కేంద్ర హోం శాఖకు బాంబు బెదిరింపు.. నార్త్‌ బ్లాక్‌ హై అలర్ట్‌ | Sakshi
Sakshi News home page

కేంద్ర హోం శాఖకు బాంబు బెదిరింపు.. నార్త్‌ బ్లాక్‌ హై అలర్ట్‌

Published Wed, May 22 2024 5:23 PM

Bomb Threatening Mail To North Block Delhi

సాక్షి,ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర హోం శాఖ కొలువు దీరిన నార్త్ బ్లాక్‌ భవనానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. హోం శాఖకు బుధవారం(మే22) బాంబు బెదిరింపుల మెయిల్ అందినట్లు పోలీస్ కంట్రోల్ రూమ్‌ వెల్లడించింది. 

బాంబు బెదిరింపులు వచ్చిన వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్త చర్యగా రెండు ఫైర్‌ ఇంజిన్లను నార్త్‌బ్లాక్‌ వద్దకు తరలించారు. గత కొన్ని రోజులుగా దేశంలోని పలు ప్రాంతాల్లోని స్కూళ్లకు, ఎయిర్‌పోర్టులకు ఫేక్‌ బెదిరింపు కాల్స్‌ వస్తున్న విషయం తెలిసిందే.


 

Advertisement
 
Advertisement
 
Advertisement