్స్ పంపుతారని? ఆ సంగతి హైబత్కు తెలియదు, రవికి తెలియదు. రోజూ వచ్చి మెయిల్ బాక్స్ ఓపెన్ చేసుకుని చూసుకుంటూ ఉంటాడు. ఒక రోజు రానే వచ్చింది మెయిల్. అందులో ‘కంగ్రాట్యులేషన్స్... మీరు రెండు కోట్ల రూపాయలు లాటరీలో గెలుచుకున్నారు.’ అని. అది ఫేక్ మెయిల్. కాని దానిని రవి నిజమని నమ్ముతాడు. తన ఫ్రెండ్‌ను కూడా ఇందులో దింపుతాడు. ఆ తర్వాత ఏమయ్యిందనేది కథ. అందమైన సంగతులు కాని ఇందుకోసం ఈ సినిమా చూడరు ఎవరూ. తెలంగాణ భాష కోసం, మనుషుల కోసం, ఊళ్లో జరుగుతున్న కథలో భాగమైన భావన కోసం, ఆ క్షణకాలపు పెను సమస్యలతో పాత్రలు సతమతమవడాన్ని చూడటం కోసం ఈ సినిమా చూస్తారు. ఇది మొత్తంగా ఒక ఊరు ఉమ్మడి కథ. పాత్రలు కొంచెం ముందు నిలబడతాయి అంతే. డిగ్రీ కాలేజీలో చేరిన వెంటనే మొదలయ్యే ప్రేమలు, పాసనయ్యానని చెప్తే పెద్దగా వ్యక్తీకరణ లేకుండా ‘బట్టలు కొనుక్కుంటావా’ అని అడిగే తండ్రులు, చదువు అబ్బని కొడుకులను చూసి నాలుగు తగిలించే నాన్నలు, అర్ధ చటాక్ చింతపండును కొనడానికి వచ్చే ఆడపిల్లలు, చిన్న చిన్న అసూయలు, కొద్ది కొద్ది ఈర్ష్యలు... మనుషులందరూ ఒకటే అని చెప్పే ఈ భావోద్వేగాలను ఈ సినిమాలో చూస్తాము. కాళ్లకు చెప్పులు వేసుకుని వస్తే కంప్యూటర్‌కు వైరస్ వస్తుందని నమ్మిన ఆ కాలంలో ఆ మూఢ విశ్వాసం చుట్టూ మంచి హాస్యం అల్లుకున్నారు. కంప్యూటర్లో డ్రైవ్ నిండి ఎర్రగా కనిపించినా అది వైరస్సే అని భయపడతాడు హైబత్. దానిని రిపేరు చేయడానికి వచ్చినవాడిది ఇంకా పెద్ద మాయ. దర్శకుడి స్వీయకథ ఈ సిరీస్‌ను తీస్తున్నది దర్శకుడు ఉదయ్ గుర్రాల. ఇతనిది ఈ సినిమా కథ జరిగిన ప్రాంతమే. బహుశా ఇతని, ఇతని స్నేహితుల అనుభవాలే ఈ సినిమా. అందుకే కథలో ఒరిజినాలిటీ, ప్రవర్తనలు, పాత్రలు సహజంగా అమిరాయి. మేకింగ్‌లో హిందీ వెబ్ సిరీస్ ‘పంచాయత్’ ప్రభావం ఉన్నట్టు అనిపించినా అది మంచికే. కథను ఇంకొంత వేగంగా చెప్పవచ్చు. ఇంత నిడివి అక్కర్లేదు అనిపిస్తుంది. తర్వాతి చాప్టర్లో ఈ జాగ్రత్త తీసుకుంటాడని ఆశిద్దాం. ఈ సిరీస్‌ను ఓకే చేసిన నిర్మాతలు స్వప్నా దత్, ప్రియా దత్, అశ్వినిదత్ను అభినందించాలి. మిస్ హైదరాబాద్ టైటిల్ గెలుచుకున్న గౌరిప్రియ ఎంత చక్కగా నటించిందో చెప్పలేము. ఆ కళ్లే అన్ని భావాలు పలుకుతున్నాయి. ఆ తెలంగాణ పలుకు బంగారం. కోస్తా ప్రాంతంలో కథలు బాగానే వచ్చాయి. కాని రాయలసీమ, తెలంగాణ ప్రాంతం నేపథ్యంలో ఇలాంటి ఎన్నో సిరీస్‌లు తీయవచ్చు. ఇది మొదలు. మంచి కథలు రానున్నాయన్న సందేశాన్ని మోసుకొచ్చింది ‘మెయిల్’. అన్నట్టు గత ఇరవై ఏళ్లుగా ఫేక్ ఈమెయిల్స్ వచ్చి లక్షలు, కోట్లు కోల్పోయిన అమాయకులు ఉన్నారు. కాని ప్రభుత్వాలు ఈ మధ్య మాత్రమే ఆ ఫేక్ మెయిల్స్‌ను నమ్మొద్దంటూ ప్రచారం మొదలెట్టాయి. ఈలోపు జరిగిన వేలాది పెద్ద ప్రమాదాల్లో ఒక చిన్న ప్రమాదం మాత్రమే ‘మెయిల్’. – సాక్షి ఫ్యామిలీ -
నెలన్నర రోజులు బాయ్స్ హాస్టల్ ఉన్నాం..
