గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరంలో సోమవారం పలు స్కూళ్లకు వచ్చిన బాంబు బెదిరింపులు కలకాలం రేపాయి. దీంతో అప్రమత్తమైన పోలీసు యాత్రాంగం, బాంబ్ స్క్వాడ్స్ బెదిరింపులు వచ్చిన అన్ని పాఠశాలల్లో తనిఖీలు చేపట్టాయి. అయితే ఎటువంటి బాంబులు లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు.
సియా గురుకుల పాఠశాల, థాల్తేజ్‌లోని ఆనంద్ నికేతన్, డీసీఎస్ బోపాల్, మెమ్‌నగర్‌లోని హెచ్‌బీకే పాఠశాల, థాల్తేజ్‌లోని జెబార్ పాఠశాల, ఎస్‌జీ రోడ్డులోని కాస్మోస్ క్యాజిల్ ఇంటర్నేషనల్ స్కూల్, చంద్‌ఖేడా, షాహిబాగ్ కంటోన్మెంట్‌లోని రెండు కేంద్రీయ విద్యాలయాలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్ వచ్చింది. వెంటనే అప్రమత్తమైన స్కూళ్ల యాజమాన్యం విద్యార్థులను ఖాళీ చేయించాయి.
ఈ ఘటనపై అహ్మదాబాద్ పోలీసు కమినిషనర్ జీఎస్ మాలిక్ మాట్లాడుతూ.. రష్యన్ సర్వర్ నుంచి బాంబు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. అరబిక్‌లో భాషా పదాలలో బాంబు బెదిరింపులు వచ్చాయి. బాంబు బెదిరింపు మెయిల్స్‌పై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. గుజరాత్‌లో ఎన్నికల పోలింగ్‌కు ఒకరోజు ముందు బాంబు బెదిరింపులు వచ్చాయని తెలిపారు. ఇటీవల ఢిల్లీ పరిధిలోని దాదాపు 200 స్కూళ్లకు బాంబు బెదిరింపు మియిల్స్ వచ్చిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment