మెయిల్, సెల్ నంబర్ అప్‌డేట్ చేయండి
Published Sat, Dec 17 2016 11:57 PM | Last Updated on Mon, Sep 4 2017 10:58 PM
అనంతపురం : జిల్లాలోని వ్యాట్, టీఓటీ డీలర్లు తమ లాగిన్లో సరైన ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేయాలని వాణిజ్యపన్నుల శాఖ ఉప కమిషనర్ జి. కల్పన సూచించారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. అప్‌డేట్ చేయకపోతే ఈనెల నుంచి వ్యాట్ 200 నెలసరి రిటర్న్‌ను ఆన్ లైన్ ఫైల్ చేయలేమని స్పష్టం చేశారు. అలాగే సరైన పాన్ నంబర్‌ను వాణిజ్య పన్నుల అధికారులకు తెలియజేయాలని, ఒకే పాన్ నంబర్‌తో రెండు రిజిస్ట్రేషన్లు ఉంటే వెంటనే రద్దు చేసుకోవాలని సూచించారు. 2017 జనవరి 1 నుంచి 15 వరకు రిజిష్టర్డ్ డీలర్లందరూ వారి మొబైల్ ఫోన్, మెయిల్‌కు వచ్చిన ఓటీపీ (వన్ టైం పాస్‌వర్డ్) ద్వారా జీఎస్‌టీఐఎన్ లో నమోదు చేసుకోవాలని సూచించారు. నమోదు కాని వ్యాపారులు జీఎస్‌టీ చట్టంలో వ్యాపారం చేసుకునేందుకు వీలుండదని స్పష్టం చేశారు.
Advertisement