ముందస్తు ప్రణాళికలు లేవు వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోవాలనే తపన ఉంది. గెలుస్తానా.. ఓడుతానా.. అనే సందేహం లేదు. ప్రయత్నిద్దాం అనే అభిలాష ఉంది. సింగర్‌గా శభాష్ అనిపించుకొని బ్యూటీ కాంటెస్టెలలో భేష్‌గా నిలిచి మెయిల్.. అంటూ ఓటీటీ సినిమాతో రోజాగా తెలుగు ప్రేక్షకులకు చేరువైన గౌరి ప్రియారెడ్డిని పలకరించింది సాక్షి. మెయిల్ సినిమా వల్ల వచ్చిన పేరును ఎలా ఎంజాయ్ చేస్తున్నారా? గౌరి ప్రియా రెడ్డి: చాలా హ్యాపీగా ఉంది. అమ్మనాన్నలు, నా ఫ్రెండ్స్, విదేశాల్లో ఉన్న మా రిలేటివ్స్ కూడా నా యాక్టింగ్ గురించి మాట్లాడుతున్నారు. మాటల్లో చెప్పలేను ఆ ఆనందాన్ని. మెయిల్ మూవీ.. ఎక్స్‌పీరియెన్స్ గురించి .. గౌరి: చాలా ఉన్నాయి. మొత్తం 60 రోజులు సినిమా షూటింగ్. నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాద్‌లోనే. పల్లె గురించి అస్సలు తెలియదు. ఎప్పుడూ వెళ్లలేదు కూడా. అలాంటిది షూటింగ్ కోసం మారుమూల తండాల్లాంటి ప్రాంతాలకు వెళ్లాం. మహబూబాబాద్‌లోని గవర్నమెంట్ బాయ్స్ హాస్టల్లో దాదాపు నెలన్నర రోజులు ఉన్నాం. ఇప్పటి వరకు ఎప్పుడూ నేను హాస్టల్లో ఉండలేదు. ఆ ఎక్స్పీరియన్స్ కూడా చేశాను. అక్కడ నుంచి మెట్టవాడ, బురుగుపాడు, గౌరారం, కంబాలపల్లి, బయ్యారం... వంటి ఊళ్లు లొకేషన్ స్పాట్స్. ఎంత తిరిగానో.. ఆ పల్లె ప్రాంతాలు. అక్కడ పొలాల్లో పనులు చేసే అమ్మాయిలను కలవడం, పెద్ద వారితో మాట్లాడటం, వ్యవసాయం గురించి, ప్రభుత్వ పథకాలు.. వాళ్లు చెప్పేవన్నీ శ్రద్ధగా వినేదాన్ని. ఒక చోటుకి వెళితే.. కామ్‌గా ఉండను. అన్నీ తెలుసుకుంటుంటాను. అలా షూటింగ్ ఉన్నన్ని రోజులు నేను మరో లోకంలో ఉన్నట్టు ఎంజాయ్ చేశాను. అన్ని రోజులు షూటింగ్లో మీ పేరెంట్స్ మీ వెంటే ఉన్నారా? గౌరి: లేరు. వాళ్లు హైదరాబాద్‌లో. నేను విలేజ్‌లో. అసలే కోవిడ్ టైమ్. వాళ్లని ఇబ్బంది పెట్టకూడదు అనుకున్నాను. నాతోపాటు ఒక హెయిర్ డ్రెస్సర్ అమ్మాయి. మిగతా అంతా మెన్. అంతమందిలో మేమిద్దరమే అమ్మాయిలం. కానీ, ఎక్కడా అసౌకర్యం అనిపించలేదు. భయం అన్నదే లేదు. అమ్మానాన్నలకు కూడా నా గురించి బాగా తెలుసు. అస్సలు భయపడరు. అంత ధైర్యం అమ్మానాన్నలకు ఎలా కలిగించారు? గౌరి: నాన్న శ్రీనివాస్‌రెడ్డి ఒక ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలో కన్సల్టెంట్ ట్రైనర్, అమ్మ వసుంధర హౌజ్‌వైఫ్. వారికి నేనొక్కదాన్నే కూతురుని. అలాగని నా పెంపకంలో ఎప్పుడూ భయపడలేదు వాళ్లు. చిన్నప్పటి నుంచి నా ఇష్టానికే ప్రాధాన్యత. నాన్న బాగా ఎంకరేజ్ చేస్తారు. డిగ్రీవరకు చదువుకున్నాను. చిన్నప్పుడు ఇంట్లో సినిమా పాటలు బాగా పాడుతుండేదాన్ని. అది చూసి మ్యూజిక్ క్లాసులో చేర్పించారు. పెద్దవుతున్న కొద్దీ నా గొంతు నాకే బాగున్నట్లనిపించేది. నాన్న ప్రోత్సాహంతోనే 9వ తరగతిలో టీవీ షో బోల్ బేబీ సీజన్–2లో పాల్గొన్నాను, విజేతగా నిలిచాను. యాక్టింగ్ మాత్రమే కాదు... స్పోర్ట్స్ అంటే కూడా చాలా ఇష్టం. బాగా ఆడతాను. ఎవరితో మాట్లాడాలన్నా భయపడను. థియేటర్ ఆర్ట్స్ అన్నా ఇష్టమే. స్టేజి ఫియర్ అస్సలు లేదు. నా మనస్తత్వానికి సరిపడా పనులు చేసుకుంటూ వెళుతుంటాను. నేనేంటో అమ్మనాన్నలకు బాగా తెలుసు. అందుకే నా గురించి అస్సలు భయపడరు. బ్యూటీ కాంటెస్ట్ల్లోనూ పాల్గొన్నట్టున్నారు.. గౌరి: ఒకసారి మా కాలేజీలో మిస్ హైదరాబాద్ కాంటెస్ట్ స్టాల్ పెట్టారు. ఇంటికి వచ్చాక నాన్నకు చెప్పాను. పోటీలో పాల్గొనమన్నారు. ఫస్ట్‌రౌండ్ వరకైనా క్వాలిఫై అవుతానా.. అనే సందేహం వచ్చింది. కానీ, ప్రయత్నిద్దాం అనుకుని వెళ్లాను. పోటీలో విజేతగా నిలిచాను. అక్కణ్ణుంచి మోడలింగ్, యాక్టింగ్ అవకాశాలు వస్తున్నాయి. మ్యూజిక్ నా మొహంలో ఫీలింగ్స్‌ని బాగా పలికించేందుకు దోహదపడింది. అందుకే, ఈ రంగంలో నాకు అవకాశాలు వస్తున్నాయి అనుకుంటున్నాను. సినిమాల్లోనూ ముఖ్యమైన రోల్స్ చేస్తున్నాను. అవి విడుదల కావల్సి ఉంది. నెక్ట్స్ ప్లాన్స్ ఏంటి? గౌరి ప్రియా రెడ్డి: నా ఏజ్ 22. ఎప్పుడూ ప్లానింగ్ అంటూ చేసింది లేదు. ఇక ముందు అలా ఏమీ ఉండదు. అన్నీ ఫ్లోలో వెళ్లిపోతున్నాయి అంతే. ఎలాంటి అవకాశాలు వస్తాయో.. నేనూ ఎగ్జయిటింగ్‌గా ఎదురు చూస్తున్నాను. ప్రస్తుతానికి ‘మెయిల్’ సినిమా సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నాను. ఆల్ ద బెస్ట్.. గౌరి: థాంక్యూ సో మచ్. – సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
మా స్నేహం అలానే ఉంది
ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మెయిల్’. ఉదయ్ గుర్రాల దర్శకత్వంలో స్వప్నా సినిమాస్ పతాకంపై స్వప్నా దత్, ప్రియాంకా దత్ నిర్మించారు. ఈ నెల 12న ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదలవుతున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘నేను, అశ్వినీదత్ గారు సినిమా పరిశ్రమకు వచ్చి 40 ఏళ్లు అవుతోంది. మాతో పాటు వచ్చిన వాళ్లలో ఇంకా సినిమాలు తీస్తున్నది మేం మాత్రమే. ఇది మా గొప్పతనం అనటం కంటే మా పిల్లలు మా నుండి వస్తున్న దాన్ని అందుకోవటం వల్లే మాకు ఉత్సాహం వచ్చింది. మేమిద్దరం కలిసి ఏడు సినిమాలు చేశాం. సినిమాలు వచ్చాయి.. పోయాయి. మా స్నేహం మాత్రం అలానే ఉంది. స్వప్నను పిలిచి ఆహా కోసం వెబ్ సిరీస్ చేయమన్నాను. ఉదయ్‌తో చేస్తున్న ప్రాజెక్ట్ రష్ చూపించింది. నాకు నచ్చింది.. త్వరలోనే ఆహాలో వస్తుంది’’ అన్నారు. అశ్వినీదత్ మాట్లాడుతూ– ‘‘నాకు పరిశ్రమలో ఎవరు ఆత్యంత ఆప్తులు అంటే ముగ్గురు పేర్లు చెప్తాను. చిరంజీవిగారు, అల్లు అరవింద్, కె.రాఘవేంద్రరావు. అరవింద్ గారు పిలిచి వెబ్ సిరీస్ చేయమన్నారని మా అమ్మాయి స్వప్న చెప్పింది. అప్పుడు నేను నీకిది గోల్డెన్ చాన్స్ అని చెప్పాను’’ అన్నారు. స్వప్నాదత్ మాట్లాడుతూ– ‘‘పార్టనర్షిప్ గురించి నాన్నతో మాట్లాడితే ‘నేను, అరవింద్ ముప్ఫై ఏళ్లుగా సినిమాలు చేశాం. హిట్స్ తీశాం, ఫ్లాపులు తీశాం. ఏ రోజూ ఒక్క మాట అనుకోలేదు. అదీ నిజమైన పార్టనర్షిప్ అంటే’ అన్నారు. మా హృదయానికి దగ్గరైన కథ ఇది. ఎంతో హాయిగా ఇంట్లోనే అందరూ కూర్చుని చూసే సినిమా’’ అన్నారు. ఉదయ్ మాట్లాడుతూ– ‘‘ఈ కథను నేను ఇండిపెండెంట్‌గా చేద్దామనుకుంటున్న సమయంలో స్వప్నగారు కథ విని ఓకే చేశారు. మాపై ఎలాంటి ప్రెషర్ లేకుండా చిత్రీకరణకు సపోర్ట్ చేశారు’’ అన్నారు. ప్రియదర్శి మాట్లాడుతూ– ‘‘ఎంతో పెద్ద లెగసీ ఉన్న అరవింద్‌గారు, అశ్వనీదత్‌గారితో సినిమా చేయటం ఆనందంగా ఉంది. వరల్డ్ సినిమా స్టైల్లో ఉదయ్ ‘మెయిల్’ను తెరకెక్కించారు’’ అన్నారు. -
విదేశీ హ్యాకర్ల నుంచి డబ్బు రికవరీ
సాక్షి, అమరావతి బ్యూరో: ఓ విదేశీ కంపెనీ వ్యాపార లావాదేవీలకు వినియోగించే మెయిల్‌ను హ్యాకింగ్ చేసిన హ్యాకర్లు కొందరు ఆ కంపెనీ మెయిల్ ఐడీని పోలిన మరొక నకిలీ మెయిల్ రూపొందించి తద్వారా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ కంపెనీని బురిడీ కొట్టించి రూ.1.14 కోట్లు కొల్లగొట్టారు. మోసపోయిన విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన బాధితుడు విజయవాడ కమిషనర్ బత్తిన శ్రీనివాసులును కలిసి సహాయం చేయాలని కోరగా.. పశ్చిమగోదావరి ఎస్పీతో మాట్లాడిన పోలీసు కమిషనర్ భీమవరం టూ టౌన్ పోలీసుస్టేషన్లో కేసు నమోదు చేయించి.. బెజవాడ సైబర్ క్రైం పోలీసులతో కేసు దర్యాప్తు చేయించి హ్యాకర్లు కొల్లగొట్టిన సొమ్ము నుంచి కొంత రికవరీ చేయించడం విశేషం. వివరాల్లోకి వెళితే.. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణానికి చెందిన భీమవరం కమ్యూనిటీ నెట్వర్క్ సెంటర్‌కు అమెరికాలోని హార్మోనిక్స్ ఇంటర్నేషనల్ కంపెనీ తో వ్యాపార లావాదేవీలు ఉన్నాయి. ఆ కంపెనీతో ఉత్తర ప్రత్యుత్తరాలను మెయిల్ ద్వారా జరుపుకునేవారు. ఇలాంటి మెయిల్స్ కోసం ఇంటర్నెట్లో సంచరించే హ్యాకర్లు భీమవరం కమ్యూనిటీ నెట్వర్క్ సెంటర్ మెయిల్‌ను హ్యాక్ చేసి వారి వ్యాపార లావాదేవీలపై అవగాహనకు వచ్చారు. అనంతరం హార్మోనిక్స్ ఇంటర్నేషనల్ కంపెనీ మెయిల్ ఐడీని పోలిన నకిలీ మెయిల్‌ను సృష్టించారు. దాని ద్వారా భీమవరం కమ్యూనిటీ నెట్వర్క్ కంపెనీకి మెయిల్స్ పంపి, వ్యాపార లావాదేవీలకు సంబంధించిన డబ్బును హార్మోనిక్స్ ఇంటర్నేషనల్ కంపెనీ అకౌంట్లో కాకుండా.. తాము సూచించిన అకౌంట్ నందు జమ చేసే విధంగా హ్యాకర్లు ఏర్పాట్లు చేసుకున్నారు. సదరు మెయిల్స్ నిజమైనవిగా భావించిన భీమవరం కమ్యూనిటీ సెంటర్ నిర్వాహకులు రూ. 1.14 కోట్ల (1,50,913 యూఎస్ డాలర్లు)ను రెండు దఫాలుగా హ్యాకర్లు సూచించిన అకౌంట్లో జూన్ నెలలో జమ చేశారు. ఆ తరువాత తాము మోసపోయామని గుర్తించిన నిర్వాహకులు విజయవాడ పోలీసు కమిషనర్‌ను కలిసి సహాయం చేయమని విజ్ఞప్తి చేశారు. దాంతో కమిషనర్ స్పందించి పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీతో మాట్లాడి.. భీమవరం టూ టౌన్ పోలీసుస్టేషన్లో బాధితుడి ద్వారా ఫిర్యాదు చేయించారు. దర్యాప్తునకు బెజవాడ సైబర్‌క్రైం పోలీసులు సహకారం అందించాలని ఆదేశించారు. రూ. 33.08 లక్షల రికవరీ.. నగర కమిషనర్ ఆదేశాలతో దర్యాప్తును కొనసాగించిన సైబర్‌క్రైం పోలీసులు బాధితులు పోగొట్టుకున్న నగదు యునైటెడ్ కింగ్డమ్కు చెందిన హెచ్ఎస్బీసీ బ్యాంక్‌లో జమ అయినట్లు గుర్తించారు. తరువాత బాధితుడి అకౌంట్ ఉన్న ఎస్బీఐ ఫోరెక్స్ బ్రాంచ్ ద్వారా చెన్నై హెచ్ఎస్బీసీ బ్రాంచ్‌కు వివరాలు తెలిపారు. చెన్నై బ్రాంచ్ ద్వారా యూకే హెచ్ఎస్బీసీ బ్రాంచ్‌ను సంప్రదించిన సైబర్ పోలీసులు ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపి బాధితుడు పోగొ ట్టుకున్న సొమ్ములో రూ.33,08,068 లక్షల నగదు (44, 551.11 యూఎస్ డాలర్లు)ను భీమవరం కమ్యూనిటీ నెట్వర్క్ కంపెనీ అకౌంట్లో జమ చేయించారు. ఈ కేసు కౌంటర్ పార్ట్ అయిన హార్మోనిక్స్ ఇంటర్నేషనల్ కంపెనీ యాజమాన్యాన్ని విజయవాడ సైబర్‌క్రైం పోలీసులు సంప్రదించి వారి ద్వారా యూకేలోని వెస్ట్ యార్క్‌షైర్ పోలీసుస్టేషన్లో కూడా కేసు నమోదు చేయించారు. -
ఈమెయిల్ ట్రిక్స్.. సైబర్ ఎటాక్స్!
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలో బ్యాంకులు, హెల్త్‌కేర్ రంగంలో పనిచేస్తున్న పలు సంస్థలను సైబర్‌దాడులు గజగజలాడిస్తున్నాయి. ప్రతిరోజూ సరాసరిన మూడు సైబర్ ఎటాక్స్ తమ వద్ద నమోదవుతున్నట్లు నగర కేంద్రంగా పనిచేస్తున్న ‘ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఆడిట్ అండ్ కంట్రోల్ అసోసియేషన్’ తాజా అధ్యయనంలో తేలింది. సైబర్ దాడులతోపాటు ఫిషింగ్ మెయిల్స్‌తో ఆయా బ్యాంకింగ్, నాన్‌బ్యాంకింగ్ ఆర్థిక సంస్థలు, ఇన్సూరెన్స్ కంపెనీలు, హెల్త్‌కేర్ రంగంలో పనిచేస్తున్న వివిధ సంస్థలు ఈ దాడులకు గురవుతున్నట్లు ఈ సంస్థ తాజా అధ్యయనంలో తేలింది. ఆయా సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, మేనేజ్మెంట్ హోదాలో ఉన్నవారికి నిత్యం వివిధ సంస్థలు, వ్యాపార, వాణిజ్య లావాదేవీల నిమిత్తం వచ్చే మెయిల్స్‌లో సుమారు 26 శాతం ఫిషింగ్ మెయిల్స్(చౌర్యానికి పాల్పడేవి) ఉన్నాయని.. ఉద్యోగులు ఏమరుపాటుగా వీటిని తెరిచి చూస్తే ఆయా సంస్థల డేటాబేస్ చౌర్యంతోపాటు సిస్టం, సాఫ్ట్వేర్లు తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయని తేల్చింది. ఈ పరిస్థితిని అరికట్టేందుకు ఆయా సంస్థలు తమ ఉద్యోగులకు విధిగా సైబర్ సెక్యూరిటీ అంశంపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించింది. ఇప్పటికే తమ సంస్థకు చెందిన సుమారు 800 మంది నిపుణులు సైబర్‌దాడుల నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆయా సంస్థలకు అవగాహన కల్పించడంతోపాటు పరిశోధన కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించింది. ఉపయోగాలివే.. సైబర్ దాడుల నిరోధానికి ఇప్పటికే నగరంలో సైబర్ సెక్యూరిటీ క్లస్టర్లు పనిచేస్తున్నాయని.. వాటితో చేకూరే ప్రయోజనాలను ఈ సంస్థ తన అధ్యయనంలో వెల్లడించింది. సైబర్ నేరగాళ్ల సమాచారం, వారు వినియోగిస్తున్న సాంకేతికతపై సమస్త సమాచారాన్ని తెలుసుకునే హబ్‌ను ఏర్పాటు చేయడం, సైబర్ సెక్యూరిటీ క్లస్టర్లో చేరిన సంస్థలు లేదా దేశాలు, సంస్థలకు సైబర్ నేరాల నిరోధానికి అవసరమైన సాంకేతిక సహకారం అందిస్తారు. నేరాలపై జరిపే పరిశోధనకు నిపుణులు సహకరిస్తారు. ఆయా సంస్థల మధ్య సమన్వయం సాధించడంతోపాటు సైబర్ నేరాలు జరిగిన తీరును సాంకేతిక నిపుణులు విశ్లేషిస్తారు. భవిష్యత్‌లో ఇలాంటి నేరాలు చోటుచేసుకోకుండా తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తారు. విశ్వవ్యాప్తంగా సైబర్ నేరాల నిరోధానికి అవలంభించాల్సిన సాంకేతిక వ్యూహాలను సిద్ధం చేస్తారు. ఈ విషయంలో ఆయా సంస్థలకు అవగాహన కల్పించడంతోపాటు మార్గనిర్ధేశం చేస్తారు. చర్యలివే.. సైబర్ దాడులపై అప్రమత్తమైన రాష్ట్ర ఐటీశాఖ సైతం ఈ విషయంలో పలు చర్యలు చేపట్టింది. ఇప్పటికే వివిధ ప్రభుత్వ విభాగాల డేటా భద్రంగా దాచేందుకు సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్‌ను నిర్వహిస్తున్న విషయం విధితమే. సైబర్‌దాడుల నిరోధానికి సైబర్ సెక్యూరిటీ పాలసీని కూడా తీసుకొచ్చినట్లు ఐటీశాఖ వర్గాలు‘సాక్షి’కితెలిపాయి.సెక్యూరిటీఆపరేషన్స్‌సెంటర్‌తోపాటుహేగ్‌సెక్యూరిటీడెల్టా,సీడాక్‌సంస్థలసౌజన్యంతోసైబర్‌దాడులనిరోధానికి ప్రయత్నిస్తున్నామన్నాయి. పెరుగుతున్న సైబర్ నేరాలు.. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో గతేడాదిగా సుమారు వెయ్యికిపైగా సైబర్ నేరాలు నమోదయ్యాయి. ఇందులో సాంకేతిక, సాంకేతికేతర అంశాలున్నాయి. పలు బ్యాంకులు, ఆర్థిక, వాణిజ్య సంస్థలకు చెందిన కంప్యూటర్లు, కంప్యూటర్ల నెట్వర్క్, హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్, డేటా, సైబర్ స్పేస్‌కు ముప్పు వాటిల్లడం, డేటా తస్కరణ, క్రెడిట్, డెబిట్ కార్డు మోసాలు వంటి నేరాలు చోటుచేసుకున్నాయి. ఈ నేరాలను సమర్థంగా ఎదుర్కొనేందుకు అవసరమైన సాఫ్ట్వేర్ అప్లికేషన్లు, ప్రోగ్రామ్‌లు రూపొందించే అంశాలను సైబర్ సెక్యూరిటీ కోర్సులో భాగంగా ఉన్నాయి. ఈ రంగంలో మరింత పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. సమాచారం, డేటా భద్రత వంటి అంశాలకు ఇటీవలి కాలంలో పలు కంపెనీలు ప్రాధాన్యం ఇస్తుండటంతో ఈ కోర్సులకు ఇప్పుడిప్పుడే డిమాండ్ పెరుగుతోందని విశ్లేషిస్తున్నారు. సైబర్ సెక్యూరిటీ అంశంపై ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, ఉన్నతాధికారులకు అవగాహన తప్పనిసరి అని.. ఇందుకోసం ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయాలని ఈ సంస్థ తన అధ్యయనంలో వెల్లడించింది. -
కొత్త యాహూ మెయిల్ ఇన్‌బాక్స్
న్యూఢిల్లీ: యాహూ నూతన వెర్షన్ మెయిల్ యాప్‌ను ఆవిష్కరించింది. ఇన్‌బాక్స్‌కు వచ్చే మెయిల్స్‌ను యూజర్లు తమ సౌకర్యానికి అనుగుణంగా నియంత్రించుకునేందుకు అవకాశం ఉంటుంది. నచ్చని ఈ మెయిల్స్ ఇన్‌బాక్స్‌లోకి రాకుండా అన్‌సబ్‌స్క్రయిబ్ చేసుకునే టూల్‌ను కూడా ప్రవేశపెట్టింది. అలాగే, యాహూ మెయిల్ యాప్ నుంచే జీమెయిల్, అవుట్‌లుక్ వంటి వాటిల్లోకి లాగిన్ అవ్వొచ్చని యాహూ ఒక ప్రకటనలో తెలిపింది. -
సెంట్రల్ జోన్ డీసీపీ పేరుతో నకిలీ ఈ–మెయిల్
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని మధ్య మండల డీసీపీ అధికారిక ఈ–మెయిల్‌ను పోలిన దానిని సృష్టించిన దుండగులు దానిని వినియోగించి అమెరికాలో ఉంటున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్ సంతోష్‌కుమార్‌కు బెదిరింపు మెయిల్ పంపారు. అతడి భార్య పేరుతో మరో మెయిల్‌ను క్రియేట్ చేసిన దుండగులు ఆమె పేరుతో ఈస్ట్‌జోన్ పోలీసులకు సంతోష్‌కుమార్‌పై ఫిర్యాదు చేస్తూ మరో మెయిల్ పంపారు. ఇటీవల భారత్‌కు వచ్చిన బాధితులు మధ్య మండల డీసీపీని సంప్రదించారు. ఆయన సూచనల మేరకు సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. నగరంలోని చంపాపేట్ ప్రాంతానికి చెందిన సంతోష్‌కుమార్ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. గత ఏడాది మే నుంచి అతడికి కొందరు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వివిధ ఈ–మెయిల్స్ ద్వారా అసభ్య పదజాలంతో, మార్ఫింగ్ ఫోటోలతో కూడిన మెయిల్స్ వస్తున్నాయి. గత నెల 12న ఈ వ్యవహారం శృతిమించింది. హైదరాబాద్ కమిషనరేట్‌లోని మధ్య మండల డీసీపీ అధికారిక ఈ–మెయిల్‌ను పోలిన దానిని నేరగాళ్లు సృష్టించారు. డీసీపీ ఈ–మెయిల్ (dcp&cz.hyd.tspolice.gov.in) గా ఉంటుంది. అయితే దుండగులు రూపొందించింది (dcp&cz.hydpol.gov.inn@mail.com) గా ఉంది. దీనిని వినియోగించి సంతోష్‌కు ఈ–మెయిల్ పంపిన దుండగులు కేసు పేరుతో బెదిరించారు. తాము మధ్య మండల డీసీపీ ఎన్.విశ్వప్రసాద్ కార్యాలయం నుంచి ఈ మెయిల్ చేస్తున్నామని, మీపై సైబర్ క్రైమ్ ఒకటి నమోదైందని అందులో పేర్కొన్నారు. దర్యాప్తు కోసం మీ చిరునామా సహా పూర్తి వివరాలు అందించాలని కోరారు. అంతటితో ఆగని దుండగులు ఈ నెల 8న సంతోష్‌కుమార్ భార్య కవిత పేరుతో మరో ఈ–మెయిల్ సృష్టించి, ఆమె పంపినట్లు తూర్పు మండల డీసీపీకి పంపారు.అందులో తనను సంతోష్ వేధిస్తున్నాడని, తాను గర్భవతినని సహా పలు ఆరోపణలు చేర్చారు. అమెరికాలో ఉన్న అత్తింటి వారు తనను బంధించడంతో పాటు డబ్బు కోసం వేధిస్తున్నారని అందులో పేర్కొన్నారు ఈ వ్యవహారాలు శృతి మించడంతో బాధితుడు సంతోష్‌కుమార్ ఇటీవల భారత్‌కు వచ్చాడు. గత నెల 21న మధ్య మండల డీసీపీ విశ్వప్రసాద్‌ను కలిసి అసలు విషయం ఆరా తీశాడు. ఆయన కేసులు, ఈ–మెయిల్స్ బూటకమని చెప్పడంతో పాటు ఈ విషయంపై సైబర్ క్రైమ్ అధికారులకు ఫిర్యాదు చేయాల్సిందిగా సూచించారు. దీంతో బాధితుడు సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ప్రాథమిక ఆధారాలను బట్టి నిందితులు సిటీకి చెందిన వారే అయి ఉంటారని భావిస్తున్నారు. సంతోష్‌తో ఉన్న వ్యక్తిగత గొడవల నేపథ్యంలోనే ఇలా చేసి ఉంటారని, అందుకే ముందుగా అభ్యంతరకరమైన మెయిల్ పంపిన వాళ్లు ఆపై సెంట్రల్ జోన్ డీసీపీ పేరుతో ఆయనకు... అతడి భార్య పేరుతో ఈస్ట్‌జోన్ డీసీపీకి మెయిల్ పంపారని తెలిపారు. సంతోష్‌తో ఎవరెవరికి వ్యక్తిగత స్పర్థలు ఉన్నాయి? వారు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారు? అనే అంశాలను ఆరా తీస్తున్నారు. మరోపక్క సాంకేతికంగా దుండగులు వాడిన ఈ–మెయిల్స్ మూలాలను గుర్తించేందుకు దర్యాప్తు చేస్తున్నారు. -
ఏపీ: జస్టిస్ మంజునాథ రాజీనామా
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ బీసీ కమిషన్ చైర్మన్ పదవికి జస్టిస్ కేఎల్ మంజునాథ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను మెయిల్ రూపంలో సీఎం చంద్రబాబు నాయుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్‌కుమార్‌లకు పంపారు. రిజర్వేషన్లపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించినందున, ఇక తనకు పనిలేదని, అందువల్లే రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. కమిషన్‌కు చైర్మన్‌గా నియమించినందుకు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. -
మెయిల్, సెల్ నంబర్ అప్డేట్ చేయండి
అనంతపురం : జిల్లాలోని వ్యాట్, టీఓటీ డీలర్లు తమ లాగిన్‌లో సరైన ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్‌ను అప్డేట్ చేయాలని వాణిజ్యపన్నుల శాఖ ఉప కమిషనర్ జి. కల్పన సూచించారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. అప్డేట్ చేయకపోతే ఈనెల నుంచి వ్యాట్ 200 నెలసరి రిటర్న్‌ను ఆన్ లైన్ ఫైల్ చేయలేమని స్పష్టం చేశారు. అలాగే సరైన పాన్ నంబర్‌ను వాణిజ్య పన్నుల అధికారులకు తెలియజేయాలని, ఒకే పాన్ నంబర్‌తో రెండు రిజిస్ట్రేషన్లు ఉంటే వెంటనే రద్దు చేసుకోవాలని సూచించారు. 2017 జనవరి 1 నుంచి 15 వరకు రిజిష్టర్డ్ డీలర్లందరూ వారి మొబైల్ ఫోన్, మెయిల్‌కు వచ్చిన ఓటీపీ (వన్ టైం పాస్వర్డ్) ద్వారా జీఎస్టీఐఎన్ లో నమోదు చేసుకోవాలని సూచించారు. నమోదు కాని వ్యాపారులు జీఎస్టీ చట్టంలో వ్యాపారం చేసుకునేందుకు వీలుండదని స్పష్టం చేశారు. -
ఆ విషయంలో అపరిచిత వ్యక్తులతో జాగ్రత్త..
విజయవాడ : ఓ యువతి అసభ్యకర ఫొటోలను మెయిల్లో డౌన్లోడ్ చేసుకుని ఆమెను వశపరుచుకునేందుకు బ్లాక్మెయిల్ చేసిన చెన్నయ్‌కి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్‌ను విజయవాడ సైబర్ సెల్ పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడ నగర జాయింట్ పోలీసు కమిషనర్ పి.హరికుమార్ వెల్లడించిన వివరాలివీ.. విజయవాడకు చెందిన ఓ యువతికి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న శశిధరన్ (27) నెల రోజులుగా అసభ్యకర ఈ-మెయిల్స్ పంపుతూ వేధింపులకు గురిచేస్తున్నాడు. తనను పెళ్లి చేసుకోవాలని.. లేదంటే తన వద్ద ఉన్న ఫొటోలను బయటపెడతానని బెదిరిస్తున్నాడు. చివరకు ఆమె నగర పోలీసు కమిషనర్‌కు తాను పడుతున్న ఇబ్బందులను ఫ్యాక్స్ ద్వారా ఫిర్యాదు చేసింది. సీపీ గౌతం సవాంగ్ స్పందించి విజయవాడ సైబర్ సెల్ పోలీసులను విచారణకు ఆదేశించారు. ఈ విచారణలో అనేక ఆసక్తికర అంశాలు తెలిశాయి. శశిధరన్ తన పాత్ర బయటపడకుండా ఉండేందుకు సైబర్ కిటుకులను ఉపయోగించాడు. రెడిఫ్ మెయిల్‌ను వినియోగించడంతోపాటు మెయిల్ క్రియేట్ చేసే సమయంలో తప్పుడు వివరాలు ఇచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. సైబర్ పోలీసింగ్ సెల్, రెడిఫ్ మెయిల్, హాట్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా నిందితుడు శశిధరన్ వినియోగించిన ఐపీ అడ్రస్, మాక్ అడ్రస్, ఇంటి చిరునామా, ప్రస్తుతం వినియోగిస్తున్న ఫోన్ నంబరు, బెంగళూరులో పనిచేసే కంపెనీ వివరాలను పోలీసులు తెలుసుకున్నారు. విజయవాడ యువతి గత ఏడాది బెంగళూరులో నిందితుడు పనిచేస్తున్న కంపెనీలో నాలుగు నెలలు ఇంటర్న్‌షిప్ చేసినట్లు పోలీసులు వివరించారు. ఆ సమయంలో నిందితుడు బాధితురాలి జి-మెయిల్, ఫేస్బుక్ వివరాలు తీసుకుని, ఆమె పర్సనల్ ఫొటోలను గూగుల్ డ్రైవ్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని ఆమెను బ్లాక్మెయిల్ చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. నిందితుడు రకరకాల పట్టణాల నుంచి ఈ-మెయిల్స్ పెట్టి ఆమెను వేధించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు ఏడేళ్ల కిందట వినియోగించి మనుగడలో లేని ఫోన్ నంబర్‌ను మెయిల్లో ఉంచడంతో దాని ఆధారంగా అతడిని గుర్తించగలిగినట్లు పోలీసులు చెప్పారు. అపరిచిత వ్యక్తులతో జాగ్రత్త అపరిచిత వ్యక్తులను నమ్మి మెయిల్ అడ్రస్‌లు ఇవ్వవద్దని జాయింట్ కమిషనర్ హరికుమార్ హెచ్చరించారు. సోషల్ మీడియాలో గుర్తుతెలియని వారితో ఫ్రెండ్షిప్ చేస్తే మోసపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మెయిల్ ఐడీలు, ఇతర వివరాలు చెప్పవద్దని ఆయన కోరారు. -
చరిత్ర పుటల్లో 'పంజాబ్ మెయిల్'!
ముంబైః మహరాష్ట్ర రాజధాని ముంబై నగరం నుంచి ప్రయాణీకులను తరలించే 'పంజాబ్ మెయిల్' చరిత్ర పుటల్లో నిలిచింది. ముంబై నుంచి ఫిరోజ్ పూర్ కు ప్రయాణీకులను చేరవేసే పంజాబ్ మెయిల్ 104 ఏళ్ళు పూర్తైన మొదటి భారతీయ రైలుగా చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించింది. రైల్వే చరిత్రలో సుదీర్ఘ ప్రయాణాన్ని ముగించిన రైలుగా గుర్తింపు పొందింది. స్వాతంత్రానికి ముందు 'ది పంజాబ్ లిమిటెడ్' గా పిలిచే మెయిల్ సర్వీస్ ను 1912 లో ప్రారంభించినట్లు ముంబై సెంట్రల్ రైల్వే వెల్లడించిన వివరాలను బట్టి తెలుస్తోంది. అప్పటి బాంబే, ఇప్పటి ముంబై నుంచి పెషావర్ ప్రయాణించే పంజాబ్ మెయిల్ మూలాలు మాత్రం పూర్తిగా లభించలేదు. 1911 ఖర్చు అంచనా కాగితాల ఆధారంగానూ... 1912 అక్టోబర్ 12న రైలు కొద్ది నిమిషాలు ఆలస్యం అవ్వడంపై ప్రయాణీకులు చేసిన ఓ ఫిర్యాదు ఆధారంగానూ... పంజాబ్ మెయిల్ తొలిసారి బల్లార్డ్ పీర్ మోల్ స్టేషన్ నుంచి 1912 జూన్ 1న ప్రారంభమైనట్లు అంచనా. అప్పట్లో ఈ రైలు... ఫ్యామిలీ ప్లానింగ్ పై ప్రధాన ప్రకటనా మెయిల్ గా ఉపయోగపడినట్లు 1968 సెప్టెంబర్ 16 న తీసిన ఓ ఫొటోను బట్టి తెలుస్తోంది. ప్రజల్లో ఫ్యామిలీ ప్లానింగ్ పై అవగాహన పెంచడంలో భాగంగా... ఇద్దరు లేదా ముగ్గురు అన్న మెసేజ్ తో ప్రతిరోజూ ఈ రైలు ప్రయాణం సాగేది. అనంతరం ఇండియాలో ఫ్యామిలీ ప్లానింగ్ పై అవగాహన పెంచడంలో భాగంగా చాలా రైళ్ళలో ఎర్రని త్రిభుజాకారం గుర్తును బర్త్ కంట్రోల్ సింబల్ గా వాడేవారు. అప్పట్లో భారత్ లో 55 కోట్లమంది జనాభా ఉండగా ప్రతి సంవత్సరం ఒక కోటి చొప్పున పెరుగుతూ ఇప్పటికి 150 కోట్లకు చేరింది. -
వారు మహాముదుర్లు గురూ..!
న్యూయార్క్: మత్తుపదార్థాల రవాణాలో వచ్చినన్ని టెక్నిక్స్ మరే ఇతర రంగంలో ఇప్పటి వరకు రాలేదు. ఎప్పటికప్పుడూ వారు తమ లక్ష్యాన్ని చేరుకునేందుకు విస్తుపోయే మార్గాలు అనుసరస్తూనే ఉంటారు. ఇక మత్తుపదార్థాలకు బానిసైనవారి పరిస్థితి కూడా అంతే.. ఎన్ని తిప్పలు పడైనా తమకు కావాల్సిన మత్తుపదార్థాలు తెప్పించుకుంటారు. వర్జినీయా జైలులో ఉంటున్న ఖైదీల విషయాన్ని ఒకసారి పరిశీలిస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. ఎందుకంటే వారు తమకు మత్తు పదార్థాల కోసం అనుసరిస్తున్న మార్గాలు మాములువి కాదు. కనిపించేందుకు సాధారణంగానే ఉన్నా దాని లోతుల్లోకి వెళితే అవాక్కవ్వాల్సిందే. ఈ మధ్యకాలంలో వర్జినీయా జైలులో ఖైదీలంతా ఆన్ లైన్ లో విహరిస్తూ పెద్ద మొత్తంలో పేపర్లకు, ఫొటోలకు ఆర్డరిస్తున్నారు. అది కూడా మత్తుపదార్థాలకు బానిసైనవారికి ఉపశమనం కల్పించే సబాక్సన్ అనే మెడిసిన్ ఖాళీ ప్యాకెట్లు, ఆ ప్యాకెట్ ను ముద్రించిన ఫొటోల కోసం. అయితే, ఖాళీ పేపర్లు ఏం చేసుకుంటారా అని అనుకుంటున్నారా అలా అనుకుంటే మాత్రం పొరబడ్డట్లే.. ఎందుకంటే ఆ ఫొటోలు, పేపర్లు సాధారణమైనవి కాదు. పూర్తిగా డ్రగ్స్‌లో నానబెట్టినవి. సాధారణంగా తెల్లపేపర్ను డ్రగ్స్ లో నానబెడితే అది పసుపురంగులో పేరుకు పోయి కనిపిస్తుంది. కానీ, ఫొటోల్లో, ఇతర చిత్రాలతో ముద్రించిన ప్యాకెట్లపై మాత్రం అది కనిపించదు. ఈ టెక్నిక్ రహస్యాన్ని తెలిసిన డ్రగ్ బానిసలు, డ్రగ్ సప్లయ్ దారులు విరివిగా వాటిని ఉపయోగిస్తున్నారు. ఈ విషయం తెలిసిన జైలు శాఖ అధికారులు షాక్ తిన్నారు. ప్రస్తుతానికి అలాంటివాటి ఆర్డర్లను నిషేధించి నిబంధనలు కఠినం చేశారు.